Sri Matsya Mahapuranam-1    Chapters   

అష్టపంచాశో7ధ్యా.

తటాకాదిప్రతిష్ఠావిధిః.

సూతః : జలాశయగతం విష్ణుమువాచ రవినన్దనః | తటాకారామకూ పేషు వాపీషు నళినీషుచ. 1

విధిం పృచ్ఛామి దేవేశ దేవతాయతనేషుచ | కే తత్రచ ర్త్విజో నాధ వేదీ వా కీదృశీ భ##వేత్‌. 2

దక్షినా బలయః కాల స్థ్సాన మాచార్య ఏవచ | ద్రవ్యాణి కాని శస్తాని సర్వమాచ తత్త్వత. 3

శ్రీమత్స్యః : శృణు రాజ న్మహాబాహో తటాకాదిషు యో విధిః |

పురాణష్వితిహాసో7యం పఠ్యతే వదతాం వర. 4

ప్రాప్య పక్షం శుభం శుక్లం నాతీతే చోత్తరాయణ | పుణ్య7హ్ని విప్రకథితే కృత్వా బ్రాహ్మణవాచనమ్‌. 5

ప్రాగుదక్ర్పవణ దేశే తటాకస్య సమీపతః | చతుర్హస్తాం శుభాం వేదిం చతురశ్రాం(స్రాం) చతుర్ముఖామ్‌. 6

తథా షోడశహస్తశ్చ మండపశ్చ చతుర్ముఖః | వేద్యాశ్చ పరితో గర్తా7రత్ని మాత్రా స్సమేఖలాః. 7

నవ సప్తాథవా పఞ్చ చాతిరిక్తా నృపాత్మజ | విత స్తిమాత్రా యోనిస్స్యా త్‌పట్‌సప్తాఙ్గుళవిస్తృతా. 8

గర్తా శ్చతస్ర శ్శస్తాంస్యు స్త్రీపర్వోచ్ర్ఛితమేఖలాః | సర్వత స్సర్వవర్నాఃస్యుః పతాకాధ్వజసంయుతాః. 9

అశ్వత్థోదుమ్బరప్లక్ష వటశాఖాకృతానితు | మండపస్య ప్రతిదిశం ద్వారాణ్యతాని కారయేత్‌. 10

శుభాస్స్మృతాష్టహోతారో ద్వారపాలా స్తథాష్టవై | అష్టౌతు జాపకాః కార్యా బ్రాహ్మణా వేదపారగాః. 11

సర్వలక్షణసమ్పూర్ణో మన్త్రవి ద్విజితేన్ద్రియః | కులశీలసమాయుక్త స్ధ్సాపక స్స్యాద్ద్విజోత్తమః. 12

ప్రతిగర్తేషు కలశయజ్ఞోపకరణానిచ | వ్యజనం చామరే శుభ్రే తామ్రపాత్రం సువిస్తరమ్‌. 13

ఏబది ఎనిమిదవ అధ్యాయము.

తటాకాది ప్రతిష్ఠా విధానము.

సూతుడు ఋషులకు ఇట్లు చెప్పెను: తటాకములు ఆరామములు (తోటలు) బావులు దిగుడు బావులు సరస్సులు దేవాలయములు వీని ప్రతిష్ఠ జరుపు 1. విధానమును అచట కావలసిన 2. ఋత్విజులు 3. వేదికలు 4. దోక్షిణలు 5. బలులు 6. కాలము 7. స్థానము 8. ఆచార్యుడు 9. ద్రవ్యములు ఏవి ఎట్టివిగా నుండవలెనో తెలుపుము. అని మనువు మత్స్యనారాయణు నడిగెను.

మత్స్యనారాయణుడిట్లు చెప్పెను: మహాబాహు! రాజా! పురుషశ్రేష్ఠా! వినుము. ఈ విధానమంతయు (వైదికములగు) పురాణములయందు ''ఇతిహాస'' రూపమున ఇతి-హ-ఆశ-; (ఉండెను అనికాదు-ఇది ఇట్లుండవలెను అని ఇచ్చట అర్థము.) అని చెప్పబడియున్నది. 6. (కాలము) ఉత్తరాయనము-శుక్లపక్షము- బ్రాహ్మణులు నిర్ణయించిన శుభదినము ప్రశస్తములు. బ్రాహ్మణులచే స్వస్తి వాచనము జరిపించిన తరువాతనే ఈ ప్రతిష్ఠా కార్యము జరుపవలెను. 7. (స్తానము) తటాకము-(ఆరామము-కూపము-వాపి-దేవాలయము) సమీపమున తూర్పునకు ఉత్తరమునకు వాలుగా ఉన్న ప్రదేశము ప్రశస్తము. 3. (వేదికలు) నాలుగేసి మూరల భుజములతో చతురస్రముగా నుండు నాలుగు ముకములు గల వేదికను పదునారు మూరల భుజములు గల చతుర్ముఖ మండపములో నిర్మించవలెను. వేదికకు చుట్టును మేఖలలతో కూడినవియు పిడిమూర భుజములు లోతునుగల గుంటలు తొమ్మిదికాని ఏడుకాని ఐదుకాని త్రవ్యవలెను. ఇవికాక పండ్రెండంగుళముల పొడవును ఆరేడంగుళముల వెడలుపునుగల యోని (అధోముఖత్రిభుజాకృతి వేది)- నాలుగు గుంటలు ఏర్పరచవలయును. ఈ గుంటలలో ప్రతిదానికి చుట్టును మూడు వరుసలలో ఎత్తైన మేఖలలు చండవలెను. (మేఖల=చుట్టును ఉండెడి గట్టు) అనేక వర్ణముల పతాకలును ఎండాలును (తోరణములును) రావి మేడి జువ్వి మర్రి కొమ్మలతో చేసి అమర్చిన ద్వారములును మండపము చుట్టును ఏర్పరచవలెను. 2. (ఋత్విక్కులు మొదలగువారు) ఎనిమిది మంది ద్వారపాలురు-ఎనిమిది మంది హోతలు ఎనిమిది మంది జపకర్తలును వేదపారంగతులయిన బ్రాహ్మణు లుండవలెను. 8. (ఆరార్యుడు) సర్వ వైదిక లక్షణములు కలిగి మంత్రవేత్త జితేంద్రియుడు కులశీలవంతుడు నగు బ్రాహ్మణుడు ఆరార్యుడు(ప్రధాన ఋత్విక్‌)గా నుండవలెను. 9. (ద్రవ్యములు) ప్రతియొక గుంట దగ్గరను కలశములు యజ్ఞోపకరణములు (స్రుక్‌ స్రువములు దర్భలు మొదలగునవి) విసనకర్ర తెల్లని చామరములు వెడల్పయిన రాగిపాత్ర ఉండవలెను.

తత స్త్వనేకవర్ణాస్స్యు ర్బలయః ప్రతిదైవతమ్‌ | ఆచార్యః ప్రక్షిపే ద్భూమా వనుమన్త్రం విచక్షణః. 14

త్ర్యరత్నిమాత్రయూప స్స్యా తీక్షరవృక్షవినిర్మితః | యజమానప్రమాణోవా సంస్థాప్యో భూతిమిచ్ఛతా. 15

హేమాలఙ్కారిణః కార్యాః పఞ్చవింశతిఋత్విజః | కుణ్డలానిచ హైమాని కేయూరకటకానిచ. 16

తథాఙ్గుళిపవిత్రాణి వాసాంసి వివిధానిచ | దక్షిణాశ్చ సమాస్సర్వా ఆచార్యే ద్విగుణం స్మృతమ్‌. 17

దద్యా చ్ఛయనసంయుక్త మాత్మనవ్చాపి యత్ర్పియమ్‌ | సౌవర్ణౌ కూర్మమకరౌ రాజతౌ మత్స్యుడుణ్డుభౌ.

తామ్రౌ కుళీరమణ్డూకా వాయసశ్శింశుమారకః | ఏవమాసాద్య తత్సర్వ మాదావేవ విశామ్పతే. 19

శుక్లమాల్యామ్బర ధర శ్శుక్లగన్ధానులేపనః | సర్వౌషధ్యుదకస్నాత స్స్నాపితో వేదపుఙ్గవైః. 20

యజమాన స్సపత్నీ క: పుత్త్ర పౌత్త్రసమన్వితం | పశ్చిమద్వారమాశ్రిత్య ప్రవిశే ద్యాగమణ్డపమ్‌. 21

తతోమఙ్గళశ##బ్దేన భేరీణాం నిస్వనేనచ | రజసా మణ్డలం కుర్యాత్పఞ్చవర్ణేన త త్త్వవిత్‌. 22

షోడశారం తతశ్చక్రం పద్మగర్భం చతుర్ముఖమ్‌ | చతురశ్రంచ పరితో వృత్తం మధ్యే సుశోభనమ్‌. 23

వేద్యాంచ పరితః కృత్వా గ్రహా& లోకపతీం స్తతీః | విన్యసే న్మన్త్రతస్సర్వా న్ర్పతిదిక్షు విచక్షణః. 24

కూర్మాదీ& స్థాపయేన్మధ్యే వారుణం మన్త్రమాశ్రితః | బ్రహ్మాణంచ శివం విష్ణుం తత్రైవ స్థాపయేద్బుధః.

వినాయకంచ విన్యస్య కమలా మమ్బికాం తథా | శాన్త్యర్థం సర్వలోకానాం భూతగ్రామం న్యసేత్తతః. 26

పుష్పాక్షతఫలై ర్యుక్త మేవం కృత్వా7ధివాససా | కుమ్భాంశ్చ రత్నగర్భాంస్తా న్వారిణా పరిపూరితా&.

5. (బలులు) ప్రతియొక దేవతను ఉద్దేశించి అనేక వర్ణములు గల బలులు ఏర్పరచి అన్ని విషయములను ఎరిగిన ఆచార్యుడు వాటిని మంత్రసహితముగా వేయవలెను. 9. (యూపము) యూప స్తంభము మూడు పిడిమూరల పొడవున గాని యజమానుని ఎత్తునగాని ఉండుట క్షేమప్రదము. (భూషణములు) ఇరువదియైదు మంది ఋత్విజులకును బంగారుతో కుండలములు భుజకీర్తులు చేతి కడియములు వ్రేళ్ళకు పవిత్రములు చేయించవలెను. వివిధములగు వస్త్రము లీయవలెను. దక్షిణలు అందరకును సమానముగాను ఆచార్యునకు మాత్రము ఒక్కొక్క ఋత్విజునకు ఇచ్చినదానికి ద్విగుణముగాను ఇచ్చుట కేర్వరచవలెను. వారి కింకను మంచము పరపు మరింకేదైన తనకు నచ్చినది కాని బంగారుతో చేసిన కూర్మమకరములును వెండితో చేసిన చేపను నీటిపామును రాగితో చేసిన ఎండ్రి కప్ప నీటి కాకి శిశుమారము మత్స్యము ఇట్టివి కూడ చేయించవలెను.

1. ఇట్టివి సమకూర్చుకొనిన తరువాత యజమానుడును అతని భార్యయు సర్వౌషధీజలములతో విప్రులు పఠించు వేదమంత్రములతో స్నానమాడి తెల్లని వస్త్రములను తెల్లని గంధములను తాల్చి పుత్త్ర పౌత్త్రులతో కూడి పడమటి ద్వారమునుండి యాగ మంటపమును ప్రవేశించవలయును. మంగళవాద్యములు మ్రోగుచుండ ఐదువన్నెల మ్రుగ్గు పొడితో చతురస్రమును దాని నడుమ వృత్తమును దానిలోపల షోడశారచక్రమును దిక్పాలకులను గ్రహములను ఆయా మంత్రములతో నిలుపవలెను. వారుణ మంత్రములతో కూర్మము మొదలగు ప్రతిమలను త్రిమూర్తులను గణపతిని లక్ష్మీపార్వ(సరస్వతీ)తులను సర్వభూత గణములను నిలుపవలెను. మంటపమున (పీఠము పై) వస్త్రము పరచి దానిపై పుష్పా క్షతఫలములను ఉంచి రత్నములతో జలములతో నిండిన కలశము లుంచి వాని నడుమనే పై విధముగా గ్రహాదులను నిలుపవలయును.

వస్త్రాదిభిరలఙ్కృత్య ధ్వారపాలా న్త్సమన్తతః | జపధ్వమితి తాన్ర్బూయా దాచార్య న్త్వధిపూజయేత్‌. 28

బహ్వృచౌ పూర్వతస్థ్సాప్యౌ దక్షిణన యజుర్విదౌ | సామగౌ పశ్చిమే తద్వ దుత్తరేణ అథర్వణౌ. 29

ఉదఙ్మఖో దక్షిణతో యజమాన ఉపావిశేత్‌ | యజధ్వమితి తాన్ర్బూయా ద్యాజకా న్పునరేవతు. 30

ఉత్కృష్టమన్త్రజప్యేన తిష్ఠధ్వమితి జాపకా& | ఏవమాదిశ్య తాన్త్సర్వా న్పర్యుక్ష్యాగ్నిం సమర్చయేత్‌.

జుహుయా ద్వారుణౖర్మన్త్రై రాజ్యంచ సమిధస్తథా | ఋత్విగ్భిశ్చైవ హోతవ్యం వారుణౖ రేవ సర్వతః. 32

గ్రహేభ్యో విధివద్ధుత్వా తథేన్ద్రాయేశ్వరాయచ | మరుద్భ్యో లోకపాలేభ్యో విధవ్వ శ్వకర్మణ. 33

రాత్రిసూక్తం చ రౌద్రం చ పావమానం సుమఙ్గళమ్‌ |

జపేర న్పౌరుషం సూక్తం పూర్వతో బహ్వృచః పృథక్‌. 34

శాక్తం రౌద్రం చ సౌమ్యం చ కూశ్మాణ్డం జాతవేదసమ్‌ |

సౌరం సూక్తం జపేరం స్తే దక్షిణ తు యజుర్విదః. 35

వైరాజం పౌరుషం సూక్తం సౌపర్ణం రుద్రసంహితామ్‌ |

శ్యైతంచ పఞ్చనిధనం గాయత్రం జ్యేష్ఠసామ చ. 36

వామదేవ్యం బృహత్సామ రౌరవంచ రథ న్తరమ్‌ | గవాం వ్రతం వికర్ణంచ రక్షోఘ్నం వయనం తథా. 37

గాయేర న్త్సామగా రాజ న్పశ్చిమద్వార మాశ్రితాః|

ఆథర్వణా శ్చోత్తరత శ్శన్తికం పౌష్టికం తథా. 38

జపేర న్మనసా దేవ మాశ్రితా వరుణం ప్రభుమ్‌ | పూర్వేద్యు రభితో «మన్త్రై రేవం కృత్వా7ధివాసనమ్‌. 39

గజాశ్వరథవల్మీకా త్సఙ్గమహ్రదగోకులాత్‌ | మృద మాదాయ కుమ్భేషు ప్రక్షిపే చ్చత్వరా త్తథా. 40

రోచనాం యవసిద్ధార్థా న్గన్ధా న్గుగ్గులు మేవ చ | స్న పనం తస్యక ర్తవ్యం పఞ్చగవ్యసమన్వితమ్‌. 41

