Sri Matsya Mahapuranam-1    Chapters   

పంచాశీతితమో7ధ్యాయః.

సువర్ణపర్వతదానమ్‌.

ఈశ్వర ః : అథ పావహరం వక్ష్యే సువర్ణాచల ముత్తమమ్‌ |

యస్య ప్రసాదా ద్భవనం వైరిఞ్చం యాతి మానవః. 1

ఉత్తమః పలసాహస్రం మధ్యమః పఞ్చభి శ్శతైః | తదర్దేనాధమ స్తద్వ దల్పవితోపి శక్తితః. 2

దద్యా దేకపలా దూర్ద్వం యథాశక్త్వా విమత్సరః | ధాన్యపర్వతవ త్సర్వం విద్యధ్యా న్మునిపుఙ్గవ. 3

విష్కమ్భశైలాం స్తద్వచ్చ ఋత్విగ్భ్యః ప్రతిపాదయేత్‌ |

నమస్తే బ్రహ్మవిద్యాయ l బ్రహ్మగర్భాయ తే నమః. 4

యస్మా దనన్తఫలద స్తస్మా త్పాహి శిలోచ్చయ |

యస్మా దగ్నేరపత్యం త్వం యస్మా దల్పం జగత్పతేః. 5

హేమపర్వతరూపేణ తస్మా త్పాహి నగోత్తమ | అనేన విధినా యస్తు దద్యా త్కనకపర్వతమ్‌. 6

స యాతి పరమం బ్రహ్మలోక మానన్దకారకమ్‌ | తత్ర కల్పశతం తిష్ఠే త్తతో యాతి పరాం గతిమ్‌. 7

ఇతి శ్రీ మత్య్సమహాపురాణ కనకపర్వతదానమాహాత్య్మ కథనం నామ పఞ్చా శీతితమో7ధ్యాయః.

ఎనుబది ఐదవ అధ్యాయము

సువర్ణ పర్వత దానము.

ఈశ్వరుడు నారదునకిట్లు చెప్పెను : ఇప్పుడిక సువర్ణ పర్వత దానమును తెలపుదును. అది పాపహారమును ఉత్తమమును. దానిని చేసిన పుణ్య ప్రభావమున మానవులు బ్రహ్మలోకమున సుఖింతురు. దీనికై బంగారు వేయి పలములు కాని ఐదువందల పలములు కాని దానిలో సగముకాని మరియు శక్తిలేనివాడు యథాశక్తిగ బంగారు వినియోగించవచ్చును. ఒక పలమునకు తక్కువ కాకుండావలెను. కాని ఈ విషయమున ఇతరులతో పోటీపడరాదు. ప్రతి అంశము నందును ధాన్య పర్వతమునందువలెనే చేయవలెను. అట్లే విష్కంభ శైలములను ఋత్విక్కులకు దానమీయవలెను. సువర్ణ పర్వతమా: బ్రహ్మావిద్యా స్వరూపమవు; బ్రహ్మదేవుని గర్భమపు; (బీజమవు;) అనంత ఫలమునిచ్చు దానవు ; అగ్నికి సంతానమవు; పరమాత్ముని అల్పాంశ రూపమవు; కావున స్వర్ణ పర్వత రూపమున నీవు నన్ను రక్షించుము. ఈ విధాన

______________________________________

l బ్రహ్మబీజాయ

మున సువర్ణ పర్వతదానము చేయువాడు పరమానంద ప్రదమగు బ్రహ్మలోకమును చేరి అచట నూరుకల్పములపాటు సుఖించి చివరకు మోక్షమునందును.

ఇది శ్రీ మత్స్య మహా పురాణమున కనక పర్వత దాన మాహాత్య్మ కథనమను ఎనుబది ఐదవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters