Sri Matsya Mahapuranam-1    Chapters   

ద్వినవతితమో7ధ్యాయః.

గ్రహయజ్ఞవిధావయుతహోమవిధిః.

సూతః: వైశమ్సాయన మాసీన మపృచ్ఛ చ్ఛౌనకః పురా l సర్వకామప్తయే నిత్యం కథం శాన్తికపౌష్టికమ్‌. 1

వైశమ్పాయనః: శ్రీకామ శ్శాన్తికామోవా గ్రహయజ్ఞం సమాచరేత్‌ l

వృష్ట్యాయుఃపుష్టికామో వా తథైవాభిచర న్పునః. 2

______________________________________________

¯పఠ్యమానైశ్సైలేన్ద్రైర్భవ.

యేన గ్రహవిధానేన తన్మే నిగదత శ్శృణు l సర్వశాస్త్రాణ్యను క్రమ్య ¯సంక్షిప్తం(ప్య) గ్రన్థవిస్తరమ్‌. 3

గ్రహశాన్తిం ప్రవక్ష్యామి పురాణశ్రుతి చోదితామ్‌ l పుణ్య7హ్నివిప్రకథితే కృత్వా బ్రాహ్మణవాచనమ్‌. 4

గ్రహా న్గ్రహాధిదేవాంశ్చ స్థాప్య హోమం సమాచరేత్‌ l

గ్రహయజ్ఞ స్త్రిధా ప్రోక్తః పురాణుశ్రుతికోవిదైః. 5

ప్రథమో7యుతహోమ స్స్యా ల్లక్షహోమ స్తతఃపరమ్‌ l

తృతీయః కోటిహోమ స్స్యా త్సర్వకామఫలప్రదః. 6

అయుతేనాహుతీనాంచ నవగ్రహవిధి స్స్మృతః l తావ త్తస్యవిధింపవక్ష్యేపురాణశ్రుతిభాషితమ్‌. 7

గృహస్యోత్తరపూర్వేణ మణ్డపం కారయేద్బుధః l lరుద్రాయతనభూమౌవా చతురస్ర ముదక్ల్పవమ్‌. 8

దశహస్త మథాష్టౌ వా హస్తం కుర్యా ద్విధానతః l తస్య ద్వారాణి చత్వారి కర్తవ్యాని చ దక్షిణ. 9

గర్తం చోత్తర పూర్వేణ వితస్తిద్వయవిస్తృతామ్‌ l

వప్రద్వయయుతాం వేదిం వితస్త్యుచ్ర్ఛయసమ్మితామ్‌ . 10

సంస్థాపనాయ దేవానాం చతురగ్రా ముదక్ల్పవామ్‌ l

అగ్ని ప్రణయనం కృత్వా తస్యా మవాహయేత్సురా&. 11

దేవతానాం తతస్థ్సాప్యో వింశతిర్ద్వాదశాధికః l

తొంబది రెండవ అధ్యాయము.

గ్రహయజ్ఞ విధానము-హోమవిధానము- ఇతరములగు

వశ్యాభిచారప్రక్రియలును.

సూతుడు ఋషులకు ఇట్లు చెప్పెను: పూర్వము శౌనకుడు ప్రశాంతుడై కూర్చుండియున్న వైశంపాయనుని సర్వకామములు పూర్ణములగుటకు ఉపకరించు శాంతికపౌష్టిక కర్మముల నెట్లాచరించవలెనని యడిగెను. వైశం పాయనుడు శౌనకునకిట్లు చెప్పనారంభించెను: శ్రీ-శాంతి-వృష్టి-ఆయువు-పుష్టి-అను అభ్యుదయములను పొందుటకుగాని (తనకు ద్వేష్యులగు) ఇతరులకు అపకారము కలిగించు తంత్రాచరణమును చేయుటకుగాని కోరువారు ఆచరించవలసిన గ్రహ (ముల ఆరాధన) విధానమును తెలిపెదను; వినుము. సర్వ శాస్త్రములను పరీశీలించియు పురాణముల చేతను శ్రుతుల చేతను చెప్పబడిన వానిని గ్రహించియు క్రోడీకరించిన గ్రంథ విస్తరముతో గ్రహశాంతి విధానమును ప్రతిపాదింతును.

విజ్ఞులగు దైవజ్ఞ విప్రుల నిర్ణయించిన శుభదినమున బ్రాహ్మణులచేత పుణ్యాహవాచనమును జరిపించవలెను. గ్రహములనువాటి «అధిదేవతలను మండపమున ప్రతిష్ఠించి వారినుద్దేశించి హోమము చేయవలెను. (ఇది గ్రహ శాంతి విధాన సంక్షేపము.)

(ఇక మీదట దీని విస్తరణము చెప్పబడును:) పురాణములను శ్రుతులను బాగుగ ఎరిగిన మహనీయులు గ్రహయజ్ఞము అయుత (పదివేల) హోమమ-లక్షహోమమ-కోటి హోమము- అని మూడు విధములని చెప్పుచున్నారు. ఇవి అన్నియు ఆయా విషయములలో సర్వ కామ ఫలములను ఇచ్చు శక్తి కలవి. మొదట వీనిలోని మొదటిదగు అయుత హోమ రూపమగు నవగ్రహయజ్ఞ విధానము తెలిపెదను.

______________________________________________________________________

+గ్రహయజ్ఞం సమాచరేత్‌ lరుద్రహస్తమితంవా స్యాత్‌

«గ్రహములు ఆకాశమున-అంతరిక్ష లోకమున మనకు కనబడు జ్యోతిర్గోళ రూపములు; వీనికి సరిగా ద్యులోకమున నున్న దేవతా తత్త్వములే ఈ గ్రహముల అధిదేవతలును వారి అంగ దేవతలు ప్రత్యధిదేవతలును; వారి అనుగ్రహము సంపాదించనిదే ఈ గ్రహశాంతి కర్మము ఫలప్రదము కాదు. కావున గ్రహములతోపాటు వాని అధిదేవతా తత్త్వములను ప్రతిష్ఠ చేసి ఆరాదించవలయును.

యజమానుడు తన ఇంటికి ఉత్తర పూర్వదిశ (ఈశాన్య దిశ) యందుకాని శివాలయ ప్రదేశమునకాని చతురగ్ర (స్ర)ము ఉదక్ల్పవము( ఉత్తరమునకు వాలుగనుండునదియు)ను పదికాని ఎనిమిది కాని హస్తముల భుజము కలది యునగు మండపమును విధానానుసారముగ నిర్మించవలయును. దానికి దక్షిణమన నాలుగు ద్వారములును - అదే మండపము నకు ఈ శాన్యమన రెండు జేనల పోడవు- అంతే వెడలుపు-అంతే లోతు కలిగిన గుంటను (హోమమునకు) దాని సమీపమున ఈ శాన్యమునందే జేనెడు ఎత్తుగా నుండు వేదికను నిర్మించవలెను. ఈ వేదిక చతురస్రాకారముగ నుండవలెను. (దీని భుజముల కొలత ఈయబడలేదు.) ఇది గ్రహములయు-వాటి అధిదేవతా ప్రత్యధి దేవతలయు ఆవాహనము కొరకు; ఈ వేదికకు చుట్టును నాలుగు వైపుల రెండు ప్రాకారములు (కొలది ఎత్తు కల గోడలవంటి కట్టలు) ఉండవలెను. ఇదియు ఉత్తరమనకు వాలుగ ఉండవలయును.

ఈ చెప్పిన గుంటయందు (హోమకుండమునందు) అగ్ని ప్రణయనము (అగ్నిని ప్రతిష్ఠించుటకు ముందు చేయవలసిన పరిస్తరణాది పూర్వకముగ అగ్ని వ్రతిష్ఠాపనము ప్రజ్వాలనము మొదలగునవి ) చేసిన పిదప ముప్పుది ఇద్దరు దేవతలకు ఆ వేదికయందు ఆవాహన ప్రతిష్ఠాపనములు జరుపవలెను. గ్రహములు 9+ అధిదేవతలు 9+ ప్రత్యధిదేవతలు 9+ వినాయక దుర్గా వాయ్వాకాశాశ్వినులు అను 5=32; ఇచట అశ్వి దేవతలు జంట దేవతలు కావున ఇద్దరను ఒకటిగానే గణించవలెను.)

నవగ్రహావాహనాదిః.

సూర్యస్సోమో భూమిసుతో బుధో జీవ స్సితో7ర్కజః. 12

రాహుః కేతురితి ప్రోక్తా గ్రహా లోకహితావహాః l మధ్యేతు భాస్కరం విన్ద్యా చ్ఛశినం పూర్వదక్షిణ. 13

దక్షిణ లోహితం విన్ద్యా ద్బుధం పూర్వోత్తరేణతు l ఉత్తరేణ గురుం విన్ద్యా త్పూర్వేణౖవతు భార్గవమ్‌. 14

పశ్చిమేతు శనిం విన్ద్యా ద్రాహుం పశ్చిమదక్షిణ l పశ్చిమోత్తరతః కేతుం స్థాపయే చ్ఛుక్లతణ్డులైః. 15

భాస్కర స్యేశ్వరం విన్ద్యా దుమాంచ శశిన స్తథా l స్కన్ద మజారకస్యాపి బుధస్యాపి బుధస్యాపి తథా హరమ్‌. 16

బ్రహ్మాణం చ గురో ర్విన్ద్యా చ్ఛుక్రస్యాపి శచీపతిమ్‌ l శ##నైశ్చచరస్యతు యమం రాహోః కాలం తథైవచ.

కేతునాం చిత్రగుప్తంతు సర్వేషా మధిదేవతాః l అగ్ని రాపః క్షితి ర్విష్ణు రిన్ద్ర ఐన్ద్రీచ దేవతా. 18

ప్రజాపతిశ్చ సర్పాశ్చ బ్రహ్మా ప్రత్యథ దేవతాః l వినాయకం తథా దుర్గాం వాయు మాకాశ##మేవచ. 19

ఆవాహయే ద్వ్యాహృతిభి స్తథైవాశ్వికుమారకౌ l స్థాపయే ద్రక్త మాదిత్య మఙ్గారక సమన్వితమ్‌. 20

సోమశుక్రౌ తథా శ్వేతౌ బుధజీవౌచ పిఙ్గళౌ l మన్దరాహూ తథా కృష్ణౌ ధూమ్రం కేతుగణం విదుః. 21

గ్రహవర్ణాని దేయాని వాసాంసి కుసుమానిచ l ధూపమాత్రో7త్ర సురభి రుపయుజ్యశ్చ నిర్మలః. 22

ప్రత్యేకం ప్రాపయే త్ర్పాజ్ఞః ఫలం పుష్పసమన్వితమ్‌ l

గుడోదానం రవే ర్దద్యా త్సోమాయ ఘృతపాయసమ్‌. 23

అఙ్గారకాయ సంయావం బుధాయ క్షీరపిష్టకమ్‌ l దధ్యన్నం గురవే దద్యా చ్ఛుక్రాయతు ఘృతోదనమ్‌ . 24

శ##నైశ్చరాయ కృసరం మాషం మాంసంచ రాహవే l చిత్రోదనంచ కేతుభ్య స్సర్వా న్భక్ష్యై స్తథార్చ7యేత్‌. 25

ఎట్లనగా-1. సూర్యుడు 2. చంద్రుడు 3. అంగారకుడు 4.బుధుడు 5.గురుడు 6.శుక్రుడు 7.శని 8.రాహువు 9.కేతువు అను లోకహిత సంపాదకులగు గ్రహములు తొమ్మిది. (వీరి స్థానములు): 1.నడుమ 2. ఆగ్నేయము 3.దక్షిణము 4. ఈశాన్యము 5.ఉత్తరము 6.తూర్పు 7. పశ్చిమము 8.నైరృతము 9.వాయవ్యము. వీరినందరను తెల్లని బియ్యముతో ప్రతిష్ఠించవలెను. వీరి అధిదేవతలు: 1.రుద్రుడు 2. ఉమ 3.స్కందుడు 4.విష్ణువు 5.బ్రహ్మ 6.ఇంద్రుడు 7.యముడు 8.కాలుడు 9.చిత్రగుప్తుడు. ఇక ప్రత్యధిదేవతలు: 1.అగ్ని 2.జలము 3.పృథివి 4.విష్ణువు 5.ఇంద్రుడు 6. ఐంద్రి (ఇంద్రాణి-శచి) 7.ప్రజాపతి 8. సర్పములు 9.బ్రహ్మ. వీరినేకాక వ్యాహృతిత్రముతో ప్రత్యేకముగా వినాయక దుర్గా వాయ్వాకాశాశ్వినుల కైదుగురకు అవాహన ప్రతిష్ఠాపనములు జరుపవలెను. నవగ్రహ వర్ణములు :1. రక్తవర్ణము 2.శ్వేతము 3. రక్తము 4.పింగళ(ఎరువు పసువుల మిశ్రణము) 5.

పింగళము 6. శ్వేతము 7. కృష్ణము 8. కృష్ణము 9. ధూమము(పొగరంగు) వీరి పూజయందు వస్త్రములును పుష్పములును వారి వారి రంగులు కలవి. ధూపము మాత్రము నిర్మలము సుగంధము కలది ఏదైనను సరియే. పూవులతో పాటు ఫలముల గూడ అర్పించవలెను. వీరి నైవేద్యమునకు 1. బెల్లపు అన్నము 2. నేతిపాయసము 3. సంయావము(గోధుమ రవ్వను పాలతో వండినది.) 4.పాలతో ఉడికించిన పిండి 5.పెరుగన్నము 6. నేతి అన్నము 7.పులగము 8.మినుప వంట 9. చిత్రాన్నము (పులియోగిరము); ఈతొమ్మిది గ్రహములకును ఇతర దేవతా ప్రత్యధి దేవతలకును వినాయకాదులకును భక్ష్ని.మువైనను నివేదించవచ్చును.

కలశస్థాపనాదిః

ప్రాగుత్తరేణ తస్మాత్తు దధ్యక్షతవిభూషితమ్‌ l చూతపల్లవసఞ్ఛన్నం ఫలవస్త్రయుగాన్వితమ్‌. 26

పఞ్చరత్నసమాయుక్తం పఞ్చపూగయుతం తథా l స్థాపయే దవ్రణం కుంభం వరుణం తత్ర విన్యసేత్‌.

గఙ్గాద్యా స్సరిత స్సర్వా స్సముద్రాశ్చ సరాంసిచ l గజాశ్వరథవల్మీక సఙ్గమహ్రదగోకులాత్‌. 28

మృద మానీయ విప్రేన్ద్ర సర్వౌషధిసమన్వితమ్‌ l స్నానార్థం విన్యసే త్తత్ర యజమానస్య ధర్మవిత్‌ . 29

సర్వే సముద్రా స్సరిత స్తీర్థాని జలదా నదాః l ఆయాన్తు యజమానస్య దురితక్షయకారకాః . 30

ఏవ మావాహయే దేతా నమరా న్మునిసత్తమ l హోమం సమారభేత్సర్పి ర్యవవ్రీహితిలాదినా. 31

అర్కఃపలాశః ఖదిరః అపామార్గో7థ పిప్పలః l ఉదుమ్బర శ్శమీ దూర్వాకుశాశ్చ సమిధః క్రమాత్‌. 32

ఏకైకస్యా ప్య ష్టశత మష్టావింశతి రేవవా l హోతవ్యా మదుసర్పిర్భ్యాం దధ్నాచైవ సమన్వితాః. 33

ప్రాదేశమాత్రా అశిఖా అశాఖా అపలాశినీ l సమిధః కల్పయే త్ర్పాజ్ఞ స్సర్వకర్మసు సర్వదా. 34

దేవానామపి సర్వేషా ముపాంపశు పరమార్థవిత్‌ l స్వేన స్వేనైవ మన్త్రేణ హోతవ్యా స్సమిధః వృధక్‌. 35

హోతవ్యంచ ఘృతం త్వత్ర చరుభక్ష్యాదికం పునః l

మన్త్రైర్దశాహుతీ ర్హుత్వా హోమోవ్యాహృతిభి స్స్మృతః. 36

ఉదఙ్ముఖాః ప్రాఙ్ముఖా వా కుర్యు ర్ర్బాహ్మణపుఙ్గవాః l మన్త్రవన్తస్తు కర్తవ్యాశ్చరవః ప్రతిదైవతమ్‌. 37

హుత్వా పశ్చా చ్చరుం సమ్య క్తతో హోమం సమాచరేత్‌ l

(కలశ స్థాపనము) : ఈ గ్రహావాహన వేదికకు ఈశాన్యమున పెరుగు అక్షతలు పంచరత్నములు పంచపూగములు (పోకకాయలు) వేసి మామిడి చిగురాకులతో పండ్లతో నూతన వస్త్రద్వయముతో కప్పిన అరంధ్ర కలశమును ప్రతిష్ఠించి దానియందు వరుణునావాహితునిగా జేయవలెను. దానియందు గంగాది నదులనుండి సముద్రములనుండి తెచ్చిన నీటిని పోయవలెను. ఆ నీటియందు గజాశ్వరథములుండు తావులనుండి గోవులు నిలుచుచోటి నుండి పుట్టనుండి నదీసంగమములనుండి హ్రదములనుండి (మడుగుల నుండి) సేకరించి తెచ్చిన మట్టినికూడ వేయవలెను. ఈ నీరు యజమానుని స్నానార్థము వినియుక్తమగును. అన్ని సముద్రములును నదులును తీర్థములును మేఘములును నదములును యజమానుని దురితములను క్షయింపజేయుటకై దీనియందు సన్నిహితములగుగాక! అను అర్థమిచ్చు మంత్రముతో వీటినన్నిటినం దావాహనము చేయవలెను.

పిమ్మట నేయి యవలు వడ్లు తిలలు మొదలగు వానితో హోమమారంభించవలెను. ఆ యాగ్రహములకు విహితములగు సమిధలు. 1.(తెల్ల) జిల్లేడు 2.మోదుగు 3. చండ్ర 4. ఉమ్మెత్త 5.రావి 6.మేడి 7.జమ్మి 8. గరిక 9.దర్భలు. ఈ సమిధలు ప్రాదేశ మాత్ర

దైర్ఝ్యము (ప్రాదేశము-లుడితి అని తెలుగులో వాడుక-కుడిచేతి బొటన వ్రేలు చూపుడు

వ్రేలు వీటిని రెండు వైపులకును చాచగా ఏర్పడు పోడవు) కలిగి కొసలుగాని కొమ్మలు (చిల్లలు) గాని ఆకులు గాని లేక సూటిగా ఉండవలెను. ప్రతియొక ఆవాహిత దేవతకును ఈ సమిధలను తేనెతో-నేతితో -పెరుగుతో వేరువేరుగా తడిపి వేరువేరుగా నూట ఎనిమిది మారులుగాని నూట ఇరువది ఎనిమిది మారులుగాని వేల్చవలయును. (కనుక ఈ సంఖ్యకు సరిపోవునన్ని సమిధలు ఉండవలయును.)

కొసలు-కొమ్మలు(చిల్లలు) ఆకులు లేకుండు సమిధలు సేకరించుట ఈ గ్రహయజ్ఞమునందే కాదు-ప్రతిహవన కార్యమునందును ఇంతే.

(హవన విధానము): ప్రతి దేవతకును ప్రతి ఆహుతియందును ఋత్విక్కులు మంత్ర -దేవతా తత్త్వముల పరమార్థము (తాత్త్వికార్థము) నెరిగి దానికి దానికి విహితమయిన వేరు వేరు మంత్రములను ఉపాంశువుగా (దగ్గరనున్న వారికి మాత్రము వినబడునట్లును- ఐనను స్పష్టముగా) ఉచ్చరించుచు సమిధలను వేల్చవలయును. ప్రతి ఆహుతితోను నేతిని చరుద్రవ్యమును భక్ష్యములు మొదలగు వానినికూడ చేర్చవలయును. ఆయా గ్రహములకును దేవతలకును విహితములగు మంత్రములతో పది ఆహుతులను వ్యాహృత్తులతో మిగిలిన ఆహుతులను వేల్చవలెను. హోమము జయపువిప్రులు ప్రాఙ్ముఖులుగానో ఉదఙ్ముఖులుగానో కూర్చుండవలెను. మొదట ప్రతి దేవతకును సిద్ధపరచిన చరద్రవ్యమును ఆయాగ్రహములకును దేవతలకును విహితములగు మంత్రములతో అభిమంత్రించవలెను. పిమ్మట ఆ చరువుతో వేరువేరు దేవతలకు హోమము జరిపి పిమ్మటనే హోమమునారంభించవలెను.

నవగ్రహాదీనాం హోమమన్త్రాః.

ఆకృష్ణేనేతి సూర్యాయ హోమః కార్యో ద్విజన్మనా. 38

అప్యాయస్వేతి సోమాయ మన్త్రేణ జుహుయా త్పునః l

అగ్నిర్మూర్ధేతి భౌమాయ మన్త్రేణ జుహుయా త్తతః . 39

+ఉద్బుధ్యస్వేతిమన్త్రోయ ముక్త స్సోమసుతాయ వైl

బృహస్పతే+అతియదర్యమన్త్రేణతి గురోర్మతమ్‌. 40

¡కయానశ్చిత్రఆభువదితి రాహో రుదాహృతమ్‌ l కేతుంకృణ్వన్నితి బ్రూయా త్కేతూనామపి శాన్తయే.

ఆవోరాజేతి రుద్రసగ బలిం హోమం సమారభేత్‌ l ఆపోహిష్ఠేత్యుమాయాస్తు స్యోనేతి స్వామిన స్తథా 43

విష్ణోరిదం విష్ణురితి త్వామిచ్ఛేతి స్వయమ్భువఃl ఇన్ద్రమిద్ధరీవహతఇతీన్ద్రాయ పరికీర్తితమ్‌. 44

తథా యమస్య చాయంగౌరితి హోమః ప్రకీర్తితః l కాలస్య బ్రహ్మజజ్ఞానమితమన్త్రఃప్రశస్యతే. 45

చిత్రగుప్తస్య రాజనమిత వేదవిదో విదుః l అగ్నిం దూతం వృణీమహఇతి వహ్నే రుదాహృతః. 46

ఉదుత్తమంవరుణమిత్యపాం మన్త్రః ప్రశస్యతే l భుమేః పృథివ్యన్తరిక్షమిత వేదేషు పఠ్యతే. 47

సహస్రశీర్షా పురుష ఇతి విష్ణో రుదాహృతమ్‌ l ఇన్ద్రాయేన్ద్రమరుత్వఇతి శక్రస్య శస్యతే. 48

ఉత్తానపర్ణే సుభగ ఇతి శచ్యా స్సమాచరేత్‌ l ప్రజాపతేః పునర్హోమః ప్రజాపత ఇతి స్మృతః. 49

*నమో అస్తు సర్పేభ్య ఇతి సర్పాణాం మన్త్ర ఉచ్యతే l

ఏష బ్రహ్మాయ ఋత్విజ ఇతి బ్రహ్మణ్యుదాహృతః. 50

______________________________________________

+'అగ్నేవివస్వదుషస' ఇతిసోమ +వరిదీయారథేనేతి ¡అన్నాత్పరిస్రుతేతి

*నమోఆస్తునాగేభ్యఇతినాగానాం మన్త్రఉచ్యతే

వినాయకస్య చానూన మితి మన్త్రో బుధై స్స్మృతః l

జాత వేదసే సునవామ ఇతి దుర్గయా మన్త్ర ఉచ్యతే. 51

ప్రాణానాం గ్రన్థిరసీతి ప్రాణస్య పరికీర్తితః l ఆదిత్‌ ప్రత్నస్య రేతస ఆకాశస్య ఉదాహృతః. 52

ఏషా ఉషా అపూర్వ్యా ఇతి అశ్వినో ర్మన్త్ర ఉచ్యతే l పూర్ణాహుతించ మూర్ధనం దివ ఇత్యభిపాతయేత్‌. 53

యజమానాభిషేకమన్త్రాః.

అథాభిషేకమన్త్రేణ వాద్యమఙ్గళగీతకైః l పూర్ణకుమ్భేన తేనైవ హోమన్తే ప్రాగుదఙ్మఖైః 54

అవ్యఙ్గావయవైర్బ్రహ్మ9 హేమస్రగ్దామభూషితైఃl యజమానస్యకర్తవ్యం చుతుర్భిస్స్నపనం ద్విజైః. 55

సురాస్త్వా మభిపిఞ్చన్తు బ్రహ్మవిష్ణుమహేశ్వరాః lవాసుదేవో జగన్నాధ స్తథా సఙ్కర్షణో విభుః. 56

ప్రద్యుమ్న శ్చానిరుధశ్చభవన్తు విజయాయతే l అఖణ్డలో7గ్ని ర్భగవా న్యమోవై నిరృతిస్తథా. 57

వరుణః పవనశ్చైవ ధనాధ్యక్షస్తథా శివః l బ్రహ్మణా సహితా స్సర్వే దిక్పాలాః పాన్తుతే సదా. 58

కీర్తి ర్లక్ష్మీర్ధృతి ర్మేధా పుష్టి శ్రద్ధా క్రియా మతి ః l బుద్ధి ర్లజ్జా వపు శ్శాన్తి స్తుష్టిః కాన్తిశ్చ మాతరః. 59

ఏతా స్త్వా మభిషిఞ్చన్తు ధర్మపత్న్య స్సమాగతాః l ఆదిత్య శ్చన్ద్రమా భౌమ బుధజీవసితార్కజాః. 60

గ్రహా స్త్వా మభీషిఞ్ఛన్తు రాహుః కేతుశ్చ తర్పితాః l దేవదానవగన్ధర్వా యక్షరాక్షసపన్నగాః . 61

ఋషయో మునయో గావో దేవమాతర ఏవ చ l దేవపత్న్యో ద్రుమా నాగా దైత్యా శ్చాప్సరసాం గణాః.

అస్త్రాణి సర్వశస్త్రాతి రాజానో వాహనాని చ l ఔషధానిచ రత్నాని కాలస్యావయవాశ్చయే. 63

సరిత స్సాగరా స్సర్వే తీర్థాని జలదా నదాః l ఏతా స్త్వా మభీషిఞ్చన్తు సర్వకామార్థసిద్ధయే. 64

ఆయా గ్రహాదికమునకు హోమమంత్రములు : 1.సూర్యునకు-ఆకృష్ణేన రజసా' 2. చంద్రునకు-'ఆప్యాయస్వ' 3.అంగారకునకు 'అగ్నిర్మూర్ధా' 4. బుధనకు-'ఉద్బుధ్యస్వ 5.గురునకు-''బ్బహస్పతే అతియదర్యా'' 6. శుక్రునకు- 'శుక్రంతే అన్యత్‌ ' 7.శనికి- 'శంనోదేవీ' ; 'శమగ్ని రగ్నిభిస్కరత్‌' అనునది వాడుకలో నున్నది. 8. రాహువునకు- 'కయానశ్చిత్ర ఆభువత్‌ ' 9.కేతువునకు-'కేతుంకృణ్వన్‌'

అధి దేవతల హోమ మంత్రములు :1.రుద్రునకు-' ఆవోరాజా' 2. ఉమకు-' ఆపోహిష్ఠా' 3.స్కందునకు-'స్యోనా ప్పృథివీ' 4.విష్ణువునకు- 'ఇదం విష్ణుః' 5.బ్రహ్మకు-'త్వామిచ్ఛా' 6.ఇంద్రునకు-'ఇంద్రమిద్ధరీ' 7. యమునకు-'ఆయంగౌః' 8.కాలునకు-'బ్రహ్మజజ్ఞానం' 9. చిత్రగుప్తునకు-'రాజానమ్‌'

ప్రత్యధి దేవతలకు హోమ మంత్రములు:1. అగ్నికి-అగ్ని' దూతం వృణీమహే.' 2. జలములకు- 'ఉదుత్తమంవరుణ' 3. భుమికి-'పృథివ్యంతరిక్షమ్‌' 4. విష్ణునకు-'సహస్రశీర్షా' 5.ఇంద్రనకు'ఇంద్రమరుత్వ' 6. శచికి-' ఉత్తనపర్ణేసుభ##గే' 7.ప్రజాపతికి- 'ప్రజాపతే' 8. సర్పములకు-' నమో అస్తు సర్పేభ్యః' 9. బ్రహ్మకు- 'ఏషా బ్రహ్మాయ ఋత్విజః'

వినాయకుడు మొదలగు ఐదుగురకు హోమ మంత్రములు: 1. వినాయకునకు -'అనూనమ్‌' 2.దుర్గకు 'జాతవేదసే సునవామ' 3. వాయువునకు - 'ప్రాణానాం గ్రంథిరసి' 4. ఆకాశమునకు 'ఆదిత్‌ ప్రత్నస్యరేతసః' 5. అశ్వినులకు- 'ఏషా ఉషా అపూర్వ్యా.'

పూర్ణాహుతికి మంత్రమ . 'మూర్దానం దివః'

(ఈ చెప్పినవి అన్నియు ఆయా మంత్రముల ఆరంభములు)

యజమానునకు అభిషేకము (స్నానము) జరుపు ప్రక్రియ:

హోమము ముగిసిన తరువాత అంగవైకల్యము లేకుండి బంగారు ఆభరణములతో పూలమాలలతో అలంకరించబడియున్న నలుగురు బ్రాహ్మణులు తూర్పునకో ఉత్తరమునకో మొగమై అభిషేక మంత్రములు పఠించుచు మంగళ వాద్యములమ్రోతల నడుమ లోగడ చెప్పిన పూర్ణ కుంభమందలి జలముతో యజమానునకు స్నానము చేయింతురు. (అభిషేక మంత్రముల అర్థము:) బ్రహ్మవిష్ణు మహేశ్వరులు జగన్నాధుడగు వాసుదేవుడు సంకర్షణుడు ప్రద్యుమ్నుడు అనిరుద్ధుడు ఇంద్రాగ్ని యమ నిరృతి వరుణ వాయ కుభేరేశ్వరులు బ్రహ కీర్తి లక్ష్మీధృతి మేదాపుష్టి శ్రద్ధా క్రియా మతి బుద్ధి లజ్జా వపు ః శాంతి తుష్టి కాంతులు సప్తమాతృకలు ఆదిత్య సోమాంగారక బుధగురు శుక్రశని రాహు కేతువులు దేవదానవ గంధర్వ యక్ష రాక్షస పన్నగులు ఋషిముని గోదేవమాతలు దేవపత్నులు వృక్షనాగ దైత్యాప్సరసలు అస్త్రములు శస్త్రములు రాజులు వాహనములు ఔషధములు రత్నములు కాలావయవములు నదీ సాగర పుణ్యతీర్థములు మేఘములు నదములు-ఇవి యన్నియు నిన్న భిషేకించి జయమును సర్వ కామార్థ సిద్ధులును కలిగించుగాక|

తత శ్శుక్లామ్బరధర శ్శుక్లమాల్యాను లేపనః l సర్వౌషధై స్సర్వగన్ధై స్స్నాపితో ద్విజపుఙ్గవైః.

యజమాన స్సపత్నీక ఋత్విజస్తు సమాహితః l దక్షిణాభిః ప్రయత్నేన పూజయే ద్గతవిస్మయః. 66

సూర్యాయ కపిలాం ధేనుం శఙ్ఖం సోమాయ దాపయేత్‌ l

భౌమాయ రక్తవృషభం సోమపుత్త్రాయ కాఞ్చనమ్‌. 67

గురవే పీతవాసాంసి శుక్రాయాశ్వంతు దాపయేత్‌ l కృష్ణాయ కృష్ణగౌ ర్దేయా శుభలక్షణసంయుతా. 68

ఆయసం రాహవే దద్యా త్కేతుభ్య శ్ఛాగ ముత్తమమ్‌ l సువర్ణేన సమాః కార్యా యజమానేన దక్షిణాః . 69

సర్వేషా మథవా గావో దాతవ్యా హేమభూషితాః l సువర్ణ మథవా దద్యా ద్గురుర్వా యేన తుష్యతి. 70

కపిలాధిధేను దానమన్త్రాః.

స్వమన్త్రేణౖవ దాతవ్యా స్సర్వాస్సర్వత్ర దక్షిణాః l కపిలే సర్వధేనూనాం పూజనీయా 7సిరోహిణీ. 71

సర్వతీర్థమయీ యస్మా దత శ్శాన్తిం ప్రయచ్ఛమే l పుణ్యస్త్వం శఙ్గ పుణ్యానాం మఙ్గళానాంచ మఙ్గళః.72

విష్ణునా విధృతో నిత్యమత శ్శాన్తిం ప్రయచ్ఛమే l ధర్మ త్వం వృషరూపేణ జగదానన్దకారక. 73

అష్టమూర్తే రధిష్ఠాన మత శ్శాన్తిం ప్రయచ్ఛ మే l హిరణ్య గర్భగర్భస్థం హేమ బీజం విభావసోః . 74

అనన్తపుణ్యఫలద మత శ్శాన్తిం ప్రయచ్ఛమే l పీతవస్త్రయుగం యస్మా ద్వాసుదేవస్య వల్లభమ్‌ 75

ప్రదానా త్తస్య మే విష్ణో రత శ్శాన్తిం ప్రయచ్ఛమే l విష్ణో త్వ మశ్వరూపేణ యస్మా దమృతసమ్భవః.

ఇన్ద్రార్కవాహనం నిత్య మత శ్శాన్తిం ప్రయచ్ఛమే l యస్మా త్త్వం పృథివీ సర్వా ధేనుః కేశవసన్నిభా.

సర్వపాపహరా నిత్య మత శ్శాన్తిం ప్రయచ్ఛమే l గవా మఙ్గేషు తిష్ఠన్తి భువనాని పతుర్దశ. 78

యస్మా త్తస్మా చ్ఛివం మే స్యా దత శ్శాన్తిం ప్రయచ్ఛమే l యస్మా దాయస కర్మాణి తవాధీనాని సర్వదా.

లాఙ్గలా న్యాయుధాదీన తస్మా చ్ఛాన్తిం ప్రయచ్ఛమే l యస్మా త్త్వం సర్వయజ్ఞానా మజ్గ మఙ్గత్వేన వ్యవస్థితః.

యానం విభవసో ర్నిత్య మత శ్శాన్తిం ప్రయచ్ఛ మే l యస్మా దశూన్యం శయనం కేశవస్య శివస్యచ. 80

తస్మా న్మమాప్యశూన్యం స్యా ద్దానా జ్జన్మని జన్మని l యథా సర్వేషు రత్నేషు సర్వే దేవా వ్యవస్థితాః. 82

తథా శాన్తిం ప్రయచ్ఛన్తు రత్నదానేన మే సురాః l యథా భుమి ప్రదానస్య కళాం నార్హన్తి షోడశీమ్‌ . 83

దాన స్యన్యాని యే శాన్తి ర్భూమిదానా ద్భవత్విహ l ¡ఏవం సమ్పూజయిత్వాతు విప్రా న్మాత్సర్యవర్జితః.

వస్త్రాలఙ్కారరత్నాద్యై ర్మాల్యగన్ధానులేపనైః l అనేన విధినా యస్తు గ్రహయజ్ఞం సమాచరేత్‌ . 85

సర్వా న్కామా నవాప్నోతి ప్రేత్య స్వర్గే మహీయతే l యస్తు పీడాకరో నితగ మల్పవిత్తస్య వా గ్రహః. 86

__________________________________________________________________________

¡ఏవం సమ్పూజయేద్భక్త్యా విత్తశాఠ్యవివర్జతః.

తంచ యత్నేన సమ్పూజ్య శేషా న ప్యర్చయే ద్గ్రహా& l

గ్రహా గావో నరేన్ద్రాశ్చ బ్రాహ్మణాశ్చ విశేషతః. 87

పూజితాః పూజయ న్త్యేతే నిర్దహ న్త్యవమానితాః |

తస్మా న్న దక్షిణాహీనం క ర్తవ్యం భూతి మిచ్ఛతా. 88

నమ్పూర్ణయా దక్షిణయా యస్మాదేకో7పి తృప్యతి | సదైవాయుతహోమో7యం నవగ్రహమఖే స్థితః.

వివాహోత్సవయజ్ఞేషు ప్రతిష్ఠాదిషు కర్మసు | నిర్విఘ్నూర్థం మునిశ్రేష్ఠ తథోద్వేగాద్భుతేషు చ. 90

యజమానుడు ఇట్లు సర్వ గంధ యు క్తములను సర్వౌషధీ సంస్కృతములునునగు జలములతో విప్రులు తను స్నా నము చేయించగా శుక్ల వస్త్రములను శుక్ల మాల్యాను లేపనములను ధరించి తన భార్యతో కూడి శ్రద్ధా యుక్తుడై ఋత్విజులను ప్రయత్న పూర్వకముగాను అభిమాన రహితముగాను దక్షిణలతో గౌరవించవలెను. సూర్యునకు కపిల ధేనువును (ధేనువు అనగా పాడియావు) చంద్రునకు శంఖమును కుజునకు ఎర్రని వృషభమును బుధునకు బంగారును గురునకు పసుపు పచ్చని వస్త్రములను శుక్రునకు అశ్వమును శనికి శుభ లక్షణములు కల నల్లని యావును రాహువునకు ఇనుమును కేతువునకు మంచి మేకపోతును ఈయవలెను. ఇదికాక ద్రవ్య రూపమున దక్షిణగా ఋత్విజుల కందరకు సమాన పరిమాణములో బంగారమును కాని బంగారు (కొమ్ముల)తో అలంకరించబడిన గోవును (కొక్కొక్కరికి ఒక్కొక్కటి) కాని ఈయవలెను. గురునకు బంగారుగాని ఆవులనుగాని అతనికి సంతోషకరమైనది మరేదైన దక్షిణ కాని ఈయవలెను.

ఏ దక్షిణనై నను వాటికి వేరువేరుగా విహితమయిన మంత్రముతో ఈయవలెను. 1. కపిల గోవునకు: కపిల గోవా! నీవు సర్వధేనువులలో పూజనీయవు; రోహిణివి (ఎర్రని వన్నెగల దానవు;) సర్వ తీర్థయమురాలవు; ఇట్టి నీవు మాకు శాంతి నిమ్ము; 2. శంఖమునకు: శంఖమా! పుణ్యకరములైన వానిలో పుణ్యకర్మమయిన దానవు; శుభకరమయిన వానిలో శుభకరమయినదానవు; నిరతమును విష్ణునిచే ధరించబడుదానవు; ఇట్టి నీవు నాకు శాంతినిమ్మ. 3. వృషభమునకు: వృషభ రూపముననుండి జగదానంద కారకుడవగు ధర్మదేవా! నీవు అష్టమూ ర్తి యగు శివునకు అధిష్ఠాన (వాహన) మవు; ఇట్టి నీవు మాకు శాంతి కలిగింపుము. 4. స్వర్ణమునకు: సువర్ణము బ్రహ్మాదేవుని గర్భమునందుండునది; అగ్నికి బీజరూపమయినది; అనంతమగు పుణ్యఫలమునిచ్చునది; ఇట్టి నీవు నాకు శాంతినిమ్ము. 5. పీతాంబరములకు: పీతాంబరముల జత వాసుదేవునకు ప్రియమైనది; విష్ణుదేవుని దానవగు నిన్ను ఇచ్చుటవలన నీవు నాకు శాంతినిమ్ము. 6. అశ్వమునకు: అమృతముతోపాటు జన్మించిన అశ్వరూపమగు విష్ణూ! నీవు సదా ఇంద్రునకును రవికిని వాహనమవు; ఇట్టి నీవు మాకు శా న్తినిమ్ము. 7. శనికి దానము చేయు కృష్ణగోవునకు: నీవే భూమి యంతయు నయియున్నావు; ధేను రూపమవు; విష్ణు సమానురాలవు; సర్వపాపహరవు; ఇట్టి నీవు మాకు శాంతినిమ్ము; చతుర్దశ భువనములును గోవుల అవయవముల యందే ఉండును. నీవలననే శుభము కలుగును; ఇట్టి నీవు మాకు శాంతినిమ్ము. 8. ఇనుమునకు: ఆయసమా! అన్ని పనులును నాగళ్ళు ఆయుధములు మొదలగున వన్నియును నీయధీనములై యున్నవి. ఇట్టి నీవు మాకు శాంతినిమ్ము; 9. ఛాగమునకు: నీవు అన్ని యజ్ఞములకును అంగమయి యున్నావు; అగ్నికి వాహనమవు; ఇట్టి నీవు మాకు శాంతినిమ్ము; 10. శయ్యాదానమునకు: శివకేశవుల శయనము ఎన్నడును అశూన్యమై యుండును. కావున వారి దయచే అట్లే జన్మజన్మముల నా శయనము కూడ అశూన్యమయి యుండుగాక! 11. రత్న దానమునకు: సర్వ రత్నములయందును సర్వదేవతలును సన్ని హితులై యుందురు; కావున వారందరును నేచేయు రత్న దానముచే నాకు శాంతినిత్తురుగాక! 12. భూదానమునకు: ఇతర దానము లేవియు భూదానములోని పదునారవవంతునకు సరిపోలవు; కావున భూదానముచే నాకు శాంతి లభించుగాక!

యజయానుడు మాత్సర్యము (పోటీభావము) లేక భక్తితో విప్రులను వస్త్రాలంకార రత్న గంధ మాల్యాను లేపనములతో సంపూజించవలయును.

ఈ విధానమున గ్రహ యజ్ఞము నాచరించువాడు ఇహమున సర్వకామములను పూర్ణములనొనరించుకొని పరమున స్వర్గమున పూజితుడై సుఖించును.

ఎంత అల్పధనుడై నను తన ఎడతెగక పీడించుచుండు గ్రహమును యథాశ క్తిగ పూజించి ఇతర గ్రహములను కూడ అర్చించవలయును.

గ్రహములను గోవులును ప్రభువులును విశేషించి బ్రాహ్మణులును పూజితులయినచో తమ్ము పూజించినవారిని తామును పూజింతురు. (ప్రీతితో చూచెదరు.) అవమానింపబడినపుడు తమ్మవమానించిన వానిని తామును అవమానింతురు. (సుఖింపజేయవలెనని తలచరు.) కావున (ఏ కర్మమునగాని) క్షేమము కలుగవలెననుకొనినవాడెవ్వడు దక్షిణాహీనముగ కార్యము నాచరించరాదు. ఏలయన సంపూర్ణమగు దక్షిణతో ఒక్కడైనను తృప్తినొందినను దానిచే యజమానునకు క్షేమము కలుగును.

నవగ్రహ మఖమను పేరుతో ప్రసిద్ధమయియున్న ఈ «అయుత హోమము వివాహములు ఉత్సవములు యజ్ఞములు ప్రతిష్ఠలు విఘ్నములు ఉద్వేగము అద్భుత దర్శనములు మొదలగు సందర్భములందు క్షేమమును శుభమును కలిగించును.

లక్షహోమవిధిః

కథితో7యుత హోమో7యం లక్షహోమ మత శ్శృణు |

వైశమ్పాయనః : సర్వకామా ప్తయే యస్మా ల్లక్షహోమం విదు ర్బుదాః 91

పితౄణాం వల్లభం సాక్షా ద్భు క్తిము క్తిఫలప్రదమ్‌ | గ్రహతారాబలం లబ్ధ్వా కృత్వా బ్రాహ్మణవాచనమ్‌. 92

గృహస్యో త్తరపూర్వేణ మణ్డపం కారయేద్బుదః | రుద్రాయతన భూమౌవా చతురశ్ర ముదఙ్ముఖమ్‌. 93

దశ హ స్త మథాష్టౌవా హస్తా న్కుర్యా ద్విధానతః |

ప్రాగుదక్ర్పవణాం భూమిం కారయే ద్యత్నతో నరః. 94

పాగు త్తరం సమాసాద్య వ్రదేశం మణ్డపస్యతు | శోభనం కారయే త్కుణ్డం యథావ ల్లక్షణాన్వితమ్‌. 95

నవగ్రహమఘే కుణ్డం హ స్తమాత్రం ప్రశస్యతే | చతురశ్రం సమం కుర్యా ద్యోనివ క్త్రం సమేఖలమ్‌. 96

చతురఙ్గుళవిస్తారా మేఖలా తద్వ దుచ్ర్ఛితా | ప్రాగుదక్ప్రవణా కార్యా సర్వత స్సమవి స్తృతా. 97

శా న్త్యర్థం సర్వలోకానాం నవగ్రహమఘ స్స్మృతః | మానహీనాధికం కుణ్డమనేకభయదం భ##వేత్‌. 98

యస్మాత్తస్మా త్సుసమ్పూర్ణం శాన్తికుణ్డం విధీయతే | అస్మా ద్దశగుణః ప్రోక్తో లక్షహోమ స్స్వయమ్భువా.

ఆహుతీభిః ప్రయత్నేన దక్షిణాభి స్తథైవచ | ద్విహ స్తవిస్తృతం తద్వ చ్చ తుర్హస్తాయతం పునః. 100

లక్షహోమే భ##వే త్కుణ్డం యోనివ క్త్రం సమేఖలమ్‌ | తసై#్యవోత్తరపూర్వేణ విత్త స్తిత్రయసమ్మితమ్‌. 102

ప్రాగుదక్ర్పవణం తద్వ చ్చతురశ్రం సమన్తతః | విష్కమ్భస్యోచ్ర్ఛితం ప్రోక్తం స్ధణ్డిలం విశ్వకర్మణా.

సంస్థాపనాయ దేవానాం వప్రత్రయసమావృతమ్‌ | ద్విరఙ్గళోచ్ర్ఛితో వప్రః ప్రథమ స్సముదాహృతః. 103

అఙ్గుళోచ్ర్ఛయసంయుక్తం వప్రద్వయ మథోపరి | త్ర్యఙ్గుళ స్తస్య విస్తార స్సర్వేషాం కథ్యతే బుధైః 104

దశాఙ్గుళోచ్ర్ఛితా భి త్తి స్థ్సణ్డిలస్య తథోపరి |

______________________________________________

« ఈ యాగ ప్రక్రియయందు ఆవాహన ప్రతిష్ఠాపన పూజనములందుకొను గ్రహ దేవతాదికము ముప్పది రెండు మంది. వీరికి దధి-మధు-సర్పిస్సులలో వేరువేరుగ ముంచిన సమిధలతో నూట ఎనిమిదికాని నూట ఇరువది ఎనిమిదికాని ఆహుతులను వేల్చవలెను. 32´3´108=10368; లేదా 32´3´128=12288 అగును; ఇది కొంచెమెక్కువగా అయుతము=10000 అగుచున్నది. కనుక ఈ హోమమునకు అయుత హోమమని వ్యవహారము ఏర్పడినది.

లక్షహోమమను గ్రహయజ్ఞము.

ఇంతవరకును అయుత హోమ గ్రహయజ్ఞ విధానము తెలిపితిని. ఇకమీదట లక్ష హోమ విధానమును తెలిపెదను. ఇది సర్వ కామముల నెరవేర్చునది. పితృదేవతలకు ప్రీతికరమయినది. సాక్షాత్‌గా (మరియొక కర్మ సాధనముతో పనిలేక) భు క్తిము క్తిఫలము నిచ్చునది.

శుభ దినమున తారాబల గ్రహబలములు కల శుభ సమయమున బ్రాహ్మణులచేత పుణ్యాహవాచనము జరిపించి ఈ కార్యమారంభించవలయును. యజమానుడు తన ఇంటికి ఈశాన్యమున గాని శివాలయ ప్రదేశమున గాని చతురస్రముగ ఉదఙ్ముఖముగా (ఉదక్ల్పవముగా-ఉత్తరపు వైపునకు వాలుగా) ఉండు మండపమును నిర్మించవలయును. ఆ మండపపు భుజము పది హ స్తములుగాని ఎనిమిది హ స్తములు కాని ఉండవలయును. వీలునుబట్టి మండపపు నేల ఉ త్తరమునకో తూర్పనకో వాలుగా ఉండునట్లు చూడవలయును. ఈ మండపమునకు ఈశాన్యమున లక్షణ యుక్తమును హ స్త మాత్రము పొడుగు వెడల్పు లోతులుకల కుండమును యోని రూపమగు ముఖముతో (యోని=త్రిభుజము-=Triangle)తో నిర్మించవలయును. ఈ కుండమునకు నాలుగు వైపులను మేఖల (అంచుకట్ట) నాలుగు భారతీయాంగుళముల వెడల్పు ఎత్తులతో ఏర్పరచవలయును. (1 భారతీయాంగుళము=8 యవోదరములు-యవలు అడ్డముగా ఒకదాని ప్రక్కను మరియొకటి ఉంచగా ఏర్పడు దూరము.) ఈ వేఖలయును ఉ త్తరమునకుగాని తూర్పునకు గాని వాలుగాను అంతట ఒకే కొలతతో ఉండవలయును. (అనగా ఆ మేఖల వెంట వెలుపలకు గాని లోపలికి గాని నడుమ నడుమ పెంపుదల దిబ్బలవంటివి ఉండరాదు.) ఇంత చెప్పుట ఏలయన నవగ్రహ మఖము సర్వలోక శాంతికై చేయునది కావున అది కొలతలలో ఎక్కువగాని తక్కువగాని యున్నచో శాంతి కలిగించకపోగా భయము కలిగించును. కనుక శాంతి ప్రక్రియకై నిర్మించుకుండము మిక్కిలి సంపూర్ణముగను శాస్త్రీయముగను నుండవలయును. (దీనియందలి కొలతలు మాత్రము అయుత హోమ విధానమునకు సంబంధించినవి.)

అయుతహోమగ్రహయజ్ఞమునందలి ఆహుతులకు పదిరెట్ల ఆహుతులు కలది లక్ష హోమ గ్రహయజ్ఞము. ఋత్విక్సంఖ్య కూడ పదింతలు ఉండును కావున యథాశ క్తిగ దక్షిణలును అయుతహోమమునందుకంటె పదింతలుగా ఉండవలయును. ఈ లక్ష హోమ గ్రహ యజ్ఞమునకై మండపమునకు ఈశాన్యమున రెండు హ స్తముల వెడలుపు నాలుగు హ స్తముల పొడవుగల దీర్ఘ చతురస్రాకారపు కుండము (లోతు చెప్పబడలేదు.) త్రవ్యవలెను. దానికి ముందు యోని రూపమయిన ముఖమును కు డము చుట్టు పైని చెప్పినట్లు మేఖలయు ఉండవలయును. ఈ కుండమునకు ఈశాన్యమున మూడు జేనల కొలతతో చతురస్రాకారపు అరుగును ఉ త్తరమునకుగాని తూర్పనకుగాని వాలుగా దేవతా77వాహన ప్రతిష్ఠాపనములకై ఏర్పరచవలయును. దీనికి చుట్టును మూడు ప్రాకారములుండవలెను. అన్నిటిలో మొదటిది స్థండిలమునకు వెలుపల రెండు అంగుళములు దానికి వెలుపలిది (నడుమది)యు-దానికి వెలుపలిది (అన్నిటిలో బయటిది)యు ఒక్కొక్క అంగుళము ఎత్తున ఉండవలెను. స్థండిలముపై దాని బయటి అంచుమీద పది అంగుళముల ఎత్తున ప్రాకారము ఉండవలెను. వెడల్పు మాత్రము అన్నిటికిని మూడంగుళములే.

తస్మిన్నావాహయే ద్దేవా న్పూర్వవ త్పుష్పతణ్డులైలః. 105

ఆదిత్యాభిముఖా స్సర్వా స్సాధిప్రత్యధిదేవతాః | స్థాపనీయా మునిశ్రేష్ఠ నా న్తరేణ పరాఙ్ముభాః. 106

గరుత్మా నధిక స్తత్ర సమ్పూజ్య శ్ర్శియ మిచ్ఛతా | సామధ్వనిశరీర స్త్వం వాహనం పరమేష్ఠినః. 107

విషపాపహరో నిత్య మతశ్శాన్తిం ప్రయచ్ఛమే |

పూర్వవత్కుమ్భ మామన్త్ర్య తద్వ ద్ధోమం సమాచరేత్‌. 108

సహస్రాణాం శతం హుత్వా సమిత్సఙ్ఖ్యాదికం పునః | ఘృతకుమ్భం వసోర్ధారాం పాతయే దనలోపరి. 109

ఔదుమ్బరీ మథార్ద్రాంచ ఋజ్వీం కోటరవర్జితామ్‌ |

బాహుమాత్రాం స్రుచం కృత్వా న్య సే త్త్సమ్భద్వయోపరి. 110

ఘృతధారాం తత స్సమ్య గగ్నే రుపరి పాతయేత్‌ | శ్రావయేత్సూక్తమాగ్నేయం వైష్ణవం రుద్రమైన్దవమ్‌.

మహావైశ్వానరం సామ జ్యేష్ఠసామచ పాతయేత్‌ | స్నానంచ యజమానస్య పూర్వవ త్స్వస్తివాచనమ్‌.

దాతవ్యా యజమానేన పూర్వవ ద్దక్షిణా పృథక్‌ | కామక్రోధవిహీనేన ఋత్విగ్భ్య శ్శాన్తచేతసా. 113

నవగ్రహమఘే విప్రా శ్చత్వారో వేదవాదినః | అథవా ఋత్విజౌ శాన్తౌ ద్వావేవ శ్రుతికోవిదౌ. 114

కార్యా వయుతహోమేచ న ప్రసజ్యేత వి స్తరమ్‌(రే) | తద్వ ద్ద్వాదశ వాష్టౌ వా లక్షహోమే తు ఋత్విజః.

కర్తవ్యా శ్శక్తి త స్తద్వ చ్చతురో వా విమత్సరాః |

ఈ స్థండిలమునందు వెనుకటివలె పూవులతో తండులములతో గ్రహతదధిదేవతా ప్రత్యధి దేవతలు ఆవాహితులై వీరెల్లరును ఆదిత్యునకుఅభిముఖులై యుండవలయును. అంతేకాని రవికి వీరిలో నెవరును పెడమొగమయి యుండరాదు. ఈ లక్ష హోమ విధానమునందు గరుత్మంతు నధికముగా నావాహనము చేయుటవలన అధిక క్షేమము కలుగును. (గరుడా వాహన మంత్రార్థము:) ''నీవు సామవేద శరీరుడవు; పరమేష్ఠి (విష్ణునకు) వాహనమవు; సదా విషహరుడవు; పాపహరుడవు: కావున ఇట్టి నీవు మాకు శాంతిని కలిగింపుము'' వెనుకటివలెనే యజమానుని స్నానమునకై జలకుంభమును సిద్ధపరచి ఆమంత్రించవలెను. పిమ్మట హోమమాచరించవలెను. లక్ష సమిధలను లెక్కించి ఆహుతులవేల్చి ఘృత కుంభమును వసు ధారను (ఆయా నాణములు కాని వెండి బంగారు రత్నములు కాని ధారగా) అగ్ని పై పడవేయవలెను. వంకరలేనిదియు తొర్రలు లేనిదియు భుజ మాత్రము పొడవు కలదియునగు పచ్చి మేడి కర్రను స్రుక్‌గా చేసి (మండపపు) రెండు స్తంభముల మీదకు మచ్చునట్లు ఉంచవలెను. అట్లే హోమ సమయమునందు చక్కగా నేతిధారను కూడ అగ్నిపై వదలవలెను. అగ్ని విష్ణు రుద్ర సూ క్తములను మహా వై శ్వానర సామ జ్యేష్ఠసామములను పఠించవలయును. వెనుకటివలెనే యజమానున కభిషేకమును స్వస్తి వాచనమును జరుపవలెను. వెనుకటి వలెనే యజమానుడు కామక్రోధ రహితమగు శాంత చిత్తముతో ఋత్విక్కులకు వేరువేరుగా దక్షిణల నీయవలెను.

అయుత హోమము అనెడు నవగ్రహ మఖ (యజ్ఞ) మునందు వేదవాదులు శాంతులగు నలుగురుగాని ఇద్ద రే కాని ఋత్విక్కులు చాలును. అంతకంటె వి స్తరము పనికిరాదు. అట్లే లక్షహోమ విధానమునందు పండ్రెండు మందికాని ఎనిమిది మందికాని నలుగురేకాని చాలును.

నవగ్రహమ ఘే సర్వం లక్షహోమే దశో త్తరమ్‌. 116

భక్త్యా దద్యా న్ముని శ్రేష్ఠ భూషణాన్యపి శ క్తితః | సువస్త్రాణిచ హైమాని కటకానిచ శ క్తితః. 117

కర్ణాఙ్గుళీయచిత్రాణి కణ్ఠసూత్రాణి శ క్తిమా& | న కుర్యా ద్దక్షిణాహీనం విత్తశాఠ్యేన మానవః. 118

అదద ల్లోభమోహోత్తు కులక్షయ మవాప్ను యాత్‌ | అన్నదానం యథాశక్త్యా దాతవ్యం భూతి మిచ్ఛతా.

అన్నహీనః కృతో యస్మా ద్దుర్భిక్షఫలదో భ##వేత్‌ | అన్నహీనో ద హే ద్రాష్ట్రం మన్త్రహీనస్తు ఋత్విజః.

యజమాన మదాక్షిణ్యో నాస్తి యజ్ఞసమో రిపుః | అతో నాల్ప ధనః కుర్యా ల్లక్షహోమం నరః క్వచిత్‌.

తస్మా త్పీడాకరో నిత్యం య ఏవ భవతి గ్రహః | తమేవ పూజయే ద్భక్త్యా ద్వౌ వా త్రీన్వా యథావిధి.

ఏక మభ్యర్చయే ద్భక్త్యా బ్రాహ్మణం వేదపారగమ్‌ | దక్షిణాభిః ప్రయత్నేన బహూనప్యల్పవిత్తవా&.

లక్షహోమస్తు క ర్తవ్యో యథా (దా) విత్తం భ##వే ద్గృ హే |

యత స్సర్వా నవాప్నోతి సర్వా న్కామా న్విధానతః. 124

పూజ్యతే శివలోకేచ వస్వాదిత్యమరుద్గణౖః | యావత్కల్పశతా న్యష్టా వథ మోక్ష మవాప్ను యాత్‌. 125

నకామో యస్త్విమం కుర్యా లక్షహోమం యథావిధి |

సర్వా న్కామా నవాప్నోతి పద మాన స్త్య మశ్నుతే. 126

పుత్త్రార్థీ లభ##తే పుత్త్రా& ధనార్థీ లభ##తే ధనమ్‌ | భార్యార్థీ శోభనాం భార్యాం కుమారీ శోభనం పతిమ్‌. 127

భ్రష్టరాజ్య స్తథా రాజ్యాం శ్రీకామ శ్ర్శియ మాప్ను యాత్‌ |

యం యం కామయతే కామం సవై భవతి పుష్కలః. 128

నిష్కామః కురుతే యస్తు స పరం బ్రహ్మ గచ్ఛతి |

మిగిలిన అంశములన్నియు లక్ష హోమ విధానమునందు అయుత హోమ విధానమునందుకంటె పది రెట్లుండవలయును. భ క్తితో మంచి వస్త్రములను బంగారు సొమ్ములను కడియుములను చెవి పోగులను ఉంగరములను కంఠసూత్రములను కూడ శ క్తియున్నచో ఈయవలయును. శ క్తి ఉండియు కొంటెతనముతోను లోభముతోను దక్షిణల విషయమున కొరత చేయరాదు. లోభ మోహములచే సరిగా దక్షిణలనీయనిచో కులక్షయమగును.

తనకు క్షేమము కలుగవలెనని కోరువాడు యథాశ క్తిగా అన్నదానమును చేయవలెను. ఏలయన అన్న దానహీనముగా చేసిన కార్యము వలన దుర్భిక్షము కలుగును. అన్న హీనముగా జరిపిన యజ్ఞము రాష్ట్రమును మంత్రహీనయజ్ఞము ఋత్విక్కులను దక్షిణలు కొరతగా జరిగిన యజ్ఞము యజమానుని దహించును. కొరతలతో జరిగిన యజ్ఞము వంటి శత్రువు (అపకారకము) మరియొకటిలేదు.

(అశక్తుని విషయమ:) ఈ కారణములచేత తగినంత ధనము లేనివాడు ఎప్పుడు ఎట్టి స్థితియందును లక్ష హోమగ్రహ యజ్ఞము చేయరాదు. తనకు పీడాకరములుగా నున్న ఒకటి రెండు మూడు గ్రహములను మాత్రమే (తనకు గల శ క్తిని బట్టి యథావిధిగ పూజించవలెను. వేద పారంగతుడగు ఒకే బ్రాహ్మణునైన (ఎక్కువమందికి మారుగా) దక్షిణలతో అర్చించవలెను.

లక్ష హోమగ్రహ యజ్ఞపు విశిష్టత: యజమానుడు తనకు ఇంటియందుగల ధనావకాశమును బట్టి లక్షహోమగ్రహ యజ్ఞమును యథావిధిగా చేయవలెను. దీనిని సరిగా నాచరించినచో ఇహమున సర్వకామ పూర్తియగును. పరమునను ఎనిమిది వందల కల్పముల కాలము వస్వాదిత్య మరుద్గణములచే పూజింపబడును శివలోకమున సుఖించును. పిమ్మట ము క్తిని పొందును. సకామముగా (అనగా-కోరికలు తీరవలెనని సంకల్పించి) ఈ లక్ష హోమ గ్రహయజ్ఞమును యథావిధిగా జరిపించుకొనినచో సర్వ కామములను నెరవేరి అనంతమగు (మోక్ష) స్థానమును పొందును. పుత్త్రార్థి పుత్త్రులను ధనార్థి ధనమును భార్యార్థి శోభనయగు భార్యను కుమారి శోభనుడగు పతిని భ్రష్టరాజ్యుడు మరల రాజ్యమును శ్రీకాముడు (కీ ర్తి-ఆయువు-ఆరోగ్యము మొదలగువానిచే ప్రకాశము కోరువాడు) అట్టి శ్రీని పొందును. ఇట్లు ఏఏ కోరిక కోరినచో అది ఎల్ల పుష్క లముగ నెరవేరును. నిష్కాముడై ఆచరించువాడు పరబ్రహ్మ సాయుజ్యమును పొందును.

కోటిహోమవిధిః

తస్మా చ్ఛతగుణః ప్రోక్తః కోటిహోమ స్స్వయుమ్భువా. 129

ఆహుతిభిః ప్రయత్నేన దక్షిణాభిః ఫలేనచ | పూర్వవ ద్గ్రహదేవానా మావాహనవిసర్జనమ్‌. 130

హోమమాన్త్రా స్త ఏవోక్తా స్స్నానే దానే తథైవచ | కుణ్డమణ్డపవేదీనాం వి శేషో7యం నిబోధ మే. 131

కోటిహోమే చతుర్హస్తం చతురశ్రం సమ న్తతః | యోనిచక్రద్వయోపేతం తద ప్యాహు స్త్రిమేఖలమ్‌. 132

ద్వఙ్గుళాభ్యుచ్ర్ఛితా కార్యా ప్రథమా మేఖలా బుధైః |

త్ర్యఙ్గుళాభ్యుచ్ర్ఛితా తద్వ ద్ద్వితీయా పరికీర్తితా. 133

ఉచ్ర్ఛయే విస్తరే చైవ తృతీయా చతురఙ్గుళా | ద్వ్యఙ్గుళ##శ్చైవ విస్తారః పూర్వమేవ ప్రశస్యతే. 134

విత స్తిమాత్రా యోని స్స్యా త్షట్సప్తాఙ్గల విస్తృతా |

కూర్మ పృష్ఠోన్నతా మధ్యే పార్శ్వయో శ్చాఙ్గులోచ్ర్ఛితా. 135

గజాస్యసదృశీ తద్వ దాయతా చ్ఛిద్రసంయుతా | ఏతత్సర్వేషు కుణ్డషు యోనిలక్షణ ముచ్యతే. 136

మేఖలోపరి సర్వత్ర అశ్వత్థదళసన్నిభమ్‌ | వేదిశ్చ కోటిహోవే స్యా ద్విత స్తీనాం చతుష్టయమ్‌. 137

చతురశ్రం సమన్తాత్తు త్రిభి ర్వపై#్ర స్సమాసతః | వప్రమానం చ పూర్వోక్తం వేదీనాంచ తథోచ్ర్ఛయాః.

తథా షోడశ హ స్త స్స్యాన్మణ్డపశ్చ చతుర్ముఖః |

కోటి హోమగ్రహ యజ్ఞము

ఈ చెప్పిన లక్ష హోమగ్రహ యజ్ఞమునకు నూరింతలగునది కోటి హోమగ్రహ యజ్ఞమని స్వయంభూబ్రహ్మ చెప్పెను. ఆహుతులు-దక్షిణలు-కలుగు ఫలము-అన్ని విషయములందును ఇది దానికి నూరింతలుగానుండును.

దీనియందును గ్రహములు-తదధిదేవతా ప్రత్యధిదేవతలు-వీరి ఆవాహన విసర్జనములందు హోమమునందు స్నాన దానములందు వినియోగించవలసిన మంత్రములును జరుపవలసిన ప్రక్రియయు లక్ష హోమమునందువలెనే యుండును. కుండము మండపము-వేదికలు-వీని విషయమున మాత్రము భేదము కలదు; అది తెలిపెదను.

కోటిహోమమునందు కుండము చతురస్రముగా నాలుగు హ స్తములు పొడవు వెడలుపు లోతులు కలిగి ఉండవలెను. దానికి అంగములుగా యోని చక్రములు రెండుండవలెను. కుండమునకు చుట్టును మేఖలలు (వప్రములు-కుండమునకు నలువై పులనండు అంచు కట్టలవంటి చిరుగోడలు) మూడుండవలెను. వీనిలో (లోపలినుండి) మొదటిది రెండంగుళములు రెండవది మూడంగుళములు మూడవది నాలుగంగుళములు ఎత్తు కలిగియుండవలెను. వెడల్పు వరుసగా రెండు-రెండు-నాలుగు-అంగుళములుండవలెను. యోని లక్షణము: ఏనుగు ముఖమువలె త్రిభుజాకారము కలిగి తాబేటి వీపువలె నడుమ ఎత్తుగను రెండు ప్రక్కలందును తక్కువ ఎత్తుతో నుండవలెను. దీని ఎత్తు (నడుమ భాగమున) వితస్తి (జేనెడు-పండ్రెండంగుళములు) ఒక్కొక్క భుజపు కొలత ఆరు కాని ఏడు కాని అంగుళములుండవలెను. రంధ్రములు నుండవలెను. ఇది అన్ని కుండముల విషయమునను కుండమునకు ముందుండవలసిన యోనుల లక్షణము. ప్రతియొక మేఖలమీదను అచటనచట రావి ఆకు ఆకృతిని ఏర్పరచవలెను. కోటి హోమగ్రహ యజ్ఞమునందు వేది నాలుగు వితస్తుల (విత స్తి=12 భారతీయాంగుళములు) కొలతకల భుజములతో చతురస్రముగా ఉండవలెను. వప్రముల (వేఖలల) ఎత్తును వేదికల ఎత్తును లోగడనే చెప్పబడినది. మండపము పదునారు హ స్తముల భుజములతో చతురస్రముగా ఉండవలెను.

పూర్వద్వారేచ సంస్థాప్య బహ్వృచం వేదపారగమ్‌. 139

యజుర్విదం తథా యామ్యే పశ్చిమే సామవేదినమ్‌ | అథర్వవేదినం తద్వ దు త్తరే స్థాపయే ద్బుధః. 140

అష్టౌచ హౌమికాః కార్యా వేదవేదాఙ్గవేదినః | ఏవం ద్వాదశ తా న్విప్రా న్వస్త్రమాల్యానులేపనైః. 141

పూర్వవ త్పూజయేద్భక్త్యా సర్వాభరణభూషణౖః | రాత్రిసూ క్తంచ రౌద్రంచ పావమానం సుమఙ్గళమ్‌. 142

పూర్వతో బహ్వృచ శ్శాన్తిం పఠ న్నాస్త ఉదఙ్ముఖః |

శా క్తం రౌద్రంచ సౌమ్యంచ కూశ్మాణ్డం శా న్తి మేవచ. 143

పాఠయే ద్దక్షిణద్వారి యజుర్వేదిన ముత్తమమ్‌ | సౌపర్ణమథ వై రాజ మాగ్నే యం రౌద్రసంహితామ్‌. 144

జ్యేష్ఠసామ తథా శా న్తిం ఛన్దోగః పశ్చిమే పఠేత్‌ | శాన్తిసూ క్తంచ సౌరంచ తథా సంవరణం శుభమ్‌. 145

పౌష్టికం సమహారాజ ముత్తరేణా ప్యథర్వవిత్‌ |

పఞ్చభి స్సప్తభి ర్వా7పి హోమః కార్యో7థ పూర్వవత్‌. 146

స్నానే దానేచ మన్త్రా స్స్యుస్త ఏవ మునిస త్తమ | వసోర్ధారా విదానంచ లక్షహోమవదిష్యతే. 147

అనేన విధినా యస్తు కోటిహోమం సమాచరేత్‌| సర్వాన్కామా నవాప్నోతి తతో విష్ణుపదం ప్రజేత్‌. 148

యః పఠే చ్ఛృణు యాద్వాపి గ్రహయజ్ఞత్రయం నరః | సర్వపాపవిశుద్ధాత్మాపదమిన్ద్రస్య గచ్ఛతి. 149

అశ్వమేధసహస్రాణి దశ చాష్టౌచ ధర్మవిత్‌ | కృత్వా యత్ఫల మాప్నోతి కోటిహోమా త్తదశ్ను తే. 150

బ్రహ్మహత్యాసహస్రాణి భ్రూణహత్యార్బుదాన్యపి | కోటిహోమేన నశ్యన్తి యథావ చ్ఛివభాషితమ్‌. 151

(ఋత్వికుల స్థానములు): ఈ మండపమున ఋగ్వేద పారంగతుతని తూర్పు ద్వారమునను యజుర్వేదిని దక్షిణ ద్వారమునను సామవేదిని పశ్చిమ ద్వారమునను అథర్వవేదిని ఉత్తర ద్వారమునను నిలుపవలెను. హోమమునకు ఎనిమిది మంది వేద వేదాంగ వే త్తలగు విప్రులను నియమించవలెను. ఈ పండ్రెండు మందిని వస్త్రమాల్యగంధాను లేపనములతో సర్వాభరణములతో పూజించవలెను. (మండపమునందలి ఋత్విక్కులలో) ఋగ్వేది తూర్పద్వారమునందు ఉత్తరపు మొగమై ఉండి రాత్రి సూక్త-రుద్రసూక్త-పవమానసూ క్తములను శుభకరములగు శాంతి సూ క్తములను పఠించుచుండును. దక్షిణ ద్వారమునందలి యజుర్వేది శ క్తి సూ క్త రుద్ర సూ క్త సౌమ్య సూక్తములను శాంతి సూ క్తములను పఠించుచుండును. దక్షిణ ద్వారమునందలి సామవేది సౌపర్ణ వైరాజాగ్నేయ రౌద్ర జ్యేష్ట సామములను శాంతి మంత్రము పఠించుచుండును. పశ్చిమ ద్వారమునందలి సామవేది సౌపర్ణ వైరాజాగ్నేయ రౌద్ర జ్యేష్ఠ సామములను శాంతి మంత్రములను పఠించుచుండును. ఉ త్తర ద్వారమునందు అథర్వ వేది శాంతి-సౌర-సంవరణ-పౌష్టక-మహారాజ-సూక్తములను పఠించుచుండును. వెనుకటివలెనే ఏడు మంది కాని ఐదుమంది కాని హోమము జరుపుదురు. స్నాన దాన మంత్రములను (పుర్ణాహుతియందు) ఘృత కుంభ వసు ధారా విధానములును లక్ష హోమమునందు వలెనే యుండును.

ఈ విధానమున కోటి హోమము నాచరించినవాడు ఇహమున సర్వకామపూర్తినొంది పరమున ము క్తి నొందును. ఈ చెప్పిన మూడు విధములగు గ్రహ యజ్ఞముల విషయమును పఠించినను వినిను సర్వపాప విముక్తుడు శుద్ధాత్ముడునై ఇంద్ర పదమునందును. పదునెనిమిది వేల అశ్వ మేధములను చేసినందువలన పొందునంత ఫలములను ఈ కోటి హోమము నాచరించుటవలననే పొందును. వేల కొలది బ్రహ్మ హత్యలును అర్బుదములు భ్రూణ (సాంగముగ వేదాధ్యయనము చేసిన విప్రుని) హత్యలును చేసినందున కలిగిన పాపములును ఈ కోటి హోమగ్రహ యజ్ఞమునాచరించుటచే నశించునని శివుడే చెప్పెను.

వశ్యాభిచారాదిహోమః.

వశ్యకర్మాభిచారాది తథై వోచ్చాటనాదికమ్‌ | నవగ్రహమఘం కృత్వా తతః కామ్యం సమాచరేత్‌. 152

అన్యథా ఫలదం పుంసాం న కామ్యం జాయతే క్వచిత్‌ |

తస్మా దయుతహోమస్య విదానం పూర్వవ చ్చరేత్‌. 153

వృత్తం చోచ్చాటనే చాపి తథాచ వశ్యకర్మణి | త్రిమేఖలం చైకవ క్త్రం త్ర్యరత్నిం విస్తరేణతు. 154

పలాశసమిధ శ్శస్తా మధుగోరోచనాన్వితాః | చన్దనాగరునా తద్వ త్కుఙ్కుమే నాభిషేచితాః. 155

హావ యే న్మధుసర్పిర్భ్యాం బిల్వాని కమలాని చ | సహస్రాణి దశైవోక్తా స్వర్వథైవ స్వయమ్భువా 156

వశ్యకర్మణి బిల్వానాం చైవ ధర్మవిత్‌ | సుమిత్రియా న ఆపఓషధయ ఇతి హావయేత్‌. 157

నచా త స్థాపనం కార్యం నచ కుమ్భాభిషేచనమ్‌ |

స్నానం సర్వౌషధైః కృత్వా శుక్లపుష్పామ్బరో గృహీ. 158

కణ్ఠసూత్రై స్సకటకై రంగుఏళీయైః పవిత్రకైః | సూక్ష్మవస్త్రాణి దేయాని శుక్లా గావ స్సకాఞ్చనాః. 159

వశ్వాభిచారాది హోమములు.

(వశ్యకర్మ-ఇతరులను లోబరుచుకొనుట; అభిచారము-ద్వేష్యులగువారికి అపకారము చేయుట; ఉచ్చాటనము-పిశాచములు మొదలగువానినుండి విడిపించుట) వశ్య కర్మము ఆభిచార కర్మము ఉచ్చాటన కర్మము నవగ్రహముఖము మొదట జరిపిన తరువాతనే కామ్య కర్మముల నాచరించవలెను. లేనిదే కామ్య కర్మముల నాచరించినను పలితము నీయవు. కనుక కామ్యములగు లక్షహోమ కోటిహోమ గ్రహయజ్ఞముల నాచరించుటకు ముందు వెనుక చెప్పినట్లు అయుత హోమమును ఆవశ్యకతను బట్టి వశ్యమునకు అభిచారమునకు ఉచ్చాటనమునకు జరుపవలెను. ఉచ్చాట నాభిచార వశ్య కర్మములయందు ఒకే ముఖమును మూడు పిడి మూరల వ్యాసమును మూడు మేఖలలును కల కుండమును నిర్మించవలెను. ఈ కర్మములకై సమిధలు పలాశ(మోదుగు) సమిధలు-తేనె గోరోచనము చందనము అగురు కుంకుమము-వీనితో తడిపినవియును తేనెతోను నేతితోను తడిపిన బిల్వ ఫలములును కమలములను ప్రశ స్తములు. ఇట్టివి పదివేల సమిధలు వేల్చవలయును. వశ్య కర్మాదికమునందు దాని సంప్రదాయమునెరిగి బిల్వ ఫలములను'సుమిత్రియా న ఆప ఓషధయః' అను మంత్రముతో హోమము చేయవలయును. వశ్యాది కర్మత్రయమునందును గ్రహ ప్రతిష్ఠచేయు యజమానుడు కుంభ జలముతో స్నానముచేసి శుక్ల పుష్పములను శుక్ల వస్త్రములను ధరించవలయును. ఋత్విక్కులకు బ్రాహ్మణులకు బంగారుతో చేసిన కంఠసూత్రములు కడియములు మురుగులు ఉంగరములు పవిత్రములు సన్నని నూతన వస్త్రములు బంగారుతో అలంకరించిన తెల్లని యావులు దానమీయవలెను.

అవశ్యాని వశం కుక్యా త్సర్వశత్రుబలాన్యపి | అమిత్రాణ్యపి మిత్రాణి హోమా దేవం భవ న్తి హి. 160

విద్వే షేణాభిచారే చ త్రికోణం కుణ్డ మిష్యతే | ద్విమేఖలం ద్రోణముఖం హస్తమాత్రంతు సర్వతః. 161

హోమం కుర్యు స్తతో విప్రా ర క్తమాల్యానులేపనాః | నివీతా లోహితోష్ణీషా లోహితామ్బరధారిణః. 162

నరవాహనయుక్తా స్స్యు ర్పాకుసుమసన్నిభాః | సమిధో వామహస్తేన శ్యేనాస్థిలవసంయుతాః. 163

హోతవ్యా ముక్తకేశైస్తు ధ్యాయద్భి రశివం రిపోః | దుర్మిత్ర్యా స్తసై#్మ సన్తు తథా హుంఫడితిచ. 164

శ్యేనాభిచారమన్రైణ క్షురం సప్తాభిమ న్త్రితమ్‌ | ప్రతిరూపం రిపోః కృత్వా క్షురేణ పరిక ర్తయేత్‌. 165

ద్వేష్యరూపస్య శకలాం స్తథైవాగ్నౌ వినిక్షి పేత్‌ | గ్రహయజ్ఞ విధానంతు స హైవాభిచర న్నరః. 166

విద్వేషిణం తథాకుర్వ న్నైత దేవం సమాచరేత్‌ | ఇహైవ ఫలదం పుంసా మేత న్నాముత్ర శోభనమ్‌.

తస్మా చ్ఛాన్తికమేవాత్ర క ర్తవ్యం భూతి మిచ్ఛతా | గ్రహయజ్ఞత్రయం కుర్వా ద్విత్తశాఠ్యేన వర్జితః. 168

స విష్ణోః పద మాప్నోతి పునరావృత్తిదుర్లభమ్‌ |

య ఇదం శృణుయా న్నిత్యం lశ్రావయేద్వా సమాహితః. 169

న తస్య గ్రహపీడా స్యా న్నచ బన్ధునక్షయః | గ్రహయజ్ఞత్రయం గేహే లిఖితం యస్య తిష్ఠతి. 170

పీడా నచైవ బాలానాం న రోగో న చ బన్ధనమ్‌ | అ శేషయజ్ఞఫలద మశేషాఘవినానమ్‌. 171

కోటిహోమం విదుః ప్రాజ్ఞాః భుక్తిముక్తి ఫలప్రదమ్‌ | అశ్వమేధఫలం ప్రాహు ర్లక్షహోమం ద్విజోత్తమా.

ద్వాదశాహసమ స్తద్వ న్న వగ్రహ మఖ స్స్మృతః |

ఇతి కథిత మిదానీ ముత్సవానన్దహేతు స్సకలకలుషహీరీ దేవయజ్ఞాభిషేకః. 173

పరివఠతి య ఇత్థం య శ్శృణోతి ప్రసఙ్గా దభిభవతి స శ త్రూ నాయురారోగ్యయుక్తః. 174u

ఇతి శ్రీమత్స్యమహాపురాణ వైశమ్పాయనశౌనక సంవాదే గ్రహయజ్ఞ

శాన్తివిధా వయుతహోమాదికథనం నామ ద్వినవతిరమో7ధ్యాయః.

ఇట్లాచరించుటచే వశులుకాని వారిని వశుల చేసికొనవచ్చును. సర్వశత్రు బలములును లొంగిపోవును: అమిత్రులును మిత్రులగుదురు. విద్వేషముతోచేయు ఆభిచారిక కర్మములందు అన్నియు (మూడును) హ స్తమాత్ర భుజములుకలిగి ద్రోణము

______________________________________________

l పఠేద్వాపి

(ఒక విధమగు జలపాత్రము) వంటి ముఖము కలిగి రెండు మేఖలలు కలిగిన త్రిభుజాకృతి కుండము కావలయును. విప్రులు ఎర్రని వస్త్రములు మాల్యములు గంధానులేపనములు తలపాగలు ధరించి జపాపుష్పములవలె వెలుగుచు నరవాహనులై హోమము చేయవలయును. వారు యజ్ఞోపవీతము నివీతముగా ధరించి జుట్టు విరియబోసికొని 'దుర్మిత్ర్యాస్తసై#్మసన్తు' ఇత్యాది మంత్రములను 'హుం ఫట్‌' ఇత్యాది శబ్దములతో ముగియునట్లు ఉచ్చరించుచు యజమానుని శత్రువునకు అశుభము కలుగవలెనని తలంపుకలిగి డేగ ఎముక ముక్కలతో జతపరచిన సమిధలను ఎడమచేతిలో పట్టుకొని వేల్చవలయును. యజమాన శత్రు ప్రతి రూపము (బొమ్మ)ను చేసి యుంచుకొని 'శ్యేనాభిచార' మంత్రముతో ఏడుమారులు మంత్రించిన క్షురము (చురకత్తి)తో ఆ ప్రతిరూపమును క త్తిరించి ఆ ముక్కలనుకూడ ఆభిచారిక మంత్రములతో వేల్చవలయును. కాని ఈ విధమగు ఆభిచారిక గ్రహ హోమమును శాంతిక పౌష్టికాది కామనలతో చేయు గ్రహ యజ్ఞముతో సమాన కాలమున చేయరాదు. (దానికి ముందుగా వేరుగా చేయవలయును.) ఒక వేళ దానినట్లు వేరుగానే చేసినను ఇవి శత్రు నాశము మొదలగు దుష్టము క్రూరమునైన ఐహిక ఫలములనిచ్చునేకాని పారలౌకికముగ శుభము కలిగించక పోగా అశుభమును కలిగించును. కావున ఇహమునను పరమునను వాస్తవమగు శుభమును కోరువారు శాన్తిక పౌష్టిక గ్రహయజ్ఞమునే ఆచరించవలయును.

ధనము విషయములో శాఠ్యము (ఉండియు లోభముచే లేనట్లు నటించి వ్యయము తగినట్లు చేయక కొరత చేయుట) చూపక యథా శ క్తిగా అయుత హోమ-లక్షహోమ-కోటి హోమములనెడు మూడు విధములగు గ్రహ యజ్ఞములను చేయవలయును. అట్లాచరించినవాడు పునరావృత్తి రహితమును దుర్లభమునునగు విష్ణు స్థానమును పొందును. సమాహితుడై దీనిని వినినను ఇతరులకు వినిపించినను అట్టి వారికి గ్రహపీడకాని బంధు జనులకు అరిష్టముకాని కలుగదు. ఈ గ్రహయజ్ఞత్రయ విధానమును లిఖించి ఇంటిలో ఉంచుకొనినచో అట్టి వారికి బాలుర కనారోగ్యముకాని పీడకాని ఆ కుటుంబము వారికి రోగముకాని బంధనముకాని కలుగదు. అందునను కోటిహోమ యజ్ఞము భ క్తి ము క్తి ఫలదము! లక్ష హోమ గ్రహ యజ్ఞము అశ్వమేధయాగ ఫలదము. అయుత హోమ నవగ్రహ మఖము ద్వాదశాహమను శ్రౌతయజ్ఞమునంత ఫలము నిచ్చును.

ఈ చెప్పిన గ్రహయజ్ఞ విధానమంతయు ఉత్సవము చేసిన ఆనందమును కలిగించును; సకల కలుషముల హరించును; ప్రాసంగికముగ దీనిని చదివిన వారును వినిన ఖవారును ఆయురారోగ్య యుక్తులగుదురు; శత్రువులనణగ ద్రొక్కుదురు.

ఇది శ్రీమత్స్య మహాపురాణమున అయుత హోమాది గ్రహయజ్ఞ త్రయకథనమను తొంబది రెండవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters