Sri Matsya Mahapuranam-2    Chapters   

సప్త పంచాశదుత్తర ద్విశతతమో7ధ్యాయః.

క్రియాయోగవిధిః.

ఋషయః : క్రియాయోగః కథం సిద్ధ్యే ద్గృహస్థాదిషు సర్వదా | జ్ఞానయోగసహస్రాద్ధి కర్మయోగో విశిష్యతే. 1

సూతః క్రియాయోగం ప్రవక్ష్యామి దేవతార్చానుకీర్తనమ్‌ | భుక్తిముక్తిప్రదం యస్మా న్నాన్య ల్లోకే విశిష్యతే. 2

ప్పతిష్ఠాయాం సురాణాంతు దేవతార్చానుకీర్తనమ్‌ | దేవయజ్ఞోత్సవం చాపి బన్ధనా ద్యేన ముచ్యతే. 3

విష్ణుప్రతిమాలక్షణమ్‌.

విష్ణో స్తావ త్ప్రవక్ష్యామి యాదృగ్రూపం ప్రశస్యతే | శఙ్ఖచక్రధరం శాన్తం పద్మహస్తం గదాధరమ్‌. 4

ఛత్త్రాకారం శిర స్తస్య కమ్భుగ్రీవం శుభేక్షణమ్‌ | తుఙ్గనాసం శుక్తికర్ణం ప్రశాన్తోరుభుజక్రమమ్‌. 5

క్వచి దష్టభుజం కుర్యా చ్చతుర్భుజం మథాపి వా | ద్విభుజం వాపి కుర్వీత భవనేషు పురోధసా. 6

దేవస్యాష్టభుజస్యాస్య యథాస్థానం నిబోధమే | ఖడ్గో గదా శరః పద్మం దివ్యం దక్షిణతో హరేః. 7

ధనుశ్చ ఖేటకం చైవ శఙ్ఖం చక్రం చ వామతః | చతుర్భుజస్యం వక్ష్యామి యథైవాయుధ సంస్థితిః. 8

దక్షిణన గదాం పద్మం వాసుదేవస్య కారయేత్‌ | వామత శ్శఙ్థచక్రేతు కర్తవ్యే భూతి మిచ్ఛతా. 9

కృష్ణావతారే తు గదా వామహస్తే ప్రశస్యతే | యథేచ్ఛయా శఙ్ఖచక్రే ఉపరిష్టా త్ప్రకల్పయేత్‌. 10

అధస్తా త్పృథివీ దేవీ కర్తవ్యా పాదమధ్యతః | దక్షిణ ప్రణతం తద్వ ద్గరుత్మన్తం నివేశ##యేత్‌.11

వామతస్తు భ##వే ల్లక్ష్మీః పద్మహస్తా శుభాననా | గరుత్మా నగ్రతశ్చాపి సంస్థాప్యో భూతి మిచ్ఛతా. 12

శ్రీశ్చ పుష్టిశ్చ కర్తవ్యే పార్శ్వయోః పద్మసంయుతే | తోరణం చోపరిష్టాత్తు విద్యాధరసమన్వితమ్‌. 13

దేవదున్ధుభిసంయుక్తం గస్ధర్వమిథునాన్వితమ్‌ | పత్రమల్లీసమోపేతం సింహవ్యాఘ్ర సమన్వితమ్‌. 14

తథా కల్పలతోపేతం స్తువద్భు రమరేశ్వరైః | ఏవం విధో భ##వేద్విష్ణు స్త్రీ భాగేనాస్య పీఠికా. 15

నవతాల ప్రమాణాస్తు దేవదానవకిన్నరాః |

రెండు వందల ఏబది ఏడవ అధ్యాయము.

క్రియాయోగవిధి- ప్రతిమాలక్షణము- విష్ణు ప్రతిమా లక్షణము.

ఋషులు సూతునిట్లడిగిరి: గృహస్థులు మొదలగువారియందు సర్వదా క్రియాయోగము ఎట్లు సిద్ధించును? ఏల యన- వేయి జ్ఞానయోగములకంటెను కర్మ(క్రియ) యోగము విశిష్టతరమయినదికదా! కావున క్రియా యోగసిద్ధి కలుగు మార్గమెరుగుట ఆవశ్యకము. అన సూతుడు వారికిట్లు చెప్పెను. దేవతల అర్చామూర్తులను అనుకీర్తించుట (వివరించుట) అను క్రియాయోగ ప్రకారమును మీకు ప్రవచింతును: ఏలయన దానికంటె విశిష్టతరమగు భుక్తి ముక్తిప్రద సాధనము మరియేదియులేదు. సంసార బంధముక్తి కలిగించునది కావునను దేవతా ప్రతిష్ఠయందును దేవతాయజ్ఞో త్సవములందును ఆవశ్యకము కావునను దేవతల యర్చామూర్తుల స్వరూపవర్ణనము తెలిసికొనదగియున్నది; ఇందు మొదట ప్రశస్తమగు విష్ణు ప్రతిమా రూపమును తెలిపెదను.

అతడు శంఖచక్రధరుడు శాంతుడు పద్మహస్తుడు గదాధరుడు ఛత్త్రాకార శిరస్కుడు శంఖముంవంటి మెడయు శుభ##నేత్రములును కలవాడు. అతని ముక్కు ఎత్తయి చెవులు ముత్తెపుచిప్పలవలెను భుజక్రమములు గొప్పవై ప్రశాంతములుగను నుండును; గృహములయందు పూజకై శాస్త్రజ్ఞుడగు పురోహితుడిది అష్టభుజమూర్తిగనో చతుర్భుజ మూర్తిగనో ద్విభుజమూర్తిగనో చేయించవచ్చును; అష్ట భూజమూర్తికి కుడి చేతులందు ఖడ్గ గదాశర పద్మములును వామహస్తముల యందు ధనుఃభేటక శంఖచక్రములు నుండును; చతుర్భుజునకు కుడిచేతులందు గదా పద్మములును ఎడమ చేతులందు సంఖచక్రరములు నుండును. (ఇచట ఆయా యాయుధములు ఏ క్రమమందుండవలయునో చెప్పబడలేదను అంశము గమనించవలయును). కృష్ణ ప్రతిమకు గద ఎడమ క్రింది చేతియందుండుట ప్రశస్తము; శంఖ చక్రములను తమ ఇచ్ఛానుసారము ఎడమ చేతియందో కుడి చేతియందో పైచేతులయందు నిలుపవలయును; అనగా కుడి క్రింద చేతియందు పద్మముండును; దేవుని పాదద్వయ మధ్యమున క్రిందిభాగమున భూదేవియు కుడివైపున నమస్కరించుచున్న గరుత్మంతుడును ఎడమవైపున పద్మహస్తయు శుభముఖియునగు లక్ష్మియు నుండవలయును; గరుత్మంతుని విష్ణునకు ముందు ఉంచుటయు శ్రేయస్కరమే; పద్మము ధరించిన శ్రీదేవీ పుష్టిదేవులు కుడి ఎడమలందుండవలయును; దేవునకు పైభాగమున తోరణముండును; దానిపై విద్యాధరులు దేవదుందుభులు గంధర్వ దంపతులు పత్రములు వల్లులు సింహములు వ్యాఘ్రములు కల్పలతలు స్తుతించు అమరేశ్వరులు నుందురు; విష్ణు రూపము ఇది.

మూర్తి పరిమాణములో మూడవవంతు పీఠ పరిమాణముండును.

దేవదానవ కిన్నర ప్రతిమలు తొమ్మిది తాళముల ప్రమాణముతో నుండును. (తాలము= చాచిన బొటనవ్రేలి కొననుండి చాచిన నడిమి వ్రేలి కొనవరకుగల దూరము).

అతః పరం ప్రవక్ష్యామి మానోన్మానం విశేషతః. 16

జాలాన్తర ప్రవిష్టానాం భానూనాం యద్రజః స్ఫుటమ్‌ | త్రసరేణు స్స విజ్ఞేయో వాలాగ్రం తై రథాష్టభిః. 17

తదష్టకేణ లిక్షాతు యూకా లిక్షాష్టకం తథా | యవో యూకాష్టకం తద్వ దష్టభి సతై స్తథాఙ్గుళమ్‌. 18

స్వకీయాఙ్గుళ మానేన ముఖం స్యా ద్ద్వాదశాఙ్గుళమ్‌ | ముఖమానే తు క ర్తవ్యా సర్వావయవకల్పనా. 19

సౌవర్ణీ రాజతీ వా7పి తామ్రీ రత్నమయీ తథా | శైలీ దారుమయీ వాపి లోహసఙ్ఘమయూ తథా. 20

రీతికా ధాతుయుక్తాచ తమ్రకాంస్యమయీ తథా | శుభదారుమయీ వాపి దేవతా7ర్చా ప్రశస్యతే. 21

అఙ్గుష్ఠపర్వా దారభ్య వితస్తి ర్యావదేవతు | గృహేషు ప్రతిమా కార్యా నాధికా శస్యతే బుధైః. 22

ఆషోడశాత్తు ప్రాసాదే కర్తవ్యా నాధికా తతః | మధ్యోత్తమాకనిష్ఠా తు కార్యా విత్తానుసారతః. 23

ద్వారోచ్ఛ్రయస్య యన్మాన మష్టదా తత్తు కారయేత్‌ | భాగమేకం తత స్త్యక్త్వా పరిశిష్టంతు యద్భవేత్‌. 24

భాగద్వయేన ప్రతిమా త్రిభాగీకృత్య తత్పునః | పీఠికా భాగతః కార్యా నాతినీచా న చోచ్ఛ్రితా. 25

ఇక మీదట ఈ కొలతల తెలివిడికై సూక్ష్మభేదములతో కూడ మానోన్మానమును తెలిపెదను; (ఉన్మానమనగా తూకపు పరిమాణమని యర్థము; కాని ఇచట దైర్ఘ్యాది మానములను కొలుచు విధానమని యర్థము); గవాక్షరంద్రముల నుండి లోనికి రవికిరణములు ప్రవేశించుచుండగా వానియందుండి గాలిలో ఎగురుచున్నట్లు కానవచ్చు స్పష్టరజఃకణముల లోని సూక్ష్మతమకణమును త్రసరేణు వందురు; అట్టివి ఎనిమిదియైన ఒక వాలాగ్రము; అవి ఎనిమిది ఒక లిక్షయగును; అవి ఎనిమిది ఒక యూక; అవి ఎనిమిది ఒక యవ; అని ఎనిమిది (ఒక దాని ప్రక్క నొకటి అడ్డముగా పెట్టినయవ లెనిమిదిటితో వ్యాప్తమగు దూరము) ఒక అంగుళము; (మానవుని బొటనవ్రేలి కణుపుదగ్గర అరచేతివైపునగల దురమును ఒక యంగుళముగా గ్రహింతురు; శిల్పిదియో యజమానునిదియో కుడిచేతి బొటణవ్రేలికణుపునొద్దగల ఈ దూరమును ప్రమాణముగా తీసికొనగా అట్టి యంగుళములు పండ్రెండు ప్రతిమాముఖపు నిలువు ఉండవలయును; ముఖమానమునుబట్టి మిగిలిన అవయవముల కొలతలుండును; (అనగా ఇందీయబోవు ఆయా అవయవముల కొలతలన్నియు ఈ పండ్రెండంగుళములముఖమానమును బట్టి యుండును; ఇది మారినచో అదియే యనుపాతములో మిగిలిన అవయవముల కొలతలును మారును).

బంగారము - వెండి-రాగి- రత్నములు- శిల- దారువు- మిశ్ర(పంచ) లోహములు -ఇత్తడి- రాగి కంచు మిశ్రము - చందనమువంటి శుభదారువులు- ఇట్టివానితో దేవతార్చా మూర్తులు చేయుట ప్రశస్తము; ఇండ్లయందు అర్చించు ప్రతిమలు కుడిచేతిబొడనవ్రేలి కణుపంత మొదలుకొని జేనెడు (పండ్రెండు భారతీయాంగుళముల)వరకుగల నిలువుటెత్తుతో ఉండవలెను. దేవాలయములందలి దేవతా మూర్తులు పదునారు జేనలవరకు నిలిపుటెత్తులో ఉండవచ్చును; అంతకంటె ఎక్కువ ఎత్తుగా నుండుట తగదు; విత్తశక్తిననుసరించి ఈ పరిమితులనడుమ ఉత్తమాధమకనిష్ఠమాసములలో దేనితోనైన విగ్రహనిర్మాణము చేయవలయును; ఇందనుసరించవలసిన పద్ధతి ఏమనిన- దేవాలయద్వారపు ఎత్తును ఎనిమిదిగా విభజించి వానినుండి ఒక భాగమును వదలి మిగిలిన ఏడుభాగముల పరిమాణముతో దేవతా మూర్తిని చేయించవలెను; మొత్తము పరిమాణమును మరల మూడుభాగములుచేసి అందు త్రిభాగము (1/3) తో పీఠమును అంతఎక్కువ ఎత్తును అంత తక్కువయును కాకుండ నిర్మించవలయును.

ప్రతిమాముఖమానేన నవభాగా న్ప్రకల్పయేత్‌ | చతురఙ్గళా భ##వేద్గ్రీవా భాగేన హృదయం పునః. 26

నాభి స్తస్మా దధః కార్యా భాగేనై కేన శోభితా | నిమ్నిత్వే విస్తరత్వే చ అఙ్గుళం పరికీర్తితమ్‌. 27

నాభే రధస్తా న్మేంఢ్రం చ భాగేన కేన కల్పయేత్‌ | ద్విభాగేనాయతా వూరూ జానునీ చతురఙ్గళే. 28

జిఙ్ఘే ద్విఖ్యాతే పాదౌచ చతురఙ్గుళౌ | ఊర్ధ్వమానమిదం ప్రోక్తం పృథుత్వం చ నిబోధత. 29

సర్వావయవమానేషు విస్తారం శృణుత ద్విజాః |

నిలువబడినట్లు ఉండు విగ్రహపు కొలతలు -నిలువు కొలతలు

ప్రతిమకు ముఖమొంత నిలువుటెత్తుండునో అంత పరిమాణములు తొమ్మిదిటిని మనస్సులో కల్పించి ఉంచుకొన వలయును; (లోగడ ముఖపు నిలువుటెత్తు పండ్రెండు అంగుళములు అని చెప్పబడినది కావున అట్టి తొమ్మిది భాగములు 9 x12= 108 భారతీయాంగుళములు దృష్టియందుంచుకొనవలయును).

ఇక మూర్తి ప్రదానఖండముల కొలతల పాళ్లు (Ratio); 1. (ముఖపు నిలువుటెత్తు 12 అంగుళములయి నపుడు) 2. మెడ 4అంగుళములు; 1 భాగము=12 అం. హృదయము; దానికి దిగువను నాభివరకు 1 భాగము= 12 అం.; 4. బొడ్డు లోతు 1 అంగుళము 5. నాభికి దిగువ అంచునుండి మేఢ్రము (మర్మాంగము) దిగువకొనవరకు 1 భాగము =12 అంగుళములు; 6. తొడలు 2 భాగములు 2x 12 =24 అంగుళములు; 7 మోకాళ్లు

(మోకాటి చిప్పలు) 4 అంగుళములు 8. *జంఘలు 2 భాగములు 2 x12= 24 అంగుళములు; 9. పాదముల నిలువు కొలత 4 అంగుళములు; 10 శిరస్సు 14 అంగుళములు; (ముఖపు కొలత శిరపు కొలతలో చేరిపోయినది; ఇట్లు మొత్తము 108 అంగుళములగును 9x12= 108; నవభాగ ప్రకల్పన సరిపోయినది; ఇట్లు ఈ 108 అంగుళములకు పీఠపుఎత్తు 54 అంగుళములు చేర్చగా 162 అంగుళములు; ఇది దేవాలయద్వారపు టెత్తులో 7/8 అగుచో ద్వారపుటెత్తు 162 x8 =184 అంగుళములు;) ఇది విగ్రహు నిలువు కొలతల విషయము; ఇక ఆయా అవయవముల వెడల్పును వాని చుట్టు కొలతలును వానిచే ఏర్పడు వైశాల్యమును తెలిపెదను; వినుడు.

చతుర్దశాఙ్గుళ స్తద్వ న్మౌళిరస్యప్రకీర్తితః. 30

చతురఙ్గళం లలాటం స్యా దూర్ధ్వం నాసా తథైవచ | ద్వ్యఙ్గుళం తు హన్ఞు ర్జేయ మోష్ఠ స్స్వాఙ్గుళసమ్మితః. 31

అష్టాఙ్గుళం లలాటంతు తావన్మాత్రే భ్రువౌ మతౌ | అర్ధాఙ్గుళా భ్రువో లేఖా మధ్యే ధనురివానతా. 32

ఉన్నతాగ్రా భ##వేత్పార్శ్వే శ్లక్‌ష్ణా తీక్‌ష్ణా ప్రశస్యతే | అక్షిణీ ద్వ్యఙ్గుళాయామే తదర్ధం చైవ విస్తరాత్‌. 33

ఉన్నతోదరమధ్యే తు రక్తాన్తే శుభలక్షణ | తారకార్ధవిభాగేన దృష్టి స్స్యా త్పఞ్చభాగనికా. 34

ద్వ్యఙ్గుళంతు భ్రువో ర్మధ్యే నాసామూల మథాంగుళమ్‌. నాసాగ్రవిస్తరం తద్వత్పుటద్వయ మథానతమ్‌. 35

నాసాపుటబిలం తద్వ దర్ధాంగుళ ముదాహృతమ్‌ | కపోలే ద్వ్యంగుళే తద్వ త్కర్ణమూలా ద్వినిర్గతే. 36

హన్వగ్ర మంగుళం తద్వ ద్విస్తారో ద్వ్యంగుళో భ##వేత్‌ | అర్ధాంగుళా ద్భ్రువో రాజీ ప్రణాళసదృశీ సమా. 37

అర్ధాంగుళసమ స్తద్వ దుత్తలోష్ఠస్తు విస్త రే| నిష్పావసదృశం తద్వ న్నాసాపుటదళం భ##వేత్‌. 38

సృక్విణీ జ్యోతిస్తుల్యేతు కర్ణమూలా త్షడంగుళే | కర్ణౌతు భ్రూసమౌ జ్ఞే¸° ఊర్ధ్వంచ చతురంగుళౌ. 39

ద్వ్యంగుళౌ కర్ణపార్శ్వౌతు మాత్రా మేకాంతు విస్తృతౌ | కర్ణయో రుపరిష్టాచ్చ మస్తకం ద్వాదశాఙ్గుళమ్‌. 40

లలాటా త్పృష్ఠతో7ర్ధేన ప్రోక్త మష్టాందళాంగుళమ్‌ |* షట్త్రింశదంగుళం చాస్య పరిణాహ శ్శిరోగతః. 41

సకేశనిచయో యస్య ద్విచత్వారింశదంగుళః | కేశాన్తా ద్ధనుకా తద్వ దంగుళాని తు షోడశ. 42

* ఈ ప్రతి మాలక్షణాధ్యాయమునందు :

"జంఘే ద్విభాగే విఖ్యాతి -పాదౌ చ చతురంగుళౌ "కాగానే-

" ఊర్ధ్వమాన మిదం ప్రోక్తం - పృథుత్వంచ నిబోధత| సర్వావయవమానేషు విస్తారం శ్రణుత ద్విజాః."

అని ఉండవలెను. దాని తరువాత" చతుర్ధశాంగుల స్తద్వ న్మౌళి రస్య ప్రకీర్తితా | చతురంగుళంలలాటం స్యాత్‌". ఇత్యాదిగ నుండవలెను. కాని-విస్తారమానములో నుండవలసిన ఈ మౌళిమానపు వాక్యములు ముద్రితపుస్తకములలో ఊర్ధ్వమానములో చేరిపోయినవి. శ్రీ వాజపేయం రంగాచార్‌ గారు దీనినిట్లే గ్రహించి తాత్పర్యము వ్రాసిరి. ఇదికాక వీరు ఈ ఊర్ధ్వమాన విషయములో "నవతాళ మిదం ప్రోక్తమ్‌" అను దాని ననుసరించి రావలసిన నవతాళము=9x12=108 అంగుళములు అనునది సరిపెట్టుకొనుటకై యత్నము చేయకయే తాత్పర్యము వ్రాసినారు.

*షట్త్రింశదంగుళం చాస్య.

ఆయా అవయవముల వెడల్పులు - చుట్టుకొలతలు.

మౌళి (శిరము) (రెండు మూపుల నడుమనుండి తలపై వరకు) 14అం. లలాటపు నిలువుటెత్తు నాల్గంగుళములు; ముక్కు నిలుపుటెత్తు నాలుగుంగుళములు; హనువు ఒక్కొక్కటియు పెదవులును రెండేసి అంగుళములు వెడల్పు (అడ్డపు కొలత): లాలటపు అడ్డపు కొలతలు ఎనిమిదంగుళములు; కనుబొమలు రెండును కలిసి ఎనిమిది అంగుళములు; కనుబొమరేఖ నడుమ ధనువువలె వంగియుండుచోట దాని వంపుటెత్తు అర్ధాంగుళము; కనుబొమ పార్శ్వమునందు కొనఉన్నతమయి నునుపునగు వాడిగను నుండవలయును; ఇట్టి నిర్మాణము ప్రశస్తము: కన్నులు రెండును వేరువేరుగ రెండేసి అంగుళముల అడ్డు పొడవును అంగుళము వెడలుపును (ఎత్తును) ఉండవలయును. కనుగ్రుడ్లు నడుమ ఉబ్బుగను కనుగొనలు(కుడి కంటి కుడి కొనయు ఎడమకంటి ఎడమకొనయు) ఎరుపుగను ఉండవలయును; ఇట్టివి శుభలక్షణ నేత్రములు; మొత్తము కంటి పొడవులలో ఐదవ (1/5)వంతు కొలతతో కంటి గ్రుడ్డులోని అర్ధభాగము ఉండవలయును: (కనుగ్రుడ్డు: కంటి మొత్తము పొడవు 2:5); రెండు కనుబొమల నడిమి కొలత రెండు అంగుళములు; నాసా మూలము (ముక్కు మొదలు -ముక్కు కనుబొమలతో కలియుచోటు) ఒక అంగుళము; నాసాగ్రము కూడ ఇంతే (ఒకంగుళము) వెడల్పులుండవలయును; రెండు ముకు పుటములును కుడి ఎడమలకు వంగి ఉండవలయును. నాసాపుట బిలము అర్ధాంగుళము; కర్ణమూలమునుండి వెలికి వచ్చు నంతవరకు కపోలములు రెండంగుళములు; హనువు (దౌడ) కొన ఒక అంగుళము; హనువు వెడల్పు రెండంగుంళములు; కనుబొమల వెంట్రుకల వరుస మందము ప్రణాళీ (నీరు పారు గొట్టముతో) సదృశ##మై సమమయి అర్ధాంగుళము వెడల్పుతో నుండవలయును; పై పెదవి వెడలుపుకూడ అర్ధాంగుళము: ముకుడిప్పల బ్రద్ద ఒక్కొక్కటియు అనుపగింజల పప్పు బ్రద్దవలె ఉండవలయును: సెలవులు జ్యోతిస్సుల (దీపజ్వల) వలె నుండవలెను; అవి కర్ణ మూలమునుండి ఆరంగుళముల దూరమందు ఉండవలెను; కనుబొమలపై అంచునకు తిన్నగా చెవులపై అంచులు ఉండవలెను; వాటి నిలువుటెత్తు నాలుగంగుళములు; చెవులు అడ్డపు నిడివి రెండంగుళములకు కొంచెము చిల్లర ఎక్కువగ ఉండవలెన; (మాత్రా =ఒక ప్రధాన పరిమాణమందలి అల్పాంశము. దీనిని వాడుకలో పైచిల్లర అందురు;) చెవులపై అంచునుండి మస్తకపు (తల) పై కొనవరకు (నిట్టనిలువుగా లంబరేఖలో కొలిచినపుడు) ఎత్తుసరి పండ్రెండంగుళములు;

లలాటపు (కుడి ఎడమలలో) ఏ అంచునుండియైనను తల వెనుకవైపు నడిమి ప్రదేశమునకు పదునెనిమిదంగుళములు; అనగా లలాటమునకు తిన్నగానుండు తల చుట్టుకొలత ముప్పదియారంగుళములు; కేశనిచయము (రాశి) ఉండు శిరోభాగము (లలాటపు పై అంచునుండి తల వెనుకవైపున వెంట్రుకలు ఉండు భాగపు చివరవరకు) నలువది రెండంగుళములు: తల వెనుక వైపునకు నడిమి బాగములో వెంట్రుకలు మొలచుట ఆగిపోవు చోటినుండు దౌడల ఆరంభము వరకు ఉండు దూరము పదునారంగుళములు.

గ్రీవామధ్యుపరీణాహ శ్చతుర్వింతికాంగుళః | అష్టాంగుళా భ##వేద్గ్రీవా పృథుత్వేన ప్రశస్యతే. 43

స్తనగ్రీవాన్తరం ప్రోక్త మేకతాళం స్వయమ్భువా | స్తనయో రస్తనం తద్వ ద్ద్వాదశాంగుళ మిష్యతే. 44

స్తనయో ర్మణ్డలం తద్వ ద్ద్వ్యంగుళం పరికీర్తితమ్‌ | చూచుకౌ మణ్డలస్యాన్త ర్యవమాత్రా వుభౌ స్మృతౌ.

ద్వితాళం చైవ విస్తారా ద్వక్షస్థ్సల ముదాహృతమ్‌ | కక్షే షడంగుళే ప్రోక్తే బాహుములస్తనాన్తరే. 46

చతుర్దశాంగులో పాదా వంగుష్ఠౌ త్య్రంగుళౌ స్మృతౌ | పఞ్చాంగుళపరీణాహ మంగుష్ఠాగ్రం తథోన్నతమ్‌. 47

అంగుష్ఠకసమా తద్వ దాయామా స్యా త్ప్రదేశినీ | తస్యా ష్ఠోడశభాగేన హీయతే మధ్యమాంగుళీ. 48

అనామికా7ష్టభాగేన కనిష్ఠాప చ హీయతే | పర్వత్రయేమ చాంగుళ్యో గుర్ఫౌ ద్వ్యంగుళకౌ మతౌ. 49

పార్షి ర్ద్వ్యంగుళమాత్రస్తు కలయోచ్చః ప్రకీర్తితః | ద్విపర్వాంగుష్ఠకః ప్రోక్తః పరిణాహశ్చ ద్వ్యంగుళః. 50

ప్రదేశినీపరీణాహ స్త్రంగుళ స్సముదాహృతః | కనిష్ఠా చాష్టభాగేన పీయతే క్రమశో ద్విజాః. 51

అంగుళేనోచ్ఛ్రయః కార్యో హ్యంగుష్ఠస్య విశేషతః | తదర్ధేనతు శేషాణా మంగుళీనాం తథోచ్ఛ్రయః. 52

జఙ్ఘాగ్రే పరిణాహస్తు అంగుళాని చతుర్ధశ | జఙ్ఘామధ్యే పరీణాహ స్తథైవాష్టాదశాంగుళః. 53

మెడ నిలువుటెత్తులోని నడిమి భాగమున దాని చుట్టుకొలత నాలుగంగుళములు; మెడ ముందువైపు వెడల్పు ఎనిమిదంగుళములు; స్తనములు నడిమి బిందువునుండి మెడ క్రింది నడిమి బిందువు వరకు ఒక తాళ ప్రమాణము; రెండు స్తనముల నడిమి బిందువుల నడిమి దూరము పండ్రెండంగుళములు; ఒక్కొక్క స్తనపు చుట్టుకొలత రెండంగుళములు; ఈ స్తనమండల (వృత్త)మునకు నడుమ చూచుకములు (స్తనాగ్రములు చను మొనలు- ఉబ్బెత్తు భాగములు- యవ పరిమాణము-) 1/8 భారతీయాంగుళము; వక్షఃస్థలపు వెడలుపు రెండు తాళములు; బాహు మూలపు క్రింది అంచునుండి స్తనపు నడుమ వరకుగల నడిమి దూరము (కక్ష- చంక) ఆరంగుళములు; పాదముల నిడివి పదునాలుగంగుళములు; బొటనవ్రేళ్ళ నిడివి మూడంగుళములు; పాదాంగుష్ఠము ఉన్నత భాగమున ఐదంగుళముల నిలువు చుట్టు కొలతలతో నుండవలయును; పాదపు రెండవ వ్రేలుకూడ బొటనవ్రేలి యంత పొడవే; పాదపు నడిమివ్రేలి పొడవు దీని కంటె షోడశాంశము (1/16 తగ్గును; పాదపు అనామిక పాదపు నడిమి వ్రేలి పొడవు (1/8) అష్టాంశమును పాదపు చిటికెన వ్రేలి పొడవు అనామిక పొడవులో అష్టాంశమున తగ్గును; కాలి బొటనవ్రేలికి తప్ప మిగిలిన వ్రేళ్ళకు అన్నిటికిని మూడేసి కణుపులు ఉండవలయును; చీలమండల నిడివి(వ్యాసము) రెండంగుళములు; మడమ ఎత్తు రెండంగుళముల కంటె కలా మాత్రము (1/16) ఎక్కువ; పాదపుబొటనవ్రేలి కణుపు రెండే; దాని అడ్డు (పై) చుట్టుకొలత మూడంగుళములు; పాదపు రెండవ వ్రేలి నిలువు చుట్టుకొలత మూడు అంగుళములు; ఇవి క్రమముగ కనిష్ఠక వరకు ఒక దానికంటె ఒకటి అష్టమాంశము (1/8) తగ్గును; పాదాంగుష్టమును ముందునుండి చూచినప్పుడు దాని నిలుటెత్తు ఒక అంగుళము; మిగిలిన నాలుగు వ్రేళ్ళకును ఈ ముందు ఎత్తు అర్ధాంగుళము; పిక్కల పై భాగపు చుట్టుకొలత పదునాలుగంగుళములు; పిక్కల నడుమ (ఎక్కువ లావుగ ఉండుచోట) చుట్టుకొలత పదునెనిమిది అంగుళములు.

జానుమధ్యే పరీణాహ ఏకవింశతికాంగుళః | జానూచ్ఛ్రయోం7గుళః ప్రోక్తో మణ్డలంతు త్రిరంగుళమ్‌. 54

ఊరుమధ్యే పరీణాహో హ్యాష్టావింశకాంగుళః | ఏకత్రింశోపరిష్టాచ్చ వృషణౌ చ త్రింరంగుళౌ. 55

ద్వ్యందుళం తు తథా మేఢ్రం పరిణాహ ష్షడంగుళమ్‌ | మణిబన్దా దధో విన్ద్యా త్కేశ##రేఖా స్తథై వచ. 56

మణిబన్ధపరీణాహ శ్చతురంగుళ మిష్యతే | విస్తరేణ భ##వే త్తద్వ త్కటి రష్టాదశాంగుళా. 57

ద్వావింశతిస్‌ తథా స్త్రీణాం స్తనౌ చ ద్వాదశాంగుళౌ | నాభిమద్యపరీణాహో ద్విచత్వారింశదంగుళః. 58

పురుషే పఞ్చపఞ్చాశ త్కట్యాం చైవ తు వేష్టనమ్‌ | కక్షయో రుపరిష్టాత్తు స్కన్ధౌ ప్రోక్తౌషడంగుళౌ. 59

అష్టాంగుళం తు విస్తారే గ్రీవాం చైవ తు నిర్దిశేత్‌ | పరిణాహే తథా గ్రీవాం కలా ద్వాదశ నిర్దిశేత్‌. 60

ఆయయో భుజయో స్తద్వ ద్ద్విచత్వారింశదంగుళః | కార్యం తు బాహుశిఖరం ప్రమాణ షోడశాంగుళమ్‌. 61

ఊర్ధ్వం యద్బాహుపర్యన్తం విన్ద్యా దష్టా దశాంగుళమ్‌ | తథైకాంగుళహీనం తు ద్వితీయం పర్వ ఉచ్యతే. 62

బాహుమధ్యే పరీణాహో భ##వే దష్టాదశాంగుళః | షోడశోక్తః ప్రబాహుస్తు షట్కలో7గ్రకరో మతః. 63

మోకాళ్ళకు నిర్దేశించిన మొత్తము పొడవులో నడిమి భాగమున ఒక్కొక్క మోకాలి చుట్టుకొలత ఇరువది యొక్క అంగుళములు; మోకాటి చిప్ప ఎత్తునరి ఒక అంగుళము; అచట దాని (ఒక్కొక్క మోకాటి చిప్ప) చుట్టుకొలత మూడు అంగుళములు; తొడల మొత్తము దైర్ఘ్యముతో నడిమి భాగమున వానిలో ఒక్కొక్క దాని చుట్టుకొలత ఇరువది

ఎనిమిదంగుళములు; తొడ ఒక్కొక్కయు పై బాగమున ముప్పదియొక్క అంగుళముల చుట్టుకొలతతో నుండును; వృషణముల రెంటి ప్రమాణము మూడంగుళములు; మేఢ్రము(రహస్యాంగము) రెండంగుళములు: దాని నిలువు చుట్టు కొలత అరంగుళములు; మణి బంధమునకు దిగువలో కేశ##రేఖలను చూపవలయును; మణిబంధపు (నగపు?) చుట్టుకొలత నాలుగంగుళములు; కటి ప్రదేశపు (ముందు భాగపు) విస్తారము( వెడలుపు) పదునెనిమిదంగుళములు; స్త్రీల కటి విస్తారము ఇరువది రెండంగుళములు; (స్త్రీలకు) స్తనముల చుట్టుకొలత పండ్రెండంగుళములు; (స్త్రీలకే) నాభికి తిన్నగా నుండు నడుము చుట్టుకొలత నలువది రెండంగుళములు: పురుషునకయినచో కటి ప్రదేశపు చుట్టుకొలత ఏబదియైదంగుళములు; కక్ష (చంక)లకు పైభాగమందు స్కన్ధ (భుజమూల)ములు ఆరంగుళములు; మెడ వెడలుపు (వీపు వైపునకు ఉండు భాగమును వదలగా) ఎనిమిదంగుళములు; గ్రీవ(మెడ) చుట్టుకొలత పండ్రెండు కలలు (తాళ ప్రమాణమును పదునారు భాగములు చేసి వానిలో నుండి పండ్రెండు భాగములు గ్రహించవలెనని యర్థము; అనగా (12/16= 3/4 తాళము) భుజముల పొడవు నలువది రెండంగుళములు; భుజ శిఖరమొక్కొక్కటి పదునారంగుళములు; బాహుపర్యంతము గల పై నిడివి పదునెనిమిదంగుళములు; (మోచేతి సంధినుండు పైభాగమ); రెండవ పర్వబాగము (మోచేతి నుండి దిగువ భాగము) ఒక అంగుళము తక్కువ (పదునేడంగుళములు); బాహువులలో ఒక్కొక్కటియు దాని నడిమి భాగమున గల చుట్టుకొలత పదునెనిమిదింగుళములు; మోచేతికి సరిగా భాగపు చుట్టుకొలత పదునారంగుళములు; అగ్రకరపు (ముంజేతి) చుట్టు కొలత ఆరు కలలు ( 6 /16= 3/8 తాళము).

సప్తాంగుళం కరతలం పఞ్చమధ్యాంగుళీ మతా | అనామికా మధ్యమాయా స్సప్తభాగేన హీయత్‌. 64

తస్యాశ్చ పఞ్చభాగేన కనిష్ఠా పరిహీయతే | మధ్యమాయాస్తు హీనా వై పఞ్చభాగేన తర్జనీ. 65

అంగుష్ఠస్తతర్జనీమూలా దధః ప్రోక్తస్తు తత్సమః | అంగుష్ఠపరిణాహస్తు (పర్వమానన్తు) విజ్ఞేయ శ్చతురంగుళః. 66

శేషాణా మంగుళీనైం తు భాగో భాగేన హీయతే | మధ్యమాపర్వమానం తు అంగుళద్వయ మాయతమ్‌. 67

యవో యవస్తు సర్వాసాం తస్యా స్తస్యాః ప్రహీయత్‌ | అంగుష్టపర్వమధ్యం తు తర్జన్యా సదృశం భ##వేత్‌. 68

యవద్వయాధికం తద్వ దగ్రపర్వ ఉదాహృతమ్‌ | పర్వార్ధేన నకా న్విన్ద్యా దంగుళీషు సమన్తతః. 69

స్నిగ్ధం శ్లక్షణం ప్రకుర్వీత ఈషద్రక్తం తథా7గ్రతః | నిమ్నిపృష్ఠం భ##వే న్మధ్యే పార్శ్వతః కలయోచ్ఛ్రితమ్‌. 70

తథైవ కేశవల్లీయం స్కన్దోపరి దశాంగుళా | స్త్రీయః కార్యాస్తు తన్వఙ్గ్యః స్తనోరుజఘనాదికాః. 71

చతుర్దశాంగుళాయామ ముదరం తత్తు నిర్దిశేత్‌ | నానాభరణసమ్పన్నాః కిఞ్చిచ్ల్ఛక్షణముఖా స్తథా. 72

కిఞ్చిద్ధీర్ఘం భ##వేద్వక్త్ర మలకావళి రుత్తమా | నాసా గ్రీవాలలాటంచ సార్ధమాత్రం త్రిరంగుళమ్‌. 73

అధ్యర్ధాంగుళవిస్తార శ్శస్యతే7ధర పల్లవః | అధికం నేత్రయుగ్మంతు చతుర్భాగేన నిర్దిశేత్‌. 74

గ్రీవావళిక్చ కర్తవ్యా కిఞ్చిదర్ధాంగుళోచ్ఛ్రయా | ఏవం నారీషు సర్వాసు దేవానాం ప్రతిమాసుచ. 75

సవతాళ మిదం ప్రోక్తం లక్షణం పాపనాశనమ్‌. 75

ఇతి శ్రీమత్స్య మహాపురాణ విష్ణు ప్రతిమాలక్షణాది కథనం నామ

సప్తపఞ్చాశదుత్తర ద్విశతతమో7ధ్యాయః.

అరచేతి పొడవలు ఏడంగుళములు; చేతి నడిమివ్రేలు ఐదంగుళములు; అనామిక పొడవు దానిలో (1/7) ఏడవ వంతు తగ్గును; కనిష్ఠిక పొడవు దానిలో ఏడవవంతు తగ్గును; నడిమి వ్రేలి పొడవులో ఐదవవంతు తగ్గి తర్జని పొడవుండును; తర్జనీ మూలమునుండి దిగువ భాగమునకు వచ్చిన అంగుష్ఠ (భాగ)ము దానితో (ఊర్ధ్వభాగమున ఉండిపోయిన అంగుష్టాంశముతో) సమముగా నుండును; అంగుష్ఠపు రెండు కణుపుల మొత్తము పరిమాణము నాలుగంగుళములు; మిగిలిన వ్రేళ్ళ కణుపులు ఒక్కొక్కటియు బొటనవ్రేలి ఒక్కొక్క కణుపు కంటె కొంచెము తగ్గుచుపోవును మధ్యమా పర్వపు (కణుపు) కొలత రెండంగుళములు; మిగిలిన వ్రేళ్ళు కణుపుల పొడవులు ఒకదానికంటె మరియొక దాని కణుపు యవ- యవ- పరిమాణము తగ్గుచుపోవును; అంగుష్ఠ పర్వ మధ్యము మాత్రము తర్జనితో సమానముగా నుండును; అంగుష్ఠపు మొదటి పర్వము(కణుపు) మాత్రము తర్జనీ పర్వ పరిమాణముకంటె రెండు యవలు ఎక్కువ; ప్రతియొక వ్రేలియందును ఆవ్రేలి చివర సగములో ఆవ్రేలి గోరుండును; అవి నునుపుగా సొగసుగా చివరలో కొంచెము ఎరుపుగా నుండునట్లు చేయవలయును; అందును పైభాగము కొంచెము పల్లముగా నుండును; ప్రక్కల కంటె నడుమ భాగము కొంచెమెత్తుగ నుండవలయును; కేశవల్లిక భుజమూలములకు పైగా పది యంగుళములవరకు వ్యాపించియుండవలయును.

స్త్రీల మూర్తులు- స్తనములు తొడలు కటి ప్రదేశము -ఈ భాగములందు ఎత్తుగా నుండునట్లు నిర్మించవలయును; స్త్రీల శరీరములు అంత స్థూలము కాకుండ ఉండవలయును; వారి ఉదరము పదునాలుగంగుళములు పొడవున ఉండును; వారు నానాభరణ సంపన్నలై నున్నని ఇంపైన ముఖములతో నుండవలయును; వారి మొగము కొంచెము పొడవుగా నుండవలయును; అలకావళి (ముంగురుల వరుస) చాల ఉత్తమముగా ఉండవలయును; నాసిక- గ్రీవ- లలాటము- ఇవి మూడున్నరేసి అంగుళములుండవలయును; క్రింది పెదవి చిగురాకువలెను ఒకటిన్నర అంగుళము వెడల్పుతోను( స్త్రీలకు) ఉండుట మంచిది; వారి కన్నులును పురుషులనేత్ర దైర్ఘ్యముకంచే అందులో నాల్గవపాలు ఎక్కువగ ఉండవలయును; (వారికి) గ్రీవయును పురుషుల గ్రీవకంటె ఇంచుమించుగ అర్ధాంగుళమధికముగ నుండుట ప్రశస్తము.

(ఈ చెప్పినదంతయు దేవతా ప్రతిమలయందును అందును స్త్రీమూర్తులయందును ఉండవలసిన ఆయా అవయవముల లక్షణములును పరిమాణములును: ఇవి నవతాళ లక్షణము( అనగా పీఠభాగము కాక కేవలమూర్తి భాగము తొమ్మిది తాళములుండునట్లు చేయునపుడు ఉండవలసిన కొలతలు! మూర్తి మొత్తపు పరిమాణమునుబట్టి అదే అనుపాతములో ఆయా అవయవముల కొలతల మార్పులను ఎరుగవలయును.)

ఇది శ్రీమత్స్యమహాపురాణన ప్రతిమా లక్షమ- విష్ణు ప్రతిమాలక్షణ -కథనమను

రెండు వందల ఏబది ఏడవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-2    Chapters