Brahmapuranamu    Chapters   

అథద్వినవత్యధికశతతమో7ధ్యాయః

అక్రూరప్రత్యాతగమనమ్‌

వ్యాస ఉవాచ

చింతయన్నితి గోవింద ముపగమ్య సయాదవః | అక్రూరో7స్మీతి చరణౌ ననామ శిరసా హరేః | 1

సో7ప్యేనం ధ్వజవజ్రాబ్జ కృతచిహ్నేన పాణినా | సంస్పృ శ్యాకృష్య చప్రీత్యా సుగాఢం పరిషస్వజే || 2

కృతసంవదనౌ తేన యథావద్బలకేశవౌ | తతః ప్రవిష్టౌ సహసా తమాదాయా7త్మమందిరమ్‌ || 3

సహ తాభ్యాం తదా7క్రూరః కృతసంవదనాదికః | భుక్తభోజ్యో యథాన్యాయ మాచచక్షే తత స్తయోః || 4

యథా నిర్భర్త్సిత స్తేన కంసే నా7నకదుందుభిః | యథాచ దేవకీదేవీ దానవేన దురాత్మనా || 5

ఉగ్రసేనే యథాకంసః స దురాత్మాచ వర్తతే | యంచై వార్థం సముధ్దిశ్య కంసేన స విసర్జితః || 6

తత్సర్వం విస్తరాచ్ఛ్రుత్వా భగవాన్‌ కేశిసూదసః | ఉవా చాఖిల మేతత్తు జ్ఞాతం దానపతే మయా || 7

కరిష్యేచ మహాభాగ యదత్రౌపయికం మతమ్‌ | విచింత్యం నాన్యథైత త్తే విద్ధి కంసం హతం మయా || 8

అహం రామశ్చ మథురాం శ్వో యాస్యావః సమంత్వయా | గోపవృధ్థాశ్చ యాస్యంతి అదా యోపాయనం బహు || 9

నిశేయం నీయతాం వీర న చింతాం కర్తుమర్హసి | త్రిరాత్రాభ్యంతరే కంసం హనిష్యామి సహానుగమ్‌ || 10

అక్రూరుని తిఱిగిరాక

వ్యాసుడిట్లనియె.

ఇట్లా యాదవు డక్రూరుడు గోవిందుని దలచుచువచ్చి నేనక్రూరుడనని పేరుసెప్పికొని తలవాంచి హరికి నమస్కరించెను. (గోత్రనామములు సెప్పికొని నమస్కరించుట విశిష్టగౌరముపాత్రులగురువులకు దైవసమానులయెడజేయదవలసిన లక్షణము శాస్త్రీయము.) శ్రీహరియు ధ్వజవజ్రపద్మచిహ్నములుగల హస్తముచే నక్రూరుందాకి దరికిదీసికొని ప్రీతితో గాఢాలింగనముసేసికొనెను. బలరామకృష్ణు లాతనితో కుశలసంభాషణాదులు నెఱిపి వెంటనే యాతనింజేకొని తమమందిరమునం బ్రవేశించిరి. అతడును వారితో ముచ్చటలాడుచు విందారగించి సముచితముగ వారికి దావచ్చిన విశేషముం దెలిపెను. కంసుడు దేవకీవసుదేవులను బెదరించుట తనతండ్రియగు నుగ్రసేమనియెడ నతడు వర్తించుతీరు తన్నెందులకు కంసుడు పంపెనో యావిషయము నెల్లను నాతడుతెలుప విని కేశిసంహారకుడగు భగవంతుడుదానపతీ! (ఓ అక్రూరా)ఇదెల్ల నాకు దెలిసినది. ఇందేమియుచితమో యదియా లోచించి చేసెదను. ఓ మహానుభావ! నీవింకొకలాగను కొనకుము. నాచే కంసుడు హతుడయినట్లే తెలియుము. నేనును నన్నయ్య బలరాముడును నీతో రేపు మథురకు వత్తుము. గోపవృద్ధులు గూడ యుపాయనములం బెక్కింటినిగొని వత్తురు. ఈరేయి విశ్రమింపుము. చింతింపంబనిలేదు మూడేరాత్రులలోగా గంసుని పరివారముతో సంహరింతునని కృష్ణుడు పల్కెను.

గోపికాపరితాపః

వ్యాస ఉవాచ

సమాదిశ్య తతో గోపా నక్రూరో7పి సకేశవః | సుష్వావ బలభద్రశ్చ నందగోపగృహే గతః || 11

తతః ప్రభాతే విమలే రామకృష్ణా మహాబలౌ | అక్రూరేణసమం గంతు ముద్యతౌ మథురాం పురీమ్‌ || 12

దృష్ట్వా గోపీజనః సాస్రః శ్లథద్వలయబాహుకః | నిశ్వసంశ్చాతాదుఃఖార్తః ప్రాహచేదం పరస్పరమ్‌ || 13

మథురాంప్రాప్యగోవిందః కథం గోకులమేష్యతి | నాగరస్త్రీకలాలాపమధు శ్రోత్రేణ పాస్యతి || 14

విలాసివాక్యాజాతేషు నాగరీణాం కృతాస్పదమ్‌ | చిత్త మస్య కథం గ్రామ్యగోపగోపీషుయాస్యతి || 15

సారం సమస్తగోష్ఠస్య విధినా హరతా హరిమ్‌ | ప్రహృతం గోప యోషిత్సు నిర్ఘృణన దురాత్మనా || 16

భావగర్భస్మితం వాక్యం విలాసలలితా గతిః | నాగరీణా మతీవై తత్‌ కాటాక్షేక్షితమేవతు || 17

గ్రామ్యో హరి రయం తాసాం విలాసనిగదైర్యతః | భవతీనాం పునః పార్శ్వం కయా యుక్త్యా సమేష్యతి || 18

ఏషోహి రథమారుహ్య మథురాం యాతికేశవః | అక్రూర క్రూరకేణాపి హతాశేన ప్రతారితః || 19

కింన వేత్తి నృశంసో7య మసురాగపరంజనమ్‌ | యేనే మమక్షరాహ్లాదం నయ త్యన్యత్ర నోహరిమ్‌ || 20

ఏష రామేణసహితః ప్రయాత్యత్యంతనిర్ఘృణః | రథమారుహ్య గోవింద స్త్వర్యతా మస్యవారణ || 21

గురూణామగ్రతో వక్తుం కిం బ్రవీషిన నః క్షమమ్‌ | గురవః కింకరిష్యంతి దగ్ధానాం నిరహాగ్నినా || 22

నందగోపముఖా గోపా గంతుమేతే సముద్యతాః | నోద్యమం కురుతే కశ్చిత్‌ గోవిందవినివర్తనే || 23

సుప్రభాతాద్య రజనీ మథురావాసియోషితామ్‌ | యాసా మచ్యుత వక్త్రాబ్జే యాతి నేత్రాణి భోగ్యతామ్‌ || 24

ధన్యాస్తే పథి యే కృష్ణమితో యాంత మవారితాః | ఉద్వహిష్యంతి పశ్యంతః స్వదేహం పులకాంచితమ్‌|| 25

మధురానగరీ పౌరనయనానాం మహోత్సవః | గోవిందవదనాలోకా దతీవాద్య భవిష్యతి || 26

కోను స్వప్నః సభాగ్యాభి ర్ధృష్టస్తాభి రథోక్షజః | విస్తారి కాంతనయనా యా ద్రక్షం త్వనివారితమ్‌ || 27

ఆహో! గోపీజనస్యాస్య దర్శయిత్వా మహానిధిమ్‌ | ఉద్ధృతా న్యద్య నేత్రాణి విధాత్రా7కరుణాత్మనా || 28

అనురాగేణ శైథిల్య మస్మాను వ్రజతో హరేః | శైథిల్య ముపయాం త్యాశు కరేషు వలయాన్యపి || 29

అక్రూరః క్రూరహృదయః శీఘ్రంప్రేరయతే హయాన్‌| ఏవమార్తాసు యోషిత్సు ఘృణా కస్య నజాయతే|| 30

హే హే కృష్ణరథస్యో చ్చైశ్చక్రరేణు ర్నిరీక్ష్యతామ్‌ | దూరీకృతో హరి ర్యేన సో7పి రేణు ర్నలక్ష్యతే || 31

ఇత్యేవ మతిహార్దేన గోపీజననిరీక్షితః | తత్యాజ వ్రజభూభాగం సహ రామేణకేశవః || 32

అక్రూరుడు నారాత్రి గోపకులకుంజెప్పి కృష్ణునితో బలభద్రునితో నందునిమందిరమున నిదురించెను. బలశాలురగు రామకృష్ణు లవ్వల సుప్రభాతమునం దక్రూరునితో మధురకేగ సన్నద్ధులైరి. గోపికలది చూచికన్నులనీర్నిండ దుఃఖమునంజిక్కి ముంజేతుల గంకణములుజార నిటూర్పుపుచ్చుచు నొండొరులతో నిట్లనుకొనిరి. గోవిందుడు మధురకేగి మరివ్రేపల్లె కెట్లు రాగలడు. ఆనాగరికసుందరుల అవ్యక్తమధురభాషణయధుధారల వీనులం గోలును. ఆ నగరకాంతల మెరమెచ్చులముచ్చటలందిరపుకొన్న యీతని చిత్త మిక నీపల్లెంగల గొల్ల పడుచుల వంక కెట్లు తిఱుగును. ఈగోష్ఠముయొక్క (వ్రేపల్లెయుక్క) సమగ్రసారమైన హరినిట్లు హరించుకొని పోవు నాపాడు దైవము నిర్థయమై గోపాంగనలసర్వస్వము దోచుకొన్నాడు. పరిహాసభాంగర్భితమైనయాపలుకు లాయొయ్యారపునడక లానెఱజాణలు మధురాపురీ సుందరుల యవ్వాల్చూపుటురులం జిక్కి ఈ పల్లెటూరిదేవయ్య మీప్రక్కకు మఱి యేయుక్తిని రాగలడు. పేరుమాత్రమున కక్రూరుడయిన యీ క్రూరునిచే నీహతాశునిచే మోసగింపబడి యిదెమాధవుడు రథమెక్కి మధురకేగుచున్నాడు. ఈనీచుడింతయెరుగడా యీతనిపైవలపుగొన్న యీజనమునుతఱుగనితఱితీవుగొని మఱగిన మనసామిని హరిని గొంపోవుచున్నాడు. ఇతడో! దయమాలి రమ్మన్నదే తడవుగ నివ్వనమాలి హలితో వీనివెంటంబడి రథమెక్కి (ఎన్నడునెక్కని రథమెక్క నుబలాటవడి కాబోలు) చనుచున్నాడు. వలదని వారింపం ద్వరపడుదము? పెద్దలయెదుటంబడి మా కేదిగతి ఏమందు వని మొరవెట్టుదము. ఆ పెద్దవాండ్రు మాత్రము విరహాగ్నిచే గ్రాగుమన కేమిసేయగలరు? నందగోపుడు మున్నుగానిచె వీరును ప్రయాణ సన్నద్దులగుచున్నారు. గోవిందునిమఱలింప నొక్కరే నిందు యత్నించుట లేదు. మథురావాసులగు విలాసినుల కీరేయి యిపుడు సుప్రభాతము. అచ్యుతునిముఖారవిందమునకా సుందరులకనుగవలు భోగ్యవస్తువులుకాగలవు.(అనగా కృష్ణు డాపడతుల వాల్చూపులసొంపులననుభవించు నన్నమాట)ఇటనుండి కృష్ణుడేగుచుండ దారిలోనిలిచియెవ్వరు వలదువలదని వారింపబడక స్వేచ్ఛగానాసొగసుగానిసొగసుగనినెమ్మేనంబులకింతురో యయ్యింతులుధన్యులుగదె. గోవిందవదనారవిందసందర్శనమున నిపుడు మధురాపురపౌరులనయనముల కిదియొక మహోత్సవము గానున్నది. కనులంతంతలు సేసికొని యేయభ్యంతరములేకుండ భాగ్యవతులగు నాపుర యువతులధోక్షజుంజూడనున్నారిది యొక కలగాదుగదా? ఈగోపికల కొకపెన్నిధిం జూపించినయవ్విధి(బ్రహ్మ) యింతలో జాలిమాలి మనకన్నులందిగనడచినాడు. మాధవునెడననురాగముననతడేగుటకు మనయందు శైథిల్యమేర్పడ(ఏకీలునకాలుపట్టువిడుచుండ)మాతోబాటు మాముంజేతులనున్న వలయములును(కంకణములు) పట్టుదప్పి జారిపోవు చున్నవి. అక్రూరుడు క్రూరహృదయుడు, అల్లదె గుఱ్ఱములను త్వరత్వరగా దోలుచున్నాడు. ఇట్లార్తలై యలమటించు నబలలపైనెవ్వనికిందయ పుట్టదు? ఓఓకృష్ణా! అల్లదె రథచక్రములరేగిన రేణువరదముపై గ్రమ్మినదిచూడుడు. దానహరిదూరము సేయబడినాడు ఆరేణువుగూడ గనబడుబలేదు అని యిట్లు హార్దమైనభావముతో గోపికలలమటింప నెవరికి జాలి కలుగదు!

గచ్ఛంతో జవనాశ్వేన రథేన యమునాతటమ్‌ | ప్రాప్తా మధ్యాహ్నసమయే రామాక్రూరజనార్దనాః || 33

అథాహకృష్ణ మక్రూరో భవద్భ్యాం తావదాస్యతామ్‌ | యావత్కరోమి కాలింద్యామాహ్నికార్హణ మంభసి || 34

తథేత్యుక్తే తతః స్వాచాంతః స మహామతిః | దధ్యౌ బ్రహ్మ పరం విప్రాః ప్రవిశ్య యమునాజలే || 35

ఫణాసహ స్రమాలాఢ్యం బలభద్రం దదర్శ సః | కుందమాలాంగ మున్ని ద్రపద్మపత్రాయతేక్షణమ్‌ || 36

వృతం వాసుకిడింభౌఘై ర్మహద్భిః పవనాశిభిః | సంస్తూయమానం సద్గంథివనమాలావిభూషితమ్‌ || 37

దధానమసితే వస్త్రేచారురూపావతంసకమ్‌ | చారుకుండలిసం మత్త మంతర్జలతలే స్థితమ్‌ || 38

తస్సోత్సంగే ఘనశ్యామ మాతామ్రాయతలోచనమ్‌ | చత్సుర్బాహు ముదారాంగం చక్రాద్యాయుధ భూషణమ్‌ || 39

పీతే వసానం వసనే చిత్రమాల్యవిభూషితమ్‌ ? శక్రచాపతటిన్మాలా విచిత్రమివతోయదమ్‌ || 40

శ్రీవత్సవక్షసం చారుకేయూర ముకుటోజ్జ్వలమ్‌ | దదర్శ కృష్ణమక్లిష్టం పుండరీకావతంసకమ్‌ || 41

సనందనాద్యైర్మునిభిః సిద్ధయోగై రకల్మషైః | సంచింత్యమానం మనసా నాసాగ్రన్యస్తలోచనైః ||42

జవనాశ్వమ్మగురథమునం జని బలరామకృష్ణులు నక్రూరుండును మధ్యాహ్నమునకు యమునా తీరమును జేరిరి. అంతట నక్రూరుడు తామిద్దరు నిట గూర్చుండుడు. నేనీకాళిజలములం దాహ్నికకృత్యము నొనరింతుననియె. వారట్లేయన నతడు యమునా జలములం జొచ్చి యాచమించి స్నానముసేసి పరబ్రహ్మాముం ధ్యానించెను. అన్నీటిలో నతడయ్యెడ వేయిపడగలతో నున్నశేషునిగ బలరాముం దర్శించెను. అతడు మల్లెదండవంటి శరీరము ధరించి తామరరేకులట్లున్న కన్నులలో వాసుకిగన్నడింభకులు పవనభక్షులు చుట్టునుండి స్తుతింప వనమాలం దాల్చి నల్లనివస్త్రముందాల్చి చక్కని అవతంసముతో (శిరోభూషణముతో) నింపైన కుండలములుదాల్చి నీటిలోనుండం గనెను. ఆతని యొడిలో మేఘశ్యాముని అంతటనెఱ్ఱనగు కన్నులు గలవానిని నలుచేతలు గలవానిని ఉన్నత శరీరుని చక్రాద్యాయధధారిని పీతాంబరో త్తరీయముల రంగరంగుల పూలమాలలదాల్చి ఇంద్రధనుస్సు మెఱపుదీగలతోడి విచిత్రమగు తోయదము(మేఘము) వలె నున్న వానిని శ్రీవత్సాంకితవక్షుని చక్కని భుజకీర్తులు కీరీటమందాల్చి మిఱుమిట్లు గొల్పుచున్నవానిని తెల్లదామరపువ్వు సిగపూవుధరించియున్న యానందమూర్తిని గృష్ణుని పుణ్యులగు సనకసనందనాది సిద్దయోగులు ముక్కుగొనం జూవువిలిపి మనస్సుచే ధ్యానించు వానిని గృష్ణునిం గనెను.

బలకృష్ణా తదా7క్రూరః ప్రత్యభిజ్ఞాయ విస్మితః | ఆచింతయదథో శీఘ్రం కథ మత్రాగతావితి || 43

వివక్షోః స్తంభయామాస వాచం తస్య జనార్దనః | తతో నిష్క్రమ్య సలిలా ద్రథమభ్యాగతః పునః ||44

దదర్శ తత్ర చైవోభౌ రథస్యోపరి సంస్థితౌ | రామకృష్ణా యథాపూర్వం మనుష్యవపుషా77న్వితౌ || 45

నిమగ్నశ్చ పునస్తోయే దదృశే స తథైవ తౌ | సంస్తూయమానౌ గంధర్వైర్ముని సిద్ధ మహోరగైః || 46

తతో విజ్ఞాతసద్భావః సతు దానపతి స్తదా | తుష్టావ సర్వవిజ్ఞానమయ మచ్యుత మీశ్వరమ్‌ || 47

అయ్యెడ నక్రూరుడు వీరు బలరామకృష్ణులని దెలిసికొని యాశ్చర్యపడి యావెంటనె వీరెట్లిచ్చటికివచ్చినారని యాలోచించెను. పలుకబోయిన యాతని వాక్కును హరి స్తంభింపజేసెను. అంతట నాతడు నీరువెడలి వెలికేగుదెంచి రథమునందుమ నయ్యిరుపురం దర్శించెను. మునీపటీయట్ల వారు మానవులట్లు ప్రాకృతరూపమున గోచరించురి. తిణిగి యతడు నీటనుమునిగి మున్నట్లవ్రాకృతదివ్యమూర్తుల నందుగనియె. గంధర్వులు మునులు సిద్ధులు నాగులు నయ్యిద్దఱ నయ్యెడ స్తుతించుచుండం జూచెను. అంత నద్దానపతి (అక్రూరుడు) సర్వసత్తా స్వరూపము నెఱింగికొని సర్వవిజ్ఞానమయుడగు నచ్యుతు నీశ్వరుని స్తుతించెను.

అక్రూరకృత స్తవః

అక్రూర ఉవాచ

తన్మాత్రరూపిణ7చింత్యమహిమ్నే పరమాత్మనే | వ్యాపినే నైకరూపైకస్వరూపాయ నమో నమః || 48

శబ్ధరూపాయ తే7చింత్య హవిర్భూతాయ తే నమః | నమో విజ్ఞాన రూపాయ పరాయ ప్రకృతేః ప్రభో ||49

భూతాత్మా చేంద్రియాత్మా చ ప్రధానాత్మా తథా భవాన్‌ | ఆత్మా చ పరమాత్మా చ త్వమేకః పంచధాస్థితః || 50

ప్రసీద సర్వధర్మాత్మన్‌ క్షరాక్షర మహేశ్వర | బ్రహ్మ విష్ణు శివాద్యాభిః కల్పనాభిరుదీరితః || 51

ఆనాఖ్యేయస్వరూపాత్మ న్ననాఖ్యేయ ప్రయోజన | అనాఖ్యేయాభిధాన త్వాం నతోస్మి పరమేశ్వరమ్‌ || 52

న యత్ర నాథ విద్యంతే నామజాత్యాది కల్పనాః | తద్ర్బహ్మ పరమం నిత్య మవికారి భవానజః || 53

న కల్పనామృతే7ర్ధస్య సర్వస్యా ధిగమోయతః | తతః కృష్ణాచ్యుతానంత విష్ణుసంజ్ఞాభిరీడ్యసే || 54

సర్వాత్మన్త్వమజ వికల్పనాభిరే తైర్దేవా స్త్వం జగదఖిలం త్వమేవ విశ్వమ్‌ |

విశ్వా త్మన్‌త్వమసివికారభేదహీనః సర్వస్మి న్నహి భవతో7స్తి కించిదన్య(ంయ) త్‌ || 55

త్వం బ్రహ్మా పశుపతిరర్యమా విధాతాత్వం ధాతా త్రిదశపతిః సమీరణో7గ్నిః |

తోయేశో ధనపతి రంతకృత్త్వ మేకో భిన్నాత్మా జగదపి పాసి శక్తి భేదైః || 56

విశ్వం భవాన్‌సృజతి హంతి గభస్తి రూపోవిశ్వం చ తే గుణమయో7య మజ ప్రపంచః

రూపం పరం సదితివాచక మక్షరం యజ్ఞానాత్మనే సదసతే ప్రణతో7స్మి తసై#్మ || 57

ఓం నమో వాసుదేవాయ నమ స్సంకర్షణాయచ | ప్రద్యుమ్నాయ నమస్తుభ్య మనిరుద్ధాయ తేనమః || 58

వ్యాస ఉవాచ

ఏవమంతర్జలే కృష్ణమభిష్టూయ స యాదవః | ఆర్చయామాస సర్వేశం ధూపపుషై#్ప ర్మనోమయైః || 59

పరిత్యజ్యాన్యవిషయం మన స్తత్ర నివేశ్య సః | బ్రహ్మభూతే చిరం స్థిత్వా విరరామ సమాధితః || 60

కృతకృత్య మివా77త్మానం మన్యమానో ద్విజోత్తమాః | ఆజగామ రథం భూయో నిగమ్య యమునాంభసః || 61

రామకృష్ణౌ దదర్శాథ యథాపూర్వ మవస్థితౌ | విస్మితాక్షం తదా7క్రూరం తం చ కృష్ణో7భ్యభాషత || 62

శ్రీకృష్ణ ఉవాచ

కింత్వయా దృష్టమాశ్చర్య మక్రూర యమునాజలే | విస్మయోత్ఫుల్లనయనో భవాన్‌ సంలక్ష్యతే యతః || 63

అక్రూర స్తవము

పంచతన్మాత్ర రూపుడు ఊహింప నలవిగాని మహిమ గలవాడు సర్వవ్యాపకుడు అనేక రూపుడు నైనవాడు నగు పరమాత్మకునమస్కారము. శబ్దరూపము హవిస్స్వరూపము విజ్ఞానరూపము నైనవానికి బ్రకృతికంటె పరునికి నమస్కారము. భూతాత్మయు నింద్రియాత్మయు ప్రధానాత్మయునీవే. ఆత్మయు (జీవుడు) పరమాత్మయునీవే. ఇట్లు నీవోక్కడవే యైదుగా నున్నావు. క్షరము (సర్వభూతము) అక్షరము (కూటస్థుడు) సర్వధర్మ మూర్తిని బ్రహ్మవిష్ణు శివాది నానావిధ కల్పనలచే బిలువబడు నీవు ప్రసన్నుడవుకమ్ము. నీస్వరూపము పలుక నలవిగానిది. నీవేమి ప్రయోజనము గలవాడనో తెలుపశక్యముగాదు. నీయభిదాన మిదియని చెప్పవశముగాదు. అట్టి పరమేశ్వరుని నిన్ను గూర్చి వినతుడనయ్యెదను. నామముజాతి మొదలైన కల్పన లెందులేవో అట్టి పరబ్రహ్మము నిత్యము అవికారి అజమునైనది నీవే. కల్పనగాకుండ సకల పదార్ధము అందదుగావున కృష్ణఅచ్యుత విష్ణునామములచే (కల్పనలచే) నీవు స్తుతింపబడుచున్నావు.

నీవు సర్వమునకాత్మవు. వికల్పనములచే నీవే దేవతలు విశ్వమును. ఓవిశ్వాత్మ! నీవు వికారభేదము లేనివాడవు. అంతట నీకంటే వేరొకటి యించుకయులేదు. నీవు బ్రహ్మవు పశుపతివి అర్యముడవు (సూర్యుడు) విధాతవు ధాతవు ఇంద్రుడవు వాయువు అగ్నివి. జలాధిపతి వరుణుడవు. ధనేశుడవు (కుబేరుడు) నీవు. అంతము చేయువాడు (యముడు) నీవు. ఒక్కడయ్యు భిన్న భిన్న శక్తులచే భిన్నభిన్న రూపుడవై జగత్తును రక్షించుచున్నావు. కిరణ రూపమున నీవు జగత్తును సృజించి హరింతువు. ఈవిశ్వము పంచభూత వికారము. గుణమయము. సత్‌అను శబ్దమున కర్ధమైన పరము స్వరూపము అక్షరమునై సదసద్రూపుజ్ఞానరూపునగునీకు నమస్కారము. వాసుదేవుడవు సంకర్షణుడవు ప్రద్యుమ్నుడవు అనిరుద్దుడవునగు నీకు నమస్కారము(చతుర్వ్యూహాత్మాకమైన పరమాత్మకు నమస్కారము) . అనియిట్లు నీళ్లలో కృష్ణునిం బొగడి యయ్యాదవుడు మనస్సుచేత గల్పింపబడిన ధూపదీప పుష్పాదులచే షోడశోపచారములచే శ్రీహరి నర్చించెను. మానసిక పూజచేసెనన్నమాట. ఇతర విషయముల విడిచి మనస్సును కృష్ణరూప పరబ్రహ్మ మందునిచి చిరకాలమునకు సమాధినుండి విరమించెను. తనును గృతార్ధునిగ భావించి యమునా జలములనుండి వెడలిమరల రథముదరికి వచ్చెను. వచ్చి రామకృష్ణులనుముంటివోలె నున్నవారింగాంచెను. ఆశ్చర్యము నంజూచునక్రూరునితో గృష్ణుడు యమునాజలమున నీవేమి వింత చూచితివి నీకన్నులాశ్చర్య వికసితములైనవని యనగ నక్రూరుండిట్లనియె.

అక్రూర ఉవాచ

అంతర్జలే యదాశ్చర్యం దృష్టం తత్ర మయాచ్యుత | తదత్రైవ హి పశ్చామి మూర్తిమత్పురతః స్థితమ్‌ || 64

జగదేతన్మమహాశ్చర్య రూపం యస్యమహాత్మనః | తేనా77శ్చర్యపరేణాహం భవతా కృష్ణ సంగతః || 65

తత్కిమేతేన మథురాం ప్రయామో మధుసూదన | బిభేమి కంసాద్ధిగ్జన్మ పరపిండోప జీవినః || 66

వ్యాస ఉవాచ

ఇత్యుక్త్వా చోదయామాస తాన్‌ హయాన్వాతరంహనః | సంప్రా ప్తశ్చాపి సాయాహ్నేసో7 క్రూరోమథురాం పురీమ్‌ ||

విలోక్య మథురాం కృష్ణం రామం చ77హ స యాదవః || 67

అచ్యుతా! నీళ్ళలో నేనేమి వింత గన్గొంటినో యది యిచటనే రూపొంది నాముందర గనుగలదు. ఈజగచ్చిత్రమేమహాత్మనిచే యాశ్చర్యరూపమై యున్నదో అట్టి యాశ్చర్యములకవధియైన నీతో నేనిపుడు గూడికొన్నాను. ఈవింతతో మనము మధురకు వెళ్ళుదమా! కంసునకు నేనుజడియుచున్నాను. ఛీ!ఛీ! పరులు పెట్టినపిండముచే బ్రతుకువానిజన్మమేమి జన్మము. అనివాయువేగమున రథాశ్వములను దోలెను. సాయాహ్నామున కక్రూరుడు మధురం బ్రవేశించెను. మధురంగని బలరామకృష్ణులతో నాతడిట్లనియె.

అక్రూర ఉవాచ

పద్భ్యాం యాతం మహావీర్యౌ ర థేనైకో విశామ్యహమ్‌ | గంతవ్యం వసుదేవస్య నో భవద్భ్యాం తథా గృహే ||

యువయో ర్హి కృతేవృద్ధః కంసేన స నిరస్యతే || 68

వ్యాస ఉవాచ

ఇత్యుక్త్వా ప్రవివేశాసావక్రూరో మధురాం పురీమ్‌ | ప్రవష్టౌ రామకృష్ణౌ చ రాజమార్గముపాగతౌ|| 69

స్త్రీభిర్నరైశ్చ సానందలోచనై రభివీక్షితౌ | జగ్మతు ర్లీలయా వీరౌ ప్రాప్తౌ బాలగజావివ || 70

భ్రమమాణౌ తు తౌ దృష్ట్వా రజకం రంగకారకమ్‌ | అయాచేతాం సురూపాణి వాసాంసి రుచిరాణి తౌ || 71

కంసస్య రజకః సో7థ ప్రసాదారూఢ విస్మయః | బహున్యాక్షేప వాక్యాని ప్రాహోచ్ఛై రామకేశవౌ || 72

తత స్తల ప్రహారేణ కృష్ణ స్తస్య దురాత్మనః | పాతయామాస కోపేన రజకస్య శిరోభువి || 73

హత్వా77దాయ చ వస్త్రాణి పీతనీలాంబరౌతతః | కృష్ణరామౌ ముదాయుక్తా మాలాకార గృహం గతౌ || 74

వికాసినేత్రయుగలో మాలాకారో7తివిస్మితః | ఏతౌ కస్య కుతో యాతౌ మనసా7చింతయ త్తతః || 75

పీతనీలాంబరధరౌ దృష్ట్వా7తి సుమనోహరౌ | స తర్కయామాస తదా భువం దేవా పుపాగతౌ || 76

వికాసిముఖపద్మాభ్యాం తాభ్యాం పుష్పాణి యాచితః | భువం విష్టభ్య హస్తాభ్యాం పస్పర్శ శిరసామహీమ్‌ || 77

ప్రసాద సుముఖౌనాథౌ మమ గేహముపాగతౌ | ధన్యో7హ మర్చయిష్యామీత్యాహ తౌ మాల్యజీవికః || 78

తతః ప్రహృష్టవదన స్తయోః పుష్పాణికామతః| చారూణ్యతాని చైతాని ప్రదదౌస విలోభయన్‌ || 79

పునః పునః ప్రణమ్యాసౌ మాలాకారో త్తమో దదౌ | పుష్పాణి తాభ్యాం చారూణి గంధవంత్యమలాని చ || 80

మాలాకారాయ కృష్ణో7పి ప్రసన్నః ప్రదదౌవరమ్‌ | శ్రీస్త్వాం మత్సంశ్రయా భద్ర న కదాచిత్త్యజిష్యతి || 81

బలహాని ర్నతే సౌమ్య ధనహాని రథాపివా | యావద్ధరణిసూర్యౌ చ సంతతిః పుత్రపౌత్రికీ || 82

భుక్త్వా చ విపులాన్‌ భోగాం స్త్వమంతే మత్ప్రసాదతః | మమానుస్మరణం ప్రాప్య దివ్యలోకమవాప్స్యసి || 83

ధర్మే మనశ్చ తే భద్ర సర్వకాలం భవిష్యతి | యుష్మత్సంతతి జాతానాం దీర్ఘమాయుర్భవిష్యతి || 84

నోపసర్గాదికం దోషం యుష్మత్సతంతి సంభవః | ఆవాప్స్యతి మహాభాగ యావత్సూర్యో భవిష్యతి || 85

వ్యాస ఉవాచ

ఇత్యుక్త్వా తద్గృహాత్కృష్ణో బలదేవ సహాయవాన్‌ | నిర్జగామ మునిశ్రేష్టా మాలాకారేణ పూజితః || 86

ఇతి శ్రీ బ్రహ్మపురాణ7క్రూర ప్రత్యాగమనం నామ ద్వినవత్యధికశతతమో7ధ్యాయః

మీరిరువురు నడచిరండు. నేను రథమున నొక్కడనే నగరముం బ్రవేశింతును. మీరు వసుదేవు గృహమున కేగకుడు మీ నిమిత్తమున నావృద్ధుని గంసుడు లేవగొట్టును. అని యక్రూరుండొక్కడేమధురంజొచ్చెను. రామకృష్ణులు రాజమార్గమున వచ్చిరి. స్త్రీల పురుషులయానంద భరితములైన చూపులం జూడబడుచు వారువాలాసముగ నేనుగుగున్నలట్లు రాజవీధిలో నడచిరి. అచట నట్టిట్టు దికుగుచువారొకచాకలింజూచి చక్కని చలువమడతల నిమ్మని యడిగిరి. వాడు కంసుని చాకలి గివున మిగుల విస్మయమంది రామకృష్ణులంగూర్చి యాక్షేపవాక్యములు పెక్కులు బిగ్గఱగా నరచెను. అంతట గిమకగొని కృష్ణుండరచేతం గొట్టివాని తలను బుడమింబడ గొట్టెను. వానింజంపి పీతనిలాంబరులు కృష్ణుడు రాముడును నాబట్టలంగొని ముదమున మాలాకారునింటికింజనిరి. చక్కని వారింగని వాడు దేవతలవనికిందిగిరని యెంచి మోములు వికసింపవారు పువ్వులిమ్మని యడిగినంతట చేతులంబుడమిందాతలతో నేలనంటి ప్రసన్న సుముఖులై ప్రభువులు నాయింటికి వచ్చితిరి నేను ధన్యుడను. మిమ్మర్చించెదనని యామాల్యజీవిగండు పలికి హర్షవదనుడై పరమళించు చక్కని పువ్వులేరియేరి మురిపించుచు మఱిమఱి మ్రొక్కి యాపెద్దమపిషి కోరి వారికికాన్కవెట్టెను. కృష్ణుడును బ్రసన్నుడై మాలాకారునికివరమిచ్చెను. ఓభద్రుడా! (శుభలక్షణాయన్నమాట) నన్నాశ్రయించిన సిరి నిన్నెప్పుడునువిడువదు. నీబలమునకు హానిగలుగదు. ఓ మంచివాడ! ధనహానియు నీకుగలుగదు. నీవు విపులము లైన భోగము లనుభవించి తుదకు నాప్రసాదము వలన నా అనుస్మరణమంది దివ్యలోక మందెదవు. నీమన సెల్లవేళల ధర్మమునందుండగలదు. నీసంతతికి బుట్టినవారికి దీర్ఘాయువు గల్గును. నీసంత సూర్యుడున్నంత కాలమెట్టి యిబ్బందులకు లోనుగాదు అని యిట్లుపల్కి మాలాకారుని పూజగొని వాని యింటినుండి కృష్ణుడు బలదేవునితోడుగా బయలు వెడలెను.

ఇది శ్రీబ్రహ్మపురాణమునందు అక్రూర ప్రత్యాగమనము అను నూట తొంబది రెండవయధ్యాయము.

Brahmapuranamu    Chapters