Sri Matsya Mahapuranam-1    Chapters   

దశోత్తరశతతమో7ధ్యాయః.

ప్రయాగమాహాత్మ్యమ్‌.

నన్దికేశ్వరః : 

భ్రాతృభి స్సహిత స్సర్వై ర్ద్రౌపద్యా సహ భార్యయా | ప్రయాగం సమనుప్రాప్య స్నాత్వా స కృతనైత్యకః. 1

బ్రాహ్మణభ్యో నమస్కృత్వా గురుదేవా న్ప్రతర్ప్య చ | వాసుదేవోపి తత్రైవ క్షణనాభ్యగమ త్తదా. 2

పాణ్డవై స్సహితై స్సర్వైః పూజ్యమాన స్సమాధవః | కృష్ణోథ సహితైస్సర్వై రభ్యషిఞ్చ ద్యుధిష్ఠిరమ్‌. 3

ఏతస్మి న్నన్తరేచైవ మార్కణ్డయో మహామునిః | తత స్స్వస్తీతి చోక్త్వాచ క్షణా దాశ్రమ మభ్యగాత్‌. 4

యుధిష్ఠిరోపి ధర్మాత్మా భ్రాతృభి స్సహ సో7వసత్‌ | మహాదానం తతో దత్వా ధర్మసూను ర్యుధిష్ఠిరః. 5

యస్త్విదం కల్య ఉత్థాయ మాహాత్మ్యం పఠతే నరః | ముచ్యతే సర్వపాపేభ్యో రుద్రలోకం స గచ్ఛతి. 6

నూట పదవ అధ్యాయము.

ప్రయాగ మాహాత్మ్యము.

నందికేవ్వరుడు నారదునకు ఇట్లు చెప్పెను: అంతట యుధిష్ఠిరుడు మార్కండేయ వచనమున సోదరులతోను పత్నియగు ద్రౌపదితోను కూడి ప్రయాగకేగి స్నానమాడి నిత్యానుస్ఠానముదీర్చి బ్రాహ్మణుల నమస్కరించి గురువులకు (పూర్వులగు పెద్దలకు) దేవతలకు తర్పణము ఇచ్చెను. క్షణములో వాసుదేవుడును అక్కడ కేతెంచెను. మాధవుడును వారలందరచే పూజింపబడి పిమ్మట యుధిష్ఠిరు నభిషేకించెను. అంతలోనే మార్కండేయ మహా మునియు నతనికి స్వస్తి వచనము పలికి క్షణములో తన యాశ్రమమేతెంచెను. యుధష్ఠిరుడు మాత్రము భ్రాత్రాదులతో కూడి యటనేయుండి మహా దానము లాచరించెను. ప్రాతఃకాలమున మేల్కాంచి ఈ మహాత్మ్యము పఠించు నరుడు సర్వపాప వినిర్ముక్తుడై రుద్రలోక ప్రాప్తుడగును.

వాసుదేవః: మమ వాక్యంచ కర్తవ్యం త్వయా స్నేహా ద్యుధిష్ఠిర l నిత్యం యజస్వ జుహ్వస్వ ప్రయాగే విగత జ్వరః. 7

ప్రయాగం స్మరవై నిత్యం తస్మా త్కురు యుధిష్ఠిర l స్వయం ప్రాప్స్యసి రాజేన్ద్ర స్వర్గలోకం న సంశయః. 8

ప్రయాగ మనుగచ్ఛేద్వా వసతే వా7పి యో నరః l సర్వపాపవిముక్తాత్మా రుద్రలోకే మహీపతే. 9

ఋషిభిః క్రతవః ప్రోక్తా దేవైశ్చాపి యథాక్కమమ్‌l నహి శక్యా దరిద్రేణ యజ్ఞాః కర్తుం మహీవతే. 10

బహుపకరణా యజ్ఞా నానామ్బారవిస్తరాః l ప్రాప్యన్తే పార్థివైరేవ సమృద్ధైర్వా నరైః క్వచిత్‌. 11

యో దరిద్రైరపి విధి శ్శక్యః ప్రాప్తుం యుధిష్ఠిర l తుల్యో యజ్ఞఫలైః పుణ్యౖ స్తన్నిబోధ వదామితే. 12

ఋషీణాం పరమం గుహ్య మిదం రాజర్షిసత్తమ l తీర్థానుగమనం పుణ్యం యజ్ఞేభ్యో7పి విశిష్యతే. 13

దశతీర్థసహస్రాణి త్రింశత్కోట్య స్తథాపరాః l మాఘమాసే గమిష్యన్తి గజ్గాయాం భరతర్షభ.14

స్వస్థో భవ మహారాజ భుజ్ష్వ రాజ్య మకణ్టకమ్‌ l పునర్ద్రక్ష్యసి రాజేన్ద్ర యజమానో విశేషతః. 15

నన్దికేశ్వరః: ఇత్యుక్త్వా స మహాభాగో మార్కణ్డయో మహాతపాః l యుధిష్ఠిరస్య నృపతే స్తత్రైవాన్తరధీయత. 16

పునస్తత్ర సమాప్లాన్య గాత్రాణి సగణో నృపః l యథోక్తేన విధానేన పరాం నిర్వృతి మాగతః. 17

తదా త్వమపి దేవర్షే ప్రయాగాభిమఖో భవ l అభిషేకంతు కుర్యాద్యః కృతకృత్యో భవిష్యతి. 18

నూతః:ఏవముక్త్వా7థ నన్దీశ స్తత్రైవాన్తరధీయత l నారదోవై జగామాథ ప్రయాగాభిముఖ స్తథా. 19

ఇతి శ్రీమత్స్యమహాపురాణ నన్దికేశ్వరనారదసంవాదే ప్రయాగ

మాహాత్మ్యపరిసమాప్తిర్నామ దశోత్తరశతతమో7ధ్యాయః:

* ఇతి ప్రయాగ మాహాత్మ్యమ్‌.*

అనంతరము శ్రీకృష్ణుడు యుధిష్ఠిరునితో ఇట్లనెను: యుధిష్ఠిరా! నాయందలి స్నేహముతో నావాక్యమిది ఆచరించవలయును. నిత్యమును సంతాపరహితచిత్తముతో ఈ ప్రయాగయందు దేవతల యజించుచు హోమములు జరుపుచుండుము. మరల మార్కండేయుడు యుధిష్ఠిరునితో ఇట్లనెను. రాజా! తరువాత కూడ నిత్యమును ప్రయాగను స్మరించుచుండుము. నిస్సంశయముగా దాన నీవు స్వర్గ సుఖమునందగలవు. ఏలయన నరుడెవ్వడేని ప్రయాగకేగినను నట వసించినను సర్వపాప మిముక్తుడై రుద్రలోకమున పూజితుడై సుఖించును. మహీపతీ ! ఋషులును దేవతలునెన్నియో యజ్ఞ క్రతువులు ప్రవచించిరి. దరిద్రుడవి చేయజాలడుకదా! యజ్ఞములకు బహుపకరణములును నానా సంభార విస్తరములును కావలయును. అట్టివి భూపతులకు మాత్రముగాని ధనవంతులకుగాని లభ్యములగును. కాని దరిద్రులకును పొంద సులభమగు విధానము యజ్ఞఫలతుల్య ఫలప్రదమై పుణ్యప్రదమగునది కలదు; తెలిపెదను. ఇది ఋషులకును తత్త్వమెరుగరాని గుహ్య విషయము. తీర్థయాత్రా గమనము యజ్ఞములకంటె విశిష్టతర పుణ్యప్రదము. ముప్పది కోట్ల పదివేల తీర్థములు మాఘమాసమున గంగయందు చేరియుండును. (ఇది ఎరిగి) నీవు స్వస్థతనందుము. అకంటకముగ రాజ్మము ననుభవించుము. నీవు యజమానుడవయి (యజ్ఞముల నాచరించుచు) నన్ను మరల చూతువుగాని; అని యిట్లు పలికి మార్కండేయుడు యుధిష్ఠిరుని ఎట్ట యొదుటనే అంతర్థానమందెను. యుధిష్ఠిరుడును మరల యథావిధానముగ సపరివారముగ ప్రయాగయందలి గంగా యమునా సంగమమున స్నానమాడి పంమానందము నందెను. కావున నోదేవర్షీ! నారదా! నీవును బయలుదేరి ప్రయాగకేగుము. అని నారదునితో పలికి నందికేశ్వరుడు అంతర్థానమందెను. నారదుడును ప్రయాగాభిముఖుడై బయలుదేరెను.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున ప్రయాగ మాహాత్య్మ

పరిసమాప్తియను నూట పదియవ అధ్యాయము.

క్రియా యోగ ప్రకరణము ముగిసినది.

[ఈ క్రియా యోగము 52వ అధ్యాయము నారంభమునుండి 110 అధ్యాయాంతము వరకు ఇచట ఈయబడినది. మరల 257 అధ్యాయారంభమునుండి 288వ అధ్యాయాంతము వరకు ఇది ప్రతిపాదింపబడును.

-అనువాదకుడు]

Sri Matsya Mahapuranam-1    Chapters