Naa Ramanasrma Jeevitham    Chapters   

32. మూలమంత్రం

శ్లో|| నకర్మణా నప్రజయా ధనేన

త్యాగే నైకే అమృతత్వమానశుః|

పరేణ నాకం నిహితం గుహాయాం

విభ్రాజదేతద్యతయో విశంతి|| (1)

=అరవం= అమృతత్వమానడు కర్మత్తాలుం, పుత్రాది (ప్రజై) యాలుం, ధనత్తాలుం, అడయప్పడువ దన్ఱు, (అవఱ్ఱ్రి&) త్యాగత్తాల్‌ చిలర్‌ అడైహిన్ఱర్‌, స్వర్గత్తిను మిక్కదాయ్‌ (హృతయ) గుహైవిరుందు వి శేషమాయ్‌ విళంగుం ఇద్దసత్తై (ఇంద్రియ నిగ్రహ) యతిగల్‌ అడైహిన్ఱనర్‌.

=తెలుగు= అమృతత్వము కర్మవల్లను, పుత్రాది (ప్రజల) వల్లను, ధనమువల్లను లభ్యము కాదు. (వాటి యొక్క) త్యాగమువల్లనే (అంతర్ముఖులు) కొందరు అమృతత్వమును పొందిరి. స్వర్గమునకు పరమైనదై (హృదయ) గుహయందుండి విశేషమయి వెలుగు ఈ సత్తను (ఇంద్రియ నిగ్రహ) సంపన్నులైన యతులు పొందుదురు.

శ్లో|| వేదాంతవిజ్ఞానసునిశ్చితార్థా

స్సంన్యాసయోగా ద్యతయ శ్శుద్ధసత్త్వాః|

తే బ్రహ్మలోకేతు వరాంతకాలే

పరామృతా త్పరిముచ్యన్తి సర్వే|| (2)

=అరవము= వేదాంతం కూరుం విశేషజ్ఞానత్తాల్‌ ఉరుదిప్పోరుళాల్‌ ఉణగ్దోరుం త్యాగ (సన్యాస) యోగం (మన వొరుమై) కుళాల్‌ శుద్ధ చిత్తరుమాన యతిహళ్‌ (శాంతర్‌) యావరుం బ్రహ్మలోక (సాక్షాత్కార) త్తిల్‌ (అజ్ఞాన మఱ్ఱ్రు) దేహాంత కాలత్తిల్‌ మూలమాయై విన్ఱ్రు ముఱ్ఱ్రుమ్‌ విడిపడు హిన్ఱనర్‌.

=తెలుగు= వేదాంతము బోధించు విశేషజ్ఞానముచే సునిశ్చితార్థులై త్యాగ, (సంన్యాస) యోగా (చిత్తై కాగ్రా)దుల వల్ల శుద్ధచిత్తులైన యతులు (శాంతులు) ఎల్లరును బ్రహ్మలోక (సాక్షాత్కార)మున (అజ్ఞాన రహితులై) దేహాంత కాలమున మూలమాయనుండి పూర్ణముగ విడివడుదురు.

శ్లో|| దహ్రం విపాపం పరమేశ్మభూతం?

యత్పుండరీకం పురమధ్యసగ్గ్‌ంస్థం |

తత్రాపి దహ్రం గగనం విశోక |

స్తస్మిన్‌ యదంతస్తదుపాసితవ్యం|| (3)

=అరవం= ఉడల్‌ నడువిల్‌ (పురమద్ధియిల్‌) అఱ్పముమ్‌, అమలముమ్‌ పరంపొరుళి ఇరుప్పిడముమామ్‌ హృదయకమలత్తినుళ్‌ తున్బమఱ్ఱ్రు ఇలలగుం నుణ్ణిరువాయ్‌ విళంగు మదువే (బ్రహ్మమే) వళ్ళిపడఱ్‌ ఱ్పాలదు.

=తెలుగు= దేహమధ్యమున (పురమధ్యమున) సూక్ష్మము, అమలము, సరవస్తు నివాసస్థానమునగు హృదయకమలములో దుఃఖరహితమై వెలుగుచు సూక్ష్మాకాశమట్లు ప్రకాశించు నదియే (బ్రహ్మమే) ఉపాసింపదగు నట్టిది.

శ్లో|| యోవేదాదౌ స్వరఃప్రోక్తో

వేదాంతే చ ప్రతిష్ఠిత ః |

తన్య ప్రకృతిలీనస్య

యః పరస్స మహేశ్వరః || (4)

=అరవము= వేదాదియిలుం, వేదాంత త్తిలుం ఉళ్ళదాయ్‌

చొల్లప్పరువదుం (ధ్యానత్తాల్‌) ప్రకృతియిల్‌

బడుంగువడుమాం ప్రణవ (సర) త్తిర్కుం ప్పరనా

యుళ్ళోనే పరమేశువరనా (పరంపొరుళా) వాన్‌.

=తెలుగు= వేదమున కాదియందును, వేదాంతమునందును, ఉన్నదిగా చెప్పబడునదియు, (ధ్యానముచే) ప్రకృతిలో లీనమగునదియు, నైన ప్రణవ (స్వర)మునకు పరమైయుండు వాడే పరమేశ్వరుడు (పరవస్తువు) అగును.

(భగవా& వ్రాసిన తేదీ 10-9-38)

Naa Ramanasrma Jeevitham    Chapters