Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

అథ షష్ట్యధిక త్రిశతతమోధ్యాయః

అథ కోశేషు స్వర్గపాతాలాదివర్గాః

అగ్నిరూవాచ

స్వర్గాది నామలింగోయో హరిస్తం ప్రవదామితే | స్వఃస్వర్గనాక త్రిదివాద్యోదివౌద్వేత్రివిష్టపమ్‌. 1

దేవాబృందారకా లేఖారుద్రాద్యా గణదేవతాః | విద్యాధరోప్సరోయక్ష రక్షోగంధర్వ కిన్నరాః. 2

పిశాశో గుహకసిద్ధో భుతోమి దేవ యోనయః | దేవద్విషోసురా దైత్యాః సుగతః స్యాత్తథాగతః. 3

బ్రహాత్మభూః సురజ్యేష్టో విఘ్నర్నా రాయణోహరిః | రేవతీశో హలీరామః కామః పంచశరః స్మరః 4

లక్ష్మీః పద్మాలయా పద్మాసర్వః సర్వేశ్వరః శివః కపర్దోస్య జటాజూటః పినాకోజ గవంధనుః. 5

ప్రమథాఃస్యుః పారిషదామృడానీ చండికాంబిగా | ద్వైమాతురో గజాస్యశ్చసేనానీ రగ్ని భూర్గుహః. 6

ఆఖండలః సునాసీరః సుత్రామాచ దివస్పతిః | పులోమజాశచీన్దాణీ దేవీతస్యతు వల్లభా. 7

స్యాత్ర్పాసాదౌ వైజయంతో జయంతః పాకశాసనిః | ఐరావతోభ్రమాతంగైరావణాభ్రమువల్లభాః. 8

హ్రాదినీ వజ్రమస్త్రీసాత్కులిశం భిదురం పవిః | వ్యోమయానం విమానోస్త్రీ పీయూష మమృతంసుధా. 9

స్యాత్సుధర్మా దేవసభా సర్గంగా సురదీర్ఘికా | స్త్రియాం బహుష్పప్సరసః స్వర్వేశ్యా ఉర్వశీ ముఖాః. 10

హాహా హూహూశ్చ గంధర్వా అగ్నిర్వహ్నిర్ధనంజయః | జాతవేదాః కృష్ణవర్త్మా ఆశ్రయాశశ్చపావకః. 11

హిరణ్యరేతాః సప్తార్చిః శుక్రశ్చైవాశుశుక్షణః | శుచిర ప్తిత్తమౌర్వస్తు వాడవో వడ వానలః. 12

వహ్నేర్ద్వయోర్జ్వాల కీలా వర్చిర్హేతిః శిఖాస్త్రియామ్‌ | త్రిషు స్ఫులింగోగ్నికణో ధర్మరాజః పరేతరాట్‌.

కాలోన్తకో దండధరంః శ్రాద్ధదేవోథ రాక్షసః | కోణపాస్త్రపక్రవ్యాదా యాతుధానశ్చ నైఋతిః. 14

ప్రచేతా వరుణః పాశీశ్వసనః స్వర్శనోనిలః | సదాగతిర్మాతరిశ్వా ప్రాణో మరుత్స మీరణః. 15

జవోరం హస్తరసీ తులఘు క్షిప్ర మరం ద్రుతమ్‌ | సత్వరం చవలంతూర్ణమవిలంబితమాశుచ. 16

సతతానారతాశ్రాంత సంతతా విరాత నిశమ్‌ | నిత్యానవరతా జస్ర మప్యథాతి శయోభరః. 17

అతివేల భృశాత్యర్థాతి మాత్రోద్గాఢ నిర్భరమ్‌ | తీవ్రై కాంతనితాంతాని గాఢబాఢ దృఢానిచ. 18

గుహ్యకేశో యక్షరాజో రాజరాజో ధనాధిపః | స్మాత్కిన్నరః కింపురుషస్తురంగ వదనోమయుః. 19

నిధ్మిర్నాశే విధిర్యోమత్వభ్రం పుష్కర మంబరమ్‌ | ద్యోదివౌ చాంతరిక్షం ఖం కాష్ఠాశాకకుభోదిశ-. 20

అభన్తరం త్వన్తరాలం చక్రవాలం తు మండలమ్‌ | తడిత్వా న్వారిదో మేఘస్తనయిత్నుర్భలాహకః. 21

కాదంబనీ మేఘ మాలాస్తనితం గర్జితం తథా | శంపా శత హ్రదాహ్రాది న్యైరావత్యః క్షణప్రభా. 22

తడిత్సౌదామినీ విద్యుచ్చంచలా చపలాపిచ | స్ఫూర్జథుర్వ జ్రనిర్ఘోషో వృష్టిఘాత స్త్వవగ్రహః. 23

అగ్ని పలికెను. స్వర్గాదినామములు లింగముగ కల హరిని గూర్చి చెప్పెదను. స్వన్‌ స్వర్గ. నాక, త్రిదివ, ద్యో దివ్‌, (పుం, స్త్రీ,) త్రివిష్ట పమ్‌,= స్వర్గము. దేవాః, వృందారకాః లేఖాః = దేవతలు, రుద్రులు మొదలగు వారు గణ దేవతలు. విద్యాధరః అప్సరాః, యక్షః, రక్షః గందర్వః కిన్నరః పశాచః, గుహ్యకః, సిద్ధః భూతః= వీరందరు దేవయోనులు. దేవద్విషః, అసురాః దైత్యాః = దైత్యులు. సుగతః, తథా గతః = బుద్ధుడు బ్రహ్మా ఆత్మ భూ, సురజ్యేష్ఠ = బ్రహ్మ, విష్ణుః, నారాయణః, హరిః = విషువు. రేవతీశః, హలీ, రామః, = బలరాముడు, కామః, పంచశరః స్మరః = మన్మథుడు, లక్ష్మీః, పద్మాలయా, పద్మా, = లక్ష్మి శర్వః, సర్వేశ్వరః, శివః = శివుడు, ఇతని జటా జూటమునకు కపర్ద యనిపేరు. పినాకః, అజగవమ్‌ ఈ రెండును ఈతని ధనుస్సునకు పేర్లు. శివుని పారిషదులకు ప్రమథాః అని పేరు. మృడానీ, చండికా, అంబికా = పార్వతి ద్వైమాతురః, గజాస్యః = గణపతి, సేనానీః, అగ్నిభూః గుహః = కుమారస్వామి. ఆఖండల సునాశీర, సుత్రామా, దివస్పతిః,=ఇంద్రుడు ఆతని భార్యకు పులోమజా శచీ, ఇందాణీ, యనిప్లేరు. ఆతని ప్రాసాదము వైజయంతమ్‌. ఆతని కుమారుడు జయంతుడు ఐరావతః, అభ్రమాతంగః, ఐరావణః; అభ్రము వల్లభః = ఐరావతము హ్రాదినీ, వజ్రం. (పుం, న) కులిశమ్‌, భిదురమ్‌, పవి=వజ్రా యుధము వ్యోమయానం, విమానః (పుం న)=విమానము. పీయూషం, అమృతమ్‌, సుధా=అమృతము. సుధర్మా--దేవ సభా; స్వర్గంగా సురదీర్ఘికా=స్వరలోక గంగ, అప్సరస్‌ శబ్దము స్త్రీలింగము నందును నిత్య బహువచనము నందును వుండును. ఊర్వశి మొదలగువారు స్వర్గలోకవేశ్యలు, హా హాః ఉహూః, వీరు గుంధర్వులు, అగ్నిః వహ్నిః, ధనంజయః, జాత వేదా- కృష్ణవర్త్మా, ఆశ్రయాశః, భావకః హిరణ్య రేతాః, శుక్రః ఆశుశుక్షణిః శుచిః, అప్పిత్తమ్‌=అగ్ని; ఔర్వః, వాడవః వడవానలః=వడవాగ్ని; అగ్ని యొక్క జ్వాలలు బోధించు జ్వాల కీలశబ్దములు రెండు లింగములందును వుండును. అర్చిః హేతిః శిఖా, (స్త్రీ)=జ్వాలలు. స్ఫు లింగః (పుంస్త్రీన(=అగ్నికణము. ధర్మరాజుః, పరతరాట్‌ కాలః, హంతకః. దండధరః. శ్రాద్ధదేవః=యముడు; రాక్షస, - కోణప - అస్రవ, - క్రవ్యాద - యాతుధాన - నైఋతి=రాక్షసుణ, ప్రచేతన్‌ - వరుణ - పాశీ = వరుణుడు శ్వసనః - స్వర్శనః, - అనిలః - సదాగతిః, - మాతిరిష్వన్‌ - ప్రాణః - మరుత్‌ - సమీరణః వాయువు. జవ - రంహస్‌ - తరస్‌ - వేగము - లఘ, - క్షిప్రమ్‌, - అరం, - ద్రుతమ్‌, - సత్వరం, - చపలం - తూర్ణం - అవిలంబితయ్‌ - ఆశు=శ్రీఘ్రముగా; సతత, - అనారత - అశ్రాంత - సంతత - - అవిరత - అనిశ - నిత్య - అనవరత అజస్ర = ఎల్లపుడును. అతి శయః, భరః=అతిశయము, అతివేల, - భృశ - అత్యర్థ - అతిమాత్ర - ఉద్గాఢ - నిర్భర - తీవ్ర - ఏకాంత - నితాంత - గాఢ - బాఢ - దృఢ=మిక్కిలి; గుహకేశః, యక్షరాజః, రాజరాజ - ధనాధిపః=కుబేరుడు. కిన్నరః - కింపురుషః - తురంగవదనః - మయుః - ఇవి సమానార్థకములు. నిధి ః - శేపధిః=నిధి, వ్యోమ, - అభ్ర - పుష్కర - అంబర - ద్యో - దివ్‌ - అంతరిక్ష - ఖ=ఆకాశము. కాష్ఠా - ఆశా - కుకుభ్‌ - దిశ్‌=దిక్కులు. అభ్యంతరమ్‌ - అంతరాళమ్‌ - చక్రవాళము - మండలమ్‌=మండలము. తటిత్వత్‌ - వారిద, మేఘ - స్తనయిత్ను, - బలాహక-మేఘము. కాదంబనీ, మేఘమాలా=మేఘ పంక్తి, - స్తనితం - గర్జితమ్‌ = ఉరుము; శంపా - శతహ్రద - హ్రాదినీ - ఐరావతీ - క్షణప్రభా - తడిత్‌ - సౌధామినీ - విద్యుత్‌ - చంచలా చపలా=మెరుపు స్ఫూర్జథుః . వజ్రనిర్ఘోషః=ఉరుము, అవగ్రహః అనగా వర్షా భావము.

ధారా సంపాత ఆసారః శ్రీకరోంబుకణాః స్మృతాః | వర్షోపలస్తుకరకామేఘచ్ఛన్నేహ్ని దుర్దినమ్‌. 24

అంతర్దా వ్యవధాపుంసిత్వన్తర్ధి రపవారణమ్‌ | అపిధానతిరోధాన పిధానాచ్ఛా దనానిచ. 25

అబ్జోజైవాతృకః సోమోగ్లౌర్ముగాంకః కలానిధిః విధుః కుముదబంధుశ్చ బింబోస్త్రీమండలం త్రిషు. 26

కలాతు షోడశోభాగో భిత్తం శకలఖండకే | చంద్రికా కౌముదీ జ్యోత్ప్నా ప్రసాదస్తు ప్రసన్నతా. 27

లక్షణం లక్ష్మకం చిహ్నం శోభాకాంతిర్ద్యుతిశ్ఛవిః | సుషమా పరమా శోభాతుపారస్తుహినం హిమమ్‌. 28

అవశ్యాయస్తు నీహారః ప్రాలేయః శిశిరోహిమః | నక్షత్రమృక్షం భంతారా తారకాప్యుడు వాస్త్రియామ్‌. 29

గురర్జీవ ఆంగిరస ఉశనా భార్గవకవిః | విధుంతుద స్తమోరాహుర్లగ్నం రాశ్యుదయః స్మృతః. 30

సప్తర్షయో మరీచ్యత్రి ముఖాశ్చిత్ర శిఖండినః | హరిదశ్వ బ్రధ్నపూషద్యుమణిర్మిహిరోరవిః. 31

పరివేషస్తు పరిధిరుప సూర్యకమండలే | కిరణోస్త్ర మయూఖాంశు గభస్తిఘృణి ఘృష్ణయః. 32

భానుః కరోమరీచిః స్త్రీపుంసయోర్దీధితిస్త్రియామ్‌ | స్యుః ప్రభారుగ్రుచిస్త్విడ్భా భాశ్ఛవిధ్యుతి దీప్తయః. 33

రోచిః శోచిరుభేక్లీబే ప్రకాశోద్యోత ఆతపః | కోష్ణం కవోష్ణం మందోష్ణం కదుష్ణం త్రిఘతద్వతి. 34

తిగ్మం తీక్షం ఖరం తద్వద్దిష్టోనేహాచ కాలకః | ఘస్రోదినాహానీ చైవసాయసంధ్యా పితృప్రసూః. 35

ప్రత్యూషో೭೭హర్ముఖం కల్యముషః ప్రత్యూషసీ ఆపి | పాహ్ణాపరాహ్ణ మధ్యాహ్ణా త్రిసంధ్య మథశర్వరీ. 36

యామీ తమీ తమిస్రాచ జ్యోత్స్నీ చంద్రికయాన్వితా | ఆగామి వర్తమానా హర్యుక్తాయాం నిశిపక్షిణీ. 37

అర్థరాత్ర నిశీథౌద్వౌ ప్రదోషోరజనీముఖమ్‌ | సపర్వసంధిః ప్రతిపత్పంచ దశ్యోర్యదంతరమ్‌. 38

పక్షాంతౌ పంచదశ్యౌద్వే పోర్ణమాసీతు పూర్మిమా | కలాపీనే సానుమతిః పూర్ణేరాకా నిశాకరే. 39

అమావాస్యా తమావస్యా దర్శః సూర్యేందు సంగమః |

సాదృష్టేందుః సినీవాలీ సానష్టేందు కలాకుహూః. 40

ధారా వర్షమునకు ఆసారః అని పేరు. శీకరః=నీటి బిందువులు, వర్షోపల) 0 కరకా=వడగళ్ళు, దుర్దినమ్‌=మేఘములు కప్పిన దివసము. అంతర్థా - వ్యవధా - అంతర్థి (పుం) అపవారణ - అపిధాన - తిరోధాన - పిధాన - ఆచ్చాదన=ఆచ్ఛాదనము. అబ్జ=జై వాతృక - సోమ - గ్లౌ - మృగాంక - కళానిధి - విధు - కుముదబందు=చంద్రుడు. బింబః - (పుం. న.) మండలము. (పుం స్త్రీన) = మండలము పదహారవ భాగమునకు కళ యని పేరు. భిత్త - శకల - ఖండక - ఖండము - చందికా - కౌముదీ - జ్యోత్స్నా = వెన్నెల; ప్రసాదః = వసన్నత్వము. లక్షణమ్‌ లక్ష్మకమ్‌ - చిహ్నం = చిహ్నము. శోభా - కాంతి - ద్యుతి - ఛవి - కాంతి - పురుమ శోభ-సషమ. తుషార - తుహిన - హిమ = మంచు - సన్నని మంచునకు అవశ్యాయః, నీహారః అని పేర్లు. ప్రాలేయః - శిశిరః - హిమః = ఇవి కూడ నీహారమునకు పేర్లు. నక్షత్ర - ఋక్ష - భ - తారా - తారకా - ఉడు - స్త్రీ. న. = నక్షత్రము. గురుః - జీవః - ఆంగిరసః=గురుడు. ఉశనాః - భార్గవః=కవిః=శుక్రుడు. విదుంతుదః - తమః - రాహుః=రాహువు. లగ్నం=రాశి యొక్క ఉదయము. మరీచి, అత్రి మొదలగు వారు సప్తర్షులు. చితశిఖండినః అని పేరు. హరిదశ్వ - బ్రధ్న - పూష - ద్యుమణి మిహిర, రవి = సూర్యుడు, పరివేషః - పరిధిః - సూర్యుని చుట్టు కట్టిన మండలము. కిరణ - ఉశ్ర - మయూఖ - అంశు - గభస్తి - ఘృణి - ఘృష్ణి - భాను - కర - మరీచి (స్త్రీ. వు.) దీధితి = కిరణము (స్త్రీ) - ప్రభా - రుచి - త్విట్‌ - భా - ఆభా - ఛవి - ద్యుతి - దీప్తి - రోచిస్‌ - (న) శోచిస్‌ (న)=కాంతి. ప్రకాశ - ద్యోత - ఆతప - ఎండ - కోష్ణ - కవోష్ణ - మందోష్ణ - కదుష్ణ=కొంచెము వేడి. కొంచెము వేడి కలది అను అర్థమున త్రిలింగములు. తిగ్మ - తీక్ష - కర = తీక్షము. దిష్ట - అనేహ - కాల - కాలము. ఘస్రః = రాత్రింబవళ్ళు; సాయం సంధ్యా - పితుప్రసూః=సాయంకాల సంధ్యా. ప్రత్యూషః - అహర్ముఖం - కల్యం - ఉషః - ప్రత్యుషః = ప్రాతః కాలము. ప్రాహ్ణఅపరాహ్ణ - మధ్యాహ్నములకు త్రిసంధ్యము అని పేరు. శర్వరీ - యామి - తమీ=రాతి; తమిసా చీకటి రాత్రి; జ్యోత్స్నీ వెన్నెలరాత్రి. రాబోవు పగలు జరుగుచున్న పగలు కలసి రాత్రికి "పక్షిణీ" అని పేరు. అర్థ రాత - నాశీథ = అర్థరాత్రి - ప్రదోషః = సాయంకాల ప్రారంభము. ప్రతిపత్తునకును, పూర్ణిమ అమావాస్యలకును మధ్యనున్నది పర్వ సంధి. రెండు పక్షాంత తిథులకు పంచదశీ అని పేరు. పౌర్ణమాసీ - పూరిమా = పూర్ణిమ= చంద్రుడు ఒక కళ తక్కు వున్నచో ఆ పూర్ణిమా "అనుమతి" పూర్ణచంద్రుడున్నది "రాకా" అమావాసా. అమావసా - దర్శః - సూర్యేందు సంగమః = ఆమావాస్య చంద్రుడు కనబడినది - సినీవాలీ, చంద్రకళ లేనిది - కుహూః, సంవర్త - ప్రశయ - కల్ప - క్షయ - కల్పాంత = ప్రళయము.

సంవర్తః ప్రలయః కల్పః క్షయః కల్పాన్త ఇత్యపి |

కలుష వృజినైనోఘమంహో దురితదుష్కు%ృతమ్‌. 41

స్యాద్ధర్మ మస్త్రియాం పుణ్య శ్రేయసీ సుకృతం వృషః |

ముత్ర్పీతిః ప్రమదోహర్షః ప్రమోదామోదసమ్మదాః. 42

స్యాదానన్ద థురానందః శర్మశాత సుఖానిచ | శ్వః శ్రేయనం శివం భద్రం కల్యాణం మంగళం శుభమ్‌. 43

భావుకం భవికంభవ్యం కుశలం క్షేమమస్త్రియామ్‌ | దైవం దిష్టం భాగధేయం భాగ్యం స్త్రీనియతిర్విధిః. 44

క్షేత్రజ్ఞ ఆత్మాపురుషః ప్రధానం ప్రకృతిః స్త్రియామ్‌ | హేతుర్నాకారణం బీజంనిదానం త్వాదికారణమ్‌. 45

చిత్తంతు చేతోహృదయం స్వాన్తం హృన్మానసంమనః . బుద్ధిర్మనీషాధిషణాధీః ప్రజ్ఞాశేముషీ మతిః. 46

ప్రేక్షోపలబ్దిశ్చిత్సం విత్ర్పతిపజ్ఞచేతనాః | ధీర్ధారణావతీ మేధానంకల్పః కర్మమానసమ్‌. 47

సంఖ్యావిచారణా చర్చావిచికిత్సాతు నంశయః | అధ్యాహారస్తర్క ఊహః సమౌనిర్ణయ నిశ్చ¸°. 48

మిథ్యాదృష్టిర్నాస్తికతా భాంతిర్మిథ్యా మతిర్ర్భమః | ఆంగీకారాభ్యు పగమప్రతిశ్రమ సమాధయః. 49

మోక్షేధీర్ఞాన మన్యత్ర విజ్ఞానం శిల్పశాస్త్రయోః | ముక్తిః కైవల్య నిర్వాణ శ్రేయోనిఃశ్రేయసామృతమ్‌.

కలుష - వృజిన - ఏనన్‌ - అఘ - అంహన్‌ - దురిత - దుష్కృత = పాపము. ధర్మ (పుం న) పుణ్య - శ్రేయస్‌ - సుకృత - వృష = పుణ్యము. ముత్‌ - ప్రీతి - ప్రమద - హర్ష - ప్రమోద - ఆమోద - సంమద-ఆనందధు-ఆనంద - శర్మ - శాత - సుఖ = ఆనందము. స్వ శ్రేయసం - శివం - భద్రం - కల్యాణం - మంగళం - భావుకం - భవికం - భవికం - భవ్యం - కుశలం - క్షేమం - (పుం. న.) = క్షేమము. దైవం - దిష్టం - భాగధేయం - భాగ్యం - నియతిః - విధిః = దైవము. క్షేత్రజ్ఞః . ఆత్మా - పురుషః = జీవుడు. ప్రధానం - ప్రకృతిః = ప్రకృతి, హేతుః (పుం) కారణం - బీజం - హేతువు. నిదానం = ఆదికారణము. చిత చేతన్‌ - హృదయ - స్వాంత - హృత్‌ - మానస - మనన్‌ = మనస్సు, బుద్ధిః -మనీషా - ధిషణా - ధీః - ప్రజ్ఞా శేముషీ - మలిః - ప్రేక్షా - ఉపలబ్ధి - చిత్‌ - సంవిత్‌ - ప్రతిపత్‌ - జ్ఞప్తి - చేతనా = బుద్ధి. ధారణా శక్తిగల బుద్ధి మేధ. మానసిక కర్మ సంకల్పము. సంఖ్యా - విచారణా - చర్చా = విచారణ. విచికిత్సా - సంశయః=సంశయము. అధ్యాహారః - తర్కః-ఊహః=ఊహ. నిర్ణయ - నిశ్చయ=నిర్ణయము. మిధ్యాదృష్టి - నాస్తికతా=నాస్తికత్వము. భ్రాంతిః - మిథ్యా మతిః - భ్రమ. అంగీకార - అభ్యుపగమ - ప్రతిశ్రమ - సమాధి = అంగీకారము. జ్ఞానం = మోక్ష బుద్ధి. విజ్ఞానం - శిల్ప శాస్త్ర జ్ఞానము. ముక్తి - కైవల్య - నిర్వాణ - శ్రేయస్‌ - నిశ్రేయన్‌ - అమృత - మోక్ష - అపవర్గ = మోక్షము. అజ్ఞానం - అవిద్యా - అహంమతిః = అజ్ఞానము.

మోక్షోపవర్గోథాజ్ఞానమవిద్యాహమ్మతిః స్త్రియామ్‌ |

విమర్దోత్థే పరిమలో గంధే జన మనోహరే. 51

ఆమోదః సోతినిర్హారీ సురభిర్ఘ్రాణ తర్పణః | శుక్లశుభ్రశుచిశ్వేత విశదశ్వేత పాండరాః. 52

అవదాతః సితోగౌరో వలక్షో ధవలోర్జునః | హరిణః పాండురః పాండురీషత్పాండుస్తు ధూసరః. 53

కృష్ణే నీలాసిత శ్యామకాలశ్యామల మేచకాః | పీతోగౌరో హరిద్రాభః పాలాశోహరితోహరిత్‌. 54

రోహితో లోహితోరక్తః శోణః కోకనదచ్ఛవిః | అవక్తరాగస్త్వరుణః శ్వేతరక్తస్తు పాటలః. 55

శ్యావఃస్యాత్కపిశోధూమ్రధూమలౌ కృష్ణలోహితే | కడారః కపిలః పింగ పిశంగౌక ద్రుపింగలౌ. 56

చిత్రం కిర్మీర కల్మాషశబలైతాశ్చ కర్బురే | వ్యాహారఉక్తిర్లపిత మపభంశో శబ్దకః. 57

తిఙ్సబన్తచయోవాక్యం క్రియావాకార కాన్వితా | ఇతహాసః పురావృత్తం పురాణం పంచలక్షణమ్‌. 58

ఆఖ్యాయికోపలబ్ధార్థా ప్రబంధః కల్పనాకథా | సమాహారః సంగ్రహస్తు ప్రవహ్లికా ప్రహేళికా. 59

సమస్యాతు సమాసార్థా స్మృతిస్తు ధర్మసంహితా | ఆఖ్యాహ్వే చాభిధానంచ వార్తావృత్తాంత ఈరితః. 60

హూతిరాకారణాహ్వాన ముపన్యాసస్తు వాఙ్మఖమ్‌ | వివాదోవ్యవహారః స్యాత్ర్పతి వాక్యోత్తరేసమే. 61

ఉపోద్ఘాత ఉదాహారోహ్యథ మిథ్యాభిశంసనమ్‌ | అభిశాపోయశః కీర్తిః ప్రశ్నః పృచ్ఛానుయోగకః. 62

విమర్దము వలన కలిగిన సువాసన పరిమళము. అది జనమనోహరముగా వుండును. ఎక్కువ ఆనందము కల్గించునది ఆమోదము. ఘ్రాణమునకు తృప్తి నిచ్చునది - సురభి - శుక్ల - శుభ్ర, శుచి, శ్వేత - విశద - స్యేత, పాండర - అవదాత - సిత - గౌర - వలక్ష - ధవళ - అర్జున - హరిణ - పాండుర - పాండు = తెలుపు, తెల్లనీ, ధూసరః = కొంచెము తెల్లగా నున్నది కృష్ణ - నీల - అసిత - శ్యామ - కాల - శ్యామల - మేచక = నలుపు నల్లని. పీత - గౌర - హరిద్రాభ = పసుపు వచ్చని, పాలాశ - హరిత - హరిత్‌ = ఆకుపచ్చని, రోహిత లోహిత - రక్త - శోణ - కోకనదచ్ఛవి = ఎరువు, ఎర్రని, అరుణః=అంతగా ఎర్రని కానిది, పాటలః = తెలుపు ఎరుపు రంగులు కలది. శ్యావః - కపిశః = కపి శవర్ణము కలది. ధూమ్ర - దూమల - కృష్ణ లోహితము. కడారః - కపిల - పింగః - కద్రుః - పిశంగః - పింగళ=పింగళ వర్ణము కలది. చిత - కిర్మీర - కల్మాష - శబల - ఏత - కర్బుర = చిత్ర వర్ణము కలది. వ్యాహారః - ఉక్తిః లపితం = సంభాషణము. అపభ్రంశః = అప శబ్దము. తిఙ్గన్త సుబంతముల సముదాయము లేదా కారకాన్వితమగు క్రియ వాక్యము. ఇతిహాస - పురావృత - పురాణ - పంచ లక్షణ = పురాణము. సత్యమైన కథ కలది ఆఖ్యాయికా. కల్పిత ప్రబంధము కథా. సమహార - సంగ్రహ; = సముదాయము. ప్రవర్హికా- ప్రహేళికా = ఈ రెండును సమానార్థకములు. సమస్యా - సమాసార్థ = ఈ రెండును సమానార్థకములు. స్మృతిః - ధర్మ సంహితా = ధర్మ శాస్త్రము. అఖ్యా-ఆహ్వ - అభాధాన = పేరు. హూతి - ఆకారణా - ఆహ్వాన = పిలుచుట. ఉపన్యాసః - వాఙ్మఖము = వాక్ప్రారంభము. వివాదః - వ్యవహారః = వివాదము. ప్రతివాక్య - ఉత్తర = ఈ రెండును సమానార్థకములు. ఉపోద్ఘాతః - ఉదాహారః = సమానార్థకములు. అభిశాపః = అనగా మిథ్యాభి శంసనము యశః=కీర్తిః, పర్యాయములు. ప్రశ్నః - ప్పచ్ఛా - అనుయోగకః=పర్యయములు.

ఆమ్రేడితం ద్విస్త్రరుక్తం కుత్సానిదేచ గర్హణ | స్యాదాభాషణ మాలాపః ప్రలాపోనర్థకంవచః. 63

అనులాపో మూహుర్భాషా విలాపః పరిదేవనమ్‌ | విప్రలాపో విరోధోక్తిః సంలాపోభాషణం మిథః. 64

సుప్రలాపః సువచన మపలాపస్తు నిహ్నవః | రుశతీ వాగకల్యాణీ సంగతం హృదయం గమమ్‌. 65

అత్యర్థమధురం సాన్త్వమబద్ధం స్యాదనర్థకమ్‌ | నిష్ఠురాశ్లీల పరుషం గ్రామ్య వైసూనృతప్రియే. 66

సత్యం తథ్యమృతం సమజ్‌ నాదనిస్వాననిస్వనాః | ఆరవారావ సంరావ విరావా అథమర్మరః. 67

స్వనితే వస్త్రపర్ణానాం భూషణానాంతు శింజితమ్‌ | వీణాయా నిక్వణః క్వాణః తిరశ్చాంవాశితంరుతమ్‌. 68

కోలాహలః కలకలో గీతంగాన మిమేసమే | స్త్రీప్రతిశుత్ర్పతి ధ్వానే తంత్రీకంఠాన్నిషాదకః. 69

కాకలీతు కలేసూక్ష్మే ధ్వనౌతు మధురాస్ఫుటే | కలోమంద్రస్తు గంభీరే తారోత్యుచ్చైః స్త్రీయాస్త్రిషు. 70

నమన్వితలయస్త్వేక తాలోవీణాతు వల్లకీ | విపంచీ సాతుతంత్రీభిః సప్తభిః పరివాదినీ. 71

తతంవీణాదికం వాద్యమానద్ధం మురజాదికమ్‌ | వంశాదికంతు సుషిరం కాంస్యతాలాదికం ఘనమ్‌. 72

చతుర్విధమిదం వాద్యం వాదిత్రాతోద్యనామకమ్‌ |

మృదంగా మురజా భేదా స్త్వంఖ్యాలింగ్యోర్ధ కాస్త్రయః. 73

స్యాద్యశః పటహోఢక్కా భేర్యామానక దుందుభి. | ఆనకః పటహోభేదా ఝర్ఘరీ డిండిమాదయః. 74

మర్దలః వణవస్తుల్యో క్రియామానంతు తాలకః | లయః సామ్యం తాండవస్తు నాట్యం లాస్యంచ నర్తనమ్‌.

తౌర్యత్త్రికం నృత్యగీత వాద్యం నాట్యమిదం త్రయమ్‌ | రాజాభట్టారకోదేవః సాభిషేకాచ దేవ్యపి. 76

శృంగారవీర కరుణాద్భుత హాస్యభయానకాః | బీభత్స రౌద్రేచ రసా శృంగారః శుచిరుజ్జ్వలః. 77

ఉత్సాహవర్దనోవీరః కారుణ్యం కరుణాఘృణా | కృపాదయా చానుకంపాప్యనుక్రోశోవ్యథోహనః. 78

హాసో హాస్యంచ బీభత్సం వికృతం త్రిష్విదం ద్వయమ్‌ |

విస్మయోద్భుత మాశ్చర్యం చిత్రమప్యథ భైరవమ్‌. 79

ధారుణం భీణషం భీష్మం ఘోరం భీమం భయానకమ్‌ | భయంకరం ప్రతిభయం రౌద్రంతూగ్రమమీత్రిషు.

చతుర్ధశదరత్రాసౌ భీతిర్భీః సాధ్వసం భయమ్‌ | వికారోమానసో భావోనుభావో భావబధనః. 81

ఆమ్రేడితం=రెండు మూడుసార్లు చెప్పినది. కుత్సా - నిందా - గర్హణ=నింద, ఆలావః మాటలాడుట. ప్రలాప.=అనర్థ వచనము. అనులాపః=మాటి మాటికి చెప్పుట. విలాపః=ఏడ్పు. విప్రలావః=విరోధ వచనము, సంలాపః=పరస్పర భాషణము. సుప్రలాప=మంచి మాట. అపలాపః=కప్చివుచ్చుట. రుషతీ=అమంగళ వాక్కు, సంగతం=హదయంగమమైనది. స్వాంత్వం=మిక్కిలి మధురమైనది. అబద్ధం=అర్థము లేని మాట. నిష్ఠుర - అశ్లీల- పరుష=గ్రామ్యము. సూవృతం=ప్రియ వాక్కు, సత్యం - తథ్యం - ఋతం=సత్యమైన మాట. నాద - నిస్వాన - నిస్వన - ఆరవ - ఆరావ - సంరాన విరావ= ధ్వని. మర్మరః=వస్త్ర వర్ణాదుల ధ్వని. సింజితం=అలంకారమైన ధ్వని. నిక్వణః - క్వాణః=వీణాధ్వని. ఋతం=తిర్యగ్జంతువుల కూత. కోలాహలః - కలకలః = పర్యాయ పదములు. గీతం - గానం - పర్యా: ప్రతిశృత్‌=(స్త్రీ) ప్రతిధ్వని. నిషాదకః=తంతీ కంఠ ధ్వని, కాకలీ=సూక్ష్మము. మధురము అయిన ధ్వని, కలః=మధురము అస్ఫుటమైన ధ్వని. మంద్ర=గంభీరము. తారః=అత్యుచ్య ధ్వని. ఈ మూడు పదములు మూడు లింగములలో వుండును. ఏకతాలః=పాటతో కలిసిన లయ. వీణా - వల్లకీ - విపంచీ - పర్యా. పరివాదినీ=ఏడు తీగల వీణ తతం=వీణాది వాద్యము. ఆనద్థం=మురజాది వాద్యము. సుషిరం=వంశాది వాద్యము. ఘనం=కాంశ్య తాలాది వాద్యము. ఈ నాలుగు విధములైన వాద్యములకు వాదిత్రం, ఆతోద్యం అని పేరు. మృదంగాః=మురజాః=పర్యా, అంక్య - ఆలింగ్య - అర్దాక=ఈ మూడును మురజ భేదములు. యశః-పటహః - ఢక్కా =పర్యా. ఆనక దుందుభిః=భేరి; ఆనకః - పటహః=పర్యా. ఝర్ఘరీ - డిండిమాదులు పటహ భేదములు. మర్దలః=పణవః=పర్యా. సంగీత క్రియామానమునకు తాలకము అని పేరు. లయః - సామ్యం=పర్యా. తాండవం - నాట్యం - లాస్యం - నర్తనం=పర్యా. నృత్య, గీత, వాద్యములు, మూడింటికిని తౌర్యత్త్రికం నాట్యము యని పేరు. భట్టారకః - దేవః=రాజు. దేవీ=రాజ్యాభిషేకము పొందిన రాణి. శృంగార - వీర - కరుణ - అద్భుత - హస్య - భయానక - బీభత్స - రౌద్రములు, రసములు, శృంగారః=శుచిః - ఉజ్జ్వలః=పర్యా. కృత్స్నః - వర్ధనః - వీరః=పర్యా. కారుణ్య - కరుణా - ఘృణా - కృపా - దయా - అనుకంపా - అనుక్రోశ - పర్యా.హసః - హాసః - హాస్యం=పర్యా. బీభత్సం - వికృతం=పర్యా విస్మయ - అద్భుత - ఆశ్చర్య - చిత్ర=పర్యా. భైరవ - దారుణ - భీషణ - భీష్మ ఘోర - భీమ - భయానక - ప్రతిభయ=సమానార్థకములు. రౌద్ర - ఉగ్ర=పర్యా. పైన చెప్పిన పదునాలుగు పదములు మూడు లింగములలో నుండును దర - త్రాస - భీతి - భీ - సాధ్వస - భయ=పర్యా. మానసిక వికారమునకు భావమని పేరు. భావమును బోధించునది అను భావము.

గర్వోభిమానోహంకారో మానశ్చిత్త సమున్నతిః | అనాదరః పరిభవః పరిభావస్తిరస్ర్కియః. 82

వ్రీడా లజ్జాత్రపాహ్రీః స్యాదభి ధ్యానం ఘనే స్పృహా | కౌతూహలం కౌతుకంచ కుతుకంచ కుతూహలమ్‌.

