Sri Matsya Mahapuranam-1    Chapters   

సప్తాశీతితమో7ధ్యాయః.

కార్పాసపర్వతదానమ్‌.

ఈశ్వరః: కార్పాసపర్వత స్తద్వ ద్వింశ ద్భారై రిహోత్తమః l

దశభిర్మధ్యమః ప్రోక్తః కనిష్ఠ: పఞ్చభి స్స్మృతః. 1

భారేణాల్పధనో దద్యా ద్విత్తశాఠ్య వివర్జితః l ధాన్యపర్వతవ త్సర్వ మాసాద్య మునిపుఙ్గవ.2

ప్రభాతాయాంతు శర్వర్యాం దద్యాదిద ముదీరయేత్‌ l త్వమేవావరణం యస్మాల్లోకానా మిహ సర్వదా. 3

కార్పాసాద్రే నమస్తుభ్యం మమాఘం త్వ మతో నుద l

ఇతి కార్పాసశైలేన్ద్రం యో దద్యా చ్ఛర్వ సంనిధౌ. 4

రుద్రలోకే వ సేత్కల్పం తతో రాజా భ##వే దిహ. 4u

ఇతి శ్రీమత్స్యమహాపురాణ కార్పాసాద్రిదానమాహాత్య్మ కథనం నామ సప్తాశీతితమో7ధ్యాయః.

ఎనుబది ఏడవ అధ్యాయము.

కార్పాస (దూది) పర్వత దానము.

ఈశ్వరుడు నారదునితో ఇట్లు చెప్పెను : ఇదే విధముగ కార్పాసపర్వత దానమును గలదు. దానికై పదికాని ఐదుకాని శక్తిలేకున్నచో ఒకటికాని బారువల దూదితో శక్తి యుండియు వంచన చేయక పర్వతముల నిర్మించవలెను. అన్ని యంశము లందును ధాన్యపర్వతమువిషయమునవలెనే చేయవలయును. దాన దినపు ఉదయమున( దానకాలమున) ఈ మంత్రము చెప్పవలయును: కార్పాస పపర్వతమా ! లోకములకు ఎల్లప్పుడును ఆచ్ఛాదనము చేయు (కప్పెడి) సాధనము నీవేకదా ! (వస్త్ర రూపమున దూది ప్రాణుల శరీరమును కప్పుచున్నది.) నీకు నమస్కారము; ఇట్టి నీవు నా పాపములను పోగొట్టుము. ఇట్లు చెప్పుచు శివ సన్నిధియందు కార్పాస పర్వత దానము చేయువాడు కల్పమంత కాలము రుద్రలోకమున వసించి మరల కల్పాది సృష్ణియందు రాజైపుట్టును.

ఇది శ్రీమత్స్య మహాపుపరాణమున కార్పాస పర్వత దానమాపహాత్య్మ కథనమను ఎనుబది ఏడవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters