Brahmapuranamu    Chapters   

అథపంచనవత్యధికశతతమో7ధ్యాయః

జరాసం ధేనసహ రామజనార్దన యుద్ధవర్ణనమ్‌

వ్యాస ఉవాచ

జరాసంధసుతే కంస ఉపయేమే మహాబలః | అస్తిం ప్రాప్తించ భోవిప్రా స్తయోర్భర్తృహణం హరిమ్‌ || 1

మహాబలపరీవారో మాగదాధిపతి ర్బలీ | హంతు మభ్యాయ¸°కోపాజ్జరాసంధః సయాదవమ్‌ || 2

ఉపేత్య మథురాం సో7థ రురోధ మగధేశ్వరః | అక్షౌహిణీభిః సైన్యస్య త్రయోవింశతిభిర్వృతః || 3

విష్క్రమ్యాల్ప పరీవారా వుభౌ రామజనార్దనౌ | యుయుధాతే సమంతస్య బలినౌ బలసైనికైః || 4

తతోబలశ్చ కృష్ణశ్చ మతించక్రే మహాబలః | ఆయుధానాం పురాణానామాదానే మునిసత్తమాః || 5

అనంతరం చక్రశార్జే తూణౌచాప్యక్ష¸° శ##రైః | ఆకాశాదాగతౌవీరౌతదాకౌమోదకీ గదా || 6

హలంచబలభద్రస్య గగనాదాగమత్‌ కరమ్‌ | బలస్యాభిమతం విప్రాః సునందం ముశలంతథా || 7

తతోయుద్థేపరాజిత్యస సైన్యం మగధాధిపమ్‌ | పురీం వివిశతుర్వీరా వుభౌ రామజనార్దనౌ || 8

వ్యాసుడిట్లనియె.

మగదాధిపతి జరాసంధుని కూతుండ్రను అస్తిప్రాప్తి అనువారిని కంసుడు పెండ్లాడెను. వారిభర్తను జంపినాడని యాదవుడైనహరిని దానుజంపుటకు జరాసంధుడు కోపముగొని వచ్చెను. వచ్చిమథురను ముట్టడించెను. వానితో నిరువది మూడ క్షౌహిణులుసేన యుండెను. బలరామకృష్ణు లల్పపరివారముతో వాని బలముతోబోరిరి. కొంతసేపటికి హలియు హరియు తమ పురాణాయుధములను జేకొనవలెనని సంకల్పించిరి. సంకల్పమాత్రమున చక్రము శార్జము (విష్ణుధనస్సు) అక్షయ బాణములుగల యమ్ముల పొదులు రెండు కౌమోదకియను గదయు నింగినుండి అవ్వీరుల దరికేతెంచెను. బలరాముని నాగలికూడ గగనమునుండి యాతని చేతికండెను. మరియు నతని కిష్టమైన సునందమను ముసలాయుధము (రోకలి) గూడ బలరాముని కరమునం జేరెను. అవ్వల యుద్ధమున సేనతో మగధరాజునోడించి యవ్వీరులు వారిపురముం జొచ్చిరి.

జితే తస్మిన్‌ సుదుర్వృత్తే జరాసంధే ద్విజోత్తమాః | జీవమానే గతేతత్ర కృష్ణోమేనే న తం జితమ్‌ || 9

పునరప్యా జగామాథ జరాసంథో బలాన్వితః | జితశ్చరామకృష్ణాభ్యామపకృత్వ ద్విజోత్తమాః || 10

దశ చాష్టౌచ సంగ్రామా నేవ మత్యంతదుర్మదః | యదుభిర్మాగధోరాజాచక్రే కృష్ణపురోగమైః || 11

సర్వేష్వేవచ యుద్ధేషు యదుభిః స పరాజితః | అపక్రాంతోజరాసంధః స్వల్పసైన్యై ర్బలాధికః ||12

తద్బలం యాదవానాంవై రక్షితం యదనేకశః | తత్తు సంనిథి మహాత్మ్యం విష్ణోరంశస్య చక్రిణః || 13

మనుష్యధర్మశీలస్య లీలాసా జగతః పతేః | అస్త్రాణ్యనేక రూపాణి య దరాతిషు ముంచతి || 14

మనసైవ జగత్‌ సృష్టిం సంహారం తు కరోతి యః | తస్యారిపక్షక్షపణ కియా నుద్యమవిస్తరః || 15

తథాపిచ మనుష్యాణాం ధర్మస్తదనువర్తనమ్‌ | కుర్వన్‌ బలవతా సంధిం హీనై ర్యుద్ధం కరోత్యసౌ || 16

సామచోపప్రదానం చ తథా భేదం చ దర్శయన్‌ | కరోతి దండపాతంచక్వచి దేవ పలాయనమ్‌ || 17

మనుష్యదేహినాం చేష్టామిత్యేవమనువర్తతే | లీలా జగత్పతే స్తస్య చ్ఛందతః సంప్రవర్తతే || 18

ఇతి శ్రీ బ్రహ్మపురాణ శ్రీకృష్ణ చరితే పంచనవత్యధిక శతతమో7ధ్యాయః

ఆదుష్టుడు ఓడిపోయెంగాని బ్రతికిపోయెనని కృష్ణుడు వానిం గెలిచినట్లు కాదనుకొనెను. వాడు బలముంగూర్చికొని మఱలవారిపై దిఱుగబడెను. అప్పుడు వారిచేతిలోవాడు జితుడయ్యె. దుర్మదమున నాతడిట్లు పదునెన్మిది దండయాత్రలు సేసి మాగధుడు కృష్ణముఖ్యులతో యాదవులతో బోరి అల్పావశిష్టమైన సైన్యముతో వెనుదిరిగి పోవుచుండెను. అన్నింటను యాదవసైన్యము పెక్కుతీరుల సురక్షితమగుట కేవలము చత్రియగు విష్ణునంశముయొక్క సాన్నిధ్యప్రభావమే. అది యాజగత్పతియొక్క మానుషావతార లీలా విలాసమే. మనసుచేతనే జగమ్ముల సృష్టి సంహారములు సేయు భగవంతుడు శత్రువులపై ననేకములయిన యస్త్రములను విడచుట శత్రుపక్షక్షయమునకై సేయు ప్రయత్నవిస్తరమది యెంత పాటిది? అయినను మానవులకు మానవధర్మానువర్తనము ధర్మము కావున నీకృష్ణుడును బలవంతులతో సంధియుదక్కువారితోవిగ్రహమును నీమహినుభావుడు చేయును.

సామదాన భేదోపాయములు ప్రదర్శించి తుదకు దండోపాయముపయోగించి యొకప్పుడు పలాయనమును (పారి పోవుటను) గావించును. లీలా మానుషమూర్తియగు నాజగత్ప్రభువు స్వేచ్చానుసారము వర్తిచును. మానవశరీరుల చేష్టను గూడ యిట్లనువర్తించును.

ఇది బ్రహ్మపురాణమున కృష్ణచరిత్రలోని నూటతొంబదియైదవ యధ్యాయము.

Brahmapuranamu    Chapters