Sri Matsya Mahapuranam-1    Chapters   

షడు త్తరశతతమో7ధ్యాయః.

ప్రయాగమాహాత్మ్యమ్‌.

యుధిష్ఠిరః : 

ఏతచ్ర్ఛుత్వా ప్రయాగస్య య త్త్వయా పరికీర్తితమ్‌ | విశుద్ధం మే7ద్య హృదయం ప్రయాగస్యతు కీర్తనాత్‌. 1

అనాశకఫలం బ్రూహి భగవం స్తత్ర కీదృశమ్‌ | కంచ లోక మవాప్నోతి విశుద్ధ స్సర్వకిల్బిషైః. 2

మార్కణ్డయః : శృణు రాజ న్ర్పయాగస్య త్వనాశకఫలం విభో |

ప్రాప్నోతి పురుషో ధీమాఞ్ఛ్రద్దధానో జితేన్ద్రియః. 3

అహీనాఙ్గో హ్యరోగశ్చ పఞ్చేన్ద్రియసమన్వితః | అశ్వమేధఫలం తస్య గచ్ఛస్తు పదేపదే. 4

కులాని తారయేద్రాజ& దశపూర్వా& దశాపరా& | ముచ్యతే సర్వపాపేభ్య స్సగచ్ఛే త్పరమంపదమ్‌. 5

యుధిష్ఠిరః : మహాభాగ్యం హి ధర్మస్య య త్త్వం వదసి మేప్రబో |

అల్పేనైవ ప్రయత్నేన బహూ& ధర్మా నవాప్ను యాత్‌. 6

అశ్వమేధైస్తు బహుభిః ప్రాప్యతే ప్రాకృతైరపి| ఇమం త్వం సంశయం బ్రూహి పరం కౌతూహలంహి మే.

మార్కణ్డయః: శృణు రాజన్మహద్గుహ్యం మహాపాపప్రణాశనమ్‌ |

పద్మగర్భేణ యత్ప్రోక్త మృషీణాం సన్నిధౌ పురా. 8

పఞ్చయోజనవిస్తీర్ణం ప్రయాగస్యతు మణ్డలమ్‌ | ప్రవేశో యస్య తద్భూమౌ సో7శ్వమేధః పదేపదే. 9

వ్యతీతా న్పురుషా న్త్సప్త భవిష్యాంశ్చ చతుర్దశ | నర స్తారయతే సర్వా న్యస్తు ప్రాణా న్పరిత్యజేత్‌. 10

ఏవం జ్ఞాత్వాతు రాజేన్ద్ర సదా శ్రద్ధాపరో భవ | అశ్రద్దధానాః పురుషాః పాపోపహతచేతసః. 11

న ప్రాప్నువన్తి తం స్థానం ప్రయాగం దేవరక్షితమ్‌ |

యుధిష్ఠిరః : స్నేహాద్వా ద్రవ్యలోభాద్వా యేతు కామవశం గతాః. 12

కథం తీర్థఫలం తేషాం కథం పుణ్య మవాప్నుయుః | విక్రయ స్సర్వభాణ్డానాం కార్యాకార్య మజానతః. 13

ప్రయాగే కా గతి స్తస్య తన్మే బ్రూహి మహామతే |

మార్కణ్డయః : శృణు రాజ న్మహద్గుహ్యం సద్యః పాపప్రణాశనమ్‌. 14

మాసమేకం నర స్స్నాయా త్ప్రయాగే నియతేన్ద్రియః |

ముచ్యతే సర్వపాపేభ్యో యథా77దిష్టం స్వయమ్భువా. 15

నూట ఆరవ అధ్యాయము

ప్రయాగ మామాత్మ్యము

యుధిష్ఠిరుడు మార్కండేయు నిట్లడిగెను: అయ్యా! తాము కీర్తించిన ప్రయాగ మాహాత్మ్యమును విని నా హృదయము విశుద్ధమయినది. భగవన్‌! అచట నెట్టి యాచరణమున అనాశక (ఎన్నటికిని నశించని) ఫలము కలుగునది తెలుపుము. దానిచే నరుడు సర్వపాపముక్తుడై యే లోకములనందును? అన మార్కండేయు డతని కిట్లు వచించెను: రాజా! ప్రయాగ తీర్థయాత్రచే అనాశక ఫలమునందు విధము వినుము. వివేకవంతుడును శ్రద్ధాళువును జితేంద్రియుడు నగు పురుషుడు ఆ యాత్రచే అనాశకఫలమునంది అంగవికలుడును రోగియు కాక పంచేంద్రియ నుఖము లనుభవించును; అడుగడుగున అశ్వమేధఫలము నందును; తనకు ముందు వెనుకల పది తరలముల వారిని తరింపజేయును; సర్వపాప వినిర్ముక్తుడై పరమపద మందును.

