Sri Devi Bagavatham-2    Chapters   

అథ ఏకాదశో7ద్యాయః.

వ్యాస ఉవాచః పుష్పరాగమయా దగ్రే కుంకుమారుణ విగ్రహః | పద్మరాగమయః సోలో మధ్యే భూశ్చైవతాదృశీ. 1

దశయోజనవాన్దైర్గ్యే గోపురద్వారసంయుతః | తన్మణి స్తంభసంయుక్తా మండపాః శతశో నృప. 2

మధ్యే భువి సమాసీనా శ్చతుఃషష్టీమితాః కలాః | నానాయుధధరా వీరా రత్న భూషణభూషితాః. 3

ప్రత్యేకలోకస్తాసాం తు తత్తల్లోకస్య నాయకాః | సమంతాత్పద్మరాగస్య పరివార్య స్థితాః సదా. 4

స్వస్వలోకజనై ర్జుష్టాః స్వస్వవాహనహేతిభిః | తాసాం నామాని వక్ష్యామి శృణు త్వం జనమేజయ. 5

పింగలాక్షీ విశాలాక్షీ సమృద్ది ర్వృద్ధి రేవ చ | శ్రద్ధా స్వాహాస్వధా భిఖ్యా మాయా సంజ్ఞా వసుందారా. 6

త్రిలోకధాత్రీ సావిత్రీ గాయత్రీ త్రిదశేశ్వరీ | సురూపా బహురూపా చ స్కందమాతా7చ్యుత ప్రియా. 7

విమాలా చామలా తద్వ దరుణీ పునరారుణీ | ప్రకృతి ర్వికృతిః సృష్టిః స్థితిః సంహృతి రేవ చ. 8

సంధ్యా మాతా సతీ హంసీ మర్దికా వజ్రికాపరా | దేవమాతా భగవతీ దేవకీ కమలాసనా. 9

త్రిముఖీ సప్తచముఖ్యాన్యా సురాసురవిమర్దినీ | లంబోష్ఠీ చోర్ద్వకేశీ చ బహుశీర్షా వృకోదరీ. 10

రథరేఖాహ్వయా పశ్చాచ్ఛశిరేఖా తథాపరా | గగనవేగా పవనవేగా చైవ తతః పరమ్‌. 11

అగ్రే భువనపాలా స్యా త్తత్పశ్చాన్మదనాతురా | అనంగానంగమథనా తథై వానంగమేఖలా. 12

అనంగకుసుమా పశ్చా ద్విశ్వరూపా సురాదికా | క్షయంకరీ భ##వేచ్చక్తి రక్షోభ్యా చ తతఃపరమ్‌. 13

సత్యవాది న్యథ ప్రోక్తా బహురూపా శుచివ్రతా | ఉదారాఖ్యా చ వాగీశీ చతుఃషష్టిమితాః స్మృతాః. 14

జ్వలజ్జిహ్వానాః సర్వా వమంతో వహ్నిముల్బణమ్‌ | జలంపిబామః సకలం సంబరామో విభావసుమ్‌. 15

పవనం స్తంభయామో ద్య భక్షయామో ఖిలం జగత్‌ | ఇతి వాచం సంగిరం తే క్రోధసంరక్తలోచనాః. 16

చావబాణధరాః సర్వా యుద్ధాయై వోత్సుకాః సదా | దంష్ట్రోకటకటారవై ర్బధిరీకృతదిజ్ముఖాః. 17

పింగోర్ధ్వకేశ్యః సంప్రోక్తా శ్చాపబాణకరాః సదా | శతాక్షౌహిణికా సనాప్యేకైకస్యాః ప్రకీర్తితా. 18

ఏకైకశ##క్తేః సామర్థ్యం లక్షబ్రహ్మాండ నాశ##నే | శతాక్షౌహిణికాసేనా తాదృశీ నృపసత్తమ. 19

కిం నకుర్యా జ్జగత్మస్మి న్న శక్యం వక్తుమేవ తత్‌ | సర్వా పి యుద్ధ సామగ్రీ తస్మిన్సాలే స్థితా మునే. 20

రథానాం గణానా నాస్తి హయానాం కరిణాం తథా | శస్త్రాణాం గణనా తద్వ ద్గణానాం గణనా తథా. 21

పదునొకండవ అధ్యాయము

మణిద్వీప వర్ణనము

వ్యాసు డిట్లనియె : పుష్యరాగమణుల ప్రాకారమునకు ఎగువగ లోపలి వైపున కుంకుమవలె నెఱ్ఱనైన పద్మరాగ మణుల ప్రాకారము చెన్నొందుచుండును. అచటి నేలయు నటులే యెఱ్ఱగ నుండును. ఆ ప్రాకారము పది యోజనముల ఎత్తు గలది. దానికి గోపుర ద్వారములు గలవు. రాజా! అచట పద్మరాగమణులతో ప్రకాశించునట్టి మండపము లెన్నియో కలవు. ఆ ప్రాకారముల నడుమ పెక్కాయుధములు - రత్నభూషణములు దాల్చిన వీరులును అరువదినాల్గు కళలును గలవు. ఆ వీరులకు ప్రత్యేకము నాయకులు గలరు. వారికి ప్రత్యేకము లోకములును గలవు. ఆ లోకములును పద్మరాగమణులచే నిర్మింప బడినవే. ఆయా లోకములందలి జను లాయా వాహనములు వస్త్రములు దాల్తురు. జనమేజయా! వారి పేర్లు తెలుపుచున్నాను వినుము. పింగలాక్షి - విశాలాక్షి - సమృద్ధి - శ్రద్ధ - స్వాహా - స్వధా - అభిఖ్య - మాయ - సంజ్ఞ - వసుంధర - లోకధాత్రి - సావిత్రి - గాయత్రి - త్రిదశేశ్వరి - సురూప - బహురూప - స్కందమాత - అచ్యుత ప్రియ - విమల - అమల - అరుణి - అరుణి - ప్రకృతి - వికృతి - సృష్టి - స్ధితి - సంహృతి - సంధ్య మాత - సతి - హంసి - మర్దిక - వజ్రిక - దేవమాత - భగవతి - దేవకి - కమలాసన - త్రిముఖి - సప్తముఖి - సురాసురవిమర్ధిని - లంబోష్ఠి - ఊర్ధ్వకేశి - బహుశీర్ష - వృకోదరి - రథరేఖ - శశిరేఖ - గగనవేగ - పవనవేగ - భవనపాల - మదనాతుర - అనంగ - అనంగమథన - అనందమేఖల - అనంగకుసుమ - విశ్వరూప - సురాధిక - క్షయంకరి - శక్తి - అక్షోభ్య - సత్యవాదిని - బహురూప - శుచివ్రత - ఉదార - వాగీశి - అను నరువదినాల్గు కళలును శక్తులనబరగును. వారందఱిని నిప్పులు గ్రక్కుచున్న మహోజ్జ్వలమైన నాలుకలు గలవు. వారుపెక్కు ముఖములనుండి యగ్విజ్వాలలు ప్రజ్వరుల్లుచుండును. ''మన మీ నీ రంతయును త్రావుదము. ఈ యగ్ని నంతయు చల్లార్చుదము. ఈ గాలినంతయు స్తంభిపజేతము ఈ జగముల నెల్ల భక్షించి వేతము.'' అని కన్ను లెఱ్ఱ జేసి వారు పల్కుచుందురు. అందఱును విల్లమ్ములు దాల్చి కయ్యమునకు కాలు దువ్వుచుందురు. పటపట పండ్లు గీటుటచే గల్గు చప్పుళ్లకు దిక్కులకు చెవుడు పట్టిన ట్లుండును. ఆ మహావీరులతో ప్రతి యొక్కనికి నూర్ధ్వ కేశములు గలవు. వారికి విల్లమ్ములు దాల్చున నూర్లయక్షౌహిణుల సేన గలదు. ఒక్కొక్క శక్కికి లక్ష బ్రహ్మాండములైన చంపగల శక్తి గలదు. అట్టివి నూర్ల యక్షౌహిణుల సేనలు గలవు. ఈ జగములందా శక్తులకు సాధ్యము చకానిది కలదని యెవడును. పలుకజాలడు. ఆ ప్రాకారమందు వారి యుద్ధసామగ్రి యంతయును భద్రపఱచుబడియుండును. ఆచట రథములు - గజములు - గుఱములు - శస్త్రములు - గణములును లెక్కకు మీరి యున్నవి.

పద్మరాగమయా దగ్రే గోమేదమణినిర్మితః | దశ##యేజనదైర్ఘ్యేణ ప్రాకారో వర్తతే మహాన్‌. 22

భాస్వజ్జప్రసూనాభో మధ్యభూస్తస్య తాదృశీ | గోమేదకల్పితాన్యేవ తద్వాసిసదనానిచ. 23

పక్షిణః స్తంభవర్యా శ్చ వృక్షా వాప్యః సరాం సి చ | గోమేదకల్పితా ఏవ కుంకుమారుణ విగ్రహా. 24

తన్మధ్యస్ధా మహాదేవ్యో ద్వాత్రిం శచ్చక్తయః స్మృతాః | నానాశస్త్రప్రహరణా గోమేదమణిభూషితా. 25

ప్రత్యేకలోకవాసిన్యః పరివార్యం సమంతతః | గోమేదసాలే సన్నద్ధాః పిశాచవదనా నృప. 26

స్వర్లోకవాసిభి ర్నిత్యం పూజితాశ్చ కబాహవః | క్రోధరక్తేక్షణా భింది పచ చ్ఛింధి దహేతి చ. 27

వదంతి సతంత వాదం యుద్ధోత్సు క హృదంతరాః | ఏకైకస్యా మహాశ##క్తే ర్దసాక్షౌహిణికా మతా. 28

సేనా తత్రా ప్యేకశక్తి ర్లక్షబ్రహ్మాండనాశినీ | తాదృశీనాం మహాసేనా వర్ణనీయా కథం నృప. 29

రథానాం నైవ గణనా వాహనానాం తథైవ చ | సర్వయుద్ధసమారంభస్తత్ర దేవ్యా విరాజతే. 30

తాసాం నామాని వక్ష్యామి పాపనాశకరాణి చ | విద్యాహ్రీ పుష్టయః పజ్ఞా సినీవాలీ కుహూ స్తథా. 31

రుద్రా వీర్యా ప్రభా నందా పోషిణీ బుద్ధిదా శుభా | కాలరాత్రి ర్మహారాత్రి ర్బద్రకాళీ కపర్దినీ. 32

వికృతిర్దండిముండిన్యౌ సేందుఖండా శిఖండినీ | నిశుంభ శుంభమథినీ మహిషాసుర మర్తినీ. 33

ఇంద్రాణీ చైవ రుద్రాణీ శంకరార్థశరీరిణీ | నారీ నారాయణీచైవ త్రిశూలిన్యపి పాలినీ. 34

అంబికా హ్లాదినీ పశ్చా దిత్యేవం శక్తయః స్మృతాః | యద్యేతాః కుపితా దేవ్య స్తధా బ్రహ్మాండనాశనమ్‌. 35

పరాజయో నచైతాసాం కదాచి త్క్వచిదస్తిహి |

అట్టి పద్మరాగమణుల ప్రాకారమునకు ఎగువగా లోపలి వైపున గోమేదకమణుల ప్రాకరము తనరారుచుండును. అది పది యోజనముల ఎత్తున నొప్పారుచుండును. అది జపాకుసుమమువలె వెలుగులు విరజిమ్ముచుండును. దాని నడుమ గల నే యు నటులే యుండును. అచట నుండువారు నదే వర్ణముతో నుందురు. అచటి భవనములును నదే వర్ణముతో గోమేదక కాంతులు జిమ్ముచుండును. అచటి పక్షులు - వృక్షములు - స్తంభములు - కొలంకులును కుంమవలె నెఱ్ఱగ గోమేద కముతో చేయబడినట్టు లొప్పుచుండును. ఆ ప్రాకారము నడుమ దేవియొక్క ముప్పదిరెండు శక్తు లుందురు. వారు గోమేద కపు సొమ్ములు దాల్చి పెక్కు శస్త్రములు ప్రయోగింపజాలియుందురు. ఆ ప్రాకారమున ముప్పదిరెండు లోకములు గలవు. ప్రతి లోకశక్తికి పది యక్షౌహిణుల సేన గలదు. రాజా! గోమేదక ప్రాకరమందలి శక్తులు పిశాచవదనలు. ఆ శక్తులు నిరంతరము చక్రములు దాల్తురు. స్వర్గవాసులచేత నిత్యము పూజింపబడుచుందురు. వారు కోపోద్రేకమున ''ఛేదింపుడు బేదింపుడు వండుడు కాల్చుడు'' అని నిరంతరము యుద్ధము చేయు తలంపుతో నుందురు. ప్రతి మహాశక్తియొద్ద పదియక్షౌహి ణులసేన యుండును. వారితో ప్రతి శక్తియును లక్షబ్రహ్మాండములనైన నాశము చేయగలది. అటువంటి మహాసేనల నెంతని వర్ణించగలము. అచట నున్న రథములను వాహనముల కింక లెక్కయే లేదు. వారందఱును దేవి కొఱకై యుద్ధము చేయుటకు సన్నద్ధలై యుందురు. వారి పాపహరములైన పేరులు తెలుపుదును వినుము. విద్య హ్రీ పుష్టి ప్రజ్ఞ సినీవాలి కుహూ రుద్ర వీర్య ప్రభ నంద పోషిణి బుద్ధిద శుభ కాలరాత్రి మహారాత్రి భద్రకాళి కపర్దిని వికృతి దండిని ముండిని సేందు ఖండ శిఖండిని నిశుంభశుంభమథిని మహిషాసురమర్దిని ఇంద్రాణి రుద్రాణి శంకరార్ధశరీరిణి నారి నారాయణి త్రిశూలిని పాలిని అంబిక హ్లాదిని మాయాదేవి. కోపించినచో వీరు బ్రహ్మాండముల నెల్ల నశింపచేయగలరు. వీ రెన్నడు నోటమి యెరుంగరు.

గోమేదకమయాదగ్రే సద్వజ్రమణి నిర్మితః. 36

దశయోజనతుంగో సౌ గోపురద్వార సంయుతః | కపాటశృంఖలాబద్ధో నవవృక్ష సముజ్జ్వలః. 37

సాలస్తన్మధ్యభూమ్యాపి సర్వం హీరమయం స్మృతమ్‌ | గృహాణి వీథయో రథ్యా మహామార్గాంగణాని చ. 38

వృక్షాలవాలతరవః సారంగా అపి తాదృశాః | దీర్ఘికాశ్రేణయో వాప్యస్తడాగాః కూపసంయుతాః. 39

తత్ర శ్రీ భువనేశ్వర్యా వసంతి పరిచారికాః | ఏకైకా లక్షదాసీభిః సేవితా మదగర్వితాః. 40

తాలవృంతధరాః కాశ్చి చ్చషకాఢ్య కరాంబుజాః | కాశ్చిత్తాంబూలపాత్రాణి ధారయంత్యో తి గర్వితాః. 41

కాశ్చిత్తచ్ఛత్ర ధారిణ్య శ్చామరాణాం విధారికాః | నానా వస్త్రధరాః కాశ్చి త్కాశ్చిత్పుష్ప కరాంబుజాః. 42

నానాదర్శకరాః కాశ్చిత్కాశ్చి త్కుంకుమలేపనమ్‌ | ధారయంత్యః కజ్జలం చ సిందూర చషకం పరాః. 43

కాశ్చిచ్చిత్రక నిర్మాత్ర్యః పాదసంవాహనే రతాః | కాశ్చిత్తు భూషాకారిణ్యో నానా భూషాధరాః పరాః. 44

పుష్పభూషణ నిర్మాత్ర్యః పుష్ప శృంగార కారికాః | నానావిలాస చతురా బహ్వ్య ఏవం విధాః పరాః. 45

నిబద్ధపరిధానీయా యువత్యః సకలా అపి | దేవీకృపా లేశవశా త్తుచ్ఛీ కృత జగత్త్రయాః. 46

ఏతా దూత్యః స్మృతా దేవ్యః శృంగార మదగర్వితాః | తాసాం నామాని వక్ష్యామి శృణు మే నృపసత్తమ. 47

అనంగరూపా ప్రథమా ప్యనంగ మదనా పరా | తృతీయా తు తతః ప్రోక్తా సుందరీ మదనాతురా. 48

తతో భువనవేగా స్యా త్తథా భువనపాలికా | స్యాత్సర్వశిశిరానంగవేదనానంగమేఖలా. 49

విద్యుద్దామసమానాంగ్యః క్వణత్కాంచీగుణాన్వితాః | రణన్మం జీరచరణా బహిరంతరిత స్తతః. 50

ధావమానాస్తు శోభంతే సర్వా విద్యుల్లతోపమాః | కుశలాః సర్వకార్యేషు వేత్రహస్తాః సమంతతః. 51

అష్టదిక్షు తథైతాసాం ప్రాకారా ద్బహి రేవ చ | సదనాని విరాజంతే నానావాహనహేతిభిః. 52

అట్టి గోమేదక ప్రాకారము దాటినచో దాని కెగువగా లోపలి వైపున వజ్రాల ప్రాకరము ప్రకాశించుచుండును. అదియును పది యోజనముల యెత్తు గల్గి గోపుర ద్వారములు గల్గి గొలుసులు బిగించిన తులుపులు గల్గి శోభలు వెలార్చు చుండును. ఆ ప్రదేశము క్రొత్త క్రొత్త చెట్లతో నలరారు చుండును. ఆ ప్రాకారమందలి నేలయంతయును వజ్రమయమే అచటి యిండ్లు వీథులు గొందు - సందులు పెద్ద పెద్ద వీథులు చెట్లు తీగలు పక్షులు నిన్నియును వజ్రమయములే. బావులు దిగుడుబావులు చెఱువులును వజ్రమయములే. అచ్చోట శ్రీత్రిభువనేశ్వరీ దాసీ జనము నివసింతురు. ప్రతిదాసి మరల లక్షల దాసీజనముచే గర్వమున సేవలందుకొనుచుండును. వారిలో కొందఱు తాటాకు విసనకఱ్ఱలు కొందఱు పానపాత్రలు కొందఱు తాంబూల పాత్రలును చేతులతో బట్టుకొని యుందురు. కొందఱు ఛత్రచామరములు నానా వస్త్రములు పుష్పములు నిలువుట ద్దములు కుంకుమానులేపనములు కాటుక - సిందూరము - పానపాత్ర దాల్చి యుందురు. కొందఱు చిత్తరువులు దింపుటలో కొందఱు సొమ్ములు చేయుటలో నిపుణులు. మఱికొందఱు దేవి పాదకమలము లొత్తుటయందే తన్మయలగుదురు. కొందఱు మేనినిండ సొమ్ములు దాల్తురు. కొందఱు పూల సొమ్ములు వివిధములగు పూలదండలు నల్లుచుందురు. ఈ చందముగ నచటి రమణులు - విలాసవతులై చతురలై రాణకెక్కుదురు. ఆ యువతు లెల్లరును దేవీసేవకై నడుములు బిగించి యుందురు. వారు దేవి దయాదృష్టిచే మజ్జగములను సైతము తుచ్ఛముగ దలంచుచుందురు. శ్రీదేవి దాసులు - శృంగారమద గర్వితలు; దేవిదాసుల పేర్లు తెలుపుచున్నాను వినుము. అనంగరూప అనంగమదన సుందరి మదనాతుల భువనవేగ భువనపాలిక సర్వ శిశిర అనంగవేదన అనంగమేఖల. వారెల్లరును మెఱుఉతీగలవంటి మేనులు గలవారు; తమ రవళించు మొలనూలిగంటలతో నినదించు కాలియందెలతో నటు నిటు నొయ్యారములొలుక బోయుచు తిరుగుచుందురు. అచట కొందఱు మెఱుగుబోడులు వేత్రహస్తలై యన్ని పనులను చక్కపెట్టుటలో నేర్పరులై యిటు నటు పరుగులిడుచు కన్నుల పండువుగ నుందురు. ఆ ప్రాకారమునకు బైటగ నెనిమిది దిక్కులందును వారి వారి భువనములు గలవు. అందు వారి పెక్కు వాహనములు ఆయు ధములు తనరుచుండును.

వజ్రసాలా దగ్రభాగే సాలో వైడూర్యనిర్మితః | దశయోజనతుంగో7సౌ గోపురద్వారభూషితః. 53

వైడూర్యభూమిః సర్వాపి గృహాణి వివిధాని చ | విథ్యో రథ్యా మహామార్గాః సర్వే వైడూర్య నిర్మతాః. 54

వాపీకూపతడాగా శ్చ స్రవంతీనాం తటాని చ | వాలుకా చైవ సర్వా7పి వైడూర్యమణి నిర్మితా. 55

తత్రాష్టదిక్షుపరితో బ్రాహ్మ్యాదీనాం చ మండలం | నిజై ర్గు ణౖః పరివృతం భ్రాజతే నృపసత్తమ. 56

ప్రతి బ్రహ్మాండ మాతౄణాం తాః సమష్టయ ఈరితాః | బ్రాహ్మీమాహేశ్వరీ చైవకౌమారీ వైష్ణవీ తథా. 57

వారాహీ చ తథేంద్రాణీ చాముండా సప్తమాతరః | అష్టమీ తు మహాలక్ష్మీ ర్నామ్నా ప్రోక్తా స్తు మాతరః. 58

బ్రహ్మారుద్రాదిదేవానాం సమాకారాస్తు తాః స్మృతాః | జగత్కల్యాణకారిణ్యః స్వస్వసేనా సమావృతాః. 59

తత్సాలస్య చతుర్ద్వార్షు వాహనాని మహేశితుః | సజ్జాని నృపతే సంతి సాలంకారాణి నిత్యశః. 60

దంతినః కోటిశో వాహాః కోటిశః శిబికాస్తథా | హంసాః సింహాశ్చ గరుడా మయూరా వృషభా స్తథా. 61

తైర్యుక్తాః స్యందనాస్తద్వత్కోటిశో నృపనందన | పార్షిగ్రాహసమాయుక్తా ధ్వజై రాకాశచుంబినః. 62

కోటిశస్తు విమానాని నానాన్వితాని చ ! నానావాదిత్రయుక్తాని మహాధ్వజయుతాని చ. 63

ఆ వజ్ర ప్రాకారము దాటగ దానికెగువగా లోపలివైపున వైడూర్యమణుల ప్రాకరము గలదు. అదియును పది యోజనముల యెత్తుగ గోపుర ద్వారములతో విలసిల్లుచుండును. అచటి నేల యిండ్లు వీథులు సందులు - గొందు లన్నియును వైడూర్యమయములే. అచట వాపీకూపములు - చెఱువులు - నదీతీరములు - ఇసుకభూములు - అన్నియును వైడూర్యమయములే. అచట నెనిమిది దిక్కులందును బ్రాహ్మిమొదలగు దేవతల మండలములు గలవు. వారందఱును తమ తమ గణములతో కొలువుందురు. ప్రతి బ్రహ్మాండమునందలి తల్లులందఱికిని వీరే సమిష్టిగ ప్రతిరూపలుగ పేర్కొనబడుదురు. బ్రాహ్మి మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండ యనువారలు సప్త మాతృకలు. ఎనిమిదవ మాతృక శ్రీమహా లక్ష్మి ప్రసిద్ధి గాంచినది. వీరు బ్రహ్మారుద్రాది దేవతలకు సమానమైన యాకార చేష్టలు గలవారు; జగములకు శుభకారిణులు; తమ తమ సేనలతో శోభిల్లుచుండువారు. ఈ ప్రాకారము నాల్గు ద్వారములందును నిత్యము మహేశ్వరీదేవి దివ్యవాహనములు చక్కగ నలంకరింపబడి సంసిద్ధముగ నుండును. అచట కోట్లకొలదిగ నేనుగులు గుఱ్ఱములు రాయంచలు సింహములు గరుత్‌మంతులు వృషభములు పల్లకీలు నెమళ్ళు వాహనములై సిద్ధముగ నుండును. అటులే కోట్ల కొలదిగ రథములును గలవు. వాటికిరువైపుల పార్శ్వచరులు గలరు. ఆరథముల టెక్కెములు గగనమును చుంబించునట్లుండును. అచ్చట పలువిధములు జెండాలతో గుర్తులతో వాద్య విశేషములతో నలరారుచున్న విమానములు కోట్ల సంఖ్యలో గలవు.

వైడూర్య మణిసాలస్యా ప్యగ్రే సాలః పరః స్మృతః | దశయోజనతుంగో7సా వింద్రనీ లాశ్మనిర్మతః. 64

తన్మధ్యభూ స్తథా వీథ్యో మహామార్గా గృహాణిచ | వాపీకూపతడాగాశ్చ సర్వే తన్మణి నిర్మితాః. 65

తత్ర పద్మం తు సంప్రోక్తం బహుయోజన విస్తృతమ్‌ | షోడశారం దీప్యమానం సుదర్శనమివాపరమ్‌. 66

తత్ర షోడశశక్తీనాం స్థానాని వివిధాని చ | సర్వోపస్కర యుక్తాని సమృద్ధాని వసంతి హి. 67

తాసాం నామాని వక్ష్యామి శృణు మే నృపసత్తమ | కరాళీ వికరాళీ చ తథోమా చ సరస్వతీ. 68

శ్రీదుర్గోషా తథా లక్ష్మీః శ్రుతిశ్చైవ స్మృతిర్ధృతిః | శ్రద్ధా మేధా మతిః కాంతిరార్యా షోడశశక్తయః. 69

నీలజీమూత సంకాశాః కరవాలకరాంబుజాః | సమాఖేటక ధారిణ్యో యుద్ధోపక్రాంతమానసాః. 70

సేనాన్యః సకలా ఏతాః శ్రీదేవ్యా జగదీశితుః | ప్రతి బ్రహ్మాండ సంస్థానాం శక్తీనాం నాయికాః స్మృతాః. 71

బ్రహ్మాండక్షోభకారిణ్యో దేవీశక్త్యు పబృంహితాః | నానారథసమారూఢా నానాశక్తిభిరన్వితాః. 72

ఏతత్పరా క్రమం వక్తుం సహస్రాస్యో7పి న క్షమః |

అట్టి వైడూర్య ప్రాకారమునకు ఎగువగ లోపలి వైపున పది యోజనముల యెత్తున నింద్రనీలమణుల ప్రాకారము ప్రకాశించుచుండును. అందలి బావులు కొలంకులు ఇండ్లు మహామార్గములు గొందులు నన్నియు నింద్రనీలమణిమయములే. అచట పెక్కు యోజనముల వెడల్పున నొక మహాపద్మ మరరారుచుండును. అది పదారు రేకులు గల్గి సుదర్శనచక్రమువలె ప్రకాశించుచుండును. అచట పదారుశక్తుల నివాసస్థానములు గలవు. వారు తమ తమ వస్తు సామగ్రులతో నివాస ముందురు. రాజా! వారి పేర్లు తెలుపుచున్నాను వినుము. కరాళి వికరాళి ఉమ సరస్వతి శ్రీ దుర్గ ఉష లక్ష్మి శ్రుతి స్మృతి ధృతి శ్రద్ధ మేధమతి కాంతి ఆర్య యను పదారుగుగు మహాశక్తులు. వారు నీలమేఘమువంటి కాంతి గల్గి చేతులందు కత్తులు సమము ఆఖేటకము మున్నగు నాయుధములు దాల్చి యుద్ధ సన్నధ్దలై యుందురు. నా రందఱును జగదీశ్వరీదేవి యొక్కసేనా నాయికలు. ప్రతిబ్రహ్మాండమందలి శక్తుల కన్నిటికి మహానాయికలుగు పేరుగ గాంచిరి. వారు బ్రహ్మాండములనే తలక్రిందులుగ జేయ శక్తిగలవారు - దేవీశక్తి సంపన్నలు - నానా రథము లెక్కి పలుశక్తులను ధరించువారు. ఆది శేషుడును వారి పరాక్రమమును తెలుపజాలడు.

ఇంద్రనీలమహాసాలా దగ్రే తు బహు విస్తృతః. 73

ముక్తాప్రాకార ఉదితో దశయోజన దైర్ఘ్యవాన్‌ | మధ్యభూః పూర్వ వత్ర్పోక్తా తన్మధ్యే ష్ట దళాంబుజమ్‌. 74

ముక్తామణిగణాకీర్ణం విస్తృతం తు సకేసరమ్‌ | తత్ర దేవీసమాకారా దేవ్యాయుధధరాః సదా. 75

సంప్రోక్తా అష్టమంత్రిణ్యో జగద్వార్తా ప్రబోధికాః | దేవీ సమానభోగాస్తా ఇంగితజ్ఞా స్తు పండితాః. 76

కుశలాః సర్వకార్యేషు స్వామికార్యపరాయణాః | దేవ్య భిప్రాయ బోధ్యస్తా శ్చతురా అతిసుందరాః. 77

నానాశక్తి సమాయుక్తాః ప్రతి బ్రహ్మాండవర్తినామ్‌ | ప్రాణినాం తాః సమాచారం జ్ఞానశక్త్యా విదంతి చ. 78

తాసాంనామాని వక్ష్యామి మత్తః శృణునృపోత్తమ | అనంగకుసుమా ప్రోక్తా ప్యనంగకుసుమాతురా. 79

అనంగమదనా తద్వదనంగమదనాతురా | భువనపాలా తు సా గగనవేగా చైవ తతః పరమ్‌. 80

శశిరేఖా చ గగనరేఖా చైవ తతః పరమ్‌ | పాశాంకుశవరాభీతి ధరా అరుణవిగ్రహాః. 81

విశ్వసంబంధినీం వార్తాం బోధయంతి ప్రతిక్షణమ్‌ |

ఇంద్రనీల ప్రాకారమునకు ఎగువగ లోపలివైపున విస్తారముగల ఇంకొక ప్రాకారము గలదు. అది ముత్యాల ప్రాకారము. పది యోజనముల ఎత్తున తళతళ లాడుచుండును. అందలి నేల యంతయును జాతి ముత్యముల కాంతులు విరజిమ్ముచుండును. నడుమ నెనిమిది దళముల కమలము చెన్నుదలిర్చుచుండును. అదియును ముత్యాల మణుల కాంతు లీనుచుండును. ఆ కమల మందలి కేసరములు లెక్కకు మించి యుండును. అచట దేవితో సమమైన యాకారమును దేవ్యా యుధములును దాల్చినవారు గలరు. వారు అష్టమంత్రిణులు; దేవితో సమానమైన సుఖభోగము లనుభవించుచుందురు. ఇంగిత మెఱింగినవారు. పండితురాండ్రు ఎల్ల లోకాల వార్తలు తెలుపజాలినవారు. అన్ని కార్యములలో వారు చతురలు స్వామి కార్యపరాయణలు. అతిలోకసుందరులు. దేవి మనస్సును బాగుగ నర్థము చేసికొనువారు. వారు ప్రతి బ్రహ్మాండ మందలి పలు శక్తులతో గూడియుందురు. తమ త్రికాలజ్ఞానముతో ప్రాణుల సమాచారములు రహస్యములు

నెఱుగజాలిన వారు. రాజా! వారి పేర్లు తెల్పుదును వినుము. అనంగకుసుమ అనంగసుమాతుర అనంగమదల అనంగమదునాతర భువనపాల గగనవేగ శశిరేఖ గగనరేఖ. వీరెల్లరును పాశాంకుశములు వరాభయముద్రలు దాల్చిన యెఱ్ఱని విగ్రహములవారు. వారీ విశ్వమంతట జరుగు వార్తల నన్నిటిని క్షణక్షణము తెలుపజాలినవారు.

ముక్తాసాలా దగ్రభాగే మహామారకతోపరః . 82

సాలోత్తమః సముద్దిష్టో దశయోజన దైర్ఘ్యవాన్‌ | నానాసౌభాగ్య సంయుక్తో నానా భోగ సమన్వితః . 83

మధ్యభూ స్తా దృశీ ప్రోక్తా సదనాని తథైవ చ | షట్కోణ మత్ర విస్తీర్ణం కోణస్థా దేవతాః శృణు . 84

పూర్వకోణ చతుర్వక్త్రో గాయత్రీ సహితో విధిః | కుండికాక్ష గుణాభీతి దండాయుధ ధరః పరః . 85

తదాయుధ ధరా దేవీ గాయత్రీ వరదేవతా | వేదాః సర్వే మూర్తి మంతః శాస్త్రాణివివిధాని

చ . 86

స్మృతయ శ్చ పురాణాని మూర్తి మంతి వసంతి హి | యే బ్రహ్మవిగ్రహాః సంతి గాయత్రీ విగ్రహా శ్చ యే . 87

వ్యాహృతీనాం విగ్రహా శ్చ తే నిత్యం తత్ర సంతి హి | రక్షః కోణ శంఖ చక్ర గదాంబుజ కరాంబుజాః . 88

సావిత్రీ వర్తతే తత్ర మహా విష్ణు శ్చ తాదృశః | యే విష్ణు విగ్రహాః సంతి మత్స్యకూర్మాదయో 7ఖిలాః . 89

సావిత్రీ విగ్రహా యే చతే సర్వేతత్ర వసంతి హి | వాయుకోణ పరశ్వక్షమాలాభయవరాన్వితః . 90

మహారుద్రో వర్తతే7త్ర సరస్వత్యపి తాదృశీ | యే యేతు రుద్రభేదాః స్యు ర్ధక్షిణా స్యాదయోనృప . 91

గౌరీభేదా శ్చ యే సర్వే తే తత్ర నివసంతి హి | చతుః షష్ట్యాగమా యే చ యేచాన్యే ప్యాగమాః స్మృతాః . 92

తే సర్వే మూర్తిమంతశ్చ తత్రవై నివసంతిహి | అగ్నికోణ రత్నకుంభం తథా మణికరండకమ్‌ . 93

దధానో నిజహస్తాభ్యాం కుబేరో ధననాయకః | నానావీథీసమాయుక్తో మహాలక్ష్మీ సమన్వితః . 94

దేవ్యానిధిపతిస్త్వాస్తే స్వగుణౖః పరివేష్టితః | వారుణ తు మహాకోణ మదనో రతి సంయుతః . 95

పాశాంకుశధనుర్బాణధరో నిత్యం విరాజతే | శృంగారమూర్తిమంత స్తు తత్ర సన్నిహితాః సదా. 96

ఈశాన కోణ విఘ్నేశో నిత్యం పుష్టిసమన్వితః | పాసాంకుశధరో వీరో విఘ్నాహర్తా విరాజతే. 97

విభూతయో గణశస్య యా యాః సంతి నృపోత్తమ | తాః సర్వా నివసంత్యత్ర మహైశ్వర్య సమన్వితాః . 98

ప్రతి బ్రహ్మాండ సంస్థానాం బ్రహ్మాదీనాం సమష్టయః | ఏతేబ్రహ్మదయః ప్రోక్తాః సేవంతే జగదీశ్వరీమ్‌. 99

ముక్తా ప్రాకారమునకు ఎగువగ లోపలివైపున మరకత ప్రాకారము తనరారుచుండును. అదియును పది యోజనముల ఎత్తున గలదు; భోగభాగ్యముల కునికి పట్టు. అందలి వేల భవనములు మరకతమణులతో నిర్మించబడి కాంతులు విరజిమ్ముచుండును. అచట షట్కోణములు గలవు. ఆ కోణములందున్న దేవతల పేర్లు వినుము. తూరుపు కోణమందు

శ్రీగాయత్రితో గూడిన బ్రహ్మ కమండలువు అక్షమాల దండము అభయము ఆయుధములు దాల్చి విరాజిల్లు చుండును. అవే యా యుధములు దాల్చి పరదేవతయైన గాయత్రియు ప్రకాశించుచుండును. ఎల్ల వేదములు వివిధ శాస్త్రములు స్మృతులు పురాణములు మూర్తిమంతములై యచట నివసించును. బ్రహ్మస్వరూపులు గాయత్రీ స్వరూపలు వ్యాహృతుల రూపములు నచట నివసించుచుండును. నైరృత కోణమునందు శంఖచక్రములు గదాపద్మములు చేతులందు దాల్చి సావిత్రీ విష్ణులు నివాసమై యుందురు. మత్స్యము కూర్మము మొదలగు విష్ణుని విగ్రహములను సావిత్రీ స్వరూపములు నన్నియు నచట వెలయుచుండును. వాయు కోణమున పరశువు అక్షమాల అభయవరములు దాల్చి మహారుద్రుడు ప్రకాశించుచుండును. దక్షిణామూర్తి మొదలగు రుద్రుని విగ్రహములును శ్రీగౌరీ స్వరూపలు నచట విలసిల్లుచుందురు. అట నరువదినాలుగాగమ ములును తక్కిన యాగమములును రూపు దాల్చి యొప్పారుచుండును. అగ్ని కోణమందు తన చేతులందు రత్నకుంభము మణికరండము దాల్చి ధనపతియగు కుబేపుడు వెలుగుచుండును. అతడు పెక్కు వీథూలందు మహాలక్ష్మీని గూడి యుండును. ధనపతి యచట తన దేవితో తన గణములతో గూడి వసించును. పడమటి కోణమున కామదేవుడు రతితో గూడి చెలువుమీర నుండును. అతడు పాశాంకుశములు చెఱకు విల్లు అమ్ము దాల్చి శృంగారాది రసములు మూర్తిమంతులై కొలువ సొబగు మిగిలియుండును. ఈ శాన్య కోణమున పుష్టితో పాశాంకుశములు దాల్చి విఘ్నహరుడగు విఘ్నేశ్వుడు నిత్యము వీరవేషమున తనరారుచుండును. గణపతి విభూతు లెన్ని గలవో యన్నియు నచట గొప్ప సంపదలతో తులతూగుచుండును. అట ప్రతి బ్రహ్మండమందలి బ్రహ్మాదుల సమష్టిరూపులగు బ్రహ్మాదు లందఱును శ్రీ జగదేశ్వరిని నిత్తెము సేవించుచుందురు.

మహామారకతస్యాగ్రే శతయోజనదైర్ఘ్యవాన్‌ | ప్రవాళశాలో7స్త్యపరః కుంకుమారుణ విగ్రహః . 100

మధ్యభూస్తాదృశీ ప్రోక్తా సదనాని చ పూర్వవత్‌ | తన్మధ్యే పంచభూతానాం స్వామిన్యః పంచ సంతి చ . 101

హృల్లేఖా గగనా రక్తా చతుర్థీ తు కరాళికా | మహోచ్చుష్మా పంచమీ చ పంచభూత సమప్రభాః . 102

పాశాంకుశ వరాభీతి ధారిణ్యో7మిత భూషణాః | దేవీసమాన వేషాఢ్యా నవ¸°వన గర్వితాః . 103

మరకత ప్రాకారమునకు ఎగువవగ లోపలివైపున పది యోజనముల ఎత్తున కుంకుమవలె నెఱ్ఱనైన పగడాల ప్రాకారము మెఱయుచుండును. దాని నడుమ నున్న భవనము లన్నియును పగడాలవలె నెఱ్ఱగ మిఱుమిట్లు గొలుపుచుండును. దాని నడుమ పంచభూతముల స్వామిని లైదుగురు గలరు. హృల్లేఖ - గగన- రక్త- కరాళిక- మహోచ్చుష్మ- యనువారలు పంచభూతములవంటి కాంతి గలవారు. వరాభయ- పాశాంకుశములు ధరించి పెక్కు సొమ్ములు దాల్చి దేవవలె వేషభూషలు గల్గి నవ¸°వనముతో గర్వించియుందురు.

ప్రవాళశాలా దగ్రేతు నవరత్న వినిర్మితః | బహుయోజన విస్తీర్ణో మహాశాలో7స్తి భూమిప. 104

తత్రచామ్నా యదేవీనాం సదనాని బహున్యపి | నవరత్నమయాన్యేన తడాగా శ్చ సరాంసి చ . 105

శ్రీదేవ్యా యే7వతారాః స్యుస్తే తత్ర నివసంతి హి | మహావిద్యా మహాభేధాః సంతి తత్రైవ భూమిప. 106

నిజావరణ దేవీభీ ర్నిజభూషణ వాహనైః | సర్వదేవ్యో విరాజంతే కోటిసూర్యసమప్రభాః . 107

సప్తకోటి మహామంత్రదేవతాః సంతి తత్రహి | నవరత్నమయా దగ్రే చింతామణిగృహం మహత్‌ . 108

తత్రత్యం వస్తుమాత్రం తు చింతామణి వినిర్మితమ్‌ | సూర్యోద్గారోపలై స్తద్వచ్చంద్రోద్గారోపలై స్తథా. 109

విద్యుత్ప్రభోపలైః స్తంభాః కల్పితా స్తు సహస్రశః | యేషాంప్రభాభి రంతఃస్థ వస్తు గించిన్న దృశ్యతే. 110

ఇతి శ్రీదేవీ భాగవతే మహాపురాణ ద్వాదశస్కందే ఏకాదశో7ధ్యాయః.

పగడాల ప్రాకారమునకు ముందు పెక్కు యోజనములు వైశాల్యముగల నవరత్న ప్రాకారము గలదు. అందామ్నాయ దేవతల భవనములు పెక్కు గలవు. (పూర్వ- దక్షిణ- పశ్చిమోత్తరోర్ధ్వా మ్నాయయము) అచటి చెఱువులు- కొలంకులును నవరత్నమయములే. అచట శ్రీదేవి మహావతారములు ప్రకాశించుచుండును. పాశాంకుశేశ్వరి- భువనేశ్వరి- భైరవి- కపాలభువనేశ్వరీ- అంకుశభువనేశ్వరి- ప్రసాదభువనేశ్వరి- క్రోధభువనేశ్వరి- త్రిపుట- అశ్వరూఢ- నిత్యక్లిన్న- అన్నపూర్ణ- త్వరిత. రాజ! కాళి- తార- షోడశి - భైరవి- మాతంగి మున్నగు పది మహావిద్య లచట రూపు దాల్చి ప్రకాశించుచుండును. అట సకల దేవీ రూపములును తమ తమ ఆవరణ దేవతలతో భూషలు దాల్చి కోటి సూర్యకాంతులతో విరాజిల్లుచుందురు. అచ్చోటనే ఏడు కోట్ల మహామంత్రములు రూపు దాల్చి శోభిల్లును. నవరత్న ప్రాకారమునకు ముందు శ్రీకారమైన చింతామణి గృహము మహోజ్జ్వలముగ ప్రభలు విరజిమ్ముచుండును. అందలి ప్రతి వస్తువును చితామణులచే నిర్మించబడినదే. సూర్యకాంత- చంద్రకాంత శిలలతోను మెఱుగుకాంతుల మణులతోను నిర్మించ బడిన వేల మణిస్తంభము లచట వెల్గు స్తంభమువలె నొప్పుచుండును. అయన్ని వెల్గుల నడుమ వస్తు వేదియు కనిపించదు.

ఇది శ్రీదేవీ భాగవత మహాపురాణమందలి ద్వాదశ స్కంధమున ఏకాదశాధ్యాయము.

Sri Devi Bagavatham-2    Chapters