Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

ఎనిమిదవ యధ్యాయము - పురుషలక్షణము

రామః- పురుషాణాం తథా స్త్రీణాం గజానాం తురగై స్సహ | వాల వ్యజన ఛత్రాణాం తథా భద్రాసనస్య చ || 1

రత్నానాం ధనుషాం చైవ ఖడ్గస్య చ సురాత్మజ ! | లక్షణం శ్రోతు మిచ్ఛామి తన్మమాచక్ష్వ పృచ్ఛతః || 2

పుష్కరః- ఆదావేవ ప్రవక్ష్యామి పౌరుషాణాం తు లక్షణమ్‌ | నిబోధ ! తన్మే గదతో భృగువంశ వివర్ధన ! 3

ఏకాధికో ద్విశుక్లశ్చ త్రిభి ర్వ్యాప్నోతి యస్తథా | త్రివళీవాన్‌ త్రివినతః త్రికాలజ్ఞశ్చ భార్గవ ! | 4

పురుష స్స్యాత్‌ సులక్షణ్యో విపులశ్చ తథా త్రిషు | చతుర్లేఖ స్తథా యశ్చ తథైవ చ చతుస్పమః || 5

చతుష్కిష్కుశ్చతుర్దంష్ట్ర శ్చతుష్కృష్ణ స్తథైవ చ | చతుర్గంధ శ్చతుర్హ్రస్వః పంచసూక్ష స్తథైవ చ || 6

పంచదీర్ఘో భృగుశ్రేష్ట ! తథైవ చ షడున్నతః | సప్తస్నేహో 7ష్ట వంశ శ్చ నవస్థానా7మల స్తథా || 7

దశపద్మో దశబృహ న్న్యగ్రోధ పరిమండలః | చతుర్దశ సమద్వంద్వః షోడశాఖ్యశ్చ శస్యతే || 8

రామ:- ఏకాధికాద్యా యే ప్రోక్తాః పురుషస్య త్వయాగుణాః ! తానాహం శ్రోతు మిచ్ఛామి యథా వద్వరుణాత్మజ ! 9

పుష్కరః- ధర్మేచార్థే చ కామేచ జన స్సర్వో7భిషజ్జతే | ఏకాధికస్తు విజ్ఞేయో యస్తు ధర్మే విశేషతః || 10

తారకాభ్యాం వినా నేత్రే శుక్లా శ్చ దశన స్తథా | ద్వాత్రింశ ద్రామ ! యస్య స్యు ర్ద్విశుక్ల స్సతు కీర్తితః || 11

ఉరో నాభి స్తథా సక్థి ర్గభీరా యస్య దేహినః || ప్రోచ్యతే సతు ధర్మజ్ఞ ! త్రిగంభీరో నరోత్తమః ||

అనసూయా దయా క్షాంతి స్త్రిక మేకం ప్రకీర్తితమ్‌ || 12

మంగళాచార సంస్పర్ళః శౌచం చేత్యపరంత్రయమ్‌ || అనాయాస మకార్పణ్య మైశ్వర్యం చ త్రయ స్త్రికాః || 13

త్రిప్రలంబో భుజాభ్యాంతు వృషణన చ కీర్త్యతే | దిగ్దేశ జాతి సర్గైశ్చ తేజసా యశసా శ్రియా || 14

వ్యాప్నోతి యో భృగుశ్రేష్ట ! త్రిభిర్వ్యాప్నోత్యసౌ స్మృతః | ఉదరే వలయ స్తిస్రో గంభీరా యస్య దేహినః || 15

స ఉచ్యతే భృగుశ్రేష్ట ! త్రివళీవా న్నరోత్తమః | దేవతానాం ద్విజానాంచ గురూణాంచ తథా నతః || 16

పురుషో బార్గవ శ్రేష్ట : ప్రోక్త స్త్రివినత స్సదా | ధర్మ స్యార్థస్య కామస్య సంపత్కాల విభాగవిత్‌ || 17

సేవతే యశ్చ ధర్మజ్ఞః ప్రోచ్యతే స త్రికాలవిత్‌ | ఉరో లలాటం వక్త్రంచ విస్తీర్ణం యస్య దేహినః || 18

కథిత స్స భృగుశ్రేష్ట ! విపుల స్త్రిషు మానవః | ద్వౌపాణి ద్వౌ తథా పాదౌ ధ్వజ చ్ఛ త్రాదిభి ర్యుతౌ || 19

లేఖాభి ర్యస్య నిర్దిష్ట శ్చతుర్లేఖ స్స మానవః | అంగుళ్యో హృదయం పృష్ఠం కటి ర్యస్య తథా సమః || 20

పురుష స్స భృగుశ్రేష్ఠ ! చతుస్సమ ఉదాహృతః | షణ్ణవత్యంగులో త్సేధః చతుష్కిష్కుః ప్రమాణతః 21

ప్రమాణయోగ ద్ధర్మజ్ఞ చతుష్కిష్కు స్సకీర్తితః | దంష్ట్రాశ్చతస్ర శ్చంద్రాభాః దశ##నేభ్య స్సమున్నతాః || 22

కించి ద్యస్య స ధర్మజ్ఞ ! చతుర్ద్రంష్ట్రః ప్రకీర్తితః నేత్ర తారే భ్రువౌ శ్మశ్రుః కృష్ణాః కేశా స్తధై వచ || 23

యస్యే హ స చతుష్కృష్ణః ప్రోచ్యతే మనుజోత్తమః | నాసాయాం వదనే స్వేదే కక్షాసు చ నరోత్తమ ! 24

గంధ స్తు సురభి ర్యస్య చతుర్గంధ స్సకీర్తితః | బాహూ జానూరు గండశ్చ చత్వార్యస్య సమాని తు || 25

పురుషస్య భృగుశ్రేష్ట ! చతుస్సమ ఉదాహృతః | ఆస్యా7 సృజ్‌ మధ్య వీర్యగాత్రాణాం పద్మానాం తుల్యోగంధస్తు యస్యవై || 26

కథిత స భృగుశ్రేష్ఠ ! చతుర్గంధ ఇతి ద్విజైః | హ్రస్వం లింగం తథా గ్రీవా జంఘే హ్రస్వేతు దేహినః || 27

యస్య భార్గవ శార్దూల ! చతుర్హ్రస్వః సకీర్తితః | అంగుళీనాంతు పర్వాణి నఖకేశ ద్విజ త్వచమ్‌ ||

సూక్ష్మాణి యస్య తం రామ ! పంచసూక్ష్మం ప్రచక్షతే || 28

హనూ నేత్రే లలాటం చ నాసాచైవ స్తనాంతరమ్‌ | దీర్ఘాణి యస్య తం రామ ! పంచ దీర్ఘం విదు ర్భుధాః || 29

వక్షః కక్షౌ నఖా నాసా మఖం చైవ కృకాటికా | షడున్నతాని యస్స్యేహతం వదన్తి షడున్నతమ్‌ || 30

త్వక్కేశలోమ దంతాశ్చ దృష్టి ర్వాణీ నఖా స్తథా | స్నిగ్ధా యస్స్యేహ తం ప్రాహు స్సప్తస్నిగ్థం బహుశ్రుతాః || 31

పురుషులు స్త్రీలు గజతు రగములు ఛత్రచామరములు భద్రాసనము రత్నములుధనుస్సులు కత్తియను రాజసాధనముల లక్షణములు తెలుపుమన పుష్కరుడు, మొదటనే పురులక్షణము దెలుపుచున్నాను వినుమని యిట్లు చెప్పదొడంగెను. ఏకాధికః అని మొదలుపెట్టి '' షోడశాఖ్యశ్చశస్యతే '' అని యొకటి మొదలు పదునాఱవ సంఖ్యదాక పురుషుని సాముద్రిక లక్షణములను సంకేతించి చెప్పెను. ఆ సంకేతము 4 వ శ్లో. నుండి 9 దాకా తద్వివరణ మిట్లు చేసినారు. ఎల్ల జనమును ధర్మమందు అర్థమందు కామ పురుషార్థము నందును నభినివేశము గల్గి యుండును. ఎవడు ఒక్క దానియందే యనగా యొక్క ధర్మమందే యనుషక్తుడై యుండునో యట్టి ధర్మైకనిరతు డేకాధికుడనబడును. కనుపాపలు రెండు తెల్లనివగుటయేకాక ముప్పదిరెండు దంతములును దెల్లనివైయున్న యతడు '' ద్విశుక్లుడు '' అని యిక్కడ బేర్కొనబడినాడు. త్రిగంభీరుడు రోమ్ము బొడ్డు సక్థి ( మోకాలు) అను మూడు దావులు లోతుగా నుండు వాడు. అసూయ లేకుండట దయ,. క్షాంతి. ఓరిమి యనునివి '' త్రికము '' అనబడును. మంగళాచారము మంగళవస్తు సంస్పర్శము శౌచము ననునది మరొక త్రికము. ఆయాసపడకుండుట కార్పణ్యము ( దైన్యము) లేకుండుట ఐశ్వర్యమనునది యింకొక త్రికము. మొత్తము మూడు త్రికములచే వ్యాపకుడగుట యుత్తమ పురుషలక్షణము. త్రిప్రలంబః - బుజములు వృషణములునగు నివి త్రిలంబములై యుండువాడు. దిక్కు దేశ జాతి సర్గములచే తేజస్సుచే యశస్సుచే సంపదచే వ్యాపకుడైనవాడు త్రివ్యాపకుడనబడును. కడుపుమీలద మూడు ముడుతలు లోతయినవి గలవాడు త్రివళీవంతుడనబడును. దేవద్విజ గురువులయెడ వినతుడగువాడు త్రినతుడనబడును. ధర్మాద్థ కామ పురుషార్థ విభాగము తెలిసి వానిని సేవించు ధర్మజ్ఞుడు త్రికాలవిదుడనబడును. రొమ్ము లలాటము (నుదురు) మఖమును విస్తీర్ణములు (విశాలములు) అయిన వాడు త్రివిపులుడనబడును. రెండు చేతులు రెండు పాదములు ధ్వజరేఖ ఛత్రరేఖ మొదలయిన భాగ్యరేఖలతో గూడియుండు నాతడు చతుర్లేఖుడనబడును. వ్రేళ్లు హృదయము పృష్టము నడుము ననునని సమములైయున్న యతడు చతుస్సముడనబడును. 96 అంగుళములు నాల్గు కిష్కువులు అట్టినాల్గు కిష్కువు లెత్తు గలవాడు చతుష్కిష్కువనబడును. దంతముల కంటే ( పండ్ల కంటే) కొలదిగ పెద్దవి చంద్రకాంతి కలిగినవి నాల్గు దంష్గ్రలు కోరలుగలవాడు చతుర్దంష్ట్రుడనబడును. కనుపాపలు కనుబొమలు గడ్డము జుట్టుననునీ నాల్గును నల్లనివైయున్నవాడు చతుష్కృష్ణుడు. ముక్కు ముఖము చెమట చంకలు నెవ్వనివి పరిమళించుచుండు నాతడు చతుర్గంధుడు. బాహువులు తొడలు మోకాలు చెక్కిళ్లునను నాల్గును సమములుగాయున్న యతడు చతుస్సముడనబడును. ముఖము రక్తము అను నాల్గింటి వాసన పద్మము వాసన వంటిదగునేని యతడు చతుర్గంధుడనబడును. లింగము మెడ పిక్కలు రెండును హ్రస్వములయియున్న యతడు చతుర్హ్రస్వుడు. వ్రేళ్ళకణువులు గోళ్ళు జుట్టు మేని చర్మము నెవ్వని సూక్ష్మములు (పలుచనివి) యతడు పంచ సూక్ష్ముడనబడును. దవడలు కండ్లు నుదురు ముక్కు రెండు స్తనముల నడిమ భాగము నెవ్వనివి పొడవైనవి యతడు పంచదీర్ఘుడు. వక్షము చంకలు గోళ్ళు ముక్కు ముఖము కృకాటికా ఈ యాఱును నెత్తుగాయున్న నాతడు షడున్నతుడు. చర్మము జుట్టుమేని పైవెంట్రుకలు దంతములు చూపుమాట గోళ్ళు స్నిగ్ధములు నునుపై (మెఱుగు గలవి) మృదులములునగు నాతడు సప్తస్నిగ్ధుడనబడును.

జాను వంశా వుభౌ రామ ! భుజవంశౌ తథా ప్యుభౌ | ఊరు వంశద్వయం చైవ పృష్ఠవంశం చ భార్గవ ! 32

నాసా వంశం సమో యస్య సో7ష్టవంశః ప్రకీర్తితః | నేత్రే నాసా పుటౌ కర్ణౌ మేఢ్ర పాయూ ముఖం తథా || 33

ఛిద్రా నవైతే విమలా యస్య తం తు నవామలమ్‌ | జిహ్వోష్ఠతాలు నేత్రాన్తర్హస్త పాద నఖ స్త్సనౌ || 34

శిశ్నాగ్ర వక్షో యస్త్యెతే పద్మాఖా దశ దేహినామ్‌ | పాణీ పాదౌ ముఖం గ్రీవా శవణ హృదయం శిరః || 35

లలాట ముదరం పృష్ఠం బృహన్తః పూజితా దశ | ప్రసారిత భుజస్యేహ మధ్యమాగ్ర ద్వయాంతరాత్‌ | 36

ఉచ్ఛ్రయేణ సమో యస్స న్యగ్రోధ పరిమండలః | కథితస్స నృపశ్రేష్ఠః సర్వలక్షణ పూజితః || 37

పాదో గుల్ఫౌ స్ఫిచౌ పార్శ్వౌ పృషణా వీక్షణౌ హనూ | కర్ణోష్ట సక్థినీ జంఘే హస్తౌ బాహూ తథా భ్రువౌ || 38

ద్వంద్వా న్యేతాని యస్య స్యుః సమాని తు చతుర్దశ | చతుర్దశ సమద్వంద్వః కథిత స్స నృపోత్తమః || 39

విద్యా స్థానాని యానీహ కధితాని చతుర్దశ | ప్రపశ్యతి చ యో రామ ! నేత్రాభ్యాంచ నరోత్తమః || 40

మ్య క్స కథితో లోకే షోడశాక్షో భృగూత్తమ ః |

రూక్షం శిరాతతం గాత్రం తథా మంస వివర్జితమ్‌ | దుర్గంధి చాశుభం సర్వం విపరీతంచ శస్యతే || 41

దృష్టిః ప్రసన్నా మధురాచవాణీ మత్తేభ తుల్యా చ గతిః ప్రశస్తా |

ఏకైక కూప ప్రభవాశ్చ రోమాః సత్వం ప్లుతం హాస మనుల్బణం చ || 42

శ్రాన్తస్య యాన మశనంచ బుభుక్షితస్య పానం తృషా పరిగతస్య పరేషు రక్షా |

ఏతాని యస్య పురుషస్య భపన్తి కాలే తం ధన్య మాహు రధిభూమినరం ద్విజేంద్రాః || 43

ఇతి శ్రీ విష్ణుధర్మోత్తరే ద్వితీయఖండే పురుషలక్షణం నామా7ష్టమో7ధ్యాయం.

మోకాలి ఎముకలు రెండు బుజములు ఎముకలు తొడల ఎముకలు పృష్టవంశము ముక్కుదూలము సమములయినవాడష్ట వంశుడనబడును. కండ్లు ముక్కుపుటములు చెవులు మేఢ్రము గుదము ముఖము ననునివి తొమ్మిది ఛిద్రములు నెవ్వని విమలములో (స్వచ్ఛములుగా నుండునో) అతడు నవామలుడనబడును. నాలుక పెదవులు కనుగొనలు చేతులు పాదములు గోళ్ళు స్తనములు శిశ్నాగ్రము ఱోమ్ము పద్మమువలె నెఱ్ఱనివై యుండునో, చేతులు కాళ్ళు ముఖము మెడ చెవులు హృదయము తల లలాటము కడుపు పృష్టము నెవ్వనికి పెద్దవో రెండు భుజములు చాచినపుడు రెండు మధ్యమాంగుళుల చివరిదాకి నున్న కొలత నెవ్వని యెత్తుకొలతయు సమానములో యాతడు న్యగ్రోధపరిమండలు డనబడును. మఱ్ఱి వృక్షముయొక్క (మండలము) చుట్టుకొలతగలవాడుగ పేర్కొనడును. అట్టి రాజశ్రేష్టుడు సర్వలక్షణ పూజితుడని చెప్పబడెను, పాదములు చీలమండలు స్ఫిక్కులు పార్శ్వములు వృషణములు చూపులు దవడలు చెవులు పెదవులు సక్థులు పిక్కలు చేతులు బాహువులు కనుమబ్మొలు నను నీ జంటలు పదునాలుగు సమములయియుండునో యతడు చతుర్దశ సముడనబడును. పదునాల్గు విర్యాస్థానములని పెర్కొనబడినవి (చతుర్దశ విద్యలు) ఆ పదునాల్గింటిని రెండు కన్నులం జూచినతడు షోడశాక్షుడని చెప్పబడెను. తాకిన రూక్షముగా (కఠినముగ) నుండు బరలుదేరి నరములు పైకి కనిపించుచు మాంసము లేనిదై కంపుగొట్టు శరీరము విపరీతమని చెప్పబడును. ప్రసన్నమైన దృష్టి మధురమైన వాణి మదపుటేనుగట్టి చక్కని నడక యొక్కొక్క కూపమందొక్కొటిగాపుట్టి రోమకళ సత్వము (సత్తువ) ప్లుతము = నవ్వు అనుల్బణముగాదో మితిమీరి యుండదో విశ్రాంతిగొన్న తఱి వ్రయాణము అకలి కన్నము, దప్పికకు నీరు పరులయెడ రక్షణముననునీ లక్షణములు సకాలములో నెవ్వనికిగల్గు నామానవుని భూమియందు ధన్యునిగా ద్విజేంద్రులు పేర్కొందురు.

ఇది శ్రీ విష్ణు ధర్మోత్తర మహాపురాణము ద్వితీయ ఖండమున పురుషలక్షణమను ఎనిమిదవ యధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters