Brahmapuranamu    Chapters   

అథద్విశతతమో7ధ్యాయః

ప్రద్యుమ్నాఖ్యానమ్‌

మునయ ఊచుః

శంబరేణ హృతోవీరః ప్రద్యుమ్న స్స కథం పునః | శంబరశ్చ మహావీర్యః ప్రద్యుమ్నేన కథం హతః || 1

వ్యాస ఉవాచ

షష్ఠే7హ్ని జాతమాత్రేచ ప్రద్యుమ్నం సూతికాగృహాత్‌ | మమైష హంతేతి ద్విజా హృతవా న్కాలశంబరః || 2

నీత్వా చిక్షేప చైవైనం గ్రాహోగ్రే లవణార్ణవే | కల్లోలజనితావర్తే సుఘోరే మకరాలయే || 3

పతితం చైవ తత్రైకో మత్స్యో జగ్రాహ బాలకమ్‌ | న మమార చ తస్యాపి జఠరానలదీపితః || 4

మత్స్యబంధైశ్చ మత్స్యో7సౌ మత్స్యైరన్యైః సహ ద్విజాః | ఘాతాతో7సురవర్యాయ శంబరాయ నివేదితః || 5

తస్య మాయావతీ నామ పత్నీ సర్వగృహేశ్వరీ | కారయామాస సూదానా మాధిపత్యమనిందితా || 6

దారితే మత్స్యజఠరే దదృశే సా7తిశోభనమ్‌ | కుమారం మన్మథతరో ర్దగ్ధస్య ప్రథమాంకురమ్‌ || 7

కో7యం కథ మయం మత్స్యజఠరే సముపాగతః | ఇత్యేవం కౌతుకావిష్టాం తాం తన్వీం ప్రాహ నారదః || 8

నారద ఉవాచ

అయం సమస్త జగతాం సృష్ఠిసంహారకారిణా | శంబరేణ హృతః కృష్ణతనయః సూతికాగృహాత్‌ || 9

క్షిప్తస్సముద్రే మత్స్యేన నిగీరస్తే వశం గతః | నవరత్నమిదం సుభ్రు విస్రబ్ధా పరిపాలయ || 10

వ్యాస ఉవాచ

నారదేనైవ ముక్తా సా పాలయామాస తం శిశుమ్‌ | బాల్యాదేవాతిరాగేణ రూపాతిశయ మోహితా || 11

ప్రద్యుమ్నా ఖ్యానము

మునులనగా శంబరునిచే బ్రద్యుమ్నుడెట్లుహరింపబడెను. ప్రద్యుమ్నుడాశంబరుని సంహరించిన విధమేమి? తెలుపుడని వ్యాసుండిట్లనియె. ప్రద్యుమ్నుడు పుట్టినయాఱవనాడుకాలశంబరుడు. తనకీతడు హంతకుడనితలచియా శిశువునుపురిటింటనుండి కొంపోయిమొసళ్లచే భయంకరమైన సముద్రమున విసరివేసెను. ఆపడినశిశువు నొకచేపపట్టుకొనెను. దానిజఠరాగ్నికి గురి యయ్యు నా బాలుడు చావలేదు. జాలరులు వలవేయ నితర చేపలతో బాటు పట్టువడి శంబరునికి సమర్పింపబడియె. వాని భార్య మాయావతి యనునది వాని గృహయజమానురా లాచేపను వంటవానికీయ వాడది చీల్చి యాచేపకడుపున మున్ను దగ్ధుడైన మన్మథుడను వృక్షముయొక్క మొదటి మొలకను, పరమ సుందరుడగు శిశువుం జూచెను. ఎవడునీవు? చేపకడుపున కెట్లువచ్చెను! అని వెడుక పడుచున్న శంబరునిభార్యంగని నారదుడు; ఈ శిశువు సర్వసృష్టి సంహారములు సేయగల శంబరునిచే పురిటింట నుండి హరింపబడినవాడు. కృష్ణుని కుమారుడు సముద్రమున విసరబడి చేపమ్రింగగా నీకుదక్కినాడు. ఇది మానవరత్నము. శ్రద్ధగ కాపాడుమని తెల్పెను. ఆమెయట్లే యా బాలుని సౌందర్యాతిశయమునకు మోహపడి యనురక్తితో బెంచెను.

స యదా ¸°వనాభోగభూషితో7భూద్ద్విజోత్తమాః | సాభిలాషా తదా సాతు బభూవ గజగామినీ || 12

మాయావతీ దదౌచాసై#్మ మాయా సర్వా మహాత్మనే | ప్రద్యుమ్నాయా77త్మభూతాయ తన్న్యస్త హృదయేక్షణా ||

ప్రసజ్జంతీం తు తామాహ స కార్‌ష్ణిఃః కమలలోచనః |

ప్రద్యుమ్న ఉవాచ

మాతృభావం విహాయైవ కిమర్ధం వర్తసే7న్యథా ||

వ్యాస ఉవాచ

సా చాసై#్మ కథయామాస స పుత్త్రస్త్వం మమేతి వై | తనయం త్వామయం విష్ణోర్హృతవాన్కాలశంబరః || 15

క్షిప్తః సముద్రే మత్స్యస్య సంప్రాప్తో జఠరాన్మయా | సాతు రోదితి తే మాతా కాంతా7ద్యాప్యతివత్సలా || 16

ఆ బాలుడు నిండు ¸°వనము గనియామెవానికి తనమాయనంతనుచెప్పెను. వానియందు హృదయము చూపులు నిలిపి ప్రవర్తించుండ ప్రద్యుమ్నుడు, మాతృభావము విడిచి మరొక తీరున నాయెడలనీవేలప్రవర్తించున్నాపనియడిగెను. ఆమెయు నీవు నాకు కుమారుడవు కావు. విష్ణుకుమారుడవైన నిన్ను కాలశంబరుడు హరించి సముద్రమున విసనగా నొక చేప కడుపునుండి నాకు లభించితివి. నిన్నుగన్న తల్లి నీకొఱకిప్పుడును నేడ్చుచున్నది.

వ్యాస ఉవాచ

ఇత్యుక్తః శంబరం యుద్ధే ప్రద్యుమ్నస్స సమాహ్వయత్‌ | క్రోధాకులీకృతమనా యుయుధే చ మహాబలః || 17

హత్వా సైన్యమశేషం తు తస్య మాధవః | సప్త మాయా వ్యతిక్రమ్య మాయాం సంయుయుజే7ష్టమీమ్‌ ||

తయా జఘాన తం దైత్యం మాయయా కాలశంబరమ్‌ | ఉత్పత్య చ తయా సార్ధ మాజగామ పితుః పురమ్‌ ||

అంతఃపురే చ పతితం మాయావత్యా సమన్వితమ్‌ | తం దృష్ట్వా హృష్టసంకల్పా బభూవుః కృష్ణయోషితః || 19

రుక్మిణీ చాబ్రవీత్ప్రేమాణ77 సక్తదృష్టి రనిందితా || 20

అది విని కోపముగని మనసు వికలమై ప్రద్యుమ్నుడు శంబరునియుధ్ధమునకు బిలిచెను. మరియు వానిసైన్యమెల్ల గూల్చి ఏడురకముల మాయలను దాటి ఎనిమిదవ విధమైన మాయనుప్రయోగించి యాశంబరాసురునిజంపెను. ఆమాయావతితో నెగిరి తండ్రి పురమునకు వచ్చెను. అంతఃపురమందు వ్రాలి మాయావతితో గూడియున్న యాతనిని జూచి కృష్ణపత్నులు సంతోషించిరి. రుక్మిణియును ప్రీతితో నతనిపై చూపు నిలువ నిట్లనియె.

రుక్మిణ్యువాచ

ధన్యాయాః ఖల్వయం పుత్రో వర్తతే నవ¸°వనే | అస్మిన్వయసి పుత్రో మే ప్రద్యుమ్నో యది జీవతి || 21

సభాగ్యా జననీ వత్స త్వయా కా7పి విభూషితా | ఆథవా మాదృశః స్నేహో మమ యాదృగ్వపుశ్చ తే || 22

హరే రపత్యం సువ్యక్తం భవాన్వత్స భవిష్యతి ||

వ్యాస ఉవాచ

ఏతస్మిన్నంతరే ప్రాప్తః సహకృష్ణేన నారదః | అంతఃపురవరాందేవీం రుక్యిణీం ప్రాహ హర్షితః || 23

శ్రీకృష్ణ ఉవాచ

ఏషతే తనయః సుభ్రు హత్వా శంబరమాగతః | హృతో యేనాభవత్పూర్వం పుత్రస్తే సూతి కాగృహాత్‌ || 24

ఇయం మాయావతీభార్యా తనయస్యాస్య తే సతీ | శంబరస్య న భార్యేయం శ్రూయతా మత్ర కారణమ్‌ || 25

మన్మథే తు గతే నాశం తదుద్భవ పరాయణా | శంబరం మోహయామాస మాయారూపేణ రుక్మిణి! || 26

వివాహాద్యుపభోగేషు రూపం మాయామయం శుభమ్‌ | దర్శయామాస దైత్యస్య తస్యేయం మదిరేక్షణా || 27

కామో7వతీర్ణః పుత్రస్తే తస్యేయం దయితా రతిః | విశంకా నాత్ర కర్తవ్యా స్నుషేయం తవ శోభనా || 28

వ్యాస ఉవాచ

తతో హర్షసమావిష్టౌ రుక్మిణీకేశవౌ తదా | నగరీ చ సమస్తా సా సాధు సాధ్వి త్యభాషత || 29

చిరం సష్టేన పుత్రేణ సంగతాంప్రేక్ష్యరుక్మిణీమ్‌ | అవాప విస్మయం సర్వో ద్వారవత్యాం జనస్తదా || 30

ఇతి శ్రీమహాపురాణ ఆదిబ్రాహ్మే శంబరహృతప్రద్యుమ్నాగమనవర్ణనం నామ ద్విశతతమో7ధ్యాయః

ఏ ధన్యురాలి తనయుడో యీతడు నవ¸°వన మందున్నాడు. నా కుమారుడు ప్రద్యుమ్నుడే కనుక జీవించి యుండిన ఈ వయసులో నుండెడివాడు. నాయనా! నీచేత సొంపుగన్న యా కన్నతల్లి యదృష్టవంతురాలు. అదిగాక నీ ప్రేమ నీ శరీరము నీ యాకారము సరిగా నన్ను పోలియున్నది. స్పష్టముగ నీవు హరి కుమారుడవే అగుదువు అనేను. ఇంతలో కృష్ణునితో గూడ నారదుడేతెంచి అంతఃపురాంగనల కెల్ల మిన్నయైన రుక్మిణీదేవిని చూచి హర్షముతో కల్యాణీ! మున్ను పురిటింటనుండి హరించిన యా శంబరాసురుని చంపి వచ్చిన యీతడు నీ బిడ్డడే. ఈ మాయావతి పతివ్రత. ఆ నీకుమారుని భార్య. శంబరుని భార్య కాదు. దానికి కారణమిదిగో వినుము. మన్మథుడు పోయిన తరువాత నాతని పునర్జన్మ కోరుచు మాయారూపమున వివాహాది భోగములందు శంబరుని ఈమె తబ్బిబ్బు సేసెను. మన్మథుని పత్నియే యీమె. ఆ దైత్యునికి మాయారూపమును జూపినది. నీ కుమారుడు మన్మథుడు తిరిగి యవతరించినాడు. ఆతని ప్రాణప్రియ రతియే యీమె. శంకింపకుము. ఈ పరమ కల్యాణి నీ కొడలు. అన రుక్మిణీకృష్ణులు ఆనందభరితులైరి. ద్వారకా నగరమెల్ల బాగుబాగని హర్షించినది. చిరకాలము క్రిందట బోయిన కుమారునితో కూడుకొనిన రుక్మిణిని చూచి ద్వారకానగరజనమెల్ల విస్మయము జెందెను.

ఇది శ్రీ బ్రహ్మపురాణమున శంబరుడు హరించిన ప్రద్యుమ్నుని పునరాగమనమను రెండువందల అధ్యాయము.

Brahmapuranamu    Chapters