స్త్రీణాం విలాస వివ్వోక విభమా లలితం తథా | హేలాలీలేత్యమీ హావాః క్రియాః శృంగార భావజాః. 84

ద్రవకేళి పరీహాసాః క్రీడాలీలాచ కూర్దనమ్‌ | స్యాదాచ్ఛురితకం హాసః సోత్ర్పాసః సమానాక్స్మితమ్‌. 85

అధోభువన పాతాలం చ్ఛిద్రంశ్వభ్రం వపాసుషిః | గర్తావటౌ భువిశ్వభ్రే తమిశ్రంతిమిరం తమః. 86

సర్పః వృదాకుర్భుజగో దందశూకోబిలేశయః | విషం క్ష్వేడశ్చ గరళం నిరయోదుర్గతిః స్త్రియామ్‌ 87

పయః కీలాలమమృతముదకం భువనం వనమ్‌ ః భంగస్తరంగ ఊర్మిర్వా కల్లోలోల్లోలకౌచతౌ. 88

పృషన్తి బిందు వృషతాః కూలం రోధశ్చ తీరకమ్‌ ః తోయోత్థితం తత్పులినం జంబాలం పంకకర్దమౌ. 89

జలోచ్ఛ్వాసాః పరీవాహాః కూపకాస్తు విదారకాః | ఆతర స్తరపణ్యం స్యాద్ద్రోణీ కాష్ఠాంబు వాహినీ 90

కలుషశ్చావిలోచ్ఛస్తు ప్రసన్నోథ గభీరకమ్‌ | అగాధం దాశ##కైవర్తౌశంబుకా జలశుక్తయః 91

సౌగంధికంతు కహ్లారం నీలమిందీవరం కజమ్‌ | స్యాదుత్పలం కువలయం సితేకుముదకైరవే. 92

శాలూకమేషాం కందః స్యాత్పద్మం తామరసం కజమ్‌ |

నీలోత్పలం కువలయం రక్తం కోకనదం స్మృతమ్‌. 93

కరహాటః శిఫాకందంద కింజల్కః కేసరోస్త్రియామ్‌ |

ఖనిః స్త్రియామాకరః స్యాత్పాదాః ప్రత్యన్తపర్వతాః. 94

ఉపత్యకాద్రే రాసన్నా భూమిరూర్ధ్వమధిత్యకా | స్వర్గ పాతాల వర్గాద్యా ఉక్తా నానార్థకాంచ్ఛృణ. 95

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే శబ్దకోశే స్వర్గాది వర్గ నిరూపణం నామ షష్ట్యధిక త్రిశతతమోధ్యాయః.

గర్వ - అభిమాన - అహంకార=పర్యా. చిత్తమునకు ఉన్నతి మానము. అనాదర - పరిభవ - పరీభావ - తిరస్ర్కియ=పర్యా. వ్రీడా - లజ్జా - త్రపా - హ్రీః - పర్యా ధనమునందు ఆసక్తి అభిధ్యానము; కౌతూహల - కౌతుక -

(అ) 2/49

కుతుక - కుతూహల=వర్యా. విలాస - బిబ్బోక - విభ్రమ - లలిత - హేలా - లీలా - అనునవి శృంగార భావము వలన కలిగిన స్త్రీ చేష్టల. వీటికి హావములు అనిపేరు. ద్రవ - కేళి - పరీహాస - క్రీడ - లీలా - కూర్దన=ఇవి క్రీడ పరిహాసదాచకములు. ఇతరులను పరిహసించుట అచ్ఛురితకము. స్మితం=చిరునవ్వు. అధోభువన - పాతాళ=పర్యా. ఛిద్ర - స్వభ్ర - వసా - శుషి=ఛిద్రము. గర్త - అవట - భూపిమైన గొయ్యి. తమిశ్రం - తిమిరం - తమః=పర్యా సర్ప - వృదాకు - భుజగ - దందశూక - బిలేశయ - సర్పము. విషం - క్ష్వేడః - గరళం=విషము. నిరయః - దుర్గతిః=నరకము. పయస్‌ - కీలాల - అమృత - ఉదక - భువన - వన - జలము. భంగ - తరంగ - ఊర్మి - కల్లోల - ఉల్లోల=తరంగములు. వృషత్‌ - బిందు - జల బిందువులు. కూల - రోధన్‌ - తీరమ్‌=ఒడ్డు నీటినుండి బయట పడినది పులినము. జంబాల - పంక - కర్దమ=బురద. పరీవాహాః=పొరలు చున్న నీరు. కుపక - విదారక - జలాశయములలో నిలిచియున్న నీరు. ఆతరః=నది దాటించుటకు ఇచ్చుధనము. ద్రోణీ-కర్రతో చేసిన తొట్టె. కలుషః=ఆవిలః=కలుషమైనది. అచ్ఛః - ప్రచన్నః=స్వచ్ఛమైనది. గభీరకం. అగాధం=లోతైనది. దాశః - కైరవర్తః=పల్లెవాడు. శంబూకాః=నత్తగుల్లలు. సౌగంధిక - కహ్లార=శ్వేతకమలము ఇందీవరం=నీలకమలము. ఉత్పలం=కువలయం=కలువ. కుముద - కైరవ=తెల్లకలువ; వీటి కందమునకు శాలూకము అనిపేరు. పద్మం - తామరసం - కంజం = పద్మము. కువలయం - నీలోత్పలం = పర్యా. కోకనదం = ఎర్రకలువ. కరహాటః - శిఫా - కందం=పద్మలత యొక్క దుంప. కింజల్కః - కేసరః=పర్యా. ఖనిః - ఆకరః=పర్యా. పాదాః=దగ్గరనున్న చిన్న పర్వతములు. ఉపత్యాక=పర్వతమునకు దగ్గరనున్న భూమి. అధిత్యకా=పర్వతముపై నున్న భూమి స్వర్గ పాతాళ వర్గాదులు చెప్పబడినవి. నానార్థములను వినుము.

అగ్నిమహాపురాణమున శబ్దకోశమునందు స్వర్గాదివర్గ నిరూపణమను మూడువందల అరువదవ అధ్యాయము సమాప్తము.

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page