Sri Vamana Mahapuranam    Chapters   

శ్రీ వామన పురాణ షట్పంచాశోధ్యాయః

నారద ఉవాచ ః

భగవం ల్లోకనాథాయ విష్ణవే విషమేక్షణః, కిమర్థ మాయుధం చక్రం దత్తవాం ల్లోకపూజితమ్‌ ? || 1

పులస్త్య ఉవాచ ః

శ్రుణుష్వావహితో భూత్వా కతా మేతాం పురాతనీమ్‌, చక్రప్రదాన నంబద్ధాం శివమాహాత్మ్యవర్థినీమ్‌ || 2

ఆసీద్ద్విజాతి ప్రవరో వేదవేదాంగపారగః | గృహశ్రమీ మహాభా గో వీత మన్యు రితిస్మృతః || 3

తస్యాత్రేయీ మహాభాగా భార్యాసీచ్ఛీలసంమ తా, పతివ్రతా పతిప్రాణా ధర్మశీలేతి విశ్రుతా || 4

తస్యా మస్య మహర్షేస్తు ఋతుకాలాభిగామినః, సంబభూవ సుతః శ్రీమాన్‌ ఉపమన్యు రిత్మృతః || 5

తం మాతా మునిశార్దూల ! శాలిప్టిరసేనవై, పోషయామాస వదతీ క్షీర మే తత్‌ సుదుర్గతా || 6

సో జానానో థ క్షీరస్య స్వాద్రుతాం పయ ఇత్యథ, సంభావనామప్యకరో చ్ఛాలివిష్టరసే పి హి || 7

సత్వేకదాసమం పిత్రా కుత్రచి ద్విజవేశ్మని, క్షీశాదనంచ బుభుజే సుస్వాదు ప్రాణపుష్టిదమ్‌ || 8

స లబ్ద్వా నుపమం స్వాదం క్షీరస్యఋషిదారకః, మాత్రా దత్తం ద్వితీయేహ్ని నా దత్తే పిష్ట వారి తత్‌ || 9

రురోదా థతతో బాల్యాత్‌ పయోర్థీ చాతకో యధా, తం మాతా రుదతీ ప్రాహ బాష్పగద్గదయా గిరా || 10

ఉమాపతౌ పశుపతౌ శూలధారిణి శంకరే, అప్రసన్నేవిరూపాక్షే కుతః క్షీరేణ భోజనమ్‌ || 11

యదీచ్చసి పయోభోక్తుం సద్యః పుష్టికరం సుత! తదారాధయ దేవేశం విరూపాక్షం త్రిశూలినమ్‌ || 12

తస్మింస్తుష్టే జగద్ధామ్ని సర్వకల్యాణదాయిని, ప్రాప్యతే మృతపాయిత్వం కింపునః క్షీరభోజనమ్‌ || 13

తన్మాతు ర్వచనం శ్రుత్వా వీతమన్యు స్సుతో బ్రవీత్‌, కోక యం విరూపాక్షతి త్వయా రాధ్యస్తు కీర్తితః || 14

తతఃసుతం ధర్మ శీలా ధర్మాఢ్యం వాక్య మబవీత్‌, యో యం విరూపాక్షితి శ్రూయతాం కధయామి తే ||1 5

నారదుడు ప్రశ్నించాడు స్వామీ ! ఆ అసమాక్షుడు శివుడు లోకనాధుడైన విష్ణునకు లోకపూజితమైన చక్రాయుధం ఎందులకిచ్చెను? అందుకు పులస్త్యుడిలా చెప్పపాగాడు. నారదా ! ఈ చక్ర ప్రధానకధ మహా పురాతనమైనది. శివమాహత్మ్యాన్ని పెంపొందించేదని. చెబుతున్నా జాగ్రత్తగా వినుము. ఒకప్పుడు వేత్త ద్విజాతిశ్రేష్ఠుడు మహానుభావుడు గృహస్థాశ్రమంలో వున్నవాడు ''వీతమన్యుడు'' అనువాడు ఉండెను. ఆత్రేయుడు, అతని భార్య పతివ్రత శీలవతి, పతియే ప్రాణంగా భావించిన సాధ్వి, పేరు ధర్మశీల. ఒకప్పుడు ఋతుకాలంలో ఆమెను ఆ మహర్షి కలియగా వారలకు ఉపమన్యుడను శ్రీమంతుడు కలిగాడు అతడ్ని దరిద్రానికిలోనై తనపుత్రునకు రోజూ ''పాలు'' అని చెప్పి బియ్యపు పిండి కలిపిన నీరు యిస్తూ ఉండేది. పాలరుచి తెలియని ఆ బాలుడు ఆపిండి నీటినే త్రాగుతూ వచ్చాడు. ఒకనాడు తండ్రి వెంట ఒక బ్రాహ్మణ గృహంలో భోజనానికి వెళ్లగా అక్కడ మధురమైన క్షీరాన్నం వడించారు. ఆ ప్రాణ పుష్టుకరమైన పాయాసాన్ని కడుపార త్రాగిన ఆ బిడ్డు మరునాడు తల్లి యిచ్చిన బియ్యపు నీరు త్రాగలేదు. బాల్యచాపల్యాన పాలు తెమ్మని ఏడువసాగాడు. వేరే ఏమిచ్చినా వద్దంటూ స్వాతి చినుకు కోసం చాతకం లాగ పట్టుబట్టి కూర్చున్నాడు. పిల్లవాని ఏడ్పు తన అసహాయతకు కుమిలిపోతూ ఆ తల్లి ధర్మశీల రుద్ధకంఠంతో - నాన్నా ! ఉమాపతి పశుపతి శూలధరుడు విరూపాక్షుడైన శంకరుడు అప్రసన్నుడైన చోట పాలెక్కడ నుంచి వచ్చునయ్యా ? నిజంగా పుష్టినిచ్చే పాలు కావాలంటే ఆ త్రిశూల ధరుడైన విరూపాక్షుణ్ణి ఆరాధించు తండ్రీ ! ఆ జగన్మయుడు, సర్వకల్యాణ ప్రదాత సంతోషిస్తే పాలే కాదు అమృతమే త్రాగవచ్చు బాబూ ! అని విలపించింది. తల్లి మాట మనస్సుకు నాటిన ఆ బాలుడు - అమ్మా ! నీవారాధించమనిన ఆ విరూపాక్షుడెవరమ్మా ? ఎలా ఉంటాడో చెప్పమ్మా అని అర్థించగా నా ధర్మశీల, బాబూ ! ఆ విరూపాక్షదేవుడెవరో చెబుతున్నా వినుము అని చెప్పసాగింది.

ఆసీన్మహా నురపతిః శ్రీదామ ఇతివిశ్రుతః తేనాక్రమ్య జగత్పర్వం శ్రీర్నీతా స్వవశం పురా || 16

ని శ్రీ కాస్తు త్రయోలోకాః కృతాస్తేన దురాత్మనా, శ్రీవత్సం వాసుదేవస్య హర్తు మైచ్చ న్మహాబలః || 17

తమస్య దుష్టం భగవా నభిప్రాయం జనార్దనః, జ్ఞాత్వా తస్య వధాకాంక్షీ మహేశ్వర ముపాగమత్‌ || 18

ఏతస్మిన్నంతరే శంభు ర్యోగమూర్తిధరో వ్యయః, తస్థౌహి మాచల ప్రస్థ మాశ్రిత్య శ్లక్షభూతలమ్‌ || 19

ఆధా భ్యేత్యజగన్నాధం సహస్రశిరసం విభుమ్‌, ఆరాధయామాస హరిః స్వయ మాత్మాన మాత్మనా || 20

సాగ్రం వర్షసహస్రం తు పాదాంగుష్ఠేన తస్థివాన్‌, గృణం స్తత్పరమం బ్రహ్మ యోగిజ్ఞేయ మలక్షణమ్‌ || 21

తతఃప్రీతః ప్రభుః ప్రాదా ద్విష్ణవే పరమం వరమ్‌, ప్రత్యక్షం తైజసం శ్రీమాన్‌ దివ్యం చక్రం సుదర్శనమ్‌ || 22

తద్దత్వా దేవదేవాయ సర్వభూత భయప్రదమ్‌, కాలచక్రనిభం చక్రం శంకరో విష్ణు మబ్రవీత్‌ || 23

వరాయుధో యం దేవే శ ! సర్వాయుధనిబర్హణః, సుదర్శనోద్వాదశారః షణ్ణాభి ర్ద్వియుగో జవీ || 24

ఆరాసంస్థా స్త్వమీచా స్య దేవా మాసాశ్చ రాశయః, శిష్టానాం రక్షణార్థాయ సంస్థితా బుతవశ్చషట్‌ || 25

అగ్నిఃసోమః తథా మిత్రో వరుణో థ శచీపతిః,ఇంద్రాగ్నీ చా ప్యధో విశ్వే ప్రజాపతయఏవచ || 26

హనూమాంశ్చాథ బలవాన్‌ దేవూ ధన్వంతరి స్తథా, తపశ్చైవ తపస్యశ్చ ద్వాదశైతే ప్రతిష్టితాః,

చైత్రాద్యాః ఫాల్గుణాంతాశ్చ మాసా స్తత్ర ప్రతిష్ఠితాః || 27

త్వమేవమాధాయవిభో ! వరాయుధం, శత్రుం సురాణాం జహి మా విశంకిథా ః,

అమోఘ ఏషోమరరాజ పూజితో ధృతో మయా నేత్రగత స్తపోబలాత్‌ || 28

ఇత్యుక్తః శంభునా విష్ణుః భవం వచన మబ్రవీత్‌, కథం శంభో విజానీయా మమోఘో మోఘ ఏవ వా || 29

యద్యమోఘో విభో ! చక్రః సర్వత్రా ప్రతిమస్తవ, జిజ్ఞాసార్ధం తవై పేహ ప్రక్షేప్స్యామి ప్రతీచ్చ భో | 30

బాబూ ! పూర్వం శ్రీ దాముడనే ఘోరరక్కసుడు ముల్లోకాలను జయించి లక్ష్మీదేవిని తీసుకుని వెళ్ళాడు. ఆ దురాత్ముని చేష్టవల్ల లోకాలన్నీ శ్రీ హీనాలైపోయాయి. వాసుదేవుని శ్రీవత్సాన్ని కూడ హరించాలని ఆ దుష్టుడు సంకల్పించాడు. వాడి దురాలోచన గ్రహించిన జనార్దనుడు వానిని వధించ గోరి మహేశ్వరుని వద్దకు వెళ్లాడు. ఈ లోపున యోగమూర్తియై అవ్యయుడైన శివుడు హిమాచలం మీద పీఠభూమిగా ఉన్న సమతల స్నిగ్ధ ప్రదేశాన స్థానమేర్పరచుకున్నాడు. ఆహరి సహస్ర శీర్షుడైన ఆమహాదేవుని సమీపించి, ఆయనను తన ఆత్మస్థునిగా భావించి ఒంటికాలి బొటనవ్రేలు మీద నిలచి వేయి సంవత్సరాలు ఆయోగిగమ్యుడూ లక్షణాతీతుడైన పరబ్రహ్మను ఆరాధించాడు. విష్ణువు చేసిన ఆ ఉగ్రతపస్సునకు సంతోషించి వరంగా, తేజోమయమైన దివ్యసుదర్శన చక్రాన్ని యిస్తూ యిలా అన్నాడు. జనార్దనా ! ఇది సర్వప్రాణి భయంకరమైన మృత్యుచక్రాన్ని బోలిన చక్రం. ఇతర ఆయుధాలన్నింటినీ నాశనం చేయగల ఉత్తమ ఆయుధం. ఈ ఉదర్శన చక్రం పన్నెండు ఆకులూ ఆరు నాభులు రెండు యిరుసులూ కలిగి మహావేగం కలది. దీని ఆకులలో దేవతలు పన్నెండు మాసాలు, పన్నెండు మేషాదిరాసులు, ఆరు ఋతువులూ ఉన్నాయి. సూర్యచంద్రాగ్నులు వరుణుడు శచీపతి విశ్వేదేవతలు ప్రజాపతులు, హనుమంతుడు ధన్వంతరి మొదలైన సర్వ దేవమయమైన ఈ ఆయుధం సజ్జనుల రక్షణకై రూపింపబడినది దీనిలో తపస్సు, తపస్వులు పన్నెండుగూరూ చైత్రాది ఫాల్గుణాంతాలయిన మాసాలు ఉన్నాయి. ఇలాంటి దివ్యాయుధాన్ని తీసుకుని దేవశత్రువును సంహరించుము. ఇంద్రుడు ఆరాధించిన ఆ అమోఘాస్త్రాన్ని యోగబలంచేతనేను నానేత్రాలలో యింతవరకు ధరించాను. శివుడు చెప్పిన మాటలువిని శ్రీహరి ఆయనతో యిలా అన్నాడు ఓ మహాదేవా ! ఈ అస్త్రం అమోఘమవునో కాదో నాకెలా తెలుస్తుంది? ఎక్కడా ఎదురు లేకుండా ఉండేవరా యుధమైనదీ లేనిదీ తెలుసుకొనుటకుగాను, దీనిని నీమీదనే ప్రయోగించి నా సందేహం తీర్చుకుంటాను సిద్ధంగా ఉండండి -30

తద్వాక్యంవాసుదవేస్య నిశమ్యాహ పినాకధృక్‌, యద్యేవేం ప్రక్షిపస్వేతి నిర్విశంకేన చేతసా || 31

తన్మహేశానవచనం శ్రుత్వావిష్ణు ః సుదర్శనమ్‌, ముమోచ తేజోజిజ్ఞాసుః శంకరం ప్రతివేగవాన్‌ || 32

మురారికర విభ్రష్టం చక్ర మభ్యేత్యశూలినమ్‌ , త్రిథాచ కార విశ్వేశం యజ్ఞేశం యజ్ఞయాజకమ్‌ || 33

హరం హరిస్త థాభూతం దృష్ట్వా కృత్తం మహాభుజః, వ్రీడోపప్లుతదేహస్తు ప్రణిపాతపరో భవత్‌ || 34

పాదప్రణామా వనతం వీక్ష్యదామోదరం భవః, ప్రాహ ప్రీతిపరః శ్రీమాన్‌ ఉత్తిష్ఠేతి పునఃపునః || 35

ప్రాకృతోయం మహాబాహూ! వికార శ్చక్రనేమినా, నికృత్తో న స్వభాతోమే నోచ్ఛేద్యో దాహ్య ఏవచ || 36

తద్యదేతాని చక్రేణ త్రీణి భాగాని కేశవ, కృతాని తాని పుణ్యాని భవిష్యంతి న సంశయః|| 37

హిరణ్యాక్షః స్మృతోహ్యేకః సువర్ణాక్షస్తధా పరః, తృతీయశ్చ విరూపాక్ష స్త్రయో మీ పుణ్యదా నృణామ్‌ || 38

ఉత్తిష్ఠ గచ్ఛస్వ విభో ! నిహంతు మమరార్దనమ్‌, శ్రీదామ్ని నిహతే విష్ణో నందయిష్యంతి దేవతా ః|| 39

ఇత్యేవముక్తో భగవాన్‌ హరేణ గరుధ్వజః, గత్వాసురగిరి ప్రస్థం శ్రీదామానం దదర్శహ || 40

తం దృష్ట్వా దేవదర్పఘ్నం దైత్యం దేవవరో హరిః, ముమోచ చక్రం వేగాడ్యం హతోసీతి బ్రువ న్ముహుః || 41

తతస్తు తేనా ప్రతిపౌరు షేణ చక్రేణ దైత్యస్య శిరో నికృత్తమ్‌,

సంఛిన్న శీర్షో నిపపాతశైలా ద్వజ్రాహతం శైల శిరో యథైవ || 42

తస్మిన్‌ హతే దేవరిపౌ మురారి రీశం సమారాధ్య విరూపనేత్రమ్‌, లబ్ద్వా చ చక్రం

ప్రవరం మహాయుధం జగామ దేవూ నిలయం పయోనిధిమ్‌ || 43

సో యంపుత్ర ! విరూపాక్షో దేవదేవోమహేశ్వరః , తమారాధయ చేత్‌ సాధో ! క్షీరేణచ్చసి భోజనమ్‌ || 44

తన్మాతు ర్వచనం శ్రుత్వా వీతమన్యుసుతో బలీ, తమారాధ్య విరూపాక్షం ప్రాప్తః క్షీరేణ భోజనమ్‌ || 45

ఏవంతవోక్తం పరమం పవిత్రం సంఛేదనం శర్వతనోః పురా వై,

తత్తీర్థవర్యం స మహాసురో వై సమాససాదా థనుపుణ్యహేతోః || 46

ఇతి శ్రీ వామన పురాణ షట్పంచాశోధ్యాయః సమాప్తః

వాసుదేవుని మాట విని ఆపినాకపాణ్హి, జనార్దనా ! అలాగైతే వెంటనే సందేహించకుండా చక్రం నామీద ప్రయోగించమని ఆదేశించాడు. ఈ శ్వరుని మాట విని వెంటనే తేజోరాశి అయిన ఆ ఆయుధాన్ని శ్రీహరి ప్రయోగించగా నది శివుని శరీరాన్ని మూడు భాగాలుగా విశ్వేశ్వరుడు, యజ్ఞేశ్వరుడు, యాజకుడుగా ఖండించింది. హరుడు మూడు భాగాలుగా ఖండితుగుట చూచి విష్ణువు సిగ్గుతో కుంచించుకుపోయి ఆమహనీయుని కాళ్లమీద పడిపోయాడు. అంతట భవుడు ప్రేమతో నాహరిని చూచి దామోదరా చింతింపకుము, లెమ్ము లెమ్ము. ఈ మార్పు నాలో కనిపించే భౌతిక దేహానికే వర్తింస్తుంది. కాని నా అసలు రూపం అచ్ఛేద్యం అదాహ్యం. దానినే శక్తి ఖండించలేదు. నీ చక్ర ప్రయోగంలో ముక్కలైన ఈ శరీరం గూడ కల్యాణ ప్రదంగా పరిణమిస్తుంది. ఈ మూడు ఖండాలలో మొదటిది హిరణ్యాక్షుమనీ రెండవది సువర్ణాక్షమనీ మూడవది విరూపాక్షమనీ ప్రసిద్ధి చెందుతాయి. ఈ మూడు నరులకు పుణ్యం కలుగజేస్తాయి. యిందులో నీవు బాధపడవలసినదేవీ లేదు. ఈ చక్రం తీసికొని దేవ విరోధి అయిన ఆ అసురుణ్ణి హతమార్చమని చెప్పగా గరుడధ్వజుడు మేరుపర్వతానికి వెళ్ళి శ్రీదామదైత్యుని చూచాడు. ఆ దేవదర్పహరుడి మీద చక్రం ప్రయోగించి శిరస్సు తెగవేశాడు. అలా చక్రధారకు తలతెగి ఆ రాక్షసుడు వజ్రధారకు తెగిపడే గిరి శిఖరం లాగా నేల మీద పడిపోయాడు. అంతట నామురారి శివుని విరూపాక్షుని పూజించి ఆయన అనుమతి పొందిన సుదర్శనాయుధంతో క్షీరసాగరానికి వెళ్లాడు. కుమారా ఉపమన్యూ ! ఆ ప్రభువే విరూపాక్షుడు త్రినేత్రుడు ఆయన నారాధిస్తే నీకు కావలసిన క్షీరాన్న భోజనం లభిస్తుంది తల్లి మాటలకు సంతోషించి ఆబాలుడు పట్టుదలతో విరూపాక్ష దేవుని ఆరాధించి క్షీరభోజనాన్ని సమకూర్చుకున్నాడు. నారదా ! శివుని శరీరం మూడుగా ఛేదింపబడటం శ్రీహరికి శివుడు సుదర్శన ప్రదానం చేయడం ఎలా సంభవించిందీ నీకు చెప్పాను. ఆ అసురభాగవతుడు ప్రహ్లాదుడు పుణ్యసంపాదనకై ఆ క్షేత్ర రాజానికి వెళ్ళి చేరాజు -

ఇది శ్రీ వామన పురాణంలో ఏబది యారవ అధ్యాయం ముగిసినది

Sri Vamana Mahapuranam    Chapters