Brahmapuranamu    Chapters   

అధచతుర్ధశో7ధ్యాయః

శ్రీ కృష్ణజన్మానుకీర్తనమ్‌

లోమహర్షణ ఉవాచ -

గాంధారీ చైవ మాద్రీ చ క్రోష్టో ర్బార్యే బభూవతుః | గాంధారీ జనయామాస అసమిత్రం మహాబలం || 1

మాద్రీ యాధాజితం పుత్రం తతో7న్యం దేవమీఢుషమ్‌ | తేషాం వంశ స్త్రిధా భూతో వ్భష్ణీనాం కులవర్ధనః || 2

మాద్య్రాః పుత్రౌ తు జజ్ఞాతే శ్రుతౌ వృష్ణ్యంధకాపుభౌ | జజ్ఞాతే తన¸° వృష్ణేః శ్వఫల్క శ్చిత్రకస్తథా || 3

సూతుడిట్లనియె -

క్రోష్టుని భార్యలు గాంధారి మాద్రియును, గాంధారి అనమిత్రుని మాధ్రి యుధాజిత్తును దేవమీఢుఘడనను నిద్దరింగనెను. వారివంశ##మే వృష్టి వంశముగా మూడు శాఖలుగా వృధ్ది నందెను. మాద్రికొడుకులు వృష్ణి అంధకుడు. అనువారు శ్వఫల్కడు, చిత్రకుడనువారు వృష్ణియొక్క కుమారులు.

శ్వఫల్కస్తు ముని శ్రేష్ఠా ధర్మాత్మా యత్ర వర్తతే | నాస్తి వ్యాధిభయం తత్రానా వర్షస్తపమేవ చ || 4

కదాచి త్కాశిరాజస్య విషమే మునిసత్తమాః | త్రీణి వర్షాణి పూర్ణాని నావర్ష త్పాకశాసనః || 5

స తత్ర చా77నయామాస శ్వఫల్కం పరమార్చితమ్‌ | శ్వఫల్క పరివర్తేస వవర్ష హరివాహనః || 6

శ్వఫల్కః కాశిరాజస్య సుతాం భార్యా మవిందత | గాందినీం నామ గాం సా చ దదౌ విప్రాయ నిత్యశః 7

శ్వఫల్కుడు ధర్మపరుడు, వాని పాలనము నందు వ్యాది భయము, అవృష్ణి తాపము మొదలైన బాధలు లేకుండె. ఒకప్పుడు కాశీరాజు పాలించు దేశమునందింద్రుడు మూడేండ్లు వర్షింపనేలేదు. అపుడు కాశీరాజు శ్వఫల్కుని తన రాజ్యమునకుం గొనవచ్చెను. అతడచ్చేట మసలినకతన హరివాహనుడు (ఇంద్రుడు) వాన గురియించెను. అపుడు శ్వఫల్కుడు కాశీశ్వరుని కుమార్తె గాంధినిని వివాహమాడెను. అమె నిత్యము విప్రునికి గోవు నొసంగుచుండెను.

దాతా యజ్వా చ వీరశ్చ శ్రుతవా నతిథిప్రియాః | అ క్రూరః సుషువే తస్మా చ్ఛ్వఫల్కా ద్భూరిదక్షిణః || 8

ఉపమద్గు స్తథా మద్గు ర్మేదుర ళ్చారిమేజయః | అవిక్షిత స్తథా77క్షేపః శత్రుఘ్న శ్చారిమర్ధనః || 9

ధర్మధృ గ్యతిధర్మాచ ధర్మోక్షో7ంధకరు స్తథా | అవాహ ప్రతివాహౌచ సుందరీ చ వరాంగనా || 10

అక్రూరేణోగ్రసేనాయాం సుగాత్య్రాం ద్విజసత్తమాః | ప్రసేస శ్చోపదేవశ్చ జజ్ఞాతే దేపవర్చసౌ || 11

చిత్రక స్యాభ వన్పుత్రాః పృథు ర్విపృథురేవ చ | అశ్వగ్రీవో7శ్వ బాహుశ్చ స్వపార్మ్వకగవేషణౌ || 12

అరిష్టనేమి రశ్వశ్చ సుధర్మా ధర్మభృత్తథా | సుబాహు ర్బహుబాహుశ్చ శ్రవిష్టా శ్రవణ స్త్రి¸° || 13

అసిక్న్యాం జనయామాస శూరం వై దేవమీఢుషమ్‌ | మహిష్యాం జజ్ఞిరే శూరా భోజ్యాయాం పురుషా దశ || 14

వనుదేవో మహాబాహూః పూర్వ మానకదుందుభిః | జజ్ఞే యస్య ప్రసూతస్య దుందుభ్యః ప్రాణదన్‌దివి || 15

అనకానం చ సంహ్రాదః సుమహా నభవ ద్దివి | పపాత పుష్పనర్షశ్చ శూరస్య జననే మహాన్‌ || 16

మనుష్యలోకే క్సత్స్నే7పిరూపే నాస్తి సమోభువి | యప్యా77సీ త్పురుషాగ్ర్యస్య కాంతిశ్చంద్రమసోయథా || 17

దాత యజ్వ వీరుడు పండితుడు అతిధిప్రియుడు భూరిదక్షిణుడైన అక్రూరుడు ఉపమద్గువు మద్గువు మందరుడు అరిమేజయుడు, అవిక్షుతుడు అంధకరువు అవాహుడు ప్రతివాహుడును సుందరి యను కన్వయు శ్వఫల్కునకు పుట్టిరి. దేవవర్చస్సు గల ప్రసేనుడు, ఉపదేవుడు అనువారు ఉగ్రసేనయందు అక్రూరునకు ఉదయించిరి. వృష్ణి కుమారుడగు చిత్రుకునకు పృధువు వివృధువు అశ్వగ్రీవుడు, లశ్వబాహువు, స్వపార్శ్వుడు, గవేషణుడు, అరిష్టనేమిఅశ్వుడు, సుధర్ముడు, సుభాహువుబహుబాహువు ననుకుమారులు. శవిష్ఠశ్రవణయను కుమార్తెలుపుట్టిరి. దేవమీఢుడు అసిక్నియందు శూరుడనువానినిగనెను. శూరునకు భోజ్యయందు పదిమంది శూరులనువారుదయించిరి. వసుదేవుడు ఆనక దుందుభియను పేరున ముందుగ పుట్టెను. పుట్టగానే దివంబున అనకములనెడి వాద్య విశేములు దుందుభులు మ్రోగినవి. పుష్పవృష్టి గురిసెను. వసుదేవునితో సముడయిన యందగా డీలోకమునలేడు. అతడు చంద్రునివంటి కాంతితో తేజరిల్లెను.

దేవభాగ స్తతో జజ్ఞే తథా దేవశ్రవాః పునః | అనాధృష్టిః కనవకో వత్సవా నథ గృంజమః || 18

శ్యామః శమీకో గండూషః పంచ చాస్య వరాంగనాః | పృధుకీర్తిః పృథా చైవ శ్రుత దేవా శ్రుత శ్రవా || 19

రాజాధిదేవీ చ తథా పంచైతా వీరమాతరః | శ్రుత శ్రవాయాం చైద్యస్తు శిశుపాలో7భవన్నృపః || 20

హిరణ్యకశిపు ర్యో7సౌ దైత్యరాజో7భవత్పురా | పృథుకీర్త్యాం తు సంజజ్ఞే తనయో వృధ్ధశర్మణః || 21

కరూశాధిపతి ర్వీరో దంతవక్త్రో మహాబలః | పృధాం దుహితరం చక్రే కుంతి స్తాం పాండు రావహత్‌ || 22

యస్యాం స ధర్మవి ద్రాజా ధర్మోజజ్ఞే యుధిష్ఠిరః | భీమసేన స్థథా వాతా దింద్రాచ్చైవ ధనంజయ || 23

లోకే7ప్రతిరథో వీరః శక్రతుల్యపరాక్రమః | ఆనమిత్రాచ్ఛిని ర్జజ్ఞే కనిష్ఠా ద్వృష్ణినందనాత్‌ || 24

శైనేయః సత్యక స్తస్మా ద్యుయుధానశ్చ సాత్యకిః | ఉద్దవో దేవభాగస్య మహాభాగః సుతో7భవత్‌ || 25

పండితానాం పరం ప్రాహు ర్దేవశ్రవస ముత్తమమ్‌ | అశ్మక్యం ప్రాప్తవా న్పుత్ర మనాధృష్టి ర్యశస్వినమ్‌ || 26

నివృత్తశత్రుం శత్రుఘ్నం శ్రుతదేవా త్త్వజాయత | శ్రుతదేవాత్మజా స్తేతు నైషాదిర్యః పరిశ్రుతః || 27

ఏకలవ్యో మునిశ్రేష్ఠా నిషాదైః పరివర్థితః | వత్సవతే త్వవుత్రాయ వసుదేవః ప్రతాపవాన్‌ || 28

అద్భిర్దదౌ సుతం వీరం శౌరిః కౌశిక మౌరసమ్‌ | గండూషాయ హ్యవుత్రాయ విష్వక్సేనో దుదౌ నుతాన్‌ || 29

చారుదేష్ణం సుదేష్ణం చ పంచాలం కృతలక్షణమ్‌ |

ఈయనకు దేవ భాగుడు, దేవశ్రవుడు, అనాధృష్ఠి, కనవకుడు, వత్సవానుడు, గృంజముడు, శ్యాముడు, శమీకుడు, గండూషుడునను కొమరులు, పృథుకీర్తి, పృథ, శ్రుతదేవ, శ్రుతశ్రవ రాజాధిదేవి అను నైదుగురు కూతురులు వీరపత్నులు గల్గిరి, శ్రుత శ్రవయందుచైద్యుడు శిశుపాలుడగను పేర గల్గెను. ఇతడే క్రింధటి జన్మమునదైత్యపతి హిరణ్యకశివుడు, వృద్ధశర్మ వలన వృధ కీర్తియందు కరూశాధిపతియోన దంతవక్త్రుండు పుట్టెను. కుంతియనురాజు పృథను కుమార్తెగా పెంచుకొనెను. అమెను పాండురాజు పెండ్లాడెను. అమెయందు యముడే ధర్మవేత్తయైన ధర్మరాజై(యుధష్టిరుడు) యుదయించెను. వాయువుcవలన భీమసేనుడు గల్గెను. ఇంద్రుని వలన ధనంజయుడు అప్రతిరథుడు ఇంద్రపరాక్ర ముడుదయించెను. కనిష్ఠుడయిన అనమిత్రుడను వృష్ణినందనునికి శినియను వాడుకల్గెను. శిని కొడుకు (శైనేయుడు) సత్యకుడు సత్యకునికుమారుడు యుయుధానుడు(సాత్యకి) దేవభాగునకు మహానుభావుడు. ఉద్దవుండావిర్భవించెను. డేవశ్రవునిపండితాగ్రణియందురు, దేవశ్రవుడు కీర్తి శాలియగుఆశ్మక్యుడను సుతునింబడెసెను. అనాధృష్టినికృత్తశత్రువసుకుమారిని శ్రుతదేవయనునామె శత్రుఘ్ననిం గనెను. శ్రుతదేవ కుమారుండు ఏకలవ్యుడు నిషాదుని పెంపకములో పెరిగెను. వత్సవంతునకు పుత్రులు లేనికతన శౌరి (శూరవంశమువాడగు వసుదేవుడు) తన కుమారుని కౌశికుని ధారాదత్తము సేసెను. అవుత్రకుడైన గండూఘనకు విష్వక్సేనుడు తనకుమారులగు చారుదేష్టుడు, సుదేష్ణుడు పంచాలుడు కృత లక్షణుడునను వారిందతత్త యిచ్చెను.

అసంగ్రామేణ యో విరో నా77 వర్తత కదాచన | రౌక్మిణయో మహాబాహుః కనీయా న్ద్విజసత్తమా || 30

వాయసానాం సహస్రాణి యం యాంతం పృష్ఠతో7న్వయుః చారూ నద్యోప భోక్ష్యామ శ్చారుదేష్ణ హతానితి || 31

తంత్రిజ స్తంత్రిపాలశ్చ సుతౌ కనవకస్య తౌ | వీరు శ్చాశ్వ హను శ్చైవ వీరౌ తా వథగృంజిమౌ || 32

శ్యమ పుత్రః శమీకస్తు శమీకో రాజ్య మావహత్‌ | జుగుప్సమానో భోజత్వా ద్రాజసూయ మవాప సః || 33

అజాతశత్రుః శత్రూణాం జజ్ఞే తస్య వినాశనః | వసుదేవ సుతా న్వీరా న్కీర్తయిష్యా మ్యతఃపరమ్‌ || 34

వృష్ణే స్త్రవిధ మేవంతు బహుశాఖం మహౌఙసమ్‌ | ధారయ న్విపులం వంశం నానర్థై రిహ యుజ్యతే || 35

చారుధేష్ణుడు యుద్ధమునకేగి యెన్నడు వెనుదిరిగినవాడు గాడు అతడు రుక్మిణి తనయులందు కడగొట్టువాడు మహావీరుడు, చారుధేష్ణునిచే హతులైనవారిని (చారూన్‌ రుచిగనున్నవారివి) ఇపుడుతినవలయునని యాత్ర పోవునపుడు వేలకొలది కాకు లాతని వెంట పోయెడివట. కనవకునికి తంత్రిజుడు, తంత్రిపాలుడు ననునిద్ధరు కల్గిరి. గృంజమునికి వీరువు అశ్వహనువు గల్గిరి. శ్యమపుత్రుడగు శమీకుడు రాజ్యమేలెను. భోజవంశమున జనించుటచే నేపగించు వాడైనను రాజసూయమొనర్చె. అతనికి శత్రునాశకుడగు అజాతశత్రపు గల్గెను. ఇక వసుదేవుని సంతానము దెల్పెద. వృష్ణియొక్క (వృష్ణి అంధకభోజ) త్రిశాఖమైన (మూడుశాఖలై) యీ వంశముయొక్క చరిత్ర ధారణము చేయునతడు వంశాభివృద్ధి నందును అనర్థములనుబాయును.

యాః సత్న్యో వసుదేవస్య చతుర్దశ వరాంగనాః | పౌరవీ రోహిణీ నామ మదిరాది స్తథాపరా || 36

శైశాఖీ చ తథా భద్రా సునామ్నీ చైవ పంచమీ సహదేవా శాంతిదేవా శ్రీదేవీ దేవరక్షితా || 37

వృకదేవ్యుపదేవీ చ దేవకీ చై వ సప్తమీ | నుతను ర్వడవా చైవ ద్వే ఏతేపరిచారికే || 38

పౌరవీ రోహిణీ నామ బాహ్లికస్యా77త్మజా7భవత్‌ | జ్యేష్ఠా పత్నీ మునిశ్రేష్ఠా దయితా77నకదుందుభేః || 39

లేభే జ్యేష్ఠం సుతం రామంశరణ్యం శరమేవచ | దుర్దమం దమనం ళుభ్రం పిండారక ముశీనరమ్‌ || 40

చిత్రానామ కుమారీ చ రోహిణీ తనయా నవ | చిత్రా సుభ##ద్రేతి పున ర్విఖ్యాతా మునిసత్తమాః || 41

వసుదేవాచ్చ దేవక్యాం జజ్ఞే శౌరి ర్మహాయశాః | రామాచ్చ నిశఠో జజ్ఞే రేవత్యాం దయితః సుతః || 42

సుభద్రాయాం రథీ పార్థా దభిమన్యు రజాయత | అక్రూరా త్కిశికన్యాయాం సత్యకేతు రజాయత || 43

వసుదేవస్య భార్యాసు మహాభాగాసు నప్తసు | యే పుత్రా జజ్ఞిరే శూరాః సమస్తాం న్నిబోధత || 44

భోజశ్చ విజయశ్చైవ శాంతిదేవాసుతా వుభౌ | వృకదేవః సునామాయాం గద శ్చాస్తాం నుతా వుభౌ అగావహాం మహాత్మానం వృకదేవీ వ్యజాయత |

వసుదేవుని భార్యలు పదునల్గురు, పురువంశమున పుట్టిన (1) పౌరవి, (2) రోహిణి, (3) మధిరా, (4) ఆది, (5) వైశాఖి, (6) భద్ర, (7) నునామ్నీ, (8) సహదేవ, (9) శాంతిదేవ, (10) శ్రీదేవి (11) దేవరక్షిత, (12) వృకదేవి, (13) ఉపదేవి, (14) దేవకి అని సుతనువు బడబ అనువారిరువురు పరిచారికలు, పౌరవి, రోహిణియు బాహ్లికుని కుమార్తెలు. వసుదేవని పెద్దభార్యకు రాముడు, శరణ్యుడు, శరుడు, దుర్దముడు, దమనుడు, శుభ్రుడు, పిండారకుడు, ఉశీనరుడు, చిత్రయను కూతురుం గల్గిరి మొత్తం వీరు తొమ్మండుగురు. చిత్రయే సుభద్రయను పేరుతో గూడ ఖ్యాతి గాంచినది. వసుదేవునికి దేవకీయందు శౌరి (కృష్ణుడు) అవతరించెను. రామునికి రేవతియందు నిశఠుడను, ప్రియుపుత్రుడుదయించె. పార్ధునికి సుభద్రయందురథికుడగు అభిమన్యుడుగల్గెను. అక్రూరునికి కాశికన్యయందు సత్యకేతువు జనించె. వసుదేవనియేడ్వురు భార్యలందు కలిగిన శూరుల క్రమమిది. శాంతిదేవకు భోజుడువిజయుడు నను నిద్ధరుగల్గిరి. సునామయందు వృకదేవుడు, గదుడు గల్గిరి. వృకదేవికి అగావహుడు పుట్టెను.

కన్యా త్రిగర్త రాజస్య భార్యావై శిశిరాయణః || 46

జిజ్ఞాసాం పౌరుషే చక్రే న చస్కందే చ పౌరుషమ్‌ | కృష్ణాయస సమప్రఖ్యో వర్షే ద్వాదశ##మే తథా || 47

మిథ్యాభిశప్తో గార్గ్యస్తు మన్యునా7తిసమీరితః | ఘోషకన్యా ముపాదాయ మైధునా యోపచక్రమే || 48

గోపాలీ చప్సరా స్తస్య గోపస్త్రీవేషధారిణీ | ధారయామాస గార్గ్యస్య గర్భం దుర్ధర మచ్యుతమ్‌ || 49

మాసుష్యాం గర్గబార్యాయాం నియోగా చ్చూలపాణినః | స కాలయవనో నామ జజ్ఞే రాజా మహాబలః || 50

పృత్త పూర్వార్ధకాయస్తు సింహసంహననో యువా | అపుత్రస్య స రాజ్ఞస్తు వపృధే7ంతః పురే శిశుః || 51

యవనస్య మునిశ్రేష్ఠా స కాలయువనో7 భవత్‌ | అయుధ్యమానో నృపతిః పర్యపృచ్చ ద్ద్విజోత్తమమ్‌ || 52

పృష్ణ్యంధకకులం తన్య నారదో7కథయ ద్విభుః | అక్షౌహిణ్యా తు సైనస్య మధురా మభ్యయాత్తాదా || 53

దూతం సంప్రేషయామాన పృష్ణ్యంధకని వేశనమ్‌ | తతో పృష్ణ్యంథకాః కృష్ణం పురస్కృత్య మహామతిమ్‌ || 54

సమేతా మంత్రయామాసు ర్వవనస్య భయా త్తదా | కృత్వా వినిశ్చయం సర్వే పలాయన మరోచయన్‌ || 55

విహాయ మధురాం రమ్యాం మానయంతః పినాకినమ్‌ | కుశస్థలీం ద్వారవతీం నివేశయితు మీప్సవః || 56

ఇతి కృష్ణస్య జన్మేదం యః శుచి ర్నియతేంద్రియః | పర్వసు శ్రావయే ద్విద్వా ననృణః స సుఖీ భ##వేత్‌ 57

ఇతి శ్రీమహాపురాణ ఆదిబ్రాహ్మే కృష్ణజన్మానుకీర్తనం నామ చతుర్దశో7ధ్యాయః

త్రిగర్తరాజుకూతురు శిశిరాయణి యొక్క భార్య గార్గ్యమునివర్యుని పౌరుష పరీక్షకు పూనుకొనెను. కాని యతనివీర్యము స్ఖలనము కాలేదు. పన్నెండవ సంవత్సరమున పరిహసితుడైనయాముని ఒక ఘోషకన్యతో మిథున క్రీడకువక్రమించెను. అఘోషాంగన ఘోషవేషధారిణియైన గోపాలియనునొక అప్సరస.గోపకన్యావేషము ధరించి యాతని ధరింపనలవికాని గర్భమును (శిశువు) ధరించెను. మనుష్య స్త్రీ యైన యాగార్గ్యుని భార్యయందు శివునాజ్ఞచే కాలయవనుడనువాడు సింహమువంటి మహాబలశాలి పుట్టెను. వాని పూర్వకాయము వర్తులాకారము సింహమువంటి యాకారము గల్గియుండెను. అపుత్రకుడైన యవనరాజు యొక్క అంతః పురమున వాడు పెరిగెను. అందువలన యవనునికి వాడు కుమారడయి కాలయవనుడన నొప్పెను. వాడు యుద్ధకుతూహలము గొనియేరితో తలపడుదునవి యడుగగా దేవర్షి నారదుడు వృష్ణి - అంధక కులములను జెప్పెను. అక్షౌహిణిసేనతో వాడు మధురపైనేగి దూతను బంపెను. అపుడువృష్ణ్యంధకులు మహామతియైన కృష్ణునిం బురస్కరించుకొని పోయి కార్యాలోచనచేసి యొకనిశ్చయమునకు వచ్చి పారిపోవుటకంగీకరించిరి. పినాకపాణియైన శివుని అభిప్రాయమును గౌరవించి మధురనువదిలి కుశస్థలిని ద్వారకనుజేరినివాసము సేయనెంచిరి. ఇది శ్రీ కృష్ణ జన్మవృంత్తాంతము. శుచియై ఇంద్రియములను నియమించుకొని పర్వములందు వినిపింపవలెను. అట్లువినిపించిన విద్వాంసుడు ఋణములను బాసి సుఖియగును.

ఇది శ్రీ బ్రహ్మపురాణమందు కృష్ణ జన్మానుకీర్తనమనుపదునాలుగవ యధ్యాయము

Brahmapuranamu    Chapters