Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

నూట డెబ్బదియారవ అధ్యాయము - యాత్రా విధానమ్‌.

రామ ఉవాచః

యాత్రా విధానమాచక్ష్వ సర్వధర్మ భృతాం వర ! జిగీషూణాం నరేద్రాణాం సిద్ధికారణ ముత్తమమ్‌ ||

పుష్కర ఉవాచ ః

సప్తాహేన యథాయాత్రా భవిష్యతి మహీభృతాం | తదా దినేతు ప్రథమే పూజనీయో వినాయకః ||

మోదకై రక్షతైర్దధ్నా కుసుమైశ్చ తథా పలైః | గంధైః రలంకారై ర్దూపైర్దీపై ర్మనోహరైః ||

ద్వితీయో7హ్నితదా కార్యం సర్వ దిక్పాలపూజనమ్‌ | దిక్పాల పూజనం కృత్వా తేషాంచ పురతఃస్థితః ||

శయ్యాం కుశాభిః కుర్వీత సితవస్త్రోత్తర చ్ఛాదామ్‌ | వికిరే న్నాగపుషై#్పస్తాం తథా సిద్ధార్థకై శ్ముభైః ||

తచ్ఛీర్షకేతు పూజ్యాశ్రీః భద్రకాళీచ పాదయోః | హరం దక్షిణ పార్మ్వేతు వామే బ్రహ్మాణమేవచ ||

పూజితం కలశం హృద్యం కుర్యా దుష్ణీషకే దృఢమ్‌ | నీలపల్లవ సంఛన్నం చారు పుష్పోజ్జ్వలం శుభమ్‌ ||

ఏకకాలం హవిష్యాన్నం లఘు భుక్త్వా మహీపతిః | స్వయం దక్షిణ పార్మ్వచ మంత్రమేతదుదీరయేత్‌ః ||

నమశ్శంభో త్రినేత్రాయ రుద్రాయ వరదాయచ | వామనాయ విరూపాయ స్పప్నాధిపతయే నమః ||

భగవన్‌ దేవదేవేశ శూలభృడ్వృ షవాహన | ఇష్టానిష్టం సమాచక్ష్వ స్వప్నే సుప్తస్య శాశ్వతమ్‌||

యజ్జాగ్రతో దూరమితి మంత్రమావర్తయేత్తతః | హృది న్యస్య కుశాన్రాజ్ఞః ప్రయతస్తు పూరోహితః ||

తతః స్వప్నే శుభే దృష్టే యాత్రా దేయాతు నాన్యథా | తృతీయే7హని సంప్రాప్తే దేవం దిఙ్నాథ మర్చయేత్‌ ||

ఏకమేవ మహాభాగ ః దిననాథం తథా గ్రహమ్‌ | యాం దిశం నృపతి ర్గచ్ఛేన్నాథం తస్యాస్తథైవతాః ||

పరశురాము డనియె ! సర్వ ధర్మజ్ఞశ్రేష్ఠ ! జయము గోరెడి రాజేంద్రులకు సిద్ధినిచ్చెడి యాత్రా విధానముం దెలుపుము. అన విని పుష్కరుం డనియెః

దండయాత్ర యేడు రోజులు సేయవలసినపుడు రాజు మొదటి రోజున వినాయకుని బూజింపవలెను. పెరుగు ఉండ్రాళ్ళు పండ్లు నివేదింపవలెను. గంధ పుష్పాక్షలతో రమ్యములయిన వస్త్రములతో భూషణములతో ధూప దీపాదులతో నర్చింపవలెను. రెండవరోజున ఇంద్రాది దిక్పాలురను బూజించి వారి ముందు నిలువబడి దర్భలతో శయ్య నేర్పరచి తెల్లని వస్త్రము పైని పరచి యా పాన్పుమీద నాగ పుష్పములను సుర పొన్న పువ్వులు ఆవాలతో గూడ చల్లవలెను. ఆ పాన్పు తలవైపు శ్రీదేవిని (మహా లక్ష్మిని) పాదములవైపు భద్రకాళిని కుడివైపు శివుని యెడమవైపు బ్రహ్మను బూజింపవలెను. చక్కని కలశమును పూజించి తలపాగ కదలకుండ నిలుపవలెను. దానిని నల్లని పువ్వులతో గ్రమ్మవలెను. చక్కని పువ్వులతో నలంకరింబవలెను. భూపతి యొంటిపూట హవిష్యాన్నమును హోమ శిష్టాన్నమును భుజించి కుడివైపున నిలిచి యీ మంత్రము స్వయముగా పఠింపవలెను.

శంభువునకు, త్రినేత్రునకు, రుద్రునకు, వరదునకు, వామనునకు, విరూపునకు స్వప్నాధిపతికి నమస్కారము. భగవంతుడా ! దేవ దేవేశ ! శూలపాణీ ! వృషభవాహన నిదిరించిన వేళ నాకు శాశ్వతముగ జరుగబోవు మంచి చెడ్డలను దెలుపుము అను నర్థము గల యీ మంత్రమును జపింపవలెను. అటుపై పురోహితుడా రాజు హృదయమందు కుశాగ్రముల నానించి నియమమూని "యజ్జాగ్రతో దూరం" అను మంత్రము జపింపవలెను. అటు పైని కలలో శుభ దర్శన మయినచో దండయాత్ర సేయవలెను. మంచి కల రానిచో మానవలెను. మూడవ రోజు రాగానే ప్రభువే దెసకు యాత్ర జేయనున్నాడో యా దిశ దిగ్గజమును ఆ రోజున కధిపతియయిన గ్రహమును, ఆ దిశకు ప్రభువు నొక్కనినే పూజింపవలెను.

చతుర్థే7హని సంప్రాప్తే గ్రహయాగో విధీయతే ; పంచమే7హని సంప్రాప్తే సర్వయాగ స్తథైవ చ.

దేవతానాం స్వనగరే కృతా యాసాం తథా77లయాః ; తాసాం సంపూజనం కార్యం స్వపురేయే తథా స్థితాః.

తత్రైవ రాత్రౌ భూతానాం కర్తవ్యం చ తథా7ర్చనమ్‌.

ఏకవృక్షేషు చైత్యేషు చత్వరా7ట్టాలకేషు చ ; చతుష్పథేషు రథ్యాసు పర్వతానాం గుహాసు చ.

నదీ తీరేషు శైలేషు దేవతా77యతనేషు చ ; తేషాం సంపూజనం కృత్వా స్వగృహే తాన్సమర్చయేత్‌.

తత్ర కృత్వా తతో వాచ్యాః ప్రమథా భూభుజా స్వయమ్‌ ; వాసుదేవస్య దేవస్య తథా సంకర్షణస్య చ.

ప్రద్యుమ్నస్యా నిరుద్ధస్య బ్రహ్మణః శంకరస్య చ : కీనాశ శక్రవరుణ ధనేశానాంతు యే గణాః.

వాయోశ్చ నిరృతే ర్వహ్నే స్తథా చంద్రర్కయోశ్చయే ; గ్రహాణా మథ ఋక్షాణాం స్కందస్య చ మహాబలాః .

వినాయకస్య దేవస్య దేవతానాం గణాశ్చయే ; దైత్యానాం రాక్షసానాం చ సర్వేషా మనుగాశ్చయే.

మహాబలా మహాకాయా మహాసత్త్వా మహావ్రతాః | అణిమామహిమా ప్రాప్తిః ప్రాకామ్యేన చ సంయుతాః.

ఈశిత్వేన వశిత్వేన ప్రాప్తి నామ్నా తథోదయే ; యత్రకామావసాయిత్వం తథా తేషాం చ విద్యతే.

ఏవ మష్టగుణౖశ్వర్యసంయుతా భీమ విక్రమాః ; నానా సత్త్వ శిరోగ్రీవా నానా ప్రహరణాయుధాః.

నానావిరాగవసనా నానా సత్త్వవపుర్ధవాః ; తథా నానా విధా7హారాః మహాచేష్టా మహాబలాః.

భక్తా7నుకంపినో వీరా వరదాః కామరూపిణః ; ప్రమథాః పరిగృహ్ణంతు ఉపకారం నమో7స్తు వః .

సుపత్త్రా7మాత్య భృత్యో7హం సదారః శరణం గతః.

నాల్గవనాడు గ్రహయాగము నొనరింపవలెను. అయిదవ రోజున తన రాజధానియందేయే దేవతల కాలయములు గట్ట బడినవో యాయా దేవాలయములం దాయాదేవతల కర్చనము గావింపవలెను. అదేరాత్రి భూతముల కర్చనము సేయవలెను.

ఒంటి చెట్టున్న చైత్యములందు చత్వరములందు కలిసిన కూడలియందు కోట బురుజుల మీది గృహములందు (అట్టాలకములందు) చతుష్పథములందు (నాల్గుదారులుకలసిన కూడలియందు) రథ్య (రాజవీథు) లందు (రథముతిరుగు వీథులన్నమాట) పర్వతగుహలందు నదియొడ్డులను కొండల మీద దేవాలయములందు నాయా దేవతలను పూజనము సేసి తన యింటను వారినర్చింస వలెను.

అటుపై రాజు స్వయముగ ప్రమథగణములను వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధులయొక్క బ్రహ్మయొక్క శంకరునియొక్క యమ- ఇంద్ర- వరుణ కుబేరులయొక్క గణములు వాయువు నిరృతి అగ్నవి చంద్ర సూర్యులు ఇతర గ్రహములు నక్షత్రములు స్కందుడు (కుమారస్వామి) వినాయకుడు దేవతలయొక్కయు గణములు మహాబలులు మహాశరీరులు మహాసత్త్వలు మహావ్రతులు అణిమ మణిమ గరిమ ప్రాప్తి ప్రాకామ్యము ఈ శిత్వము వశిత్వము నను నెనిమిది సిద్ధులు గలవారు కోరికల యొక్క పరమావధి యెవరికిగలదో అట్టి అష్టగుణౖశ్వర్య సంపన్నులు భయంకర పరాక్రమవంతులు నానావిధ సత్త్వముల యొక్క (జంతువుల యొక్క) తలలు మెడలు గలవారు నానావిధ ప్రహరణాయుధులు నానావిధ వర్ణములుగల వస్త్రములు ధరించు వారు నానావిధ జంతువుల శరీరములు గలవారు నానావిధాహారులు మహా చేష్టలు గలవారు మహాబలవంతులు భక్తులనను గ్రహించువారు వీరులు వరమునిచ్చువారు కామరూపులు (ఏరూపుకావలెనన్న నారూపు ధరింపగలవారు) అగు ప్రమథగమములు నేసమర్పించు పుష్పాంజలిని స్వీకరితురుగాక; మీకు నమస్కారము. కొడుకులు కూతుళ్ళు మంత్రులు నౌకరులు భార్య మొదలగు వారితో గూడ నేను మిమ్ము శరణందుచున్నాను.

రక్షంతు మాం మహాభాగ గృహే యుద్ధే తథా7ధ్వని | చమూనాం పృష్ఠతో గత్వా నాశయధ్వం తతా రిపూన్‌ ||

స్వప్నే శుభా7శుభం వా7పి కథయధ్వం సమాహితాః | వినివృత్తశ్చ దాస్యామి దత్తా దభ్యధికం బలిమ్‌ ||

వినివృత్తేన దాతవ్యః స చ యత్నేన భూభుజా | పూర్వవచ్చ తథా రాత్రౌ స్వప్న ప్రార్థనమిష్యతే||

షష్ఠే7హని జయస్నానం కర్తవ్యం చ తథా భ##వేత్‌ | విధి రస్యా7భిషేకార్థః సర్వ ఏవ విధీయతే ||

తతో యాత్రా దినే ప్రాప్తే క్షౌరకర్మ వివర్జయేత్‌ | ముద్రణం భేదనం చైవ తథా నఖ నికృంతనమ్‌ ||

అభ్యంగం గృకాహర్యం చ క్రోధశోకా చ కంకతమ్‌ | యాతవ్యం యేన తేనాథ తదుక్తం స్నాన మాచరేత్‌ ||

స్నాత శుక్లాంబరః స్రగ్వీ తథా శ్వేతానులేపనః | చిత్రాభరణవాన్‌ రాజా దూర్వా పల్లవ లాంఛనః ||

పూజయిత్వా మహాభాగం దేవదేవం త్రివిక్రమమ్‌ | జుహుయా చ్చ తథా వహ్నౌ సుసమిద్ధే పురోహితః ||

ఆయుష్య మభయం చైవ తథా స్వస్త్యయనం గణమ్‌ ; శర్మ వర్మ గణం చైవ తథా ప్రతిరథం శుభమ్‌ ||

శకునం చ తథా సూక్తం సూక్తం వైష్ణవ మేవ చ | తథా7గ్ని లక్షణో త్పత్తౌ శుభే యాయాన్మహీపతిః ||

నక్షత్ర స్య దిశ##శ్చైవ నైవేద్యం యత్ర్పకీర్తితమ్‌ | తదేవ నృపతిః ప్రాశ్య యాత్రాం కుర్యా ద్యథా విధి ||

అహృద్యం మక్షికాకేశ కీటయుక్తం వివర్జయేత్‌ | దగ్ధే చ వర్జయే ద్యాత్రాం దేయా భవతి చా7న్యథా ||

తతస్తు రాజలింగానాం చాయుధానాం తథైవ చ | నీ రాజ నోక్త మంత్రైస్తు సర్వాం స్తా నభిమంత్రయేత్‌ ||

మహానుభావులు మీరు దేవతలందరు నింటను యుద్ధమందు దారిలో నా సేనల ముందు వెనుకను నుండి శత్రువుల నశింప జేయుడు. మీమనసులను నాయందు నిలిపి కలలో నాకు గాబోవు మంచి చెడ్డలను జెప్పుడు. మఱలి వచ్చియిప్పుడిచ్చిన దాని కంటె హెచ్చుగ బలిని (పూజను) పూజను మీ కిచ్చెదను. కలలో శుభాశుబ మెరిగింపుడని ప్రార్థన సేసినప్పటికంటె హెచ్చుగ విజయ యాత్రనుండి వచ్చినపుడు యాదేవతల నర్పింపవలయును.

ఆరవరోజు పట్టాభిషేకమందే విధముగ జేసెనోయట్లు రాజు జయస్నానము సేయవలెను. అందుచే యాత్రాదినమున క్షౌరముసేసికొనరాదు. ముద్రణము భేదనము పగులగొట్టుట గోళ్ళుత్రుంచికొనుట తలకుపోసికొనుట యింటిపనులు, కోపముశోకము క్రంకతం (తలదువ్వు) కొనుటయు చేయరాదు. యాత్రాప్రస్థానమందు చెప్పబడిన స్నానము మాత్రము సేయవలెను.

స్నానముచేసి తెల్లనిమడువులందాల్చి తెల్లనిపూలమాలలం గైసేసి తెల్లని గంధముపూసికొని చిత్రవిచిత్రా భరణములూని గరికచిగుళ్ళనుం గూడ పూని త్రివిక్రమ మూర్తిని (వామనావతారుని) బూజింప వలెను. పురోహితుడగ్నియందు హోమము సేయవలెను. అహోమములు ఆయుష్యము అభయము స్వస్త్యయనము చర్మ - వర్మ - అప్రతిరథము లను (యుద్ధమందు తిరుగు లేకుండ జేయుట) శుభమునిచ్చు నాయాదేవతా గణముల నుద్దేశించి వేర్వేరు హోమము సేయవలెను. యాత్రాసమయ నక్షత్రము యాత్రచేయు దిక్కునకధిదేవతకు నివేదనము సేసిన పదార్ధమును దిని యాత్ర సేయవలెను. ఇంపుగానిది యీగలు కేశము పురుగులతో గూడినచో నాపదార్ధమును వదలివేయవలెను. అది మంటలు మండుచున్నట్లు ఎఱ్ఱగకనిపిచినచో (దిశాదాహం అంటారు) రణయాత్ర చేయరాదు.

అటుపై రాజచిహ్నములయిన ఛత్రచామరాదులను ఆయధములను నీరాజన మంత్రములతో నభిమంత్రింప వలెను.

దైవవిత్‌ ప్రయతో భూత్వా రాజా వా7థ పురోహితః | తేషాం సంపూజనం కృత్వా దైవజ్ఞం సపురోహితమ్‌ ||

ధనేన పూజయే ద్రాజా దక్షిణాభి ర్ద్విజోత్తమాన్‌ | తతః పుణ్యాహ ఘోషేణ ద్విజానాం హతకల్మషః ||

మంగళా77లంభనం కృత్వా మంత్రమేతం నిశామయన్‌ | ఆదిత్యా వసవో రుద్రా విశ్వే దేవా మరుద్గణాః ||

లోకపాలాః సగంధర్వాః నద్యః శైలా మహాద్విజాః | అగ్నిస్స్వాహా స్వధా హామః స్కంధో బ్రహ్మా ప్రజాపతిః ||

ముహూర్తా స్తిథయో భాని వేదా స్సాయన వత్సరాః | గా వ స్స రస్వతీ దేవీ దీర్ఘమాయు ర్దిశంతు తే ||

