Naa Ramanasrma Jeevitham    Chapters   

26. సూరి సభ

1949 ప్రారంభంలోనే భగవానుని ఎడమ చేతికి కురువు (కణితి) ప్రారంభంచటం, ఆపరేషన్‌లు, ఇత్యాదులన్నీ వచ్చినవి. ఆ వివరమంతా నోటు చేసుకొన్నాను. అదంతా తరువాత వరుసగా వ్రాస్తాను. 1947 మార్చి, ఏప్రిల్‌ ఆ ప్రాంతాలలో "శ్రీవారి శరీరానికి శ్రమ కలుగుతుంది గనుక ఎవరూ ప్రశ్నించరాదనీ, భగవాన్‌ మాట్లాడిస్తేనే తప్ప అవసరంగా ఎవరూ పలుకరించరాదనీ, ఆఫీసు వారు ఆజ్ఞాపిస్తే అందరమూ దాన్ననుసరించే వుంటూ వచ్చాం, ఒకనాటి మధ్యాహ్నంనే నెందుకో రెండు గంటలకే వెళ్ళాను. భగవాన్‌ పెరియపురాణం చూస్తున్నారు. నున్ను చూడగానే ఉత్సాహపూరితులై "ఇదుగో సుందరమూర్తి కథ ఇది, సంబంధుల కథ అది; మాణిక్యవాచకులు దిది; అప్పరుది అది." అంటూ ఆ కథలన్నీ సంగ్రహంగా సెలవిచ్చారు భగవాన్‌. ఆ వెనుక అవ్వయార్‌ సమాచారం ఎత్తుకొని "ఒక సారి కంబరు, సభలో ఆమెను అవమానించాలని 'అడీ అడీ (ఒసీ ఒసి)' అని రెండుసార్లు సంబోధిస్తూ ఒక సమస్య ఇచ్చాడనీ, ఆమె మహాపౌరుషశాలిని గనుక ఆ సమస్య పూరిస్తూ తిరిగి ఆయనను 'అడా అడా (అరే అరే)' అని పదిసార్లు సంబోధిస్తూ ఆ సమస్య పూరించిందనీ ఇంకా ఏవో ఆ కబుర్లూ ఈ కబుర్లూ నాతో చెపుతూ పోష్టు వచ్చేవరకూ మాట్లాడుతునేవున్నారు భగవాన్‌. వారడిగిన దానికి ఏదో సమాధానం చెప్పక నాకూ తప్పలేదు. పోష్టు చూస్తున్నారే గాని లోలో పల నవ్వుకుంటునే వున్నారు భగవాన్‌. పోష్టు వెళ్ళగానే ఒట్ట కూత్తరు (ఒక కవి) సభలో పందెం చరచటం ఇత్యాది కథంతా చెపుతూ వుంటె నాలుగుముప్పావయింది. సేవకులు కఱ్ఱ, కమండలం పుచ్చుకొని నిలవడం చూచి, నేను లేచి నిలబడ్డాను. అది మగనించి భగవాన్‌ సేవకుల వంక చూచి "ఓహో! టయిమయిందా అంటూ?" అంటూ బయటికి వెళ్ళారు.

తమిళ్‌ పండితుడూ, కవీ అయిన ఒక భక్తుడు భగవాన్‌ లేచి వెళ్ళగానే నన్ను సమీపింఛి "నాయన (గణపతి శాస్త్రి) చత్వారింశత్‌లో 'సూరిసభాగురుణా' అని లోగడనే వ్రాశారు. సూరి నాగమ్మ వస్తుంది. ఆమ సభ జరుగుతుందిక్కడ అనే గాబోలు దాని భావం. ఈ నాడంతా సూరి నాగమ్మ సభే" అన్నాడు వ్యంగ్యంగా, నాకేమో విస్తుబోయినట్లుండి" నా దేమున్నది. అంతా భగవానే గదా మాట్లాడింది?" అన్నాను. "అది కాదులే, సూరి నాగమ్మ సభేయిది" అంటూ వెళ్ళిపోయినా డతను. నే నొక ఆప్తమిత్రులతో ఈ విషయం చెపితే" పోనీలేవమ్మా. మంచి మాటే. సూరివంశమంటే పండితవంశమనేగదా అర్థం. 'గణరాణ్ముఖ సూరిసభాగురుణా' అని గమపతిశాస్త్రిగారు వ్రాశారు. గణపతి మొదలైన పండితసభకు నీవు గురుడవు అనిగదా అసలు అర్థం. మీదీ పండితవంశ##మే గనుక సరిపోయిందని అనుకోరాదటమ్మా" అని సమాధానించారు. అదీ బాగానే వున్నదనుకొన్నాను.

Naa Ramanasrma Jeevitham    Chapters