Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

అథ సప్తపంచాశ దధిక త్రిశతతమో7ధ్యాయః

అణాది సిద్ధరూపకమ్‌

కుమార ఉవాచ :

ఉణాదయో7భి ధాస్యన్తే ప్రత్యయా ధాతుతఃపరే | ఉణికారుశ్చ శిల్పీస్యాజ్ఞాయుర్మాయుశ్చ పిత్తకమ్‌ః 1

గోమాయురాయుర్వేదేషు బహులం స్యురుణాదయః | ఆయుః స్యాదుశ్చ హేత్వాద్యాః కింశారుర్ధాన్యశూకకః.

కృకవాకుః కుక్కుటః స్యాదురుర్భర్తామరు స్తథా | శయుశ్చా జగరోజ్ఞేయః సరురాయుధ ముచ్యతే. 3

స్వరుర్వజ్రం త్రపుసీస మసారం ఫల్గురీరితమ్‌ | గృధ్నశ్చక్రని కిరచి మందిరం తిమిరం తమః. 4

ఇలచి సలిలం వారి కల్యాణం బాండలస్మృతమ్‌ | బుధో విద్వాన్క్వసౌ స్యాచ్చ శిబిరం గుప్తసంస్థితిః. 5

ఓతుర్బిడాలశ్చ తుని అభిధానాదుణాదయః | కర్ణః కామీచ గృహ భూర్వాస్తు జైవాతృకః స్మృతః. 6

అనడ్వాన్వ హతేర్డినిః స్యాజ్ఞాతౌ జీవార్ణ వౌషధమ్‌ | నౌవహ్నిరినని హరిణః మృగః కామీచ భాజనమ్‌. 7

కంబోజో భాజనం భాండే సరండశ్చ చతుష్పదః | తరురేరండః సంఘాతో వరూడః సామనిర్భరమ్‌. 8

స్ఫారం ప్రభూతం స్యాన్నంత ప్రత్యయే చీలవల్కలమ్‌ | కాతరో భారురుగ్రస్తు ప్రచండో జవసోతృణమ్‌. 9

జగచ్చైవ తు భూర్లోకో కృశాను జ్యోతిరర్కకః | వర్వరః కుటిలో ధూర్తశ్చతరంచ చతుష్పథమ్‌. 10

చీవరం భిక్షు ప్రావృతిరాదిత్యో మిత్ర ఈరితః | పుత్రః సూనుః పితాతాతః పృదాకుర్వ్యాఘ్ర వృశ్చికే.

గర్తో7వటోథ బరతోనటో7పరే7ప్యుణాదయః. 11

ఇది ఆదిమహాపురాణ ఆగ్నేయే ఉణాది సిద్ధరూప నిరూపణం నామ

సప్తపంచాశ దధిక త్రిశతతమో7ధ్యాయః.

కుమారస్వామి చెప్పెను. ఇపుడు ధాతువు కంటే పరముగ వచ్చు ఉణాది ప్రత్యయములను గూర్చి చెప్పెదను. ఉణ్‌ - కారుః=శిల్పి జాయః. మాయః=పిత్తము. ట్లేగోమాయువు ఆయువు మొదలగునవి. ఉణాదులు బహుళముగ వచ్చును. ఆయుఃస్వాదువు హేతువు మొదలగునవి ఉణాది ప్రత్యయ సిద్ధములు. కింశారః=వరిముల్లు. కృకవాకుః=కోడి. గురుః=భర్త. మరుః శయివు=అజగరము. సరుః=ఆయుధము. స్వరుః=వజ్రము. త్రపు=సీసము. ఫల్గు=సారరహితము. క్రన్‌ ప్రత్యయము చేర్చగా గృధ్రః నిష్పన్న మగును. కిరచ్‌ - మందిరమ్‌ తిమిరమ్‌ (చీకటి). ఇలచ్‌ - సలిలమ్‌=(నీరు). బండిలమ్‌=కల్యాణము. క్వన్‌ప్రత్యయము చేర్చగా విద్వాన్‌=బుధుడు. శిబిరమ్‌=రహస్యమైన నివాస స్థానము. తున్‌ - హోతుః=పిల్లి. ఉణాదులు అభిధానమును బట్టి వచ్చుచుండును. కర్ణః=చెవి. మరియు కాముడు వాస్తు=గృహ భూమి జైవాతృక,=చంద్రుడు వహ - డిన్‌ - చేర్చగా అనడ్వాన్‌. జీవాతు=జీవన ఔషధము. వహ్‌ ధాతువునకు ని ప్రత్యయము చేర్చగా వహ్నిః. ఇనన్‌ - హరిణః=మృగము మరియు కాముకుడు. పాత్రము, కంబోజః=పాత్రము. సరండః=బాండము, చతుష్పదము. హేరండః=వృక్షము. వరండః=సామవేదము. స్ఫారం=అత్యధికము. క్రన్‌ పత్యయము చేర్చగా చీరము సిద్ధించును. వల్కలము; ఫారుః=పిరికివాడు. ప్రచండః=గురుడు. జవసమ్‌ = తృణము. జగత్‌=భూలోకము. కృశానుః=అగ్ని, సూర్యుడు. వర్వరః=కుటిలుడు, ధూర్తుడు. చత్వరమ్‌=చతుష్పదము. చీవరమ్‌=బిక్షువులుకప్పకొనువస్త్రము. మిత్రః=సూర్యుడు. పుత్రః=కుమారుడు. పితా=తండ్రి. వృదాకుః=వ్యాఘ్రము వృశ్చికము. గర్తః=గొయ్యి. భరతః=నటుడు. ఇంకను ఉణాదులున్నవి.

అగ్ని మహా పురాణమున ఉణాది సిద్ధ రూప నిరూపణ మను మూడు వందల యేబది ఏడవ అధ్యాయము సమాప్తము.

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page