Brahmapuranamu    Chapters   

అ థ చ తు ర్విం శో7 ధ్యా యః

ధ్రువసంస్థితినిరూపణమ్‌-

లోమహర్షణ ఉవాచ-

తారామయం భగవతః శిశుమారాకృతిః ప్రభోః | దివి రూపం హరే ర్యత్తు తన్య పుచ్ఛే స్థితో ధ్రువః || 1

నై ష భ్రమ న్ర్భామయతి చంద్రాదిత్యాదికా స్గ్రహాన్‌ | భ్రమంతమను తం యాంతి నక్షత్రాణి చ చక్రవత్‌ || 2

సూర్యాచంద్రమసౌ తారా నక్షత్రాణి గ్రహై స్సహ | వాతానీకమయై ర్బంధైః ధ్రువే బద్ధాని తానివై || 3

శిశుమారాకృతి ప్రోక్తం యద్రూపం జ్యోతిషాం దివి|నారాయణః పరంధామ తస్యా77ధారః న్వయం హృది|| 4

ఉత్తానపాదతనయ స్త మారాధ్య ప్రజాపతిమ్‌ | స తారాశిశుమారస్య ధ్రువః పుచ్ఛే వ్యవస్థితః || 5

ఆధారః శిశుమారస్య సర్వాధ్యక్షో జనార్దనః | ధ్రువస్య శిశుమారశ్చ ధ్రువే భాను ర్వ్యవస్థితః || 6

తదాధారం జగచ్చేదం సదేవాసురమానుషమ్‌ | యేన విప్రా విధానేన తన్మే శృణుత సాంప్రతమ్‌ || 7

సూతుడిట్లనియె-

భగవంతుడగు హరియొక్క తారా (నక్షత్ర)మయమైన రూపము శిశుమారనక్షత్ర మంతరిక్షచక్రమునందు ప్రకాశించుచున్నది.దాని తోక యందు ధ్రువుడున్నాడు. అతడు దాను దిరుగుచు చంద్రాదిత్యాదిగ్రహములను ద్రిప్పుచున్నాడు. తిరుగుచున్న యీ ధ్రువుననుసరించి నక్షత్రముల చక్రమువలె తిరుగుచుండును. సూర్యచంద్రులు తారానక్షత్రగ్రహనమూహము వాయుమయములైనబంధములచే ధ్రువునియం దనుబద్ధములై యున్నవి. అంతరిక్షమందు జ్యోతిశ్చక్రము శిశుమారాకారమున (మొసలివలె) నున్నదని వర్ణితమైనది. ఆమ్మూర్తికాథారమై హృదయమందు నాఠాయణుండున్నాడు. ఉత్తానపాదునికుమారుడు ప్రజాపతి నారాధించి తారారూపమయినయాశిశుమారముయొక్కతోకయందున్నాడు. శిశుమారమునకాధారము సర్వాధ్యక్షుడైన జనార్దనుడు. ధ్రువున కాధారము శిశుమారచక్రము. ధ్రువునియందు భానుడున్నాడు. సురానురమానుషమయిన యీ జగత్తంతయు నాసూర్యుని యాధారమయున నిలిచియున్నది. నూర్యుడీ జగత్తునంతకు నే విధానమున నాధారముగ నుండెనో నావలన వినుడు!

వివస్వా నష్టభి ర్మాసై ర్గ్రసత్యపో రసాత్మికాః | వర్షత్యంబు తతశ్చాన్న మన్నాద మఖిలం జగత్‌ || 8

వివస్వా నంశుభి స్తీక్షై రాదాయ జగతో జలమ్‌ | సోమం పుష్య త్యధేందుశ్చ వాయునాడీమయై ర్దివి|| 9

జలై ర్విక్షిప్యతే7భ్రేషు ధూమాగ్న్యనిలమూర్తిషు | నభ్రశ్యంతి యతస్తేభ్యో జలా న్యభ్రాణి తా న్యతః || 10

ఆభ్రస్థాః ప్రపతం త్యాపో వాయునా సముదీరితాః|సంస్కారం కాలజనితం విప్రాశ్చా77సాద్య నిర్మలాః || 11

సరిత్సముద్రా భౌమాస్తు తథా77పః ప్రాణిసంభవాః | చతుష్ప్రకారా భగవా నాదత్తే సవితా ద్విజాః || 12

ఆకాశగంగాసలిలం తథా77హృత్య గభస్తిమాన్‌ | అనభ్రగత మేవోర్వ్యాం సద్యః క్షిపతి రశ్మిభిః || 13

తస్య సంప్పర్శనిర్థూతపాపపంకో ద్విజో త్తమాః| న యాతి నరకం మర్త్యోదివ్యం స్నానం హితత్స్మృతమ్‌|| 14

దృష్టసూర్యం హి తద్వారి పత త్యభ్రైర్వినా దివః | ఆకాశగంగాసలిలం తద్గోభిః క్షిప్యతే రవేః || 15

సూర్యుడెనిమిది మాసములు రసన్వరూపములైన జలములను బీల్చి వర్షించును. ఆవర్షమువలన అన్నము దానివలన సకల జగత్తు పొడమును. తీక్షకిరణములచే నర్కుడు జగమ్మునగల నీటినాకర్షించి సోముని పోషించును. ఆయన వాయునాడీమయమైన జలముచే యాకాశము నందుండి పొగ అగ్ని వాయువు యనువానియొక్క సన్నిపాతస్వరూపమయిన మేఘములందు జలముల జిమ్మును. అమ్మేఘములనుండి నీరు భ్రంశముకానందున నమ్మబ్బులకు ''అభ్రములు'' అను పేరు వచ్చినది. ఈ మేఘము నందున్న నీళ్ళు వాయుప్రేరణమున కాలజనితసంస్కారమును బొంది నిర్మలములై వానగా నపనిపై బడును. ప్రాణికోటి పుట్టుటకు కారణములయి భౌమములయిన యీ అప్పులు (నీళ్ళు) నదులు, సముద్రములు. భూమి ప్రాణి జన్యము లని నాలుగు రూపములతోనున్న యీ జలమును భగవంతుడైన సవిత ఆదానము చేయును (గ్రహించును). సూర్యుడు అభ్రగతము కాకుండ ఆకాశగంగాగతమైన నీటినికూడ కిరణములచే గ్రహించి ఆప్పటికపు డవనిపై వర్షించును. అట్టి ఆకాశగంగోదకముల స్పర్శవలన పాపములు వాసిన మర్త్యుడు నరకముసకేగడు. అది దివ్యస్నాసమని ఋషులు చెప్పిరి. సూర్యదర్శనమాత్రమున దివంబునుండి రవికిరణములచే నాయాకాశగంగోదకము వెదజల్లబడును.

కృత్తికాదిషు ఋక్షేషు విషమేష్వంబు యద్దివః | దృష్ట్వా7ర్కం పతితం జ్ఞేయం తద్గాంగం దిగ్గజోద్ధృతమ్‌|| 16

యుగ్మకేషు తు యత్తోయం పత త్యర్కోద్ధృతం దివః | తత్సూర్యరశ్మిభి స్సద్యః సమాదాయ నిరస్యతే || 17

ఉభయం పుణ్యమత్యర్ధం నృణాం పాపహరం ద్విజాః | ఆకాశగంగా సలిలం దివ్యం స్నానం ద్విజో త్తమాః || 18

యత్తు మేఘైః సముత్సృష్టం వారి తత్ప్రాణినాం ద్విజాః|పుష్ణా త్యోషధయ స్సర్వా జీవనాయా మృతం హితత్‌ || 19

తేన వృద్ధిం పరాం నీతః సకల శ్చౌషధీగణః | సాధకః ఫలపాకాంతః ప్రజానాం తు ప్రజాయతే || 20

తేన యజ్ఞా న్యథాప్రోక్తా న్మానవాః శాస్త్ర చక్షుషః | కుర్వతే7హరహశ్చైవ దేవా నాప్యాయయంతి తే || 21

ఏవం యజ్ఞాశ్చ వేదాశ్చ వర్ణశ్చ ద్విజపూర్వకాః | సర్వదేవనికాయాశ్చ పశుభూతగణాశ్చయే || 22

వృష్ట్యా ధృత మిదం సర్వం జగత్ధ్సాపరజంగమమ్‌ |సాపి నిష్పాద్యదే వృష్టిః సవిత్రా మునిస త్తమాః || 23

ఆధారభూతః సవితుః ధ్రువో మునివరో త్తమాః | ధ్రువస్య శిశుమారో7సౌ సో7పి నారాయణాశ్రయః || 24

హృదినారాయణ స్తస్య శిశుమారస్య సంస్ధితః | విభర్తా సర్వభూతానా మాదిభూతః సనాతనః || 25

ఏవంమయా మునిశ్రేష్ఠా బ్రహ్మాండం సముదాహృతమ్‌|భూసముద్రాదిభిర్యుక్తంకి మన్య చ్ర్ఛోతు మిచ్ఛథ || 26

ఇతి శ్రీమహాపురాణ ఆది బ్రాహ్మే ధ్రువసంస్ధితినిరూపణం నామ చతుర్వింశో7ద్యాయః

కృత్తికాదివిషమ(బేసి)నక్షత్రములందు సూర్యుని దర్శనముతో వర్షించు నయ్యుదకముదిగ్గజములెత్తి వర్షించినట్టిగంగోద కమని తెలియనగును. సూర్యునికిరణములద్వారమున సరిసంఖ్యకల నక్షత్రములందు కురియువాన అప్పటికప్పుడు సూర్యకిరణములచే స్వీకరింపబడి వర్షింపబడినది యీ ఉభయమును నరులకు పావహరము పుణ్యకరమునునగు దివ్యస్నానమనితెలియనగును. మేఘములవెంట కురియు నుదక మోషధులను బోషించును. ప్రాణులకుజ్జీవనమగు నాజలము అమృతము. దానంబెంపొందిన సకలౌషదీగణము ఫలపాకాంతమై (పంటపండగానే నశించునదియై) ప్రజలకు సాధకమగును. అందుచే శాస్త్రచక్షువులగు మానవులు వేదములు సెప్పిన యజ్ఞము సహరహము నాచరించి దేవతల కాప్యాయనము కలిగింతురు. ఇట్లు యజ్ఞములు వేదములు బ్రాహ్మణాది వర్ణములు సర్వదేవనికాయము సకలపశుభూతనంఘాతము స్థావర జంగమాత్మకమైన సర్వజగత్తు వర్షాధారమున రాజిల్లుచున్నది. ఆవర్షము సూర్యుని వలన నేర్పడుచున్నది. అట్టి సూర్యుని కాధారమై ధ్రువుడున్నాడు. ఆతనికి శిశు మారము దానికి నారాయణుడును అశ్రయమై యున్నారు. శిశుమారచక్రహృదయ స్థానమందు నారాయణుడుండి సర్వభూతములను ధరించుచు సనాతనుడు సర్వాదిభూతుడై యలరారు చున్నాడు. భూ సముద్రాదిసహితమైన బ్రహ్మాండముయొక్క స్వరూపమిది. మీకు తెలిపితిని. మరియేమి వినదలతురో యానతిండు.

ఇది శ్రీ బ్రహ్మపురాణ మందు ధ్రువసంస్ధితినిరూపణ మను ఇరువదినాలుగవ యధ్యాయము

Brahmapuranamu    Chapters