Sri Scanda Mahapuranamu-3    Chapters   

పదమూడవ అధ్యాయము

మూ || వ్యాస ఉవాచ

శంభోశ్చ పశ్చిమేభాగే స్థాపితః కశ్యపాత్మజః | తత్రాస్తితన్మహాభాగర విక్షేత్రంత దుచ్యతే || 1 ||

తత్రోత్పన్నౌ మహాదివ్యౌరూప ¸°వన సంయుతా | నాసత్యా వశ్వినౌ దేవౌ విఖ్యాతౌ గదనాశనౌ || 2 ||

యుధిష్ఠి ఉవాచ -

పితామహ మహా భాగ కథయస్వ ప్రసాదతః | ఉత్పత్తి రశ్వినోశ్చైవ మృత్యులోకేచ తత్కథం || 3 ||

రవిలోకాత్కధం సూర్యోధరా యామవతారితః | ఏతత్సర్వం ప్రయత్నేన కథయస్వప్రసాదతః || 4 ||

యచ్ఛ్రుత్వాహి మహాభాగ సర్వపాపైః ప్రముచ్యతే || 5 ||

వ్యాస ఉవాచ -

సాధుపృష్టం త్వయాభూవ ఊర్థ్వలోకకథానకం |

యచ్ఛ్రుత్వానరశార్దూల సర్వరోగాత్ర్పముచ్యతే | విశ్వకర్మ సుతాసంజ్ఞా అంశుమద్ర విణావృతా || 6 ||

సూర్యందృష్ట్వా సదాసంజ్ఞాస్వాక్షి సంయమనంప్యధాత్‌ | యతస్తతః సరోషోర్కఃసంజ్ఞాంవచనమబ్రవీత్‌ || 7 ||

సూర్యఉవాచ -

మయిదృష్టే సదాయస్మాత్‌ కురుషే స్వాక్షి సంయమం | తస్మాజ్జనిష్యతే మూఢే ప్రజాసంయమనోయమః || 8 ||

తతః సాచపలందేవీ దదర్శచ భయాకులం | విలోలితదృశం దృష్ట్వా పునరాహచ తాంరవిః || 9 ||

యుస్మాద్విలోలితా దృష్టిః మయిదృష్టేత్వయాధునా | తస్మాద్ద్విలోలితాం సంజ్ఞే తనయాం ప్రసవిష్యసి || 10 ||

వ్యాస ఉవాచ -

తతస్త స్యాస్తు సంజజ్ఞే భర్తృశాపేన తేనవై | యమశ్చ యమునాయే యం విఖ్యాతా సుమహానదీ || 11 ||

సాచసంజ్ఞారవేస్తే జోమహద్దుఃఖేన భామినీ | అసహం తీవసాచిత్తే చింతయా మానవైతదా || 12 ||

కింకరోమిక్వగచ్ఛామిక్వ గతాయాశ్చ నిర్వృతిః | భ##వేన్మమ కథం భర్తుః కోపమర్కస్య నశ్యతి || 13 ||

ఇతి సంచిత్య బహుధా ప్రజాపతి సుతాతదా | సాధుమేనే మహాభాగా పితృ సంశ్రయం మావసా || 14 ||

తతః పితృగృహం గంతుం కృతబుద్ధి ర్య శస్వినీ | ఛాయా యాహూ యాత్మనస్తు సాదేవీదయితారవేః || 15 ||

తాంచోవాచ త్వయాస్థేయమత్ర భానోర్యథామయా | తథా సమ్యగవత్యేషు వర్తి తప్యం తథారవౌ || 16 ||

దుష్టమపివ వాచ్యంతే యథా బహుమతంమమ | సైవాస్మి సంజ్ఞాహ మితి వాచ్యమేవం త్వయానఘే || 17||

తా || వ్యాసుని వచనము -7 శంభునకు పశ్చిమ భాగమందు కశ్యపాత్మజుడు స్థాపించబడ్డాడు. ఆ మహాభాగుడు అక్కడున్నాడు. అది రవి క్షేత్రం అనబడుతోంది (1) అక్కడ పుట్టినవారు మహాదివ్యులు, రూప ¸°వనములు కలవారు. నా సత్యావశ్వినులు (నా సత్య, అశ్విన) దేవతలు విఖ్యాతులు, రోగనాశకులు (2) యుధిష్టరుని వచనము - ఓ పితా మహా మహాభాగ దయతో చెప్పండి. మృత్యులోకంలో అశ్వినుల ఉత్పత్తి ఎట్లా జరిగింది. (3) సూర్యుడు రవిలోకం నుండి భూమిపై ఎట్లా అవతరించాడు. ఇదంతా శ్రమయనక అనుగ్రహించి చెప్పండి (4) దానిని విన్నందువల్ల పాపములన్నింటినుండి విముక్తులౌతారు, ఓ మహాభాగ అని అనగా (5) వ్యాసుని వచనము ఓ భూప! ఊర్థ్వలోకపు కథను నీవు బాగా అడిగావు. ఓ నరశార్దూల ! దానిని వింటేసర్వరోగముల నుండి విముక్తులౌతారు. విశ్వకర్మ కూతురు సంజ్ఞ అనునది కాంతిమంతుడైన సూర్యుని వరించింది (6) సూర్యుని చూచి ఎప్పుడు సంజ్ఞ తన కన్నులను మూసుకునేది (కన్నుకొట్టేది) అందువల్ల కోపంతో అర్కుడు సంజ్ఞతో ఇట్లా అన్నాడు (7) సూర్యుని వచనము - నన్ను చూచినప్పుడల్లా నీ కళ్ళను మూసుకుంటున్నావు కనుక ఓ మూఢురాల ప్రజాసంయమనం చేసే యముడు నీకు కల్గుతాడు (8) అప్పుడు ఆమె చంచలమైంది, భయాకులమైంది. ఆమెను చూచాడు. చంచలమైన చూపులుగల ఆమెను చూచి సూర్యుడు మళ్ళా ఇట్లా అన్నాడు (9) నన్ను చూచినందువల్ల నీ దృష్టి విలోలితమైంది. అందువల్ల ఓసంజ్ఞ! విలోలితమైన తనయనుకంటావు (10) వ్యాసుని వచనము - ఆ పిదప ఆమెకు ఆ భర్త శాపంతో, యముడు, యమున అని కలిగారు. యమున, ప్రసిద్ధమైన గొప్పనది (11) ఆ సంజ్ఞ సూర్య తేజస్సును సహించని దానివలె, ఆభామిని చాలా దుఃఖంతో అప్పుడు మనస్సులో ఇట్లా ఆలోచించింది (12) ఏంచేయను, ఎక్కడికెళ్ళను. ఎక్కడికి వెళితే తృప్తి కలుగుతుంది. నా భర్తయైన ఆర్కుని కోపము ఎట్లా నశిస్తుంది. (13) అని చాలా ఆలోచించి ప్రజాపతి కూతురు ఆమె అప్పుడు ఇట్లా తలచింది. ఓ మహాభాగులార! తండ్రి దగ్గరకు వచ్చింది (14) తండ్రి ఇంటికి పోవటానికి నిశ్చయించుకున్నప్పుడు ఆమె, యశస్విని, ఆదేవి, సూర్యుని భార్య తన నీడను పిలిచి (15) ఆమెతో అంది, సూర్యుని దగ్గర నే, నెట్లాఉన్నానో నీవు అట్లా ఉండు అని అట్లాగే నా పిల్లలందు, సూర్యుని యందు బాగా ప్రవర్తించాలి అని (16) నీకు బాగా అని పించకపోయినా చెప్పొద్దు. నా ఇష్టమెట్లాగో అట్లా ఉండాలి. ఓ అనఘ! నీవు, ఆ సంజ్ఞను నేనే అని చెప్పాలి ఇట్లా ఉండాలి, అని అనగా(17).

మూ || ఛాయసంజ్ఞోవాచ -

అకేశగ్రహణాచ్చాహ మాశాపాచ్చ వచస్తథా | కరిష్యే కథయిష్యామి యావత్కే శాపకర్షణాత్‌ || 18 ||

ఇత్యుక్తా సాతదాదేవీ జగామ భవనం పితుః | ద దర్శతత్ర త్వష్టారం తవసాధూత కిల్బిషం || 19 ||

బహుమానాచ్చ తేనాపి పూజితా విశ్వకర్మణా | తస్థౌ పితృగృహే సాతుకించిత్కాల మనిందితా || 20 ||

తతః ప్రాహసధర్మజ్ఞః పితానాతిచిరోషితాం | విశ్వకర్మాసుతాం ప్రేవ్ణూ బహుమానపురః సరం || 21 ||

త్వాంతుమే పశ్యతో వత్సే దినాని సుబహూస్యపి | ముహూర్తేన సమానిస్యుః కింతుధర్మో విలుప్యతే || 22 ||

బాంధవేషు చిరం వాసోన నారీణాం యశస్కరః | మనోరథోబాంధవానాం భార్యా పితృగృహేస్థితా || 23 ||

సాత్వంత్రైలోక్యనాథేన భర్త్రాసూర్యేణ సంగతా | పితుర్‌ గృహ చిరంకాలం వస్తుం నార్హసి పుత్రికే || 24 ||

అతోభర్తృగృహం గచ్ఛ దృష్టోహం పూజితాచమే | పునరాగమనం కార్యం దర్శనాయ శుభేక్షణ || 25 ||

వ్యాస ఉవాచ -

ఇత్యుక్తా సా తదాక్షిప్రం తథేత్యుక్త్వాచ వైమునే | పూజయిత్వాతు పితరం సాజగామోత్తరాన్‌కురూన్‌ || 26 ||

సూర్యతాపమనిచ్ఛంతీ తేజసస్తస్యబిభ్యతీ | తపశ్చ చారతత్రాపి వడవారూపధారిణీ || 27 ||

సంజ్ఞామిత్యేవమన్వానోద్వితీయా యాం దివస్పతిః | జనయామాసతన ¸°కన్యాం చైకాం మనోరమాం || 28 ||

ఛాయా స్వతన యేష్వేవ యధాప్రేవ్జూధ్య వర్తత | తథాన సంజ్ఞా కన్యాయాం పుత్రయోశ్చా ప్యవర్తత

లాలన సుచభోజ్యేషు విశేష మనువా నరం || 29 ||

మనుస్తత్‌ క్షాంతవానస్యా యమస్త స్యానచాక్షమత్‌ | తాడనాయతతః కోపాత్‌ పాదస్తేన సముద్యతః

తస్యాః పునః క్షాంతమనా సతుదేహేన్యపాతయత్‌ || 30 ||

తతః శశాపతం కోపాత్‌ ఛాయాసంజ్ఞాయమం నృప | కించిత్‌ ప్రస్ఫుర మాణోష్ఠీ విచలత్పాణి పల్లవా || 31 ||

పత్న్యాం పితుర్మయి యది పాదముద్యచ్ఛసేబలాత్‌ | భువిత స్మాదయం పాదః తవాద్యైవ భవిష్యతి || 32 ||

ఇత్యాకర్ణ్య యమంః శాపం మాతర్యతి విశంకితః | అభ్యేత్య పితరం ప్రాహ ప్రణిపాతపురస్సరం || 33 ||

తాతైతన్మహదాశ్చర్యం అదృష్టమితి చక్వచిత్‌ | మాతా వాత్సల్య రూపేణ శాపం పుత్రే ఫ్రయచ్ఛతి || 34 ||

యథామాతా మమాచష్టనేయం మాతా తథామమ | నిర్గుణష్వపి పుత్రేషు సమాతానిర్గుణా భ##వేత్‌ || 35 ||

తా || ఛాయా సంజ్ఞ ఇట్లా అంది - కేశగ్రహణం చేయనంతవరకు, శాపమివ్వనంత వరకు నేను అట్లాగే చేస్తాను. కేశాపకర్షణ చేయనంత వరకు ఆ మాటలను ఆచరిస్తాను (18) అని అనగా అప్పుడు ఆ సంజ్ఞ తండ్రి ఇంటికి వెళ్ళింది. అక్కడ తపస్సుతో పాపములన్నీ తొలగించుకున్న త్వష్టను చూచింది. (19) ఆ విశ్వకర్మ ప్రేమతో ఆమెను ఆదరించాడు. పితృగృహమందు ఆమె కొంత కాలము, ఏ నిందలు లేకుండా ఉంది (20) అప్పుడు ఆ ధర్మమెరిగిన తండ్రి చాలా కాలం నుండి ఉన్న కూతురుతో ఇట్లా అన్నాడు. విశ్వకర్మ ప్రేమతో గౌరవ పురఃపరంగా కూతురుతోఇట్లా అన్నాడు (21) ఓవత్సే! నిన్ను చూస్తున్ననాకు, చాలాకాలం కూడా ముహూర్తంగా ఐపోతుంది. కాని ధర్మంలోపిస్తుంది (22) బంధువుల ఇంటిలో చాలా కాలము ఉండటం స్త్రీలకు యశస్కరము కాదు. భార్యయైన స్త్రీ, పితృగృహంలో ఉండటం బాంధవులకు ఇష్టం కాదు (23) నీవు త్రైలోక్యనాధుడైన సూర్యునితో భర్తతో కూడి ఉండాలి. ఓ పుత్రిక పితృగృహంలో చాలా రోజులు ఉండటం తగదు (24) అందువల్ల భర్త దగ్గరకు వెళ్ళు. నేను నిన్ను చూశాను. గౌరవించాను కూడా. ఓ శుభ##మైన చూపులదాన! మళ్ళీ కావలిస్తే నన్ను చూడటానికి రా (25) అని అన్నాడు. వ్యాసవచనము - అప్పుడు ఆమె వెంటనే మునితో అట్లాగే కాని అని పలికి, తండ్రిని పూజించి ఆమె ఉత్తరకురు భూములకు వెళ్ళింది (26) సూర్యతాపమును ఇష్టపడనిది, ఆతని తేజస్సుకు భయపడేది బడబారూపమును ధరించి తపమాచరించింది (27) సూర్యుడు రెండవ ఆమెను సంజ్ఞ అనియే భావించి ఆమె యందు ఇద్దరు తనయులను, ఒక కన్యను మనోరమమైన దానిని పుట్టించాడు (28) ఛాయ తన సంతాన మందు ఎంత ప్రేమగా ఉందో అట్లా సంజ్ఞ యొక్క పుత్రికపై పుత్రులపై ప్రేమగా ఉండలేదు. ప్రత్యేకంగా లాలించటంలో, భోజన మందు ప్రతిరోజు ప్రేమగా ఉండటంలేదు (29) మనువు దానిని క్షమించాడు. యముడు దానిని సహించలేకపోయాడు. పిదప ఆతడు కోపంతో కొట్టడానికి కాలెత్తాడు. తిరిగి శాంతుడై ఆమెను తన్నలేదు (30) అప్పుడు ఛాయా సంజ్ఞ కోపంతో ఆయుముణ్ణి శపించింది. కొంచం చలిస్తున్న పెదవులు కలిగి, చేతులు వణుకుతుండగా (31) మీనాన్నకు భార్యయైన నాపై బలంగా పాదమెత్తుతావా. అందువల్ల నీఈ పాదము ఈ వేళ భూమిపై ఉంటుంది. (32) అని అనగా యముడు ఆ శాపమును విని, తల్లిని అనుమానించినవాడై, తండరి దగ్గరకు వచ్చి నమస్కార పూర్వకముగా ఇట్లన్నాడు (33) ఓ నాన్న! ఇది మహా ఆశ్చర్యకరమైనది. ఎక్కడా చూడబడలేదు కూడా. తల్లి వాత్సల్యరూపంతో పుత్రునకు శాపమిచ్చింది. చూడలేదు కూడా (34) ఈ తల్లి ఎట్లానాతో అన్నదో, నా తల్లైతే అట్లా అనదు. ఈమె నా తల్లికాదు. గుణహీనులైన పుత్రులపైన కూడా తల్లి గుణహీనంగా ప్రవర్తించదు (35).

మూ || యమసై#్యతత్‌పచఃశ్రుత్వా భగవాంస్తి మిరావహః | ఛాయాసంజ్ఞామథాహుయ పవ్రచ్ఛక్వగతేతిచ || 36 ||

సాచాహ తనయా త్వష్టు రహంసంజ్ఞా విభావసో | పత్నీతవ త్వయా పత్యాన్యేతా నిజనితానిమే || 37 ||

ఇత్థం వివస్వతస్తాంతు బహుశః పృచ్ఛతో యదా | నాచరక్షేత దాక్రుద్ధో భాస్వాంస్తాం శప్ను ముద్యతః || 38 ||

తతః సాకథ యామాన యధావృత్తం వివస్వతే | విదితార్థర్శ భగవాన్‌ జగామత్వష్టురాలయం || 39 ||

తతః సంపూజయామా సత్వష్టా త్రైలోక్య పూజితం | భాస్వన్‌ కింరహితా శక్త్యానిజగేహ ముపాగతః || 40 ||

సంజ్ఞాం పప్రచ్ఛతంతసై#్మ కథయామానతత్వవిత్‌ | ఆగతాసేహమే వేశ్మ భవతః ప్రేషితారవే || 41 ||

దివాకరః సమాధిస్థో పడవారూపధారిణీం | తపశ్చరంతీం దదృశే ఉత్తరేషు కురుష్వథ || 42 ||

అసహ్యమానా సూర్యస్య తేజస్తే నాతి పీడితా | వహ్న్యాభనిజరూపంతు ఛాయారూపంవిముచ్యత || 43 ||

ధర్మారణ్య సమాగ్య తపస్తే పే సుదుష్కరం | ఛాయా పుత్రం శనిందృష్ట్వా యమం చాన్యం చభూపతే || 44 ||

తదైవ విస్మితః సూర్యో దుష్టపుత్రౌ సమీక్ష్యచ | జ్ఞాతుం దధ్యౌక్షణం ధ్యాత్వా విదిత్వాత చ్చకారణం || 45 ||

ఘృణ్యౌష్ణ్యా ద్దగ్ధ దేహాసా తపస్తేపే పతివ్రతా | యేనమాంతే జసా సహ్యం ద్రష్టుం నైవ శశాకహ || 46 ||

పంచాశద్ధాయనే తీతే గత్వా కౌత పఅచరత్‌ | వ్రద్యోతనో విచార్యైవం గత్వాశీఘ్రం మనోజవః || 47 ||

ధర్మారణ్య వరేపుణ్య యత్ర సంజ్ఞాస్థితా తపః | ఆగతంతం రవిందృష్ట్వా పడవా సమజాయత || 48 ||

సూర్యపత్నీ సదాసంజ్ఞా సూర్యశ్చాశ్వస్తతోభవత్‌ | తాభ్యాంసహాభూత్సం యోగోఘ్రాణ లింగంనివేశ్యచ || 49 ||

తదాతాచసముత్పన్నౌ యుగలా వశ్వినౌభువి | ప్రాదుర్భూతం జలం తత్ర దక్షిణన ఖురేణచ || 50 ||

విదలితే భూమిభాగే తత్రకుండం సముద్బభౌ | ద్వితీయం తుపునః కుండం పశ్చార్థ చణోద్భవం || 51 ||

ఉత్తరవాహిన్యాః కాశ్యాః కురుక్షేత్రాది వైతథా | గంగాపురీ సమఫలం కుండేత్ర మునినోదితం || 52 ||

తత్ఫలం సమవాప్నోతి తప్తకుండేన సంశయః | స్నానం విధాయతత్రైవ సర్వపాపైః ప్రముచ్యతే || 53 ||

న పునర్జాయతే దేహః కుష్ఠాది వ్యాధి పీడితః | ఏతత్తే కథితం భూపదస్రాం శోత్పత్తి కారణం || 54 ||

తా || యముని ఈ మాటలను విని, చీకట్లను తొలగించే ఆ సూర్య భగవానుడు, ఛాయ సంజ్ఞను పిలిచి ఎక్కడికెళ్ళావు అని అడిగాడు (36) అశ్వష్ఠతనయ ఇట్లా అంది - ఓ విభావసు నేను సంజ్ఞను, నీ భార్యను. నీ వల్ల నాకు ఈ సంతానం కలిగింది (37) సూర్యుడు ఆమెను ఎన్నిసార్లు అడిగినా ఇట్లాగే చెప్పింది. నిజం చెప్పలేదు. అప్పుడు సూర్యుడు కోపించి ఆమెను శపించబోయాడు (38) అప్పుడు ఆమె సూర్యునకు ఉన్నదున్నట్లు చెప్పసాగింది. విషయం తెలిసిన సూర్యుడు త్వష్ట ఇంటికి వెళ్ళాడు. (39) అప్పుడు త్వష్ట త్రైలోక్య పూజితుడైన సూర్యుని పూజించాడు. ఓ భాస్వన్‌ ! శక్తిలేకుండా (భార్య) నా ఇంటికొచ్చావేమిటి, అని (40) సంజ్ఞను గూర్చి అడిగాడు. యథార్థ విషయాన్ని సూర్యునికిట్లా చెప్పాడు. ఆమె నా ఇంటికి నీవు పంపగా వచ్చింది, ఓ రవి (41) అనగా సూర్యుడు సమాధి యందుండి, బడబారూపధారియైన తపమాచరిస్తున్న ఆమెను ఉత్తరకురు భూముల్లో చూచాడు (42) సూర్యుని తేజస్సును సహించలేనిదై, దానితో చాలా పీడింపబడి, తన ఛాయారూపమును వదలి, అగ్ని లాంటి తన నిజరూపంతో (43) ధర్మారణ్యమునకు వచ్చి, సుదుష్కరమైన తపస్సు చేసింది. ఓ భూపతె ! ఛాయా పుత్రుడైన శనిని చూచి, మరొకడైన యముని చూచి (44) అప్పుడే సూర్యుడు ఆశ్చర్యపడి, దుష్టులైన (రాలి) పుత్రులను చూచి, అసలు విషయం తెలుసకోవటానికి క్షణకాలం ధ్యానం చేశాడు. ధ్యానించి ఆ కారణాన్ని తెలుసుకొన్నాడు (45) తేజోవంతుడనైన నన్ను (ఆరోగ్యం కల) చూడటానికి అసమర్ధురాలై కిరణముల వేడితో శరీరం కాలిపోగా ఆమె, పతివ్రత తపమాచరించింది. (46) ఏభై సంవత్సరాలు గడిచాక వెళ్ళి ఏం తపమాచరించిందో చూడ దలచాడు సూర్యుడు. ఈ విధంగా ఆలోచించి శీఘ్రంగా మనోవేగంతో (47) పరమైన ధర్మారణ్య మందు సంజ్ఞ తపస్సు చేస్తున్న పుణ్యమైన తపోవనమునకు వెళ్ళాడు. వచ్చిన సూర్యుని చూచి ఆమె బడబ ఐంది (ఆడ గుఱ్ఱము) (48) అప్పుడు సూర్యుని భార్య సంజ్ఞ ఆడ గుఱ్ఱమైతే పిదప సూర్యుడు గుఱ్ఱమైనాడు. ఘ్రాణమందు (ముక్కులో) లింగమును పెట్టాడు. వారిద్దరికి సంయోగమైంది (49) అప్పుడు ఆజంటయై అశ్వినులు భూమిపై జన్మించారు. ఎడమగిట్టవల్ల అక్కడ జలము పుట్టింది (50) భూమి భాగాన్ని కదలించగా అక్కడ కుండం ఏర్పడింది. రెండవ కుండము వెనుకనున్న (సగము) చరణములతో కల్గినట్టిది (51) ఉత్తరమందు నది గల కాశికి కురుక్షేత్రము మొదలగునవి వలె, ఈ కుండమందు స్నానం చేస్తే గంగాపురితో సమానమైన ఫలం లభిస్తుంది. అని మునికి చెప్పారు. (52) ఈ తప్తకుండమందు అంత ఫలం లభిస్తుంది అనుమానం లేదు. అక్కడ స్నానం చేయటంవల్ల సర్వపాపముల నుండి ముక్తులౌతారు (53) కుష్ఠాది వ్యాధులతో పీడింపబడే దేహము తిరిగి కలుగదు. ఓ భూప! నీకు అశ్వినీ దేవతల ఉత్పత్తి కారణమును దీనిని చెప్పాను (54).

మూ || తదాబ్రహ్మయో దేవా ఆగతాస్తత్ర భూపతే | దత్వా సంజ్ఞా పరం శుభ్రం చింతితా దధికం హితైః || 55 ||

స్థాపయిత్వారవింతత్రబకులాఖ్య వనాధిపం | ఆనర్చుస్తే తదా సంజ్ఞాం పూర్వరూపాభవత్తదా || 56 ||

స్థాపితాతత్ర రాజ్ఞీచ కుమారౌ యుగలౌ తదా | ఏతత్తీర్థ ఫలం వక్ష్యే శృణు రాజన్మ హామతే || 57 ||

ఆదిస్థానం కురుశ్రేష్ఠ దే వైరపిసుదర్లభం | రవికుండేనరః స్నాత్వా శ్రద్ధాయుక్తో జితేంద్రియః || 58 ||

తారయేత్సపితౄన్‌ సర్వాన్‌ మహానరకాగనపి | శ్రద్ధయాయః పి బేత్తో యం సంతర్ప్య పితృదేవతాః || 59 ||

స్వల్పం వాపి బహూర్వాపి సర్వం కోటిగుణం భ##వేత్‌ | సప్తమ్యాం రవివారేణ గ్రహణం చంద్ర సూర్యయోః || 60 ||

రవికుండేచయే స్నాతాః సతేవై గర్భగామినః | సంక్రాంతౌచ వ్యతీపాతే వైధృతేషుచ పర్వసు || 61 ||

పూర్ణమా స్యామమా వాస్యాం చతుర్దశ్యాంసితాసితే | రవికుండేచయః స్నాతాః క్రతుకోటిఫలం లభేత్‌ || 62 ||

పూజయేద్బకులార్కంచ ఏకచిత్తేన మానవః | సయాతి పరమంధామ సయావత్త పతేరవిః || 63 ||

తస్యలక్ష్మిః స్థిరానూనం లభ##తే సంతతిం సుఖం | అరివర్గః క్షయంయాతి ప్రసాదాచ్చదివస్సతేః || 64 ||

నాగ్నేర్భయం హి తస్యస్యాన్న వ్యాఘ్రాన్నచదంతినః | సచసర్పభయం క్వాపి భూత ప్రేతాదిభిర్నహి || 65 ||

బాలగ్రహాశ్చసర్వేపి రేవతీ వృద్ధ రేవతి | తేసర్వేనాశమాయాంతి బకులార్క నమోస్తుతే || 66 ||

గావస్తస్య వివర్ధంతే ధనం ధాన్యంతథైవచ | అవిచ్ఛేదోభ##వేద్వంశో బకులార్కే నమస్కృతే || 67 ||

కాకవంధ్యాచయానారీ అసపత్యామృత ప్రజా | వంధ్యా విరూపితా చైవ విషకన్య్యాశ్చయాః స్త్రియః || 68 ||

ఏవందోషైః ప్రముచ్యంతే స్నాత్వా కుండేచ భూపతే | సౌభాగ్యస్త్రీ సుతాంశ్చైవ రూపం చాప్నోతి సర్వశః || 69 ||

వ్యాధిగ్రస్తోపియో మర్త్యః షణ్మాసాచ్చైవ మానవః రవికుండేచ సుస్నాతఃసర్వరోగాత్ర్పముచ్యతే || 70 ||

నీలోత్సర్గ విధింయస్తు రవిక్షేత్రక రోతివై | పితరస్తృప్తి మాయాంతి యావదాభూతసంప్లవం || 71 ||

తా || ఓ భూపతి! అప్పుడు బ్రహ్మాది దేవతలు అక్కడికొచ్చారు. అనుకున్న దానికన్న ఎక్కువగా ఇచ్చే సంజ్ఞకు భర్తయైన కల్మషరహితుడైన సూర్యుని వారు (55) అక్కడ సూర్యుని వకుళమను పేరు గల వనమునకు అధిపతిగా జేసివారు పూజించారు. ఆ పిదప సంజ్ఞ తన పూర్వ రూపాన్ని పొందింది (56) అక్కడ ఆమెను స్థాపించారు. ఆ ఇద్దరిని కూడా (కుమారులను) స్థాపించారు. ఓ మహామతి, రాజ, ఈ తీర్థ ఫలాన్ని చెబుతున్నాను. విను (57) ఓ కురుశ్రేష్ఠ! ఇది ఆదిస్థానము. దేవతలకు కూడ ఆదుర్లభ##మైనట్టిది. శ్రద్ధ కలవాడై, జితేంద్రియుడై రవికుండంలో నరుడు స్నానంచేస్తే (58) మహా నరకంలో ఉన్న పితరులను కూడా ఆతడు తరింపచేస్తాడు. పితృదేవతలకు సంతర్పణ చేసి శ్రద్ధతో ఆనీరు తాగితే (59) అది ఎక్కువైనా తక్కువైనా అదంతాకోటిగుణితమౌతుంది. సప్తమి, ఆదివారం చంద్ర సూర్యుల గ్రహణము (60) అప్పుడు రవికుండంలో స్నానం చేసినవారు తిరిగి గర్భవాసమును పొందరు. సంక్రాంతి, వ్యతీపాతము, వైధృతము పర్వము (61) పూర్ణిమ, అమావాస్య కృష్ణ శుక్ల పక్షములోని చతుర్దశి వీటిలో రవికుండమందు స్నానం చేసినవారు కోటి యజ్ఞముల ఫలితాన్ని పొందుతారు (62) మానవుడు ఏకాగ్రచిత్తంతో బకులమందలి అర్కునిపూజించాలి. సూర్యుడు వెలిగినంత కాలము ఆతడు పరమస్థానము నందుంటాడు (63) ఆతనికి లక్ష్మి స్థిరంగా ఉంటుంది. సంతతిని, సుఖమును పొందుతాడు. శత్రువర్గము నాశనమౌతుంది. సూర్యుని ప్రసాదంవల్ల (64) అగ్ని భయము కలుగదు. వ్యాఘ్ర భయము, ఏనుగుల నుండి భయము లేదు. సర్పభయముండదు. భూతప్రేతములతోనూ, భయముండదు (65) బాల గ్రహములన్నీ రేవతి, వృద్ధ రేవతి అవన్ని నశిస్తాయి. ఓ బకులార్క! నీకు నమస్కారము (66) ఆతని ఆవులు వృద్ధి నందుతాయి. ధన ధాన్యములు అట్లాగే వృద్ధి నందుతాయి. వంశం విచ్ఛేదం లేకుండా ఉంటుంది. బకులార్కునకు నమస్కరిస్తే (67) ఒకే సంతానం గల స్త్రీ సంతానం లేని చచ్చిన సంతానం గల స్త్రీ వంధ్య విరూపం గల స్త్రీలు విషకన్యలైన స్త్రీలు (68) వీరందరు ఈ కుండంలో స్నానంచేస్తే ఆయా దోషముల నుండి ముక్తులౌతారు. సౌభాగ్య స్త్రీ అన్ని విధములను సుతులను, రూపమును పొందుతుంది (69) ఆరునెలల నుండి వ్యాధిగ్రస్తుడైన మనిషి కూడ రవికుండంలో స్నానం చేస్తే అన్ని రోగముల నుండి ముక్తుడౌతాడు (70) రవిక్షేత్ర మందు ఉదక తర్పణంచేసిన వారి పితరులు తృప్తిని పొందుతారు, ప్రళయం వచ్చేంత వరకు (71).

మూ ||కన్యాదాసంచయఃకుర్యాత్‌అస్మిన్‌ క్షేత్రేచ పుత్రక | ఉద్వాహా పరిపూతాత్మా బ్రహ్మలోకే మహీయతే || 72 ||

ధేనుదానం చశయ్యాంచ విద్రుమంచ హయంతథా | దాసీ మహిషీఘంటాశ్చ తిలంకాంచన సంయుతం || 73 ||

ధేనుంతిల మయీందద్యా దస్మిన్‌ క్షేత్రేచభారత | ఉపానహోచ ఛత్రంచ శీతత్రాణాది కంతథా || 74 ||

లక్షహోమంతథారుద్రం రుద్రాతి రుద్రమేవచ | తస్మిన్‌ స్థానే చయత్కించిత్‌ దదాతి శ్రద్ధయాన్వితః || 75 ||

ఏకైక స్యఫలం తాత పక్ష్యామి శృణుతత్వతః | దానేన లభ##తే భోగా నిహలోకే పరత్రచ || 76 ||

రాజ్యంచలభ##తేమర్త్యః కృత్వోద్వాహంతు మానుషాః | జాయాతో ధర్మకామార్థాః ప్రాప్యంతే నాత్రసంశయః || 77 ||

పూజాయాః లభ##తే సౌఖ్యం భ##వేజ్జన్మని జన్మని | సప్తమ్యాం రవియుక్తాయాం బకులార్కం న్మరేత్తుయ. || 78 ||

జ్వరాదేః శత్రుతశ్చైవ వ్యాధేస్తన్య భయం నహి || 79 ||

యుధిష్ఠిర ఉవాచ -

బకులార్కేతి వైనామ కథం జాతం రవేర్మునే | ఏతన్మే వదతాం శ్రేష్ఠ తత్వమాఖ్యాతు మర్హసి || 80 ||

వ్యాస ఉవాచ -

యదా సంజ్ఞాచ రాజేంద్ర సూర్యార్థం చైక చేతసా | తేపేబకుల వృక్షాథః పత్యుస్తేజః ప్రశాంతయే || 81 ||

ప్రాదుర్భావంరవేర్‌ దృష్ట్వా వడనా సమజాయత | అత్యంతం గోపతిః శాంతో బకులస్య సమీపతః || 82 ||

సుషువేచ తదారాజ్ఞే సుతౌ దివ్యౌ మనోహరౌ | తేనాస్య ప్రధితం నామ బకులార్కేతి వైరవేః || 83 ||

యస్తత్ర కురుతే స్నానం వ్యాధిస్తస్యన పీడయేత్‌ | ధర్మ మర్థం చకామంచ లభ##తే నాత్ర సంశయః || 84 ||

షణ్మాసాత్‌ సిద్ధి మాప్నోతి మోక్షంచలభ##తేనరః | ఏతదుక్తం మహారాజ బకులార్కస్య వైభవం || 85 ||

ఇతి శ్రీ స్కాందే మహా పురాణ ఏకాశీతి సాహస్ర్యాం సంహితాయాం తృతీయే బ్రహ్మఖండే పూర్వభాగే ధర్మారణ్యో పాఖ్యానే బకులార్క మాహాత్మ్య కథనం నామ త్రయోదశోధ్యాయః || 13 ||

తా || ఓ పుత్రక! ఈ క్షేత్రమందు కన్యాదానం చేసినవారు, వివాహంతో పవిత్రమైన ఆత్మకలవారై బ్రహ్మలోకంలో వెలుగొందుతారు (72) గోదానము, శయ్యాదానము వగడము, గుఱ్ఱము, దాసి, బఱ్ఱ, ఘంట, నువ్వులు, దానితో బంగారము (73) వీటిని తిలమయమైన (కపిల) ధేనువును ఈ క్షేత్రమందు దానం చేయాలి. ఓ భారత! చెప్పులు, గొడుగు కంబలి మొదలగు వానిని దానం చేయాలి (74) అట్లాగే లక్షరుద్ర హోమము, రుద్ర అతి రుద్రములు చేయాలి. ఆ స్థానంలో శ్రద్ధతో ఏదైనా, దానం చేయాలి. (75) ఓ తండ్రి! ఒక్కొక్క దాన ఫలాన్ని ఉన్నదున్నట్లు చెబుతాను విను. దానంవల్ల ఈ లోకంలో పరలోకంలోను భోగములను పొందుతాడు (76) వివాహము చేసినందువల్ల మనుష్యులు రాజ్యాన్ని పొందుతారు. మనుష్యులు భార్యవలన ధర్మకామ అర్థములను పొందుతారు. అనుమానంలేదు (77) పూజవల్ల సుఖమును జన్మజన్మలలో పొందుతారు. సప్తమి ఆదివారంనాడు బకులార్కుని స్మరించినవారు (78) జ్వరము, శత్రువు, వ్యాధి, వీటి నుండి భయమును పొందరు (79) యుధిష్ఠిరుని వచనము - సూర్యునకు బకులార్కుడనే పేరు ఎట్లా కలిగింది, ఓ ముని! దీన్ని అడుగుతున్న మాకు, ఓ శ్రేష్ఠుడ! యథార్థాన్ని చెప్పండి (80) వ్యాసుని వచనము - ఓ రాజేంద్ర సూర్యుని కొరకు, ఏకాగ్ర మనస్సుతో సంజ్ఞ, భర్తయొక్క తేజః శాంతి కొరకు బకుల వృక్షము క్రింద తపమాచరించింది (81) సూర్యుడు వస్తున్నాడని గమనించి ఆమె బడబగా మారింది. బకుల వృక్ష సమీపంలో సూర్యుడు మిక్కిలి శాంతించాడు (82) అప్పుడు రాజ్ఞి మనోహరులైన దివ్యులైన సుతులను కన్నది. అందువల్ల ఈ రవిపేరు బకులార్కుడని ప్రసిద్ధమైంది. (83) అక్కడ స్నానం చేసిన వారిని వ్యాధి పీడించదు. ధర్మము అర్థము కామము వీటిని పొందుతాడు అనుమానం లేదు (84) ఆరుమాసములలో సిద్ధిని పొందుతాడు మోక్షాన్ని పొందుతాడు. నరుడ ఓమహారాజ! బకులార్కుని ఈ వైభవాన్ని చెప్పాను (85) అని శ్రీ స్కాంద మహా పురాణమందు ఏకాశీతి సహస్ర సంహిత యందు తృతీయ బ్రహ్మఖండమందు పూర్వభాగమందు ధర్మారణ్య ఉపాఖ్యాన మందు బకులార్క మాహాత్మ్య కథన మనునది పదమూడవ అధ్యాయము || 13 ||

Sri Scanda Mahapuranamu-3    Chapters