Brahmapuranamu    Chapters   

అథద్వాత్రింశదధికద్విశతతమో7ధ్యాయః

వ్యాసముని సంవాదే ప్రాకృతప్రతిసంచరకథనమ్‌

వ్యాస ఉవాచ

సర్వేషామేవ భూతానాం త్రివిధః ప్రతి సంచరః | నైమిత్తికః ప్రాకృతిక స్తథైవా೭೭త్యంతికో మతః || 1

బ్రాహ్యా నైమిత్తిక స్తేషాం కల్పాంతే ప్రతిసంచరః | ఆత్యంతికో వై మోక్షాశ్చ ప్రాకృతో ద్విపరార్ధికః || 2

సృష్ట్యుపసంహారలక్షణము

సర్వభూతములకును జరుగు ప్రతిసంచరము. అనగా ప్రళయము మూడావిధములు. 1. నైమిత్తికము, 2. ప్రాకృతికము 3. అత్యంతికము. వానిలో 1. బ్రహ్మదేవుని ఆయుఃకాలము సమాప్తికాగా కల్పాంతమున జరుగు ప్రళయము నైమిత్తికము. 2. జీవునకుమోక్షము లభించుటయే అత్యంతిక ప్రళయము. 3. రెండుపరార్ధముల కొకసారి జరుగునది ప్రాకృతప్రళయము. అని వ్యాసుడు పలికెను.

మునయ ఊచుః

పరార్దసంఖ్యాం భగవం స్త్వమాచక్ష్వ యథోదితామ్‌ | ద్విగుణీకృతయజ్ఞేయః ప్రాకృతః ప్రతిసంచరః || 3

మాకు పరార్ధకాలపరిమాణము తెలిసినచో దానికి రెట్టింపు కాలమగు ద్విపరార్ధముల తరువాత జరుగు ప్రాకృత ప్రళయము మాకవగతమగును. కనుక దానిని తెలుపుమని మునులు వ్యాసునడిగిరి.

వ్యాస ఉవాచ

స్థానాత్థ్సానం దశగుణ మేకైకం గణ్యతే ద్విజాః | తతోష్టాదశ##మే భాగే పరార్ధమభిధీయతే || 4

పరార్ధం ద్విగుణం యత్తు ప్రాకృతః స లయో ద్విజాః | తదా7 వ్యక్తేభిలం వ్యక్తం సహేతౌ లయమేతి వై || 5

సంఖ్యల లెక్కింపులో కుడివైపునుండి ఎడమవైపునకు పోగా స్థానపువిలువ పదిరెట్లు పెరుగుచుండును. అట్లు పోగా పదునెనిమిదవస్థానముతో పరార్ధమగును. ఒకట్లు పదులు నూర్లు - వేలు లక్ష-పదిలక్షలు-కోటి పదికోట్లు ఇటుపోగా పదునెనిమిదవస్థానములో ఏర్పడుసంఖ్య పరార్థము. అనగా 100,000,000,000,000 ఇదిపరార్ధ సంఖ్య. ఇన్ని సంవత్సరాలకాలమునకు రెట్టింపుచేసినచో ద్వివరార్థము. ఇట్టి ద్విపరార్ధకాలమున కొకసారి జరుగు ప్రళయము ప్రాకృతప్రళయము. అప్పుడు ఈవ్యక్త స్పష్టరూపముకల ప్రపంచమజతయు తనమూలకారణముతో కూడ అవ్యక్తమగు ప్రకృతి మూలతత్త్వమునందు లయమునొందును.

నిమేషో మానుషోయోయం మాత్రామాత్రప్రమాణతః | తైః పంచదశభిః కాష్ఠా త్రింశత్కాష్ఠాస్తథా కలా || 6

నాడికా తు ప్రమాణన కళా శ్చ దశపంచచ | ఉన్మానేనాంభసః సా తు పలాన్యర్ధత్రయోదశ || 7

హేమమాషైః కృతచ్ఛిద్రా చతుర్భిశ్చతురంగుళైః | మాగధేన ప్రమాణన జలప్రస్థస్తు స స్మృతః || 8

నాడికాభ్యామథ ధ్వాభ్యాం ముహూర్తో ద్విజసత్తమాః | అహోరాత్రం ముహూర్తాస్తు త్రింశన్మాసో దినైస్తథా || 9

మాసైర్ద్వాదశభిర్వర్ష మహోరాత్రం తు తద్దివి | త్రిభిర్వర్షశ##తైర్వర్షం షష్ట్యా చైవాసురద్విషామ్‌ || 10

తైస్తుద్వాదశసాహన్నై శ్చతుర్యుగముదాహృతమ్‌ | చతుర్యుగసహస్రం తు కథ్యతే బ్రహ్మణో దినమ్‌ || 11

స కల్పస్తత్ర మనవ శ్చతుర్దశ ద్విజో త్తమాః | తదంతే చైవ భో విప్రా బ్రహ్మనై మిత్తిలో లయః || 12

తస్య స్వరూపమత్యుగ్రం ద్విజేంద్రా గదతో మమశృణుధ్వం ప్రాకృతం భూయ స్తతో వక్ష్యామ్యహం లయమ్‌ || 13

నైమిత్తికప్రళయము వివరింతును. కాలపరిమాణములో మానవుని ఱప్పపాటు అన్నిటికి మూలపరిమాణము. అట్టి నిమేషములు పదునైదు (పదునెనిమిది) కాష్ఠా అనబడును. ముప్పదికాష్ఠలుకల పదునైదుకలలునాడిక. రెండునాడికలు ముహూర్తము. ముప్పదిముహూర్తములు ఒకరాత్రింబగలు. ముప్పదిఅహోరాత్రములు మాసము. పండ్రెండుమాసములు సంవత్సరము. ఇట్టి మూడువందలఅఱువది సంవంత్సరములు దేవతల సంవత్సరము. పండ్రెండువేలదేవసంవత్సరములు ఒక చతుర్యుగము. అనగా కృతత్ర్‌తాద్వాపర కలియుగములు నాలుగు అగును. వేయిచతుర్యుగములు బ్రహ్మదినము. కల్పాంతము, బ్రహ్మతోకూడ నైమిత్తికలయుము జరుగును. దానిస్వరూపము మిగులభయంకరయు. అది యొదటమీకు తెలిపి పిమ్మట ప్రాకృతప్రళయ స్వరూపము వివరింతును వినుడు.

చతుర్యుగ సహస్రాంతే క్షీణప్రాయే మహీతలే | అనావృష్టి రతీ వోగ్రా జాయతే శతవార్షికీ || 14

తతో యాన్యల్పసారాణి తాని సత్త్వాన్యనేకశః | క్షయం యాంతి మునిశ్రేష్టాః పార్థివాస్యతి పీడనాత్‌ || 15

తతః స భగవా న్కృష్ణో రుద్రరూపీ తథా వ్యయః | క్షయాయ యతతే కర్తు మాత్మస్థాః సకలాః ప్రజాః || 16

తతః స భగవాన్విష్ణు ర్భానోః సప్తమ రశ్మిషు | స్థితః పిబత్యశేషాణి జలాని మునిసత్తమాః || 17

పీత్వాంభాంసి సమస్తాని ప్రాణిభూత గతాని వై | శోషం నయతి భో విప్రాః సమప్తం పృథివీతలమ్‌ || 18

సముద్రాన్సరితః శైలాన్‌ శైలప్రస్రవణాని చ | పాతాశేషు చ యత్తోయం తత్సర్వం నయతి క్షయమ్‌ || 19

తతస్తస్యాప్యభావేన తోయాహారోపబృంహితః | సహస్రరశ్మయః సప్త జాయంతే తత్ర భాస్కరాః || 20

అధశ్చోర్ధ్వం చ తే దీప్తా స్తతః సప్త దివాకరాః | దహంత్య శేషం త్రైలోక్యం సపాతాశతలం ద్విజాః || 21

దహ్యమానం తు తైర్దీపై#్త సై#్తలోక్యం దీప్త భాస్కరైః | సాద్రినగార్ణవాభోగం విఃస్నేహమభిజాయతే || 22

తతో నిర్దగ్ధవృక్షాంబు త్రైలోక్యమఖిలం ద్విజాః | భవత్యేషా చ వసుధా కూర్మపృష్ఠోపమాకృతిః || 23

తతః కాలాగ్నిరుద్రోసౌ భూతసర్గమరో హరః | శేషాహిశ్వావసంతాపా త్పాతాళాని దహత్యధః || 24

పాతాళాని సమస్తాని స దగ్ధ్వా జ్వలతో మహాన్‌ | భూమిమభ్యేత్య సకలం దగ్ధ్వా తు వసుధాతలమ్‌ || 25

భువో లోకం తతః సర్వం స్వర్గలోకం చ దారుణః | జ్వాలామాలామహావర్త స్తత్రైవ పరివర్తతే || 26

వేయిచతుర్యుగముల తరువాత మహీతలము చాలవరకు క్షీణించిపోగా నూరేండ్లు ఎడతెగని అనావృష్టి ఏర్పడును. బలమంతగాలేని ప్రాణులనేకములు భూమిపై మిగుల పీడలపాలై నశించును. అంతట విష్ణుభగవానుడు రుద్రునిరూపమున సమస్తప్రజలను తనలో లయముచేసికొనుటకు యత్నించును. అతడు సూర్యునిఏడు కిరణముల యందును నిలిచి సమస్తజలమును త్రాగును. ప్రాణులన్నియు అందుచే శోషించును. సముద్రముల నదుల కొండల సెలయేళ్ళ- పాతాళముల -లోనున్న నీరంతయు ఇంకిపోవును. దానిచేనీరు మాత్రమే ఆహారముగాగల జీవరాశులును నశించి పోవును. అంతట ఏడుమంది సూర్యుల ఆవిర్భవించి వారు అన్ని దిక్కులకును ప్రజ్వలించుచు పాతాళతలము వరకుగల లోకమునంతటిని కాల్చివేయుదురు. వారిమూలమున ఈభూమి పర్వతముల - సముద్రములతోకూడ దగ్ధమయి తాబేలు వీపువలె అయిపోవును. అంతట ప్రళయకాలాగ్ని రుద్రుని ఆదిశేషుని నిశ్శ్వాసవాయువుల తాపముచే సప్తపాతాళములను కాల్చివేయును. ఆఅగ్నియే పాతాళమునుండి భూలోకమునకు అచటినుండి స్వర్గమునకు కూడపోయి వరుసగా మూడు లోకములను పూర్తిగా కాల్చివేయును.

అంబరీషమివా೭೭భాతి త్రైలోక్యమఖిలం తదా | జ్వాలా వర్త పరీవార ముపక్షీణ బలా స్తతః || 27

తతస్తాప పరీతాస్తు లోకద్వయనివాసినః | హృతావకాశా గచ్ఛంతి మహర్లోకం ద్విజా స్తదా || 28

తస్మాదపి మహాతాప తప్తా లోకా స్తతః | పరమ్‌| గచ్ఛంతి జనలోకం తే దశావృత్త్యా పరైషిణః || 29

తతో దగ్ధ్వా జగత్పర్వం రుద్రరూసీ జనార్దనః | ముఖ నిఃశ్వాసజాన్మేషూ న్కరోతి ముని సత్తమాః || 30

తతో గజకుల ప్రఖ్యా స్తదిద్వంతో నివాదినః | ఉత్తిష్ఠంతి తదా వ్యోమ్ని ఘోరాః సంవర్తకా ఘనాః || 31

కేచిదంజస సంకాశాః కేచిత్కుముద సంనిభాః | ధూమవర్జా ఘనాః కేచి త్కేచిత్పీతాః పయోధరాః || 32

కేచిద్ధరిద్రావర్ణాభా లాక్షారస నిభా స్తథా | కేచిద్వైదూర్య సంకాశా ఇంద్ర నీలని భాస్తథా || 33

శంఖకుందనిభాశ్చాన్యే జాతీకుందనిభా స్తథా | ఇంద్రగోపనిభాః కేచి న్మనః శిలనిభా స్తథా || 34

పద్మపత్రనిభాః కేచి దుత్తిష్ఠంతి ఘనా ఘనాః | కేచిత్పురవరాకారాః కేచిత్పర్వత సంనిభాః || 35

కూటాగార నిభాశ్చాన్యే కేచిత్థ్సలనిభా ఘనాః | మహాకాయా మహారావా పూరయంతిః సభఃస్థలమ్‌ || 36

వర్షంతస్తే మహాసారా స్తమగ్నిమతి భైరవమ్‌ | శమయంత్యఖిలం విప్రా సై#్త్రలోక్యాంతర విస్తృతమ్‌ || 37

నష్టే చాగ్నౌ శతం తేపి వర్షాణామధికం ఘనాః | ప్లావమంతో జగత్సర్వం వర్షంతి మునిసత్తమాః || 38

ధారాభి రక్షమాత్రాభిః ప్లాపయిత్వాఖిలాం భువమ్‌ | భువో లోకం తథైవోర్ధ్వం ప్లావయంతి దివం ద్విజాః || 39

అంధకారీకృతే లోకే నష్టే స్థాపరజంగమే | వర్షంతి తే మహామేఘా వర్షాణా మధికం శతమ్‌ || 40

ఇతి శ్రీమమాపురాణ ఆదిబ్రాహ్మే వ్యాసర్షి సంవాదే సంహార లక్షణకథనంనామ ద్వాత్రింశదధిక ద్విశతతమోధ్యాయః.

అపుడు ఈమూడులోకములు జ్వాలల సుడులతో చుట్టివేయబడి కాలుచున్న వేపుడుమంగలము వలె నుండును. ముల్లోకములలోని బ్రాహ్మణులును తాపముతోనిండి బలము ఉపక్షీణమై ఎచ్చటను నిలుచుటకు అవకాశములేక మహర్లోకమునకు పోవుదురు. అచ్చటను మహాతాపముతో తపించి అంతకు పైనున్న జనలోకమునకు పోవుదురు. అంతట రుద్రరూపుడగు విష్ణువు తన నిట్టూర్పు అవిరులచే మేఘముల సృష్టించును. సంవర్తకములను పేరుతో ఆ మబ్బులు పెద్దఉరుములతో మెఱపులతో ఆకాశమంతట క్రమ్మును. ఏనుగులవలె-కాటుకవలె నల్లకలువపూలవలె-న్లలనివి కొన్ని పొగరంగుతోకొన్ని పచ్చనివికొన్ని పసపువలె లక్కవలె వైడూర్యరత్నముల వలె ఇందనీలములవలె శంఖముల వలె మొల్లపూలవలె జాజిపూలవలె అర్ద్రపురుగులవలె మనఃశిలవలె తామరపూరేకులవలె వెలిగెడి అమేఘములు అంతటను వ్యాపించును. నగరములవంటి పర్వత ములవంటి గిడ్డంగులవంటి మిట్టనేలలవంటి అకారములతో పెద్దశరీరములతో పెద్దధ్వనులతో అవి ఆకాశమున నిండును. పెద్దవానలుకురియించి అభయంకరాగ్ని జ్వాలలను అర్పివేయును. ఆఅగ్ని చల్లారినతరువాత కూడ అమెఘములు ఎడతెగక వర్షించుచు లోకమునంతటిని నీటితోముంచును. అవి బండిఇరుసంత లావైన జలధారలనీటితో భూమిని నింపినతరువాత ఊర్ధ్వరుకములనులోడ నింపును. ఇట్లు స్థిర్నర జీవులు జడచేతనే పదార్థములు అన్నియు నశించి లోకమంతయు అంధకారావృతమైయుండగా అమేఘములట్లు నూరుసంవత్సరములకు పై కాలముఎడతెగక వర్షించుచునేయుండును.

ఇది శ్రీమహాపురాణమున ఆదిబ్రాహ్మమున వ్యాబుషి సంవాదమున సృష్ట్యుసంహారలక్షణకథనము అను రెండువందలముప్పదిరెండవ అధ్యాయము.

Brahmapuranamu    Chapters