Page load depends on your network speed. Thank you for your patience. You may also report the error.

Loading...

Siva Maha Puranam-3    Chapters   

అథ నవమో%ధ్యాయః

మహాబలేశ్వర మాహాత్మ్యము

ఋషయ ఊచుః |

సూత సూత మహాభాగ ధన్యస్త్వం శైవసత్తమః | చాండాలీ కా సమాఖ్యాతా తత్కథాం కథయ ప్రభో || 1

ఋషులు ఇట్లు పలికిరి-

ఓ సూతా! సూతా! మహాత్మా! శివభక్తాగ్రేసరుడవగు నీవు ధన్యుడవు. ఓ ప్రభూ! ఆ చాండాలి ఎవరు? ఆ గాథను చెప్పుము (1).

సూత ఉవాచ |

ద్విజాశ్శృణుత సద్భక్త్యా తాం కథాం పరమాద్భుతమ్‌ | శివప్రభావసంమ్రిశాం శృణ్వతాం భక్తి వర్ధనీమ్‌ || 2

చాండాలీ సా పూర్వభ##వే%భవద్ర్బాహ్మణ కన్యకా | సౌమినీ నామ చంద్రస్యా సర్వలక్షణ సంయుతా || 3

అథ సా సమయే కన్యా యువతీ సౌమినీ ద్విజాః | పిత్రా దత్తా చ కసై#్మచిద్విధినా ద్విజా సూనవే || 4

సా భర్తారమను ప్రాప్య కించిత్కాలం శుభవ్రతా | రేమే తేన ద్విజశ్రేష్ఠా నవ¸°వన శాలినీ || 5

అథ తస్యాః పతిర్విప్రస్తరుణస్సురు జార్దితః | సౌమిన్యాః కాలయోగాత్తు పంచత్వమగమద్ద్విజాః || 6

మృతే భర్తరి సా నారీ దుఃఖితాతి విషణ్ణధీః | కించిత్కాలం శుభాచారా సుశీలోవాస సద్మని || 7

తతస్సా మన్మథావిష్ట హృదయా విధవాపి చ | యువావస్థా విశేషేణ బభూవ వ్యభిచారిణీ || 8

తద్‌ జ్ఞాత్వా గోత్రిణస్తస్యా దుష్కర్మ కులదూషణమ్‌ | సమేతాస్తత్యజుర్దూరం నీత్వా తాం సకచగ్రహామ్‌ || 9

సూతుడిట్లు పలికెను-

ఓ బ్రాహ్మణులారా! పరమాశ్చర్యకరమైనది, శివమహిమతో విరాజిల్లునది, వినువారలకు భక్తిని పెంపొందిచునది యగు ఆ గాథను ఉత్తమమగు భక్తితో వినుడు (2). ఆ చాండాలి పూర్వజన్మలో చంద్రుని వంటి ముఖము గలది, సర్వశుభలక్షణములతో గూడియున్నది, సౌమిని అను పేరు గలదియగు బ్రాహ్మణకన్యక (3). ఓ బ్రాహ్మణులారా! ఆమెకు యుక్తవయస్సు రాగానే ఆమె తండ్రి ఆమెను ఒక బ్రాహ్మణ కుమారునకిచ్చి యథావిధిగా వివాహమును చేసెను (4). ఓ బ్రాహ్మణోత్తములారా ! శుభమగు వ్రతము గలది, నూతన ¸°వనముతో ఒప్పారునది అగు ఆ బ్రాహ్మణయువతి భర్తను పొంది కొంతకాలము వానితో రమించెను (5). ఓ బ్రాహ్మణులారా! తరువాత కొంతకాలమునకు యువక బ్రాహ్మణుడైన సౌమినియొక్క భర్త పెద్ద వ్యాధిచే పీడితుడై మరణించెను (6). భర్త మరణించిన తరువాత ఆ యువతి అతిశయించిన దుఃఖముతో నిండిన మనస్సు గలదై కొంతకాలము వరకు సౌశీల్య సదాచారములతో ఆ గృహమునందే నివసించెను (7). ఆ తరువాత ఆమె భర్తృహీనయే అయిననూ ¸°వనప్రభావముచే మన్మథావేశముతో నిండిన మనస్సు గలదై వ్యభిచారిణి ఆయెను (8). కులప్రతిష్ఠను చెడగొట్టే ఆమెయొక్క ఆ చెడు వర్తనను గాంచి ఆమె యొక్క బంధువులు జతగూడి ఆమెను జుట్టు పట్టుకొని తీసుకువెళ్ళి దూరములో విడిచిపెట్టిరి (9)