అనిన మార్కండేయుని పలుకులు వినిన యుధిష్ఠిరు డిట్లనెను: ప్రభూ! తాము చెప్పుదానిని బట్టి నరుడు అల్ప ప్రయత్నముతోనే బహు ధర్మాచరణఫలములనందు మహాభాగ్యము కలుగునని తెలియుచున్నది. కాని ప్రాకృత జనులును ఇంత సుకరముగ అనేకాశ్వమేధఫల మెట్లంద కలుగుదురని సంశయించుచున్నాను. ఇది తీర్ప వేడుచున్న నా కుతూహలము తీర్పు డనెను. ఆతనికి మార్కండేయు డిట్లు తెలిపెను: రాజా! మహాపాప ప్రణాశకమును మహాగుహ్యము నగు విషయము చెప్పెదను. ఇది పూర్వము ఋషుల సన్నిధియందు చతుర్ముఖుడు చెప్పెను. ప్రయాగ మండలము ఐదు యోజనముల విస్తృతి కలది. అట ప్రవేశించి (పై జెప్పిన గుణములతో కూడి యాత్ర సేవించి)న యాతని కడుగడుగున నశ్వమేధ ఫల మబ్బును. గడచిన-గడువనున్న-ఏడేసి తరములవారి నతడు తరింపజేయును. అట ప్రాణత్యాగముచే కూడ ఈ పల మబ్బును. ఇది యెరిగి రాజేంద్రా! సదా శ్రద్ధాపరుడవు గమ్ము. పాపోపహతచిత్తులును అశ్రద్దధానులు నగు వారు దేవరక్షితమగు ఆ ప్రయాగ స్థానమును చేరి దాని సేవింపజాలరు.

అన విని యుధిష్ఠిరు డిట్లనెను: ద్రవ్యమునందు ప్రీతి లోభములకు పశులై కామవశులై ఈ యాత్ర చేసినవారికి కలుగు తీర్థయాత్రాఫలము ఎట్టిది? వారికే గతి కలుగును? ఇది చేయదగు నిది చేయరాదనునది లేక యచట ధనాశతో కామబుద్ధితో సర్వ ద్రవ్యముల నమ్ముకొను వ్యాపారి కే ఫలము కలుగునో తెలుపుము. అన మార్కండేయు డతని కిట్లు చెప్పెను.: రాజా! మమాగుహ్యమును వినినంతనే పాపనాశకమునగు నది చెప్పెద వినుము. ప్రయాగయందు నరుడు నియతేంద్రియుడై మాసకాలము స్నాన మాడినచో సర్వపాపముక్తు డగునని స్వయంభూ బ్రహ్మ చెప్పెను.

శుచిస్తు ప్రయతో భూత్వా7హింసక శ్శ్రద్ధయా7న్వితః| ముచ్యతే సర్వపాపేభ్య స్సగచ్ఛే త్పరమంపదమ్‌.

విప్రమ్భపాతకానాంతు ప్రయాగే శృణు యత్ఫలమ్‌| త్రికాలమేవ స్నాయీత ఆహారం భైక్ష మాచరేత్‌. 17

త్రిభిర్మాసైః ప్రముచ్యేత ప్రయాగే నాత్రసంశయః | అజ్ఞానేనతు తత్సర్వం తీర్థయాత్రాదికం భ##వేత్‌. 18

సర్వకామసమృద్ధస్తు స్వర్గలోకే మహీయతే | స్థానంచ లభ##తే నిత్యం ధనధాన్యసమాకులమ్‌. 19

ఏవం జ్ఞానేన సమ్పూర్ణ స్సదా భవతు లోభవా& | తారితాః పితరస్తేన నరకా త్ప్రపితామహాః. 20

ధర్మానుసారీ ధర్మజ్ఞ త్వయాపృష్టః పునఃపునః| త్వత్ప్రియార్థం మయాప్రో క్తం గుహ్యమేత త్పనాతనమ్‌.

ఆచట శరీరమున చిత్తమున శుచియు ప్రయతుడును అహింసకుడును శ్రద్ధావంతుడునగు వానికే పాపము క్తియు పరమపదప్రా ప్తియు నగును; (పైకి పుణ్యము చేయువారుగా కనబడుచు) రహస్యముగ పాపములే యచట చేయువారికి కలుగు ఫలము దీనితోనే నీవు తెలిసికొనుము. అట్టివారు ఆచట మూడు పూటల స్నానము చేయుచు భిక్షాటనముచే జీవించుచు మూడు మాసములు గడపినచో అజ్ఞానకృతమగు పాపము నశించును. తీర్థయాత్రాఫల మబ్బును. సర్వకామపూర్తినందును. స్వర్గసుఖముల నందును. పపిదప ధనధాన్య సమృద్ధి కలవారి యింట జనించును. లోభవంతుడే యగుగాక! అత డిది ఎరిగి జ్ఞానవంతుడై ప్రయాగతీర్థ సేవ చేసినచో అతని పితృ పితామహాదులును నరకమునుండి తరింతురు. ధర్మానుసారినగు నన్ను ధర్మము నెరుగ గోరి నీవు మరి మరి యడిగినది గుహ్యము సనాతనమునగు విషయము నీ ప్రీతికై చెప్పితిని.

యుధిష్ఠిరః : అద్యమే సఫలంజన్మ హ్యద్యమే తారితం కులమ్‌ |

ప్రీతో స్మ్యనుగృహీతోస్మి దర్శనాదేవ తే మునే. 22

త్వద్దర్శనాత్తు ధర్మాత్మ న్ముక్తో7హం సర్వకిల్బిషైః | ఇదానీం వేద చాత్మానం భగవ& హతకిల్బిషమ్‌. 23

మార్కణ్డయః : దిష్ట్యా తే సఫలం జన్మ దిష్ట్యా తే తారితం కులమ్‌ |

కీర్తనా ద్వర్ధతే పుణ్యం శ్రుత్వా పాపం ప్రణశ్యతి. 24

యమునాస్నానమాహాత్మ్యమ్‌.

యుధిష్ఠిరః : స్నానేన యమునాయాం తు కింఫలంవై మహామునే |

ఏతన్మే సర్వమాఖ్యాహి యథాదృష్టం యథాశ్రుతమ్‌. 25

మార్కణ్డయః : తపనస్య సుతా దేవీ త్రిషు లోకేషు విశ్రుతా |

సమాఖ్యాతా మహాపుణ్యా యమునా తత్ర నిమ్నగా. 26

యేనైవ నిస్సృతా గఙ్గా తేనైవ యమునా గతా | యోజనానాం సహస్రేణ కీర్తనా త్పాపనాశనీ. 27

తత్ర స్నాత్వా చ పీత్వాచ యమునాయాం యుధిష్ఠిర | కీర్తనా ల్లభ##తే పుణ్యం దృష్ట్వా భద్రాని పశ్యతి. 28

అవగాహ్యచ పీత్వావా పునాత్యాసప్తమం కులమ్‌ | తస్యాం స్నానఫలాదేవ స యాతి పరమాం గతిమ్‌. 29

అగ్నితీర్థమితి ఖ్యాతం యమునాదక్షిణతటే | పశ్చిమే ధర్మరాజస్య తీర్థంచ నరకం స్మృతమ్‌. 30

తత్ర స్నాత్వా దివం యా న్తి యేమృతా స్తే7పునర్భవాః | ఏవం తీర్థాని సర్వాణి యమునాదక్షిణతటే. 31

ఉ త్తరేణ ప్రవక్ష్యామి ఆదిత్యస్య మహాత్మనః | తీర్థం నిరఞ్జనంనామ యత్రదేవా స్సవాసవాః. 32

ఉపాసతే సదా సన్ధ్యాం నిత్యం కాలే యుధిష్ఠిర | దేవా స్సేవ న్తి త త్తీర్థం యే చాన్యే విబుధా జనాః. 33

సదా దానపరో భూత్వా కురు తీర్థాభిషేచనమ్‌ | అన్యేచ బహవ స్తీర్థా స్సర్వపాపహరా స్మృతాః. 34

తేషు స్నా త్వా దివం యాన్తి యే మృతా స్తే7పునర్భవమ్‌ | గఙ్గాచ యమునాచైవ ఉభే తుల్యఫలే స్మృతే.

కేవలం జ్యేష్టభావేన గఙ్గా సర్వత్ర పూజ్యతే | ఏవం కురుష్వ కౌ న్తేయ సర్వతీర్థాభిషేచనమ్‌. 36

యావజ్జీవకృతం పాపం తత్‌క్షణాదేవ నశ్యతి | య ఇదం కల్య ఉత్థాయ పఠతేచ శృణోతిచ. 37

ముచ్యతే సర్వపా పేభ్య స్సర్గలోకం సగచ్ఛతి.

ఇతి శ్రీమత్స్యమహాపురాణ మార్కణ్డయ యుధిష్ఠిరసంవాదే ప్రయాగ

మాహాత్మ్యే షడు త్తరశతతమో7ధ్యాయః.

అన యుధిష్ఠిరు డిట్లనెను: ఇపుడు నా జన్మము సఫలమైనది. నా వంశ పూర్వులు తరించిరి. మునీ! నీ దర్శన మున ప్రీతి చెందితిని. అనుగ్రహము నందితిని. సర్వపాపముక్తుడ నయితిని. అన మార్కండేయు డిట్లనెను: నీ జన్మము సఫలమగుటయు నీ వంశము తరించుటయు నీ యదృష్ఠమే. ప్రయాగ క్షేత్రమును గూర్చి వినుటచే దానిని కీ ర్తించుటచే పాపనాశ పుణ్యవృద్ధులు కలుగును. అన యుధిష్ఠిరు డిట్లనెను. మహామునీ! యమునా స్నాన ఫలమును నీవు కనివిని ఎరిగినంత తెలుపుము. అన ముని యిట్లనెను: రవిసుతయని త్రిలోక విశ్రుతయగు యమున యను నామె మహాపుణ్యద యగు నదిగా ప్రసిద్ధయయి అట ప్రవహించుచున్నది. ఏ హేతువున గంగ ఉత్పన్నయైనదో ఆ హేతువుననే యమునయు ఆమెతో కలిసినది. (అనగా ఆ రెండు నదులు నట ప్రయాగ తీర్థమున సంగమించుట ప్రాణుల పాపనాశమునకేయని యర్థము.) వేల యోజనములయందుండి యామెను కీ ర్తించినను పాపనాశకమగు యమునయం దచట స్నాన మాడినను జలము ఆచమించినను సమీపమందుండి ఆమెను కొనియాడినను భ క్తితో దర్శించినను శుభములు కలుగుటలో సందేహమే లేదు. అట యమునా స్నానముచే జలపానముచే తానును తన ఏడు తరముల వారును పరమగతి నందుదురు. యమునా దక్షిణతటమున అగ్ని తీర్థమును దానికి పశ్చిమమున నరకమను ధర్మరాజ తీర్థమును కలవు. అట స్నానముచే పునరావృత్తి రహితలోకప్రాప్తు డగును. యమునో త్తర తటమున ఆదిత్య దేవతాకమగు నిరంజనతీర్థ మున్నది. ఇంద్రాది దేవతలును తదితర విద్వాంసులను సంధ్యాదేవి నట ఉపాసింతురు. నీ వచట సదా తీర్థ స్నాన మాడుచు దానము చేయుచుండుము. అచట యమునా తీరమున పాపహరములు మరి యెన్నియో తీర్థములు కలవు. వానియందు స్నానముచే పునరావృత్తి రహితలోకప్రా ప్తి యగును. గంగకు పెద్దరిక మిచ్చి పూజింతురే కాని వా స్తవమున గంగా యమునలు రెండును తుల్యఫలప్రదములే. కావున కౌంతేయా! నీవు నే జెప్పిన తీరున సర్వతీర్థ స్నా మచట చేసినచో తత్‌క్షణమే యావజ్జీవము నీవు చేసిన పాపము లన్నియు నశించును.

వేకువనే లేచి ఇది చదివినను వినినను సర్వపాపముక్తుడై స్వర్గప్రాప్తు డగును.

ఇది శ్రీమత్స్య మహాపురాణమున ప్రయాగ మాహాత్మ్యమను నూట ఆరవ అద్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters