Brahmapuranamu    Chapters   

అథ ఏకనవత్యధికశతమో7ధ్యాయః

బాలకృష్ణచరితే అక్రూరగమనవర్ణనమ్‌

వ్యాస ఉవాచ

అక్రూరో7పి వినిష్ర్కమ్యస్యందనే నా77శుగామినా | కృష్ణసందర్శనాసక్తః ప్రయ¸° నందగోకులమ్‌ || 1

చింతయామాస చాక్రూరో నాస్తి ధన్యతరోమమ | సో7హ మంశా వతీర్ణస్య ముఖం ద్రక్ష్యామి చక్రిణః || 2

అద్యమే సఫలం జన్మ సుప్రభాతాచ మేనిశా | య దున్ని ద్రాబ్జపత్రాక్షం విష్ణో ర్ద్రక్ష్యామ్యహం ముఖమ్‌ || 3

పాపం హరతి యత్పుంసాం స్మృతం సంకల్పనామయమ్‌ | తత్పుండ రీకనయనం విష్ణో ర్ద్రక్ష్యామ్యహంముఖమ్‌ || 4

నిర్జగ్ముశ్చ యతో వేదా వేదాంగాన్యఖిలాని చ | ద్రక్ష్యామి తత్పరంధామ దేవానాం భగవన్ముఖమ్‌ || 5

యజ్ఞేషు యజ్ఞపురుషః పురుషైః పురుషోత్తమః | ఇజ్యతేయో7ఖిలాధార స్తం ద్రక్ష్యామి జగత్పతిమ్‌ || 6

ఇష్ట్వా య మింద్రో యజ్ఞానాం శ##తే నామరరాజతామ్‌ | అవాప త మనంతాది మహం ద్రక్ష్యామి కేశవం || 7

నబ్రహ్మా నేంద్ర రుద్రాశ్వివస్వాదిత్యమరుద్గణాః | యస్య స్వరూపం జానంతి స్పృశత్యద్య స మాంహరిః || 8

సర్వాత్మా సర్వగః సర్వః సర్వభూతేషు సంస్థితః | యోభవ త్యవ్యయో వ్యాపీ వీక్ష్యతే సమయాహరిః || 9

మత్య్సకూర్మవరాహాద్యైః సింహరూపాదిభిః స్థితమ్‌ | చకార యోగతోయోగం స మా మాలాపయిష్యతి || 10

సాంప్రతం చ జగత్స్వామీ కార్యజాతేవ్రజే స్థితిమ్‌ | కర్తుం మనుష్యతాం ప్రాప్తః స్వేఛ్ఛాదేహధృ గవ్యయః || 11

యో7నంతః పృథీవీం ధత్తే శిఖరస్థితిసంస్థి తామ్‌ | సో7వతీర్ణో జగత్కార్యే మామక్రూరేతి వక్ష్యతి || 12

పిత్రబంధు సుహృద్భాతృ బంధుమిత్రమయీమిమామ్‌ | యన్మాయాం నాలముత్తర్తుం జగ త్తసై#్మ నమోనమః || 13

తరంత్యవిద్యాం వితతాం హృది యస్మిన్ని వేశితే | యోగమాయామిమాం మర్త్యాస్తసై#్మ విద్యాత్మనే నమః || 14

యజ్ఞభుగ్యజ్ఞపురుషో వాసుదేవశ్చ శాశ్వతైః | వేదాంతవేదిభిర్వష్ణుః ప్రోచ్యతే యో నతో7స్మి తమ్‌ || 15

తథా తత్ర జగద్ధామ్ని ధార్యతే చ ప్రతిష్టితమ్‌ | సదసత్త్వం స స త్త్వేన మయ్యసౌ యాతు సౌమ్యతామ్‌ || 16

స్మృతే సకలకల్యాణభాజనం యత్ర జాయతే | పురుషప్రవరం నిత్యం వ్రజామి శరణం హరిమ్‌ || 17

వ్యాసులిట్లనిరి.

అక్రూరుడు గమనవేగముగలరథమున వెడలి కృష్ణదర్శనానక్తిచే నందగోకులమున కేగెను. ఏగుచు ద్రోవలో నాకన్న ధన్యతముడు లేడు. హరియంశమున నవతరించిన యాచక్రప్రాణి నెమ్మోము జూడనున్నాను. ఇపుడు జన్మము సఫలమైనది. ఈరాత్రి సుశోభనముగ చెల్లవారినది. విచ్చినతామరరేకులట్లు కన్నులుగలయా విష్ణుముఖమును దర్శింపనున్నాను. దేనిం దలచికొన్న భావము పోవునో యట్టి పుండరీకనయనుని నెమ్మోము నిప్పుడు జూడనున్నాను. ఎందుండి యెల్లవేదములు వేదాంగములు వెలువడినవో దేవతల కెల్లనెయ్యది పరంధామమో యట్టి భగవంతునిముఖము చూడబోవుచున్నాను. యజ్ఞములందు యజ్ఞపురుషునిగ పురుషులచే పురుషోత్తముడుగనే సర్వాధార మూర్తి యజింపబడునో యట్టి జగద్భర్తను జూడనున్నాను. నూరుయజ్ఞములయందెవ్వని నుపాసించి యింద్రుడు దేవేంద్రపదవి నందెనో యట్టి యంతువడని యాదిగలస్వామిని గేశవుని గననున్నాను. బ్రహ్మయింద్రరుద్రాశ్వినీవసుఆదిత్య మరుద్గణము లెవ్వని రూపమెరుగరో యట్టి హరి నన్ను దాకుచున్నాడు. సర్వముసుందానై సర్వభూతములందుండి సర్వమగు సర్వవ్యాపి యిపుడు నాకు గనబడుచున్నాడు. మత్స్య కూర్మవరాహనారసింహా ద్యవతారయోగమును యోగముచేత నొనరించిన యా దేవుడు నన్నిపుడు పలుకరింప నున్నాడు. అవ్యయుడైన హరి జగత్ర్పభువు ఇపుడు వ్రేపల్లెయందునికిజేయ స్వేచ్ఛాశరీరధారియై మనుష్యరూపమొంది స్థితికార్య నిర్వహణమునకు వచ్చియున్నాడు. ఏ యనంతుడు శిఖరాదివిశిష్ట పృథివిని ధరించునో యా దేవుడు జగత్కార్య నిర్వహణమునకు నవతరించిన మహానుభావుడు అక్రూరయని నోరార నన్నుబిలువనున్నాడు. తండ్రి బంధువు చెలి తమ్ముడు అన్నయను జుట్టరికములతో నల్లుకొని యున్న జగత్తు ఎవ్వనిమాయచే దాట శక్యమగాదో యట్టి మాధవునికి నమస్కారము. ఎవ్వడు హృదయముమందు బ్రవేశించినంతట మర్త్యులు (మరణ స్వభావం గలవారు) సువిస్తరమైన యవిద్యను యోగమాయను దాటుదురో యట్టి కేవలజ్ఞానస్వరూపుడై నవానికి నమస్కారము. యజ్ఞభోక్త యజ్ఞపురుషుడు వాసుదేవుడు అని యెవ్వడు వేదాంత మెరిగినవారిచేత గీర్తంపబడునో యట్టి విష్ణువునకు నేను వినతుడనయ్యెదను. జగధారుడగు నా పరమాత్మయందు నిలుపబడి సరసద్రూప జగత్తు ధరింనబడుచున్నది. అట్టి స్వామి నాయెడల ప్రసన్నుడగుగాక! నరుడెవ్వని స్మరణమాత్రమున సకల కల్యాణభాజనమగునో యట్టి పురుషోత్తముని హరిని నిత్యము శరణోందెను.

వ్యాస ఉవాచ

ఇత్థం స చింతయన్‌ విష్ణుం భక్తినమ్రాత్మమానసః | అక్రూరో గోకులం ప్రాప్తః కించిత్సూర్యే విరాజతి || 18

స దదర్శ తదా తత్ర కృష్ణమాదోహనే గవామ్‌ | వత్సమధ్యగతం పుల్లనీలోత్పలదలచ్ఛవిమ్‌ || 19

ప్రపుల్లపద్మపత్రాక్షం శ్రీవత్సాంకితపక్షసమ్‌ | ప్రలంబబాహు మాయామతుం గోరస్థల మున్నసమ్‌ || 20

సవిలాసస్మితాధారం బిభ్రాణం ముఖపంకజమ్‌ | తుంగర క్తనఖం పద్భ్యాం ధరణ్యాం సుప్రతిష్ఠితమ్‌ || 21

బిభ్రాణం వాససీ పీతే వన్యపుష్పవిభూషితమ్‌ | సాంద్రనీలలతాహస్తం పితాంభోజావతంసకమ్‌ || 22

హంసేందకుందధవలం నీలాంబరధరం ద్విజాః | తస్యాను బలభద్రం చ దదర్శ యదునందనమ్‌ || 23

ప్రాంశుముత్తుంగబాహుం చ వికాశిముఖపంకజమ్‌ | మేఘమాలాపరివృతం కైలాసాద్రి మివాపరమ్‌ || 24

తౌ దృష్ట్వా వికసద్వక్త్రసరోజః స మహామతిః | పులకాంచిత సర్వాంగ స్తదా7క్రూరో 7 భవద్విజాః || 25

యఏతత్సరమం ధామ ఏత త్తత్పరమం పదమ్‌ | అభవద్వాసుదేవో7సౌద్విధా యో7యం వ్యవస్థితః || 26

సాఫల్యమక్షోర్యుగపన్మమాస్తు దృష్టే జగద్ధాతరి హాసముచ్చైః |

అప్యంగ మేత ద్భగవత్ర్పసాదాద్దృత్తాంగసంగే ఫలవ ర్త్మ తత్న్యాత్‌ || 27

అథైవ స్పృష్ట్వా మమహ స్తపద్మం కరిష్యతి శ్రీమదనంతమూర్తిః ||

యస్యాంగులిస్పర్శహతాఖిలాఘైరవాప్యతే సిద్ధి రమత్తమా సరైః || 28

తథా7శ్విరుద్రేంద్ర వసుప్రణీతాదేవాః | ప్రయచ్ఛంతి వరం ప్రహృష్టాః |

చక్రం ఘ్నతాదైత్యపతేర్హృతాని దైత్యాంగనానాం నయనాంజనాని || 29

యంత్రాంబు విన్యస్య బలి ర్మనోజ్ఞానవాప భోగాన్వసుధాతలస్థః ||

యథా7మరేశ స్త్రిదశాధిపత్యం మన్వంతరం పూర్ణ మవాప శక్రః | 30

అథాపిమాం కంసపరిగ్రహేణ దోషాస్పదీభూత మదోషయుక్తమ్‌ |

కర్తా స మానోపహితం ధిగస్తు యస్యాత్మనః సాధు బహిష్కృతోయః || 31

జ్ఞానాత్మ కస్యాఖిలసత్వరాశే ర్వ్యా వృత్త దోషస్యసదా7స్ఫుటస్య

కింవా జగత్యత్ర సమస్త పుంసా మజ్ఞాత మస్యాస్తి హృదిస్థితస్య | 32

తస్మాదహం భక్తి వినమ్రగాత్రో వ్రజామి విశ్వేశ్వర మీశ్వరాణామ్‌ |

అంశావతారం పురుషోత్తమస్య అనాదిమధ్యాంత మజస్య విష్ణోః || 33

ఇతి శ్రీ బ్రహ్మపురాణ కృష్ణచరితే అక్రూరగమన వర్ణనం నామ నవత్యధికశతతమో7ధ్యాయః

అని యిట్లు భక్తినమ్రమైన తన మనస్సుతో విష్ణువునిదలచుచు నక్రూరు డించుకపొద్డుండగనే గోకులముంజేరెను. అతడచట నావులపాలుబిదుకుచునున్న కృష్ణుని దూడలమధ్యనున్న వానిని ప్రపుల్ల పద్మపత్రాక్షుని శ్రీవత్సాంకితవక్షుని యాజాను బాహుని నెత్తైన వెడదయురముగలవాని నున్నతవాసుని సవిలాసమందహాస భరిత వదనారవిందుని నెత్తై మెరుపుజిందునఖములతో పీతాంబరము నుత్తరీయముందాల్చి వనమాలాభూషితుడై తెల్లదామరపూవు శిరమునందాల్చియున్న హరిని యక్రూరుడు సందర్శించెను. హంసవలె చందమామవలె మొల్లలవలె తెల్లనై నల్లని వలువదాల్చిన యదునందనుని బలభద్రు నాకృష్ణునివెనుక జూచెను. అతడున్నతుడు ఉన్నతబాహువులుగలవాడు సవికాసమైనముఖారవిందముగలవాడునై మేఘములగుంపుతో నలముకొన్న మఱొక కైలాస పర్వతమట్లున్న బలరామ మూర్తినిగాంచెను. ఆ యిద్దరిని జూచి యమ్మతిమంతుడు ముఖపద్మము విప్పార మేనెల్లగగుర్పోడువ నక్రూరుడు ఇది పరంధామము. ఇదియే యాపరముపదము. ఇదే యవ్వాసుదేవడిరుతెరగులై యిచట నున్నాడు.

అజగద్విధాత దర్శనమున నాకనుగవ సాఫల్యమందుగాక! నన్ను గౌగలించికొని నించు ఆ అవ్యాజమైన యా నవ్వు అభగవంతుని ప్రసాదమే అది నాసర్వార్థ సిద్దికి మార్గమగుగాక!

ఎవ్వడు కొనవేలస్పృశించిన మాత్రన సర్వపాపములు తూలిపడునట్టి యానంతమూర్తినాహన్తపద్మమును శ్రీమంతమును శోభావంతమును జేయును. దాన నింద్రమరుద్రుద్రాశ్విని దేవతలందఱు నాయెడ బ్రసన్నులై వరమ్ములిత్తురా? ఎవ్వడు దైత్యరాజ బలమును చంపి భార్యల కనుల గాటుకల నెల్లందుడిచివైచె నెవ్వని చేతిలో దానధార వోసి యవనిపైనుండియే అమరలోకేంద్రభోగముల నందెనో ఎవ్వనింగొలిచి ఇంద్రుడు మన్వంతరముదాక స్థిరమైయుండు స్వర్గ సామ్రాజ్యాధిపత్యము నంచెనో అట్టి సాక్షాద్భగవంతుడు కంసుని పరిగ్రహముచే (నన్నుతన వానిగా మిత్రకోటిలోనికి స్వీకరించుటచే) దోషమునకు స్థానమైనట్టియు నిర్దోషినై అత్మ బహిష్కరింపబడినట్టి దురభిమానినినగు నన్ను గూర్చి నిందయగుగాక!(నన్నునేనే ఛీ యనుకొనవలసి యున్నదన్నమాట) కేవల జ్ఞానమై సత్వనిధియై యదోషియై అందరును సులభముగా దేటపడక అందరి హృదయము లందునుండెడి ప్రభువునకీ జగమునం దెలియని దేమున్నది? అందువల్ల భక్తిచే మోమువంచి యీశ్వరులకెల్ల నీశ్వరుడైన యావిశ్వేశ్వరుని అనాది మధ్యావసానుడు అజుడునగు విష్ణువుయొక్క ఆ యంశావతార మూర్తిని దర్శింప నేగెదను.

ఇది బ్రహ్మ పురాణమునందు అక్రూరగ మనవర్ణనము నూటతొంభై యొకటవ యధ్యాయము.

Brahmapuranamu    Chapters