Brahmapuranamu    Chapters   

ఊనాశత్యధిక శతతమో7ధ్యాయః

ఋషిప్రశ్న నిరూపణమ్‌

లోమహర్షణ ఉవాచః

వ్యాసస్య వచనం శ్రుత్వా మునయః | సంయతేంద్రియాః | ప్రీతా బభూవు స్సంహృష్టా విస్మితాశ్చ పునః పునః || 1

మునయఊచుః

అహో భారతవర్షస్య త్వయా సంకీర్తితా గుణాః | తద్వచ్ఛ్రీపురుషాఖ్యస్య క్షేత్రస్య పురుషోత్తమ || 2

విస్మయో హి నచైకస్య శ్రుత్వా మాహాత్మ్యముత్తమమ్‌ | పురుపాఖ్యస్య క్షేత్రస్య ప్రీతిశ్చ వదతాంవర || 3

చిరాత్ర్పభృతి చాస్మాకం సంశయోహృది వర్తతే | త్వద్దృతే సంశయస్యాస్య చ్ఛేత్తా నాన్యో7స్తి భూతలే || 4

ఉత్పత్తిం బలదేవస్య కృష్ణస్య చ మహీతలే | భద్రాయాశ్చైవ కార్త్య్సేన వ్రుచ్ఛామస్త్వాం మహామునే || 5

కిమర్థం తౌ సముపత్పన్నౌ కృష్ణసంకర్షణావుభౌ | వసుదేవసుతౌ వీరౌ స్థితౌ నందగృహే మునే || 6

నిఃసారే మృత్యులోకే7స్మిన్దుఃఖ ప్రాయే7తి చంచలే | జల బుద్బుద సంకాశే భైరవే లోమహర్షణ || 7

విణ్మూత్రపిఛ్ఛలం కష్టం సంకటం దుఃఖదాయకమ్‌ | కథం ఘోరతరం తేషాం గర్భవాస మరోచత || 8

యానికర్మాణి చక్రుస్తే సముత్పన్నా మహితలే | విస్తరేణ మునే తాని బ్రూహి నో వదతాం వర || 9

సమగ్రం చరితం తేషామద్భుతం చాతిమానుషమ్‌ | కథం స భగవాన్దేవః సురేశః సురసత్తమః || 10

వసుదేవకులే ధీమాన్వాసు దేవత్వమాగతః | అమరైళ్చా77వృతం పుణ్యం పుణ్యకృద్భిరలంకృతమ్‌ || 11

దేవలోకం కిముత్సృజ్య మర్త్యలోక ఇహా77గతః | దేవమానుషయోర్నేతా ద్యోర్భువః ప్రభవో7వ్యయః | 12

కిమర్ఠం దివ్యమాత్మానం మానుషేషు న్యయోజయత్‌ || యశ్చ క్రం వర్తయత్యేకో మానుషాణామనామయమ్‌ || 13

న మానుష్యే కథం బుద్దిం చక్రే చక్రగదాధరః || గోపాయనం యః కురుతే జగతః సార్వభౌతికమ్‌ | 14

స కథం గాం గతో విష్ణుర్గోపత్వమకరోత్ర్పభుః || మహాభూతాని భూతాత్మా యో దధార చకార చ || 15

శ్రీగర్భ స్స కథం గర్బేస్త్రియా భూచరయా దృతః | యేన లోకాన్ర్క మైర్జిత్వా త్రిభిర్వై త్రిదశేప్సయా || 16

స్థాపితా జగతో మార్గాస్త్రివర్గాశ్చాభవంస్త్రయః | యోన్తకాలే జగత్పీత్వా కృత్వా తోయమయంవపుః || 17

లోకమేకార్ణవం చక్రే దృశ్యాదృశ్యేన చాత్మనా | యఃపురాణః పురాణాత్మా వారాహం రూపమాస్థితః || 18

విషాణాగ్రేణ వసుధాముజ్జహారారిసూదనః | యఃపురాణః పురుహూతార్థే త్రైలోక్యమిద మవ్యయం || 19

దదౌజిత్వా వసుమతీం సురాణాం సురసత్తమః | యేన సింహవపుః కృత్వా ద్విధా కృత్వా చ తత్పునః || 20

పూర్వం దైత్యో మహావీర్యో హిరణ్యకశిపుర్హతః | యఃపురా హ్యనలో భూత్వా ఔర్వః సంవర్తకోవిభుః || 21

పాతాలస్థో7ర్ణవరసం పపౌ తోయమయంహరిః | సహస్రచరణం బ్రహ్మ సహస్రాంశు సహస్రదమ్‌ || 22

సహస్రశిరసం దేవం యమాహుర్వై యుగేయుగే | నాభ్యాం పద్మం సముద్భూతం యస్యపైతామహంగృహమ్‌||

ఏకార్ణవే నాగలోకే సద్ధిరణ్మయ పంకజమ్‌ | యేనతే నిహతాదైత్యాః సంగ్రామే తారకామయే || 24

యేనదేవమయం కృత్వా సర్వాయుధ ధరం వపుః | గుహాసంస్థేనచోత్సిక్తః కాలనేమిర్నిపాతితః || 25

ఉత్తరాంతే సముద్రస్య క్షీరోదస్యామృతోదధౌ | యః శేతే శాశ్వతం యోగమాస్థాయ తిమిరంమహత్‌ || 26

ఋషిప్రశ్ననిరూపణము

లోమ హర్షణుడిట్లనియె.

వ్యాస వచనమువిని జితేంద్రియులగు మునులు సంప్రీతులై సంతసించి యచ్చెరువంది మఱిమఱి యిట్లనిరి. భారత వర్షప్రభావమెంత జక్కగ నీవు వర్ణించితివి. అట్లే పురుషోత్తమక్షేత్రమహిమము తాము సెలవిచ్చినది విని వింత సెందితిమి. చిరకాలమునుండి మా యెద నొక సందియముపాదుకొనియున్నది. దానిని వదలింప దమకంటె మఱియొకడు భూతలమునలేడు. బలరామకృష్ణు లవని నవతరించుటకు గారణమేమి ? భద్రాదేవి యవతారము నెందులకువచ్చినది ? వసుదేవుని కుమారులై నందగృహమం దయ్యన్న దమ్ములెందులకుండిరి ? ఈ లోకము దుఃఖప్రాయము. మృత్యురూపము. నీటిబుడగవలె నస్థిరము. పరమపురుషులు వారు ఈమలపూరితమైన గొందెలో నీఘోరమైనగర్భముననెందులకు నివాసయమునుగోరిరి ? అవనినవతరించి వారేమేమి పనులుచేసిరి ? అవెల్ల సమగ్రముగమాకానతిమ్ము. అతి మానుషమైన వాసుదేవభగవానుని కథ పరమపుణ్యము. పుణ్యాత్ముల చరిత్రలతో ముడిపడియున్నది. దివినుండి యవనికి స్వామి వచ్చుటకుగతమేమి ? చక్రపాణి సర్వసృష్టిచక్రముద్రిప్పు ప్రభువు మనుష్యలోకమునెడల నెట్లు తలుపుగొనెను. సర్వజగద్గోపకుడైన హరి సామాన్య గోపమూర్తియెందులకయ్యెను. మహాభూతములను భరించు సర్వభూతాత్మకుడైన ప్రభువు శ్రీగర్భుడు (అణిమాద్యైర్వర్య సంపన్నుడు) అగు శ్రీపతియొక మానవ స్త్రీగర్భమున నెట్లు భరింపబడెను ? దేవతలమేలుకొఱకు ముల్లోకములను మూడడుగులచే నాక్రమించిన త్రివిక్రమమూర్తి భూర్భువ స్వర్లోకములను మూడు దారులను ధర్మార్థకామములను మూడు పురుషార్థములను నొడుదుడుగు లేకుండ నిలుపు స్థితి కర్త యాతడు లయకాలమున జలమయ మూర్తిదాల్చి లోకమేకార్ణవమొనరించి దృశ్యాదృశ్య స్వరూపమున జగమెల్ల దిగద్రావి యుండు పురాణపురుషుడు పురాణాత్మరూపుడు పరాహ రూపధారియై తన కొమ్ముతుద నివ్వసుమతినుద్ధరించిన మధుసూదనుడు వసుంధరనెల్లగెలిచి దేవతల కిచ్చిన దేవవతి నరాకృతి సింహాకృతియునై హిరణ్యకశిపు సంహరించిన శ్రీహరి ఔర్వాగ్ని (బాడబాగ్ని) స్వరూపుడై ప్రలయ మూర్తియైపాతాళమునకేగి సముద్రమునెల్ల నాపోశనము పట్టిన నారాయణుడు ఈయవనినరాకృతియైయేల యవతరించెను. సహస్రచరణుడు సహస్రశీర్షుడు సహస్రపాదుడు సహస్రాంశువు నని యేదేవుని(పురుషసూక్తమున)వేదజ్ఞులుస్తుతింతురో యుగయుగమందునెవ్వనినాభినుండి పితామహునిపుట్టినిల్లైనపద్మము ద్భవించునో లోకమేకావర్ణవమైనపుడు హిరణ్మయమైన యాకమలము ఎవ్వనినుదడి పొడమెనో నెవ్వనిచే దారకాసుర సంగ్రామమున దైత్యులు హతులైరో యెవ్వడు సర్వదేవతాత్మకమైన సర్వాయుధధరమైన మేనుగొని మద మెక్కిన కాలనేమిని గూల్చెనో తుట్టతుదను క్షీరసముద్ర మందు అమృత నిధియందు యోగమూర్తియై జగత్తుఅంధకార బంధురమైనప్పుడు నెవ్వడు నిద్రించునో యాస్వామి యవనిపై నవతరింయుటకు కారణమేమి!

సురారణిర్గర్భమధత్త దివ్యం తపఃప్రకర్షాదదితిః పురాణమ్‌|

శక్రంచయో దైత్య గణావరుద్ధం గర్భావధానేన కృతం చకార || 27

పదాని యో యోగమయాని కృత్వా చకార దైత్యాన్సలిలేశయస్థాన్‌|

కృత్వా చ దేవాంస్త్రిదశేశ్వరాంస్తు చక్రే సురేశం పురుహూతమేవ || 28

గార్హపత్యేన విధినా అన్వాహార్యేణ కర్మణా | అగ్నిమాహవనీయం చ వేదం దీక్షాం సమిద్‌ ధ్రువమ్‌ || 29

ప్రోక్షణీయం స్రువం చైవ ఆవభృథ్యం తథైవచ | అవాక్పాణిస్తు యశ్చక్రే హవ్యభాగభుజ స్తథా || 30

హవ్యాదాంశ్చ సురాంశ్చక్రే కవ్యాదాంశ్చ పితౄనధ| భోగార్థే యజ్ఞవిధినాయోజయద్యజ్ఞకర్మణి || 31

పాత్రాణి దక్షిణాం దీక్షాం చరూంశ్చోలూఖలానిచ | యూపం సమిత్ర్సువం సోమం పవిత్రాన్పరిధీనపి || 32

యజ్ఞియానిచ ద్రవ్యాణి చమసాంశ్చ తథాపరాన్‌ | సదస్యాన్యజయానాంశ్చ మేధాదీంశ్చ క్రతూ త్తమాన్‌ || 33

విబజ పురాయస్తు పారమేష్ఠ్యనకర్మణా | యుగానురూపం యః కృత్వా లోకాననుపరాక్రమాత్‌ || 34

తపోబలమున దేవతలవతరించుటకు నరణియైన ఆదితి (అగ్ని పుట్టుటకు నాధారభూతమైన జమ్మికర్రయరణియన బడును) గర్భమందు ధరించిన దైత్యగణ బద్ధుడైన దేవేంద్రుని నెవడు జాగరూకతతో రక్షించెనో మూడడుగులను యోగమయములైన పదములనుగచేసి దైత్యులను సముద్రము పాలొనరించి దేవతలను దేవేశ్వరులను దేవేంద్రుని కాపాడెనో గార్హపత్య విధానమున అన్వాహార్య కర్మచే అహవనీయాగ్నిని వేదమును దీక్షను సమిధలను ధ్రువపాత్రను బ్రోక్షణ పాత్రను న్రువమును అవబృధ్యమును నేమహానుభావుడు ముఖము చేయియు మఱి మయే యవయవ స్ఫూర్తి లేని నిరాకారుడు దేవతలను గవ్యములను ఆరగించు పితృదేవతలను గల్పించి భోగార్థము యజ్ఞాచరణమందు యజ్ఞవిథిని సమ్మేశనము సేసెనో యజ్ఞపాత్రలు దక్షిణ దీక్ష చెరువు సోమసాధనములైన యూపము సమిధ సోమము స్రువము పవిత్రములు పరిధులు మఱియు యజ్ఞార్హములైన ద్రవ్యములు చమసలు సదస్యులను యజమానులను మేధాదులను క్రతుశ్రేష్ఠములను నెవ్వడు పారమేష్ఠ్యమగు కర్మచేత (బ్రహ్మా చేయ వలసిన పనిగా) విభాగము చేసి యయ్యై యుగముల కనువుగా నొనరించెనో యయ్యజ్ఞపురుషుడు విష్ణువే కృష్ణుడై యవతరించెను.

క్షణానిమేషాః కాష్ఠాశ్చ కలాసై#్రకాల్యమేవచ | ముహూర్తాస్తిథయో మాసా దినం సంవత్సర స్తథా || 35

ఋతవః కాలయోగాశ్చ ప్రమాణం త్రివిధంత్రిషు | ఆయుః క్షేత్రాణ్యుపచయో లక్షణం రూపసౌష్ఠవమ్‌ || 36

త్రయోలోకాస్త్రయో దేవా సై#్త్రవిధ్యం పావకాస్త్రయః | త్రైకాల్యంత్రీణికర్మాణిత్రయో వర్ణాస్త్రయోగుణాః ||37

సృష్గాలోకాః పురా సర్వే యేనాన న్తేనకర్మణా | సర్వభూతగతః స్రష్టా సర్వభూతగూణాత్మకః || 38

నృణామింద్రియ పూర్వేణ యోగేన రమతేచయః | గతాగతాభ్యాం యోగేన య ఏవ విధిరీశ్వరః || 39

యో గతిర్థర్మ యుక్తానా మగతిః పాపకర్మాణామ్‌ | చాతుర్వర్ణస్య ప్రభవ శ్చాతుర్వర్ణ్యస్య రక్షితా || 40

చాతుర్విధ్యస్య యోవేత్తా చాతురాశ్రమ్య సంశయః | దిగన్తరం నభో భూమిర్వాయుర్వాపి విభావసుః|| 41

చంద్ర సూర్యమయం జ్యోతిర్యుగేశః క్షణదాచరః | యః పరంశ్రూయతే జ్యోతిర్యః పరంశ్రూయతే తపః || 42

యః పరం ప్రాహురపరం యః పరః పరమాత్మవాన్‌ | ఆదిత్యానాంతుయోదేవో యశ్చదైత్యాన్త కోవిభుః || 43

యుగాన్తే ష్వంతకోయశ్చ యశ్చ లోకా న్తకా న్తకః| సేతుర్యో లోకసేతూనాం మేథ్యో యో మేథ్యకర్మణామ్‌ || 44

వేద్యోయోవేదవిదుషాం ప్రభుర్యః ప్రభవాత్మనామ్‌ | సోమభూతశ్చ సౌమ్యానామగ్ని భూతోగ్నివర్చసామ్‌ || 45

యః శక్రాణామీశభూత స్తపోభూత స్తపప్వినామ్‌ | వినయో నయవృత్తీనాం తేజస్తే జస్వినామపి || 46

క్షణములు నిమేషములు కాష్ఠలు కలలు వీని మానము ననుసరించి యేర్పడు భూత భవిష్యద్వర్తమాన కాలములు ముహూర్తములు తిథులు నెలలు దినము సంవత్సరము ఋతువులు కాలయోగములు త్రైకాలిక కాలప్రమాణము ఆయువు క్షేత్రములు (శరీరము) వాని యువచయము (పెరుగుదల) లక్షణము రూపసౌష్టవము ముల్లోకములు ముమ్మూర్తులు త్రివిధ కార్యము త్రేతాగ్నులు త్రికాలములు కర్మత్రయము త్రివర్ణములు సత్వరజస్తమ గుణములు నెవ్వనిచే నంతులేని కర్మ ప్రభావముచే సృష్ఠింబడునో యా సృష్ఠికర్త హరియై యవతరించెను. సర్వభూతాంతర్యామియై సర్వభూత గుణమూర్తియై మానవులయందు నిద్రియములవెంటనగు యోగముచేత వినోదించునో గడచిన గడువనున్న కర్మముల యొక్క సంబంధముచేత సర్వవిధాయకుడైన యీశ్వరుడుతానై (కర్మఫలదాన సమర్థుడై) ధర్మపరులకు నెవ్వడు గతియు పాపకర్ములకు నగతియునై దోచునో చాతుర్వర్ణ్య విభాగమునకు మూలమై రక్షకుడై యున్నాడో చాతుర్వర్ణ్యమున (చతుర్వేద విజ్ఞానమునకు) నెవ్వడెరుంగునొ బ్రహ్మచర్యాది చతురాశ్రమముల కెవ్వడాశ్రయుడో సర్వదిక్కుల నడిమిభాగము నాకసము భూమి వాయువు సూర్యుడు చంద్రసూర్యమయమైన జ్యోతిస్సు చతుర్యుగములకధీశ్వరము నెవ్వడు పరంజ్యోతియని పరమ తపప్సని వేదములందు వినబడునో యెవ్వని పరుని యపరినిగాకూడ (జీవాత్మగా పరమాత్మగాకూడ) బేర్కొందురో యెవ్వడు పరుడు పరమాత్మయునో యాదిత్యుల కధినాదుడును దైత్యులకంతకుడును నేవిభుడో యుగాంతమందంతకు దెవ్వడో యెవ్వడు లోకాంతకులకుకూడ నంతకుడో లోకసేతువులకెవ్వడు సేతువో మేధ్యకర్ములకెవ్వడు మేధ్యుడో(మేథ్యము=పవిత్రము) వేదములెరింగినవారి కెవ్వడెరుంగ తగినవాడో సృష్టిహేతువు తైనవారికి గూడ నెవ్వడు సృష్టిబీజమో లేక ప్రభుశక్తి కలవానికెవ్వడు ప్రభువో సౌమ్యద్రవ్యములకెవ్వడు సోముడో అగ్నివర్చస్సులకెవ్వడు అగ్నియో సర్వలోకేశులగు శక్రులకు (ఇంద్రులకు) నీశ్వరుడో తపస్సులకు దపస్స్వరూపుడో వినయశీలురులలో నెవ్వడు వినయమో తేజశ్శాలురలలో నెవ్వడు తేజస్సో.

విగ్రహో విగ్రహార్హాణాం గతిర్గతి మతామపి | ఆకాశప్రభవో వాయుర్మాయోః ప్రాణాద్‌ హుతాశనః || 47

దివోహుతాశనః ప్రాణః ప్రాణోగ్నిర్మథుసూదనః | రసాచ్ఛోణితసంభూతిః శోణితాన్మాం స ముచ్యతే || 48

మాంసాత్తు మేదసోజన్మ మేదసో7స్థినిరుచ్యతే | అస్థ్నో మజ్జాసమభవన్మజ్జాతః శుక్రసంభవః || 49

శుక్రాద్గర్భః సమభవద్ద్రసమూలేన కర్మణా|| తత్రాపాం ప్రథమోభాగః సమ్యోసౌరాశిరుచ్యతే || 50

గర్భోష్మసంభవో జ్ఞేయో ద్వితీయో రాశిరుచ్యతే | శుక్రం సోమాత్మకం విద్యాదార్తవం పావకాత్మకమ్‌ || 51

భావా రసానుగాశ్చైషాం బీజే చ శశిపావకౌ | కఫవర్గే భ##వేచ్ఛ్రుక్రం పిత్తవర్గేచ శోణితమ్‌ || 52

కఫస్యహృదయం స్థానం నాభ్యాం పిత్తం ప్రతిష్ఠితమ్‌ | దేహస్యమధ్యే హృదయం స్థానం తన్మనసః స్మృతమ్‌ ||

నాభికోష్ఠాంతరం యత్తు తత్రదేవో హుతాశనః | మనః ప్రజాపతిఃజ్ఞేయః కఫః సోమో విభావ్యతే || 54

పిత్తమగ్నిః స్మృతం త్వేవమగ్నిసోమాత్మకం జగత్‌ | ఏవం ప్రవర్తితే గర్భే వర్థితే7ర్బుదసన్నిభే || 55

వాయుః ప్రవేశం సంచక్రే సంగతః పరమాత్మనః | స పంచధా శరీరస్థో భిద్యతే వర్తతే పునః || 56

ప్రాణాపానౌ సమానశ్చ ఉదానో వ్యానేవచ | ప్రాణో7స్య పరమాత్మానం పర్థయన్పరావర్తతే || 57

అపానః పశ్చిమం కాయముదానో7ర్థం శరీరిణః | వ్యానస్తు వ్యాప్యతే యేన సమానః సన్నివర్తతే || 58

భూతావాప్తి స్తత స్తస్య జాయేతేంద్రియగోచరా | పృథివీ వాయురాకాశమాపో జ్యోతిశ్చ పంచమమ్‌ || 59

తస్యేంద్రియవివిష్టాని స్వంస్వం భాగం ప్రచక్రిరే | పార్థివం దేహమాహుస్తు ప్రాణాత్మానం చ మారుతమ్‌ || 60

ఛిద్రాణ్యాకాశయోనీని జలాత్స్రావః ప్రవర్తతే | జ్యోతిశ్చక్షూంసి తేజశ్చ ఆత్మా తేషాం మనః స్మృతమ్‌ || 61

గ్రామాశ్చ విషయాశ్చైవ యస్యవీర్యాత్ప్రనర్తితాః | ఇత్యేతాన్పురుషః సర్వాన్సృజల్లోకాన్సనాతనః || 62

కలహశీలురులలో నెవ్వడు కలహమో గతి మంతులలో నెవడు గతియో యట్టి హరి పుడమిరవతరించెను. ఆకాశమునుండి వాయువు ప్రాణ వాయువునుండి అగ్ని పుట్టినవి. ఆకాశము అగ్ని ప్రాణము ఈ మూడునువిష్ణురూపములే. రసమునుండి శోణితము శోణితమునుండి మాంసము మాంసమునుండి మేదస్సు మేదస్సునుండి (క్రొవ్వు)(హృదయస్థమైన) యెముక యెముకనుండి మజ్జ (ఎముకలలోని క్రొవ్వు) మజ్జ్యనుండి శుక్రము శుక్రమునుండి రసనిర్మాణక్రియచే గర్భము బుట్టును. అందు మొదటి భాగము అప్పులు (ఉదకము) అదే సౌమ్యరాశియని చెప్పబడును. గర్భగతమగు ఊష్మమునుండి రెండంరాశి పుట్టును. శుక్రము సోమాత్మకము ఆర్తవము (స్త్రీ శోణితము) అనలాత్మకము. అగ్ని సోమాత్మకమైన ఈ ద్రవ్యములు రసముననుసరించి యేర్పడును. శశి పావతులు బీజములు. కఫవర్గమునకు సంబంధించినది శుక్రము (పురషవీర్యము) పిత్తవర్గములోనిది స్త్రీశోణితము. కఫమునకు స్థానము హృదయము. పిత్తమునకుస్థానము నాభి. దేహమద్యమందున్న హృదయము మనస్సుయుండుచోటు. నాభికోష్ఠమునందు అగ్నిదేవుడున్నాడు. మనస్సు ప్రజాపతి. కఫము సోముడు. పిత్తమగ్ని. ఈవిధముగ నీజగత్తు అగ్నీసోమాత్మకము. ఇట్లు ఏర్పడెడి గర్భము వృద్ధిబొందినగొలది పరమాత్మతోబాటు వాయువు శరీరమునందు బ్రవేశించును. ఆవాయువు శరీరమందు ప్రాణము అపానము సమానము ఉదానము వ్యానము అను అయిదు తెరగులయినది. ప్రాణవాయువు పరమాత్మను బెంపొందించుచు హృదయమందుండును. అపానము నాభి క్రింద భాగమున (గుదస్థానం) యేండును. ఉదానము కంఠదేశమునందుండును. వ్యానవాయువు శరీరమెల్లవ్యాపించి యుండును. సమానవాయువు నాభియందుండును. ఇంద్రియగోచరమై యీ భూతోత్పత్తి యీ వాయువులవలననే కలుగును. వాయువు ఆకాశము నీరు భూమితేజస్సు అను నీపంచభూతాంశలింద్రియములందు జేరినవై తమతమ భాగములను నిర్వహించును. దేహము పార్థివమనియందురు. వాయువును ప్రాణస్వరూపమందురు. శరీరమందున్న నవరంధ్రములు (అవకాశములు) ఆకాశమూలములు. జలభూతమువలన శరీరమందు రక్త శుక్రాది స్రావమేర్పడును. కన్నులు జ్యోతి (తేజః) స్వరూపములు. మనస్సు వానికి యాత్మరూపము. మనశ్శక్తివలననే విషయాదులు ప్రవర్తితములగును.

ఈ విధముగ సనాతనుడైన పురుషుడు పరమాత్మ సర్వలోకములను సృజించెను.

మునయ ఊచుః

నైధనే7స్మిన్కథం లోకే నరత్వం విష్ణురాగతః | ఏష నః సంశయో బ్రహ్మన్నేష నో విస్మయోమహాన్‌|| 63

కథం గతిర్గతిమతా మాపన్నో మానుషీం తనుమ్‌ | ఆశ్చర్యం పరమం విష్ణుర్దేవైర్దైత్యైశ్చ కధ్యతే|| 64

విష్ణోరుతృత్తి మాశ్చర్యం కథయస్వమహామునే| ప్రఖ్యాతబలవీర్యస్య విష్ణోరమితతేజసః || 65

కర్మణాశ్చర్యభూతస్య విష్ణోస్తత్వమిహోచ్యతామ్‌ | కథం స దేవో దేవానామార్తిహా పురుషోత్తమః || 66

సర్వవ్యాపీ జగన్నాథః సర్వలోకమహేశ్వరః | సర్గస్థిత్య న్తకృద్దేవః సర్వలోక సుఖవహః || 67

అక్షయః శాశ్వతో7నంతః క్షయవృద్ధివివర్జితః | నిర్లేపో నిర్గుణః సూక్ష్మో నిర్వికారోరికంజనః || 68

సర్వోపాది వినిర్ముక్తః సత్తామాత్ర వ్యవస్థితః | అవికారీ విభుర్నిత్యః పరమాత్మాననాతనః || 69

అచలోనిర్మలో వ్మాపీ నిత్యతృప్తో నిరాశ్రయః | విశుద్ధం శ్రూయతే యస్య హరిత్వం చ కృతేయుగే || 70

వైకుంఠత్వం చ దేవేషు కృష్ణత్వం మానుషేషు చ | ఈశ్వరస్య హి తస్యేమాం గహానాం రర్మణోగతిమ్‌ || 71

సమతీతం భవిష్యంచ శ్రోతుమిచ్చాప్రవర్తతే అవ్యక్తో వ్యక్త లింగస్థో యఏష భగవాన్ప్రభుః || 72

నారాయణో హ్యనంతాత్మా ప్రభవో7వ్యయ ఏవచ | ఏష నారాయణో భూత్వా హరిరాసీత్సనాతనః || 73

బ్రహ్మాశక్రశ్చ రుద్రశ్చ ధర్మః శుక్రో బృహస్పతిః | ప్రధానాత్మా పురాహ్యేష బ్రహ్యోణమసృజత్ప్రభుః || 74

సో7సృజత్పూర్వ పురుషః పురాకల్పే ప్రజాపతీన్‌ | ఏవం స భగవాన్విష్ణుః సర్వలోకమహేశ్వరః || 75

కిమర్థం మర్త్యలోకేస్మిన్యాతో యదుకులే హరిః || 76

ఇతి బ్రహ్మపురాణ ఋషిప్రశ్ననిరూపణంనామైకోనాశృత్యధిక శతతమో7ధ్యాయః

అన మునులిట్లడిగిరి. నశించు స్వభావముగల నీలోకమందు నశింపని పదార్థమగు విష్ణువు నరరూపమునెట్లు పొందెను. అని మా సందియము. విస్మయమును. ఉత్తమగతి కేగువారికి బరమగతి యగునీతడెట్లు మారవశరీరియయ్యెను? దేవతలు దైత్యులుగూడ నీవిషయము పరమాశ్యర్యముగా బేర్కొందురు. ఆయాశ్చర్యకరమైన విష్ణువుయొక్క పుట్టుక వృత్తాంతము తెలుపుము. ఆయన మహాతేజస్సు. బలవీర్యములు ప్రసిద్ధములు. ఆయనచేష్ట యాశ్చర్యకరము. అట్టి విష్ణువుయొక్క తత్వమిపుడు జెప్పతగును. ఆదేవుడు పురుషోత్తముడు దేవతల కష్టములనెట్లు హరించెను. సర్వ వ్యాపకుడు సర్వలోకేశ్వరుడు సర్వలోక సుఖకరుడు సృష్ఠిస్థితిలయకారుడునగుజగన్నాథుడు శాశ్వతుడు. అంతములేనివాడు. క్షయవృద్ధులులేనివాడు. పాపపుణ్యస్పర్శలేనివాడు. నిర్గుణుడు. సూక్ష్ముడు. వికారరహితుడు. నిరంజనుడు. విభుడు. నిత్యుడు. సత్తామాత్రుడు. అచలుడు నిర్మలుడు సర్వవ్యాపి నిత్యతృప్తుడు నిరాశ్రయుడునైన యాతడు దేవతలయందు వైకుంఠభావమును (నారాయణత్వం) మానవులందు కృష్ణత్వమును నెట్లుపొందెను. కృతయుగమందు విశుద్ధమైన హరిత్వమును సర్వేశ్వరుడగు నా భగవంతుని కర్మగతిని దురవగాహమగు గడచిన జరగనున్న దానిని వినగోరుచున్నాము. భగవంతుడు స్వభావముచేత నవ్యక్తుడయ్యు వ్యక్తరూపమునందియున్నాడు. ఈయన నారాయణుడయ్యు హరియనుపేర అవతరించెను. బ్రహ్మ శక్రుడు(ఇంద్రుడు) రుద్రుడు ధర్ముడు (యముడు) శుక్రుడు గురుడు అయినాడు. తొలుత ప్రధానాత్మయై బ్రహ్మను సృజించెను. పురాణపురుషుడగు నతడు పూర్వకల్పమందు ప్రజాపతులను సృజించెను. అట్టి భగవంతుడు (షడ్గుణౖశ్వర్య సంపన్నుడు) సర్వవ్యాపకుడగు విష్ణువు సర్వలోకేశ్వరుడు మర్త్యలోకమున యదుకులమందు నెందులకు బ్రవేశించెను. తెలుపుము.

ఇది బ్రహ్మపురాణమున ఋషిప్రశ్ననిరూపణమును నూటడెబ్బది తిమ్మిదవ అధ్యాయము.

7

Brahmapuranamu    Chapters