Brahmapuranamu    Chapters   

అథ అష్టాశీవ్యధికశతతమో7ధ్యాయః

గోవర్ధనోద్ధరణమ్‌

వ్యాసఉవాచ

మఖే ప్రతిహతే శక్రో భృశం కోపసయన్వితః | సంవర్తకం నామ గణం తోయదానా మ థాబ్రవీత్‌ || 1

భో భో మేఘా నిశ మ్యైత ద్వదతో వచనం మమ | అజ్ఞా నాంతర మే వాశు క్రియతా మవిచారితమ్‌ || 2

నందగోపః సుదుర్భుద్ధి ర్గోపై రన్యైః సహాయవాన్‌ | కృష్ణాశ్రయ బలాధ్మాతోమఖభంగ మచీకరత్‌ ||3

ఆజీవో యః పరం తేషాం గోపత్వస్య చ కారణమ్‌ | తా గోవో వృష్టిపాతేన పీడ్యంతాం వచనా న్మమ|| 4

అహ మ ప్యద్రిశృంగాభం తుంగ మారుహ్య వారణమ్‌ | సాహాయ్యం వః కరిష్యామి వాయూనాం సంగమేన చ ||

వ్యాసఉవాచ

ఇ త్యాజ్ఞప్తాః సురేంద్రేణ ముముచుస్తే బలాహకాః | వాతవర్షం మహాభీమ మభావాయ గవాం ద్విజాః || 6

తతః క్షణన ధరణీ కకుభో7ంబర మేవ చ | ఏకం ధారామహాసారపూరణ నాభవ ద్ద్విజాః || 7

గావస్తు తేన పతతా వర్షవాతేప వేగినా | ధుతాః ప్రాణా న్జహుః సర్వా స్తిర్యఙ్ముఖశిరోధరాః || 8

క్రోడేన వత్సా నాక్రమ్య తస్థు రన్యా ద్విజో త్తమాః | గావో వివత్సా శ్చ కృతా వారిపూరేణ చాపరాః || 9

వత్సాశ్చ దీనవదనాః పవనాకంపికంధరాః | త్రాహి త్రా హీత్యల్ప శబ్దాః కృష్ణ మూచు రివార్తకాః ||10

తత స్త ద్గోకులం సర్వం గోగోపీగోపసంకులమ్‌ | అతీ వార్తం హరి ర్దృష్ట్వా త్రాణా యాచింతయత్తదా|| 11

ఏతత్కృతం మహేంద్రేణ మఖభంగ విరోధినా | త దేత దభిలం గోష్ఠం త్రాతవ్య మధునా మయా ||12

ఇమ మద్రి మహం వీర్యా దుత్పాట్యోరుశిలాతలమ్‌ | ధారయిష్యామి గోష్ఠస్య పృథుచ్చత్ర మివోపరి ||13

వ్యాసఉవాచ

ఇతి కృత్వా మతిం కృష్ణో గోవర్ధనమహీధరమ్‌ | ఉత్పాట్యైగరకరేణౖవ ధారయామాన లీలయా || 14

గోపాంశ్చాహ జగన్నాథః సముత్పాటితభూధరః | విశధ్వ మత్ర సహితాః కృతం వర్ష నివారణమ్‌ ||15

సునిర్వాతేషు దేశేషు యథాయోగ్య మి హాస్యతామ్‌| ప్రవిశ్య నాత్ర భేతవ్యం గిరిపాతస్య నిర్భయైః || 16

ఇత్యుక్తా స్తేన తే గోపా వివిశు ర్గోధనైః సహ| శకటారోపితై ర్భాండై ర్గోప్య శ్చా77సారపీడితాః || 17

కృష్ణొ7పి తం దధారైవం శైల మత్యంత నిశ్చలమ్‌ | ప్రజౌకోవాసిభిర్హర్షవిస్మితాక్షై ర్నిరీక్షితః || 18

గోపగోపీజనై ర్హృష్టైః ప్రీతివిస్తారి తేక్షణౖః | సంస్తూయమానచరితః కృష్ణః శైల మధారయత్‌ || 19

సప్తరాత్రం మహామేఘా వవర్షు ర్నందగోకులే | ఇంద్రేణ చోదితా మేఘా గోపానాం నాశకారిణా || 20

తతో ధృతే మహాశైలే పరిత్రాతే చ గోకులే | మిథ్యాప్రతిజ్ఞో బలభి ద్వారయామాన తాన్ఘనాన్‌ || 21

వ్యభ్రే నభసి దేవేంద్రే వాతథే శక్రమంత్రితే | నిష్క్రమ్య హృష్టః స్వస్థానం పున రాగమత్‌ || 22

గోవర్ధనోద్ధరణము

వ్యాసుడిట్లనియె.ఇంద్రోత్సవము సేయబనిలేదను గోపకుల నిశ్చయముచే మిక్కిలి కోపించి యింద్రుడు సంవర్తకమును మేఘ గణముం గూర్చి యిట్లనియె. ఓ మేఘములారా! నేను బలుకు వచనము నాలింపుడు. నా యాజ్ఞను అవిరామముగ వెంటనే కావింపుడు. నందుడు దుర్బుద్ధియై గొల్లలంగూడగట్టుకొని కృష్ణుని యాశ్రయ బలముచేనుబ్బి ఉత్సవభంగము సేసివాడు. ఆ గొల్లలకు జీవనాధారము, గోపాలురనిపించుకొనుటకు గారణమునుగోవులే. కావున వానిని రాళ్ళవానగురిసి బాధింపుడు. నేనును కొండశిఖరమట్లున్న యైరావత గజమునెక్కివచ్చి వాయువులతోడ మీకు దోడయ్యెదను. ఇట్లింద్రునిచే నాజ్ఞాపింపబడి మేఘములు గోవులుచెడ జడుపుగొలుపు జడివాన గురిసినవి. క్షణములో నీధరణి దిక్కులు నాకాశము నొక్కటిగ నేకధారగ గురిసిన కుంభవృష్టిచే నావులు దెబ్బతిని మెడలు తలలు తిఱుగబడి పడిపోయినవి. కొన్ని గోవులు దూడలను ఱొమ్ములనదిమికొన్నవి. కొన్ని గోవులు దూడలకెడమైనవి. కొన్నియావులు గాలికి నొడలువడక బిక్క మొగముపెట్టి కావుకావుమన్న ట్లంబారవములుసేసి యల్లన గృష్ణునిం గూర్చి మొర వెట్టికొన్నవి. గోవులు గోపికలు గోపకులతో నాగోకులమెల్లబెగడువడి వ్యాకులమౌటగని హరివారిని రక్షింపనాలోచించెను. ఉత్సవభంగమునకు బగగొని యింద్రుడిది చేసెను. నేనీ గోవ్రజముం గాపాడవలయును. ఈ కొండంబెల్లగించి యీగోష్ఠమునకెల్ల గొడుగుగా నెత్తి పట్టెదనుగాక అని నిశ్చయించి యాగోవర్ధనగిరి నొంటిఱక్క నవలీలగ నెత్తి పట్టెను. మఱియును జగన్నాథుడు వాన కడ్డుసేసితిని. ఈ కొండ గొడుగుక్రింద కందఱు రండు రండు. గాలి తాకిడి లేనియెడ ననువగుచోటుల మీరు సరుదుకొనుడు. ఈ కొండవిరిగి మీదపడునేమోయని యీ క్రింద నిలుచుటకు జడియవలదన హరిపలుకువిని గోధనములతో బండ్లకెక్కించికొన్నకుండలుమండలతో గోపకులు గోపికలు వానదెబ్బదిని యా కొండక్రిందికిం జొచ్చిరి. కృష్ణుడు నా శైలముం గేలల్లాడకుండ నెత్తివట్టెను. వ్రజవాసులు నానందపడి యచ్చెరువుగొని విచ్చిన వెదకన్నులప్పగించి కృష్ణ డప్పంగని బాలకృష్ణలీలలం గొనియాడిరి. స్వామియు నదియొక యాటగా నేడురాత్రులేక ధారగానింద్రాజ్ఞగొని మేఘములు గురియ నేకధాటి నా గోవర్ధనము నెత్తికొనెను. హరియట్లప్పెనుగొండ నెత్తికొన గోకులము రక్షణగొన బలారి తనప్రతిన యబద్ధమయి యాకనమున మబ్బు విరిసినట్ల తనయాలోచనలు వమ్మయిపో గోకులమువెడలి సంబరపడి స్వస్థానమునకు దిరిగి వచ్చెను.

ముమోచ కృష్ణో7పి తదా గోవర్ధనమహాగిరిమ్‌ | స్వస్థానే విస్మితముఖై ర్దృష్ట సై#్తర్ర్వజవాసిభిః || 23

వ్యాస ఉవాచ

ధృతే గోవర్ధనే శైలే పరిత్రాతే చ గోకులే | రోచయామాన కృష్ణస్య దర్శనం పాకశాసనః || 24

సో7ధిరుహ్య మాహానాగ మైరావత మమిత్రజిత్‌ | గోవర్ధనగిరౌ కృష్ణస్య దర్శనం త్రిదశాధిపః ||25

చారయంతం మహావీర్యం గాశ్చ గోపవపుర్ధరమ్‌ | కృత్స్నస్య జగతో గోపం వృతం గోపకుమారకై ః || 26

గరుడం చ దద ర్మోచ్చై రంతర్ధానగతం ద్విజాః | కృతచ్ఛాయం హారే ర్మూర్ధ్ని పక్షాభ్యాం పక్షిపుంగవమ్‌ ||27

అవరుహ్య స నాగేంద్రా దేకాంతే మధుసూదనమ్‌ | శక్రః సస్మిత మాహేదం ప్రీతివిస్ఫారితేక్షణః || 28

కృష్ణుడును గోవర్ధనగిరిని యధాస్ధానమునడించెను. వ్రజవాసు లెనలేని యుల్లాసమున నవ్వింతంగనిరి. ఈవిధముగ గిరినెత్త గోకులము రక్షణముగొన నింద్రుడు కృష్ణదర్శనము సేసికొననెంచి యైరావతమెక్కి క్రిందికిందిగివచ్చి యయ్యాలకాపరిని జగమ్మునకెల్ల కాపరింగా గరుడుండు తనఱక్కలువిప్పి కల్పించిన నీడక్రింద గరుడ వాహనారూఢుడై యున్న సాక్షాద్విష్ణువుని మధుసూదనునింగని గజరాజమునుండిదిగి యేకాంతమునం దల్లననగుచు ప్రీతిచే కన్నులు విప్పార నిట్లనియె.

గోవర్ధన పట్టాభిషేకము

కృష్ణ కృష్ణ శ్రుణుష్వేదం యదర్థ మహ మాగతః | త్వ త్సమీపం మహాబాహో నైత చ్చింత్యం త్వయా7స్యథా || 29

భారావతరణార్థాయ పృథివ్యాః పృథివీతలమ్‌ | అవతీర్ణో7ఖిలాధార స్త్వ మేవ పరమేశ్వర || 30

మహభంగవిరుద్ధేన మయా గోకులనాశకాః | సమాదిష్టా మహామేఘా సై#్త శ్చైత త్కదనం కృతమ్‌ || 31

త్రాతా స్తాపా త్త్వయా గావః సముత్పాట్య మహాగిరిమ్‌ | తే నాహం తోషితో వీర కర్మణా7త్యద్భుతేన తే || 32

సాధితం కృష్ణ దేవానా మద్య మన్యే ప్రయోజనమ్‌ | త్వయా 7య మద్రి ప్రవరః కరే ణౖకైన చోద్ధృతః || 33

గోభి శ్చ నోదితః కృష్ణ త్వ త్సమీప మిహా 77 గతః | త్వయా త్రాతాభి రత్యర్థం యుష్మ త్కారణకారణాత్‌ || 34

సత్వాం కృష్ణాభిప్రేక్ష్యామి గవాం వాక్యప్రచోదితః | ఉపేంద్రత్వే గవా మింద్రో గోవింద స్త్వం భవిష్యసి || 35

ఆ థోపవాహ్యా దాదాయ ఘంటా మైరావతా ద్గజాత్‌ | అభిషేకం తయా చక్రే పవిత్ర జలపూర్ణయా || 36

క్రియమాణ7భిషేకే తు గావః కృష్ణస్య తత్‌క్షణాత్‌| ప్రస్రవోద్భూతదుగ్ధార్ద్రాం సద్య శ్చక్రు ర్వసుంధరామ్‌ || 37

అభిషిచ్య గవాం వాక్యా ద్దేవేంద్రో వై జనార్దనమ్‌ | ప్రీత్యా సప్రశ్రయం కృష్ణం పున రాహ శచీపతిః || 38

కృష్ణా కృష్ణా! వినుమేనిటకు నీసన్నిధికెందులకు వచ్చతినో యిదిమఱొకలాగున భావింపవలదు. భూ భారముదింప నియ్యిలపై నీవతరించిన నిఖిలాధారుడవు. పరమేశ్వరుడవునీవే. నన్ను గూర్చిన మహోత్సవమునకు భంగమయ్యెనన్న విరోధమున గోకులముంజెఱువ నేను బంపిన కార్మబ్బులచే నింత రగడు జరిగినది. నీ వా గిరినెత్తి యాదవులంగాంచితిని. అవ్వింతంగని నేనును సంతుష్టుడనైతిని దేవతల కార్యమిద్దాన నెరవేరినది. నా ప్రయోజనము చక్కగ సిద్ధించినదని నేను దలచెదను. నీరక్షణమందిన గోవులు నీయవతారకారణమునకు గారణమైనవి. ప్రేరణసేయ నీదరికేతెంచితిని. గోవిందుడవీవే యిపుడుపేంద్రుడను కాగలవు. అని యైరావతముమెడనుండి గంటనుజేకొని పవిత్రజలపూర్ణమైన యద్దానిచే హరి కభిషేకముగావించెను. గోప్రేరణచే ఆ జరిపిన యాగోవర్ధన పట్టాభిషేక వైభవమందు గోవులు నిండ చేసిన క్షీరధారలచే నాక్షణమయభిషేకించి యివ్వసుంధరంగూడ నిండదడిపినవి. శచీపతి ప్రీతిగోని వినయముతో గృష్ణుంగని మఱియు నిట్లనియె.

గవా మేత త్కృతం వాక్యా త్తథా7న్య దపి మే శృణు | య ద్బ్రవీమి మహాభాగ భారావతరణచ్ఛయా || 39

మమాంశః పురుషవ్యాఘ్రః పృథివ్యాం పృథివీధర | అవతీర్థో7ర్జునో నామ స రక్ష్యో భవతా సదా || 40

భారావతరణ సఖ్యం స తే వీరః కరిష్యతి | స రక్షణీయో భవతా యథా77త్మా మధుసూదన || 41

శ్రీభగవానువాచ

జానామి భారతే వంశే జాతం పార్ధం త వాంశతః | త మహం పాలయిష్యామి యావ దస్మి మహీతలే || 42

యావ న్మహీతలే శక్ర స్థాస్యా మ్యహ మరిందమ| నతావ దర్జునం కశ్చి ద్దేవేంద్ర! యుధి జేష్యతి || 43

కంసో నామ మహాబాహు ర్దైత్యో7రిష్ట స్తథా పరః | కేశీ కువలయాపీడో నరకాద్యా స్తథా7పరే || 44

హతేషు తేషు దేవేంద్ర భవిష్యతి మహాహవః | తత్ర విద్ధి సహస్రాక్ష భారావతరణం కృతమ్‌ || 45

స త్వం గచ్ఛ న సంతాపం పుత్రార్ధే కర్తు మర్హసి | నార్జునస్య రిపుః కశ్చి న్మమాగ్రే ప్రభవిష్యతి || 46

అర్జునార్థే త్వహం సర్వా న్యుధిష్ఠిరపురోగమాన్‌ | నివృత్తే భారతే యుద్ధే కుంత్యై దాస్యామి విక్షతాన్‌ || 47

ఇత్యుక్తః సంపరిష్వజ్య దేవరాజో జనార్దనమ్‌ | ఆరు హ్యైరావతం నాగం పున రేవ దివం య¸° || 48

కృష్ణో7పి సహితో గోభి ర్గోపాలైశ్చ పున ర్ర్వజమ్‌ | ఆజగా మాథ గోపీనాం దృష్టిపూతేన వర్త్మనా || 49

ఇతి శ్రీమహాపురాణఆదిబ్రాహ్మే శ్రీకృష్ణబాలచరితేగోవిందపట్టాభిషేకవర్ణనంనామ అష్టాశీత్యధికశతతమో7ధ్యాయః

ఈ వై భవమంతయు గోవుల మాటంబట్టి చేసితిని. ఒకవిన్నపము గావించెద నాలింపుము. నాయంశమున నియ్యవనిపై మహాపురుషుడై అర్జునుండవతరించి యున్నాడు. అతడు తమరక్షణ కర్హుడు. భూభారమునందు నీతో జెలిమి చేయగలడు. వానిని నీవు నిన్నువలె గాపాడవలయును. అన భగవంతుడిట్లనియె. భారతవంశమున నీయంశమున పార్ధుడు పుట్టుట నేనెఱుంగుదును. వానిని నేనవని నున్నంతదనుక పాలింతును. ఆయర్జును నెవ్వడును యుద్ధమున గెలువజాలడు. కంసుడు అరిష్టుడు కేశి కువలయాపీడుడు నరకుడు మఱియెందరో కూలిన తరువాత మహాయుద్దము జరుగగలదు. దాన భూభారము హరించును. అందుచే నీవేగుము. నీపుత్రునకై నీవు పరితాపపడకుము. అర్జునునికి శత్రువను వాడొక్కడు నాముందుండబోడు. అర్జునుకొఱకే నేను యుదిష్టిరాదులను భారతయుద్ధము జరిగిన తరువాత క్షేమముననున్నవారిని గుంతికి సమర్పింతును. అనిహరిపలుక దేవాధిపతి జనార్ధనుం గౌగలించికొని యైరావతమెక్కి దివంబున కరిగెను. కృష్ణుడును గోవులతో గోపాలురతో గొల్లపల్లెను గోపికలచూపులచే బవిత్రమైనత్రోవ నేతెంచెను.

ఇది బ్రహ్మపురాణమున శ్రీకృష్ణబాలచరిత్రమందు గోవిందపట్టాభిషేకమను నూటయెనుబదవ అధ్యాయము.

Brahmapuranamu    Chapters