Brahmapuranamu    Chapters   

నవమో7ధ్యాయః

సోమోత్పత్తి వర్ణనమ్‌

లోమహర్షణ ఉవాచ -

పితా సోమస్య భో విప్రా జజ్ఞే7త్రిర్భగవా సృషిః| బ్రహ్మణో మానసాత్పూర్వం ప్రజాసర్గంవిధిత్సతః ||

అనుత్తరం నామ తపో యేన తప్తం హి తత్పురా | త్రీణివర్ష సహస్రాణి దివ్యానీతి హి నః శ్రుతమ్‌ ||2

ఊర్థ్వ మాచక్రమే తస్య రేతః సోమత్వమీయివాన్‌ | నేత్రాభ్యాం వారి సుస్రావ దశథా ద్యోతయన్దిశః||3

తం గర్భం విధినా77దిష్టా దశ దేవ్యో దధు స్తతః | సమేత్య ధారయామాసు ర్నచతా స్సమశక్నువన్‌||4

యదా న ధారణ శక్తా స్తస్య గర్భస్య తా దిశః | తతస్తాభిః స త్యక్తస్తు నిపపాత వసుంధరామ్‌ || 5

పతతిం సోమ మాలోక్య బ్రహ్మా లోకపితామహః | రథమారోపయామాస లోకానాం హితకామ్యయా || 6

తస్మి న్నిపతితే దేవాః పుత్రే7త్రేః పరమాత్మని | తుష్టువు ర్ర్భహ్మణః పుత్రా స్తథా7న్యే మునిసత్తమాః||7

తస్య సంస్తూయమానస్య తేజః సోమస్యభాస్వతః | ఆప్యాయనామ లోకానాం భావయామాస సర్వతః|| 8

స తేన రథముఖ్యేన సాగరాంతాం వసుంధరామ్‌ | త్రి స్సప్తకృత్వో7తి యశా శ్చకా రాభిప్రదక్షిణమ్‌ || 9

తస్య యచ్చరితం తేజః పృథిబీ మన్వపద్యత| ఓషధ్య స్తాః పముద్భూతా యాభిః సంధార్యతే జగత్‌ || 10

స లబ్ధతేజా భగవా న్సంస్తవైశ్చ స్వకర్మభిః | తపస్తేపే మహాభాగః పద్మానాం దర్శనాయ సః|| 11

తతస్తసై#్మ దదౌ రాజ్యం బ్రహ్మా బ్రహ్మవిదాంవరః | బీజౌషధీనాం విప్రాణా మపాంచ మునిసత్తమాః|| 12

సూతుండిట్లనియె - ఓ విప్రులార ! సోముని అత్రి భగవానుడు ఋషి అయన బ్రహ్మమానస పుత్రుడు. అతడు గొప్ప తపమొనరించినవాడు. అతడు మూడువేల దివ్య సంవత్సరములు తపమాచరించెనని ప్రసిద్ధి. ఆయనయొక్క తేజస్సు మీదికి జిమ్ముకొనెను. అదియె సోమరూపము దాల్చెను. అయన కళ్ళ నుండి నీరు దిక్కుల ప్రకాశింపజేయుచు. పది తెఱంగుల స్రవించెను. దశదిశాధిదేవతలేకమై విధియానతి నా తేజస్సుఎను ధరింపcబోయు శక్యముగాక జారవిడిచిరి. వసుధవై బడిన యా సోమరూపముయిన వీర్యమును జూచి లోకపితామహుడైన బ్రహ్మc లోకహితమునకై తన రథమెక్కించుకొనయె అత్రి కుమారుడట్లుబడుట చూచి బ్రహ్మకుమారులు దేవతలు మరి మునివరులు పొగడిరి. అట్లు స్తుతింపబడు సోముని తేజస్సులోకముల నాప్యాయనముc సేయనెల్లడల నలముకొనియె. అ సోముడు బ్రహ్మ యొక్క రథమునందధష్టించి సాగరపరీవృతయైన యివ్వసుంధర నిరువదియొక్క మారులు బ్రదక్షణము సేసెను. అయన తేజస్సు భూమియందుc బ్రవేశించెను. అందుండి నర్వౌషధులు సర్వజగదాధార భూతములై మొలచినవి. ఆ సోముడు స్తుతులచే స్వకీయ సత్క్రుతులచే తేజస్సు వడసి పద్మదర్శనమునకై తపమొనరించెను. బ్రహ్మవిదగ్రగణ్యుడగు బ్రహ్మ యతనికి బీజౌషధుల యొక్కయు విప్రుల యొక్కయు జలముయొక్కయు సామ్రాజ్యమొసంగెను. (1-12)

న తత్ప్రాప్య మహారాజ్యం సోమః సౌమ్యవతాం వరః సమాజహ్రే రాజసూయం సహస్రశతదక్షిణమ్‌ || 13

దక్షిణా మదదా త్సోమ స్త్రీన్లోకానితి నః శ్రుతమ్‌ | తేభ్యో బ్రహ్మర్షిముఖ్యేభ్యః సదస్యేభ్యశ్చ భోద్విజాః || 14

హిరణ్యగర్బో బ్రహ్మాత్రిర్భృగుశ్చ ఋత్విజో7భవన్‌| సదస్యో భూ ద్ధరి స్తత్ర మునిభిర్భహుభి ర్వృతః || 15

తం శినీశ్చ కుహూశ్చైవ ద్యుతిః పుష్టిః ప్రభావసుః | కీర్తిర్ధృతిశ్చ లక్ష్మీశ్చ నవ దేవ్యః సిషేవిరే || 16

ప్రాప్యావభృథ మప్యగ్ర్యం సర్వదేవర్షిపూజితః| విరరా జాజా ధిరాజేంద్రో దశధా భాసయ న్దిశః|| 17

తస్యతత్ర్పాప్య దుష్ర్పాప్య మైశ్వర్య మృషిసత్కృతమ్‌ | విబభ్రామ మతిస్తాతావినయా దనయాహృతా || 18

బృహస్పతే స్సవై భార్యా మైశ్వర్యమదమోహితః | జహార తరసా సోమో విమ త్యాంగిరసః సతీమ్‌ || 19

సౌమ్యులకెల్ల సౌమ్యుడగు నాతడది వడసి, సహస్రశతదక్షిణముగ రాజసూయము చేసెను. ముల్లోకములను నాకైరవబంధువు దక్షిణ యిచ్చెనని విననయ్యెడిని. ఆ రాజసూయాధ్వరమున సదస్యులై బ్రహ్మర్షులు దక్షిణల నందుకొనిరట. హిరణ్యగర్భుడు (బ్రహ్మ) అత్రి భృగువు నందు ఋత్విజులైరి. బహుమునిపరివృతుడై హరియందు నదస్యు డయ్యెను. అ సోముని సినీకుహువు. ద్యుతి. పుష్టి, వ్రభ, వసువు. కీర్తి. ధృతి, లక్ష్మియను తొమ్మండ్రు డేపతానుందరీమణులు సేవించిరి. అవబృథస్నాతుడై సర్వదేవర్షిపూజితుడై పదివిధముల దిక్కులనుద్భాసింపcజేయుచు సోమరాజేంద్రుడు వెలుగొందెను. ఏరికి బడయరాని యైశ్వర్య మంది ఋషి సత్కారనంభృతమై దనకు లభించెనని యుప్పొంగి యవినయము ననయమునకు (అనీతి) లోబడి యాతని మతిపోయినంత నత డమితెశ్వర్య మదమోహితుడై కానక బృహస్పతి భార్యను తారను బలాత్కారమున హరించెను. (13-19)

స యాజ్యమానో దేవై శ్చ తథా దేవర్షిభి ర్ముహుః | నైవ వ్యసర్జయ త్తారాం తస్మా అంగిరసే తదా || 20

ఉశనా తస్య జగ్రాహ పార్షిమంగిరస స్తథా | రుద్రశ్చ పార్షిం జగ్రాహ గృహీత్వా 7జగవం ధనుః || 21

తేన బ్రహ్మశిరోనామ పరమాస్త్రం మహాత్మనా | ఉద్దిశ్య దేవా నుత్సృష్టం యేనైషాం నాశితం యశ ః || 22

త త్ర త ద్యుద్ధ మభవ త్ప్రఖ్యాతం తారకామయమ్‌ | దేవానాం దానవానాంచ లోకక్షయకరం మహత్‌ || 23

తత్ర శిష్టాస్తు యే దేవా స్తుషితా శ్చైవ యే ద్విజాః | బ్రహ్మాణం శరణం జగ్ము రాదిదేవం సనాతనమ్‌ || 24

దేవతలు దేవర్షులు మఱిమఱి యాచించినను నతడు వినక తార నాంగిరనునికి అప్పగింపక యపోయెను. అపుడు యంగిరను మడమలం ద్రొక్కికొని ఉశనసుడు (శుక్రుడు) వచ్చెను. రుద్రుడు అజగవమ్మను విల్లుకొని పార్షి గ్రాహుడయ్యెను. అతడు బ్రహ్మశిరోనామకాస్త్రముc గొని దేవతలపైకి విసరెను. దానిచే నవ్వేల్పుల కీర్తి కళంకితమయ్యెను. తారకామయమును ప్రఖ్యాతమయ్యుద్ధమక్కడ దేవదానవలోక క్షయకరమయ్యెను. బ్రాహ్మణులారా ! అందు మిగిలిన దేవతలు తుషితులనుదేవతలు సనాతనుడును నాదిదేవుడునగు బ్రహ్మను శరణుcజొచ్చిరి. (20-24)

