Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

నూటనలుబది ఎనిమిదవ అధ్యాయము - ఉపాధి వర్ణనము

పుష్కరః- ఉత్పాతైరనృతైః కార్యాం పరస్యోద్వీజనం నృపైః అరాతి శిబిరస్యాత్ర వసతి ర్యస్య పక్షిణః ||

స్థూలస్య తస్య పుచ్ఛస్థాం కృత్వోల్కాం విపులాం ద్విజ | విసృజ్యైనం తతస్తీర ముల్కాపాతం ప్రదర్శయేత్‌ ||

అనేనైవాత్ర సారేణ బుద్ధ్యా నిశ్చిత్య యత్నతః | ఉత్పాతాని తధాన్యాని దర్శనీయాని పార్థివైః ||

ఉద్వేజనం తధా కుర్యా త్కుహకై ర్ద్వివిధైర్ద్విషాం || సంవత్సరా నహార్షశ్చ నాశం బ్రూయుః పరస్యచ ||

జిగీషుః పృధివీంరాజ్యేతేన చో ద్వేజయే త్పరాన్‌ | దేవతానాం ప్రసాదాని కీర్తనీయాని తస్యతు ||

సుస్వప్నలాభాంశ్చ జిగీషోః ప్రతికీర్తయేత్‌ | దుఃస్వప్నలాభం చ తధా పరేషా మితి నిశ్చయః ||

ఆగతంనో మిత్రబలం ప్రహరధ్వ మభీతవత్‌ |ఏవలబ్రూయాద్రణ ప్రాప్తే మయాభగ్నాః పరేఇతి ||

క్ష్వేడాః కిలకిలా శబ్దం మమశత్రుర్హత స్తధా | దేవాజ్ఞా బృంహితో రాజాసన్నద్ధ స్సమరంప్రతి ||

ఏవం ప్రకారాద్విజపర్యః మాయాః కార్యా నరేద్రై రరిషు ప్రహృష్టైః |

మయాహతః శత్రురథ ప్రసహ్య | సక్యఃసుఖంహన్తు మదీనసత్వః ||

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ద్వితీయఖండే ఉపాధి వర్ణనంనామ అష్టచత్వారింశదుత్తర శతతమో7ధ్యాయః ||

పుష్కరుండిట్లనియె. రాజులు అసత్యపు నుత్పాతములను కల్పించి శత్రువునకు భయోద్వేగమును కలుగజేయనగును. స్థూలమైన పక్షియొకటి శత్రు శిబిరమున నున్నట్లును దాని తోకయందు పెద్దకొఱవి యున్నట్లును ఆ పక్షిని తీరమున వదలగా నుల్కాపాతము నది చేయుచున్నట్లు చూపవలెను. ఈ విధిముగా బుద్ధితో నిశ్చయించి ప్రయత్నపూర్వకముగ ననేకోత్పాతము [ఉపద్రవము]లను రాజులు చూపవలెను. ఇట్లు కల్పితములైన ఉత్పాతములను చూపి శత్రువులకు భయమును కలుగ జేయవలెను. జ్యోతిషుకులను రప్పించి వారిచే శత్రువులకు నాశమున్నట్లు చెప్పింపవలెను. భూమిని జయింపగోరిన రాజు ఆ జ్యోతిషుకుని ద్వారా శత్రువులను భయపెట్టుటయే గాక తనకు దేవతాను గ్రహమున్నట్లు చెప్పింప వలెను. తన విషయమై సుస్వప్నప్రాప్తిని శత్రువుల విషయమై దుస్స్వప్న లాభ నిశ్చయమును కీర్తింపజేయవలెను. తనకు సహాయార్థమై ఏతెంచిన మిత్రబలమును నిర్భయులై"కొట్టుడు కొట్టుడని" హెచ్చరిక చేయవలెను. రణమాసన్నముకాగా నాచే శత్రురాజులు జితులైరి. దేవాజ్ఞచే నుపబృంహితుడై రాజు యుద్ధమునకు సంసిద్ధుడాయెను. శత్రువు చచ్చెను అని పెద్దకేకలు కిలకిల ధ్వనులు చేయవలెను. బ్రాహ్మోణోత్తమా! ఈ విధములగు పెక్కు మాయలను శత్రువుల విషయమై సంతోషముతో రాజులు కల్పించవలెను. ఇట్లు మాయలచే హతుడైన శత్రు వెంత బలాధికుడైనను సులభముగ జయింపనగును.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణమందు ద్వితీయఖండమునందు ఉపాధి వర్ణనమను నూటనలుబది యెనిమిదవ అధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters