Sri Scanda Mahapuranamu-3    Chapters   

అథశ్రీస్కాందేమహాపురాణ

తృతీయ బ్రహ్మఖండే (ధర్మారణ్య) ఉత్తరభాగః

మూ || శ్రీగణశాయనమః

శ్రీగురుభ్యోనమః

ఓంనమఃశివాయ -

జ్యోతిర్మాత్రస్వరూపాయ నిర్మలజ్ఞానచక్షుషే | నమఃశివాయ శాంతాయబ్రహ్మణలింగమూర్తయే || 1 ||

ఋషయఊచుః -

ఆఖ్యాతంభవతాసూతవిష్ణోర్మాహాత్మ్యముత్తమం | సమస్తాఘహరంపుణ్యంసమాసేనశ్రుతంచనం || 2 ||

ఇదానీంశ్రోతుమిచ్ఛామోమాహాత్మ్యంత్రిపురద్విషః | తద్భక్తానాంచమాహాత్మ్యంఅశేషాషుహరంపరం || 3 ||

తన్మంత్రాణాంచమాహాత్మ్యంతధైవద్విజసత్తమ | తత్కధాయాశ్చతద్భక్తేఃప్రభావమనువర్ణయ || 4 ||

సూతఉవాచ -

ఏతావదేవమర్త్యానాం పరంశ్రేయఃసనాతనం | యదీశ్వరకధాయాంవైజాతాభక్తిరహైతుకీ || 5 ||

అతస్తద్భక్తిలేశస్యమాహాత్మ్యంవర్ణ్యతేమయా | అపికల్పాయుషానాలంవక్తుంవిస్తరతః క్విచిత్‌ || 6 ||

సర్వేషామపిపుణ్యానాంసర్వేషాంశ్రేయసామపి | సర్వేషామపియజ్ఞానాంజపయజ్ఞఃపరఃస్మృతః || 7 ||

తత్రాదౌజపయజ్ఞస్యఫలంస్వస్త్యయసంమహత్‌ | శైవంషడక్షరందివ్యంమంత్రమాహుర్మహర్షయః || 8 ||

దేవానాంపరమోదేవోయథావైత్రిపురాంతకః | మంత్రాణాంపరమోమంత్రఃతథాశైవఃషడక్షరః || 9 ||

ఏషపంచాక్షరోమంత్రోజప్తానాంముక్తిదాయకః | సంసేవ్యతేమునిశ్రేష్టైఃఅశేషైఃసిద్ధికాంక్షిభిః || 10 ||

అసై#్యవాక్షరమాహాత్మ్యంనాలంవక్తుంచతుర్ముఖః | శ్రుతయోయత్రసిద్ధాంతగతాః పరమనిర్వృతాః || 11 ||

సర్వజ్ఞఃపరిపూర్ణశ్చసచ్చిదానందలక్షణః | సశివోయత్రరమతేశైవేపంచాక్షరేశుభే

|| 12 ||

ఏతేనమంత్రరాజేన సర్వోపనిషదాత్మనా | లేఖిరేమునయః సర్వేపరంబ్రహ్మనిరామయం || 13 ||

నమస్కారేణజీవత్వంశివేత్రపరమాత్మని | ఐక్యంగతమతోమంత్రఃపరబ్రహ్మమయోహ్యసౌ || 14 ||

భవపాశనిబద్ధానాందేహినాంహితలకామ్యయా | అహోంనమఃశివాయేతిమంత్రమాద్యంశివఃస్వయం || 15 ||

తా || జ్యోతిర్మాత్రస్వరూపుడు, నిర్మలజ్ఞానమే చక్షువుగాగలవాడు, శాంతుడు, లింగమూర్తి, బ్రహ్మఐనశివునకు నమస్కారము. (1) ఋషులిట్లన్నారు. సూత! మీరు ఉత్తమమైన విష్ణుమాహాత్మ్యాన్ని చెప్పారు. సమస్తపాపముల హరించేది, పుణ్యప్రదమైనది. మేము సంక్షిప్తంగా విన్నాము (2) ఇప్పుడు త్రిపురద్వేషియైనవానిమాహాత్మ్యమును వినదలిచాము. ఆతని భక్తులయొక్కమాహాత్మ్యముగూడా సమస్తపాపమునశింపచేసేదిపరమైనది. (3) వారిమంత్రములమాహాత్మ్యాన్ని ఓ ద్విజ సత్తమ! ఆతనికథలప్రభావము, ఆతనియెడభక్తికల్గిన దానిప్రభావము వర్ణించండి. అనగా (4) సూతులిట్లన్నారు - ఇదే నరులకు సనాతనమైన ఉత్తమశ్రేయస్సు. ఈశ్వరునికధలయందు నిర్హేతుకభక్తికలగటమేశ్రేయస్సు. (5) అందువల్ల ఆతని భక్తిలేశమాహాత్మ్యాన్ని నేనువర్ణిస్తున్నాను. కల్పకాలమంత ఆయుస్సు ఉన్నావిస్తారంగా చెప్పటంసాధ్యంకాదు. (6) పుణ్యము లన్నింటికిశ్రేయస్సులన్నింటికి, యజ్ఞములన్నిటికిజపయజ్ఞము ఉత్తమము (7) అందులోమొదట జపయజ్ఞఫలము గొప్ప శుభాన్నిచ్చేది. మహర్షులు శివసంబంధమైనది షడక్షరములుకలది దివ్యమైనమంత్రమని అన్నారు (8) త్రిపురాంతుడు దేవతలకుపరమమైనదేవుడుఅట్లాగేశైవషడక్షరమంత్రము మంత్రములలోపరమమంత్రము. (9) ఈపంచాక్షరమంత్రము జపించేవారికిముక్తినిచ్చేది. సిద్ధిని కోరేసమస్తముని శ్రేష్ఠులుదీనినిసేవిస్తున్నారు. (10) దీని అక్షరములమాహాత్మాన్ని చెప్పుటకు బ్రహ్మచాలడు. శ్రుతులు ఎక్కడ సిద్ధాంతంచేశాయోపరమంగామరలినాయో (11) ఆసర్వజ్ఞుడు, పరిపూర్ణుడు సచ్చిదానంద లక్షుణుడు శివుడుశైవమైనశుభ##మైనపంచాక్షరమందు రమిస్తున్నాడు (12) పర్వోపనిషత్తులకు ఆత్మరూపమైన ఈమంత్రరాజ మతోమునులందరు, నిరామయమైన పరబ్రహ్మనుపొందారు (13) ఇక్కడ పరమాత్ముడైనశివునియందునమస్కారంతోజీవత్వము ఐక్యాన్నిపొందింది అందువల్ల ఈమంత్రముపరబ్రహ్మమయము (14) భవపాశనిబద్ధులైనప్రాణులక్షేమంకోరకు ఆద్యమైన ఓంనమఃశివాయ అనుమంత్రమునుశివుడు స్వయంగాచెప్పాడు (15)

మూ || కింతస్యబహుభిర్మత్రైఃకింతీర్థైఃకింతపోధ్వరైః | యస్యోంనమఃశివాయేతిమంత్రోహృదయగోచరః || 16 ||

తావద్భ్రమంతిసంసారేదారుణదుఃఖసంకులే | యావన్నోచ్చారయంతీమంమంత్రందేహభృతంసకృత్‌ || 17 ||

మంత్రాధిరాజరాజో7యంసర్వవేదాంతశేఖరః | సర్వజ్ఞాననిధానంచసో7యంచైవషడక్షరం || 18 ||

కైవల్యమార్గదీపో7యంఅవిద్యాసింధువాడవః | మహాపాతకదావాగ్నిఃసో7యంమంత్రఃషడక్షరః || 19 ||

తస్మాత్సర్వప్రదోమంత్రఃసో7యంపంచాక్షరఃస్మృతః | స్త్రీభిఃశూద్రైశ్చసంకీర్ణైఃధార్యతేముక్తికాంక్షిభిః || 20 ||

నాస్యదీక్షాసహోమశ్చనసంస్కారోనతర్పణం | నకాలోనోపదేశశ్చనదాశుచిరయంమనుః || 21 ||

మహాపాతకవిచ్ఛిత్యైశివ ఇత్యక్షరద్వయం | అలంసమస్క్రిమాయుక్తోముక్తోయేపరికల్పతే || 22 ||

ఉపదిష్టఃసద్గురుణాజప్తఃక్షేత్రేచపావనే | సద్యోయధేప్సితాంసిద్ధిందదాతీతికిమద్భుతం || 23 ||

అతఃసద్గురుమాశ్రిత్యగ్రాహ్యోయంమంత్రనాయకః | పుణ్యక్షేత్రేషుజప్తవ్యఃసద్యఃసిద్ధింప్రయచ్చతి || 24 ||

గురవోనిర్మలాఃశాంతాఃసాధవోమితభాషిణః | కామక్రోధవినిర్ముక్తాఃసదాచారాజితేంద్రియాః || 25 ||

ఏతైఃకారుణ్యతోదత్తోమంత్రఃక్షిప్రంప్రసిద్ధ్యతి | క్షేత్రాణిజపయోగ్యానిసమాసాత్కధయామ్యహం || 26 ||

ప్రయోగంపుష్కరంరమ్యంకేదారంసేతుబంధనం | గోకర్ణంనైమిషారణ్యంసద్యఃసిద్ధికరంనృణాం || 27 ||

అత్రాసువర్ణతేసిద్ధిఃఇతిహాసఃపురాతనః | అనకృద్వాసకృద్వాపిశృణ్వతాంమంగలప్రదః || 28 |7

మధురాయాంయదుశ్రేష్ఠోదాశార్హితివిశ్రుతః | బభూవరాజామతిమాన్‌మహోత్సాహోమహాబలః || || 29 ||

శాస్త్రజ్ఞోనయవాక్‌శూరోదైర్యవాసమితద్యుతిః | అప్రధృష్యఃసుగంభీరఃసంగ్రామేష్వనివర్తితః || 30 ||

మహారధోమహెష్వాసోనానాశాస్త్రార్థకోవిదః | వదాన్యోరూపసంపన్నోయువాలక్షణసంయుతః || 31 ||

నకాశిరాజతనయామువయేమేపరాననాం | కాంతాంకలావతీంనామరూపశీలగుణాన్వితాం || 32 ||

కృతోద్వాహఃసరాజేంద్రః సంప్రాప్యనిజమందిరం | రాత్రౌతాంశయనారూఢాంసంగమాయసమాహ్వయత్‌ || 33 ||

తా || అనేకమంత్రములతోఏంపనితీర్థములతోకాని, తపస్సుతోకాని, అధ్వరములతోకాని వానికేంపని. వాడికి ఓంనమః శివాయఅనే మంత్రముహృదయగోచరమైతేచాలు (16) దేహధారులుఒక్కసారిఈమంత్రాన్నిఉచచరించనంతవరకు ధారుణమైన దుఃఖసంకులమైనసంపారమందుభ్రమిస్తారు. (17) మంత్రములకు అధిరాజరాజు ఇది. సర్వవేదాంతమలకు ఇది శేఖరము. సర్వజ్ఞానములకు స్థానమది. అదే షడక్షరము. (18) ఇదికైవల్యమార్గమునకుదీపము. అవిద్యఅనేసముద్రానికి ఓడ. మహాపాతకములకు. దావాగ్నిఆమంత్రమేషడక్షరమంత్రము (19) అందువల్లఈమంత్రము, పంచాక్షరము, అన్నింటిని ఇచ్చేదిఅని. ముక్తి కోరేవారు స్త్రీలైనాశూద్రులైనా అందరూ ఈ మంత్రాన్నిధరించవచ్చు. (20) దీనికి దీక్షగాని హోమము కాని, సంస్కారముకానితర్పణముకాని అవసరంలేదు. కాలము, ఉపదేశముఅవసరంలేదు. ఈమంత్రము సర్వదా సర్వదాశుచియే (21) మహాపాతకములనాశంకొరకు శివ అనురెండక్షరాలు చాలు. నమస్కార మాచరించినవారు ముక్తికి కల్పింపబడుతారు (22) సద్గురువుతో ఉపదేశంపొంది పావనక్షేత్రంలో జపించినవారికివెంటనే కోరినసిద్ధిని ఇస్తారనటంలోఆశ్చర్యమేముంది (23) అందువల్లసద్గురువునాశ్రయించి, ఈనాయకమంత్రమును గ్రహించాలి. పుణ్యక్షేత్రములో జపిస్తేవెంటనేసిద్ధినిస్తుంది (24) గురువులు నిర్మలులు, శాంతులు, సాధువుల, మితభాషులు, క్రామఁకోధవినిర్ముక్తులు, సదాచారులు, జితేంద్రియులు (25) వీరు (ఇలాంటి గురువులు) దయతో ఈమంత్రాన్ని ఇస్తే త్వరగాసిద్ధిస్తుంది. జప యోగ్యమైనక్షేత్రములగూర్చి సంక్షేపంగా చెబుతాను. (26) ప్రయాగ, పుష్కరమురమ్యమైన కేదారక్షేత్రము, సేతుబంధనము గోకర్ణము, నైమిశారణ్యముఇవినరులకువెంటనేసిద్ధిస్తాయి. (27) ఇక్కడ పెద్దలు ప్రాచీనమైన ఇతిహాసాన్నిచెబుతారు. మాటిమాటికిగాని ఒక్కసారిగాగానివిన్నవారికిమంగళాన్ని ఇస్తుంది. (28) మథురలో దాశార్హుడనియదుశ్రేష్ఠుడు ఉండేవాడు. ఆతడు బుద్ధిమంతుడు మహోత్సాహంకలవాడు, మహాబలుడు ఆరాజు. (29) శాస్త్రమెరిగినవాడు. నీతివాక్యములు చెప్పేవాడు శూరుడు, ధైర్యవంతుడు, అమితద్యుతికలవాడు. ఎదిరించరానివాడు, గంభీరుడు, యుద్ధంలో మడమతిప్పని వాడు (30) మహారథుడు మహెష్వానుడు, నానాశాస్త్రార్థకోవిదుడు, వదాన్యుడు, రూపసంపన్నుడుయువకుడు మంచి లక్షణములుకలవాడు (31) వరాననయైనకాశిరాజుకూతురును ఆతడువివాహమాడాడు. ఆమె పేరు కళాపతి, రూపశీలగుణా న్వితమనోహరమైనది (32) వివాహమయ్యాకఆరాజు తనమందిరమునకువచ్చి, శయనమందు అధివసించిన ఆమెను రాత్రియందుసంగమముకొరకుపిలిచాడు (33)

మూ || సాస్వభర్త్రానమాహూతాబహుశః ప్రార్థితాసతీ | సంబబంధమనస్తస్మిన్‌చాగచ్ఛత్తదంతికం || 34 ||

సగమాయయదాహూతానాగతానిజవల్లభా | బలాదాహర్తుకామస్తాముదతిష్ఠన్మహీపతిః || 35 ||

రాజ్ఞ్యువాచ -

మామాంస్పృశమహారాజకారణజ్ఞాం వ్రతేస్థితాం | ధర్మాధర్మౌవిజానాసిమాకార్షీఃసాహసంమయి || 36 ||

క్వచిత్‌ప్రియేణభుక్తంయద్రోచతేతుమనీషిణాం | దపంత్యోఃప్రీతియోగేనసంగమఃప్రీతివర్థనః || 37 ||

ప్రియంయదామేజాయేతతదాసంగస్తుతేమయి | కాప్రీతిఃకింసుఖంపుంసాంబలాద్భోగేనయోషితాం || 38 ||

అప్రీతాంరోగిణోంనారీంఅంతర్వత్నీంధ్రుతవ్రతాం | రజస్వలామకామాంచనకామేతబలాత్పుమాన్‌ || 39 ||

ప్రీణసంలాలసం పోషంరంజనంమార్దవందయాం | కృత్వావధూముపగమేత్‌యువతీంప్రేమవాన్పతిః

యువతౌకుసుమేచైవవిధేయంసుఖమిచ్ఛతా || 40 ||

ఇత్యుక్తో7పితయాసాధ్వ్యాసరాజాస్మరవిహ్వలః | బలాదాకృష్యతాంహస్తేపరిరేభేరిరంసయా || 41 ||

తాంస్పృష్టమాత్రాంసహసాతప్తాయఃపిండసన్నిభాం | నిర్దహంతీమివాత్మానంతత్యాజభయవిహ్వలః || 42 ||

రాజోవాచ -

అహోనుమహదాశ్చర్యమిదందృష్టంతవప్రియే | కధమగ్నిసమంజాతంవపుఃవల్లవకోమలం || 43 ||

ఇత్థంసువిస్మితోరాజాభీతఃసారాజవల్లభా | ప్రత్యువాచవిహసై#్యనంవినయేనశుచిస్మితా || 44 ||

రాజ్ఞ్యువాచ -

రాజన్మమపురాబాల్యేదుర్వాసామునిపుంగవః | శైవంపంచాక్షరీంవిద్యాంకారుణ్యనోపదిష్టవాన్‌ || 45 ||

తేనమంత్రానుభావేనమమాంగంకలుషోజ్ఘితం | స్ప్రష్టుంనశక్యతేపుంభిఃసపాపైఃదైవవర్జితైః || 46 ||

త్వయా రాజన్‌ప్రకృతి నాకులటాగణికాదయః | మదిరాస్వాదనిరతానిషేవ్యంతేనదాస్త్రియః || 47 ||

నసాన్నంక్రియతేనిత్యంసమంత్రోజప్యతేశుచిః | నారాధ్యతేత్వయేశానఃకథంమాంపన్ప్రష్టుమర్హసి || 48 ||

రాజోవాచ -

తాంసమాఖ్యహినుశ్రోణిశైవీంమాహతీంశుభాః | విద్యావిధ్వస్తపాపో7హంత్వయీచ్ఛామిరతింప్రియే || 49 ||

రాజ్ఞ్యువాచ -

నాహంతవోపదేశంవైకుర్యాంమమగురుర్భవాన్‌ | ఉపాతిష్ఠగురుం ............ మంత్రవిదాంపరం || 50 ||

సూతఉవాచ-

ఇతిసంభాషమాణౌతౌదంపతీగర్గసన్నిధిం | ప్రాప్యతచ్చరణౌమూర్ఖ్నావవందాతేకృతాంజలీ || 51 ||

అధరాజాగురుంప్రీతమభిపూజ్యపునఃపునః | సమాచష్టవినీతాత్మారహస్యాత్మమనోరథం || 52 ||

తా || ఆమెతనభర్తతోపిలువబడుతూఅనేకమార్లు ప్రార్థింపబడ్డా అతని యందు ఆమె మనస్సుబంధింపబడలేదు. ఆతని సమీపానికిరాలేదు (34) సంగమమునకుపిలువబడినాతన భార్యఎప్పుడురాలేదో అప్పుడు రాజు బలవంతంగా హరించటానికి ఆమె దగ్గరకు వచ్చాడు (38) రాణివచనము - ఒ రాజనన్నుముట్టకుకారణమెరిగిన దానిని వ్రతమందున్నాను ధర్మాధర్మములెరిగినవాడవు. నాయందుసాహసంచేయొద్దు (36) ప్రియముగా భుజించేదే రుచిస్తుంది బుద్ధిమంతులకు దంపతుల ప్రీతి యోగం వల్లనే సంగమము ప్రీతిని పెంచుతుంది (37) నాకెప్పుడు ప్రీతి కల్గుతుందో అప్పుడే నాకు నీతో సంగమము. ఆడవాళ్ళను బలవంతంగా అనుభవించటం వల్ల పురుషులకు ఏం ప్రీతికల్గుతుంది. ఏం సుఖం లభిస్తుంది (38) ప్రీతిలేని దానిని, రోగిణిని, వ్రతమందున్నన దానిని, గర్భిణిని, రజస్వలను, కోరికలేని దానిని బలవంతంగా పురుషుడు కామించరాదు (39) సంతోష పరచటం, లాలన, పోషణం ఆనందింపచేయటం మృదుత్వము, దయ ఇవన్ని చూపి ప్రేమగల భర్తయువతియైన వధువును పొందాలి. సుఖమును కోరేవాడు యువతిని పూవులా చూడాలి (40) అని చెప్పినా ఆమె, ఆరాజుస్మర విహ్వలుడై ఆమెనుచేతితోబలంగా లాగి రమించదలచి ఆలింగనము చేసుకున్నాడు (41) తొందరగా ఆమెను ముట్టుకోగా ఆమెకాలిన ఉక్కుముద్దలా ఉంది. తనను కాల్చేస్తున్నట్లుగా ఉంది. అందువల్ల భయంతో వదిలి పెట్టాడు (42) రాజిట్లన్నాడు - నీవల్ల చాలా ఆశ్చర్యకరమైన ఈ విషయాన్ని చూచాను ఓ ప్రియ! పల్లవకోమలమైన నీ శరీరము అగ్ని సమం ఎట్లా ఐంది (43) ఇట్లా రాజు చాలా ఆశ్చర్యపడినాడు భయపడినాడు. ఆ రాజుభార్య ఇతనిని చూచి నవ్వి వినయంతో చిరునవ్వు నవ్వుతూ ఇట్లా పలికింది (44) రాణఙ వచనము - ఓ రాజ! పూర్వం నా బాల్యంలో దుర్వాసుడను ముని పుంగవుడు శివ సంబంధమైన పంచాక్షరి విద్యను దయతోనాకు ఉపదేశించాడు (45) ఆ మంత్రాను భవంతో నా శరీరము కలుషముతో విడిపోయింది. పురుషులు నన్నుముట్టుకోలేరు. దైవవర్జితులై పాపులైనవారు నన్ను తాకలేరు (46) ఓరాజ! నీ ప్రకృతి స్వభావంవల్ల నీవు కులటాగణికాదులను సేవిస్తున్నావు. నీవు మదిరా స్వాదనిరతులైన స్త్రీలను ఎప్పుడూ సేవిస్తున్నావు. (47) నీవురోజు స్నానం చేయటంలేదు. శుచిగామంత్రాన్ని జపించటంలేదు నీవు శివుని ఆరాధించటంలేదు. నన్నెట్లా ముట్టకోగలవు (48) రాజిట్ల్నాడు - ఓసుశ్రోణి, శివసంబంధమైన శుభ##మైన పంచాక్షరిని నాకు చెప్పు. విద్యచే పాపములన్ని తొలగిపోయి నీయందు నేనురతిని ఇష్టపడుతున్నాను (49) రాణిఇట్లాఅంది - నీకునేను ఉపదేశించను. నాకు నీవు గురువవు. గురువును మంత్ర విదుని సేవించు (చాలి) (50) సూతులిట్లన్నారు - అని సంభాషిస్తూ ఆ దంపతులు గర్గుని సన్నిధికి వచ్చి ఆతని పాదములక నమస్కరించారు చేతులు జోడించారు (51) పిదప రాజు సంతోషించిన గురువును పూజించి వినీతమైన ఆత్మగలవాడై రహస్యంలో తనమనోరథాన్ని గురువుకు నివేదించాడు. (52).

మూ || రాజోవాచ -

కృతార్థం మాంకురుగురోసంప్రాప్తం కరుణార్ద్రధీః శైవీం పంచాక్షరీం విద్యాముపదేష్టుం త్వమర్హసి || 53 ||

అనాజ్ఞాతంయదాజ్ఞాతం యత్కృతం రాజకర్మణా | తత్పావం యేన శుద్ధ్యేతతస్మంత్రం దేహిమే గురో || 54 ||

ఏవమభ్యర్థితో రాజ్ఞాగర్గో బ్రాహ్మణ పుంగవః | తౌనినాయ మహాపుణ్యం కాలింద్యాస్త టముత్తమం || 55 ||

తత్రపుణ్యతరోర్మూలే నిషణ్ణో7థ గురుః స్వయం | పుణ్యతీర్థ జలేస్నాతం రాజానం సముపోషితం || 56 ||

ప్రాఙ్‌ముఖంచోపవేశ్యాథసత్వాశివ పదాంబుజం | తన్మన్తకేకరంన్యస్య దదౌమంత్రం శివాత్మకం || 57 ||

తన్మంత్ర ధారణాదేవత ద్గురోర్‌ హస్తసంగమాత్‌ | నిర్యయుస్తస్య వపుషోవాయసాః శతకోటయః || 58 ||

తేదగ్ధపక్షాః క్రోశంతేని పతంతో మహీతలే | భస్మీభూతాస్తతః సర్వే దృశ్యంతే న్మసహస్రశః || 59 ||

దృష్ట్వాత ద్వాయ సకులందహ్యమానం సువిస్మితౌ | రాజాచరాజ మహిషీతం గరుం పర్యపృచ్ఛతాం || 60 ||

భగవన్నిద మాశ్చర్యం కథంజాతం శరీరతః | వాయసానాం కులం దృష్టం కిమేతత్‌ సాధుభణ్యతాం || 61 ||

శ్రీగురు రువాచ -

రాజన్భవ సహస్రేషు భవతా పరిధావతా | సంచితాని దురంతాని సంతి పాపాస్యనేకేశః || 62 ||

తేషు జన్మ సహస్రేషుయానిపుణ్యాని సంతితే | తేషామాధిక్యతః క్వాపి జాయతే పుణ్యయోనిషు || 63 ||

తథా పాపీయసీం యోనిం క్వచిత్పాపేనగచ్ఛతి | సామేపుణ్యాన్యయోశ్చైవ మానుషీంయోనిమాప్తవాన్‌ || 64 ||

శైవీపంచాక్షరీ విద్యాయదాతే హృదయంగతా | అఘానాం కోటయస్త్వత్తః కాకరూపేణ నిర్గతాః || 65 ||

కోటయో బ్రహ్మహత్యానాం అగమ్యాగమ్యకోటయః | స్వర్ణస్తేయ సురాపానభ్రూణహత్యాదికోటయః

భవకోటి సహస్రేషుయే7న్యే పాతకరాశయః || 66 ||

క్షణాద్భస్మీ భవంత్యేవశైవే పంచాక్షరే ధృతౌ ఆ సంస్తవాద్య రాజేంద్ర దగ్థాః పాతక కోటయః || 67 ||

అనయా సహపూతాత్మా విహరస్వయథాసుఖం | ఇత్యాభాష్యమునిశ్రేష్ఠాః తంమంత్రముపదిశ్యచ || 68 ||

తాభ్యాం విస్మితచిత్తాభ్యాం సహితః స్వగృహంయ¸° | గురువర్యమనుజ్ఞాప్య ముదితౌతౌ చ దంపతీ || 69 ||

తతః స్వభవనం ప్రాప్యరేజతుఃస్మమహాద్యుతి | రాజాదృఢం సమాశ్లిష్య పత్నీంచందన శీతలాం

సంతోషం పరమంలేభేనిః స్వః ప్రాప్య యధాధనం || 70 ||

అశేషవేదోపనిషత్పురాణశాస్త్రావతం సో7యమఘాంతకారీ |

పంచాక్షరసై#్యవమహాప్రభావోమయా సమాసాత్కధితో వరిష్ఠః || 71 ||

ఇతి శ్రీ స్కాందే మహాపురాణ ఏకాశీతి సాహస్ర్యాం సంహితాయాం తృతీయే బ్రహ్మోత్తర ఖండే పంచాక్షర మంత్ర మాహాత్మ్య వర్ణనం నామ ప్రథమో7ధ్యాయః || 1 ||

తా || రాజిట్లన్నాడు - మీదరికి వచ్చిన నన్ను కరుణతో ఆర్ద్రమైన బుద్ధిగల ఓగురు! నన్ను కృతార్థుణ్ణి చేయి. శివసంబంధమైన పంచాక్షరి విద్యను ఉపదేశించుటకు నీవు అర్హుడవు (53) తెలియక, ఎప్పుడో తెలిసినందువల్ల, రాజకర్మతో దేన్ని చేశానో ఆ పాపం ఎట్లా పోతుందో ఆ మంత్రాన్ని నాకు ఇవ్వు ఓ గురు! (54) అని రాజు ఇట్లా అభ్యర్థించగా గర్గుడు బ్రాహ్మణ పుంగవుడు వారిద్దరిని మహాపుణ్యమైన కాళిందినది తటప్రదేశానికి తీసుకువెళ్ళాడు (55) అక్కడ పుణ్యప్రదమైన చెట్టు క్రింద కూర్చొని గురువు స్వయంగా, ఉపవసించిన, పుణ్యతీర్థ జలమందు స్నాన మాచరించిన రాజును (56) తూర్పుముఖముగా కూర్చోబెట్టి, శివపాదములకు నమస్కరించి, ఆతని (రాజు) తలపై చేయి ఉంచి శివాత్మకమైన మంత్రాన్ని ఉపదేశించాడు (57) ఆ మంత్రాన్ని ధరించుటతోనే ఆ గురువుగారి హస్త సంగమంవల్ల ఆతని శరీరం నుండి శతకోటి వాయు నములు బయటికొచ్చాయి (58) అవి రెక్కలు తగలబడి, అరుస్తూ భూమిపై పడిపోతూ భస్మీభూతమై అన్నివేల కొలది కన్పిస్తున్నాయి (59) ఆ వాయసకులాన్ని కాలిపోతున్న వానిని చూచి ఆశ్చర్యపడ్డారు. రాజు, రాజు భార్య ఆ గురువును అడిగారు (60) ఓ భగవాన్‌ ! ఇది చాలా ఆశ్చర్యకరమైనది. శరీరం నుండి ఎట్లా సంభవించింది. కాకుల సమూహము కన్పించింది. ఇదేమిటి చక్కగా చెప్పండి అనగా (61) గురువు ఇట్లన్నారు. ఓరాజ! అనేక వేలకొలది జన్మలలో పరిగెత్తే నీవు సంపాదించిన అంతములేని పాపములనేకములున్నాయి. (62) ఆ జన్మసహస్రములలో నీపుణ్యములేమున్నయోవాటి ఆధిక్యం వల్లఎక్కడో పుణ్యయోనులలో జన్మిస్తాడు (63) అట్లాగే పాపంవల్ల పాపీయమైన యోనిని పొందుతాడు. సమాన పుణ్యంవల్ల మానుష యోనిని పొందావు (64) శైవ పంచాక్షర విద్య ఎప్పుడు నీ హృదయంలో ప్రవేశించిందో పాపముల కోటుల నీశరీరం నుండి కాకుల రూపంలో బయటికొచ్చాయి (65) బ్రహ్మహత్యల కోటులు చేరరాని వారిని చేరిన పాపాలకోటులు, బంగారు దొంగతనము, సురాపానము, భ్రూణహత్య మొదలగువాని కోటులు సహస్ర కోటిజన్మలలోని ఏ ఇతర పాతక రాశులున్నాయో (66) అవన్నీ శివపంచాక్షరి ధరించినంతమాత్రం చేత క్షణంలో భస్మమౌతాయి. ఈ రోజు స్తుతించు ఓ రాజేంద్ర! పాతక కోటులు దగ్ధమైనాయి. (67) దీనితో పవిత్రాత్ముడవై స్వేచ్ఛగా సుఖంగా విహరించు అని పోయివస్తానని పలికి మునిశ్రేష్టుడు ఆ మంత్రాన్ని ఉపదేశించాడు (68) వారు ఆశ్చర్యకరమైన మనస్సు కలవారై ఇంటికి చేరారు. గురువుగారి అనుజ్ఞ తీసుకొని ఆదంపతులిద్దరు ఆనందించినారు (69) పిదప తన ఇంటికి చేరి గొప్పకాంతితో వెలిగిపోయారు. రాజు చందన శీతలమైన తన పత్నిని గట్టిగా కౌగిలించుకొని చాలా సంతోషాన్ని పొందాడు, ధనహీనుడు ధనాన్ని పొంది ఆనందించినట్లుగా (70) సమస్త వేదములు ఉపనిషత్తులు పురాణశాస్త్రములు వీటికి శిరోభూషణమైన వాడు ఈతడు అఘాసురసంహారి. పంచాక్షర ప్రభావమును పరిష్ఠమైన దానిని నేను సంక్షేపంగా చెప్పాను. (71) అని శ్రీ స్కాంద మహాపురాణమందు ఏకాశీతి సహస్ర సంహితయందు మూడవ బ్రహ్మోత్తర ఖండమందు పంచాక్షర మంత్రమాహాత్మ్య వర్ణనమనునది మొదటి అధ్యాయము || 1 ||

Sri Scanda Mahapuranamu-3    Chapters