తదా నివార్యోశనసం తం వై రుద్రం చ శంకరమ్‌ | దదా వంగిరసే తారాం స్వయమేన పితామహః || 25

తా మంతః ప్రసవాం దృష్ట్వా క్రుద్ధః ప్రాహ బృహస్పతిః| మదీయాయాం నతేయోనౌ గర్భోధార్యః కథంచన|| 26

ఇషీకాస్తంబ మాసాద్య గర్భం సా చోత్సపర్జహ | జాతమాత్రః స భగవాన్దేవానా మాక్షిప ద్వపుః||27

తత స్సంశయమాపన్నా స్తారా మూచుః సురోత్తమాః | సత్యం బ్రూహి సుతః కస్య సోమస్యాథ బృహస్పతేః|| 28

పృచ్ఛ్యమానా యదా దెవైర్నాహ సా విబుధా న్కిల | తదా తాం శప్తుమారబ్ధః కుమారో దస్యుహంతమః || 29

తం నివార్య తతో బ్రహ్మాతారాం పప్రచ్ఛ సంశయమ్‌| యదత్ర తథ్యం త ద్భ్రూహి తారే కస్యసుత స్త్వయమ్‌|| 30

ఉవాచ ప్రాంజలిః సాతం సోమస్యేతి పితామహమ్‌ | తదాతం మూర్ధ్నిచా77ఘ్రాయ సోమో రాజా సుతంప్రతి || 31

బుధ ఇత్యకరోన్నామ తస్య బాలస్య ధీమతః | ప్రతికూలం చ గగనేసమ్య గుత్తిష్ఠతే బుధః || 32

ఉత్పాదయామాస తదాపుత్రం వై రాజపుత్రికమ్‌ | తస్యాపత్యం మహాతేజా బభూ వైలః పురూరవాః || 33

ఉర్వస్యాం జజ్ఞిరే యస్య పుత్రాః సప్త మహాత్మనః | ఏత త్సోమస్య వో జన్మ కీర్తితం కీర్తివర్థనమ్‌ || 34

వంశ మస్యముని శ్రేష్ట కీర్త్యమానం నిబోధత | ధన్య మాయుష్య మారోగ్యం పుణ్యం

సంకల్పసాధనం || 35

సోమన్య జన్మ శ్రుత్వైవ పాపేభ్యో విప్రముచ్యతే || 36

ఇతి శ్రీ మహాపురాణ బ్రాహ్మే సోమోత్పత్తి కథనం నామ నవమో7ధ్యాయః

పితామహుడంతట శుక్రుని రుద్రుని (శంకరుని) వారించి న్వయముగ తారను అంగిరసుని కప్పగించెను. బృహస్పతి. యా యిల్లాలి నంతః ప్రసవగ గమనించి (గర్భిణియగుట గ్రహించి) క్రుద్ధుడై నాకు హక్కయిన ఈయోనియందు గర్భముదాల్చుట నీకు చితము గాదనిన నామె ముంజ గడ్డియందుంచెను. ఈ శిశువు పుట్టినంతనే దివ్య శరీరము నొందెను. సురవరులంతట నంశయమంది తారంగని నిజము చెప్పుము. ఈ బాలుడు సోముని కొడుకా లేకా బృహస్పతి బిడ్డడా యనగా నామె వేల్పులకుc బదులుపలకదయ్యె. అపుడు చోర హస్తకుడగు నా మారుడామెను శపింపc బూనిన వారించి బ్రహ్మ తారా ! ఇందు నిజమేది చెప్పుము. వీడెవ్వని కొడుకు ? అననామె ప్రాంజలియై సోముని వాడని యనెను. అయ్యడ సోముడాపావనిశిరంబు మూర్కొని వానికి బుధుడని నామకరణ మొనరించెను. అ బుధుడు గగనమున ప్రతికూలముగ నుదయించుచుండును. అతడు వైరాజమనువు పుత్రిక యందు పుత్రుని గనెను. అ పుత్రునకు పురూరవుడను పుత్రుడు జనించెను. వురూరువున కూర్వశియందేడ్గురు మహాత్ములైన కుమారులుదయించిరి. ఇది సోముని జన్మవృత్తాంతము. ఇది కీర్తంపకీర్తికలుగును. ఈ సోమవంశ సంకీర్తనము ధన్యతను అయుష్యము - ఆరోగ్యము -పుణ్యము గూర్చును. సంకల్పసాఫల్యము గూర్చును. సోమజన్మవృత్తాంతము విన్న యతడు పాపవిముక్తి నందుగల్గును ( 25-26)

శ్రీ బ్రహ్మ మహాపురాణము నందు సోమోత్పత్తి కథనమను తొమ్మిదవ అధ్యాయము సమాప్తము

Brahmapuranamu    Chapters