జగత్సృజో7థ యాసిద్ధి ర్బభూవ బ్రహ్మణః పురా | జగజ్జిష్ణోశ్చ యా విష్ణోః సిద్దిర్యా77సీత్‌ త్రివిక్రమే ||

అసురైశ్వర్య నాశేచ బభూవ త్ర్యంబకస్య యా | సిద్ధి స్త్రి దశ వృద్ధ్యర్ధం త్రిపురాంత కృతః పురా ||

శ##క్రే వృత్రవధేయావ త్స్కందే దేవారి సంక్షయే | తాం ప్రాప్ను హి సదా సిద్ధిం సా చ యాత్రా7స్తుతే సదా ||

రక్షంతు సర్వతః సర్వే దేవాః శక్ర పురోగమాః | ఇతి శ్రుత్వా శుభాం వాచం గృహీత్వా సశరం ధనుః ||

ధన్వ నాగేతిమంత్రేణ దైవజ్ఞస్య కరాత్స్వయమ్‌ | తద్విష్ణోః పరమిత్యేవ శృణ్వన్‌ మంత్ర మనుత్తమమ్‌ ||

పైష్టే రిపుముఖే దద్యాత్‌ ప్రథమం దక్షిణం పదమ్‌ | పద ద్వాత్రింశకం గత్వా జిష్ణుః ప్రాచ్యాదిషు త్వథ ||

నాగం రథం హయం చైవ యుంజానే చారుహేత్‌ క్రమాత్‌ | ఆరుహ్య సుమనా గచ్ఛే ద్వా ద్యఘోషేణ భూరిణా ||

సనిష్క్రమ్య మహా నీశో న పృష్ఠ మవలోకయేత్‌ | మంగళాని తతః పశ్యన్‌ స్పృశన్‌ చృణ్వన్‌ శ##నైర్వ్రజేత్‌ ||

దేవజ్ఞుడు గాని, రాజుగాని, పురోహితుడుగాని నియమవంతులై ఆ యాయుధాలను బుజించిన తర్వాత రాజు జ్యౌతిషికుని పురోహితుని ధనమిచ్చి దక్షిణలిచ్చి బ్రాహ్మణోత్తములను బూజింపవలెను. అటుపై ద్విజులు గావించిన పుణ్యాహవాచన ఘోషముచే కల్మషము లెల్ల పోయి మంగళాలంభనముతో (అద్దము మొదలయిన మంగళ పదార్థములను స్పృశించుచు) నీ మంత్ర మును పురోహిత ముఖమున జదివించి వినవలెను.

వసువులు, రుద్రులు, విశ్వదేవులు, మరుద్గణములు, ఆదిత్యులు మొదలగు ప్రజాపతిదాకగల దేవతాది వర్గము. ముహూర్తములు తిథులు, నక్షత్రాలు, వేదములు, ఆయనములు, సంవత్సరములు, గోవులు, సరస్వతీదేవి, నీకుదీర్ఘాయువు నిత్తురుగాక. జగమును బుట్టించు బ్రహ్మకు మున్నేసిద్ధి కలిగినదో జగమ్ములంగెలుచు విష్ణువునకు త్రివిక్రమావతార మందే సిద్ధి గల్గెనో దేవతాభివృద్ధికి, అసురుల (త్రిపురాసురుల) ఐశ్వర్యమును నశింప జేయునెడ త్రిలోచనునికే సిద్ధి యొదవెనో వృత్రాసురవధయం దింద్రునికి రాక్షస సంహారమందు స్కందునికి గల్గిన సిద్ధిని నీవు పొందుము. వారింబోలె నీదండయాత్ర శుభప్రదమై అప్రతిహతమై సాగుగాక.

ఇంద్రాది దేవతలెల్లయెడల నిన్ను రక్షింతురుగాక. ఈవిధములయిన మంగళాశాసనములను విని బాణమును బట్టి ''ధన్వనాగ'' అను మంత్రముతో దైవజ్ఞుని చేతినుండి బాణముతో ధను వందుకొని తద్విష్ణోఃపరమమ్‌ అను మహామంత్రము నాలించుచు పిండిబొమ్మగ జేసిన శత్రువుయొక్క ముఖమందు దొలుత కుడిపాద ముంచవలెను. అటుపై ముప్పదిరెండడుగులు తూర్పుమొదలగు దిశలందు నడచి జయార్థియైన ప్రభువు ఆయత్తము లొనరింపబడిన ఏనుగు రథమును గుఱ్ఱమును వరుసగ నెక్కవలెను. మనస్సు చక్కగానొనరించికొని మంగళవాద్యములు పెల్లుగ మ్రోయుచుండ పురమువెడలి మహారాజు వెనుకకు జాడ గూడదు; అటుపై మంగళములంగనుచు వినుచుం దాకుచును మెలమెల్ల ముందుకు సాగవలెను.

క్రోశమాత్రం తతో గచ్ఛే న్నాధికం తు కదాచన | గత్వా దేశే శుభే తిష్ఠే త్పూజయిత్వా జనార్ధనమ్‌ ||

తతః క్రమేణ గచ్ఛే చ్చ పరదేశం మహీపతిః | ఆత్మసైన్యాను రూపేణ కృత రక్షః పథా ద్విజాః ||

త్రిరాత్రముషితో గచ్ఛే ద్భూయో నక్షత్ర సంపదా | యవసేంధన తోయానాం రక్షకో విషదూషణాత్‌ ||

పరానభిముఖో గచ్ఛేత్‌ ప్రభూతయవ సేంధనః | సై#్వర చంక్రమణం శయ్యాం భాండప్రక్షేపణం తథా ||

భోజనం చ సుఖం కుర్యా న్నో చ్ఛింద్యా ద్దవమత్ర తు | కులస్త్రియం చ తన్వీం చ వృద్ధాం నైవా7వమానయేత్‌ ||

కులీన మభినందేత్తు నవై నృపతి వంశజమ్‌ | న కర్మనాసాచ్ఛే దాంశ్చ న తథా నేత్రభేదనమ్‌ ||

కాలవి ష్మంత్రి భిషజో ర్వాక్యం కుర్యా న్మహీపతిః ||

తతః క్రమా త్ప్రాప్య పురీం స్వకీయాం | బలింతు దద్యా దధికాం పురోక్తామ్‌ ||

కుర్యాన్మహీం యూపసురాలయాంకామ్‌ | స్వర్లోక మిచ్ఛ7పృథివీం సమగ్రామ్‌ ||

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ద్వితీయఖండే యాత్రావిధిర్నామ షట్సప్తత్యుత్తర శతతమో7ధ్యాయః ||

ఒక్కక్రోసుదూర మేగవలెను. అంతకుమించి యెన్నడుంబోరాదు; ఏగీ యొక శుభ ప్రదేశమందు జనార్దనునిం బూజించి నిలువలెను. అవ్వల క్రమముగ శత్రుదేశమును గూర్చి తన సైన్యమున కనువైన దారిలో రక్షణచేసికొని చనవలయును.

మూడురాత్రులు నడుమవిడిదిచేసి నక్షత్రబలసంపద ఆనుకూల్యముతో యవసము (గుర్రములకు) గడ్డి ఇంధనము వంట కట్టెలు (సేనలవంటకు) నీరు విషముచే దుషితములు కాకుండ కాపాడుకొనుటు శత్రువుల కభిముఖముగ యాత్రసేయవలెను. గడ్డి వంటచెఱకు గూడ సమృద్ధిగ నుండవలెను. స్వేచ్ఛా సంచారము (వాహ్యాళి) పడక, పాత్రసామాగ్రి యెగుమతి భోజనమును పూజనము సేయవలెను. దారిలో దావమును (అడవిని) నరుకరాదు ; పతివ్రతలను వృద్ధ స్త్రీని నవమానింపనే కూడదు ఉత్తమ రాజు వంశజు నభినందింపవలెను. రాజ వంశజుని చెవులు ముక్కు కోయరాదు. కండ్లు పోడువరాదు. కాలజ్ఞుడు జ్యౌతిషిక మంత్రులు వైద్యులు చెప్పినట్లు చేయవలెను.

స్వర్గము గోరు రాజు అవ్వల క్రమముగ తన రాజధానికి వచ్చి యింతకు మున్ను జెప్పిన బలిని (పూజను) యాత్రా ప్రారంభము నందు కంటె నెక్కువగా గావింపవలెను; ఈ వసుంధరను నెల్ల నేలుచు యూపములు (యజ్ఞములందలి) దేవాలయ ములు గూడిన దానిం గావింపవలెను.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణమందు ద్వితీయ ఖండమున యాత్రా విధి యను నూడ డెబ్బదియారవ అధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters