Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

శ్రీ మదగ్ని మహాపురాణము

అథ షట్‌ చత్వారింశ దధిక త్రిశతతమోధ్యాయః

అథ కావ్యగుణవివేకః

అగ్నిరువాచ :

అలంకృతమపి ప్రీత్యైన కావ్యం నిర్గుణం భ##వేత్‌ | వపుష్యలలితే స్త్రీణాం హారో భారాయతేపరమ్‌. 1

నచ వాచ్యం గుణో దోషాభావఏవ భవిష్యతి | గుణాః శ్లేషాదయోదోషా గూడార్థాద్యాః పృథక్‌ కృతాః. 2

యః కావ్యేమహతీం ఛాయామను గృహ్ణాత్యసౌ గుణః సంభవత్యేష సామాన్యో వై శేషిక ఇతిద్విధా. 3

సర్వసాధారణీ భూతః సామాన్య ఇతిమన్యతే | శబ్దమర్థముభౌప్రాప్తః సామాన్యోభవతిత్రిధా. 4

శబ్దమాశ్రయతే కావ్యం శరీరం యః సతద్గుణః | శ్లేషోలాలిత్యగాంభీర్య సౌకుమార్యముదారతా. 5

సత్యేవ యోగికీ చేతి గుణాః శబ్దన్య సప్తధా | సుశ్లిష్ట సన్నివేశత్వం శబ్దానాం శ్లేష ఉచ్యతే. 6

గుణాదేశాదినా పూర్వం పదసంబద్ద మక్షరమ్‌ | యత్రసంధీయతేనైవ తల్లాలిత్యముదాహృతమ్‌. 7

విశిష్టలక్షణోల్లేఖలేఖ్య ముత్తాన శబ్దకమ్‌ | గాంభీర్వయం కథయన్త్యార్యాస్తదేవాన్యేషు శబ్దతామ్‌. 8

అనిష్ఠురాక్షర ప్రాయశబ్దతా సుకుమారతా | ఉత్తాన పదతౌ దార్యయుతశ్లాఘ్యైర్విశేషణః. 9

ఓజః సమాస భూయస్తవ మేతత్పద్యాది జీవితమ్‌ | ఆ బ్రహ్మాస్తంబ పర్యన్తామోజసైకేన పౌరుషమ్‌. 10

ఉచ్యమానస్య శ##బ్దేన యేనకేనాపి వస్తునః | ఉత్కర్షమావహన్నర్థోగుణ ఇత్యభి ధీయతే. 11

మాధుర్యం సంవిధానంచ కోమలత్వముదారతా | ప్రౌఢిః సామయికత్వంచ తద్భేతాః షట్‌ చకాసతి. 12

కోధేర్ష్యాకార గాంభీర్యాన్యాధుర్య ధైర్యగాహితా | సంవిధానం పరికరః స్యాదపేక్షితా సిద్ధయే. 13

యత్కాఠిన్యాది నిర్ముక్త సన్నివేశ విశిష్టతా | తిరస్కృత్వైవ మృదుతాభాతి కోమలతేతిసా. 14

లక్ష్యతేస్థూల లక్షత్వ ప్రవృత్తేర్యత్ర లక్షణమ్‌ | గుణస్యతదుదారత్వ మాశయస్యాతి సౌష్ఠవమ్‌. 15

అభిప్రేతం ప్రతియతో నిర్వాహస్యోవ పాదికాః | యుక్తయో హేతుగర్భిణ్యః ప్రౌఢా ప్రౌఢిరుదాహృతా. 16

స్వతంతస్యాన్య తంత్రన్య బాహ్యాన్తః సమయోగతః | తత్రవ్యుత్పత్తిరర్థస్యయా సామయికతేతిసా. 17

అగ్నిదేవుడు పలికెను. గుణరహితమగు కావ్యము అలంకార సహితమైనను ప్రీతి జనకము కాదు. లలితము కాని స్త్రీ శరీరముపై హారము బరువుకుచేటు. దోషాభావమే గుణము కదా! గుణములను ఇక చెప్పుట ఎందుకు యని అనకూడదు. ఏలనన! శ్లేషాది గుణములు, గూఢార్థత్వాదిదోషములు వేర్వేరుగా చెప్పబడినవి. కావ్యమునందు శోభాతిశయమును కల్గించునవి గుణములు. సామాన్యములు వైశేషికములు అని ఇవి రెండు విధములు, సర్వ సాధారణములు సామాన్యములు. ఇవి శబ్ద - అర్ధ - శబ్దార్ధములతో సంబంధించి మూడు విధములగును. కావ్య శరీరమగు శబ్దమును ఆశ్రయించినది శబ్దగుణము. శ్లేష లాలిత్యము, గాంభీర్యము, సౌకుమార్యము. ఉదారతా ఓజస్సు, ¸°గికీ యని శబ్ద గుణులు ఏడు విధములు, శబ్దముల చిక్కదనము శ్లేష. గుణ వృద్ధ్యాదుల ద్వార అక్షరములకు సంధిలేనిచో అది లాలిత్య గుణము. ఉత్తమ భావవ్యంజకములగు శబ్ద సమూహము విశిష్ట లక్షణ యుక్తమైనచో అది గాంభీర్యము. దానికే శబ్దత అనిపేరు. నిష్ఠురాక్షరములు లేని శబ్దములు అధికముగనున్నచో అది సౌకుమార్యము. శ్లాఘ్య విశేషణములతో కూడిన ఉత్కృష్టవదముల ప్రయోగము ఔదార్యము. దీనికే ఉత్తాన పదతాయని పేరు. సమాస బాహుల్యము ఓజస్సు, ఇది పద్యాదులకు జీవితము. బ్రహ్మ మొదలు స్తంభము వరకు వున్న జీవుల పౌరుషమును ఓజోగుణ విశిష్ట శబ్దములతోడనే వర్ణింప వీలగును. ఎశబ్దములైనను ప్రయోగించి వర్ణింపబడు వస్తువుల ఉత్కర్షను సూచించునది అర్ధ గుణము, మాధుర్యము సంవిధానము, కోమలత్వము. ఉదారత, ప్రౌఢీ, సామైకతా, అని ఆర్థ గుణులు ఆరు. క్రోధ ఈర్ష్యాదులందు కూడ ఆకార గాంభీర్యము ధైర్యము ఉండుట మాధుర్యము. కార్యసిద్ధికై ప్రయత్నము సంవిధానము. కాఠిన్యాది దోషవర్జిత మగు మృదు సన్నవేశము కోమలత. ఔదార్యమును సూచించుచు ఆశయమును అతి సుందరముగ ప్రకటించినచో అది ఉదారతా. అభీష్టమగు విషయమును గూర్చి తన్నిర్వాహమును సమర్థించు హేతుగర్భ యుక్తులకు ప్రౌఢి యని పేరు. స్వతంత్రము గాని పరతంత్రము గాని యగు కార్యము యొక్క బాహాంతర సంయోగముచే కలుగు అర్థవ్వుత్పత్తికి సామైకతయని పేరు.

శబ్దార్థవుపకుర్వాణో నామ్నోభయగుణః స్మృతః | తన్యప్రసాదః సౌభాగ్యం యథాసంఖ్య ప్రశస్తతా. 18

పాకోరాగ ఇతిపాజ్ఞైః షట్‌ ప్రపంచ విపంచితాః | సుప్రసిద్ధార్ధ పదతా ప్రసాత ఇతిగీయతే. 19

ఉత్కర్షవాన్గుణః కశ్చిద్యస్మిన్నుక్తే ప్రతీయతే | తత్సౌభాగ్య ముదారత్వం ప్రవదంతి మనీషణః. 20

యథాసంఖ్యమనూద్దేశః సామాన్య మతిదిశ్యతే | సమయే వర్ణనీయస్య దారుణస్యాపి వస్తునః. 21

అదారుణన శ##బ్దేన ప్రాశస్త్య ముపవర్ణనమ్‌ | ఉచ్చై పరిణతిః కాపిపాక ఇత్యభిధీయతే. 22

మృద్వీకానారి కేలామ్బుపాకభేదా చ్చతుర్విధః | ఆదావన్తేచసౌ (సా) రస్యం మృద్వీకా పాకఏవసః. 23

కావ్యేచ్ఛయా విశేషోయః సరాగ ఇతిగీయతే | అభ్యాసోపహితః కాంతిం సహజామపివర్తతే. 24

హారిద్రశ్చైవ కౌసుభో నీలీరాగశ్చ సత్రిధా | వైశేషిక పరిజ్ఞేయోయః స్వలక్షణ గోచరః. 25

ఇత్యాదిమహాపురాణ ఆగ్నేయే కావ్యగుణ వివేకవర్ణనంనామ షట్‌ చత్వారింశదధిక త్రిశతతమో7ధ్యాయః.

శబ్దార్థములు రెండింటికిని ఉపకారకముగా నుండునది ఉభయ గుణము. ప్రసాదము సౌభాగ్యము యుథాసంఖము ప్రశస్తత పాకము రాగము అని ఆరువిధములు. ప్రసిద్ధార్థములగు పదముల ప్రయోగము ప్రసాదము; దేనిని వర్ణించగ ఉత్కర్ష సూచితమగునో అట్టి వర్ణనము సౌభాగ్యము; దీనికే ఉదారత్వమనిపేరు. తుల్యవస్తువులను క్రమముగ చెప్పుట యథాసంఖ్యము; వర్ణనీయమగు దారుణ వస్తువును సమయాను సారముగ అదారుణ శబ్దములచే వర్ణించుట ప్రాశస్త్యము. పదార్థము యొక్క ఉన్నత పరిణితి పాకము; మృద్వికాపాకము నారికేళాంబు పాకమని అవిరెండు విధములు. ఆదినుండి అంతమువరకురసభరిత మైనది మృద్వికాపాకము; కావ్యము నందలి ఛాయ విశేషమునకు రాగమని పేరు. అభ్యాసవశముచే ఇవి సహజ కాంతిని కూడ అతిశయించి వుండును. ఒకానొక విశేషలక్షణముచే అనుభవమునకు వచ్చుదానిని వైశేషిక గుణందురు. హరిద్రారాగము కౌసుంబరాగము నీలిరాగము అని రాగము మూడు విధములు. స్వలక్షణగోచరమైనది అనగా అనస్య సాధారణమైన ధర్మము వైశేషికము.

అగ్ని మహాపురాణమున కావ్య గుణ వివేక కథనమను మూడు వందల నలుబది ఆరవ అధ్యాయము సమాప్తము.

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page