Sri Vamana Mahapuranam    Chapters   

ముప్పది ఆరవ అధ్యాయము

పులస్త్య ఉవాచ :

తతోమురారి భవనం నమభ్యేత్య సురాస్తతః |ఊచుర్దేవంనమస్కృత్య జగత్సంక్షుబ్దికారణమ్‌. 1

తచ్ర్భుత్వా భగవాన్‌ ప్రాహ గచ్ఛామోహర మందిరమ్‌ |

నవేత్స్యతి మహాజ్ఞానీ జగత్‌ క్షుబ్దం చరాచరమ్‌. 2

తథోక్తా వాసుదేవేన దేవాః శక్రపురోగమాః | జనార్దనం పురస్కృత్య జగ్ముర్మండరకంగిరిమ్‌. 3

శూన్యం గిరిమపశ్యంత అజ్ఞానతి మిరావృతాః | తాన్‌ మూఢదృష్టీన్‌ సంప్రేక్ష్య దేవాన్‌ విష్ణుర్మహాద్యుతిః. 4

ప్రోవాచకిం నపశ్యధ్వం మహేశం పురతః స్థితమ్‌ | తమూచుర్నైవ దేవేశం పశ్యామో గిరిజాపతిమ్‌. 5

నవిద్మః కారణంతచ్చ యేనదృష్టిర్హతాహినః | తానువాచ జగన్మూర్తి ర్యూయం దేవస్యసాగసః. 6

పాపిష్ఠా గర్భహంతారో మృడాన్యాః స్వార్థతత్సరాః | తేనజ్ఞాన వివేకోవై హృతో దేవేనశూలినా. 7

యేనాగ్రతః స్థితమపి వశ్యంతో7పిన పశ్యథ | తస్మాత్‌ కాయ విశుద్ద్యర్థం దేవదృష్ట్యర్థ మాదరాత్‌. 8

తప్తకృచ్ఛ్రేణ సంశుద్ధాః కురుద్వం స్నామీశ్వరే | క్షీరస్నానే ప్రయుంజీత సార్థం కుంభశతంసురాః 9

దధిస్నానేచతుఃషష్టీ ర్ద్వాత్రిం శద్దవిషో7ర్హణ | పంచగవ్యస్య శుద్దస్య కుంభాః షోడశకీర్తితాః. 10

మధునో7ష్టౌజల స్యోక్తాః సర్వేతేద్విగుణాః సురాః | తతోరోచనయాదేవ మష్టోత్తర శ##తేనహి. 11

అనులంపేత్‌ కుంకుమేన చందనేనచ భక్తితః | బిల్వపత్రైః సకమలైః ధత్తూరకసు చందనైః. 12

మందారైః పారిజాతైశ్చ అతిముక్తైస్తథా7ర్చయేత్‌ | ఆరుగుం సహకాలేయం చందనే నాపిధూపయేత్‌. 13

జప్తవ్యం శతరుద్రియం ఋగ్వేదోక్తైః పదక్రమైః | ఏవంకృతేచ దేవేశం పశ్యధ్వంనేత రేణచ. 14

ఇత్యుక్తా వాసుదేవేన దేవాః కేశవమబ్రువన్‌ | విధానంతప్త కృచ్ఛ్రస్య కథ్యతాం మధుసూదనః

యస్మింశ్చీర్ణే కాయశుద్ది ర్భవతే సార్వకాలికీ. 15

శివపూజా విధానం

xmsoÌÁxqsVòQù²T…ÈýÁ¬s¹¸…V : ఓ నారదా ! అంతట నా దేవతలందరు మురారి విష్ణు మందిరానికి వెళ్ళి ఆ దేవునకు ప్రణామాలు గావించి జగత్సంక్షోభానికి కారణమేమని ప్రశ్నించారు.అదివిని శ్రీహరి మనమందరము శ్రీ శంకరుని నివాసానికి వెళ్ళుదము. మహాజ్ఞానియగు నాతడే జగత్తు సంక్షోభకరాణం చెప్పగలుగును. అన్నాడు. జనార్దనుని సలహా మేరకు ఆయన వెంటరాగా ఇంద్రునితో గలిసి దేవతలందరు మందరగిరికి వెళ్ళగా నచట శివపార్వతులు కాని నందీశ్వర వృషభాలు కాని కనిపించలేదు. అజ్ఞానాంధకారం వల్ల మూర్ఖులై వెర్రి చూపులతో నాశూన్య మందిరాన్ని చూస్తూ నిలచిపోయిన దేవతలతో మహా తేజస్వియగు నా విష్ణువు, ఇదేమి ఎదురుగా ఆశీనుడైన మహాదేవుడు మీకు కనిపించడం లేదా ! అని ప్రశ్నించాడు. అందుకు దేవతలు తమకా గిరిజా నాధుడు కనిపించడం లేదు. తమ దృష్టి ఏకారణాన నశించినదో తెలియదని వాపోయారు. అప్పుడు శ్రీహరి మీరు మహా పాపిష్ఠులు. శివద్రోహం చేశారు. స్వార్థంతో గ్రుడ్డివారై ఆ భవాని మృడాని గర్భహననం గావించారు. అందుచేత మీ జ్ఞానం వివేకం ఆ శూలపాణి హరించాడు. కనుకనే ఎట్టఎదుట ఆయన ఉన్ననూ కళ్ళుతెరచి కొని కూడా మీరా ప్రభువును చూడలేకున్నారు. కాబట్టి ఆ పాపపరిహారానికై తప్తకృ చ్ఛ్ర వ్రతం ద్వారా కాయ శుద్ధి చేసుకోండి. దేవుని చూడగలుగుటకై ఆ మహనీయునకభిషేకం చేయండి. నూట ఏబది కడవల పాలతోను తర్వాత అరవై నాలుగు కుండల పెరుగుతోను, ఆ తర్వాత ముప్పది రెండు కడవల నేయితోను పదహారు కడవల పంగవ్యం (ఆవుపాలు ఆవు పెరుగు ఆవు నేయి, ఆవు పేడ అవుపంచితం కలిసిన మిశ్రం) తోను వరసగా నామహాదేవుని అభిషేకించండి. అనంతరం ఎనిమిది కడవల తేనెతో అభిషేకించి కడపటగా పైవాని కన్నింటికీ రెండు రెట్లు కడవల శుద్ధోదకంతో స్వామిని స్నానం చేయించండి. స్నానాంతరం స్వామి దేహానికి రోచన లేపనం (గోరోచనం) నూట ఎనిమిది పర్యాయాలు పూయాలి. కుంకుమ చందనాలతో భక్తిపూర్వకంగా అలంకరించి బిల్వదళాలు తామరపూలు ఉమ్మెత్తపూలు సురచందన మందార, పారిజాత, అతిముక్త కుసుమాలతో అర్చించాలి. అగరు కాలేయం (నల్లగంధ చూర్ణం) తో కలిసి స్వామికి ధూపం వేయాలి. తర్వాత నా హరుని ఋగ్వేదోక్తమైన పదక్రమ విన్యాసంతో శతరుద్రీయ మంత్రజపం చేయాలి. ఇలాచేస్తే మీ పాపాలు తొలగి ఆ స్వామి ప్రసన్నుడై నష్టమైన మీ దృష్టిని తిరిగి అనుగ్రహిస్తాడు. ఇక వేరే దారి ఏదీలేదు. వాసుదేవుని మాటలకు దేవతలు క్రుంగిపోయి ప్రభూ ! ఆ ఆ తప్తకృచ్ఛ్ర మంటే ఏమో సెలవివ్వండి. దాని నాచంరించి కాయ శుద్ధి చేసుకుంటామని వేడుకున్నారు.

వాసుదేవ ఉవాచ :

త్య్రహముష్ణంపిబేదావః త్ర్యహముష్ణంపయః పిబేత్‌ | త్యహముష్ణం పిబేత్సర్సి ర్వాయుభక్షోదినత్రయమ్‌. 16

పలాద్వాదశతోయస్య పలాష్టౌ పయనః సురాః | షట్పలం సర్పిషః ప్రోక్తం దినసేదివసేపిబేత్‌. 17

పులస్త్య ఉవాచ :

ఇత్యేవముక్తేవచనే సురాః కాయవి శుద్దయే | తప్తకృచ్ఛ్రర హస్యంవై చక్రుః శక్రపురోగమాః 18

తతోవ్రతేసురాశ్చీర్ణే విముక్తాః పాపతో7భవన్‌ | విముక్త పాపాదేవేశం వాసుదేవ మథాబ్రువన్‌. 19

క్వాసౌ వదజగన్నాథ శంభుస్తిష్ఠతి కేశవ | యంక్షీరాద్య భిషేకేణ స్నాపయా మోవిధానతః. 20

అథోవాచ సురాన్విష్ణు రేషతిష్ఠతి శంకరః | మద్దే హే కింనపశ్వధ్వం యోగశ్చాయం ప్రతిష్ఠితః. 21

తమూచుర్నైవ పశ్యామ స్త్వత్తోవై త్రిపురాంతకమ్‌ | సత్యంవద సురేశాన మహేశానః క్వతిష్ఠతి. 22

తతో7వ్య యాత్మాసహరిః స్వహృత్పంకజశాయినమ్‌ |

దర్శయామాస దేవానాం మురారిర్లింగమైశ్వరమ్‌. 23

తతఃసురాః క్రమైణవ క్షీరాది భిరనంతరమ్‌ | స్నాపయాం చక్రిరే లింగం శాశ్వతం ధ్రువమవ్యయమ్‌. 24

గోరోచ నయాత్వా లిప్యచదంనేన సుగంధినా | బిల్వపత్రాం బుజైర్దేవం పూజయామాసురంజసా. 25

ప్రధూప్యా గురుణాభక్త్యా నివేద్యపరమౌషధీః | జప్త్వా7ష్ట శతనామానం ప్రణామం చక్రిరేతతః. 26

ఇత్యేవం చింతయంతశ్చ దేవావేతౌ హరీశ్వరౌ | కథం యోగత్వమాపన్నౌ సత్వాంధత మసోద్భవౌ. 27

సురాణాం చింతితంజ్ఞాత్వా విశ్వమూర్తి రభూద్విభుః|

సర్వలక్షణ సంయుక్తః సర్వాయుధ దరో7వ్యయః. 28

సార్ధంత్రినేత్రం కమలాహికుండలం జటాగుడా కేశఖగర్ష భధ్వజమ్‌|

సమాధవం హారభుజంగ వక్షసం పీతాజినాచ్ఛన్న కటిప్రదేశమ్‌. 29

చక్రాసిహస్తం హలశార్‌ ఙ్గపాణిం పినాకశూలా జగవాన్వితంచ |

కపర్దఖట్వాం గకపాలఘంటా సశంఖటం కారరవం మహర్షే 30

దృష్ట్వైవ దేవాహరిశంకరం తం నమో7స్తుతే సర్వగతావ్యయేతి|

ప్రోక్త్వా ప్రణామంకమలాననాద్యా శ్చక్రుర్మతిం చైకతరాం నియుజ్య 31

తానేకచిత్తాన్‌ విజ్ఞాయ దేవాన్‌ దేవపతిర్హరిః | ప్రగృహాభ్య ద్రవత్తూర్ణం కురుక్షేత్రం స్వమాశ్రమమ్‌. 32

తతో7పశ్యంత దేవేశం స్థాణు భూతంజలేశుచిమ్‌ | దృష్ట్వానమః స్థాణవేతి ప్రోక్త్వా సర్వేహ్యుపావిశన్‌. 33

తతో7బ్రవీత్సురపతి రేహ్యేహి దయతాంవర | క్షుబ్ధం జగజ్జగన్నాధ ఉన్మజ్జస్వ ప్రియాతిథే. 34

తతస్తాం మధురాంవాణీం శుశ్రావ వృషభధ్వజః | శ్రుత్వాత్త స్థౌచవేగేన సర్వవ్యాపీ నిరంజనః. 35

నమో7స్తు సర్వదేవేభ్యః ప్రోవాచ ప్రహసన్‌ హరః | సచాగతః సురైః సేంద్రైః ప్రణతో వినయాన్వితైః. 36

అందులకు వాసుదేవుడిలా చెప్పాడు. మూడు రోజులు వేడినీరు త్రాగుతూ మూడురోజులు పాలుత్రాగుతూ మూడు రోజులు నేయిత్రాగి మిగిలిన మూడు నాళ్లూ వాయుభక్షణం చేస్తూ గడపాలి. తర్వాత రోజు క్రమంగా పన్నెండు పలాలు నీరు ఎనిమిది ఫలాలు పాలు ఆరుఫలాలు నేయి త్రాగాలి. ఇతి తప్తకృ చ్ఛ్ర నియమం. నారదా! ఆ విధానాన్ని విన్న దేవతలు యింద్రునితో కలిసి కాయశుద్ధి కోసం ఆ తప్తకృచ్ఛ్ర వ్రతం కావించి పాపముక్తులైనారు.అంతట వారందరూ కేశవునితో, భగవాన్‌ ఆ శంభువు ఎక్కడుండేదీ చెబితే క్షీరాదులతో అభిషేకిస్తామని అన్నారు. అందులకా విష్ణువు యిడుగో శంకరుడు నాతో కలసి నా దేహంలో ఉన్నాడు. మీకు కనిపించడం లేదా ? అని అడుగగా నా దేవతలు కనిపించుట లేదు. ఓ మధుసూదనా ! ఆ మహేశ్వరుడెక్కడున్నాడో నిజంగా చెప్పండని ప్రార్థించారు. అంతనా అవ్యయుడైన శ్రీహరి ఆ ఈశ్వర లింగాన్ని, తన హృదయ కమలంమీద శయనించినట్లుగా దేవతలకు చూపించాడు. అంతట సంతోషంచి సురలా లింగమూర్తిని విధానం ప్రకారం క్షీరాదులతో నభిషేకించి గోరోచనం లేపనం చందనాదులతో నలంకరించారు. బిల్వపత్ర పుష్పాదులతో పూజచేసి భక్తితో అగురు ధూపంవేసి మహౌషధులు నైవైధ్యంగావించారు. అష్టోత్తర శతనామ జపం చేసి ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. పరస్పర విరుద్దాలయిన సత్వతమో గుణాత్మకులయిన హరిహరులొకటిగా కలియుట, ఎలా సంభవమా ! అని ఆ దేవతలు తమలో తాము మథనపడునంతలో ఆ ప్రభువు అవ్యయుడు, సర్వాయుధాలు ధరించి సర్వలక్షణ సంపన్నుడై విశ్వరూపం ధరించాడు. హరిలో గలసిన శివుడు మూడునేత్రాలు , సర్ప పద్మ కుండలాలు, జటాజూటం, గరుడ వృషభ ధ్వజం, సర్పహారాలు, పీతాంబరం, వ్యాఘ్రాజినం , వనమాల, చక్ర ఖడ్గ శంఖ, హలశార్‌ ఙ్గ పినాక శూల అజ గవ, ఖట్వాంగ కపాల ఘంటాది (శివకేశవులకు సంబంధిచిన) ఆయుధాలు ధరించి నిలచాడు. హరిహరాత్మకమైన ఆ అద్భుతమూర్తిని దర్శించి బ్రహ్మాదులయిన దేవతలందరు ఓ సర్వగతా ! అవ్యయా ! ప్రభూ! నీకు నమస్కారమని ప్రణామాలు గావించి ఆ యిర్వురునొకటియేయని తెలుసుకున్నారు. ఆ విధంగా ఏకాభిప్రాయంతో ఉన్న నాదేవతలందరను తీసికొని శ్రీహరి వెంటనే తన ఆశ్రమ స్థానమైన కురుక్షేత్రానికి తీసుకొని వెళ్ళాడు. అచట జలాల్లో స్థాణువుగా నిలచిన శంకరుని ప్రభూః స్థాణుదేవా ! నీకు నమస్సులంటూ కీర్తించి ఉపవిష్టులయ్యారు. అపుడు సురపతి ప్రభూ జగన్నాథా ! జగత్తంతా సంక్షోభంలో ఉంది. నీవు నీటినుండి బయటకు వచ్చి వరమనుగ్రహించి మమ్ము ఉద్ధరించుమని అర్థించాడు. దేవేంద్రుని మధురవచనాలాలకించి ఆ వృషభధ్వజుడూ, సర్వవ్యాపీ నిరంజనుడూ నగు శివుడు బయటకు వచ్చి నవ్వుతూ దేవతలందరకూ నానమస్సుస్వాగతం చెప్పాడు. దేవతలంతా నాత్రినేత్రునకు నమస్కరించారు.

తమూచుర్దేవతాః సర్వాస్త్యజ్యతాం శంకర ద్రుతమ్‌|

మహావ్రతం త్రయోలోకాః క్షుబ్దాస్త్వతే జసావృతాః. 37

అథోవాచ మహాదేవో మయాత్యక్తో మహావ్రతః | తతః సురాః దివంజగ్ముర్‌ హృష్టాః ప్రయతమానసాః. 38

తతో7పికంపతేపృథ్వీ సాబ్దిద్విపాచలామునే | తతో7భ్య చింతయద్రుద్రః కిమర్థంక్షుభితామహీ. 39

తతః పర్యచరుచ్ఛూలీ కురుక్షేత్రం సమంతతః | దదర్శౌఘవతీ తీరే ఉశనసం తపోనిధిమ్‌. 40

తతో7బ్రవీత్సురపతిః కిమర్థం తప్యతేతపః | జగత్‌ క్షో భకరంవిప్రః తచ్ఛీఘ్రం కథ్యతాంమమ. 41

ఉశనా ఉవాచ :

తనారాధనా కామార్థం తప్యతేహిమహత్తపః | సంజీవ నీంశుభాంవిద్యాం జ్ఞాతుమిచ్చేత్రిలోచన. 41

హర ఉవాచ :

తపసా పరితుష్టో7స్మి సుతప్తేన తపోధన | తస్మాత్సంజివనీం విద్యాం భవాన్‌ జ్ఞాస్యతుతత్వతః. 43

వరం లబ్ధ్వాతతః శుక్ర స్తపనః సంన్యవర్తత | తథాపి చలతేపృథ్వీ సాబ్దిభూభృన్నగావృతా. 44

తతో7గమన్మహాదేవః సప్తసారస్వతం శుచిః | దదర్శనృత్య మానంచ ఋషింమంకణసంజ్ఞితమ్‌. 45

భావేన పోపూయ తిబాలవత్స భుజౌప్రసార్యైవన నర్తవేగాత్‌|

తసై#్యవవేగేన సమాహతాతు చచాలభూర్భూమి ధరైః సహైవ. 46

తంశంకరో7భ్యేత్య కురేనిగృహ్య ప్రోవాచవాక్యం ప్రహసన్‌ మహర్షే|

కింబావితో నృత్యసి కేన హేతునా పదస్వమామేత్యకి మత్రతుష్టిః. 47

సబ్రాహ్మణః ప్రాహమమాద్యతుష్టి ర్వేనేహ జాతాశృణు తద్విజేంద్ర |

బహూన్‌ గణాన్‌ వైతప్యతస్తవః సంవత్సరాన్‌ కాయవిశోషణార్థమ్‌. 48

తతో7ను పశ్యామికరాత్‌ క్షతోత్థం నిర్గచ్చ తేశాకరసంమమేహ |

తేనా7ద్యతుష్టో7స్మి భృశంద్విజేంద్ర యేనాస్మినృత్యామి సభావితాత్మా. 49

ఓ ప్రభూ ! హరా ః ముల్లోకాలు నీ తపోగ్నికి క్షోభించి పోతున్నాయి. కనుక ఈ కఠోర వ్రతాన్ని వెంటనే వదలండి అని దేవతలు కోరగానే ఆయన తన దీక్ష విసర్జించాడు. దేవతలు సంతోషంతో తమ నెలవులకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత కూడ భూమికంపిస్తూనే ఉంది. అందులకు కారణమేమో అని రుద్రుడా కురుక్షేత్ర పరిసరాల్లో వెదకగా ఓ ఘనతీ నదీతీరాన శుక్రుడు కఠోర తపస్సు చేస్తున్నాడు. అంతట భవుడాయనను ఓ ఉశనసా ! ఏ కోర్కెతో జగత్సంక్షోభం కలిగించే ఈ తపస్సు చేస్తున్నావనగా నా శుక్రుడో త్రినేత్రా ! శుభంకరమైన సంజీవని విద్యను తెలుసుకోగోరుతున్నా. అందులకే నీకు ప్రీతికరంగా తపస్సు చేస్తున్నానన్నాడు. అంతట హరుడు ఓ తపోధనా ః నేను ప్రసన్నుడనైనాను కనక సంజీవినీ విద్యామర్మం నీవు తెలుసుకోగలుగుతావని వరం యివ్వడంతో నా తేజస్వి తన తపోదీక్ష విరమించాడు. అయినప్పటికీ యింకా గిరి సముద్రాలతోసహా భూమికంపిస్తూనే ఉంది. అంతట శివుడు పవిత్రమైన సప్తసారస్వత క్షేత్రానికి వెళ్ళి అక్కడ మంకణ మహాముని ఆనందాతిరేకంతో నాట్యం చేయడం చూచాడు. అమంకఱకుడు పిల్లవాడిలాగ చేతులు త్రిప్పుతూ నేలమీద దొర్లుతూ గంతులేస్తూ ఉన్నాడు. ఆ వేగానికి భూమి కంపించి పోతోంది. శంకరుడతనిని సమీపించి నవ్వుతూ, ఓ మహర్షీ ! ఎందుకిలా గంతులేస్తున్నావు ? ఆనందానికి గారణం నాకు చెప్పమంటూ చేయిపట్టుకొని నిలదీశాడు. ఆ మంకణుడో విప్రేంద్రా! విను. నా ఆనందానికి కారణం. ఎన్నో ఏండ్లుగా శాయశుద్ధి కోసం నేను చేస్తున్న తపస్సు నేడు ఫలించింది. ఇదిగో చూడు. నాచేతికి గాయమైనచోట రక్తానికి బదులు శాకరసం (ఆకుకూర రసం) కారుతోంది.ఇంత కన్నా ఆనందమేముంటుంది ? అందుకే యిలా నృత్యంచేస్తున్నానని చెప్పాడు.

తంప్రాహశంభుర్ధ్విజః పశ్యమహ్యం భస్మ ప్రవృత్తో7గు లితో7తిశుక్లమ్‌|

సంతాడనా దేవనచప్రహర్షో మమాస్తినూనం హిభవాన్‌ ప్రమత్తః. 50

శ్రుత్వా7థవాక్యం పృషభధ్వజస్య మత్వామునిర్మం కణకోమహర్షేః|

నృత్యం పరిత్యజ్యసు విస్మితో7థ వవందపాదౌ వినయావనమ్రః 51

తమాహంశంభుర్ద్విగచ్చలోకం తం బ్రహ్మాణో దుర్గమమవ్యయస్య |

ఇదంచతీర్థం ప్రవరం పృథివ్యాం పృథూదకస్యాస్తు సమంఫలేన. 52

సాంనిధ్యమత్త్రై వసురాసురాణాం గంధర్వ విద్యాధర కిన్నరాణామ్‌ |

సదా7స్తుధర్మస్య నిధానమగ్ర్యం సారస్వతం పాపమలాపహారి | 53

సుప్రతాకాంచనాక్షీచ సువేణుర్విమలోదకా | మనోహరా చౌఘవతీ విశాలాచ సరస్వతీ. 54

ఏతాః సప్తసర స్వత్యో నివసిష్యంతినిత్యశః | సోమపానఫలం సర్వాః ప్రయచ్ఛంతి సుపుణ్యదాః. 55

భవానపి కురుక్షేత్రే మూర్తిం స్థాన్యగరీయసీమ్‌ | గమిష్యతి మహాపుణ్యం బ్రహ్మలోకం సుదుర్గమమ్‌. 56

ఇత్యేవ ముక్తోదేవేన శంకరేణ తపోధనః | మూర్తింస్థాప్య కురుక్షేత్రే బ్రహ్మలోకమగాద్వశీ. 57

గతేమంకణ కేపృథ్వీ నిశ్చలాసమజాయత | అథాగాన్మందరం శంభుః నిజమావసథం శుచిః. 58

ఏతత్తవోక్తం ద్విజశంకరస్తు గత స్తదాసీత్త పపే7థశైలే |

శూన్యే7భ్యగా ద్దుష్టమతిర్హి దేవ్యా సంయోధితో యేనహికారణన. 59

ఇతి శ్రీ వామన మహాపురాణ షట్‌ త్రింశో7ధ్యాయః.

అది విని శివుడు మంకణునితో ఓయి ! యిటుచూడు. నేను వ్రేలితో కొట్టినంతమాత్రాన్నే స్వచ్ఛమైన భస్మం వస్తున్నది. అయితే అందుకు నేనే మీ వళ్ళు మరచి నృత్యం చేయడం లేదే ! నిజంగా నీకు మత్తెక్కి నట్టుంది అన్నాడు. అదిచూచి చకితుడై సిగ్గుతో తలవంచుకొని శివునకు వందనము చేశాడాముని, అంతట హరుడు ఓ మునీ ! నీవు అవ్యయమైన బ్రహ్మలోకానికి పొమ్ము. ఈ ప్రదేశం కూడ పృథూదకంతో సమానమైన పుణ్యతీర్థంగా విలసిల్లుతుంది. ఈ సారస్వత తీర్థంలో సురాసుర గంధర్వ విద్యాధర కిన్నరాదులు నిత్యం సన్నిహితులై ఉంటారు. ఇది ధర్మానికి పట్టుగొమ్మగా ఉంటూ పాపమలాలన్నింటినీ నశింపజేస్తుంది. అని వరమిచ్చాడు. సుప్రభ, కాంచనాక్షి సువేణు విమలోద కంతో కూడిన మనోహర, ఓఘవతి. విశాల, సరస్వతీ జలాలతో పునీతమైన ఈ సప్తసారస్వత తీర్థం సేవిస్తే సోమపానం చేసిన ఫలం లభిస్తుంది. ఈ సప్త సరస్వతులు ఎప్పుడూ యిక్కడ ఉంటాయి. ప్రతి ఒక్కనదీ సోమయాగఫలం కలుగ జేస్తుంది. నీవు కూడ యిక్కడ మహిమగల మూర్తిస్థాపనం చేసి దుర్లభ##మైన బ్రహ్మలోకానికి పోగలవు. శంకరుని ఆదేశం ప్రకారమాతవస్వి, ఆ కురుక్షేత్రంలో మూర్తిస్థాపనగావించి బ్రహ్మలోకానికి వెళ్ళాడు. మంకణుడు వెళ్ళిపోవడంతో భూమి కంపించడం తగ్గి యథాస్థితికి చేరుకుంది. శివుడు గూడ తన నెలవు మందరగిరిగి వెళ్ళిపోయాడు. ఓ బ్రహ్మర్షీ ! శంకరుడు మందరగిరి వదలి తపస్సుకు ఎందుకు వెళ్ళినదీ నీకు వివరించాను. ఆయన లేని సమయంలోనే దుర్బుద్ధి అంధకుడు వెళ్ళడం, పరమేశ్వరితో యుద్ధం చేయడం జరిగింది.

ఇది శ్రీవామన మహాపురాణంలో ముప్పదియారవ అధ్యాయము ముగిసింది.

Sri Vamana Mahapuranam    Chapters