Naa Ramanasrma Jeevitham    Chapters   

8. కోతుల సేవ

ఏ భక్తులకు గాని గురుదైవముల అనుగ్రహం పొందిన వెనుక వారిని స్తుతించాలన్న బుద్ధిపుట్టటం సహజమే గదా? అందువల్ల అదివరకే నాలో ఇమిడివున్న కవితా ధోరణికి ఈ సందర్భంలో మంఛి అవకాశం లభించి 1941 నవంబరులో జరిగిన కృత్తికోత్సవ సమయంలో 5 పద్యాలు వ్రాసి శ్రీ వారికి సమర్పించాను. ఆ వెనుక గుఱ్ఱం సుబ్బరామయ్యగారు 1942 అక్టోబరులో అట్టలుసడలీ, కుట్లుపూడీ శిథిలావస్థలోవున్న''ఆముక్తమాల్యద'' అనే గ్రంథం భగవాన్‌ సన్నిధికి పంపారు. భగవా నది బైండు చేయించి ముత్యాలవంటి అక్షరాలతో పేరు వ్రాసి చదువుమని నా కిచ్చారు. అప్పుడున్నూ కొన్ని పద్యాలు వ్రాసి భగవానుకు సమర్పించడం జరిగింది. 1943లో శ్రీవారి చరిత్ర సంగ్రహం గొబ్బిపాటగా వ్రాశాను. వ్రాసిన కొత్తలో చంద్రమ్మ అనే ఒక ఆంధ్రయువతి చక్కని రాగంతో ఆ పాట భగవాన్‌ సన్నిధిలో పాడింది. భగవాన్‌ సావధానంగా విని ''ఇది శివప్రకాశంపిళ్ళె వ్రాసిన 'వాళ్హ వాళ్హ వాళ్హ వాళ్హ రమణర్‌ పాదం వాళ్హవె' అన్న దానివలె వున్నదోయ్‌'' అని ప్రక్కనున్న వారితో సెలవిచ్చి, నాలుగు ముప్పావుకు కొండవైపువెడుతూ రంగస్వామితో ''ఇదిగో చూడు. నన్ను అందరూ ఆ అవతారం ఈ అవతారం అని వ్రాస్తారు. నాగమ్మ ఎల్లా వ్రాసిందనుకున్నావ్‌. 'నిత్యమై అనంతమైన ప్రత్యగాత్మయె. సత్యపథము జాడ దెలుపజనన మందెనె' అని వ్రాసింది. ఎక్కడ విజయవాడ, ఎక్కడ అరుణాచలం. అక్కడినుండి వచ్చి, ఇక్కడే వుండిపోయి, ఇల్లా వ్రాసిందంటె ఏం చెప్పగలం? వారివారి సంస్కారాన్ని బట్టి స్వభావాలు వెలువడుతూ వుంటవి. దాని సంస్కారం అటువంటిది.'' అని సెలవిచ్చారట భగవాన్‌.

ఆ వెనుక కొద్దిరోజులకే ప్రార్థన అనే శీర్షికతో 4 పద్యాలు వ్రాసి శ్రీవారికి సమర్పించాను. భగవా నవిచూచి తమలో తామే నవ్వుకుంటూవుంటె రాజగోపాలయ్యరుచూచి ''ఏం వ్రాసిందేమిటి?'' అని అడిగాడు. భగవాన్‌ దరహసిత వదనులై ''ఇవి ప్రార్థనగా వ్రాసినవి నాల్గు పద్యాలు. ఇందులో రెండవ పద్యం తమాషాగా వున్నదోయ్‌ నాకు కొండవిడచిన వెనుక కోతులసేవ లేదట. అందువల్ల నా మనస్సనే కోతిని నీ పాదసేవ చేయించుకోరాదా? ఇహార్థములకై ప్రాకులాడే ఈ కోతిని కట్టో, కొట్టో, నీ పాదసేవ చేయించుకో బాబూ అని భావం శివానందలహరిలో శంకరులున్నూ ఒక శ్లోకంలో ఇంచుమించు ఇదే భావంగా వ్రాశారు. * 'ఓ శంకరా! నీవు భిక్షుకుడవు గదా ! నా మనస్సనే కోతిని నీ కఱ్ఱకు కట్టుకొని పోరాదా? నీకు భిక్ష బాగా దొరకుతుందే' అని ఆశ్లోక భావం. ఈ పద్యాలభావం అల్లాగేవుంది'' అని సెలవిచ్చారు. నా కెంతో సంతోషం కలిగింది. ఆ పద్యం దిగువన వ్రాస్తున్నాను.

''కోతుల సేవలేదుగదకొండను

వీడిన వెన్కచిత్తమ&

కోతియిదేభ్రమించు గయికోగదవే

బహుజన్మవాసన& !

గాతర¸°నిహార్థములకై కృప

కట్టుదొ కొట్టుదోరుష&

నేతవుతీర్చు టెట్లొ పదనీరజసేవల

నెట్లుగొందువో ||

_______________________________

* శివానందలహరీ - 20 - వ శ్లోకం.

Naa Ramanasrma Jeevitham    Chapters