Sri Matsya Mahapuranam-2    Chapters   

ఏకాశీత్యుత్తరద్విశతతమో7ధ్యాయః.

హేమహస్తిరథదానవిధానమ్‌.

శ్రీమత్స్యః: అథాత స్సమ్ప్రవక్ష్యామి హేమహ స్తిరథం శుభం | యస్య ప్రదానా ద్భువనం వైష్ణవం ప్రాప్యతే నరైః. 1

పుణ్యాం తిథి మథాసాద్య తులాపురుషదానవత్‌ | విప్రవాచనకం కుర్యా ల్లోకేశావాహనం బుధః. 2

ఋత్విఙ్మణ్డపసమ్భారభూషణాచ్ఛాదనానిచ | అత్రాప్యుపోషిత స్తద్వ ద్భ్రాహ్మణౖ స్సహ భోజనమ్‌. 3

కుర్యా తృష్పరథాకారం కాఞ్చనం మణిమణ్డితవ్షు | వలభీభిర్విచిత్రాభి శ్చతుశ్చక్రసమన్వితమ్‌. 4

కృష్ణాజినే తిలద్రోణం కృత్వా సంస్థాపయే ద్రథమ్‌ | లోకపాలాష్టకోపేతం బ్రహ్మ7ర్కశివ సంయుతమ్‌. 5

మధ్యే నారాయణోపేతం లక్ష్మీపుష్టిసమన్వితమ్‌ | తథాష్టాదశ ధాన్యాని భాజనాసనచన్దనైః. 6

దీపకోపానహచ్ఛత్త్ర పాదుకాదర్పణాన్వితమ్‌ | ధ్వజేతు గరుడం కుర్యా త్కూబరాగ్రే వినాయకమ్‌. 7

నానా ఫలసమాయుక్త ముపరిష్టా ద్వితానకమ్‌ | కౌశేయ పఞ్చవర్ణం చ అవ్లూనకుసుమాన్వితమ్‌. 8

చతుర్భిః కలశై స్సార్ధం గోభి రష్ఠాభిరన్వితమ్‌ | చతుర్భి ర్హేమమాతఙ్గై ర్ముక్తాదామవిభూషితైః. 9

స్వరూపతః కరిభ్యాంచ యుక్తం కృత్వా నివేదయేత్‌ | కుర్యా త్పఞ్చపలాదూర్ధ్వ మాభారాదపి శక్తితః. 10

తథా మఙ్గళశ##బ్ధేన స్నాపితో పేదపుఙ్గవైః | త్రిః ప్రదక్షిణ మావృత్య గృహీతకుసుమాఞ్జలిః. 11

ఇమ ముచ్ఛారయేన్మన్త్రం బ్రాహ్మణభ్యో నివేదయేత్‌ | నమో నమ శ్శఙ్కరప్మజార్క లోకేశ విద్యాధరవాసుదేవైః. 12

త్వం సేవ్యసే వేదపురాణయజ్ఞే స్తేజోమయ స్యన్దన పాహితస్మాత్‌ | యత్తత్పదం పరమగుహ్యతమం మురారే హ్యానన్దహేతు గుణరూపవిముక్తమన్తః. 13

యోగై కతానస్వదృశో మున్వయ స్సమాధౌ పశ్యన్తి తత్త్వమసి నాథ పదే7ధిరూఢ |

యస్మాత్తమేవ భవసాగరసవ్లుుతానా మానన్దభా గమృతమధ్వరపానపాత్రమ్‌. 14

తస్మా దఫ°ఘశమనేన కురు ప్రసాదం చామీకరేభరథ మాధవ సమ్ప్రదానాత్‌ |

ఇత్థం ప్రణమ్య కనకేభరథప్రదానం యః కారయే త్సకల పాపవిముక్తదేహః. 15

విద్యాధరామరమునీన్ద్రగణాధిజుష్టం ప్రాప్నో త్యసౌ పద మనుత్తమ మిన్దుమౌళేః| కృతదురుతవితాన ప్రజ్వలద్వహ్నిజాల వ్యతికరకృతదేహోద్వేగ భాజో7పి బన్ధూ&. 16

నయతి చ పితృపౌత్త్రా న్బాన్ధవాన ప్యశేషా న్కృతగజరథదానా చ్ఛాశ్వతం సద్మ విష్ణోః. 16

ఇతి శ్రీమత్స్యమహాపురాణ మహాదానాను కీర్తనే హేమహస్తిరథ ప్రదానికో

నామ ఏకా7 శీత్యుత్తరద్విశతతమో7ధ్యాయః.

రెండు వందల ఎనిబది యొకటవ అధ్యాయము.

హిరణ్య హస్తి (గజ) రథ దాన విధానము.

శ్రీమత్స్యుడు మనువునకు ఇట్లు చెప్పెను: ఇపుడిక శుభమగు సువర్ణగజ రథ విధానము తెలిపెదను: ఆ ప్రదానముచే వివేకులగు నరులు వైష్ణవపద (స్థాన) ము నందు గలరు; శుభదినమందు తులాపురుష దానమందువలెనే విప్రులచే స్వస్తిపుణ్యాహవాచన లోకపాలావాహనాదికము జరిపవలెను; ఋత్విజులను మండపమును సంభారములను భూషణ వస్త్రాదికమును కూడ అట్లే సమకూర్చుకొనవలయును; ఇందును అట్లే ఉపవసించి బ్రాహ్మణులతో కూడి భోజనము జరుపవలయును; పుష్ప రథాకారమగు బంగరు రథము చేయించవలయును; అందు మణ్యలంకారములు వింతగొలుపు వలభులు(చూరులవంటి కూర్పులు) నాల్గుచక్రములుఉండవలెను; అష్టలోకపాలురు బ్రహ్మరవి శివులు నడుమ లక్ష్మీ పుష్టి దేవీసహితుడగు నారాయణుడు నుండవలెను; ఇవియన్నియు కృష్ణాజినముపై తిలద్రోణమందుంచవలయును; దగ్గరలో అష్టాదశధాన్యములు పాత్రములు ఆసనములు చందననము దీపికలు పాదుకలు పాదరక్షలు ఛత్త్రములు అద్దములు ఉండవలెను: రథపు ధ్వజమందు గరుడుడు కూబరపు కొనపై వినాయకుడు నుండవలెను; దానిపై మేలు కట్టును దగ్గరలో నానాఫల ములును ఐదు వన్నెల పట్టువస్త్రమును వాడని పూవులును కుశ చతుష్టయమును అష్టగోవులును సువర్ణగజ చతుష్టయమును ముత్తెముల దండలును రెండు వాస్తవ గజములును- ఇన్నియు ఉంచి దానమీయవలెను; బంగరు రథము మాత్రము ఐదు పలములనుండి బారువ వరకుగల బంగారుతో చేయించవలయును; మంగళవాద్య వేదధ్వనులతో కూడ వేదవేత్తలగు బ్రాహ్మమ పుంగవులచే స్నానము చేయించుకొని యజమానుడు పూవులు దోసిట పట్టుకొని అగ్న్యాదులను త్రిఃప్రదక్షిణము చేసి ఈ మంత్రముచ్ఛరించుచు బ్రాహ్మణులకు అవి దానము చేయవలెను :

" తేజోమయ రథమా! నమోనమః; బ్రహ్మవిష్ణు రుద్ర రవి లోకపాల విద్యాధరులును వేద పురాణ యజ్ఞములును నిన్ను సేవించు (ఆశ్రయిం)చును; కావున ఇట్టి నీవు మమ్ము కాపాడుము; పరమ గుహ్యతమమును ఆనందహేతువును గుణరూప రహితమును నగు ఏ విష్ణు స్థానమును యోగై కావలంబనమగు స్వదృక్కులుగల యోగులు తమ హృదయ మధ్య మందు చూతురో ఆ మహాతత్త్వము నీవే 'నాథుడవు' ' రక్షకుడవు' అను పదమందు నిలిచినవాడవు; భవసారమున ముంచబడినవారికి ఆనందకరమగు అమృతమును త్రావుటకుపయోగించు యజ్ఞాంగ పానపాత్రమవు (చమనము) నీవే; కావున బంగరుటేనుగుల అరదమురాపున నుండు మాధవా! పాపరాశిని శమింపజేసి ఈ దానముచే మాయందనుగ్రహమును చూపుము. "

ఇట్లు పలికి నమస్కరించవలయును; ఇట్లు హిరణ్యగజ రథ ప్రదానము చేయువాడు సకల పాప విముక్తదేహుడై విద్యాధరమునీంద్రదేవతా గణముల కాశ్రయమగు మహోత్తమ శివస్థాన మందును; తాము చేసిన అనేక పాప రాసు లనెడు మంటలగముల సంపర్కముచే మండుచు బాధలనందు దేహములు కలిగి బాధలను ఉద్వేగమును అందుచున్న బంధువులను పితృపౌత్త్రులను ఇతరా7శేష బంధువులను కూడ ఈదాత విష్ణు లోకమును తీసికొనిపోవును.

ఇది శ్రీమత్స్య మహాపురాణమున షోడశ మహాదానాను కీర్తనమున హిరణ్య హస్తిరథ ప్రదానికమను రెండు వందల ఎనిబది యొకటవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-2    Chapters