Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

అథు సప్తషష్ట్యధిక త్రిశతతమో7ధ్యాయః

అథ సామాన్య నామలింగాని

అగ్నిరువాచ :

సామాన్యాన్యథవక్ష్యామి నామిలింగాని తచ్ఛృణు | సుకృతీ పుణ్యవాచ్‌ ధన్యో మహేచ్ఛస్తు మహాశయః. 1

ప్రవీణ నిపుణాభిజ్ఞవిఝనిష్ణాత శిక్షితాః | స్యుర్వదాన్య స్థూలలక్షదాన శౌండా బహుప్రదే. 2

కృతీకృతజ్ఞః కుశల ఆసక్తోద్యుక్త ఉత్సకః | ఇభ్య ఆఢ్యః పరివృఢోహ్యధిభూర్నాయకోధిపః. 3

లక్ష్మీవాల్లక్ష్మణ శ్రీలః స్వతంత్రః సై#్వర్యపావృతః | ఖలపూః స్యాద్భహుకరో దీర్ఘసూత్రశ్చిర క్రియః. 4

జాల్మోసమీక్ష్యకారీ స్యాత్కుంఠోమందః క్రియాసుయః |

కర్మశూరః కర్మటః స్యాద్భక్షకో ఘస్మరోద్మరః. 5

లోలుపో గర్ధలోగృధ్నుర్వి నీతప్రశ్రితౌ తథా| ధృష్టే ధృష్టుర్వియాతశ్చ నిభృతః ప్రతిభాన్వితే. 6

ప్రగల్భో భీరుకో బీరుర్వందారు భివాదకే | భూష్టుర్భ విష్ణుర్భవితాజ్ఞాతా విదుర విందకౌ. 7

మత్తశౌండోత్కట క్షీబాశ్చండస్త్వత్యన్త కోపనః | దేవానంచతి దైవద్ర్యజ్‌ విష్వద్యజ్‌ విష్వగంచతి. 8

యః సహాంచతి సధ్ర్యజ్‌ ససతిర్యజ్‌ యస్తిరోంచతి | వాచోయుక్తి పటుర్వాగ్మీ వావదూకోతివక్తరి. 9

స్యాజ్జల్పాకస్తువాచాలో వాచాటో బహుర్గవ్యావాక్‌ | అపధ్వస్తోధిక్కృతః స్యాద్బద్ధేకీలిత సంయతౌ. 10

అగ్నిదేవుడు పలికెను. ఇపుడు సామాన్య నామలింగములను చెప్పెదను. వినుము. సుకృతీ - పుణ్యవాన్‌ - థన్యః = పుణ్యాత్ముడు; మహేచ్ఛః - మహాశయః - గొప్ప ఇచ్ఛ కలవాడు; ప్రవీణ - నిపుణ - అభిజ్ఞ - విజ్ఞ - నిష్టాత - శిక్షిత = నేర్పుకలవాడు. వదాన్య - స్థూలలక్ష - దాన - శౌండ - బహుప్రద = గొప్ప ఔదార్య వంతుడు. కృతజ్ఞః - కుశలః ప్రవీణుడు. ఆసక్తః - ఉదుక్తః - ఉత్సుకః - కార్యలగ్నుడు. ఇభ్యః - ఆఢ్యః = ధనవంతుడు. పరివృఢః - అధిభూః - నాయకః - అధిపః = అధిపతి. లక్ష్మీవాన్‌ - లక్ష్మణ - శ్రీలః - లక్ష్మీసంపన్నుడు. స్వతంత్రః - సై#్వరీ - అపావృతః-పర్యా. ఖలపూః - బహుకరః = కళ్ళము శుభ్రము చేయువాడు. దీర్ఘసూత్రః - చిరక్రియః = పనులలో చాలా ఆలస్యము చేయువాడు. జాల్మః - అసమీక్ష్యకారి = ఆలోచన లేకుండ పని చేయువాడు. కుంఠః = పనులలో మాంద్యము కలవాడు. కర్మఠః = కర్మశూరుడు; భక్షకః - ఘస్మరః - అద్మరః - పర్యా. లోలువః - గర్ధలః - గృధ్నుః = లోభి; వినీతః - ప్రశ్రితః - వినయవంతుడు. ధృష్టుః = వియాతః = ధృష్ణుడు. నిభృతః-ప్రగల్భః - ప్రతిభావంతుడు. భీరుకః - భీరుః = పిరికివాడు. వందారుః = నమస్కరించువాడు. భూష్ణుః - భవిష్ణుః = కాబోవునది; విదురః - విందకః = తెలుసుకోనువాడు. మత్తః = శౌండః - ఉత్కటః - క్షీభః = మతైక్తినావాడు. చండః = చాలకోపము కలవాడు. దేవద్రియజ్‌ = దేవతలను అనుసరించువాడు. విశ్వగ్ధ్ర్యిజ్‌ = అన్నివైపులకు వెళ్ళువాడు సద్ర్యజ్‌ = కూడ వచ్చువాడు. వాగ్మీ = మాటలలో నేర్పరి. వావదూకః = ఎక్కువ మాటలాడువాడు. జల్పాకః - వాచాలః వాచాటః = నింద్యమైన వాక్కు కలవాడు. అపధ్వస్తః = ధిక్కరింపబడినవాడు. కీలితః - సంయతః = బద్ధుడు.

వరణః శబ్దనోనాందీవాదీ నాందీకరః సమాః | వ్యసనార్తోవరక్తౌద్వౌం బద్ధేకీలిత సంయతౌ. 11

వియస్తవ్యాకులౌ తుల్యౌనృశంస క్రూరఘాతుకాః | పాపోధూర్తో వంచకః స్యాన్మూర్ఖే వైధేయబాలిశౌ. 12

కదర్యేకృపణక్షుద్రౌ మార్గణౌ యాచ కార్థినౌ| అహాంకార వానహంయుః స్యాచ్ఛుభంయుస్తు శభాన్వితః. 13

కాంతం మనోరమం రుచ్యం హృద్యాభీష్టే హ్యభీప్సితే | అసారం ఫల్గుశూన్యం వై ముఖ్యవర్య వరేణ్యకాః.

శ్రేయాన్ర్శేష్ఠః పుష్కలః స్యాత్ర్పా గ్ర్యాగ్రీయమగ్రియమ్‌ | వడ్రేరు విపులం పీనపీవ్నీతు స్థూలపీవరే. 15

సోకాల్పక్షుల్లకాః సూక్ష్మం శ్లక్‌ష్ణం దభ్రం కృశంతను | మాత్రా కుటీలవకణా భూయిష్టం పురుహం పురు.

అఖండం పూర్ణసకల ముపకంఠాన్తికాభితః | సమీపే సాన్నిధాభ్యా సౌనే దిష్టం సుసమీకమ్‌. 17

సుదూరేతు దవిష్ఠస్యాద్ద్వృత్తం నిస్తల వర్తులే | ఉచ్చపాంశూన్నతోదగ్రాధ్రువోనిత్యః సనాతనః. 18

ఆవిద్ధం కుటిలం భుగ్నం వేల్లితం వక్రమిత్యపి | చంచలం తరలం చైవ కఠోరం జఠరం దృడమ్‌. 19

ప్రత్యగ్రోభినవో నవ్యో నవీనో నూతనో నవః | ఏకతానోనన్యవృత్తి రుచ్చండ మవిలంబితమ్‌. 20

ఉచ్చావచం నైక భేదం సంబాధకలిలం తథా | తిమితం స్తిమితం కిన్నమభియోగస్త్వభిగ్రహః. 21

స్ఫాతిర్వృద్ధౌ ప్రథాఖ్యాతౌ సమాహారః సముచ్చయః . అపహారస్త్వ పచయో విహారస్తు పరిక్రమః. 22

ప్రత్యాహార ఉపాదానం నిర్హారోభ్య వకర్షనమ్‌ | విఘ్నోంతరాయః ప్రత్యూహః స్యాదాస్యాద్వసనాస్థితిః.

సన్నిధిః సన్నికర్షః స్యాత్సంక్రమో దుర్గసంచరః| ఉపలంబస్త్వనుభవః ప్రత్యాదేశో నిరాకృతిః. 24

పరిరంభః పరిష్వంగ సంశ్లేషం ఉపగూహనమ్‌ | అనుమా పక్ష హేత్వాద్యైర్డింబే భ్రమర విప్లవౌ. 25

అసన్ని కృష్టార్ఢ జానం శబ్దాద్ధి శాబ్దమీరితమ్‌ | సాదృశ్య దర్శనాతుల్యే బుద్ధిః స్యాదుపమానకమ్‌. 26

కార్యం దృష్ట్వా వినాన స్యాదర్థా పత్తిః పరార్థధీః | ప్రతియోగిన్యగృహితేభువినా స్తీత్య భావకః.

ఇత్యాది నామలింగో హి హరిరుక్తో నృబుద్ధయే. 27

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే సామాన్య నామలింగవర్ణనం నామ సప్తషష్ట్యధిక త్రిశతతమోధ్యాయః.

రవణః - శబ్దనః = ధ్వని చేయువాడు; నాందీ వాదీ - నాందీకరః = పర్యాయ పదములు. వ్యసనార్తః-ఉపరక్తః = పీడితుడు. విహస్తః - వ్యాకులః = శోకాకులుడు. నృశంసః - క్రూరః - ఘాతకః-పాపః = క్రూరుడు. ధూర్తః = వంచకుడు. వైధేయః - బాలిశః = మూర్ఖుడు; కృపణః-క్షుద్రః=లోభి. మార్గణః - యాచకః=యాచకులు. అహంయుః=అహంకారవంతుడు. శుభంయుః=శుభాన్వితుడు. కాంత-మనోరమ. రుచ్య=సుందరము. హృద్య - అభీష్ట - ఈప్సిత=ప్రియమైనది; ఫల్గు-శూన్యం - సారము లేనిది. ముఖ్య - వర్మ - వరేణ్యక - శ్రేయాన్‌ - శ్రేష్ఠ - పుష్కల=శ్రేష్ఠములు. పాగ్ర్య - అగ్ర్య - అగ్రీయ=శ్రేష్ఠములు. వడ్ర - ఉరు - విపుల = విశాలము. పీవన్‌ - స్థూల - పీవర=బలిసియున్న. స్తోక - అల్ప - క్షుల్లక - సూక్ష్మ-స్లక్ష్మ - దభ్ర - కృశ - తను - మాత్రా - తృటి - లవ - లవ కణ=సూక్ష్మము అల్పము; భూయిష్ఠం - పురుహం - పురు=అధికము. అఖండం - పూర్ణం - సకలం - వర్యా. ఉపకంఠ - అంతిక - అభితః - సన్నిధి - అభ్యాశ = సమీపము. నేదిష్ఠ=చాల దగ్గరగా వున్నది. దవిష్ఠం=సుదూరము. వృత్త - నిస్థల - వర్తుల=గుండ్రనిది. ఉచ్చ - ప్రాంశు - ఉన్నత - ఉదగ్ర=ఉన్నతమైనది. ధ్రువ - నిత్య - సనాతన = నిత్యము. ఆవిద్ధ - కుటిల - భుగ్న - వేల్లిత - పర్యా. చంచల - తరల = పర్యా కఠోర - జరఠ - ధృడ=పర్యా. ప్రత్యగ్ర - అభినవ - నవ్య - నవీన - నూతన - నవ = క్రొత్తది. ఏకతానః = ఏకాగ్రచిత్తుడు. ఉచ్చండం - అవిలంబితం = తొందరగా- ఉచ్చావచం = అనేక భేదములు కలది. సంభాధః - కలిలం = ఇరుకు. తిమిత - స్థిమిత - క్లిన్న = తడిసిన; అభియోగః - అభిగ్రహః - ఎదుటి వానిపై దోషము ఆరోపించుట. స్పాతి=వృద్ధి; ప్రథా=ప్రసిద్ధి; సమాహారః - సముచ్చయః=సమూహము. అపహారః - అపచయః=తగ్గిపోవుట. విహారః - పరిక్రమః=విహరించుట. ప్రత్యాహారః=ఇంద్రియములను విషయముల నుండి మరలించుట. నిర్హారః = లాగి వేయుట. విఘ్నః - అంతరాయః - ప్రతూహః=సమానార్థకములు. ఆస్యా - ఆసనా - స్థితిః = కూర్చుండుట. సన్నిధిః - సన్నికర్షః=దగ్గరగా వుండుట. సంక్రమః=దుర్గములో ప్రవేశించుట. ఉపలంభః = అనుభవము. ప్రత్యాదేశః=నిరాకరణము. పరిరంభ - పరిష్వంగ - సంశ్లేష - ఉపగూహన = ఆశ్లేషించుట. అనుమా=పక్షహేత్వాదులచే తెలుసుకొనుట. డింబ - భ్రమర - విప్లవ=భయపడ్డ వాడు వేయుకేక. శాబ్దం=శబ్దము వల్ల కలిగిన దూరస్థ పదార్థ జ్ఞానము; ఉపమానకం=సాదృశ్యమున బట్టి ఏర్పడిన తుల్య వస్తు జ్ఞానము. ఆర్థా పత్తిః = కార్యమును బట్టి మరొక విషయమును ఊహించుట. ఆభావకః=ప్రతియోగి కనబడక పోవుటచే అది అచట లేదు అని కలుగు జ్ఞానము. ఈ విధముగా మానవులకు జ్ఞానము కొరకై నామ లింగ స్వరూపుడగు హరి చెప్పబడినాడు.

అగ్ని మహా పురాణము సామాన్య నామ లింగ వర్ణన మను మూడు వందల ఆరువది ఏడవ అధ్యాయము సమాప్తము.

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page