ప్రత్యేకంతు మహామన్త్రై రేవం కృత్వా విధానతః | ఏవం క్షిపతి బాహ్యార్థై ర్విధియుక్తేన కర్మణా. 42

తరువాత ద్వారపాల ఋత్విక్కులను జాపకులను ఆచార్యుని హోతలను పూజించవలెను. ద్వారపాలురలో ఋగ్వేదులను ఇద్దరను తూర్పున యజుర్వేదులను ఇద్దరను దక్షిణమున సామవేదులను ఇద్దరను పడమట ఆథర్వణులను ఇద్దరను ఉత్తరమున కూర్చుండ పెట్టవలయును. యజమానుడు తాన మంటపములో దక్షిణ దిశను ఉత్తరమునకు తిరిగి కూర్చుండవలెను. ద్వారపాలురను వేదపఠనము చేయుడనియు జాపకులను జపించుడనియు హోతలను యజనము చేయించుడనియు ఋత్విగ్వరణము చేసి ప్రార్థించవలెను.

తరువాత అగ్నికి పర్యుక్షణము చేసి అర్చించవలయును. గ్రహములను ఇంద్రుని ఈశ్వరుని మరుత్తులను లోకపాలురను విశ్వకర్మను ఉద్దేశించి వారుణ మంత్రములతో నేతితో సమిధలతో హోమము చేయవలెను. ఈ హోమకాలములోనే ద్వారపాలురలో ఋగ్వేదీయులు రాత్రి-రుద్ర-పవమాన-పురుష సూక్తములను పఠింతురు. యజుర్వేదులు శాక్త-రౌద్ర-సౌమ్య-కూశ్మాండ-జాతవేదస-సౌర-సూక్తములు పఠింతురు. సామవేదులు వైరాజ-సౌరుష-సౌపర్ణ-రౌద్ర-శ్యైత-పంచనిధన-గాయత్ర-జ్యేష్ఠసామ-వామదేవ్య-బృహత్సామ-రౌరవ-రతంతర-గవాంవ్రత-వికర్ణ-రక్షోఘ్న-వయన-సూక్తములు పఠింతురు. ఆథర్వణులు వరుణ దేవతాకములుగు శాంతిక పౌష్టిక మంత్రములు పఠింతురు.

ఇంకను గజములు అశ్వములు రథములు నిలుచు ప్రదేశములనుండియు పుట్టనుండియు నదీసంగమ-హ్రద-గోకుల-ప్రదేశములనుండియు ఇండ్ల ముంగిళ్ళనుండియు తెచ్చిన మృత్తికను కడవలలోవేసి వానియందు నింపిన నీటితో గోరోచనా యవ సిద్ధార్థ (తెల్ల ఆవలు) గంధ గుగ్గులు చూర్ణములతో పంచ గవ్వముతో ఆయా మంత్రములతో వరుణునకు యథావిధానముగ స్నపనము చేయించవలెను. ఇదంతయు తటాక ప్రతిష్ఠకు ముందటి దినమున చేయవలసిన ప్రక్రియ.

తతః ప్రభాతే విమలే సఞ్జాతే7థ శతం గవామ్‌ | బ్రాహ్మణభ్యః ప్రదాతవ్య మష్టషష్టిశ్చ వా పునః. 43

పఞ్చాశ దథ షట్త్రింశ త్పఞ్చవింశతి రేవచ | తత స్సాంవత్సరప్రోక్తే శుబే లగ్నే సువోభ##నే. 44

వేదశ##బ్దై స్సగాన్ధర్వై ర్వాద్యైశ్చ వివిధైః పునః | కనకాలకృతాం కృత్వా జలే గా మవతారయేత్‌. 45

సామగాయచ సా దేయా బ్రాహ్మణాయ విశాంపతే | పాత్రీ మాదాయ సౌవర్ణాం పఞ్చరత్నసమన్వితామ్‌.

తత్ర నిక్షిప్య మకర మత్స్యాదీంశ్చైవ సర్వతః | ధృతాం చతుర్భి ర్విప్రేన్ద్రై ర్వేదవేదాఙ్గపారగైః. 47

మహానదీజలోపేతాం దధ్యక్షతసమస్వితామ్‌ | ఉత్తరాభిముభై ర్న్యస్తాం జలమధ్యే7వతారయేత్‌. 48

ఆథర్వణన సామ్నాచ పున ర్మామేత్యథైవచ | ఆపోహిష్ఠేతి మన్త్రేణ క్షిప్త్వా77గత్య చ మణ్డపమ్‌. 49

పూజయిత్వా సద స్తత్ర బలిం దద్యా త్సమన్తతః | పున ర్దినాని హోతవ్యం చత్యారి మునిసత్తమాః. 50

______________________________________________________________________________

« రాత్రావేవం

చతుర్థే కర్మకర్తవ్యం దేయా తత్రాపి శక్తితః | దక్షిణా రాజశార్దూల వరుణస్య క్షమాపణమ్‌. 51

కృత్వాతు యజ్ఞపాత్రాణి యజ్ఞోపకరణాని చ | ఋత్విగ్భ్యస్తు సమం దత్వా మణ్డపం విభ##జే త్పునః. 52

హోమపాత్రీంచ శయ్యాంచ స్ధాపకాయ నివేదయేత్‌ | తతస్సహస్రం విప్రాణా మథవా7ష్టశతం తథా. 53

భోజనీయం యథాశక్తి పఞ్చాశద్వాథ వింశతిః |

ప్రతిష్ఠా దినమున ఉదయకాలమున బ్రాహ్మణులకు నూరుకాని అరువది ఎనిమిది కాని ఏబదికాని ముప్పది ఆరుకాని ఇరువదికాని గోవుల దానమీయవలెను. తరువాత జ్యౌతిషికులు చెప్పిన శుభలగ్నమునందు వేద-గాన-వాద్య ధ్వనులనడుమ బంగారుతో అలంకరిచబడిన గోవును (ఈ క్రొత్త తటాకపు) నీటిలో దింపి పిమ్మట దానిని సామవేదియగు బ్రాహ్మణుడనకు దానమీయవలెను. పిమ్మట పంచరత్నములు తాపటము చేసిన బంగారు పాత్రలో మకర మత్స్యాది ప్రతిమలను వేసి వేదవేదాంగ ఆరంగతులైన నలుగురు విప్రులు దానిని పట్టుకొనగా దానిలో నదీ జలములు దధి-అక్షతలు నింపి ఉత్తరాభిముఖులైన ఆ విప్రులచే దానిని నీటిలో దింపిచవలెను. ఆథర్వణసామ మంత్రములతో 'పునర్మామా' 'ఆపోహిష్ఠా' అను మంత్రములతో ఆపాత్రను నీటిలో పడవేసి మంటపమునకు వచ్చి సదస్సును (సదస్సులోని పెద్దలను) పూజించి మంటపమునకు అన్ని దిక్కులందు బలి వేయవలెను.

తరువాత నాలుగు దినములు వరుసగా హోమము జరిపి నాలుగవనాడు కర్మ సమాప్తి జరుపవలెను. వరుణునకు (మంత్ర పూర్వముగ) క్షమాపణము చెప్పి యజ్ఞపకరణములను మండప సామగ్రిని దోక్షిణలను ఋత్విజులకు సమముగా పంచవలెను. హోమ పాత్రను శయ్యను ఆచార్యునకు ఈయవలెను. తరువాత యథ శక్తిగా వేయి-అష్టోత్తర శతము-ఏబది-ఇరువది-మంది బ్రాహ్మణులకు భోజనము పెట్టవలెను.

ఏవ మేష పురాణషు తటాకవిధి రుచ్యతే. 54

కూపవాపీషు సర్వాసు తథా పుష్కరినీషు చ | ఏష ఏవ విధి ర్దృష్టః ప్రతిష్ఠాసు తథైవచ. 55

మన్త్రతస్తు విశేష స్స్యా త్ర్పాసాదోద్యానభూమిషు | అయం త్వశక్తా వర్ధేన విధిర్దృష్ట స్స్వయమ్భువా. 56

అల్పే ష్వేకాగ్నివ త్కుర్యా ద్విత్తశాఠ్యా దృతేనృణామ్‌ |

పావృట్కాలే స్థితం తోయ మగ్నిష్టోమసమం స్మృతమ్‌. 57

శరత్కాలే స్థితం యత్స్యా త్తదుక్థ్యఫలదాయకమ్‌ | వాజపేయాతిరాత్రాభ్యాం హేమ న్తే శిశిరే స్థితమ్‌. 58

అశ్వమేధసమం ప్రాహుర్వస న్తసమయే స్థితమ్‌ | గ్రీష్మేవ్యవస్థితం తోయం రాజసూయా ద్విశిష్యతే. 58

ఏతా న్మహారాజ విశేషధర్మా న్కరోతి యో7త్యర్థవిశుద్ధబుద్ధిః |

స యాతి రుద్రాలయ మాశు పూతః కల్పా ననేకా న్దివి మోదతేచ. 60

అనేకలోకా న్త్సమహర్జనాదీ న్భుక్వా పరార్ధద్వయ మఙ్గనాభిః |

సహైవ విష్నోః పరమం పదం యః ప్రాప్నోతి తద్యోగఫలేన భూయః.

ఇతి శ్రీమత్స్యమహాపురాణ మత్స్యమనుసంవాదా న్తర్గతేశ్వరనారదసంవాదే

తటాక విధికథనం నామాష్టపఞ్చాశో7ధ్యాయః.

ఇది (వైదిక) పురాణములందు చెప్పినయున్న తటాక ప్రతిష్ఠా విధానము. బావులు దిగుడు బావులు కోనేళ్ళు మొదలగు జలాశయ ప్రతిష్ఠలన్నిటియందు ఇదే విధానము. ప్రాసాదములు ఉద్యానములు భూమి ప్రతిష్ఠించుట దాన మిచ్చుట మొదలగు వానిలో మంత్రములు భేదించవచ్చును. శక్తిలేని వారు దీనిని సంక్షిప్త పరచి ఏకాగ్ని (వానప్రస్థుడు) వలెనైన జరుపవచ్చును. తనకు ధనము విషయమున శక్తి యుడియు కొరత చేయరాదు.

ఈ శాస్ర విధానమున ప్రతిష్టించిన జలాశయములలోని నీరు ప్రాణుల కుపయోగపబడి వర్షాకాలము నందుపయుక్తమై అగ్నిష్టోమమను యజ్ఞముచే కలుగు ఫలమును శరత్కాలమున ఉపయోగపడి ఉక్థ్య యజ్ఞఫలమును హేమంతమున ఉపయోగపడి వాజపేయ యజ్ఞఫలమును శిశిరమున ఉపయోగపడి అతిరాత్ర యజ్ఞఫలమును వనస్తమున ఉపయోగపడి అశ్వమేధ ఫలమును గ్రీష్మమునకూడ ఉపయోగపవి రాజసూయకంటె అధిక ఫలమును ఇచ్చును.

ధనము ఉన్నంతలో నిర్మల బుద్ది కలిగి ఈ విశేష ధర్మముల నాచరించినవాడు పవిత్రుడై శివలోకమున కేగును. అనేక కల్పముల కాలము స్వర్గమున నానందించును. రెండు పదార్థములపాటు తన ధర్మపత్నితో కూడ మహర్జనాది లోకములందు సుఖించి యోగసిద్దులకు మాత్రము లభించు విష్ణు పరమపదమును కూడ పొందును.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున తటాక ప్రతిష్ఠా విధాన కథనమను

ఏబది ఎనిమిదవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters