Sri Matsya mahapuramu-2    Chapters   

అష్టస ప్తత్యుత్తరశతతమో7ధ్యాయః.

ఈశ్వరకృతః- అన్దకాసురవధః.

ఋషయః శ్రుతః పద్మోద్బవ స్సూత విస్తరేణ త్వయోదితః l సమాసా ద్బవమాహత్మ్యం బైరవస్య విధీయతామ్‌.1

సూతః : తస్యాపి దేవదేవసగ శృణుద్వం కర్మ చోత్తమమ్‌ l అసీ ద్దైత్యో7న్దకో నామ భిన్నా ఞ్జ నచయప్రభః.

తపసా మహతా యుక్తో వ్యావధ్య స్త్రిదివౌకసామ్‌ l సంకదాచి స్మహాదేవం పార్వత్యా సహితం విభుమ్‌. 3

క్రీడమానం తదా దృష్ట్వా హర్తుం దేవీం ప్రచక్రమే l తస్య యుద్దం తదా ఘోర మభవ త్సహ శమ్బునా.

అవన్తీవిషయే ఘోరే మహాకాలవనంప్రతి l అస్మిన్యుద్దే తదా రుద్ర శ్చాన్దకేనా తిపీడితః. 5

సుఘవే బాణమత్యగ్రం నామ్నా పాశుపతంహితత్‌ l రుద్రబాణ వినిర్బేదరుధిరా దన్దకస్యహ. 6

అన్దకాశ్చ సముత్పన్నా శ్శతుశో7థ సహస్రశః l తేషాం విదార్యమాణానాం రుధిరా దపరే పునః 7

బభువు రన్దకా ఘోరా యైర్వ్యప్త మఖిలం జగత్‌ l అన్దకాసురశరీరోత్పన్నరక్తపానార్థమీశ్వరకృతమాతృగణ సృష్టిః.

ఏవం మాయావినం దృష్ట్వా తంచ దేవ స్తదాన్దకమ్‌. 8

పానార్థ మన్దకస్యాపి ససృజే మాతర స్తదాl

నూటడెబ్బది ఎనిమిదవ అధ్యాయము

ఈశ్వరుడు అంధకాసురుని చంపుట (శివుని భైరవత్వమును తెలుపుకథ)

ఋషులు సూతునితో ఇట్లనరి: సూతా! నీవు పద్మోద్బవ వృత్తాంతమును విస్తరముగా మాకు చెప్పి వినిపించితివి. బైరవమాహత్మ్యమును సంగ్రహముగా చెప్పి వినిపింపగోరుచున్నాము అన సూతుడిట్లు చెప్పనారంభించెను. దేవదేవుడగు భైరవుడు నిర్వర్తించిన ఉత్తమ కర్మమును చెప్పెద వినుడు: అంధకుడను దైత్యుడుండెడివాడు; వాడు అపుడే పగులుగొట్టిన కాటుకరాశివలె మెరయువాడు. మహాతపమాచరించినవాడు; దేవతలకునుఅవధ్యుడు; వాడొకప్పుడు పార్వతితోకూడి విహరించుచున్న విభుని మహాదేవుని చూచి దేవి నపహరింప నమకట్టెను. అవంతీదేశమున ఘోరమగు మహాకాలవనమందు ఈవిషయమయి అంధకునకు శంభనితో యుద్దము జరిగెను . దానియందు శివుడు అంధకునిచే మిగుల బాధనందెను. అపుడీశ్వరుడు పాశుపతమను అత్యుగ బాణమును ప్రయోగించెను. రుద్రుడు తనబాణముతో అంధకుని చీల్చగా వాని రక్తమునుండి మరల అట్టివారి మరి కొందరంధకులు జనించిరి. వారితో సవస్త జగము వ్యాప్తమయ్యెను. ఇట్లా యంధకుడు మాయవియగుట చూచి ఆదేవుడు అంధకుని (రక్తమును) త్రావుటకుమాతృ కలన దేవతలను సృజించెను. (మహాకాలవనము ఉజ్జయిని దగ్గర ఉండెను.)

మాహేశ్వరీం తథా బ్రాహ్మీం కౌమారీం మాలినీం తథా. 9

సౌపర్ణీ మథ వాయవ్యాం శాక్రీం వై నాయకీం తథా l

సౌరీం సౌమ్యాం శివాం దూతీం చాముణ్డా మథ వారుణీమ్‌. 10

వారాహీం నారసింహీంచ వైష్ణవీం చ చలచ్చిఖామ్‌ l శతానన్దాంభగానన్దాం పిచ్చిలాం

భగమాలినీమ్‌. 11

బలాం చాతిబలాం రక్తాం సురభీం సుఖమణ్డీకామ్‌ l మాతృనన్దాం సునన్దాంచ బిడాలీం శకునీం తథా. 12

రైవతీం శాజ్కరీం చన్ద్రాం లాంగలీం కుదినీం తథా l

జయాంచ విజయాం చైవ జయన్తీం చాపరాజితమ్‌. 13

కాలీంచైవ మహాకాళీం దూతీంచైవ తథైవచ l సుభగాం దుర్బగాంచైవ కరాళీం నన్దినీం తథా. 14

అదితించ దితించైవ మారీం వై మృత్యుమేవచ l కర్ణ(ర్మ) మోటీం తథా యామ్యా ములూఖీంచ ఘటోదరీమ్‌.

వజ్రహస్తాం పిశాచీంచ కపాలీం రాక్షసీం తథా l భుసుణ్డీం శాజ్కరీం లమ్బాం చన్ద్రాంచ కరభాం తథా. 16

ఘోటాం సులోచనాం ధూమ్రాం వరవాణీం కరాళికామ్‌ l

విశాలదంష్ట్రిణీం శ్యామాం త్రిజటీం కుక్కుటాం తథా. 17

వినాయకీంచ వైతాళీ మున్మనాం బడబాం తథా l సిద్దించ లేలిహానాంచ కేకరీం గర్దభీం తథా. 18

ఉత్కటాం బహుపుత్త్రీంచ ప్రేతయానాం విటజ్కినీమ్‌ l

క్రౌఞ్చీం శైలముఖీం చైవ వినతాం పరమాం దనుమ్‌. 19

ఉమాం రమ్బాం మేనకాంచ సలిలాం చిత్రరూపిణీమ్‌ l

స్వదాం స్వాహాం వషట్కారాం ధృతిం జ్యేష్ఠాం కపర్దినీమ్‌. 20

మాయాం విచిత్రరూపాంచ కామరూపాంచ సజ్గమామ్‌ l

ముఖేవిలాసాం మజ్గళ్యాం మహానాసాం మహాముఖీమ్‌. 21

కుమారీం రోచనాం భీమాం సదామాంసమదోద్దతామ్‌ l

లమ్బాక్షీం కాలజీహ్వాంచ కుమ్బకర్ణాం మహాసురీమ్‌. 22

కేశినీం కునఖీంచైవ పిజ్గళాక్షీంచ తామసీమ్‌ l ఉల్కాముఖీం ద్రూమ్రశాఖాం కమ్పినీం పరికుమ్పినీమ్‌. 23

మోహినీం కుణ్డలీం చన్ద్రాం నిర్బయాం బాహుశాలినీమ్‌l కరకర్ణీం తథైకాక్షీం విశోకాం నన్దినీం తథా . 24

జ్యోత్స్నాముఖీం చ రభసాం నికుమ్బాం రక్తకమ్పనామ్‌ l

అధికారాం మహాచిత్రాం చన్ద్రసేనాం మనోరమామ్‌. 25

అదర్శనాం హరత్పాపాం మాతజ్గీం లమ్బమేఖలామ్‌ l అబలాం వఞ్చనాం కాళీం ప్రాణదాం లాజ్గలావతీమ్‌.

చిత్తాం చిత్తజలాం కో(శో)ణాం శాన్తికాం దృష్టశాలినీమ్‌ l లమ్బస్తనీం లమ్బసటాం విసటాం వానచూర్ణినీమ్‌.

స్ఖల న్తీం దీర్ఝకేశీంచ సుచిరాం సున్దరీం శుభామ్‌ l అయోముఖీం కద్రుముఖీం క్రోధనీంచ తథాశనీమ్‌. 28

కుబుమ్బికాం ముక్తికాంచ చన్ద్రికాం బాలమోహినీమ్‌ l

సామాన్యాం సహినీం లమ్బాం కోవిదారీం సమా (వా) సవీమ్‌. 29

శజ్కుకర్ణీం మహానాదాం మహాదేవీం మహోదరీమ్‌ l హుజ్కారీం రుద్రసుసటాం రుద్రేశీం భుతదామరీమ్‌.

పిణ్డజిహ్వాం చలజ్జ్వాలాం శివా జ్వాలాముఖీం తథా | ఏతాశ్చాన్యాశ్చ దేవేశ స్సోసృజ న్మాతర స్తదా. 31

అన్దకానాం మహాఘోరాః పపుస్తద్రుధిరం తదా l తతోన్దకాసృజ (గ్భి) స్సర్వా ః పరాం తృప్తి ముపాగతాః 32

తాసు తృప్తాసు సమ్బూతా భూయ ఏవాన్దక ప్రజా ః l అర్దితసై#్త ర్మహాదేవ శ్శూలముద్గరపాణిభిః. 33

మాహేశ్వరి - బ్రహ్మి- కౌమారి - మాలిని -సౌపర్ణి - వాయవ్య -శాక్రి -వైనాయకి- సౌరి - సౌమ్య - శివదూతి - చాముండ - వారుణి - వారాహి - నారసింహి - వైష్ణవి - చలచ్చిఖ - శతానంద- భగనంద- పిచ్చిల భగమాలిని - బల- అతిబల - రక్త-సురభి - సుఖమండిక- మాతృనంద - సునంద- బిడాలి -శకుని రైవతి - శంకరి -చంద్ర లాంగలి- కుదిని- జయ విజయ- జయంతి - అపరాజిత- కాళి- మహా కాళి- దూతి- సుభగ- దుర్బగ- కరాళి- నందిని -అదితి- దితి- మారి - మృత్యు- కర్ణమోటి - యామ్య - ఉలూభి- ఘటోదరి- వజ్రహస్త- పిశాచి - కపాలి - రాక్షసి - భుసుండి- శాంకరి- లంబ- చంద్ర- కరభ- ఘోట- సులోచన- ధూమ్ర- వరవాణి- కరాళిక- విశాలదంష్ట్రిణి- శ్యామ-త్రిజటి- కుక్కుట- వినాయకి- వైతాళి. ఉన్మనా-బడబ-సిద్ది-లేలిహానా- కేకరి గర్దభి - ఉత్కట-బహుపుత్త్రి- ప్రేతయానవిటంవిని-క్రౌంచి-శైలముభి-వినత-సరమ-దను-ఉమ-రంభ-మేనక - సలిల - చిత్రరూపిణి-స్వధా-స్వాహా - వషట్కార-ధృతి - జ్యేష్ఠ-కపర్దిని-మాయ-విచిత్రరూప-కామరూప-సంగమ-ముఖేవిలాస-మంగళ్య- మహానాన- మహాముఖీ-కుమారి - రోచన-భీమ-దామ-మదోద్దత-లంబాక్షి - కాలజిహ్వా-కుంభకర్ణ-మహాసురి - కేశిని-కునభి-పింగళాక్షి - తామసి-ఉల్కాముభి-ధూమ్రశాఖా-కంపిని-పరికంపిని-మోహిని-కుండలి-చంద్రా-నిర్బయా-బాహుశాలిని-కరకర్ణి-ఏకాక్షి-విశోక-నందిని-జ్యోత్స్నాముఖి-రభన-నికుంభ-రక్తకంపన-ఆధికార-మహాచిత్ర-చంద్రసేన మనోరమ-అదర్శన - హరత్పాపా-మాతంగి - లంబమేఖలా-అబల- వంచన-కాశి-ప్రాణద-లాంగలావతి-చిత్త-చిత్తజల-కో(శో)ణా-శాంతిక-ధృష్టశాలిని-లంబ స్తని-లంబసటా-వినటా-వాసచూర్జిని స్ఖలంతీ-దీర్ఘకేశీ-సుచిరా-సుందరీ-శుభా-అయోముఖీ-కద్రుముఖీ-క్రోధని-అశని-కుటుంబిక-ముక్తిక-చంద్రిక - బాలమోహనీ-సామాన్య సహినీ -లంబా -కోవిదారీ-మా(వా)నవి. శంకుకర్ణీ-మహానాద-మహాదేవి-మహోదరి-హుంకారి-రుద్రసనటా-రుద్రేశీ-భూతాదామరి-పిండజిహ్వ-చలజ్జ్వాల-శివా - జ్వాలాముఖి-(189) ఈ మొదలగు మహాఘోర మాతృకలు శివునిచే నృజింప బడి అంధకుల రక్తమును త్రావిరి. ఆ అంధక రక్తములతో వారందరును మిగుల తృప్తినందిరి. వారు తృప్తినందిన యనంతరము మరల అంధక పుత్రులు జనించి శూలముద్గరలములు చేతుల ధరించి వానితో మహాదేవుని బాధింపసాగిరి.

తత స్స శజ్కరో దేవ స్త్వన్దకై ర్వ్యాకులీకృతః | జగామ శరణం దేవం వాసుదేవ మజం విభుమ్‌ 34

తతత్స భవాన్విష్ణు స్సృష్టవా ఞ్ఛష్కరేవతీమ్‌ | యా పపౌ సకలం తేషా మన్దకానామసృక్షణాత్‌ 35

యథా యథా చ రుధిరం పిబత్యన్దకసమ్భవమ్‌ | తథా తథాధికం దేవీ సంశుష్యతి జనాధిప 36

పీయమానే తథా తేషా మన్దకానాం తథాసృజి | అన్ధకాస్తు క్షయం నీతా స్సర్వే తే త్రిపురారిణా 37

మూలాన్దకం తు విక్రమ్య తదా శర్వస్త్రి లోకధృత్‌ | చకార వేగ చ్ఛూలాగ్రే సచ తుష్టావ శజ్కరమ్‌ 38

ఆన్దకస్తు మహావీర్య స్తస్య తుష్టో భవోద్భవః | సామీప్యం ప్రదదౌ నిత్యం గణశత్వం తథై వచ 39

తతో మాతృగణాస్సర్వేశజ్కరంవాక్యమబ్రువ9 | భగవ న్భక్షయిష్యామ స్సదేవాసురమానుషమ్‌ . 40

త్వత్ప్రసాదా జ్జగత్సర్వం తదనుజ్ఞాతు మర్హసి |

శజ్కరః : భవతీభిః ప్రజాస్సర్వా రక్షణీయా న సంశయః 41

అస్మాద్ఘోరా దభిప్రాయా న్మనశ్శీఘ్రం నివర్త్యతామ్‌|

అంధకులతో వ్యాకులీకృతుడై శంకర భగవానుడు-అజుడు విభుడు దేవడు నగు వాసుదేవుని శరణు వేడెను. అంతట విష్ణు భగవానుడు శష్కరేవతి-యను దేవతను నృజింపగా ఆమె క్షణములో అంధకర్తపానము చేసెను ఆమె అంధక రక్తము త్రావిన కొలదిని ఎండిపోవసాగెను. ఆమె అట్లు వారి రక్తమును త్రావిన మీదట (క్రొత్తవారు పుట్టక పోగా) ఉన్న అంధకులను త్రిపురారి క్షయమందించెను. అంతట త్రిలోకధర్తయగు శంకరుడు శర్వుడు విక్రమించి (మొదటి) మూలాంధకుని మహావేగమున తన శూలాగ్రమున నిలుపగా మహావీర్యుడగు వాడును శంకరుని స్తుతించెను. భవోద్భవుడు (సంసార మూలకారణుడు) అగు శంకరుడు వాని విషయమున తుష్టుడయి వానికి నిత్యము తన సాంనిధ్యమును గణశత్వమును ప్రసాదించెను. అంతట మాతృకలు శంకరునితో ''భగవన్‌! దేవాసుర మానుషులతో కూడిన సకల జగత్తును భక్షింతుము. నీ అనుగ్రహము కావలెను. అనుజ్ఞ నీయ వేడుచున్నాము'' అనిరి. శంకరుడు ఇట్లనెను. ''మీరు ప్రజల నందరను రక్షించవలయును; ఇది నిస్సంశయము కదా ! కనుక ఈ ఘోరాభిప్రాయమును మరల్చుకొనుడు?''

సూతాః : ఇత్యేవం శజ్కరేణోక్తమనాదృత్య వచ స్తదా 42

భక్షయామాసు రవ్యగ్రా సై#్త్రలోక్యం సచరాచరమ్‌ | త్రైలోక్యే భక్ష్యమాణతు తదా మాతృగణన వై. 43

నృసింహమూర్తిం దేవేశం ప్రదధ్యౌ భగవాఞ్చివః | అనాదినిధనం దేవం సర్వలోకభవోద్భవమ్‌. 44

దైత్యేన్ద్రవక్షోరుధిరచర్ఛితా గ్రమమహానఖమ్‌ | విద్యుజ్జిహ్వం మహాదంష్ట్రం స్ఫురత్కేసరసఞ్చయమ్‌. 45

కల్పాన్తమారుతక్షుబ్దసప్తార్ణవసమస్వనమ్‌ | వజ్రతీక్‌ష్ణనఖం ఘోర మాకర్ణవ్యాదితాననమ్‌ 46

మేరుశైలప్రతీకాశ ముదయార్కసమేక్షణమ్‌ | హిమాద్రిశిఖరాకారం చారుదంష్ట్రోజ్జ్వలాననమ్‌ 47

నఖనిస్సృతరోషాగ్నిజ్వాలాకేసరమాలినమ్‌| బద్ధాజ్గదం సుముకుటం హారకేయూరభూషణమ్‌ 48

శ్రోణి సూత్రేణ మహతా కాఞ్చనేన విరాజితమ్‌ | నీలోత్పలదళశ్యామం వాసోయుగవిభూషణమ్‌ 49

తేజసా೭೭క్రాన్తసకలబ్రహ్మాణ్డాన్తరమణ్డపమ్‌ | పవనభ్రామ్యమాణానాం హుతహవ్యవహార్చిషామ్‌. 50

ఆవర్తై స్సదృశాకారై స్సంయుక్తం దేహలోమజైః | సర్వపుష్పవిచిత్రాఢ్యాం ధారయన్తం మహాస్రజమ్‌ 51

స ధ్యాతమాత్రో భగవా న్ప్రదదౌ తస్య దర్శనమ్‌ | యాదృశేనైవ రూపేణ ధ్యాతో రుద్రేణ భక్తితః 52

తాదృశైనైవ రూపేణ దుర్నిరీక్షేణ దైవతైః | ప్రణిపత్యతు దేవేశం తదా తుష్టావ శజ్కరః 53

శంకరుడు ఇట్లు పలికినను లెక్క పెట్టక వారు ఏ కలవరమును లేక స్థిరచిత్తముతో నచరాచరమగు త్రైలోక్యమును భక్షించిరి. అపుడు శివ భగవానుడు అనాదినిధనుడు దేవుడు సర్వలోకసృష్టికి మూలభూతుడు దైత్యేంద్రుని వక్షమందలి రక్తముతో పూయబడిన గోళ్ల కొనలుకలవాడు మెరపువంటి నాలుకగలవాడు పెద్ద కోరలువాడు మెరయు జూలి రాశి కలవాడు ప్రళయ వాయువుతో కలత పడు మహాసాగరము వలె ధ్వని చేయువాడు వజ్రములవంటి వాడి గోళ్లవాడు భయంకరుడు చెవుల వరకు తెరచిన నోరివాడు మేరుపర్వతమువలె ప్రకాశించువాడు ఉదయరవిని పోలు కన్నులవాడు హిమాద్రి శిఖరాకారుడు మనోహరములగు కోరలతో ఉజ్జ్వలమగు మొగము కలవాడు గోళ్లనుండి వెలికి వచ్చుచున్న రోషాగ్నిజ్వాలలనెడు జూలి పంక్తులు కలవాడు బంగారపు భుజకీర్తులు కిరీటము హారములు కటి సూత్రము సోమ్ములుగా దాల్చినవాడు నల్లకలువ రేకులవలె చామనచాయ కలవాడు వస్త్రయుగళము అలంకారముగా దాల్చినవాడు తన తేజముతో సకల బ్రహ్మాండాతంరాళమును మండపమును క్రమ్మినవాడు వాయుబలముచే త్రిప్పబడుచున్నవియు తమయందు వేల్చబడిన హవిస్సును కొనిపోవునవియు నగు అగ్నిజ్వాలల సుడులతో సమానాకారముకల వెంట్రుకలతో కూడినవాడు సర్వ వర్ణ విచిత్ర పుష్పములతో కూర్చడిన మహామాలను దాల్చినవాడు నగు నృసింహమూర్తిని ధ్యానించెను. రుద్రుడు భక్తి పూర్వకమగు ఏ రూపము కలవానిగా తను ధ్యానించెనో అదే రూపమున నృసింహదేవుడు అతనికి ధ్యానించినంతనే దర్శన మొసంగెను. కాని ఆ రూపము దేవతలకును చూడశక్యము కానిది. శంకరు డా దేవుని నమస్కరించి ఇట్లు స్తుతించెను.

శజ్కరకృతనరసింహస్తుతిః

శజ్కరః నమస్తేస్తు జగన్నాథ నరపసింహవపుర్హరే | దైత్యనాధాసృజాపూర్ణనఖశ (పం)క్తివిరాజిత. 54

జగత్సకలంసంలగ్న హేమపిజ్గళవిగ్రహ | నతోస్మి పద్మనాభ త్వాం సురశక్రజగద్గురో. 55

కల్పాన్తామ్భోద(ధి) నిర్ఘోష సూర్యకోటిసమప్రభ | సహస్రపరమక్రోధ సహస్రేన్ద్రపరాక్రమ. 56

సహస్రవదనస్ఫీత సహస్రచరణాత్మక | సహస్రకాలరచిత సహస్రనియతేన్ద్రియ. 57

సహస్రభూమిసద్దైర్య సహస్రానన్తమూ ర్తిమ9 | సహస్రచన్ద్రప్రతిమ సహస్రగ్రహవిక్రమ 58

సహస్రరుద్రతేజస్క సహస్రబ్రహ్మసంస్తుత | సహస్రవాయువేగోగ్ర సహస్రాక్షనిరీక్షణ. 59

సహస్రయన్త్రమథన సహస్రబన్ధమోచక | అన్దకస్య వినాశాయ యా స్సృష్టా మాతరో మయా. 60

అనాదృత్య తు మద్వాక్యాం భక్షయన్త్యద్య తాః ప్రజాః | కృత్వా తాశ్చ న శక్తోహం సంహర్తు మపరాజిత.

స్వయం కృత్వా కథం తాసాం వినాశ మభికారయే | ఏవముక్త స్స రుద్రేణ నరసింహవపుర్దరః 62

ససర్జ దేవో జిహ్వాయా స్తదా వాణీశ్వరీం హరిః | హృదయాత్తు తథా మాయాం గుహ్యాచ్చ భగమాలినీమ్‌.

అస్థిభ్యశ్చ తథా కళీ సృష్టా పూర్వం మహాత్మనా | యయా తద్రుధిరం పీత మన్ధకానాం మహాత్మనామ్‌. 64

యా చాస్మి న్కథితా లోకే నామత శ్శుష్కరేవతీ | ద్వాత్రింశన్మాతర స్సృష్టా గాత్రేభ్య శ్చక్రిణా తతః 65

జగన్నాథా | నృసింహదేవాధారిన్‌ ! హరీ! (పాపముల హరించువాడా!) దైత్యనాథుని రక్తముతో నిండిన గోళ్ళు అనెడు శక్త్యాయుధములు కలవాడా! నీకు నమస్కారము. సకల జగమునందును వ్యాపించిన బంగారువంటి పచ్చనిమూర్తి కలవాడా! ప్రళయకాల మేఘ ధ్వనివంటి నాదము కలవాడా! పద్మనాభా! దేవతలకును ఇంద్రునకును సమస్త జగత్తునకును తండ్రీ ! సహస్ర విధములగు మహాక్రోధము గలవాడా! సహస్రేందులంత పరాక్రమము కలవాడా! సహస్ర ముఖముల సమృద్ధి కలవాడా! సహస్రపాదా! సహస్రకాలముల రచించువాడా! సహస్ర సంఖ్యాకములగు ఇంద్రియములును నిగ్రహించువాడా! సహస్ర భూలోకములకును మంచి ధైర్యము నొసంగువాడా! వేలుకొలదిగా అనంతమూర్తులు కలవాడా! సహస్ర చంద్ర సమానా! సహస్రగ్రహ విక్రమా; సహస్ర రుద్ర సమాన తేజశ్శాలీ! సహస్ర బ్రహ్మ పరిస్తుతా! సహస్ర వాయువేగ భయంకరా ! సహస్ర నేత్రములతో చూచువాడా! వేలకొదలిగా యంత్రములను మథించువాడా! సహస్ర బంధనములనయిన విడిపించువాడా! నిన్ను నమస్కరించుచున్నాను. అంధకాసుర వినాశమునకై నేను సృష్టించిన మాతృకలు నామాట లెక్క పెట్టక ఇపుడు లోక ప్రజలను భక్షించుచున్నారు. అపరాజితా ! నేను సృష్టించి వారినిపుడు నేనయి సంహరింపజాలకున్నాను. అని రుద్రుడు పలికినది విని నరసింహమూర్తియగు ఆ హరి భగవానుడు తన జిహ్వనుండి వాణీగ్రీశ్వరిని హృదయమునుండి మాయను గుహ్యము (రహస్యాంగము) నుండి భగమాలినిని సృజించెను. ఆ దేవుడు ఇదివరకు తన ఎముకలనుండి కాళిని సృజించియుండెను. అంధకల రక్తమును త్రావిన శుష్కరేవతి ఆమెయే. ఇట్లు నలుగురను శక్తులను నృజించిన తరువాత వారికి పరివార దేవతలుగా మరి ముప్పదిరెండు మంది దేవతాశక్తులను నృషింహుడు తన యవయవములనుండి సృజించెను.

తాసాం నామాని వక్ష్యామి తాని మే గదత శ్శృణు | సర్వాస్తాస్తు మహాభాగా ఘణ్టాకర్ణీ తథైవచ. 66

త్రైలోక్యమోహినీ పుణ్య సర్వసత్త్వవశజ్కరీ | తథాచ చక్రహృదయా పఞ్చమీ కామచారిణీ. 67

శజ్ఖినీ లేఖినీ చైవ కాసజ్కర్షణీ తథా | ఇత్యేతాః కీర్తితా రాజ న్వాగీశానుచరా స్స్మృతాః 68

సజ్కర్షణీ తథాశ్వత్థా బీజభావాపరాజితా కల్యాణీ మధుదంష్ట్రీచ కమలోత్పలహస్తికా. 69

ఇతి దేవ్యష్టకం రాజన్మాయానుచర ముచ్యతే | అజితా సూక్ష్మహృదయా వృద్ధావేశాశ్మదంశనా. 70

నృసింహభైరవా బిల్వా గరుత్మద్ధృదయా జయా | భగమాలిన్యనుచరా ఇత్యష్టౌ నృపమాతరః. 71

ఆకర్షణీ సమ్భటాచ తథై వో త్తరమాలికా | జ్వాలాముఖీ భీషణికా కామదేనుశ్చ బాలికా 72

తథా పద్మకరా రాజన్రేవత్యనుచరా స్స్మృతాః | అష్టౌ మహాబలా స్సర్వా దేవగాత్రసముద్భవాః. 73

త్రైలోక్యసృష్టిసంహారసమర్థా స్సర్వదేవతాః | తాస్సృష్టమాత్రా దేవేన క్రుద్ధా మాతృగణాస్స తు. 74

ప్రధావితా మహారాజ క్రోధవిస్ఫురితేక్షణాః | అవిషహ్యతమం తాసాం దృష్టితేజస్సుదారుణమ్‌. 75

తమేవ శరణం ప్రాప్తా నృసింహో వాక్యమబ్రవీత్‌ |

వారి నామములు తెలిపెదను వినుము: 1. మహభాగయగు ఘంటాకర్ణి 2. పుణ్యయగు త్రైలోక్యమోహిని 3. సర్వ సత్త్వవశంకరి 4. చక్రహృదయ 5. కామచారిణి 6. శంఖిని 7. లేఖిని 8. కాల సంఘర్షణి- వీరు వాగీశ్వరి అను మొదటి శక్తికి అనుచరలు; 1. సంకర్షణి 2. అశ్వత్థ 3. బీజభావ 4. అపరాజిత 5. కల్యాణి 6. మధుదంష్ట్రి 7. కమలా 8. ఉత్పలహస్తికా - అనువారు ఎనిమిది మందియు మయాదేవికి అనుచరలు; 1. అజిత- 2. సూక్ష్మహృదయ 3. వృద్ధ 4. వేశాశ్మదంశనా 5. నృసింహభైరవా 6. బిల్వా 7. గరుత్మద్ధృదయా 8. జయా వీరు భగమాలినికి అను చరలు; 1. ఆకర్షణీ 2. సభటా 3. ఉత్తరమాలికా 4. జ్వాలాముఖీ 5. భీషణికా 6. కామధేను 7. బాలికా 8. పద్మకరావీరు కాళికి- లేదా శుష్కరేవతికి అనుచరలు; ఈ ఎనిమిదేసి మంది (8x4=32)యును నృసింహదేవుని అవయవముల నుండి జనించినవాడు; త్రైలోక్య సృష్టిం సంహారములు చేయ సమర్థలు; వీరందరును తాము సృష్టింపబడిన వెంటనే మొదట రుద్రుడ సృష్టించిన మాతృగణము విధము క్రుద్దలయి క్రోధముతో మెరము కన్నులతో వారిమీదకు పరువెత్తిరి. వారి దృష్టి తేజస్సతి దారుణమయి ఎంతమాత్రమును సహింపరానిదిగా నుండెను. అంతట ఆ రుద్ర సృష్టమాతృకలు నృసింహదేవునే శరణు చొచ్చిరి. వారితో నృసింహుడిట్లు పలికెను:

యథా మనుష్యాః పశవః పాలయన్తి చిరాత్సుతాన్‌. 76

జాయన్తే యే యథైవైతే తథావై దేవతాగణాః | భవత్యస్తు తథా లోకా న్పాలయంతు మయేరితాః. 77

మనుజైశ్చ తథా దేవై ర్యజధ్వం వై పురాన్తకమ్‌ నచ బాధా ప్రక ర్తవ్యా యే భక్తస్త్రిపురాన్తకే. 78

యేచ మాం సంస్మర న్తీహ తేచ రక్ష్యా నరా స్సదా | బలికర్మ క (చ)రిష్యన్తి యుష్మాకం యే సదా నరాః.

తే చ రాక్ష్యా స్సదా లోకా రక్షితవ్యం చ శాసనమ్‌ | రౌద్రీం చై వాపరాంమూర్తింమహాదేవః ప్రదాస్యతి. 81

యుష్మాన్ముఖ్యా మహాదేవ్యా స్తదుక్తం పరిరక్షథ |

మయా మాతృగణ స్సృష్టో యోయం విగతసాధ్వసః 82

ఏష నిత్యం విశాలాక్షో మయైవ సహ రంస్యతే | మయా సార్దం తథా పుజాం నరేభ్యశ్చైవ లప్స్యథ 83

పృథక్ప్రపూజితా లోకే సర్వాన్కామా న్ప్రదాస్యథ |

శుష్కాం సమ్పూజయిష్యన్తి యేచ పుత్త్రార్థినో జనాః. 84

తేసాం పుత్త్రప్రదా దేవీ భవిష్యతి న సంశయః | సర్వకామప్రదా లోకే భవిష్యతిచ పూజితా. 85

శ్రీమత్స్యః : ఏతావదుక్త్వా భగవా న్త్సహ మాతృగణన తు | జ్వాలామాలాకులవపు స్తత్రైవాన్తరధీయత.

తత్ర తీర్థం సముత్పన్న కృతశౌచేతి యజ్జగుః | తత్రాపి పూర్వజో దేవో జగదార్తిహరో హరః. 87

రౌద్రస్య మాతృవర్గస్య దత్వా రుద్రస్తు పార్థివ | రౌద్రీం దివ్యాం తనుం తత్ర మాతృమధ్యే వ్యవస్థితః. 88

సప్త తా మాతరో దేవ్య స్సార్ధనారీనర శ్శివః | నివేశ్య రౌద్రం తత్థ్సానం తత్రైవాన్తరధీయత. 89

స మాతృవర్గస్య హరస్య మూర్తి ర్జుష్టే యదా తిష్టతి తత్సమీపే |

దేవేశ్వరస్యాపి నృషింహమూర్తేః పూజాం విధత్తే త్రిపురాన్ధకారిః 90

ఇతి శ్రీ మత్స్యమహాపురాణ ఈశ్వరకృతః అన్ధకాసురవధో నామ అష్టస ప్తత్యుత్తరశతతమోధ్యాయః.

మనుష్యులును పశువులును తమ సుతులను చాలకాలము వరకు పోషించుచు పాలించుచునుండును కదా ! దేవతలు కూడా ప్రజలను అట్లే చూడవలయును కదా! కావున మీరును నామాట పాటించి లోకపాలనము సేయుడు: మనుజులును దేవతలుకూడా పరాంతకుడగు శివుని ఆరాధించునట్టు చూడుడు; శివ భక్తులకును నా భక్తలకును మీకును బలులొసంగి పూజించువారికిని ఏ బాధలును కలుగనీయక సర్వాకామ ఫలములను ఇచ్చి రక్షించుచుండుడు; నేను చెప్పిన విధానము ననుసరించి ఉచ్చాటనాదికము చేయువారిని నా శాసనమును - కూడ మీరు పాలించవలయును. ముఖ్యులగు మహాదేవులారా ! మహాదేవుడు ఇంతటి నుండి మీకు ఉగ్రమును ఉత్తమమును అగు రూపమును అనుగ్రహించును; మీరును అతని మాటను పాటించుచు లోకరక్ష చేయుచుండుడు. లోకములకు కలుగు భయమును పోగొట్టగల మాతృకలను కొందరను నేను సృష్టించితిని గదా! తమ విశాల నేత్రములతో వారు సదా ప్రజలను కనుపెట్టి చూచుచు నావెంటనే ఉండి విహరించుచుందురు. మీరును వారును నాతోపాటుగనే నరులనుండి పూజలనందుకొనుచుండుడు; లోకమున నాతోకాక వేరు వేరుగ కూడా పూజలందుకొనుచు వారికి సర్వకామములను పూరించుచుచుండుడు; పుత్త్రార్థలయి ఎవరు ఈ శుష్కరేవతిని పూజింతురో వరాకి ఆ దేవి పుత్త్రప్రద యగును; ఇది నిస్సంశయము, ఆమె పూజితురాలయి లోకమునందలి వారికి సర్వ కామప్రదయగును.

అని ఇంతమాత్రము చెప్పి జ్వాలామాలలో నిండిన శరీరముకల నృసింహ భగవానుడు తాను సృష్టించిన మాతృగణముతో కూడా అచ్చటనే అంతర్ధాన మందెను. అచ్చట కృతశౌచమను తీర్థము ఉత్పన్నమయ్యెను. సర్వ జగత్తులకంటెను ముందు యున్నవాడును జగముల ఆర్తిని హరించువాడు నగు హరుడు అచ్చటనే తను సృష్టించని రౌద్ర మాతృవర్గమునకు రౌద్రమును దివ్యమును నగు మూర్తిని ప్రసాదించి అచ్చటనే మాతృకాగణ మధ్యమున తానును ఉండి పోయెను. అర్థము నారిగా నుండిన ఈశ్వరుడగు ఆ శివుడు తాను సృష్టించిన మాతృకాగణమున ప్రధానలగు సప్తమాతృకలను ఆరుద్రస్థానమునం దుండునట్లు వ్యవస్థ చేసి తానును అచటనే అంతర్ధాన మందెను.

ఈ వృత్తాంతములు జరిగిన చోటకి సమీపమందే మాతృవర్గముతో కూడ హరుని మూర్తి ప్రతిష్ఠితమయి ఈ నాటికి ఉన్నది. అచ్చట నేటికిని త్రిపురారియు అంధక శత్రుడునునగు హరుడు నృసింహమూర్తికి పూజ చేయుచుండును.

[విశేషము: ఈ అధ్యాయమున అంధకాసురవధ వృత్తాంత నిమిత్తముగా రౌద్రమాతృకలుగా ప్రసిద్ధలగు మాతృకాగణమున నృసింహ మాతృకాగణమును ఉత్పన్నమయిన విధానము చెప్పబడినది. ప్రథమాధ్యాయమున ఋషులు నూతు నడిగిన ప్రశ్నములలో శివుడు భైరవు డెట్లయ్యెనను ప్రశ్నకు సమాధానము కూడ దీనియందు చెప్పబడినది. ఇతరులు చేసిన ఉచ్చాటనాదులచేగాని మరి ఏ ఇతర కారణములచే గాని భూతాది బాధ కలిగినపుడు తన్నివారణార్థ మారాధింపబడువారు ఈ మాతృకలు. ఇట్లు భీరువుల (భయపడువారి) భయమును పోగొట్లు భైరవీ మాతృకలను సృష్టించి శివుడు భైరవుడు అయ్యెను. ఈ రౌద్ర మాతృకలును నారసింహ మాతృకలును ఉచ్చాటనాది మాంత్రిక తాంత్రిక ప్రక్రియలందు ఉపయోగపడు శక్తి విశేషములని తెలియదగినది. రౌద్ర మాతృకల 189 మందిలో వ్రధానలు ఏడుమంది 1. బ్రాహ్మి 2. మాహేశ్వరి 3. కౌమారి 4. వైష్ణవి 5. వారహి 6. ఇంద్రాణి (శాక్రీ) 7. చాముండ అనువారు ; మిగిలిన 182 మంది (7X26=26) అనుచర దేవతలు; నారసింహ మాతృకలలో నలుగురు ప్రధానలు ఒక్కొక్కరికి ఎనిమిదేసి మంది అనుచరలు.]

ఇది శ్రీ మత్స్య మహాపురాణమున అంధకాసుర వధము- రౌద్ర- నారసింహ- మాతృకోత్పత్తియను నూట డెబ్బది ఎనిమిదవ అధ్యాయము.

Sri Matsya mahapuramu-2    Chapters