Sri Devi Bagavatham-2    Chapters   

అథ తృతీయో7ధ్యాయః.

నారద ఉవాచ : స్వామి న్సర్వ జగన్నాథ సంశయో7స్తి మమ ప్రభో |చతుః షష్టికలాభి శ్చ పాత కాద్యోగ విద్వర. 1

ముచ్యతే కేన పుణ్యన బ్రహ్మరూపః కథం భ##వేత్‌ | దేహ శ్చ దేవతారూపో మంత్రరూపో విశేషతః. 2

కర్మ తచ్ఛ్రోతు మిచ్ఛామి న్యాసం చ విధిపూర్వకమ్‌ | ఋషిశ్చందో7ధిదైవం చ ధ్యానం చ విధివత్ర్పభో. 3

శ్రీనారాయణ ఉవాచ : అస్త్యేకం పరమం గుహ్యం గాయత్రీకవచం తథా |

పఠనా ద్ధారణా న్మర్త్యః సర్వపాపైః ప్రముచ్యతే. 4

సర్వా న్కామా నవాప్నోతి దేవీరూపశ్చ జాయతే | గాయత్రీకవచస్యాస్య బ్రహ్మవిష్ణు మహేశ్వరాః. 5

ఋషయో ఋగ్వజుః సామాథర్వచ్ఛం దాంసి నారద | బ్రహ్మరూపా దేవతోక్తా గాయత్రీ పరమా కళా. 6

త ద్బీజం భర్గ ఇత్యేషా శక్తి రుక్తా మనీషిభిః | కీలకం చ ధియః ప్రోక్తం మోక్షార్థం వినియోజనమ్‌. 7

చతుర్బిర్హృదయం ప్రోక్తం త్రిభి ర్వర్ణైః శిరః స్మృతమ్‌ | పంచభిః స్యాచ్ఛిఖా పశ్చా త్త్రిభిస్తు కవచం స్మృతమ్‌. 8

చతుర్బి ర్నేత్ర ముద్దిష్టం చతుర్బిః స్యా త్త దస్త్రకమ్‌ | అథ ధ్యానం ప్రవక్ష్యామి సాధకాభీష్టదాయకమ్‌. 9

ముక్తా విద్రుమహేమనీల ధవళచ్ఛాయైర్ముఖై స్త్రీక్షణౖ | ర్యుక్తా మిందు నిబద్ధరత్న మకుటాం తత్త్వార్థవర్ణాత్మికామ్‌ |

గాయత్రీం వరదాభయాంకుశకశాః శుభ్రం కపాలం గదాం |

శంఖం చక్ర మథారవిందయుగళం హసై#్త ర్వహంతీం భ##జే. 10

గాయత్రీ పూర్వతః పాతు సావత్రీ పాతు దక్షిణ | బ్రహ్మసంధ్యా తు మే వశ్చా దుత్తరాయం సరస్వతీ. 11

పార్వతీ మే దిశం రక్షే త్పావకీం జలశాయినీ | యాతుధానీ దిశం రక్షే ద్యాతుధానభయంకరీ. 12

పావమానీం దిశం రక్షే త్పవమాన విలాసినీ | దిశం రౌద్రీ మవతుమే మే రుద్రాణీ రుద్రరూపిణీ. 13

ఉర్ధ్వం బ్రహ్మాణీ మేరక్షే దధస్తా ద్వైష్ణవీ తథా | ఏవం దశదిశో రక్షే త్సర్వాంగం భువనేశ్వరీ. 14

తత్పదం పాతు మే పాదౌ జంఘే మే సవితుః పదమ్‌ | వరేణ్యం కటిదేశంతు నాభిం భర్గ స్తథైవ చ. 15

దేవస్య మే తద్ధృదయం ధీమహీతి చ గల్లయోః | ధియః పదం చ మే నేత్రే యఃపదం మే లలాటకమ్‌. 16

నః పాతు మే పదం మూర్ధ్ని శిఖాయాం మే ప్రచోదయాత్‌ | తత్పదం పాతు మూర్ధానం సకారః పాతు భాలకమ్‌. 17

చక్షుషీ తు వికారార్ణ స్తుకారస్తు కపోలయోః | నాసాపుటం వకారర్ణో రేకారస్తు ముఖే తథా. 18

ణికార ఊర్ధ్వ మోష్ఠంతు యకార స్త్వధరోష్ఠకమ్‌ | ఆస్య మధ్యే భకారార్ణో ర్గో కార శ్చుబుకే తథా. 19

దేకారః కంఠదేశే తు వకారః స్కంధ దేశకమ్‌ | స్యకారో దక్షిణం హస్తం ధీకారో వామహస్తకమ్‌. 20

మకారో హృదయం రక్షే ద్ధికార ఉదరే తథా | ధికారో నాభిదేశే తు యోకారస్తు కటిం తథా. 21

గుహ్యం రక్షతు యోకార ఊరూ ద్వౌ నః పదాక్షరమ్‌ | ప్రకారో జానునీ రక్షే చ్ఛోకారో జంఘదేశకమ్‌. 22

దకారో గుల్ఫదేశే తు యకారః పదయుగ్మకమ్‌ | తకార వ్యంజనం చైవ సర్వాంగే మే సదా7వతు. 23

ఇదం తు కవచం దివ్యం బాధాశత వినాశనమ్‌ | చతుఃషష్టికళా విద్యాదాయకం మోక్షకారకమ్‌ . 24

ముచ్యతే సర్వపాపేభ్యః పరంబ్రహ్మాధిగచ్ఛతి | పఠనాచ్ఛ్రవణాద్వాపి గోసహస్రఫలం లభేత్‌. 25

ఇతి శ్రీదేవీభాగవతే మహాపురామే ద్వాదశస్కంధే గాయత్రీమంత్రకవచం నామ తృతీయో7ధ్యాయః.

మూడవ అధ్యాయము

గాయత్రీ కవచము

నారదు డిట్లనియె : స్వామీ! జగన్నాథా! ప్రభూ! యోగవిద్వరా! అరువదినాల్గు కళల విజ్ఞానమునకు నిధీ! నరుడు పాపములనుండి యెట్లు ముక్తుడగునో ఏ పుణ్య విశేషమున మానవుడు బ్రహ్మత్వ మొందగలడు? దాని దేహము దేవతారూపము మంత్రరూపము. ఈ అనుష్ఠానమున - న్యాసము - ఋషి - ఛందము - అధిదైవతము - ధ్యానము మున్నగువానిని విధిపూర్వకముగ చక్కగవినదలచితిని ప్రభూ! దయతో తెలుపుము. శ్రీనారాయణుడు డిట్లనెను : ఒక పరమ రహస్యమైన విషయము గలదు. అది గాయత్రీ కవచము. దానిని చదివిన - విన్న - మానవుడు సర్వపాపములనుండి విడివడును. అతని కోరికలన్నియును పండును. అతడు కేవలము దేవీస్వరూపుడు గాగలడు. ఈ గాయత్రీ కవచమునకు బ్రహ్మ - విష్ణు - మహేశ్వరులు ఋషులు; ఋగ్యజు స్సామాథర్వణములు - ఛందములు; నారదా! బ్రహ్మరూపిణి - దేవత; గాయత్రి - పరమకళ; తద్పకము - బీజము; భర్గః - శక్తి; ధియః - కీలకము; ఈఅనుష్ఠాన వినియోగము మోక్షమునందు. మొదటి నాలుగక్షరములతో హృదయమున మూడు వర్ణములతో శిరమున ఐదు వర్ణములతో శిఖయందు మూడువర్ణములతో కవచమున నాలుగు వర్ణములతో నేత్రములందు నాలుగక్షరములతో అస్త్రమున న్యాసము; ఇపుడు సాధకుని కోర్కు లీడేర్చు ధ్యానము తైలుపుచున్నాను. వినుము. ముత్యము - పగడము - సువర్ణము - నీలము - తెలుపు కాంతుల ఛాయలుగల ముఖములు గలది; త్రిణత్ర; నెలవంకతో వెలుగొందు రత్న కిరీటము దాల్చినది; ఇరు వది నాల్గు వర్ణములు స్వరూపముగాగలది; వరదాభయాంకుశ - కళా - శుభ్రకపాల - గదా - శంఖ - చక్ర - పద్మ యుగళములను తన పది చేతులతో ధరించి యలరారుచున్న శ్రీ గాయత్రీదేవిని ధ్యానించుచున్నాను. నన్ను తూర్పుదిశను గాయత్రీదేవియు దక్షిణమున సావిత్రీ దేవియును పడమట బ్రహ్మసంధ్యయును ఉత్తరమున సరస్వతియును రక్షించుగాక! నన్ను ఆగ్నేయ మున పావకోజ్జ్వలశాలినియును నైరృతదిశయందు యాతుధాన భయంకరియు గాపాడుగావుత.

నన్ను వాయువ్య దిశయందు పవమాన విలాసినియు నీశాన్య దిశయందు రుద్రరూపిణి యగు రుద్రాణియును ఊర్ద్వమునందు బ్రహ్మాణి క్రిందివైపు వైష్ణవియును బ్రోచుగాత. ఇటుల పది దిశలందు నా యంగములన్నిటిని త్రిభువనే శ్వరీదేవి రక్షించుగాత. ''త'' త్పదము నా చరణములను ''సవితుః'' పదము నా పిక్కలను ''వరేణ్యం'' కటిప్రదేశమును ''భర్గః'' బొడ్డున ''దేవస్య'' హృదయమును ''ధీమహి'' కపోలములను ''ధియః'' నేత్రములను ''యః'' పదము నా నొస టిని ''నః'' శిరమును ''ప్రచోదయాత్‌'' శిఖను ''తత్‌'' పదము నా శిరమును ''స'' కారము నొకసటిని ''వి'' కారము కన్నులను ''తు'' కారము చెక్కిళ్లను ''వ'' కారము ముక్కులను ''రే'' కారము మోమును ''ణి'' కారము పైపెదవిని ''య'' కారము క్రింది పెదవిని ''భ'' కారము ముఖమధ్యమును ''గో'' కారము గడ్డమును ''దే'' కారము కంఠమును ''వ'' కారము భుజములను ''స్య'' కారము కుడిచేతిని ''ధీ'' కారమెడమచేతిని ''మ'' కారము హృదయమును ''హి'' కారము పొట్టను ''ధి'' కారము బొడ్డును ''యో'' కారము నడుమును ''యో'' కారము గుహ్యమును ''నః'' పదము రెండు తొడలను ''ప్ర'' కారము జానువులను ''చో'' కారము పిక్కలను ''ద'' కారము చీలమండలను ''యా'' కారము రెండు పాదములను ''త'' కారమెల్ల యంగము లను రక్షించుగాక. ఇది శ్రీగాయత్రి దివ్య కవచము. ఇది వందల కొలది బాధలను శాంతింప జేయగలదు. అరువదినాల్గు కళలను విద్యల నొసంగునది. మోక్షకారకము. ఈ శ్రీగాయత్రీ కవచమును చిత్తమును ధరించిన వాడు. సకల పాపముక్తుడై బ్రహ్మసాయుజ్య మొందగలడు. దీనిని విన్నను చదివినను వేయిగోవులను దానము చేసినంత పుణ్యము ఫలము గల్గును.

ఇది శ్రీదేవీ భాగవత మహాపురాణమందలి పండ్రెండవ స్కంధమున మూడవ యధ్యాయము.

Sri Devi Bagavatham-2    Chapters