Brahmapuranamu    Chapters   

అథఏకాధికద్విశతతమో7ధ్యాయః

అనిరుద్ధవివాహేరుక్మివధనిరూపణమ్‌

వ్యాస ఉవాచ

చారుదేష్ణం సుదేష్ణం చ చారుదేహం చ శోభనమ్‌ | సుషేణం చారుగుప్తం చ భద్రచారుం తథా7పరమ్‌ || 1

చారువిందం (చంద్రం) సుచారుం చ చారుం చ బలినాం వరమ్‌ | రుక్మిణ్యజనయత్పుత్రా న్కన్యాం చారుమతీం తథా ||

అన్యాశ్చ భార్యాః కృష్ణస్య బభూవుః సప్త శోభనాః | కాళిందీ మిత్రవిందా చ సత్యా నాగ్నజితీ తథా || 3

దేవీ జాంబవతీ చాపి సదా తుష్టా తు రోహిణీ | మద్రరాజసుతా చాన్యా సుశీలా ళీలమండలా || 4

సత్రాజితీ సత్యభామా లక్ష్మణా చారుహాసినీ | షోడశాత్ర సహస్రాణి స్త్రీణామన్యాని చక్రిణః || 5

ప్రద్యుమ్నో7పి మహావీర్యో రుక్మిణ స్తనయాం శుభామ్‌ | స్వయంవరస్థాం జగ్రాహ సా7పి తం తనయంహరేః ||

తస్యామస్యా7భవత్పుత్రో మహాబలపరాక్రమః | అనిరుద్ధో రణ7రుద్ధో వీర్యోదధి రరిందమః || 7

తస్యాపి రుక్మిణః పౌత్రీం వరయామాస కేశవః | దౌహిత్రాయ దదౌ రుక్మీ స్పర్ధయన్నపి శౌరిణా || 8

తస్యా వివాహే రామాద్యా యాదవా హరిణా సహ | రుక్మిణః నగరం జగ్ము ర్నామ్నా భోజకటం ద్విజాః || 9

వివాహే తత్ర నిర్వృత్తే ప్రాద్యుమ్నేః సుమహాత్మనః | కళింగరాజ ప్రముఖా రుక్మిణం వాక్యమబ్రువన్‌ || 10

కళింగాదయ ఊచుః

అనక్షజ్ఞో హలీ ద్యూతే తథా7స్య వ్యసనం మహాత్‌ | తజ్జయామో బలం తస్మా ద్ద్యూతేనైవ మహాద్యుతే || 11

వ్యాస ఉవాచ

తధేతి తానిహ నృపాన్‌ రుక్మీ బలసమన్వితః | సభాయాం సహ రామేణ చక్రే ద్యూతం చ వైతదా || 12

సహస్రమేకం నిష్కాణాం రుక్మిణా విజితో బలః | ద్వితీయే దివసే చాన్య త్సహస్రం రుక్మిణాజితః || 13

తతో దశ సహస్రాణి నిష్కాణాం పణమాదదే | బలభద్ర ప్రపన్నాని రుక్మీ ద్యూతవిదాం వరః || 14

తతో జహాసాధ బలం కళింగాధివతి ర్ద్విజాః | దంతాన్విదర్శయన్మూఢో రుక్మీ చా77హ మదోద్ధతః || 15

రుక్మ్యువాచ

అవిద్యో7యం మహాద్యూతే బలభద్రః పరాజితః | మృషై వాక్షావలేపత్వా ద్యో7యం మేనే7క్షకోవిదమ్‌ || 16

దృష్ట్వా కళింగరాజంతు ప్రకాశదశనాననమ్‌ | రుక్మిణం చాపి దుర్వాక్యం కోపం చక్రే హలాయుధః || 17

వ్యాస ఉవాచ

తతః కోపపరీతాత్మా నిష్కకోటిం హలాయుధః | గ్లహం జగ్రాహ రుక్మీచ తత స్త్వక్షా నపాతయత్‌ || 18

అజయద్బల దేవో7థ ప్రాహోచ్చైస్తం జితం మయా | మమేతి రుక్మీ ప్రాహోచ్చై రలీకోక్తైరలం బలమ్‌ || 19

త్వయేక్తో7యం గ్ల హః సత్యం సమమైషో7నుమోదితః | ఏవం త్వయా చేద్విజితం స మయా విజితం కథమ్‌ ||

తతో7ంతరిక్షే వాగుచ్చైః ప్రాహ గంభీరనాదినీ | బలదేవస్య తం కోపం వర్థయంతీ మహాత్మనః || 21

ఆకాశవాగువాచ

జితంతు బలదేవేన రుక్మిణా భాషితం మృషా | అనుక్త్వా వచనం కించి త్కృతం భవతి కర్మణా || 22

అనిరుద్ధ వివాహమందు రుక్మివధ

వ్యాసులిట్లనియె. చారుదేష్ణుడు సుదేష్ణుడు చారుదేహుడు సుషేణుడు చారుగుప్తుడు భద్రచారుడు, చారుబిందుడు (చంద్రుడు), సుచారుడు. అనువారు రుక్మిణికుమారులు. చారుమతి యనునామె కుమార్తె. కృష్ణునకు మఱి యేడ్వురు భార్యలు కాళింది, మిత్రవింద, సత్య, నాగ్నజితి, జాంబవతి, నిత్యసంతుష్టయగు రోహిణి, మద్రరాజకుమార్తె యుత్తమ శీలముగలది యగు శీలమండల.

వీరుకాకపదహారువేలమంది భార్యలు హరికిగలరు. ప్రద్యుమ్నుడు రుక్మికూతురుని స్వయంవరమునగ్రహించెను. ఆమె అతనిని స్వయంవరమందే స్వీకరించెను. అతనికి నామెయందు ''అనిరుద్ధుడ''ను గుమారుడు గల్గెడు. యుద్ధములందు నిరోధించుటకు శక్యముగాని బలసమృద్ధుడగుట వలన నతనికాపేరువచ్చెను. వానికిరుక్మి పౌత్రినిమ్మని కోరెను. అతడును గృష్ణునితో స్పర్థబెట్టుకొన్నను దౌహిత్రునకిచ్చెను. ఆవివాహమందు బలరామాది యాదవులు రుక్మిరాజధానియగు ''భోజకటము''నకు కృష్ణునితో దరలివెళ్ళిరి. ప్రద్యుమ్నకుమారుని వివాహమచటనైన తరువాత కళింగరాజు మొదలైనవారు రుక్మింగని బలరాముడు పాచిక లాట నెరుగడు. కావున నతనిని జూదములోనే యోడింతమన రుక్మియారాజులం బిలిచి బలగము గూర్చుకొని సభయందు బలరామునితో జూదమాడెను. ఆయాటలో రుక్మి వెయ్యినిష్కముల పందెము గెలిచెను. రెండవరోజున మఱి వేయినిష్కములను గెలుచుకొనెను. ఆమీద పదివేల నిష్కములను బందెము గాసెను. అత్తఱి కళింగరాజు బలరాముని జూచి పండ్లు బయలుపడ పరిహాసపూర్వముగ నవ్వెను. అయ్యెడ రుక్మి చెలరేగి బలభద్రుడు జూదమాడుట నెరుగడు. కావున లేనియహంభావముతో నేను యాటగాడనని జూదమునకు సిద్ధపడినాడని గేలిచేసెను. హలాయుధుడు పండ్లుపైబడ నిగిలించిన కళింగరాజును బరిహసించుచు పేలిన రుక్మింజూచి కుపితుడై కోటినిష్కములను బందెమొడ్డి గెలిచెను. రుక్మి పాచికలను విసరిపారవేసెను. బలరాముడట్లు గెలిచి''గెలుపు నాదియని'' బిగ్గరగ బలికెను. ''గెలుపునాదని యబద్ధమాడకుమని'' యరచెను. నీవొడ్డిన పందెమునకు నేనామోదింపలేదు. ''ఇట్లు గెలుపు నీదగునేని నాదెందులకు గాదు'' అని రగడసేయుచుండ నాకాశవాణి గంభీరముగ బెద్దపెట్టున మహాత్ముడగు బలరాముని కోపముం బెంచుచు ''బలరాముడే గెలిచినాడు రుక్మిమాట యబద్ధము. ఏమియు బలుకక చేసినదియే చేసినట్లగును'' అనెను.

వ్యాస ఉవాచ

తతో బలః సముత్థాయ క్రోధ సంరక్త లోచనః | జఘానాష్టాపదేనైవ రుక్మిణం స మహాబలంః || 23

కళింగరాజం చా77దాయ విస్ఫురంతం బలాద్బలః బభంజ దంతాన్కుపితోయ యైః ప్రకాశం జహాససః || 24

అకృష్య చ మహాస్తంభం జాతరూనమయం బలః | జఘానయే తత్పక్షాస్తా న్భూభృతః కుపితో బలః || 25

తతో హాహా కృతం సర్వం పలాయనపరం ద్విజాః | తద్రాజమండలం పర్వం బభూవ కుపితో బలీ || 26

బలేన నిహతం శ్రుత్వా రుక్మిణం మధుసూదనః | నోవాచ వచనం కించి ద్రుక్మిణీ బలయోర్భయాత్‌ || 27

తతో7నిరుద్ధమాదాయ కృతోద్వాహం ద్విజోత్తమాః | ద్వారకామాజగామాథ యదుచక్రం సకేశవమ్‌ || 28

ఇతి శ్రీమహాపురాణ ఆదిబ్రాహ్మే అనిరుద్ధవివాహే రుక్మివధ నిరూపణం నామ ఏకాధిక ద్విశతతమో7ధ్యాయః

అంత బలకాముడు కోపముచే కన్నులెర్రబడ రుక్మిని కొట్టెను. ఎగిరెగిరి పడుచున్న కళింగ రాజును కూడ బలుడు బలముచే బట్టి, వేనిం దెరచి నవ్వెనో యాపండ్లనూడగొట్టెను. మఱియునాజూదమందికమందున్న బంగారుస్తంభమునులాగి వాని పక్షముననున్న రాజులను వైచెను. అంతట సభయంతటను హాహాకారము పుట్టి యారాజమండలమెల్ల బలాయనమయ్యెను. బలరాముడు కోపోద్రిక్తుడయ్యెను. రుక్మిబలునిచే హతుడగుట విని రుక్మిణికి బలరామునకుజడిసి మధువైరి యేమియు బలుక కుందెను. అవ్వల యదుసంఘము పెండ్లికుమారుని యనిరుద్ధునింగొని కేశవుని తోగూడ ద్వారకకు వచ్చెను.

ఇది బ్రహ్మపురాణమున ననిరుద్ధవివాహమున రుక్మివధయను రెండువందలఒకటవ యధ్యాయము.

Brahmapuranamu    Chapters