Brahmapuranamu    Chapters   

అథషట్పంచాశత్తమో7 ధ్యాయః

విస్తరేణ విష్ణుమార్కండేయ సంవాదకథనమ్‌

బ్రహ్మోవాచ

ఇత్థం స్తుత స్తదా తేన మార్కండేయేన భో ద్విజాః | ప్రీతః ప్రోవాచ భగవాన్మేఘ గంభీరయా గిరా || 1

శ్రీ భగవానువాచ

బ్రూహి కామం మునిశ్రేష్ఠ యత్తే మనసి వర్తతే | దదామి సర్వం విప్రర్షే మత్తో యదభివాంచసి|| 2

బహ్మోవాచ

శ్రుత్వా స వచనం విప్రాః శిశోస్తస్య మహాత్మనః | ఉవాచ పరమప్రీతో ముని స్తద్గత మానసః || 3

భగవంతుడట్లు మార్కండేయునిచే వినుతింపబడి మధుర గంభీరముగ నిట్లనియె. నీ మనసునం గల కోర్కెయేమి? తెలుపుము. అచెల్ల నిచ్చెదనన ముని యాదేవుని యెడ మనసు నిలిపి యిట్లనియె.

మార్కండేయ ఉవాచ

జ్ఞాతుమిచ్ఛామిదేవ త్వాం మాయాం వై తవచో త్తమామ్‌ | త్వత్ర్పసాదాచ్చ దేవేశ స్మృతి ర్న పరిహీయతే || 4

ద్రుతమంతః శరీరేణ సతతతం పర్య (రి)వర్తితమ్‌ | ఇచ్ఛామి పురండరీకాక్ష జ్ఞాతుం త్వామహమవ్యయమ్‌ || 5

ఇహ భూత్వా శిశుః సాక్షాత్కింభవా నవతిష్ఠతే | పీత్వా జగదిదం సర్వమేత దాఖ్యాతు మర్హి|| 6

కిమర్ధం చ జగత్సర్వం శరీరస్థం తవా 7నఘ | కియంతం చ త్వయా కాల మిహ న్థేయ మరిందమ|| 7

జ్ఞాతుమిచ్ఛామి దేవేశ బ్రూహి సర్వ మశేషతః | త్వత్తః కమలపత్రాక్ష విస్తరేణ యథాతథమ్‌|| 8

మహదేత దచింత్యం చ యదహం దృష్టవాన్ర్పభో ||

బ్రహ్మోవాచ

ఇత్యుక్తః స తదా తేన దేవదేవో మహాద్యుతిః | సాంత్వయన్స తదా వాక్యమువాచ వదతాం వరః || 9

స్వామి ! తామెవ్వరో నీ మాయయెట్టిదో నీ దయచే నెఱుంగ గోరెదను. నా జ్ఞాపకశక్తి పోలేదు. నీయుదర మందేమేమి వింతలు గంటినో యవి నా మనసులో మెదలుచున్నవి. ఇచట చిన్ని శిశువువై యాడుకొనుచున్నావు. ఈ జగత్తెల్ల నీ గర్భమందెందులకున్నది. ఎంతకాల మిటనుందువు. దేవేశ ! విస్తరముగ తెలుపుము. తెలియగోరెదను.

నేనుచూచినది యూహకందునది గాదు. అన దేవదేవుం జోదార్చుచునిట్లనియె.

శ్రీ భగవానువాచ

కామం దేవాశ్చ మాంవిప్ర న హి జానంతి తత్త్వతః | తవ ప్రీత్యా ప్రవక్ష్యామి యథేదం వి

సృజామ్యహమ్‌ 10

పితృభక్తో 7సి విప్రర్షే మామేవ శరణం గతః | తతో ధృష్టో 7స్మితే సాక్షద్ర్బహ్మచర్యం చతే మహత్‌ || 11

ఆపో నారా ఇతి పురా సంజ్ఞా కర్మకృతం మయా | తేన నారాయణో7స్మ్యుక్తో మమ తాస్త్వయనం సదా|| 12

అహం నారాయణో నామ ప్రభవః శాశ్వతో7వ్యయః | విధాతా సర్వభూతానాం సంహర్తా చ ద్విజోత్తమ || 13

అహం విష్ణు రహం బ్రహ్మా శక్రశ్చాపి సురాధిపః | అహం వై శ్రవణో రాజా యమః ప్రేతాధిపస్తథా|| 14

అహం శివశ్చ సోమశ్చ కశ్యపశ్చ ప్రజాపతిః | అహం ధాతా విధాతా చ యజ్ఞశ్చాహం ద్విజోత్తమ|| 15

'' వేల్లులు కూడ న్నుచ్చముగ తెలయలేరు. నీకు ప్రీతి కూర్చుటకు తెల్పెదను. నీవు పితృభక్తుడవు. న్ను శరణందితివి. నీ బ్రహ్మచర్య దీక్ష చూచియున్నాను. ''నారములు'' అనగా నీరు 'ఆయనము' అనగా స్థానము గాగలవాడను గాన నారాయణుడను. నేనె జగత్కారణము. నాకు నాశము లేదు. భూత విధాతను భూత సంహర్తను నేనే. విష్ణువు, బ్రహ్మ, ఇంద్రుడు- శివుడు- కుబేరుడు- యముడు - సోముడు - కశ్యప ప్రజాపతి - యజ్ఞము నేనె.

సదిశం చ నభః కాయో వాయుర్మనసి మే స్తితః | మయా క్రతుశ##తైరిష్టం బహుభిశ్చాప్త దక్షిణౖ ః || 16

అగ్నిరాస్యం క్షితిః పాదౌ చంద్రాదిత్యౌ చ లోచనే | ద్యౌర్మూర్థా ఖం దిశః శ్రోత్రే తథా 77పః స్వేదసంభావాః || 17

యజంతే వేదవిదుషో మాం దేవయజనే స్థితమ్‌ | పృథివ్యాం క్షత్రియేంద్రాశ్చ పార్థివా ః స్వర్గకాంక్షిణః || 18

యజంతే మాంతథా వైశ్యాః స్వర్గలోకజిగీషవః | చతు స్సముద్ర పర్యంతాం మేరు మందరభూషణామ్‌|| 19

శేషో భూత్వా7హ మేకో హి ధారయామి వసుంధరామ్‌ | వారాహం రూసమాస్తాయ మయేయం జగతీపురా|| 20

మజ్జమానా జలే విప్రః వీర్యేణచ సముద్ధృతా | అగ్నిశ్చ బాడవో విప్ర భూత్వా7 హం ద్విజసత్తమ || 21

పిబామ్యపః సమావిష్ట స్తాశ్చైవ విసృజామ్యహమ్‌ | బ్రహ్మ వక్త్రం భూజౌ క్షత్రమూరూమే సంశ్రితా విశః || 22

పాదౌశూద్రా భవంతీమే విక్రమేణ క్రమేణ చ | ఋగ్వేద స్సామవేదశ్చ యజుర్వేద స్త్వథర్వణః || 23

నాకగ్ని ముఖము. భూమి పాదము. సూర్య చంద్రులు నేత్రములు''

మత్తః దప్రాదుర్భవంత్యేతే మామేవ ప్రవిశంతి చ | యతయ ః శాంతిపరమా యతాత్మానో బుభుత్సవః || 24

కామక్రోధ ద్వేషము క్తా నిస్సంగా వీతకల్మషాః| సత్త్వస్థా నిరహంకారా నిత్యమధ్యాత్మకోవిదాః || 25

మామేవ సతతం విప్రాశ్చింతయంత ఉపాసతే | అహం సంవర్తకో జ్యోతిరహం సంవర్తకా 7నలః || 26

ఆహం సంవర్తకః సూర్త్యస్త్వహం సంవర్తకో 7నిలః| తారారూపాణి దృశ్యంతే యాన్యేతాని నభస్తలే|| 27

మమ వై రోమకూపాని విద్ధిత్వం ద్విజసత్తమ | రత్నాకరాః సముద్రాశ్చ సర్వ ఏవ చతుర్దిశః || 28

వసనం శయనం చైవ నిలయం చైవ విధ్ధి మే | కామః క్రోధశ్ఛ హర్షశ్చ భయం మోహస్తథైవ చ || 29

మమైవ విద్ధి రూపాణి సర్వాణ్యతాని సత్తమ | ప్రాప్నువంతి నరా విప్ర యత్కృత్వా కర్మ శోభనమ్‌ || 30

సత్యం దానం తపశ్చోగ్ర మహింసాం సర్వజంతుషు| మద్విధానేన విహితా మమదేహవిచారిణః || 31

మయా7భిభూత విజ్ఞానాశ్చేష్టయంతి న కామతః | సమ్యగ్వేద మధీయానా యజంతో వివిధైర్మఖైః || 32

శాంతాత్మానో జితక్రోధాః ప్రాప్నువంతి ద్విజాతయః | ప్రాప్తుం శక్యో న చై వాహం నరైర్దుష్కృత కర్మభిః 33

లోభాభిభూతై ః కృపణౖరనార్యైరకృతాత్మభిః | తన్మాం మహాఫలం విద్ధి నరాణాం భావితాత్మనామ్‌ || 34

సుదుష్ప్రాపం విమూఢానాం మాం కుయోగనిషేవిణామ్‌ | యదా యదా హి ధర్మస్యగ్లాని ర్భవతి సత్తమ || 35

అభ్యత్థాన మధర్మస్య తదా77త్మానం సృజామ్యహమ్‌ | దైత్యా హింసానురక్తాశ్చ అవధ్యాః సురసత్తమైః || 36

రాక్షసాశ్చాపి లోకేస్మిన్యదోత్పత్స్యంతి దారుణాః | తదా7హం సంప్రసూయామి గృహేషుపుణ్యకర్మణామ్‌ || 37

ప్రవిష్టో మానుషం దేహం సర్వం ప్రశమయామ్యహమ్‌ | సృష్ట్వా దేవమనుష్యాంశ్చ గంధర్వోరగ రాక్షసాన్‌ || 38

స్థావరాణి చ భూతావి సంహారామ్యాత్మమాయయా | కర్మకాలే పునర్ధేహమనుచింత్య సృజామ్యహమ్‌ || 39

ఆవిశ్య మానుషం దేహం మర్యాదా బంధకారణాత్‌ | శ్వేతః కృతయుగె ధర్మః శ్యామ స్త్రేతాయుగే మమ ||40

రక్తో ద్వాపర మాసాద్య కృష్ణః కలియుగే తథా | త్రయోభాగా హ్యధర్మస్య తస్మిన్కాలే భవంతి చ || 41

అంతకాలే చ సంప్రాప్తేకాలో భూత్వా 7తిదారుణం | త్రైలోక్యం నాశయామ్యేకః సర్వం స్థావరజంగమమ్‌ ||42 అహం త్రిధర్మా విశ్వాత్మా సర్వలోకసుఖావహంః| అభిన్న ః సర్వగో7 నంతో హృషీకేశః ఉరుక్రమః || 43

కాలచక్రం నయామ్యేకో బ్రహ్మరూపం మమైవ తత్‌ | శమనం సర్వభూతానాంసరర్వభూత కృతోద్యమమ్‌ || 44

ఏవం ప్రణిహితః సమ్యజ్మమా77 త్మా మునిసత్తమ | సర్వభూతేషు విప్రేంద్ర న చ మాంవేత్తి కశ్చన || 45

సర్వలోకేచ మాం భక్తాః పూజయంతి చ సర్వశః | యచ్చ కించి త్త్వయా ప్రాప్తం మయిక్లెశాత్మకం ద్విజ || 46

సుఖోదయాయ తత్సర్వం శ్రేయసే చ తవానఘ | యచ్చ కించిత్త్వయా లోకేదృష్టం స్థావరజంగమమ్‌ || 47

విహితః సర్వ ఏవాసౌ మయా77 త్మా భూతభావనః | అహం నారాయణో నామ శంఖ చక్రగదాధరః 48

యావద్యుగానాం విప్రర్షే సహస్రం పరివర్తతే | తావత్స్వపితి విశ్వాత్మా సర్వవిశ్వాని మోహయన్‌ || 49

ఏవం సర్వమహం కాలమిహా 77సే మునిసత్తమ | అశిశుః శిశురూపేణ యావద్ర్బహ్మాన బుధ్యతే || 50

మయా చ దత్తో విప్రేంద్ర వరస్తే బ్రహ్మరూపిణా | అసకృత్సరితుష్టేన విప్రర్షిగణ పూజిత || 51

సర్వమేకార్ణవం కృత్యా నష్టే స్థావర జంగమే | నిర్గతో 7సి మయా 77జ్ఞాత స్త తస్తే దర్శితం జగత్‌ || 52

ఇట్లు వానికి వేయి యుగములు ముగియగనే స్వామి ''మఱియేమి కోరెదవన'' నా పురాణమని యిట్లనియె.

అభ్యంతరం శరీరస్య ప్రవిష్టో7సి యదా మమ | దృష్ట్వా లోకం సమస్తం హి విస్మితో నావబుధ్యసే || 53

తతో7సి వక్త్రాద్విప్రక్షే ద్రుతం నిఃసారితో మయా | ఆఖ్యాతస్తే మయాచా77త్మా దురేజ్ఞయోహిసురాసురైః 54

యావత్స భగవాన్ర్బహ్మా బుధ్యేత మహాతపాః | తావత్త్వమిహ విప్రర్షే విస్రబ్ధ శ్చర వై సుఖమ్‌ || 55

తతో విబుద్ధే తస్మింస్తు సర్వలోకపితామహే | ఏకో భూతాని స్రక్ష్యామి శరీరాణి ద్విజోత్తమ || 56

ఆకాశం పృథివీం జ్యోతిర్వాయుః సలిల మేవచ | లోకే యచ్చ భ##వేత్కించిదిహ స్ధావరజంగమమ్‌ || 57

బ్రహ్మోవాచ

ఏవ ముక్త్వా తదా విప్రాః పునస్తం ప్రాహ మాధవః | పూర్ణే యుగసహస్రే తు మేఘ గంభీరని స్వనః 58

శ్రీ భగవానువాచ

మునే! బ్రూహి యదర్ధం మాం స్తుతవా న్పరమార్ధతః | వరం వృణీష్వ యచ్ర్ఛేష్ఠం దదామి నచిరాదహమ్‌ || 59

అయుష్మానసి దేవానాం మద్భక్తో7సి దృఢవ్రతః | తేన త్వమసి విప్రేంద్ర పునర్దీర్ఘాయురాయురావ్నుహి || 60

బ్రహ్మోవాచ

శ్రుత్వా వాణీం శుభాం తస్య విలోక్య స తదా పునః | మూర్ధ్నా నిపత్య సహసా ప్రణమ్య పునరభ్రవీత్‌ || 61

మార్కండేయ ఉవాచ

దృష్టం పరం హి దేవేశ తవ రూపం ద్విజోత్తమ | మోహో7యం విగతః సత్యం త్వయిదృష్టేతుమే హరే|| 62

ఏవమేవమహం నాథ ఇచ్ఛేయం త్వ త్ర్పసాదతః | లోకానాం చ హితార్థాయ నానాభావ ప్రశాంతయే || 63

శైవభాగవతానాం చ వాదార్థ ప్రతిషేధకమ్‌ | అస్మినేక్షత్రవరే పుణ్య నిర్మలే పురుషోత్తమే || 64

శివస్యా 77యతనం దేవ కరోమి పరమం మహత్‌ | ప్రతిష్ఠేయ తథా తత్ర తవస్థానే చ శంకరమ్‌ || 65

తతో జ్ఞాస్యంతి లోకే7స్మి న్నేకమూర్తీ హరీశ్వరౌ | ప్రత్యువాచ జగన్నాథః స వునస్తం మహామునిమ్‌ || 66

శ్రీ భగవానువాచ

యదేత్పరమం దేవ కారణం భువనేశ్వరమ్‌ | లింగమారాధనార్థాయ నానాభావ ప్రశాంతయే || 67

మమా77దిషేన విప్రేంద్ర కురు శీఘ్రం శివాలయమ్‌ | తత్ర్పభావాచ్ఛివలోకే తిష్ఠ త్వం చతథా 7క్షయమ్‌ || 68

శివే సంస్థాపితే విప్ర మమ సంస్థాపనం భ##వేత్‌ | నా77వయో రంతరం కించి దేకభావౌ ద్విధా కృతౌ || 69

యో రుద్రః స స్వయం విష్ణు ర్యో విష్ణుః స మహేశ్వరః | ఉభయోరంతరం నాస్తి పవనాకాశయోరివ|| 70

మోహితో నాభిజానాతి య ఏవ గరుడధ్వజః | వృషధ్వజః స ఏవేతి త్రిపురఘ్నం త్రిలోచనమ్‌|| 71

తవనామాంకితం తస్మాత్కురువిప్ర శివాలయమ్‌ | ఉత్తరే దేవదేవస్య కురు తీర్థం సుశోభనమ్‌ || 72

మార్కండేయ హ్రదో నామ నరలోకేషు విశ్రుత ః | భవిష్యతి ద్విజశ్రేష్ఠ సర్వపాపప్రణాశనః || 73

బ్రహ్మోవాచ

ఇత్యుక్త్వా స తదా దేవస్తత్రైవాంతరధీయత | మార్కండేయం మునిశ్రేష్ఠాః సర్వవ్యాపీ జనార్దనః || 74

ఇతి శ్రీమహాపురాణ ఆదిబ్రాహ్మే స్వయంభ్వృషి సంవాదే మార్కండేయస్య

శ్రీభగవద్దర్మనం నామ షట్పంచాశత్తమో7ధ్యాయః

నీ దయచే లోక హితముగోరి భేదభావము నశించుటకు శివవైష్ణవవాద భేదము లంతరింప జేయుటకు నిక్కడ శివాలయము నిర్మించెదను. అందు నీక్షేత్రమున శంకర ప్రతిష్ఠ జేసేదను. హరిహరు లొక్కటే యని లోక మెఱుంగు గాక.'' అని జగన్నాధుడు భువనేశ్వర రూపమయిన లింగము జగత్కారణము. నా యానగొని వెంటనే యిట నీశ్వరుని ప్రతిష్ఠింపుము. మా యిర్వురకు నంతరములేదు. లోకమెఱుంగకి వాదులాడును. నా ఆలయమిది నీ పేర నిర్మించుము. దాని కుత్తరముగ మార్కండేయ 'హ్రదము' అను పేర నొక తీర్థము కూడ నేర్పడును. అది సర్వపాపహరగును. అని సర్వవ్యాపియైన జనార్దనుడు పల్కి తిరోహితుడయ్యెను.

ఇతి శ్రీ బ్రహ్మపురాణ విస్తరేణ విష్ణుమార్కండేయ సంవాదకథనమను ఏబది ఆఱవ అధ్యాయము.

Brahmapuranamu    Chapters