Naa Ramanasrma Jeevitham    Chapters   

10. సన్నిధి సేవ

నా నివాసం ఆశ్రమం దగ్గరకు మారిన కొద్దినెలలలోనే భగవానుని స్తుతిస్తూ భక్తులు వ్రాసిన సంస్కృత శ్లోకాలన్నీ అచ్చువేయించాలని, రాణి ప్రభావతి ప్రయత్నిస్తూ, రమణ సహస్రనామాదులు వ్రాసిన జగదీశ్వరశాస్త్రిగారిచేత ఆ శ్లోకాలన్నీ సంస్కరింపజేసి, తాను నాగరలిపిలో కాపీచేయు టకు ఆరంభించింది. భగవా& సమీపవర్తియగు రాజగోపాలయ్యరు ఆ కాగితాలన్నీ శ్రీవారికి చూపించడంలో తెలుగులో వున్న పద్యాలెన్నో వారికంట పడ్డవి. భగవా& నా వైపుచూస్తూ ''ఇవిగూడా ఎవరైనా కాపీచేస్తే బాగుండును.'' అని అప్పుడప్పుడు అంటూ వచ్చారు. ఒకనాడు అదేవిధంగా జగదీశ్వర శాస్త్రిగారితో భగవానంటే ''నాగమ్మ ఆ పనికి పూనుకుంటే బాగుండును.'' అన్నారట శాస్త్రిగారు. ''ఏమో! మన మెట్లా చెప్పేది'' అన్నారట భగవా&. వారిద్దరి ఆ సంభాషణ నాకు సరిగా వినిపించక భగవా& బయటికి వెళ్ళినప్పుడు శాస్త్రిగారితో ''అన్నా! భగవా& ఏమిటి అంటున్నారు?'' అన్నాను. ''తెలుగు పద్యాలన్నీ ఎవరైనా కాపీచేస్తే బాగుండును అని అంటున్నారమ్మా.'' అన్నారు శాస్త్రిగారు. ''ఆ పని నేనే చేయవచ్చునుగాని చెప్పందే తాను గొప్పగా బయలు దేరిందంటారుగాబోలునని జంకుతున్నా'' నన్నాను. ''ఎవరైనా కాపీచేస్తే బాగుండునని భగవాన్‌ నిన్ను చూచే అంటున్నారమ్మా. వేరే చెప్పాలా? రేపు అడుగు. ఇస్తారో లేదో చూద్దాం.'' అన్నారు శాస్త్రిగారు.

మర్నాటి ఉదయాన భగవా& కొండదిగి వచ్చిన వెనుక సావధానం చూచుకొని సోఫా దగ్గరగా వెళ్ళి నిలబడ్డాను. ''ఏమి?'' అన్నట్లు చూచారు భగవా&. ''తెలుగు స్తోత్రాలు గూడా కాపీచేస్తే బాగుండునే'' అన్నాను. ''అవును. సరే. చేసే దెవరు?'' అని అదటుగా సెలవిచ్చారు భగవా&. ''నేనే చేద్దామనుకుంటున్నా'' నన్నాను. అల్లాగైతే మంచిదే. దాని కేమి? మరి పుస్తకం కావద్దూ?'' అన్నారు భగవాన్‌. ''కావాలి'' అన్నాను. ''చూస్తాం'' అని సెలవిచ్చి రాజగోపాలయ్యరుతో ''ఏమోయ్‌. తెలుగంతా నాగమ్మ కాపీ చేస్తుందట. తీసియివ్వు. పెద్ద బైండు పుస్తకం గూడా చూచి యివ్వు'' అన్నారు భగవా&. వారు కాగితాలూ, బైండు పుస్తకం తెస్తే భగవానవి స్వయంగా నా కప్పగించి, బాధ్యతారహితులైనట్లు కూర్చున్నారు. నాటినుండీ తెలుగులో ఏ స్తోత్రాలు వచ్చినా తాము చదవడంమాని నాచేతనే చదివించి వినేవారు భగవా&. కాపీచేయడం నావంతేగదా.ఆ వెనుక లైబ్రరీలో వున్న తెలుగు పుస్తకాలున్నూ ఇవ్వడం, పుచ్చుకోవడం ఇత్యాదులన్నీ చూస్తూ వచ్చాను. అదేగాక ఉత్సవసమయా లలో స్త్రీలకు వాలంటియర్‌గా కూడా పనిచేస్తూ వచ్చాను. ఈ పనులవల్ల భగవా& సన్నిధిలో బాగా చనువు ఏర్పడ్డది. గ్రంథపరిచితిన్నీ బాగా కలిగింది.

Naa Ramanasrma Jeevitham    Chapters