Sri Matsya Mahapuranam-1    Chapters   

ఏకపంచాశో7ధ్యాయః.

అగ్నివంశవర్ణనమ్‌.

ఋషయః: 

యే భూయాసు ర్ద్విజాతీనా మగ్నయః సూత సర్వదా | తా నిదానీం సమాచక్ష్వ తద్వంశం చానుపూర్వశః. 1

ఏబది ఒకటవ అధ్యాయము.

అగ్నివంశ వర్ణనము.

ఋషులు నూతుని ఇట్లు అడిగిరి: సూతా! ద్విజులు సర్వకాలములందును (ఆయా విహిత కాలములందు) ఆరాధింపవలసిన ఆయా అగ్నులను ఆ అగ్నుల వంశములను అను పూర్వితో (దేని తరువాత ఏది చెప్పవలెనో ఆక్రమమున) చెప్ప వలసినదిగా గోరుచున్నాము.

సూతః: యో7సా వగ్న్యభిమానీ తు స్మృతః స్వాయంభువేంతరే |

బ్రహ్మణో మానసః పుత్త్ర స్తస్మాత్స్వాహా7ప్యజీజనత్‌. 2

పావకం పవమానం చ శుచి మగ్నేశ్చ యే సుతాః |

నిర్మంథ్యః పవమానో7గ్ని ర్వైద్యుతః పావకః స్మృతః. 3

శుచి రగ్నిః స్మృతః సౌర స్సూనాఖ్యా శ్చైవ తే త్రయః |

పవమానాత్మజో యో7గ్ని ర్హవ్యవాహః స ఉచ్యతే. 4

పావకిః సహరక్షస్తు కవ్యవాహః సుతః శుచేః | దేవానాం హవ్యవాహో7గ్నిః *పితౄణాం కవ్యవాహనః.

సహరక్షో7సురాణాం తు త్రయాణాం తే త్రయో7గ్నయః |

ఏతేషాం పుత్త్రపౌత్త్రా యే చత్వారింశ న్నవైవ తు. 6

అనగా సూతుడు ఋషులకు ఇట్లు చెప్ప నారంభించెను: స్వాయంభువ మన్వంతరమున జరిగిన సృష్ఠియందు మొదట అవ్యక్త తత్త్వమునుండి వ్యక్తమయిన అగ్ని యను భూతమునకు అధిష్ఠాతగా ఉండు అగ్నియను దేవత చెప్పబడెను. ఈ తత్త్వము అగ్న్యభిమాని దేవత యనబడును. (అగ్న్యభిమాని దేవతయనగా పంచ స్థూలభూతములలో ఒకటియగు అగ్ని అను పదార్థమును ఆశ్రయించి తాను ఉండి ఇది నాదియను నభిమానముతో వర్తించుచు అగ్నిని ఆరాధించిన వారికి ఆయా ఫలములను ఇచ్చుచు అగ్నియందు చేసిన హవనాది ప్రయోజనములను ఇంద్రాది దేవతలకు అందించుచు ఉండు దేవతా త త్త్వము అని యర్థము. అగ్ని యందు వ్యాపించియుండు దేవతా త త్త్వము ఇదియని తలచబడు త త్త్వము అనియును అర్థము.) ఈ అగ్ని దేవునకు స్వాహా అను పత్నియందు 1. పావకుడు 2. పవమానుడు 3. శుచి యను ముగ్గురు

*ప్రథమం బ్రాహ్మణః స్మృతః ; బ్రహ్మణః సుతః.

కుమారులు కలిగిరి. వీరిలో పవమానుడు భూర్‌-భువః-సువః-అను మూడు వ్యాహృతులలో మొదటి వ్యాహృతికి అర్థము అగు భూలోకమునకు సంబంధించిన అగ్నికి అధిష్ఠాత. అతని కుమారుడు 4. నిర్మథ్యాగ్ని (అరణులతో నిర్మథనము చేయుటచే ఉత్పన్నుడగు అగ్ని); పావకుడు అనునతడు భువః అను రెండవ వ్యాహృతికి అర్థమగు అంతరిక్ష లోకమునకు సంబంధించిన అగ్నికి అధిష్ఠాత; అతని కుమారుడు 5. వైద్యుతాగ్ని; శుచి అనునతడు సువః అను మూడవ వ్యాహృతికి అర్థమగు ద్యులోకమునకు సంబంధించిన అగ్నికి అధిష్ఠాత; అతని కుమారుడు 6. సౌరాగ్ని. (పవమాన-పావక-శుచుల కుమారుల ఈ రూపములు భౌతిక-జడ-రూపములు) ఇక ఈమూడు అగ్నుల దేవతాత్మక రూపములగు కుమారులు ఇట్లు చెప్పబడుచున్నారు. పవమానుని దేవతా తత్త్వాత్మక కుమారుడు 7. హవ్యవాహుడు (హవ్యములను దేవతలకు కొనిపోయి అందించువాడు); పావకుని దేవతా తత్త్వాత్మక కుమారుడు 8. సహరక్షుడు; శుచి అను అగ్నికి కలిగిన దేవతా తత్త్వాత్మక కుమారుడు 9. కవ్యవాహుడు (పితరులకు కవ్యము నందించువాడు) కావుననే హవ్యవాహుడు దేవతలకును సహరక్షుడు రాక్షసులకును కవ్యవాహుడు పితరులకును సంబంధించినవారు.

ఈ చెప్పిన పావక-పవమాన-శుచులను ముగ్గురకును కలిసి సాముదాయికమగు నామము సూనులు-(సూనులు అనగా తేజః కిరణములని ఆర్షమగు సంప్రదాయమున అర్థము.)

మూలతః ఉన్న ఈ ముగ్గురగ్నులకును కలిగిన సంతతియును ఈ ముగ్గురగ్నులును కలిసి మొత్తము నలువది తొమ్మిదిమంది యగుదురు.

వక్ష్యామి నామత స్తా న్వై ప్రవిభాగే త త్పృథక్‌ |

పావకి ర్లౌకికో హ్యగ్నిః ప్రథమం బ్రాహ్మణః స్మృతః. 7

బ్రహ్మోదనా(రా)గ్ని స్తత్పుత్త్రో భరతో నామ విశ్రుతః |

వైశ్ననరో 7న్యో7స్యసుతో వహ న్హ వ్యం మహారసమ్‌. 8

అమృతో7థర్వణః పుత్త్రో మథితః పుష్కరా దధి |

యో7థర్వా లౌకికో హ్యగ్ని ర్దక్షిణాగ్ని స్స వై స్మృతః. 9

భృగోః ప్రజాతో వచనా ద్దక్షిణా(ధ్యజ్జా)థర్వణ స్తథా |

తస్మా త్స లౌకికో హ్యగ్నిః పాచ్యః సో7థర్వణ స్తథా. 10

అథ యః పవమానస్తు నిర్మ(ం)థ్యో7సౌ స ఉచ్యతే |

స చ వై గార్హపత్యో7గ్నిః ప్రథమం బ్రాహ్మణః స్మృతః. 11

తతః సభ్యావసథ్యౌ చ శంసన్యాస్తు సుతా పుభౌ |

వారినందరను వేరువేరుగ వారివారి ప్రవృత్తి ప్రవిభాగముతో కూడ క్రమముగ చెప్పెదను.

ఈ చెప్పిన బ్రహ్మమానసపుత్త్రుడగు ప్రాథమికాగ్ని దేవుని త త్త్వ భేదమగు పావకుడను అగ్నికి 10. భరతుడను కుమారుడు కలిగెను. ఇతనికే «బ్రహ్మోద(రా) నాగ్ని అనియు లౌకికాగ్ని అనియు దక్షిణాగ్ని అనియు వ్యవహారము. ఈ పావకాగ్నికే మరియొక కుమారుడు 11. వైశ్వానరుడు. ఇతడు హవ్యమనెడు మహారసమును ఆయాదేవతలకు వహించును. (కొనిపోవుచుండును.) భృగుని కుమారుడు దధ్యఙ్‌ అథర్వా అను ఋషి (దక్షిణా7థర్వా అనియు మరియొక పాఠము) అతడు ప్రపంచము అను పుష్కర (పద్మ)మును మథించి ఈ అమృతమును (దక్షిణాగ్నిని) ఉత్పన్న మొనర్చెను. (అథర్వన్‌ అను ఋషికి కుమారుడు అంగిరుడు. ఇతడును అగ్న్యాత్మక తత్త్వముగా శ్రుతులలో ప్రసిద్ధుడు. ముఖ్యప్రాణ

_________________________________________________________________________________________________

« ఇచట ఉదర-శబ్దము 'ఉదరణ' 'ఉదీరణ' శబ్దములతో సమానార్థకము. మాట-ఉచ్చారణము-వాక్కు అని అర్థము. బ్రహ్మణ ఉదరణమసి-బ్రహ్మణ ఉదీరణమసి-అని శ్రుతి.

త త్త్వమును 'అంగిరాః' అని ఉపనిషదృషులు చెప్పినారు. 'అథర్వాణః' 'అంగిరసః' అనువారు ఆథర్వణ మంత్రద్రష్టలుగా ప్రసిద్ధులు) ఈ దక్షిణాగ్ని కే పాచ్యః-అన్వాహార్యవచనః ఇత్యాది వ్యవహారమును సంప్రదాయమునం దున్నది. అన్వా హార్యమనగా దర్శపౌర్ణమాసాదీష్టులయందు ఋత్విక్కులకు దక్షిణగా ఇచ్చు అన్నము. అది దీని పై పాకము చేయబడును కావున ఈ దక్షిణాగ్నికి అన్వాహార్యపచనః అని శాస్త్ర వ్యవహారము.

లోగడ చెప్పిన నిర్మథ్యాగ్నియగు పవమానుడు (త్రేతాగ్నులలో గార్హ పత్యాగ్ని స్థానీయుడు. అతనికి 12.సభ్యుడు 13. ఆవసథ్యుడు అను ఇద్దరు కుమారులు. వీరి తల్లి శంసని అనునామె.

యో7సా వాహవనీయో7గ్ని రభిమానీ ద్విజైః స్మృతః. 12

స వై షోడశ నద్యస్తు చకమే హవ్యవాహనః | కావేరీం కృష్ణవేణీం చ నర్మదాం యమునాం తదా. 13

గోదావరీం వితస్తాం చ చంద్రభాగా మిరావతీమ్‌ | విపాశాం కౌశికీం చైవ శతద్రూం సరయూం తథా. 14

సీతాం మనస్వినీం చైవ హ్రాదినీం ప్లావనీం తథా | తాసు షోడశధా77త్మానం ప్రవిభజ్య పృథక్పృథక్‌.

తథా తు విహరం స్తాసు ధిష్ణ్యేశః సంబభూవ హ |

స్వాభిచారా త్స్మృతో ధిష్ణ్య స్తాసూత్పన్నాస్తు ధిష్ణియాః. 16

ధిష్ణ్యేశా జ్జజ్ఞిరే యస్మా త్తత స్తే ధిష్ణియాః (ష్ణ్యజాః) స్మృతాః |

ఇత్యేతే వై నదీపుత్త్రా ధిష్ణ్యే ష్వభ్యుపపేదిరే. 17

తేషాం విహరణీయాశ్చ ఉపస్థేయాశ్చ యే శ్రుతాః | అత్ర ధిష్ణ్యాని హవ్యానా మగ్నీనాం శృణుత క్రమమ్‌.

(పావకుడు-దక్షిణాగ్ని స్థానీయుడును పవమానుడు గార్హ పత్యాగ్ని స్థానీయుడు నైనట్లే శుచి ఆహవనీయాగ్ని స్థానీయుడగును. అట్టి) ఆహవనీయాగ్న్యభిమానియగు దేవతయగు అగ్ని తాను యజ్ఞములందు స్థానము (ధిష్ణ్యము) సంపాదించుకొనగోరి తను దా నుత్పన్న మొనర్చుకొనదలచి కావేరి-కృష్ణవేణి-నర్మద-యమున-గోదావరి-విత స్త-చంద్రభాగ-ఇరావతి-విపాశ-కౌశికి-శతద్రూ-సరయూ-సీతా-మనస్విని-హ్లాదిని-ప్లావని-అను పదునారు నదులయందును తన రూపమును పదునారుగా విభజించి విహరించుచు అవియే తనకు ధిష్ణ్యములు (విహరణ స్థానములు) కాగా తాను ధిష్ణ్యేశుడు (ధిష్ణ్యములకు ప్రభువు) అనబడెను. ఇట్లీ ఆహవనీయాగ్ని తన అభిచారము (అభితః-అంతటను; చారః సంచరణం-ప్రవృత్తి-చరించుట-తిరుగుట) వలననే తాను ధిష్ణ్యుడు అనియు వ్యవహిరింపబడెను. అతడు విహరించిన స్థానము లన్నియు (నదులు) ధిష్ణ్యములై నవి. ఇట్లు ధిష్ణ్యములనబడు నదులయందు ధిష్ణ్యుడనబడు అగ్నివలన జనించిన పదునారు మంది కుమారులకును «ధిష్ణియులు-ధిష్ణ్యజులు అను వ్యవహారము కలిగెను. ఇట్లు పదునారుమంది ఆహవనీయ పుత్త్రులగు అగ్నులును నదీ పుత్త్రులై ఆ సంకేతము ననుసరించియే యాగశాలయందును ధిష్ణ్యములనబడు తత్షోడశనదీ సంకేత రూపములగు ఋత్విక్థ్సనములందు స్థితిని సంపాదించుకొనిరి.«

__________________________________________________________________________________________

«1. అంగిరసో ధిష్ణియై రగ్నిభిః-అని యజురారణ్యకము; తృతీయ ప్రశ్నము.

2. ఆర్య ఋషులు పూర్వకాలమున పవిత్రములుగా నెంచిన పదునారు నదులను తమ కర్మానుష్ఠానములందు సతతము స్మరించుటకు అనుకూలముగా ప్రవచించిన భావన ఇదియని తోచును. దీనికి అనుకూలముగానే యజ్ఞములందు ఋత్విజులను పదునారుమంది. వీరిలో ఎనిమిదిమందిని అగ్నిరూపులనుగా భావించి చెప్పిన ఋక్‌-ఋగ్వేదమున ఇట్లున్నది. 'తవాగ్నే హోత్రం తవ పోత్ర మృత్వియం తవనేష్ట్రం త్వమగ్ని దృతాయతః| తవ ప్రశాస్త్రం త్వ మద్వరీయసి బ్రహ్మా చాసి గృహపతిశ్చ నో దమే'

ఈ ధిష్ణ్యాగ్నులు పదునారు మందియు ఉపస్థేయులు విహరణీయులు అని రెండు విధములుగా నున్నారు. వీరందరును హవిర్వహులగు (యజ్ఞములందు హుతమొనర్చిన హవిస్సును వహించుకొనిపోయి దేవతలకు అందజేయు)వారే. వీరిలో అందరకుగల స్థానములును ధిష్ణ్యములు ఐనను (ధిష్ణ్యం అనగా 'ధిష్ణ్యమోకో నివసనం స్థానావసథ వాస్తుచ' అను అమర ప్రామాణ్యమున గృహము-నిలుచు స్థానము అనియే అర్థము. ఐనను ఈ స్థానము-ఉపస్థేయము- నియతమగుటచే ఉప-తస్మిన్నేవ స్థానే-ఆస్థానమునందే-స్థేయాః-ఉంచబడవలసినవారు; విహరణీయాః-విహరణం -యథావశ్యకం స్థానాత్‌ స్థానం నయనం-అపి అర్హంతి-ఆవశ్యకతను బట్టి ఒక స్థానము నుండి మరియొక స్థానమునకు తీసికొని పోబడుటకును అర్హులగువారు) వీనికి స్థితిభేదమును బట్టి సంజ్ఞా భేదమును కలిగినది. ఈ సంజ్ఞాభేదానుసారము వీరి విషయమును క్రమముగా తెలిపెదను; వినుడు.

సమ్రాడగ్నిః కృశానుర్యో ద్వితీయోత్తరవేదికః | వితతాగ్నిముఖా హ్యేన మువతిష్ఠంతి వై ద్విజాః. 19

*పరిషద్యః పవమానస్తు * ద్వితీయః సో7నుదిశ్యతే |

l ప్రతక్వా7న్యో నభస్వాంస్తు చత్వాలే7సౌవిభావ్యతే. 20

హవ్యసూదో హ్యసంమృష్టః శామిత్రే7గ్నౌ విభావ్యతే.

ఋతధామా సువర్జ్యోతి రౌదుంబర్యః ప్రకీర్త్యతే. 21

బ్రహ్మజ్యోతిః సువర్ధామా బ్రహ్మస్థానే స ఉచ్యతే | అజైకపా దుపస్థేయః స వై శాలాసుఖీయకః. 22

2 అనుద్దేశ్యో హ్యహిర్బుధ్న్యః సో7గ్ని ర్గృహపతిః స్మృతః |

శంస్యసై#్యతే సుతాః సర్వే ఉపస్థేయా ద్విజైః స్మృతాః. 23

వీరిలో మొదట ఉపస్థేయాగ్నులను తెలిపెదను. శ్రుతులయందు 'సమ్రాడసి కృశానుః' అని స్తుతించబడిన అగ్ని ద్వితీయో త్తరవేదియం దుండును. ద్విజులు యజ్ఞములందు అగ్ని ముఖమును-యజ్ఞమును-వితతము చేయబోవుచు ఇతనిని స్తుతింతురు. 'పరిషద్యో7సి పవమానః' అని శ్రుతులయందు స్తుతించబడిన అగ్ని రెండవ ఉపస్థేయాగ్ని; ఇతడు ధ్రువస్థలియం దుండును. 'ప్రతక్వా7సి నభస్వాన్‌' అని స్తుతించబడు అగ్ని మూడవవాడు; ఇతడు చత్వాలమను శాలా భాగమందు స్థానము పొందియుండును. 'అసంమృష్ఠో7సి హవ్యసూదః' అని శ్రుతులయందు స్తుతించబడు అగ్ని నాలుగవ ఉపస్థేయాగ్ని; ఇతడు శామిత్రశాలయం దుండును. 'ఋతధామా7సి సువర్జ్యోతిః' అని శ్రుతులయందు స్తుతించబడు నతడు ఐదవ ఉపస్థేయాగ్ని; ఇతడు ఔదుంబరియను స్థానమునం దుండును; 'బ్రహ్మజ్యోతి రసి సువర్ధామా' అని శ్రుతులయందు స్తుతించబడు అగ్ని అరవ ఉపస్థేయాగ్ని;ఇతడు బ్రహ్మ స్థానమునందుండును. 'అజో7స్యేకపాత్‌' అని శ్రుతులయందు స్తుతించబడు అగ్ని ఏడవ ఉపస్థేయాగ్ని; ఇతడు 'సుఖశాలా' అను స్థానమునం దుండును. 'అహిరసి బుధ్నియః' అని శ్రుతులయందు స్తుతించబడు అగ్ని ఎనిమిదవ ఉపస్థేయాగ్ని; ఇతడు 'గృహపతి' - 'యజమాన' స్థానమునం దుండును.

శంస్యుడు అనియు వ్యవహారముగల ఆహవనీయాగ్ని కుమారులలో ఉపస్థేయులనబడు అగ్న్యష్టకము విషయము ఇది.

తతో విహరణీయాంశ్చ వక్ష్యా మ్యష్ట చ తత్సుతాన్‌ |

విభుః ప్రవాహణో7గ్నీధ్ర స్తేషాం ధిష్ణ్యా స్తథా పరే. 24

విధీయంతే యథాస్థానం సౌత్యే7హ్ని సవనే క్రమాత్‌ |

పోత్రీయస్య సుతో హ్యగ్ని ర్వహ్ని ర్యో హవ్యవాహనః. 25

___________________________________________

*పర్జన్యః «ధ్రువీ ; తృతీ lపావకాగ్నిః సమూహ్యస్తు ఉత్తరః సో7గ్ని

2 అనిర్దేశ్యో ; అంతర్దిశ్యో రుచ్యతే; పావకో7న్యస్తు ముఖ్యః స్యా

ప్రశాస్త్రగ్నిః ప్రచేతాస్తు తృతీయః శ్వాత్రనామకః |

తుథో7గ్ని ర్విశ్వవేదాస్తు బ్రాహ్మణాచ్ఛంసి రుచ్యతే. 26

3 ఉశిగగ్నిః కవి ర్యస్తు పోత్రగ్నిః స విభావ్యతే | అంభారి రగ్ని ర్బంభారి ర్నేష్ట్రీయః స విభావ్యతే. 27

అవస్యు ర్యో దువస్వాంస్తు అచ్ఛావాకీయ ఉచ్యతే| అష్టమః శుంధ్యు రగ్ని ర్యో మార్జాలీయః స ఉచ్యతే. 28

ధిష్ణ్యే ఆహరణా హ్యేతే సోమే నేజ్యన్త వై ద్విజైః| తతో యః పావకో నామ్నా అధ్వర్యో ర్గర్భ ఉచ్యతే.

అతని కుమారులలో విహరణీయులనబడు మరి ఎనిమిదిమంది విషయము ఇక చెప్పెదను. ఏలయన యజ్ఞము వితతమగునప్పుడు ఆయా సుత్యాహస్సులయందు తమ తమ స్థానములందు నిలిచియుండువారు కొందరును స్థానాంతర నయనమునకు (ఒక చోటినుండి మరియొక చోటికి కాని పోబడుటకు) అర్హులగువారు కొందరునై ఈ అగ్నులు రెండు విధములుగా నుందురుగదా!

ఈ విహరణీయాగ్నులలో 'విభూరసి ప్రవాహణః' అని శ్రుతులయందు స్తుతించబడు అగ్ని విహరణీయాగ్నులలో మొదటివాడు. ఇతడు ఆగ్నీధ్ర స్థానీయుడు; 'వహ్నిరసి హవ్యవాహనః' అని శ్రుతులయందు స్తుతించబడు అగ్ని విశేషము విహరణీయాగ్ను లలో రెండవవాడు; ఇతడు హోత్రియ స్థానీయుడు; 'శ్వాత్రో7సి ప్రచేతాః' అని శ్రుతులయందు స్తుతించబడు అగ్ని విహరణీయాగ్నులలో మూడవవాడు. ఇతడు ప్రశా స్తృ స్థానీయుడు. 'తుథో7సి విశ్వవేదాః' అని శ్రుతులయందు ప్రశంసింపబడు అగ్ని విహరణీయాగ్నులలో నాలుగవవాడు; ఇతడు బ్రాహ్మణాచ్ఛంసిస్థానీయుడు. 'ఉశిగసి కవిః' అని శ్రుతులయందు ప్రశంసింపబడు అగ్ని విహరణీయాగ్నులలో ఐదవవాడు; ఇతడు పోత్రియ స్థానీయుడు; 'అంభారిరసి బంభారిః' అని శ్రుతులయందు ప్రశంసింపబడుఅగ్ని ఆరవ విహరణీయాగ్ని. ఇతడు నేష్ట్రియ స్థానీయుడు; 'అవస్యు రసి దువస్వాన్‌' అని శ్రుతులయందు ప్రశంసింపబడు అగ్ని విహరణీయాగ్ను లలో ఏడవవాడు; ఇతడు అచ్ఛావాకీయ స్థానీయుడు 'శుంధ్యు రసి మార్జారీయః' అని శ్రుతులయందు స్తుతించబడు అగ్ని విహరణీ యాగ్నులలో ఎనిమిదవవాడు; ఇతడుమార్జా(లీ)రీయ స్థానీయుడు.

ద్విజులచేత సోమసంస్థ లనబడు యాగములందు గార్హ పత్యాగ్ని యందుండి ఆహరింపబడి యజ్ఞములందలి ఆహవనీయాగ్ని భేదములుగా ఉండి హవిర్వహనము (దేవతలకు హవిస్సును కొనపోవుట) చేయు ధిష్ణ్యాగ్నుల స్పష్ట ప్రతిపాదన ప్రకారము ఇది.(ఇంతవరకు 13+16=29 అగ్నులయినారు.)

అగ్నిః సో7వభృథే జ్ఞేయో వరుణన సహేజ్యతే |

హృద (చ్ఛ) య స్తత్సతో హ్యగ్ని ర్జఠరే7సౌ నృణాం పచన్‌. 30

మన్యుమాన్‌ జాఠరస్యాగ్నే ర్దేవపాగ్నిసుతః స్మృతః | పరస్పరోత్థితో హ్యగ్నిః స్థితో భూతాని నిర్దహేత్‌.

అగ్ని ర్మన్యుమతః పుత్త్రో ఘోరః సంవర్తకః స్మృతః | పిబన్నగ్ని ః స వసతి సముద్రే బడబాముభే.

సముద్రవాసినః పుత్త్రః సహరక్షో విభావ్యతే | సహరక్షః సుతః క్షామో గేహే 4 వ్యావసతే నృణామ్‌. 33

క్రవ్యాదాగ్నిః సుత స్తస్య పురుషా నత్తి వై మృతాన్‌ |

ఏతే తు పావకస్యాగ్నే ర్ద్విజైః పుత్త్రాః ప్రకీర్తితాః. 34

అధ్వర్యుని కుమారుడు (అధ్వర్యు స్థానము నందుండువాడు) పావకుని కుమారుడు (పావకాగ్ని సంబంధి) అవ భృథ స్నాన సమయమందు వరుణునితో పాటుగ ఆరాధించబడువాడునగు అగ్ని యొకడు కలడుగదా! అతని కుమారుడు హృదయుడు; ఇతడు మానవుల జఠరమునందుండి వారి ఆహారమును పచనము చేయుచుండును. అతని కుమారుడు

___________________________________________

3 అపాం యోనిః స్మృతశ్చాసీ త్పోతుర్నామ విభావ్యతే; తే క్షత్తానామ.

4 కామో గృహే సంచరతే.

మన్యుమాన్‌; ఇతడు దేవపుడను అగ్నికి కుమారుడుగా (కూడ) చెప్పబడును. ఈ అగ్ని పరస్పర ఘర్షణముచే జనించి చెలరేగి ప్రాణులను దహించివేయును. అతని కుమారుడు సంవర్తకుడు; అతడు భయంకరుడు; ఇతడు బడబా ముఖరూపమున సముద్రముననుండి దానిని త్రాగుచుండును. అతని కుమారుడు సహరక్షుడు; అతని కుమారుడు క్షాముడు; ఇతడు నరుల గృహములయం దుండును. అతని కుమారుడు క్రవ్యాదాగ్ని; అతడు మరణించిన పురుషులను తినుచుండును.

పావకాగ్ని పుత్త్రులుగా ద్విజులు పేర్కొను అగ్నులు వీరు ఆరుగురు.

తతఃశుచిస్తు యః సూర్యా ద్గంధర్వై ర్వసురాహృతః|మథితో య స్త్వరణాం తు సో7గ్ని మగ్నిం సమింధతే.

ఆయుర్నామా తు భగవాన్‌ పశౌ యస్తు ప్రణీయతే|

ఆయుషో మహిషః పుత్త్రః సహసో ¡నామ తత్సుతః. 5 36

6 పాకయజ్ఞే ష్వభీమానీ హుతం హవ్యం భున క్తి యః |

పుత్త్రో7స్య సహస స్యాగ్ని రద్భుతస్తు మహాయశాః. 37

అద్భుతస్య సుతో వీరో దేవాంశస్తు మహాన్‌ స్మృతఃl | ప్రాయశ్చిత్తే ష్వభీమానీ వివిధాగ్నిస్తు తత్సుతః.

వివిధాగ్నిసుతో హ్యర్కో వహ్నే స్తస్య సుతాష్టకమ్‌ | కామాదీష్టి ష్వభీమానీ రక్షోహాప్రకృచ్చ యః. 39

సురభి ర్వసుమర్యాదో 7 హర్యశ్వశ్చైవ రుక్మవాన్‌| 8 ప్రవర్గ్యః క్షమవాం శ్చైవ ఇత్యష్టౌ చ ప్రకీర్తితాః.

శుచ్యగ్నేస్తు ప్రజా హ్యేషా అగ్న యశ్చ చతుర్దశ |

పూర్వము గంధర్వులు సూర్యునినుండి తెచ్చిన వసురూపుడు శుచియను అగ్ని; (ఇతడు వారిచే పురూరవునకు ఈయబడిన తరువాత వృక్షములయందు దాగగా మరల ఆ రాజు వారి యుపదేశముచే) అరణియందు మథించగా ఉత్పన్నుడై అగ్ని నుండి మరియొక యగ్ని అను క్రమమున ప్రజ్వలించుచు (లోకమున నీతడు నిర్మథ్యాగ్నిగానే) ఉన్నాడు. అతని నామము «ఆయువు (ఇతడు ఊర్వశీ పురూరవసుల కుమారుడుగా ప్రసిద్ధుడనుట గమనింపదగినది.) ఈ అగ్ని భగవానుడు ఆహవనీయాగ్నిగా పశు యజ్ఞములందు ప్రణయనము చేయబడుచున్నాడు. అతని కుమారుడు మహిషుడు; అతని కుమారుడు సహసుడు; ఈతడు పాక యజ్ఞాభిమానియై వాటియందు వేల్చబడిన హవిస్సును అనుభవించుచుండును. ఈతని కుమారుడు మహాయశుడగు అద్భుతుడు. అతని కుమారుడు (మహాన్‌) గొప్పవాడు-పూజ్యుడు సర్వదేవాంశుడు అగు వీరుడు అనునతడు: (వీరుడను అగ్నికి కుమారుడు కంఠుడు; కంఠుని కుమారుడు కవియనునతడు.) ఈ వీరుడు అనునతడు ప్రాయశ్చిత్త కర్మానుష్ఠానాభిమానియై యుండును. అతని కుమారుడు వివిధాగ్ని; వివిధాగ్ని కుమారుడు అర్కుడు; ఈతని కుమారులు ఎనిమిదిమంది. వీరిలో మొదటివాడు కామ్యాదికములగు ఇష్టులకు అభిమానియై యుండు రక్షోహా (రక్షాంసి - హంతి - రాక్షసులను చంపువాడు) అను అగ్ని ఇంకను ప్రతికృత్‌ (ఇతరులు చేసిన అపకారములకు ప్రతీకారము చేయువాడు) సురభి-వసు మర్యాదుడు హర్యశ్వుడు రుక్మవాన్‌ ప్రవరుడు క్షమవాన్‌ అను వారును కలిసి వీరు మొత్తము ఎనిమిదిమంది.

___________________________________________

¡ సవనో l''వీరస్యాగ్నేః సుతః కంఠః కంఠస్యాగ్నేః సుతః కవిః'' అని ఒక పం క్తి ఉన్నది. దీనివలన శుచ్యగ్ని సంతానసంఖ్య పదునాలుగు కాక రెండు ఎక్కువై పదునారగును.

5 సంహితాగ్నిస్తు ; పుత్త్రోదవానాగ్నిస్తు.

6 సర్వస్మాదేవ లోకాచ్చహుతం హవ్యంబిభర్తియః. 7 హయాస్యశ్చైవ ; 8 వరేణ్యః

« ఊర్వశీ పురూరవపసుల పేరులలోని సామ్యము గమనింపదగినది. పురు-ఉరువస్‌> పురూరవస్‌; ఉ-రువస్‌-ఈ-(స్త్రీ వాచక ప్రత్యయము)>ఉర్‌(ఉ) వస్‌-ఈ>ఉర్‌వస్‌-ఈ>ఊర్వసీ>ఊర్వశీ.

ఈ పదునలుగురును శుచ్యగ్నికి సంతానమగువారు. (ఇట్లు మొత్తము అగ్నులు 29+6+14=49)

ఇత్యేతే హ్యగ్నయః ప్రోక్తాః ప్రణీతా యే హి చాధ్వరే. 41

సమన్వితా విసర్గే యే యామై స్సహ సురోత్తమైః |

స్వాయంభువే7తరే పూర్వ మగ్నయ స్తే7భిమానినః. 42

ఏతే విహరణీయా యే చేతనాచేతనే ష్విహ | స్థానాభిమానినో7గ్నిషు ప్రా గాసన్‌ హవ్యవాహనాః. 43

కామ్యనైమిత్తికే యజ్ఞే ప్రేతకర్మ స్వవస్థితాః | పూర్వమన్వంతరే7తీతే మద్రైర్యామైశ్చ తై స్సహ. 44

ఏతే దేవగణౖ స్సార్ధం ప్రథమస్యాంతరే మనోః | ఇత్యేతా యోనయో హ్యుక్తాః స్థానాఖ్యా జాతవేదసామ్‌.

ఇత్యేవ తు ప్రసంఖ్యాతా స్సాంప్రతం నో గతే ష్విహ | మన్వంతరేషు సర్వేషు లక్షణం జాతవేదసామ్‌.

స్వారోచిషాదిషు జ్ఞేయం సావర్ణ్యంతేషు సప్తసు | మన్వంతరేషు సర్వేషు నానారూపప్రయోజనైః. 47

వర్తంతే వర్తమానైశ్చ యామై ర్దేవై స్సహాగ్నయః| అనాగతైః సురైః సార్ధం వర్తంతే7నాగతాగ్నయః.

ఇత్యేష నిచయోగ్నీనాం మయా ప్రోక్తో యథాక్రమమ్‌ |

విస్తరే ణానుపూర్వ్యాచ్చ కి మన్య చ్ర్ఛోతు మిచ్ఛథ. 49

ఇతి శ్రీమత్స్యమహాపురాణ అగ్నివంశవర్ణనం నామ ఏకపంచాశో7ధ్యాయః.

ఈ విధముగా అధ్వరములందు ప్రణయనముచేయబడు అగ్నుల విషయము ప్రతిపాదింపబడినది. వీరందరును నృష్టికి ఆరంభమునందు నుండియు యాములు అనబడు దేవ శ్రేష్ఠులతో కూడియుందురు (ఏకభావము నొందియుందురు.) వీరందరును పూర్వము స్వాయంభువ మన్వంతరమునందును ఆయా వైదిక కర్మానుష్ఠానములకు అభిమానులై విహరణీయులై (అర్థము లోగడ చెప్పబడినది) సృష్టియందలి చేతనములు అచేతనములునగు పదార్థములయందు స్థానాభి మానులై ఆయా అగ్నులకు అభిమానులునై (ఈ స్థానమునకు వీరు అధిష్ఠాతలు అని విద్వాంసులచే భావన చేయబడు వారై-ఈ స్థానము నాధి-ఈ స్థానమునకు నేను అధిష్ఠాతను అను అభిమానము కలవారై) ఉండిరి.

ఇది యామదేవులలోని వారగు అగ్నుల విషయము. (ఆదికాలమున ప్రాయశ్చిత్తములును కామ్య కర్మాను ష్ఠానములను అభిచారిక కర్మములును ఉండలేదు. అందుచే ఆనాటికి యాములు అను దేవతలు మాత్రమే ఉండిరి. తరువాత ఈ కామ్యాది కర్మల ప్రవృత్తి ప్రజాపతిభావనలోనికి రాగా వీనికి అభిమానులగు మద్రులు అనబడు దేవతల భావన కర్మ కాండములలో ప్రవేశించినది.) ఇట్లు ప్రథమ మన్వంతరము అతీతము కాగా కామ్య నైమిత్తికాది కర్మలయందును ప్రేత కర్మలయందును అభిమానులై యుండిన అగ్నులు ఏర్పడి యాములను దేపతలతోపాటు మ(ం)ద్రులనబడు అగ్నులయందును వీరు సమన్వయము పొందిరి.

ఇట్లు ఆయా జాతవేదసుల యోనులును (ఉత్పత్తి ప్రకారములును) స్థానాభిఖ్యలును (అధిష్ఠానమును బట్టి వచ్చిన నామములను) ప్రతిపాదింపబడినవి. ఈ విషయము గత మన్వంతరములయందు వలనే వీరి విషయమున ప్రసంఖ్యాత (ప్రతిపాదిత) మయినది.

ఇదే విధముగ స్వారోచిష మన్వంతరము మొదలుకొని సావర్ణి మన్వంతరాంతముగా నుండు (స్వాయంభువము కాక మిగిలిన అన్ని) మన్వంతరములందును ఇంతవరకు గడచిన- గడచుచున్న- ఏడు మన్వంతరముల యందువలెనే నానారూప ప్రయోజనముల ననుసరించి అతీతులును వర్తమానులునగు ఆయా అగ్ని సంబంధులగు యామాది దేవ గణములతో కూడి ఆయా అగ్నులుందురు. ఇక అనాగత(రాబోవు) మన్వంతరములయందు రాబోవు ఆయా దేవ గణాంతర్భూతులగు వారితో కలిసి రాబోవు అగ్నులు ఉపాసింపబడుదురు.

ఈ విధముగా అగ్నుల వర్గము(ను వారి నామకర్మ ప్రవిభాగము)ను ఆనుపూర్వితో సవి స్తరముగా నేను ప్రతి పాదించితిని. మరి ఇంకను ఏమి వినగోరెదరో తెలుపుడు. అని సూతుడు ఋషులతో పలికెను.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున అగ్నివంశ వర్ణనమను ఏబది ఒకటవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters