Brahmapuranamu    Chapters   

నవత్యుత్తరశతతమో7ధ్యాయః

కేశివధనిరూపణమ్‌

వ్యాస ఉవాచ

కకుద్మిని హతే7రిష్టే ధేనుకేచ నిపాతితే | ప్రలంబే నిధనం నీతే ధృతే గోవర్ధనాచలే || 1

దమితే కాలియే నాగే భ##గ్నే తుంగద్రుమద్వయే | హతాయాం పూతనాయాం చ శకటే పరివర్తితే || 2

కంసాయనారదః ప్రాహ యథావృత్తమనుక్రమాత్‌ | యశోదాదేవకీ గర్భపరివర్తాద్య శేషతః || 3

శ్రుత్వా తత్సకలం కంసో నారదాద్దేవదర్శనాత్‌ | ననుదేవంప్రతి తదా కోపం చక్రేస దుర్మతిః || 4

సో7తికోపా దుపాలభ్య సర్వయాదవసంసది | జగర్హే యాదవాంశ్చాపి కార్యం చైతదచింతయత్‌ || 5

యావ న్న బలమారూఢౌ బలకృష్ణౌ సుబాలకౌ | తావదేవ మయా వధ్యా వసాధ్యౌ రూఢ¸°వనౌ || 6

చాణూరోత్ర మహావీర్యో ముష్టికశ్చ మహాబలః | ఏతాభ్యాం మల్ల యుధ్దేతౌ ఘాత యిష్ట్యామి దుర్మదౌ || 7

ధనుర్మహమహాయాగవ్యాజేనా77నీయ తౌవ్రాజత్‌ | తథా తథా కరిష్యామియాస్యతః సంక్షయం యథా || 8

వ్యాస ఉవాచ

ఇత్యాలోచ్య స దుష్టాత్మా కంసోరామజనార్ధనౌ | హంతుం కృతమతి ర్వీరమక్రూరం వాక్యమబ్రవీత్‌ || 9

వ్యాసుడిట్లనియె. అరిష్టధేనుకాదిరాక్షసులు హతులుగాగా గోవర్ధనోద్దరణము జరుగనారదుండు సని కంసునకు యశోదాగర్భము మార్పు మొదలైన విశేషములశేషము నివేదించెను. వినికంసుడు వసుదేవునిపై పగబట్టెను. యాదవ సభలో యాదవులను దుయ్యబట్టి తనలో నిట్లాలోచించెను.

బాలురైన బలరామకృష్ణులను బలవంతులు కాకుండనే నేనువధింపవలయును. ¸°వనమొందిన తరువాత వారసాధ్యులయ్యెదరు. ఇక్కడ చాణూరుడు ముష్టికుడును. మంచిబలశాలురు. వీరితో నాబాలురకు మల్లయుద్దముపెట్టి యాదుర్మదులను జంపెదగాక! ధనుర్యాగమును మిషపెట్టి వ్రేపల్లెనుండి వారలరావించి వారు గడతేఱుట కెట్లెట్లు సేయవలెనో యట్లు సేసెద. అనితలచి యాదుష్టు డొకనిశ్చయమునకువచ్చి అక్రూరునితో నిట్లనియె.

కంస ఉవాచ

భోభో దానపతే వాక్యం క్రియతాం ప్రీతయేమమ | ఇతః స్యందన మారుహ్య గమ్యతాం నందగోకులమ్‌ || 10

వసుదేవసుతౌ తత్ర విష్ణోరంశసముద్భవౌ | నాశాయకిల సంభూతౌ మమ దుష్టౌ ప్రవర్థతః || 11

ధనుర్మహమహాయాగశ్చతుర్దశ్యాం భవిష్యతి | అనే¸° భవతా తౌతుమల్ల యుద్ధాయ తత్రవై || 12

చాణూరముష్టికౌ మల్లౌ నియుద్దకుశలౌ మమ | తాభ్యాం సహానయోర్యుద్ధం సర్వలోకో7త్ర పశ్యతు || 13

నాగః కువలయాపీడో మహామాత్ర ప్రచోదితః | సతౌ నిహంస్యతే పాపౌ వసుదేవాత్మాజౌ శిశూ || 14

తౌ హత్వా వసుదేవంచ నందగోవం చ దుర్మతిమ్‌ | హనిప్యేపితరం చైవ ఉగ్రసేనం చ దుర్మతిమ్‌ || 15

తతః సమస్తగోపానాం గోధనా న్యఖిలాన్యహమ్‌ | విత్తం చాపహరిష్యామి దుష్టానాం మద్వధైషిణామ్‌ || 16

త్వామృతే యాదవాశ్చేమే దుష్టా దానపతే మమ | ఏతేషాం చ వధాయాహం ప్రయతిష్యామ్యనుక్రమాత్‌ || 17

తతోనిష్కంటకం సర్వం రాజ్యమేత దయాదవమ్‌ | ప్రసాధిష్యే త్వయా తస్మాన్మత్ర్పీత్యై వీరగమ్యతామ్‌ || 18

యథా చ మాహిషం సర్పి ర్దది చాప్యుపహార్యవై | గోపాః సమానయంత్వాశు త్వయా వాచ్యాస్తథా తథా || 19

వ్యాస ఉవాచ

ఇత్యాజ్ఞప్తస్తదా7క్రూరో మహాభాగవతో ద్విజాః | ప్రీతిమానభవత్కృష్ణం శ్వో ద్రక్ష్యామీతి సత్వరః || 20

తథేత్యుక్త్వా తు రాజానం రథమారుహ్యసత్వరః | నిశ్చక్రామ తదాపుర్యా మధురాయా మధుప్రియః || 21

ఓదానవేశ! నాప్రీతికొఱకు నీవిటనుండి రథమెక్కి గోకులమేగుము. హరియంశమున బుట్టినవసుదేవుని కొడుకులను గొనిరమ్ము. వారలు నాచావునకు బుట్టి పెరుగుచున్నారు. ఈచతుర్ధశినాడు ధనురుత్సవమను మహాయాగము జరుగగలదు. అందువల్ల యుద్ధమునకై యేర్పాటు జరుగును. నాకడ చాణూరముష్టికులనుమల్లురు యుద్ధకుశలురు. వారలతో నీబలరామకృష్ణులకుజరుగు యుద్దమును సర్వలోకము జూచుగాక ! కువలయాపీడమను నేనుగు మావటీండ్రకెల్ల మేటి యైన వానిచే దోలబడి యాయిద్దఱు శిశువులను మట్టుపెట్టగలదు. వారింజంపి వసుదేవుని నందునింగూల్చి నాతండ్రి దుష్టుడగు నుగ్రసేనునిం జంపెదను. అటుపై గోపాలుర గోధనములను గొల్లగొట్టెదను. వారునాకు శత్రువులు. నీవుదప్ప యీయాదవులందురు పరమదుష్టులు. నాకుగిట్టరు. ఈయందఱనుగూడ జంపుటకు క్రమముగ నీతో నేను యత్నించెద. ఆగొల్లలు గేదినెయ్యి పెరుగును కాన్కగగొని నీవెంబడినవచ్చునట్లు నీవట్లట్ల నచ్చెప్పుము. అని యిట్లా జ్ఞాపించబడి మహాభాగవతుడు (భక్తాగ్రేసరుడు) మధుప్రియుడు(మద్యప్రియుడు) అగు నక్రూరుడట్లేయని కంసరాజునకు దెల్పి మధురావురమునుండి బయలువెడలెను.

వ్యాస ఉవాచ

కేశీచాపి బలోదగ్రః కంసతూదః ప్రచోదితః | కృష్ణస్య నిధనాకాంక్షీ వృందావనముపాగమత్‌ || 22

సఖురక్షతభూపృష్ఠః సటాక్షేపధుతాంబుదః | పునర్విక్రాంత చంద్రార్కమార్గో గోపాంత మాగమత్‌ || 23

తస్య హ్రేషితశ##బ్దేన గోపాలాదైత్య వాజినః | గోప్యశ్చ భయసంవిగ్నా గోవిందం శరణం యయుః || 24

త్రాహి త్రాహీతి గోవంత స్తేషాం శ్రుత్వాతు తద్వచః | సతోయజలదధ్వాన గంభీరమిదముక్తవాన్‌ || 25

గోవింద ఉవాచ

అలం త్రాసేన గోపాలాః కేశినః కిం భయాతురైః | భవద్భిర్గోజాతీయైర్వీర వీర్యం విలోప్యతే || 26

కిమనేనాల్పసారేణ హ్రేషితారోష కారిణా | దైతేయ బలవాహ్యేన వల్గతా దుష్టవాజినా || 27

ఏహ్యేహిదుష్ట | కృష్ణో7హంపూష్ణస్త్వి పినాకధృక్‌ | పాతయిష్యామి దశనాం వదనారభిలాంస్తవ || 28

వ్యాస ఉవాచ

ఇత్యుక్త్వా సతుగోవిందః కేశినః సంముఖం య¸° | వివృతాస్యశ్చ సో7ప్యేనం దైతేయశ్చ ఉపాద్రవత్‌ || 29

బాహుమాభోగినం కృత్వా ముఖే తస్య జనార్దనః | ప్రవేశయామాస తదా కేశినో దుష్టవాజినః || 30

కేశినోవదనం తేన విశతా కృష్ణ బాహునా | శాతితా దశనాస్తస్య సితాభ్రావయవా ఇవ || 31

కృష్ణస్య వవృధే బాహుః కేశిదేహకృతోద్విజాః | వినాశాయ యథా వ్యాధిరాప్తభూతైరుపేక్షితః || 32

విపాటితౌష్టో బహులం సఫేనం రుధిరం వమన్‌ | సృక్కణీ వివృతే చక్రే విశ్లష్టే ముక్తబంధనే || 33

జగామ ధరణీం పాదైః శకృన్మూత్రం సముత్సృజన్‌ | స్వేదార్దృగాత్రః శాంతశ్చ నిర్యత్నః సో7భవత్తతః || 34

వ్యాదితాస్యోమహారౌద్రః సో7సురః కృష్ణ బాహునా | నిపపాత ద్విధాభూతో వైద్యుతేన యథాద్రుమః || 35

ద్విపాదపృష్ఠపుచ్ఛార్థశ్రవణౖకాక్షినాసికే | కేశినస్తే ద్విధా భూతే | శకలేచ విరేజతుః || 36

హత్వాతు కేశినం కృష్ణోముదితైర్గోపకైర్వృతః | అనాయస్త తనుః స్వస్థో హసం స్తత్రైవ సంస్థితః || 37

తతోగోపాశ్చ గోప్యశ్చ హతే కేశిని విస్మితాః | తుష్టువుః పుండరీకాక్ష మనురాగమనోరమమ్‌ || 38

అయ¸°త్వరితో విప్రోనారదో జలదేస్థితః | కేశినం నిహతం దృష్ట్వా హర్షనిర్భరమానసః || 39

అవ్వల గంసుని వాహనమగు గుఱ్ఱమురూపముగల కేశియనువాడు కంసప్రేరితుడై కృష్ణుంజంపనెంచి బృందావనమునకువచ్చెను. వాడు కాలిడెక్కలం ధరణీతలముం జిమ్ముచు జూలువిదలలించి మేఘములు జెదరించుచు చంద్రసూర్యమార్గమునాక్రమించి గోపకుల దరికేతెంచెను. వాని సకిలింపునువిని గోపాలురు గోపికలు భయమునంబెదరిపోయి గోవిందుని త్రాహిత్రాహి (రక్షింపు రక్షింపుము) అని శరణొందిరి. హరియునదివిని జలములతో నున్న మేఘముయొక్కగర్జనమట్ల గంభీరముగ నిట్లు పల్కెను. గోపకులార జడియవలదు. గోపజాతి పరాక్రమము లోపమగును. అల్పబలము రాక్షస బలభారముచే జిందులు ద్రొక్కుచు సకలించుచునున్న ఈ పాడు గుఱ్ఱమువలన నేమగును. అని ఓ క్రూర ! రా రా నేను గృష్ణుడను. పినాకపాణి(హరుడు) పూషుని (సూర్యుని) యొక్కవలె నీ యెల్లపండ్లూడ గొట్టెదనని కృష్ణుడు వాని కెదురు నడచె. వాడున్ను నోరువెఱచి హరిపై కెగబడెను. తన నిండుభుజమును వాని నోటిలో దూర్చెను. దాన వాని పండ్లెల్లం దెలిమేఘవు దునుకులట్లూడి రాలిపోయె. కృష్ణబాహువులోన కేగినకొలది బంధువులుపేక్షింపబెఱిగినవ్యాధియ ట్లూరక పెరిగి దవడలు బ్రద్దలయి నురుగులంతోడి రక్తముం గ్రక్కికొని వాడు సెలవులు విచ్చి కీలుకీలూడి వడి పాదములు చాచి విణ్ణూత్రములు విడుచుచు పుడమిపై బడెను. మఱియు ముచ్చెమటలుపోసి చచ్చువడివాడు చేష్టలుదక్కెను. హరిబాహువుచే నోరు విచ్చిపోవ మహరౌద్రాకారియగు వాడు పిడుగువడినచెట్టువలె బెండై రెండై కూలెను. రెండు పాదములు పిరుదు తోక రెండుగానై చెవి కన్ను ముక్కు నొక్కటి వంతుననై మొత్తము శరీరము రెండు ముక్కలై వాడు కూలబడెను. కృష్ణుడిట్లు కేశిసంహరము చేయ సంతోషబడిన గోపకులతో గూడుకొని శరీరమించుకయు నాయాస పడకుండ స్వస్థుడై నవ్వుచు నచ్చటనే యుందెను. గోపికలును గోపకులును గేశి హతుడగుట జూచి వింతబడి యనురాగమనోహరముగ బుండరీకాక్షుని గొనియాడిరి. కేశి హతుడగుట చూచి నారదుడంత మేఘములనుండి వెలువడి వెవేగ వచ్చి మన సానందభరితముగాగ కృష్ణునిట్లు గొనియాడెను.

సాధుసాధు జగన్నాథ! లీలయైన యదచ్యుత | నిహతో7యం త్వయా కేశీ క్లేశద స్త్రిదివౌకసామ్‌ || 40

సుకర్మాణ్యవతారే తుకృతాని మధుసూదన | యాని వైవిస్మితం చేత స్తోష మేతేన మే గతమ్‌ || 41

తురగస్యాస్య శక్రో7పి కృష్ణ ! దేవాశ్చ బిభ్యతి | ధుతకేసరజాలస్య హ్రేషతో7భ్రావలోకినః || 42

యస్మాత్త్వయైష దుష్టాత్మా హతః కేశీ జనార్దన | తస్మాత్కేశవనామ్నా త్వం లోకే గేయో భవిష్యసి || 43

స్వస్త్యస్తుతే గమిష్యామి కంసయుధ్దే7ధునాపునః పరశ్వో7హం సమేష్యామి త్వయా కేశివిషూదన || 44

ఉగ్రసేనసుతే కంసే సానుగే వినిపాతితే | భారావతారకర్తాత్వం ప్రుథివ్యా ధరణీధర || 45

తత్రానేకప్రకారేణ యుద్ధాని పృథివీక్షితామ్‌ | ద్రష్టవ్యాని మయా యుష్మత్ర్పణీతాని జనార్దన || 46

సో7హం యాస్యామి గోవింద దేవకార్యం మహత్కృతమ్‌ | త్వయా సభాజితశ్చాహం స్వస్తి తే7స్తు వ్రజామ్యహమ్‌ ||

వ్యాస ఉవాచ

నారదేతు గతే కృష్ణః సహ గోపై రవిస్మితః | వివేశ గోకులం గోపీనేత్రపానై కభాజనమ్‌ || 48

ఇతి శ్రీబ్రహ్మపురాణ కేశివధ నిరూపణమ్‌నామ నవత్యధికశతతమో7ధ్యాయః

బాగు బాగు జగన్నాథ స్వర్గవాసులకు బీడగల్గించు క్రేశిని లీలామాతముగ చంపితివి. ఈ యవతారమున నీ చేసినలీలలు ఆద్భుతములు. దీన నామనసు అశ్చర్యమును ఆనందమును జెందినది. ఈ హయాసురునకునింద్రుడుదేవతలును హడలిపోవుదురు. వీడు విదిలించి సకలించుచు నాకసము వంకకు జూచిన వానింజూచి దేవతలు హడలెత్తి పోవుదురు. కేశివధ సేసినందున లోకమందీవు కేశవ నామమున గీర్తింపబడుదువు. నీకు మంగళమగుగాక. వెళ్లుచున్నాను. కంసునితోడి యుద్దమున నెల్లుండి నిన్ను గలిసికొందును. ఉగ్రసేనుని కొడుకుకంసుడు సపరివారముగ గూలగనే నీవు పృథివీభారహర్తవగుదువు. అక్కడ రాజులతోడియుద్దములనేకములు నాకు దర్శనీయము కాగలవు. ఓ జనార్దన గోవింద నేను వెళ్లివచ్చెదను. దేవకార్యము చాల గొప్పగ జరుపబడినది. నీచే నేను గారవింపబడితిని. నీకు శుభమగుగాక యని నారదుడేగ కృష్ణుడు గోపకులతో గోపికలు తమనయనములచే దనలీలా సౌందర్యపానము చేయు గోకులమున బ్రవేశము చేసెను.

ఇది బ్రహ్మపురాణమున కేశివధ నిరూపణమును నూటతొంబదవ యధ్యాయము.

Brahmapuranamu    Chapters