Brahmapuranamu    Chapters   

అథ చతురధివద్విశతతమో7ధ్యాయః

ఇంద్రకృష్ణసంవాదః షోడశసహస్ర స్త్రీ పరిగ్రహవర్ణనమ్‌

వ్యాస ఉవాచ

సంస్తుతో భగవానిత్థం దేవరాజేన కేశవః | ప్రహస్య భావగంభీర మువాచేదం ద్విజో త్తమాః || 1

శ్రీ భగవానువాచ

దేవరాజో భవానింద్రో వయం మర్త్యా జగత్పతే | క్షంతవ్యం భవతైవైత దపరాధకృతం మమ|| 2

పారిజాతతరుశ్చాయం నీయతాముచితాస్పదమ్‌ | గృహీతో7యం మయాశక్ర సత్యావచనకారణాత్‌ || 3

వజ్రం చేదం గృహాణత్వం యష్టవ్యం ప్రహితం త్వయా | తవైవైత్ప్రహరణం శక్ర వైరివిదారణమ్‌ || 4

శక్ర ఉవాచ

విమోహయసి మామీశం మర్త్యో7హమితి కిం వదన్‌ | జానీమస్త్వాం భగవతో7నంతసౌఖ్యవిదో వయమ్‌ | 5

యో7సి సో7సి జగన్నాథ ప్రవృత్తౌ నాథ సంస్థితః | జగతః శల్యనిష్కర్షం కరోష్యసురసూదన || 6

నీయతాం పారిజాతో7యం కృష్ణ ద్వారవతీం పురీమ్‌ | మర్త్యలోకే త్వయా ముక్తే నాయం సంస్థాప్యతే భువి || 7

వ్యాస ఉవాచ

తథేత్యుక్త్వా తు దేవేంద్ర మాజగామ భువం హరిః | ప్రయుక్తైః సిద్ధగంధర్వైః స్తూయమాన స్తథర్షిభిః || 8

జగామ కృష్ణ స్సహసా గృహీత్వా పాదపోత్తమమ్‌ | తతః శంఖముపాధ్యాయ ద్వారకోపరి సంస్థితః || 9

ఇంద్రకృష్ణసంవాదము

వ్యాసుడిట్లనియె. భగవంతుడిట్లు దేవేంద్రునిచే బొగడొంది భావగంభీరముగ నవ్వి యిట్లుపలికెను. జగన్నాథా!నీవు దేవప్రభువవు. ఇంద్రుడవు. మేము మానవులము. నాచేసిన యీయపరాధము నీవు క్షమింపవలయు, ఈ పారిజాతతరువును యథాస్థానమునకుగొంపొమ్ము. సత్యభామవచనానుసారము నేనిద్ధానింగొనివచ్చితిని. నీచే విసరబడినయీవజ్రాయుధము పూజనీయము. దీనిని నీవే చేకొనుము. శత్రువులంజీల్చు నీప్రహరణము (ఆయుధము) నీదే. అన నింద్రుడిట్లనియె. స్వామి! నేను మర్త్యుడననిపలికి నన్ను తబ్బిబ్బు జేయనేల? భగవంతుడగునీవలని యనంత సౌఖ్యమును నెఱిగిన (రుచిమఱగిన) మేము నిన్నెఱుగదుము. జగన్నాథ! నీవెవ్వడవోయాతడే యగుదువుగాక! (నీస్వరూపమునుగూర్చి తర్కింప పనిలేదన్నమాట) అయినను ప్రవృత్తియందున్నావు. (నివృత్తియందు కేవలమునీవు సాక్షివి. కూటస్థ బ్రహ్మమయినను) జగత్కంటకుల నిష్కర్షను (= పెల్లగించివేయుటను) జేయుచున్నావు (దుష్టసంహారము కొఱకవతరించితివన్నమాట) కావున ఈపారిజాతమును ద్వారవతికిం గొంపొమ్ము. మర్త్య లోకమునీవు విడిచినతర్వాత నీవృక్షమట నుండదు. అన హరియు నింద్రునితో నట్లుకానిమ్మని యాతనితోడి సిధ్ధగంధర్వులు ఋషులునుం గొనియాడ భూలోకమున కేతెంచి ద్వారకానగరముపై నుండి శంఖముం పూరించి పురవాసుల కానంద మొదవించెను.

హర్షముత్పాదయామాస ద్వారకావాసినాం ద్వాజాః | అవతీర్యాథ గరుడా త్సత్యభామాసహాయవాన్‌ || 10

నిఘ్కటే స్థాపయామాస పారిజాతం మహాతరుమ్‌ | యమభ్యేత్యజనః సర్వో జాతిం స్మరతి పౌర్వికీమ్‌ || 11

వాస్యతే యస్య పుష్పాణాం గంధేనోర్వీ త్రియోజనమ్‌ | తత స్తే యాదవాః సర్వే దేవగంధర్వమానుషాన్‌ || 12

దదృశుః పాదపే తస్మిన్కుర్వతో ముఖదర్శనమ్‌ | కింకరైః సముపానీతం హస్త్వశ్వాది తతో ధనమ్‌ || 13

స్త్రియశ్చ కృష్ణో జగ్రాహ నరకస్య పరిగ్రహాత్‌ | తతః కాలే శుభే ప్రాప్త ఉపయేమే జనార్దనః || 14

తాః కన్యా నరకావాసా త్సర్వతో యాః సమాహృతాః | ఏకస్మిన్నేవ గోవిందః కాలేచా77సాం ద్విజోత్తమాః ||

జగ్రాహ విధివత్పాణీ న్పృథగ్దేహ స్స్వధర్మతః | షోడశస్త్రీసహస్రాణి శతమేకం తథా7ధికమ్‌ || 16

తావంతి చక్రే రూపాణి భగవాన్మధుసూధనః | ఏకైకశశ్చతాః కన్యా మేనిరే మధుసూదనమ్‌ || 17

మమైవ పాణిగ్రహణం గోవిందః కృతవానితి | నిశాసు జగతః స్రష్టా తాసాం గేహేషు కేశవః ||

ఉవాస విప్రాః సర్వాసాం విశ్వరూపధరో హరిః || 18

ఇతి శ్రీమహాపురాణ ఆదిబ్రాహ్మే శ్రీకృష్ణచరితే ఇంద్రకృష్ణసంవాద షోడశసహస్రస్త్రీ పరిగ్రహౌనామ చతురధికద్విశతతమో7ధ్యాయః

అవ్వల సత్యభామతో గరుడునిందిగి పారిజాత తరువును సత్యభామ పెరటిలో నాటించెను. నగరమందలి జనమాన్వర్గ తరవుందర్శించి పూర్వ జన్మస్మృతినందిరి. ఆపారిజాతముయొక్క పూవులవాసనచే మూడు యోజనములదాక పరిమళించుట మఱియు యాదవులెల్లరు నాతరువునందద్దమందువలె దమముఖదర్శనము సేయుటయేగాదు దేవగంధర్వమానుషుల నెల్లరనందు దర్శించిరి. ప్రాగ్జ్యోతిషమునుండి నౌకరులు గొనివచ్చిన ఏన్గులు గుఱ్ఱములు ధనము స్త్రీలను కృష్ణుడు నరకుని పరిగ్రహమునుండి గ్రహించెను. అవ్వలనొక సుమూహుర్తమందు నరకుని చెఱనుండి విడిచి రప్పింపబడిన యాకన్యలందఱను (అవివాహితలనన్నమాట) తనకులధర్మానుసారము పదునాఱువేలమీద నొకవందమందిని యథాశాస్త్రముగా పాణిగ్రహణ మొనరించుకొనెను. అయ్యెడ భగవంతుడాతడందఱ కన్నిరూపములందాల్చెను. అక్కన్యకలును నెక్కొక్కతె కొక్కొక్కనిగా గృష్ణుంభావించి ఎవరిమట్టుకువారు గోవిందుడు నాపాణియే గ్రహించి నాచేతినే చే నెసని యనుకొనిరి రాత్రులందు జగత్సృష్టికర్తయగు మాధవుడు యోగీశ్వరేశ్వరుండు గావున విశ్వరూపధరుండై యంతఱియిండ్ల నిన్నిరూపుల తానొక్కడే సంచరించెను.

ఇది బ్రహ్మపురాణమున కృష్ణచరిత్రమందు ఇంద్రకృష్ణ సంవాధము షోడశసహస్ర స్త్రీ పరిగ్రహము అను రెండువందలనాల్గవ యధ్యాయము.

Brahmapuranamu    Chapters