కశ్చిచ్ఛూద్రవరస్తాం వై విచరంతీం నిజేచ్ఛయా | దృష్ట్వా వనే స్త్రియం చక్రే నినాయ స్వగృహం తతః || 10

అథ సా పిశితాహారా నిత్యమాపీతవారుణీ | అజీజనత్సుతాన్తేన శూద్రేణ సురతప్రియా || 11

కదాచిద్భర్తరి క్వాపి యాతే పీత సురాథ సా | ఇయేష పిశితాహారం సౌమినీ వ్యభివచారిణీ || 12

తతో మేషేషు బద్ధేషు గోభిస్సహ బహిర్వ్రజే | నిశాముఖే తమోంధే హి ఖడ్గమాదాయ సా య¸° || 13

అవిమృశ్య మదావేశాన్మేషబుద్ధ్యామిషప్రియా | ఏకం జఘాన గోవత్సం క్రోశంతమతి దుర్భగా || 14

హతం తం గృహమానీయ జ్ఞాత్వా గోవత్సమంగనా | భీతా శివ శివేత్యాహ కేన చిత్పుణ్యకర్మణా || 15

సా ముహూర్తం శివం ధ్యాత్వామిష భోజనలాలసా | ఛిత్త్వా తమేవ గోవత్సం చకార హారమీప్సితమ్‌ || 16

అడవిలో యథేచ్ఛగా సంచరించుచున్న ఆ యువతిని గాంచి ఒక శూద్రప్రముఖుడు ఆమెను వివాహమాడి తన ఇంటికి గొనిపోయెను (10). తరువాత ఆమె ప్రతిదినము మాంసమును భక్షించి మద్యమును త్రాగి ఆ శూద్రునితో కలిసి ప్రీతితో రమిస్తూ కొడుకులను కనెను (11). ఒకనాడు భర్త ఎచటికో వెళ్లెను. వ్యభిచారిణియగు సౌమిని మద్యమును త్రాగి మాంసాహారమునభిలషించెను (12). ఆమె రాత్రియందు గాఢాంధకారములో కత్తిని చేతబట్టి పశువుల శాలకు వెళ్లెను. అచట గోవులతో బాటు మేకలు కూడా కట్టివేయబడియుండెను (13). మాంసాహారమును ఇష్టపడే ఆ మహాదుష్టురాలు మద్యముయొక్క ప్రభావములో నున్నదై కన్ను మిన్నుగానక మొర బెట్టుచున్న ఒక ఆవుదూడను సంహరించెను (14). ఆ మృతపశువును ఇంటికి దెచ్చి అది ఆవుదూడయని గుర్తించి భయముతో ఏదో ఒక పూర్వపుణ్యప్రభావముచే 'శివ, శివ' అనెను (15). ఆమె ముహూర్తకాలము శివుని ధ్యానించెను. మాంసభక్షణమునందు ప్రీతిగల ఆమె ఆ ఆవుదూడను కోసి తనకు నచ్చిన వంటకమును చేసుకొనెను (16).

ఏవం బహుతిథే కాలే గతే సా సౌమిని ద్విజాః | కాలస్య వశమాపన్నా జగామ యమసంక్షయమ్‌ || 17

యమో%పి ధర్మమాలోక్య తస్యాః కర్మ చ పౌర్వికమ్‌ | నివర్త్య నిరయావాసాచ్చక్రే చాండాల జాతికామ్‌ ||18

సా%థ భ్రష్టా యమపురాచ్చాండాలీ గర్భమాశ్రితా | తతో బభూవ జన్మాంధా ప్రశాంతాంగారమేచకా || 19

జన్మాంధా సా%థ బాల్యే%పి విధ్వస్తపితృమాతృకా | ఊఢా న కేన చిద్దుష్టా మహాకుష్ఠరుజార్దితా || 20

తతః క్షుధార్దితా దీనా యష్టి పాణిర్గతేక్షణా | చాండాలోచ్ఛిష్టపిండేన జఠరాగ్ని మతర్పయత్‌ || 21

ఏవం కృచ్ఛ్రేణ మహతా నీత్వా స్వవిపులం వయః | జరయా గ్రస్తసర్వాంగీ దుఃఖమాప దురత్యయమ్‌ || 22

కదాచిత్సా %థ చాండాలీ గోకర్ణం తం మహాజనాన్‌ | ఆయాస్యంత్యాం శివతిథౌ గచ్ఛతో బుబుధే% ధ్వగాన్‌ || 23

ఓ బ్రాహ్మణులారా! ఈ తీరున చాల కాలము గడిచెను. ఆ సౌమిని మరణించి యమలోకమునకు వెళ్లెను (17). ధర్మమును పరిపాలించే యముడు ఆమె పూర్వజన్మలో చేసిన కర్మలను పరిశీలించి నరకవాసమునుండి ఆమెను వెనకుకు పంపి చండాల జాతిలో జన్మింపచేసెను (18). ఆమె యమలోకమునుండి జారి చండాల స్త్రీ యొక్క గర్భములో నున్నదై జన్మించెను. ఆమె పుట్టు గ్రుడ్డియై జన్మించెను (19). ఆమె నిప్పును ఆర్పగా మిగిలిన బొగ్గులవలె నల్లగా నుండెను. పుట్టు గ్రుడ్డియగు ఆమెయొక్క తల్లిదండ్రులు బాల్యములోననే మరణించిరి. మహాకుష్ఠవ్యాధితో బాధపడుచున్న ఆ దుష్టురాలికి వివాహము కాలేదు (20). చూపులేని ఆ దీనురాలు కర్రను చేతబట్టి ఆకలికి దాళజాలక చండాలులు తినగా మిగిలిన అన్నముతో కడుపును నింపుకొనుచుండెను (21). ఆమె మహాదుఃఖముననుభవించెను (22). ఒకప్పుడు రాబోయే శివుని పర్వము నాటికి గోకర్ణమునకు వెళ్లుచున్న మహాత్ములు ఆ దారిని వెళ్లుచుండగా ఆమెకు తెలిసెను (23).

అథాసావపి చాండాలీ వసనాశనతృష్ణయా | మహాజనాన్‌ యాచయితుం సంచచార శ##నైశ్ననైః || 24

గత్వా తత్రాథ చాండాలీ ప్రార్థయంతీ మహాజనాన్‌ | యత్ర తత్ర చచారాసౌ దీనవాక్‌ ప్రసృతాంజలిః || 25

ఏవమభ్యర్థయంత్యాస్తు చాండాల్యాః ప్రసృతాంజలౌ | ఏకః పుణ్యతమః పాంథః ప్రాక్షిపద్బిల్వమంజరీమ్‌ || 26

తామంజలౌ నిపతితాం సా విమృశయ పునః పునః | అభక్ష్యమితి మత్వాథ దూరే ప్రాక్షిపదాతురా || 27

తస్యాః కరాద్వినిర్ముక్తా రాత్రౌ సా బిల్వమంజరీ | పపాత కస్య చిద్దిష్ట్యా శివలింగస్య మస్తకే || 28

సైవం శివచతుర్దశ్యాం రాత్రౌ పాంథజనాన్ముహుః | యాచమానాపి యత్కించిన్న లేభే దైవయోగతః || 29

ఏవం శివచతుర్దశ్యా వ్రతం జాతం చ నిర్మలమ్‌ | అజ్ఞానతో జాగరణం పరమానందదాయకమ్‌ || 30

తరువాత ఆ చాండాలి వస్త్రములయందు మరియు ఆహారమునందు తృష్ణ గలదై సంపన్నులగు జనులను యాచించగోరి మెల్ల మెల్లగా ఇటునటు తిరుగుచుండెను (24). దీనముగా పలుకుతూ చేతులను చాచి మహాజనులను యాచిస్తూ ఆమె గోకర్ణములో ఇటునటు తిరుగాడెను (25). ఈ విధముగా యాచిస్తున్న ఆ చాండాలి చేతిలో మహాపుణ్యాత్ముడగు ఒక బాటసారి మారేడు దళముల గుత్తిని జారవిడెచెను(26).తన చేతిలోపడిన వస్తువును పలుమార్లు స్పర్శతో పరిశీలించి అది తినే వస్తువు కాదని తలంచి దుఃఖితురాలై దూరముగా పారవైచెను(27) రాత్రియందు ఆమెనుండి విసిరివేయబడిన ఆ మరేడు దళముల గుత్తి దైవయోగముచే ఒకానొక శివలింగముయొక్క శిరస్సుపై పడెను (28). ఆమె ఈ తీరున శివచతుర్దశినాడు రాత్రియందు బాటసారులను పలుమార్లు యాచించిననూ దైవ నిర్ణయమువలన ఆమెకు ఏమియూ లభించలేదు (29). ఈ తీరున పవిత్రము, పరమానందదాయకము అగు శివచతుర్దశీవ్రతము మరియు జాగరణము ఆమెకు తెలియకుండగనే సిద్ధించెను (30).

తతః ప్రభాతే సా నారీ శోకేన మహతావృతా | శ##నైర్నివవృతే దీనా స్వదేశాయైవ కేవలమ్‌ || 31

శ్రాంతా చిరోపవాసేన నిపతంతీ పదే పదే | అతీత్య తావతీం భూమిం నిపపాత విచేతనా || 32

అథ సా శంభుకృపయా జగామ పరమం పదమ్‌ | ఆరుహ్య సువిమానం చ నీతం శివగణౖర్ద్రుతమ్‌ || 33

ఆదౌయదేషా శివనామ నారీ ప్రమాదతో వాప్యసతీ జగాద | తేనేహ భూయస్సుకృతేన విప్రా మహాబలస్థానమవాప దివ్యమ్‌ || 34

శ్రీ గోకర్ణే శివతిథావుపోప్య శివమస్తకే | కృత్వా జాగరణం సా హి చక్రే బిల్వార్చనం నిశి || 35

అకామతః కృతస్యాస్య పుణ్యసై#్యవ చ తత్‌ ఫలమ్‌ | భునక్త్యద్యాపి సా చైవ మహాబలప్రసాదతః || 36

ఏవం విధం మహాలింగం శంకరస్య మహాబలమ్‌ | సర్వపాపహరం సద్యః పరమానందదాయకమ్‌ || 37

ఏవం వః కథితం విప్రా మాహాత్మ్యం పరమం మయా | మహాబలాభిధానస్య శివలింగవరస్య హి || 38

అథాన్యదపి వక్ష్యామి మాహాత్మ్యం తస్య చాద్భుతమ్‌ | శ్రుతమాత్రేణ యేనాశు శివే భక్తిః ప్రజాయతే | 39

ఇతి శ్రీ శివమహాపురాణ కోటిరుద్రసంహితాయం చాండాలీ సద్గతి వర్ణనం నామ నవమో%ధ్యాయః (9).

మరునాడు ఉదయము ఆ స్త్రీ మహాదుఃఖముననుభవిస్తూ దీనురాలై మెల్లగా తన స్థానమునకు మరలి వెళ్లుచుండెను (31). ఆమె చిరకాలము ఉపవాసముచే సొక్కి అడుగు అడుగునా పడిపోతూ కొద్ది దూరము దాటి కుప్పగూలి ప్రాణములను విడిచెను (32). అపుడామెను శంభుని కృపచే శివగణములు శీఘ్రముగా గొప్ప విమానమునెక్కించి పరమపదమునకు గొని పోయిరి (33). ఆ బ్రాహ్మణయువతి దుష్టురాలే అయిననూ శివనామమును ముందుగా అనుకోని విధముగా ఉచ్చరించెను. ఓ బ్రాహ్మణులారా! ఆ మహాపుణ్యప్రభావముచే ఇహలోకములో ఆమె దివ్యమగు మహాబలేశ్వరస్థానమును పొందెను (34). శ్రీ గోకర్ణమునందు ఆమె శివతిథినాడు ఉపవసించి జాగరణము చేసి శివుని శిరస్సుపై రాత్రియందు బిల్వముతో పూజించెను (35). ఆమె అనుకోకుండగా చేసిన ఈ పుణ్యముయొక్క ఫలమును మహాబలేశ్వరుని అనుగ్రహముచే ఈ నాటికి అనుభవించుచున్నది (36). ఓ బ్రాహ్మణులారా! సకల పాపములను పోగొట్టి వెంటనే పరమానందమునిచ్చే మహాబలేశ్వరలింగము ఇట్టి మహిమ గలది. శివలింగములలో శ్రేష్ఠమైన మహాబలేశ్వరుని పవిత్ర మాహాత్మ్యమును నేను మీకు ఈ విధముగా చెప్పియుంటిని (37, 38). ఇంతేగాక ఆ శివుని మహిమను మరియొక దానిని కూడ చెప్పెదను. దీనిని విన్నవెంటనే శివుని యందు భక్తి ఉదయించును (39).

శ్రీ శివమహాపురాణములో కోటిరుద్ర సంహితయందు చాండాలీ సద్గతి వర్ణనమనే తొమ్మిదవ అధ్యాయము ముగిసినది (9).

Siva Maha Puranam-3    Chapters