Sri Matsya Mahapuranam-1    Chapters   

ఏకోనాశీతితమో7ధ్యాయః.

మన్దారస ప్తమీవ్రతమ్‌.

ఈశ్వరః : 

అథాత స్సమ్ప్రవక్ష్యామి సర్వపాపవినాశనీమ్‌ | సర్వకామప్రదాం పుణ్యాం నామ్నా మన్దారస ప్తమీమ్‌. 1

మాఘస్యామలపక్షేతు పఞ్చమ్యాం లఘుభు ఙ్నరః | ద న్తకాష్ఠం తతః కృత్వా షష్ఠ్యా ముపవసే న్నరః. 2

విప్రా న్త్సమ్పూజయిత్వాతు మన్దారం ప్రాశ##యే న్నిశి | తతః ప్రభాత ఉత్థాయ కృతస్రానః పున ర్ద్విజా&.

భోజయే చ్ఛక్తితః కృత్వా మన్దనారకుసుమాష్టకమ్‌ | సౌవర్ణం పురుషం తద్వ త్పద్మహ స్తం సుశోభనమ్‌. 4

పద్మం కృష్ణతిలైః కృత్వా తామ్రపాత్రే7ష్టపత్రకమ్‌ | హేమమన్దారకుసుమై ర్భస్కరాయేతి పూర్వతః. 5

నమస్కారేణ తద్వచ్చ సూర్యాయే త్యనలే దళే | దక్షిణ తద్వదర్కాయ తథార్యవ్ణుెతి నైరృతే. 6

పశ్చి మే వేదధామ్నేతి వాయవ్యాం చణ్డభానవే | పూష్ణేత్యుత్తరతః పూజ్య మానన్దాయేత్యతఃపరమ్‌. 7

కర్ణికాయాంచ పురుషం స్థాప్య సర్వాత్మనేతి చ | శుక్లవసై#్త్ర స్సమావేష్ట్య భక్ష్యమాల్యఫలాదిభిః. 8

ఏవ మభ్యర్చ్య తత్సర్వం దద్యా ద్వేదవిదే పునః | భుఞీతాతైలలవణం వాగ్యతః ప్రాఙ్ముఖో గృహీ. 9

అనేన విధినా సర్వం సప్తమ్యాం మాసిమాసిచ | కుర్యా త్సంవత్సరం యాద ద్విత్తశాఠ్యవివర్జితః. 10

ఏవ మేత ద్వ్రతాన్తేతు విధాయ కలశోపరి | గోభి ర్విభవతస్సార్ధం దాతవ్యం భూతి మిచ్ఛతా. 11

నమో మన్దారనాధాయ మన్దారభవనాయ చ | త్వం రవే తారయస్వాస్మా నస్మా త్సంసా

రసాగరాత్‌. 12

అనేన విధినా యస్తు కుర్యా న్మన్దారస ప్తమీమ్‌ | విపాప్మా స సుఖీ మర్త్య శ్శక్రేణ దివి మోదతే. 13

ఇమా మమౌఘపటలభీషణధ్వాన్తదీపికామ్‌ | గచ్ఛ న్ప్రగృహ్య సంసారశర్వర్యాం న స్ఖలే న్నరః. 14

ఇతి శ్రీమత్స్యమహాపురాణ మన్దారస ప్తమీవ్రత కథనం

నామైకోనాశీతితమో7ధ్యాయః.

డెబ్బది తొమ్మిదవ అధ్యాయము

మందార స ప్తమీ వ్రతము

ఈశ్వరుడు బ్రహ్మతో ఇట్లు చెప్పెను: ఇక ఇప్పుడు సర్వపాపనాశకము సర్వకామప్రదము పుణ్యదము నగు మందార స ప్తమీ వ్రతమును తెలిపెదను. మాఘ శుక్ల పంచమినాడు లఘువుగా భుజించవలెను. షష్ఠినాడు పలుదోముకని స్నానాదికమును చేసికొని పగలంతయు ఉపవసించి రాత్రి మందార కుసుమమును ఆహారముగా తీసికొనవలెను. స ప్తమినాడు బ్రాహ్మణ భోజనము జరుపవలెను. ఆనాడు ఎనిమిది బంగరు మందార పుష్పములను-పద్మహస్తుడగు మనోహరుడగు పురుషుని బంగారు ప్రతిమను అష్టదళ సువర్ణ కమలమును రాగి పళ్లెరములో నూవులు పోసి వానిపై నుంచవలెను. పిమ్మట ఆ అష్టదళ పద్మమునందలి దళములలో తూరన్పునుండి ఈశాన్యము వరకు గల ప్రతియొక దళమును ఈ ఎనిమిది బంగారు మందారు కుసుమములతో వరుసగా- 1. భాస్కారయ నమః-ప్రాగ్దళం పూజయామి; 2. సూర్యాయ నమః-ఆగ్నేయ దళం పూజయామి; 3. అర్కాయ నమః-దక్షిణ దళం పూజయామి; 4. అర్యవ్ణుె నమః-నైరృత దళం పూజయామి; 5. వేదధామ్నే నమః పవ్చిమ దళం పూజయామి; 6. చండభానవే నమః వాయవ్య దళం పూజయామి; 7. పూష్ణే నమః ఉత్తర దళం పూజయామి; 8. ఆనందాయ నమః ఈశాన్య దళం పూజయామి; అని పూజించవలెను. స్వర్ణ పురుష ప్రతిమను పద్మకర్ణికయందుంచి 'సర్వాత్మనే నమః' అని పూజించి నూతన శ్వేతవస్త్రము చుట్టి భక్ష్యమాల్య ఫలాదులతో అర్చించి అవి అన్ని యు వేదవే త్తయగు విప్రునకు దాన మీయవలయును. ఆ రాత్రి తైల లవణములు (కారము పులుపు) లేకుండ ప్రాఙ్ముఖుడై భుజించి మౌనము పాటించవలెను.

ధనమునకై లోభించక యథాశ క్తిగ ఇట్లు ప్రతిమాసము సంవత్సరకాలము చేయవలెను. వ్రతాంతమున ఈ సామగ్రులను కలశముతోను గోవుతోను కూడ విప్రునకు దానము ఈయవలెను. దీనిచే సకల సంపదలు కలుగును. ''మందారనాధుడు మందార కుసుమము భవనముగా కలవాడు నగు రవీ! మమ్ము సంసార సాగరమునుండి తరింపజేయుము'' అని ప్రార్థించుచు ఇట్లు మందార స ప్తమీ వ్రతము చేయు నరులు పాపముక్తులై స్వర్గమున ఇంద్రునితో కూడి ఆనందింతురు. పాపము లనెడు చీకటితో నిండిన సంసార మనెడు రాత్రియందు దీపము వంటి ఈ వ్రతమును ఆధారముగా తీసికొనినచో జారి పడదు. ఈప్సితార్థ ఫలప్రదమగు దీనిని వినినను చదివినను తెలిపినను అట్టివాడును పాపముక్తుడగును.

ఇది శ్రీమత్స్య మహాపురాణమున మందార స ప్తమీ వ్రతమును డెబ్బది తొమ్మిదవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters