Brahmapuranamu    Chapters   

షష్ఠోధ్యాయ ః

ఆదిత్యోత్పత్తి వర్ణనమ్‌

లోమహర్షణ ఉవాచ...

వివస్వా న్కశ్యపా జ్జజ్ఞే దాక్షాయణ్యాం ద్విజోత్తమాః|తస్య భార్యాభవత్సంజ్ఞాత్వాష్ట్రీ దేవీ వివస్వతః || 1

సురేశ్వరీతి విఖ్యాతా త్రిషు లోకేషు భామినీ | సావై భార్యా భగవతో మార్తండస్య మహాత్మనః || 2

భర్తృ రూపేణ నాతుష్య ద్రూప¸°వనశాలినీ | సంజ్ఞానామ సుతపసా సుదీప్తేన సమన్వితా || 3

ఆదిత్యస్య హి తద్రూపం మండలస్య సుతేజసా | గాత్రేషు పరిదగ్ధంవై నాతికాంత మి వాభవత్‌ || 4

న ఖల్వయం మృతో(తాం)డస్థ ఇతి స్నేహా దభాషత | అజాన న్కాశ్యప స్తస్మాన్మార్తండ ఇతి చోచ్యతే || 5

తేజ స్త్వభ్యధికం తస్య నిత్యమేవ వివస్వతః | యేనాతితాపయామాస త్రీన్‌లోకా న్కశ్యపాత్మజః || 6

త్రీణ్యపత్యాని భో విప్రాః సంజ్ఞాయాం తపతాం వరః| ఆదిత్యో జనయామాస కన్యాం ద్వౌ చ ప్రజాపతీ || 7

మనోర్వైవస్వతః పూర్వం శ్రాద్ధదేవః ప్రజాపతిః యమశ్చ యమానా చైవ యమజౌ సంబభూవతుః || 8

శ్యామవర్ణం తు తద్రూపం సంజ్ఞా దృష్ట్యా వివస్వతః|అసహంతీ తు స్వాం ఛాయం సవర్ణాం నిర్మమే తతః || 9

మాయామయీ తు సా సంజ్ఞా తస్యాం ఛాయాసముత్థితాం | ప్రాంజలిః ప్రణతా భూత్వా ఛాయా సంజ్ఞాం ద్విజోత్తమాః|| 10

ఉవాచ కిం మయా కార్యం కథయస్వ శుచిస్మితే తవ నిర్దేశే శాధి మాం వరవర్ణిని || 11

నూతు డిట్లనియె :-

ద్విజోత్తములారా ! కశ్యవునికి దక్షసుతయందు వివస్వంతుడుదయించెను. అతని భార్య సంజ్ఞ. ఆమె త్వష్టృ ప్రజాపతి కుమార్తె. నురేశ్వరియను పేర త్రిలోక ప్రఖ్యాతి నందినది. రూప¸°వనశాలినియైన యా దేవికి భగవంతుడగు వివస్వంతుని యొక్క (మార్తాండుని యొక్క) యంద మంత యానందమీయదయ్యొను. ఆమె మంచి తపస్సుచేసి మంచి దీప్తి గడించుకొన్నది. కాని యాదిత్య మండలము వేడిమి కామె తనూలత వాడిపోయి యంతగ రాణింపదయ్యెను. కశ్యపుడు వాత్సల్యాతిశయముచే వీడు "అండమందు మృతుడు కాలేదు'' గత అని యొఱుంగక పలికిన కతన నాతనికి మార్తండుడను పేరు రుఢమయ్యెను. ఆతని తేజస్సు దుర్భరమై మల్లోకములను దహింపజేయునదయ్యెను. ఆదిత్యుడు (వివస్వంతుడు) సంజ్ఞాదేవియందు మనువును శ్రాద్ధదేవుడైన యమునింగనెను. యమున యను కన్యనుగూడ గాంచెను. యముడును యమునయు కవలపిల్లలు. సంజ్ఞ శ్యామవర్ణుడైన యా వివస్వంతుని జూచి యోర్వక తనకు సాటియైన ఛాయను (నీడను) మాయామయియైనదానిని కల్పించెను. ఆమె యెదుట నిల్చి ప్రాంజలియై మ్రొక్కి ఓ సుహాసిని! నా చేయనగు కార్యముం జెప్పుము. నీయాజ్ఞావశ##నైయున్నాను నన్నుంబనిగొమ్మనియొ (1-11)

అహం యాస్యామి భద్రంతే స్వమేవ భవనం పితుః | త్వయైవ మహ్యం వస్తవ్యం నిర్విశంకయా ||

సంజ్ఞోవాచ -

ఇమౌ చ బాలకౌ మహ్యం కన్యా చేయం సుమధ్యమా | సంభావ్యాస్తే నచా೭೭ఖ్యేయ మిదం భగవతే క్వచిత్‌ ||

సవర్ణోవాచ...

ఆకచగ్రహణా ద్దేవి ఆశాపా న్నైవ కర్హిచిత్‌ | ఆఖ్యాస్యామి మస్తునభ్యం గచ్ఛ దేవి యథాసుఖమ్‌ || 14

సంజ్ఞ పలికెను... అబలా ! నేను పుట్టినింటి కేగెదను. నీకు భద్రమగునుగాక ! నాయింట నీవు నిశ్శంకముగ నుండవచ్చును. ఈ పిల్లలిద్దరు నీ బాలిక నా సంతానము. వీరిం గనిపెట్టుకొని యుండుము. ఈమాట భగవంతుడు వివస్వంతుని కెన్నడేని జెప్పకుము.

ఆనసవర్ణ - జుట్టుపట్టిలాగునందాక. శాపమిచ్చునందాక ఈ వార్త నేనెన్నడును జెప్పను. నీకు నమస్కారము. దేవీ! సుఖముగ వెళ్ళిరమ్మనెను. (12-14)

లోమహర్షణ ఉవాచ...

సమాదిశ్య సవర్ణాంతు తథేత్యుక్తా తయా చ సా|త్వష్టుః సమీప మగమ ద్వ్రీడితేవ తపస్వినీ || 15

పితుః సమీపగా సా తు పిత్రా నిర్భ ర్త్సితా శుభా | భర్తుఃసమీపం గచ్ఛేతి నియుక్తా చ పునః పునః || 16

అగచ్ఛత్‌బడబా భూత్వా೭೭చ్ఛాద్య రూప మనిందితా | కురూ నథోత్తరా న్గత్వా తృణా న్యథ చచార హ || 17

తపస్వినియైన సంజ్ఞ సవర్ణకు (ఛాయకు) ఇట్లు తెలిపి బిడ్డలనప్పగించి తండ్రియగు త్వష్టప్రజాపతిసమీపమున కేగి సిగ్గున తలవంచుకొని నిలువబడెను. ప్రజాపతిచే భర్తసన్నిధికి పోపొమ్మని పలుమారులు అదలించిబెదిరించి యాదేశింపబడియు నయ్యింతి కాంతుని వంక బోక బడబాకృతిందాల్చి (ఆడుగుఱ్ఱమై) తనరూపము మఱుగుపఱచుకొని ఉత్తకురుభూములందు బచ్చికబయళ్ళలో తిఱుగజొచ్చెను (15-17)

ద్వితీయాయాం తు సంజ్ఞాయాం సంజ్ఞేయమితి చింతయన్‌|ఆదిత్యో జనయామాస పుత్ర మాత్మసమం తదా || 18

పూర్వజస్య మనోర్విప్రాః సదృశోయమితి ప్రభుః | మను రే వాభవ న్నామ్నా సావర్ణ ఇతి చోచ్యతే || 19

రెండవ సంజ్ఞను ఈమె సంజ్ఞయేయని భావించి యామెయందా దిత్యుడు తన కీడైన కొడుకుంగాంచెను. ఇంతమున్ను, పుట్టిన మనుపును బోలినవాడైనందున నితడును''సావర్ణ మనువు'' అని పిలువబడుచుండెను ( 18-19)

ద్వితీయో యః సుత స్తస్యాః సవిజ్ఞేయః శ##నైశ్చరః | సంజ్ఞాతు పార్థివీ విప్రాః స్వస్య పుత్రస్యవై యథా||20

చకా రాభ్యధికం స్నేహం న తథా పూర్వజేషు వై | మను స్తస్యాః క్షమత్తత్తు యమస్తస్యా న చక్షమే || 21

సవైరోషాచ్చ బాల్యాచ్చ భావినోర్థస్య వానఘ | పదా సంతర్జయామాస సంజ్ఞాం వైవస్వతోయమః || 22

తం శశాప తతః క్రోధాత్సవర్ణజననీ తదా | చరణః పతతా మేష తవేతి భృశదుఃఖితా || 23

యమస్తు తత్పితుః సర్వం ప్రాంజలిః ప్రత్యవేదయత్‌|భృశం శాపభయోద్విగ్నః సంజ్ఞావాక్వైర్విశంకితః ||24

శాపోయం వినివర్తేత ప్రోవాచ పితరం ద్విజాః | మాత్రాస్నే హేన సర్వేషు వర్తితవ్యం సుతేషు వై || 25

సేయ మస్మా నపాస్యేహ వివస్వ న్సంబుభూషతి | తస్యాం మయోద్యతః పాదోనతుదేహే నిపాతితః || 26

బాల్యాద్వా యది వా లౌల్యా న్మోహాత్తత్‌ క్షంతుమర్హసి|శప్తోహమస్మి లోకేశ జనన్యా తపతాం వర || 27

తవప్రసాదా చ్చరణో న పతే న్మమ గోపతే | వివస్వానువాచ -

అసంశయం పుత్ర మహ ద్భవిష్య త్యత్ర కారణమ్‌ | యేన త్వా మావిశత్‌ క్రోధో ధర్మజ్ఞం సత్యవాదినమ్‌||28

నవాక్య మేత న్మిథ్యా తు కర్తుం మాతృవచ స్తవ|కృమయో మాంసమాదాయ యాస్య స్త్యవనిమేవ చ || 29

కృత మేవం మచ స్తథ్యం మాతు స్తవ భవిష్యతి | శాపస్య పరిహారేణ త్వం చ త్రాతో భవిష్యసి || 30

అమెకు కల్గిన రెండవకుమారుడు శ##నైశ్చరుడు. అతడు పుట్టిన తరువాత నామె తనకప్పగించిన సవతిబిడ్డల నాదరింపదయ్యెను. మనువు దానికి సైచి యూరకుండెను. యముడది యోర్వక యాసవతి తల్లిని పాదమెత్తిబెదరించెను. అందులకు ఛాయ కోపించి మిగుల దుఃఖించి నీకాలు పడిపోవుగాక యని శపించెను. యము డావృత్తాంమును దండ్రికి ప్రాంజలియై విన్నవించెను. నా కామె యిచ్చిన శాపమును మరలింపుమని తండ్రిని వేడుకొనెను. తల్లి తనయులందరియెడ వాత్సల్యముతో వర్తింపవలయును గదా. ఈ యమ్మమమ్ములను నిరసించి బ్రతుకనెంచినది. అందువలన నే నామెపై పాదమెత్తితిని, ఎత్తితినే కాని యామె శరీరము తాకింపలేదు. బాల్యముచే లౌల్యముచే నెఱుంగక యేనొనరించిన తప్పును క్షమింపదగుదువు. తల్లి శాపమునకు గురియైతిని గ్రహరాజ! నీయను గ్రహముచే నాపాదము పడిపోకుండుగాక ! అని కొడుకు వాపోవ గరుణించి సూర్యుడిట్లనియె. పుత్ర! ఇందేదో గొప్పకారణముండి తీరును, ధర్మజ్ఞుడవు, సత్యవచనుడవైన నిన్ను క్రోధమావేశించినది. నీ తల్లిమాట మిధ్య గాకుండుటకు కృములు నీకాలిమాంసముcదిని యవని కేగును. ఈరీతి మీయమ్మమాట సత్యము కాగలదు. ఈ విధమైన శాపపరిహారముచే నీవును సురక్షితుడయ్యెద వనెను. (20-30)

అదిత్య శ్చాబ్రవీ త్సంజ్ఞాం కిమర్ధంతనయేషువై | తుల్యే ష్వభ్యధికః స్నేహ ఏకస్మి న్ర్కియతే త్వయా || 31

సా తత్పరిహరంతీ తు నా ೭೭చచక్షే వివస్వతే|స చా೭೭త్మానం సమాధాయ యోగా త్తథ్య మపశ్యత || 32

తాం శప్తుకామో భగవా నాశక న్మునిసత్తమాః | మూర్థజేషు నిజగ్రాహ సతు తాం మునిసత్తమాః || 33

తత స్సర్వం యథావృత్త మాచచక్షే వివస్వతే | వివస్వా నథ తచ్ఛ్రత్వా కృద్ధః త్వష్టార మభ్యగాత్‌ || 34

దృష్ట్వాతు తం యథాన్యా య మర్చయిత్వా విభావసుమ్‌|నిర్దగ్ధుకామం రోషేణ సాన్త్వయామాస వైతదా || 35

త్వష్టోవాచ -

తవాతితేజసా೭೭విష్ట మిదం రూపం నశోభ##తే | అసహంతీ చ సంజ్ఞా సా వనే చరతి శాద్వలే || 36

ద్రష్టా హి తాం భవా నద్య స్వాం భార్యాం శుభచారిణీం|శ్ల్యాఘ్యాం యోగబలోపేతాం యోగమాస్థాయ గోపతే || 37

అనుకూలంతు తే దేవ యది స్యా న్మమ సమ్మతమ్‌ | రూపం నిర్వర్తయా మ్యద్య తవ కాంత మరిందమ|| 38

తదుభ్యుపగమా త్త్వష్టా మార్తండస్య వివస్వతః| భ్రమి మారోప్య తత్తేజః శాతయామాస భోధ్విజాః 39

తతోనిర్భాసితం రూపం తేజసా సంహతేన వై |కాంతా త్కాంతతరం ద్రష్టు మధికం శుశుభే తదా || 40

ధదర్శ యోగమాస్థాయ స్వాంభార్యాం బడబాం తతః| అధృష్యాం సర్వభూతానాం తేజసా నియమేనచ || 41

బడబావపుషా విప్రాశ్చరంతీ మకుతోభయామ్‌ | సోశ్వరూపేణ భగవాం స్తాం ముఖే సమభావయత్‌ || 42

మైథునాయ విచేష్టంతీం పరపుంసోవశంకయా | సా తన్నిరవ మచ్చుక్రం నాసికాభ్యాం వివస్వత ః || 43

దేవౌ తస్యా మజాయేతా వశ్వినౌ భిషజాం వరౌ | నాసత్యశ్చైవ దస్రశ్చ స్మృతౌ ద్వా వశ్వినావితి || 44

మార్తండస్యా೭೭త్మజావేతా వష్టమస్య ప్రజాపతేః|తాం తు రూపేణ కాంతేన దర్శయామాస భాస్కరః || 45

ఆదిత్యుడు సంజ్ఞం జూచి (ఛాయామూర్తిని) బిడ్డలనందర నొక్కరీతిగా గాక యొక్కనియందెక్కువ ప్రేమ నీకెందుల కనియడిగిన నామె యామాట దప్పించెనేగాని నిజము సెప్పదయ్యె. అతడు తనకుదా సమాధానపడి యోగ దృష్టిచే నిజమెఱింగెను. ఆమె నప్పుడు శపింపబూనియు శాపమీయక జుట్టు పట్టుకొని యూచెను. అంతనామె జరిగినదెల్ల పతికి విన్నవించెను. వివన్వంతుడువిని కవలి మామగారగు త్వష్ట చెంత కరిగెను. మామయు నటువచ్చిన యల్లు నాదరించెను. రోషముగొని తనను దహింప నేతెంచినాడని గ్రహించియపు డాతని ననునయించుచు నిట్లనియె.

ఓ అదిత్యమూర్తి ! నీరూపమిది భరింపరాని తేజముచే జూడరాదయ్యె. సంజ్ఞ యిదిసైపనేరక పచ్చిక బయళ్ళ తిరుగాడు చున్నది. శుభచారిణయైన నీ సహధర్మచారిణి నిప్పుడు చూడవలయును. అమె శ్లాఘనీయ యోగబల సంపన్నురాలు. గ్రహఠాజగు నీకు నామాట యనుకూలము సమ్మతమగు నేని యోగమూని యామె చెంత కరుగును. నీరూపమును జూడముచ్చటగ నొనరింతునని తెలిపి యాతరణిని (సూర్యుని) యంత్రమునెక్కించి చెక్కివైచెను. తరణిని యంత్రమున బట్టిన నాటినుండీ తరణిబట్టుటన నీపేరు లోకమున రూఢికెక్కెను. దాన నాతనితేజస్సు కొంతడిందువడి రూపము చూడ నందమయి యింపొందెను. ఆ మీద నతడు యోగశక్తిచే నేగి తన భార్యను బడరూపమున జరించు దానినిం జూచెను. తేజస్సుచే పాతివ్రత్య నియమముచే భూతములక దృశ్యయైయున్న యయ్యంగనను ఎందును జడియక సంచరించుచున్నంగని తాను నశ్వరూపముc దాల్చి ముఖమునం గవయబోయెను. పరపురుషశంకగొని యామె పెడమెగయయిమున్నతఱి నామెయందు నిక్షిప్తమైన శుక్రమామె నాసికారంద్రముల వెంట చీదివైచెను. అందుండి అశ్వినులు అను దేవవైద్యులు నాసత్యుడు(దన్రులు) అని పేర్కొనబడెడువా రిద్దరుదయించిరి. అష్టమ ప్రజాపతియగు మార్తండుని ¸°రను లీయిర్వురు మిక్కిలి యందగాండ్రు. భాస్కరుడు నవ్వల నాకాంతకు మిగులకాంతుడై కానవచ్చె. అమె కూడ తన మనోహరునింగని మిగుల సంతోషించెను (31-45)

యమస్తు కర్మణా తేన భృశం పీడిత మానసః 46

ధర్మేణ రంజయామాస ధర్మరాజ ఇమాః ప్రజా | స లేభే కర్మణా తేన శుభేన పరమద్యుతిః|| 47

పితౄణా మాధిపత్యం చ లోకపాల త్వమేవచ | మనుః ప్రజాపతి స్త్వాసీ త్సావర్ణిః స తపోధనాః ||48

భావ్యః సమాగతే తస్మి న్మనుః సావర్ణికేతరే |మేరుపృష్టే తపో నిత్య మద్యాపి స చరత్యుత || 49

భ్రాతా శ##నైశ్చరస్తస్య గ్రహత్వం సతులబ్ధవాన్‌ | త్వష్టాతు తేజసా తేన విష్ణో శ్చక్ర మకల్పయత్‌ || 50

తదప్రతిహతం యుద్దే దానవాంతచికీర్షయా | యవీయసీ తు సాస్యాసీ ద్యామీ కన్యా యశస్వినీ || 51

అభవచ్చ సరిచ్చ్రేష్ఠ్రా యమునా లోకపావనీ | మనురిత్యుచ్యతే లోకే సావర్ణ ఇతి చోచ్యతే || 52

ద్వితీయో యః సుతస్తస్య మనోర్ర్భా శ##నైశ్చరః | గ్రహత్వం స చ లేభే వై సర్వలోకాభిపూజిత ః ||53

య ఇదం జన్మ దేవానం శృణుయా న్నరసత్తమః| ఆపదం ప్రాప్య ముచ్యేత ప్రాప్నుయాచ్చ మహద్యశః ||

ఇతి శ్రీ మహాపురాణ బ్రాహ్మే అదిత్యోత్పత్తి కథనం నామ షష్టోధ్యాయః

యముడు మాత్రము తా మున్నొనరించినపనికి మిక్కిలి పగచెంది ప్రజలను ధర్మముచే రంజింపజేసి ధర్మరా జనుసార్ధక నామముం బితృదేవతల కాధిపత్యమును లోక పాలకత్వముం బడసెను. సావర్ణి ప్రజాపతి సావర్ణి మన్వంతరమున మనువు కాగలడు. అతడు మేరుగిరిపై నిప్పుడును తపము చేయుచున్నాడు. వాని తమ్ముడు శని గ్రహపదవినందెను. త్వష్ట (సూర్యబింబమును) తరణి బట్టగా రాలిన రజమునుబ్రోవు చేసి విష్ణుచక్రమునుగావించె. అది దానవాంతకము అప్రతిహతము. యముని తరువాత బుట్టిన యా బాలిక యమునయనుపేర లోకపావనియైన నది యయ్యెను. మనువు సావర్ణుడుననుపేర నా రెండవ కుమారుడు పిలువబడెను. ఆయన తమ్ముడు శని గ్రహపదవినంది సర్వలోకపూజితుడయ్యెను. దేవతల యీజన్మ వృత్తాంతమును విన్న యాతడు ఆపదలను బాసి యహాయశస్సునందును (46-54)

Brahmapuranamu    Chapters