Sri Matsya Mahapuranam-1    Chapters   

ఏకోనత్రింశ త్తమో7ధ్యాయః.

శుక్రవృషపర్వసంవాదః.

శౌనకః:

 తతః కావ్యో భృగుశ్రేష్ఠ స్సమన్యు రుపగమ్య హ | వృషపర్వాణ మాసీన మిత్యువాచ త్వరాన్వితః. 1

నాధర్మ శ్చరితో రాజ న్త్సద్యః ఫలతి గౌరివ | శ##నై రావర్త్యమానస్తు మూల్యాన్యపి నికృన్తతి. 2

యో హి నాత్మని పునత్త్రేషు న చే త్పశ్యతి నప్తృషు | పాప మాచరితం కర్మ త్రివర్గ మతివర్తతే. 3

ఫలత్యేవ ధ్రువం పాపం గురు భుక్త మివోదరే | యదా ఘాతయతా విప్రం కచ మాఙ్గిరసం తదా. 4

అపాపశీలం ధర్మజ్ఞం శుశ్రూషుం మద్గృహే రతమ్‌ | వధా దనర్హత స్తస్య వధాచ్చ దుహితు ర్మమ. 5

వృషపర్వ నిబోధ త్వం త్యక్షామి త్వాం సబాన్ధవమ్‌ |

స్థాతుం త్వద్విషయే రాజ న్న శక్ష్యామి త్వయా నహ. 6

అద్యైవం మా7భిజానాసి దైత్యం మిథ్యాప్రలాపినమ్‌ | యత స్త్వ మాత్మనోదీర్ణాం దుహితాం సముపేక్షసే.

వృషపర్వా : స్వధర్మ మమృషావాదం త్వయి జానామి భార్గవ |

త్వయి సత్యం చ ధర్మం చ త త్ప్రసీదతు నో భవాన్‌. 8

యద్యస్మా నపహాయ త్వ మితో యాస్యసి భార్గవ | సముద్రం సమ్ప్రవిశ్యామ నాన్యదస్తి పరాయణమ్‌. 9

శుక్రః : సముద్రం ప్రవిశధ్వం వా దిశో వా వ్రజతాసురాః |

దుహితు ర్నాప్రియం శ్రోతుం శక్తో7హం దయితా హి వే. 10

ప్రసాద్యతాం దేవయానీ జీవితం హ్యత్ర మే స్థితమ్‌ | యోగక్షేమకర స్తే7హ మిన్ద్రస్యేవ బృహస్పతిః.

వృషపర్వా : యత్కిఞ్చిచ్చాసురేన్ద్రాణాం విద్యతే వసు భార్గవ |

భువి హస్తి గవాశ్వం చ తస్య త్వం మమ చేశ్వరః. 12

శుక్రః : యత్కిఞ్చి దస్తి ద్రవిణం దైత్యేన్ద్రాణాం మహాసురాః |

తస్యేశ్వరో7స్మి యది తే దేవయానీ ప్రసాద్యతామ్‌. 13

ఇరువది తొమ్మిదవ అధ్యాయము

శుక్ర వృషపర్వ సంవాదము

శౌనకుడు శతానీకునితో ఇట్లు చెప్పెను : తరువాత కవిముహామునికి కుమారుడును భృగువంశ శ్రేష్ఠుడును అగు శుక్రుడు మిగుల త్వరతో పోయి కొలువుదీరి యున్న వృషపర్వునితో ఇట్లు పలికెను : ''రాజా! భూమిలో విత్తనము వేసినను వెంటనే ఫలించనట్లు ఆచరించిన అధర్మము కూడ వెంటనే ఫలించదు. మెల్లగా ఆవృత్తి చేయుచు పోగా అది వేళ్ళను కూడ పెకలించివేయును. తాను ఆచరించిన పాపకర్మము తనయందో తన కుమారులయందో మనుమలయందో ముని మనుమలయందో ఫలింపకున్నను మూడు తరముల దాని తరువాతివారికై నను తగిలితీరును. తినిన బరువయిన ఆహారము ఉదరములో రోగముగా పరిణమించినట్లు పాపము కూడ ఫలించియే తీరును. ఆనాడు నీవు పుణ్యశీలుడును ధర్మజ్ఞుడును నా శుశ్రూష చేయుచు నా యింటిలో ఉన్నవాడును అంగిరసుని మనుమడును బ్రాహ్మణుడును ఏ విధముగను చంపరానివాడును అగు కచుని చంపించుటవలనను నా కూతును కొట్టించుట వలనను నేను నిన్నును నీ వారినెల్లరను కూడ విడిచివేయు చున్నాను. నీతో కలిసి నీ దేశమునందుండ జాలను. నీవు ఇపుడు నన్నును మిథ్యా ప్రలాపియగు (అనినంత పనిని చేయజాలని) దై త్యునిగా భావించుచున్నట్లున్నది. అందుచేతనే నీ పొగరుబోతు కుమార్తెను ఏమియు అనక ఊరకున్నావు.''

వృషపర్వుడు ఇట్లనెను: ''భార్గవా! నీవు స్వధర్మ పరుడవు. మృషలు పలుకవు. అని నాకు తెలియును. నీవు సత్యమునకును ధర్మమునకును ఆధారమవు. కనుక నీవు మమ్ముల ననుగ్రహింప వేడుచున్నాను. నీవు ఇపుడు మమ్ములను విడిచి వెళ్ళినచో మేము సముద్రములోనికి పోయి దాగవలసినదే. మాకంతకంటె వేరే దిక్కులేదు.''

శుక్రుడు: ''సముద్రములో ప్రవేశించినను సరియే. మీరందరును దిక్కులకు పారిపోయినను సరియే. నాకు మిగుల ప్రీతిపాత్రురాలగు నా కుమార్తెకు అప్రియము జరిగె ననునది నేను వినజాలను. నా జీవితమునకు ఆధారమగు దేవయానిని నీవు అనుగ్రహింపజేసికొనినచో ఇంద్రునకు బృహస్పతివలె నేను నీ యోగక్షేమములను చూతును.''

వృషపర్వుడు : ''భార్గవా! ఈ భూలోకమున రాక్షసుల ఆస్తిగా ఏనుగులు గుర్రములు గోవులు ధనము మొదలయినది ఏది యేది గలదో దానికంతటికిని రాక్షసులకును నాకును నీవే ప్రభువవు.''

శుక్రుడు : ''రాక్షస రాజా! మహాసురులారా! మీరన్నట్లు దై త్యేంద్రుల ద్రవ్యమంతటికిని నేనే ప్రభుడననుట నిజమయినచో దేవయానిని బ్రతిమాలి ఆమెను అనుగ్రహింపజేసికొనుడు.''

శౌనకః : తతస్తు త్వరిత శ్శుక్ర స్స రాజ్ఞా సమ మాయ¸° |

ఉవాచ చైనాం సుభ##గే ప్రతిపన్నం వచస్తవ. 14

శర్మిష్ఠాయా దాసీత్వ ప్రాప్తికథనమ్‌.

దేవయానీ : యది త్వ మీశితా తాత రాజ్ఞో విత్తస్య భార్గవ |

నాభిజానామి తత్తేహం రాజా వదతు మాం స్వయమ్‌. 15

వృషపర్వా : యం కామ మభిజానాసి దేవయాని శుచిస్మితే |

తత్తేహం సమ్ర్పవక్ష్యామి యద్యపి స్యా త్సుదుర్లభమ్‌. 16

దేవయానీ: దాసీంకన్యాసహస్రేణ శర్మిష్ఠా మభికామయే| అనుయాస్యతు మాం తత్ర యత్ర దాస్యతి మే పితా వృషపర్వా : ఉత్తిష్ఠ ధాత్రి గచ్ఛ త్వం శర్మిష్ఠాం శీఘ్ర మానయ |

యం చ కామయతే కామం దేవయానీ కరోతు తమ్‌. 18

శౌనకః : తతో ధాత్రీ తత్ర గత్వా శర్మిష్ఠా మిద మబ్రవీత్‌ | ఉత్తిష్ఠ భ##ద్రే శర్మిష్ఠే జ్ఞాతీనాం సుఖ మావహ.

త్యజతి బ్రాహ్మణ శ్శిష్యా న్దేవయాన్యా ప్రచోదితః | యం సా కామయతే కామం స కార్యో7త్ర త్వయానఘే.

దాసీత్వ మభిజానాసి దేవయాన్యా స్సుశోభ##నే |

శర్మిష్ఠా : యం చ కామయతే కామం కరవాణ్యహ మద్య తామ్‌. 21

మాగా న్మన్యువశం శుక్రో దేవయానీ చ మత్కృతే |

శౌనకః : తతః కన్యాసహస్రేణ వృతా శిబికయా తదా. 22

పితు ర్నిదేశా త్త్వరితా నిశ్చక్రామ పురోత్తమాత్‌ | శర్మిష్ఠా : అహం కన్యాసహస్రేణ దాసీభిః పరివారితా.

అను త్వాం తత్ర యాస్యామి యత్ర దాస్యతి తే పితా |

దేవయానీ: స్తువతో దుహితా చాహం యాచతః ప్రతిగృహ్ణతః. 24

స్తూయమానస్య దుహితా కథం దాసీ భవిష్యసి | శర్మిష్ఠా: యేన కేనచి దార్తానాం జ్ఞాతీనాం సుఖ మావహేత్‌.

అను యాస్యా మ్యహం తత్ర యత్ర దాస్యతి తే పితా | శౌనకః: ప్రతిశ్రుతే దాసభావే దుహిత్రా వృషపర్వణః.

దేవయానీ నృపశ్రేష్ఠ పితరం వాక్యమబ్రవీత్‌ | ప్రవిశామి పురం తాత హృష్టాస్మి ద్విజస త్తమ. 27

అమోఘం తవ విజ్ఞాన మస్తి విద్యాబలం చతే | ఏవముక్తో ద్విజశ్రేష్ఠో దుహిత్రా సుమహాయశాః. 28

ప్రవివేశ పురే హృష్టః పూజిత స్సర్వదానవైః. 29

ఇది శ్రీమత్స్యమహాపురాణ మత్స్యమనుసంవాదా న్తర్గత శౌనకశతానీకసంవాదే చన్ద్రవంశానువర్ణనే యయాతిచరితే శర్మిష్ఠాయాః దేవయానీదాసీత్వప్రాప్తికథనం నామైకోనత్రింశో7ధ్యాయః.

తరువాత వెంటనే శుక్రుడు త్వరితగమనముతో వృషపర్వునితో కలిపి దేవయాని ఉన్న చోటికి వచ్చి ''పుత్త్రీ! నీవు ఆదృష్టవంతురాలవు. రాజు నీ మాటను అంగీకరించినాడు.'' అనెను. దేవయానియు ''తండ్రీ! భార్గవా! రాజ ధనమునకంతటికిని నీవు స్వామివి అగునో కాదో నాకేమి తెలియును? నీ మాట నేనెట్లు అంగీకరింతును? రాజే నాతో స్వయముగా ఆ మాట చెప్పనిమ్ము.'' అనెను. వృషపర్వుడు! దేవయానీ! నీ హృదయము నిర్మలమయి నీవు ఒక చిరునవ్వు నవ్విన మాకంతియ చాలును. నీవేది ఏది కోరిన నది ఎంత సుదుర్లభమయినను దానిని నెరవేర్చుదును. దేవయాని : ''తన దాసీ కన్యా సహస్రముతో శర్మిష్ఠ నాకు దాసి కావలయును. నా తండ్రి నన్నె చ్చటికిచ్చిన నచ్చటి కామెయు నా వెంట రావలయును.'' వృషపర్వుడు : ''దాదీ! నీవు పొమ్ము. శ్రీఘ్రమే శర్మిష్ఠను పిలిచికొని రమ్ము. దేవయాని ఏది కోరిన నది ఆమె చేయవలయును.

వెంటనే దాది శర్మిష్ఠకడకు పోయి ఇట్లు చెప్పెను: అమ్మాయీ! శర్మిష్ఠా! లెమ్ము. మీ పుట్టింటి వారికి సుఖము కలిగించుము. దేవయాని ప్రేరణచే శుక్రుడు తన శిష్యులను విడుచుచున్నాడు. అందులకై నీవు ఇపుడు దేవయాని కోరిన దెల్ల చేయవలసియున్నది. నీవు ఎంతయో శోభనరూపురాలవు. ఐనను దేవయానికి దాసీత్వమును అంగీకరింపవలసియున్నది. శర్మిష్ఠ: ''ఆమె ఏది కోరిన నేనిపు డది చేయుదును. నా మూలమున శుక్రుడుగాని దేవయాని కాని కోపింపకుండుట కావలయును.''

వెంటనే తన తండ్రి ఆజ్ఞతో శర్మిష్ఠ వేయి మంది తన దాసీ కన్యలు తనవెంట రాగా పాలకి నెక్కి తన తండ్రి పురమునుండి బయలు వెడలెను. శర్మిష్ఠ దేవయానితో: ''నేను నా దాసీ కన్యా సహస్రము నావెంట రాగా నిన్ను నీ తండ్రి ఇచ్చిన చోటికి నీ వెంట వత్తును.'' దేవయాని: ''స్తుతించుచు యాచించుచు ప్రతి గ్రహించుచు ఉండువాని కూతురను నేను. స్తుతించబడు వాని కూతురవు నీవు నాకు దా వెట్లగుదువు?'' శర్మిష్ఠ: ''ఏ విధముగనై నను కన్య తన పుట్టి నింటివారికి సుఖము కలిగింపవలెను. కనుక తండ్రి నిన్నెచ్చటి కిచ్చిన ఆచ్చటికి నీ వెంట వత్తును.''

ఇట్లు వృషపర్వుని కూతురు తనకు దాసి యగుటకు అంగీకరించగా దేవయాని తన తండ్రితో ఇట్లనెను: ''ద్విజ శ్రేష్ఠుడవగు తండ్రీ! నేను హర్షముతో పురములో ప్రవేశింతును. మీ విజ్ఞానమును విద్యాబలమును అమోఘమయినవి.'' తన కూతురు ఇట్లు పలికిన మీదట మిగుల గొప్పకీర్తి కల ఆ శుక్రుడు తన రాక్షసులు ప్రశంసించుచుండ వృషపర్వుని పురము ప్రవేశించెను.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున యయాతి చరితమున శర్మిష్ఠ దేవయానికి దాసియగుట యను ఇరువది తొమ్మిదవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters