Page load depends on your network speed. Thank you for your patience. You may also report the error.

Loading...

Naa Ramanasrma Jeevitham    Chapters   

విషయానుక్రమణిక

అవతరణిక

శ్రీమతి సూరి నాగమ్మగారు రమణ భక్తులకు తమ ''రమణాశ్రమ లేఖల'' ద్వారా చిరపరిచితురాలు. ఆ లేఖలు తెలుగులోనే గాక ఇంగ్లీషులో గూడ ప్రచురించటంవల్ల మన దేశంలోనే గాకుండా విదేశాలలో గూడా ఆమె ప్రఖ్యాతి వహించింది.

1-Chapter

గుంటూరు జిల్లాలో మంగళగిరికి దగ్గరనున్న కొలను కొండ అగ్రహారం నా జన్మస్థానం. జన్మించింది ప్లవనామ సంవత్సర భాద్రపద మాసం. అది భోగేశ్వర క్షేత్రం. దోర్బల చిన వెంకటశాస్త్రిగారు నా తండ్రి. సోమి దేవమ్మ నా తల్లి,
2-Chapter ఉదయాత్పూర్వమే గూడూరులో దిగి, స్నానంచేసి విల్లుపురం వెళ్ళే రైలు ఎక్కాను. ఆడవాళ్శపెట్టె లేక మా మూలు పెట్టెలోనే ఎక్కవలసివచ్చింది. త్రోవలో కాళహస్తి తిరుపతి వున్నవిగదా? ఆక్షేత్రాలు అదివరకు చూడనందువల్ల
3-Chapter నా బండి సాగిపోయి ఆశ్రమం గేటుదాటి లోప్రాకారంలో ఆగింది. బండీ దిగుతూ వుండగానే గ్రిద్దలూరి సుబ్బారావుగారు బండివద్దకువచ్చి ''ఏవూరమ్మామనది?'' అన్నారు. బెజవాడనుంచి వచ్చానని పెద్దన్న పేరు చెప్పి రెండు మూడు వారాలుండి వెడుతా నన్నాను.
4-Chapter

భగవాన్‌ తెలుగు వారితో తెలుగే మాట్లాడుతారని లోగడనే విన్నాను. నే నున్న ఆ పది రోజులలో తెలుగు వ్రాయడమూ చదవడమూ కూడా తెలుసునని తేలింది. కొందరు భక్తులు ఏదో వ్రాసి శ్రీవారికి అందీయడమున్నూ చూచాను. వారంతా పండితులు కారు. సామాన్యులే.

5-Chapter ఆ మరుదినం నే నెక్కబోయే రైలు ఉదయం 91/2 గంటలకు అరుణాచలంలో బయలుదేరి కాట్పాడిమీదుగా సరాసరి గూడూరు చేరుకుంటుంది. నేను ఉదయానంతరం టవునులో గది ఖాళీచేసి ఆశ్రమానికి వచ్చాను. భగవాన్‌ అల్పాహారం
6-Chapter లోగడ నేనున్న గదిలోనే ప్రవేశించి, అది చాలా చిన్నదగుటవల్ల, ప్రక్కనే హోటలుండుటవల్ల సందడి భరించ లేక భగవానుకు 38 ఏండ్లుగా భిక్షాకైంకర్యం చేసిన ఎచ్చమ్మ గారు నివసించే కాంపౌండులో ఒక గదికి నా మకాం మార్చాను.
7-Chapter 1942లో తమిళ్‌ పండితు లొకరు వచ్చి అమృతనాడిని గుఱించి శ్రీవారితో మూడు రోజులు ఇష్ఠాగోష్ఠిగా మాట్లాడుతూ వచ్చారు. భగవాన్‌ ఉత్సాహంతో సమాధానమిస్తూ ఆ అమృతనాడి అల్లాగుంటుందనీ, ఇల్లాగుంటుందనీ ఏదో సెలవిస్తూ
8-Chapter ఏ భక్తులకు గాని గురుదైవముల అనుగ్రహం పొందిన వెనుక వారిని స్తుతించాలన్న బుద్ధిపుట్టటం సహజమే గదా? అందువల్ల అదివరకే నాలో ఇమిడివున్న కవితా ధోరణికి ఈ సందర్భంలో మంఛి అవకాశం లభించి 1941 నవంబరులో జరిగిన
9-Chapter 1943 లో మా చిన్నన్నగారిని సెంట్రల్‌ బ్యాంకువారు అహమ్మదాబాదునుంచి మద్రాసుకు బదిలీచేశారు. నేను ఆశ్రమానికివచ్చిన ఆ రెండేండ్లలో రెండు మూడుసార్లు నేనే దేశానికి వెళ్ళివచ్చాను గాని మా వాళ్ళెవరూ ఇక్కడికి
10-Chapter నా నివాసం ఆశ్రమం దగ్గరకు మారిన కొద్దినెలలలోనే భగవానుని స్తుతిస్తూ భక్తులు వ్రాసిన సంస్కృత శ్లోకాలన్నీ అచ్చువేయించాలని, రాణి ప్రభావతి ప్రయత్నిస్తూ, రమణ సహస్రనామాదులు వ్రాసిన జగదీశ్వరశాస్త్రిగారిచేత
11-Chapter ఆరు నెలలు గడిచిన వెనుక నా నివాసం రాజుసెట్టి గారి కాంపౌండుకు మార్చాను. అక్కడ నా వ్రాతపని ప్రశాంతంగా వుండేది. ఆశ్రమం పని ఏదీ లేనప్పుడు గ్రంథ పఠన, పద్యరచన చేస్తూవుండేదాన్ని. 1943 నుఉండి 1945 లోపల  
12-Chapter ఆ డైరీ ఏర్పాటు జరిగి నప్పుడే మా చిన్నన్నగారు ''నీవు గూడా తెలుగులో వ్రాయవమ్మా; ఎంత మంది వ్రాసినా ఇబ్బంది లేదు'' అని నాకొక డైరీ పుస్తకం తెచ్చియిచ్చారు. నాకు ఫక్కి కుదరక లాభంలేదని వారితో చెప్పాను. ''పోనీ, నా కెప్పుడూ
13-Chapter ఆ నవోదయ మొదటి సంచిలో వచ్చినవి నాలుగు లేఖలు. అవి చూచిన వెంటనే శ్రీవేలూరి శివరామశాస్త్రి గారు నా కొక జాబు వ్రాశారు. వారు మాకు దగ్గర చుట్టమే అయినా ఎప్పుడూ ఉత్తరం వ్రాయని వారు ఎందుకు వ్రాశారో, ఏమో తెలియక
14-Chapter అహింసా సతయమస్తేయం దానం క్షాంతి ర్దమఃశమః | అకార్పణ్యం చ శౌచంచ తపశ్చరజనీచర. 1
15-Chapter శివరామశాస్త్రిగారి రెండవ ఉత్తరం కాపీ చేసి అన్నయ్యకు పంపాను గదా. అది చూచి అన్నయ్య ఎంతో ఉత్సాహంతో ''ఇదిన్నీ అన్నయ్యకు పంపు'' అని భగవాన్‌ సెలవిచ్చిన మాటయే భగవదాజ్ఞగా భావించి వెంటనే ''ముద్రణ కయ్యే
16-Chapter 1. గణములు-గల, గగ, య, ర, త, ఛ, జ, స, మ, న, జగ, నగ, భగ, యగ, సగ, బల, నల, భల, సల, జలల, నలల, జవ, నవ, ఇవియే వెణ్పాలో రాదగిన గణములు.
17-Chapter లేఖలు ప్రథమభాగం సరిగా జయంతివేళకు అందలేదు గదా? తరువాత 1947 జూలైలో నే నెందుకో మద్రాసు వెళ్ళాను. నాల్గు రోజులే అక్కడుండి తిరిగి ఆశ్రమానికి వస్తుంటే ఆ పుస్తకాలు 12 మాత్రమే బైండు అయినవనీ, తక్కినవి వెనుక
18-Chapter సరే. తప్పదు గదా అని ముందే ఆఫీసులో యిస్తే భగవానుకైనా చూపరేమోనన్న భయంతో భగవాన్‌ కంటపడితే మంచిదని మరుదినం ఉదయాన లేఖలన్నీ కట్టగట్టి వదినే, నేనూ ఆఫీసువైపు రాకుండా కోనేటి ప్రక్క నుంచి భగవాన్‌
19-Chapter

1. తలవులను నలలద్రోయగ

పలుమరు నీవాడు నట్టి పలుకులె మదిలో

20-Chapter ఈ పాట వ్రాసి ముగించేసరికి 3 గంట లయింది. కాగితం మడిచి ఇంట్లోనే వుంచి భగవాన్‌ సన్నిధికి వెళ్ళాను. దూరాన వుండగానే ''అదుగో నాగమ్మ వచ్చింది'' అంటున్నారు భగవాన్‌ సమీపస్థులతో హాల్లోకి వెళ్ళి నమస్కరించి లేవగానే

21-Chapter

ఈ సంఘటన జరుగకముందే ఒకనాడు భగవాన్‌ గోశాల వెనుకనుంచి వస్తుంటే వారికి సమీపంగా నిలిచాను. భగవానున్నూ నిలబడ్డారు. ''ఈ పనులన్నీ ఒకసారి ఆగి పోవటంవల్ల భగవాను కెంతో దూరమయినట్లున్న దే? చంటి బిడ్డను దూరం చేసినట్లున్న దే?''

22-Chapter

అన్నిటికంటే ముఖ్య విషయం ఏమంటే నా ప్రార్థనాను సారం భగవాన్‌ తాముగా పలుకరించి మాట్లాడిన వెనుక ఎంతో వాత్సల్యంతో నేను హాలులో లేని సమయంలో ఏదైనా విశేషం జరిగినా, ఎవరైనా ప్రశ్నించినా నేను రాగానే ''ఇదుగో! నీవు
23-Chapter వడ్డించేవాడు తనవాడైతే కడ పంక్తిన వుండమన్నా రన్న సామెత ఒకటున్నది గదా? అందుకు తార్కాణంగా భగవాన్‌ వుండే హాలులో ఆడంగులు కూర్చునే స్థలం ముందు భాగంలో ఏమాత్రం ఎడం లేకుండా కొందరు స్త్రీలు ఆసనాలు

24-Chapter

నేనే లేచి వెళ్ళితే ఏదో స్తోత్రం వచ్చిందని ఇచ్చారు భగవా&. అది చూచి కాపీ చేశాను. ఆ వెనుక సూరమ్మ గారు ''భగవాన్‌ ఏం సెలవిస్తారో ఏమో నని నీవు ఎదురు చూడాలి గాని నీ కొఱకు వా రెదురు చూడటం ఏమిటమ్మా. ఇది అపచారం గాదా?''
25-Chapter 1940 నుంచీ నేను జొన్ననూకతోనే అన్నం వండి తింటున్నాను. భగవన్‌ సన్నిధికి వచ్చిన వెనుక ఒకటి రెండు సార్లు ఆ జొన్నలే పేలాలుగా వేయించి మధ్యాహ్నం రెండు గంటలవేళ భగవాన్‌ సన్నిధికి తీసుకొని వెళ్ళితే ఆ పేలాలలో ఉప్పూ,

26-Chapter

1949 ప్రారంభంలోనే భగవానుని ఎడమ చేతికి కురువు (కణితి) ప్రారంభంచటం, ఆపరేషన్‌లు, ఇత్యాదులన్నీ వచ్చినవి. ఆ వివరమంతా నోటు చేసుకొన్నాను. అదంతా తరువాత వరుసగా వ్రాస్తాను. 1947 మార్చి, ఏప్రిల్‌ ఆ ప్రాంతాలలో "శ్రీవారి
27-Chapter 1948 జూలై 18 వ తేదీన గోలక్ష్మిముక్తి. ఆమె సమాధి సంవత్సరోత్సవానికి తిరిగి రావాలన్న సంకల్పంతోనే 1949 జూన్‌ ప్రారంభంలో ఒక కారణంవల్ల నేను విజయవాడ వెళ్ళాను. ఆ కారణం ఏమంటే, లేఖలు రెండవ భాగం ఆశ్రమంవారి
28-Chapter దక్షిణామూర్తి ప్రాదుర్భావమును గుఱించి భగవాన్‌ ఆ కథ చెప్పినప్పుడు భగవాన్‌ "ఇది దేనిలోనో చదివాను" అని సెలవిచ్చారు. నేను కథంతా వ్రాశానే గాని దేనిలో వున్నదది, అని భగవానుని తరచి అడగనూ లేదు. వారంతగా యోచించి
29-Chapter 1943 అక్టోబరులో గుఱ్ఱం సుబ్బరామయ్యగారు అట్టలు సడలీ, కుట్లువూడి, శిథిలావస్థలో వున్న కృష్ణదేవరాయ విరచితమైన ఆముక్తమాల్యద (గోదాకల్యాణం) అనే గ్రంథం, వేదం వెంకటరాయశాస్త్రిగారి టీకా, తాత్పర్య విశేషార్థ
30-Chapter ''ఇక్ష్వాకుకుమారుడైన నిమి అనే రాజువంశంలో ధర్మధ్వజుడనే రాజుకు కృతధ్వజుడు, మితధ్వజుడు అనే ఇద్దరు కొడుకులు పుట్టారు. కృతధ్వజుడు మిథిలకు రాజైనాడు. (మిథిలాధినాథు లందరకూ జనకులని సామాన్యనామం.)
31-Chapter భగవా& సన్నిధిలో సాధారణంగా ఏ సత్కర్మ జరిగినా ముందే (అంటె ఆ కర్మ జరగబోయే ముందు) ఒక పళ్ళెంలో కర్పూరం, టెంకాయలూ, పళ్ళూ మొదలైన మంగళద్రవ్యాలు పెట్టుకొని బ్రాహ్మణులంతా భగవా& సన్నిధికి వచ్చి ''న
32-Chapter

శ్లో|| నకర్మణా నప్రజయా ధనేన

త్యాగే నైకే అమృతత్వమానశుః|

33-Chapter

1949 ప్రారంభంలో శ్రీ భగవానుని ఎడమ మోచేతికి పైభాగంలో వెనుక ప్రక్కన పులిపురికాయవలె ఒక కణితి కనుపించి క్రమంగా ఎదుగుతూ 1-2-49 నాటి కది గోలీ కాయంత లావయిందట. ఇంకా పెరిగితే శ్రమ కలిగిస్తుందని తోచి
34-Chapter 17-3-49 తేదీన కుంభాభిషేకమయింది. ఆ మర్నాడే భగవాన్‌ చేతిమీద పుండున్న స్థలంలో ఎక్కువగా గోకటం, తడవటం చూచి మళ్ళీ యేమి మునిగిందో యేమోనని మా వదినె నేనూ అనుకున్నాం. 21 న మా వాళ్ళు పట్నం వెళ్ళిన వెనుక
35-Chapter 24-3-49 నుండి కృష్ణభిక్షువు రమణలీల చదివారు ఆ వెనుక 26-3-49 సాయం కాలం గోశాలవైపు నుండి వచ్చి భగవాన్‌ సోఫామీద కూర్చుండగానే నూతను లెవరో వచ్చి నమస్కరించారు. ఆ వచ్చిన వారి మెడమీద నిమ్మకాయంత కణితి
36-Chapter భగవాన్‌ మేనత్తకొమారుడు రామస్వామిగారున్నారు గదా. వారి భార్య అమ్మాళుమ్మ కుంభాభిషే కానికి వచ్చి భగవానుకు ఆపరేషన్‌ అయిన వెనుక గూడా కొద్దిరోజులున్నది. 7-4-49 ఉదయాన ఎనిమిదింటికి ఆ పండు ముత్తైదువ భగవాన్‌
37-Chapter గవా9 చేతికురుపు నుండి రక్తం స్రవించడం కదలిక వల్లనే నని కొందరి అభిప్రాయం. అందువల్ల కట్టుకట్టుబడ్డ ఆ చెయ్యి కదల్చరా దన్నారు. భగవా9 ఒక్క చేత్తోనే విసరుకోవలసి వస్తోందప్పుడు. ఫాను పెడతామంటే ఏ కొంచెం సేపో
38-Chapter శ్రీ భగవానుని చేతిపుండునుండి రక్తస్రావం ఎక్కువవటంవలన 30-4-49 సాయంకాలం మా అన్నా, సుబ్రహ్మణ్యయ్యరూ, రాఘవాచారీ మొదలైన డాక్టర్లూ పట్నంనుంచి వచ్చారు. ఆ రాత్రికే మాద్రాసునుంచి తెచ్చిన రక్తం శ్రీవారి పునీతశరీరంలోకి
39-Chapter డాక్టరు అనంత నారాయణరావుగారు కొంతకాలంగా రాత్రి ఎనిమిదింటి నుండీ తొమ్మిదింటివరకూ శ్రీ భగవానుని కాళ్ళకు తైలంరాచి మర్దనచేసే సమయంలో దగ్గరుండటం జరుగుతున్నది. భగవాన్‌ చేతిపుండుకు రెండవ ఆపరేషన్‌
40-Chapter కొత్త హాలుకు వచ్చిన వెనుక భగవాన్‌ కురుపు నుండి రక్తస్రావం తగ్గిందనీ, పుండు చాలా భాగం ఆరిందనీ కొద్ది రోజుల్లో మచ్చ పడవచ్చనీ చెప్పి కే. కే. నంబియార్‌, చావలి నాగేశ్వరరావు ఇత్యాది భక్తు లంతా భగవాన్‌ చేతికట్టు తీసివేయించి
41-Chapter పుండునుండి రక్తంకారటం అంతకంతకు అధికం కావటంవల్ల ఉభయ పక్షముల వారున్నూ ''ఈవిధంగా వదిలితే ఎట్లా? ఏదో ఒక వైద్యం చేయా''లని గోలకెత్తితే మూసు, లక్ష్మీపతి ఇత్యాది పెద్ద వైద్యులెవరిని రప్పిస్తామన్నా ''వారందరికీ
42-Chapter 15-7-49 వ తేది ఉదయాన వదినె నేనూ ఏమీ తోచక ఏడున్నరకే ఆశ్రమానికి వెళ్ళాం. భగవా& స్తిమితంగా కూర్చుని వున్నారు. సేవకులలో ఒకరైన సత్యానంద స్వామి తప్ప వేరెవ్వరూ లేరు. నమస్కరించి లేస్తూనే ''ఎట్లా గున్నది'' అన్నది
43-Chapter 23-7-49 తేదీన పోష్టులో మధుర కృష్ణమూర్తి అయ్యరు వద్దనుండి ఒక ఉత్తరం వచ్చింది. భగవానది చూచి పంపిన వెనుక నన్నుద్దేశించి ''ఇదిగో! మధుర కృష్ణమూర్తి ఉత్తరం వ్రాశాడు. 'భగవాన్‌ కిన్ని వైద్యాలెందుకు? సరియైన
44-Chapter 31-7-49 మధ్యాహ్నం మా అన్నగారితో గురుస్వామి మొదలియార్‌ వస్తారని తెలిసి ఆ వుదయానికే శ్రీనివాసరావూ, రాఘవాచారి మొదలైన డాక్టర్లొక పది మందిన్నీ యస్‌. దొరస్వామయ్యరూ వచ్చిచేరారు. ''కా& సర్‌'' కాదని

45-Chapter

రాత్రంతా నిద్రపట్టక 7-8-49 తేదీ ఉదయాన తొందరగా లేచి కాలకృత్యాలు తీర్చుకొని 6 గంటలకల్లా ఆశ్రమానికి వెళ్ళాను. భగవాన్‌ అల్పాహారానంతరం హాల్లోనుండి గోశాలవైపుకు వెళ్ళినప్పుడు దర్శనం చేసుకున్నాను.

46-Chapter

1949 అక్టోబరు రెండవ వారంలో తప్పనిసరిగా మా అన్నగారి యింటికి (మద్రాసు) వెళ్ళి నేను నవంబరు 8, తేదీ ఉదయాన బయలుదేరి సాయంకాలానికి అరుణాచలం వచ్చి సామాను నా కుటీరంలో పడవేయడమే తడవుగ
47-Chapter 1-9-49 నుండి భగవాన్‌ సన్నిధిలో వేదపారాయణ ఆరంభించి రెండు వేళలా పారాయణ సమయంలో మాత్రం అంతా హాల్లో వచ్చి కూర్చుని పారాయణ ముగిసిన వెంటనే బయటికి వెళ్ళేటట్లుగా ఏర్పాట్లు జరిగినవి. క్రమంగా మామూలు
48-Chapter ఈ ఆపరేషన్‌ సమాచారం తెలిసి 18-12-49 తేదీ ఉదయానికే మా అన్న వచ్చారు. 19వ తేదీ ఉదయం 5 గంటలకే ఆశ్రమానికి వెళ్ళి భగవాన్‌ ఆసుపత్రికి వెడుతూ వుంటే దర్శనం అవుతుందని కాచుకొని వుండి ఐదున్నరకే భగవాన్‌
49-Chapter 31-1-50 తేదీన ఉదయం 9 గంటలకు యథాప్రకారం దర్శన సమయంలో భగవా& సన్నిధికి పోష్టు వచ్చింది. చూచి పంపిన వెనుక భగవాన్‌ నావైపు చూచి ''ఇదుగో! ఈ పోష్టులో ఆస్ట్రేలియా నుండి 18 మంది సంతకాలతో ఒక ఉత్తరం
50-Chapter 2-3-50 తేదీ నుండి మూసుకున్నూ అధైర్యం తోచి భగవానుని ప్రార్థిస్తూ ఒక స్తోత్రం వ్రాసి 3 వ తేదీన శ్రీవారికి అందజేశాడు. ఆ నాడే మూసు విష్ణుసహస్రనామ పారాయణం చేసేందుకు ఏర్పాటు చేశాడు. కొందరు భక్తులు
51-Chapter 19-3-50 తేదీన ఉగాది పండుగ అయింది. నే నిక్కడికి వచ్చినప్పటి నుండీ ఈ పండుగకు భగవాన్‌ కప్పుకునేందుకు తుండూ, కౌపీనమూ ముందునాడే యిచ్చి పండుగ నాడు వేపపువ్వు పచ్చడీ, పంచాగమూ సమర్పించటం మామూలు.
52-Chapter 23-3-50 తేదీన భగవానుకు శోషరావడం 24 నుండి మూసువైద్యం ఆపడం నెలాఖరుకు కలకత్తా కవిరాజు రాక ఆయన వైద్యం ఇత్యాదులన్నీ జరిగినవి. వారు ఎంతో ఖరీదుగల దివ్యౌషధాలు వాడారు. అప్పుడు ఆయుర్వేద వైద్యులూ
53-Chapter 7 గంటల నుండీ జనసమూహం పెరిగి హాలు చుట్టూ ఆవరించింది. రిజర్వు పోలీసులు, కలెక్టర్లు, డి. యస్‌. పీలు ఇత్యాదులు లెక్క లేనంత మంది వచ్చి ఎంత ఆపినా ఆగక సముద్రఘోషవలె జనుల ఘోష మ్రోగిపోయింది. భగవానుని
54-Chapter మా అన్నా, వదినె, నేనూ నా కుటీరం చేరుకొని స్నానపానాదు లయిన వెనుక, నేను ఒకసారి ఆశ్రమానికి వెళ్ళి సమాధివద్దకొంచెంసేపు కూర్చుని వస్తానని మా వాళ్ళతో చెప్పి వెళ్ళాను. సమాధివద్దకు వెళ్ళేసరికి 9 గంట లయింది.
55-Chapter రాజు సెట్టి కాంపౌండులో నే నుంటున్న యిల్లు శిధిలాపస్థకు రావటంవల్ల 1953 లో ఆ కాంపౌండులోనే ఒక చిన్న యింటికి నా మకాం మార్చాను. అక్కడే జబ్బుచేసి వెళ్ళటం జరిగింది. తిరిగి 1953 చివరలో కాశీనుంచి వచ్చి ఆ యిల్లు మరీ
56-Chapter రామేశ్వరంలో పార్వతీ పరమేశ్వరులవలె నాకు సహకరించిన ఆ పుణ్యదంపతులను తలచికొని, ఆ వృద్ధ బ్రాహ్మణుడు చేసిన హితోపదేశానుసారం శ్రీ గురుపాదరేణువులచే పవిత్రమైన రమణా శ్రమ నివాసమే నాకు శరణ్యమని భావించి ఏ
57-Chapter అప్పుడే, అంటే 1953 సెప్టెంబరులో మా చిన్నన్నగారూ భార్యా కాశీయాత్రకు వెడుతుంటే అదివర కా క్షేత్రాలు చూడనందున నేనూ బయలుదేరాను. నా కింకా బలహీనత తగ్గనందున కాశీ, గయ, ప్రయాగ, ఆ మూడు మాత్రమే చూచి
58-Chapter మా వదినెకు క్రమంగా జ్వరం తగ్గింది. ఆ వెనుక వాళ్ళు తీర్థవిధి వగైరా కర్మకాండంతా ముగించేసరికి పది రోజులు పట్టింది. నేను మాత్రం యథా విధిగా తోమ్మిది రోజులు గంగాస్నానం, విశ్వేశ్వర సేవ చేసుకున్నాను. నెలవంతా కాశిలోనే
59-Chapter బుద్ధగయలో సిద్ధార్థుడు తపస్సిద్ధిని పొందిన వృక్షరాజం దర్శించి దాని క్రింద రవంత విశ్రమించి అక్కడినుండి గయ వచ్చి సరాసరి కలకత్తా చేరుకొని ఉగ్రరూపిణియగు కలకత్తా కాళినీ, రామకృష్ణపరమహంస సేవించిన ప్రశాంత కాళినీ
60-Chapter రాజు సెట్టి కాంపౌండులో నే నుంటున్న యిల్లు శిధిలాపస్థకు రావటంవల్ల 1953 లో ఆ కాంపౌండులోనే ఒక చిన్న యింటికి నా మకాం మార్చాను. అక్కడే జబ్బుచేసి వెళ్ళటం జరిగింది. తిరిగి 1953 చివరలో కాశీనుంచి వచ్చి ఆ యిల్లు మరీ
61-Chapter వివాహకలాపం ముగింపుకాగానే మా చిన్నన్నగారు తాను కాశినుంచి తెచ్చిన గంగ కొలనుకొండ భోగేశ్వరస్వామికి అభిషేకం చేయాలని ఒక మంచిరోజున బయలు దేరుతూవుంటే, నేనూ నా కొలనుకొండ నివాస సమాచారం వారందరికీ

62-Chapter

సిమెంటుపని ముగిసిన వెనుక సంప్రోక్షణాదులు జరిపి నిత్యం వెళ్ళకున్నా విశేషదినాలలో అర్చకునితోపాటు నేనూ వెళ్ళి అభిషేక పూజాదులు సక్రమంగా జరిపించి వచ్చేదాన్ని, అధేవిధంవగా ఒక విశేషదినమందు ఉదయం 8 గంటల లోపల

63-Chapter

చాలామంది రమణ భక్తులు అముద్రితంగా వున్న లేఖలు 3, 4, 5 భాగాలు ప్రచురించండని ఆశ్రమంవారిని ప్రోత్సహించారు గాని అప్పటి సందర్భంలో వారందుకు పూనుకొనలేదు. అందువల్ల 1958 లో మూడవ భాగం
64-Chapter కొలనుకొండ మకాం పెట్టిన కొద్ది రోజులకే నాకు రక్తపుపోటు ప్రారంభ##మైంది, అక్కడ డాక్టరు లేక, మందు దొరకక ఇబ్బందిగా వుండేది. అప్పుడప్పుడది బాగా బాధించేది. విజయవాడకు కబురు వెళ్ళటం, అక్కడినుంచి ఎవరో ఒకరు  
65-Chapter అయితే ఈ రమణసదనం ఆశ్రమంలో ఎప్పుడూ వుండేది భగవానూ, (అరూప భగవాన్‌) నేనూ ఇద్దరమే. భక్తు లెవరు వచ్చినా కొంతసేపు వుండి వెళ్ళటమేగాని నిలవ వుండరు. భోజనాది వసతులు ఇక్కడ లేనందువల్ల సకృత్తుగా ఏ
66-Chapter భగవాన్‌ శరీరం విడిచిన ఒక సంవత్సరం లోపలనే వారి సోదరి అలిమేలమ్మ అత్త స్వర్గస్థురాలైనది. ఒక సంవత్సరం దాటిన వెనుక శ్రీవారి సోదరుడు శ్రీ నిరజంనానంద స్వాములున్నూ స్వర్గస్థులైనారు. అంతకుముందే సహాయ కమిటీ ఏర్పాటయింది.
67-Chapter ''నీ వెవరవో తెలుసు'' కొమ్మని శ్రీరమణ భగవానుడు లోకానికి అందించిన సందేశం సకల వేదాంతసారమైన ముఖ్య విషయం. తా నెవరని విచారించి చూడబోతే తానే బ్రహ్మమని తెలుసుకొంటాడు. ఆ బ్రహ్మము సర్వ వ్యాపకమైనది గనుక

Naa Ramanasrma Jeevitham    Chapters