Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

అథ ఏకోన చత్వారింశ దధిక త్రిశతతమో7ధ్యాయః

అథ శృంగారాది రస నిరూపణమ్‌

అగ్నిరువాచ :

అక్షరం పరమం బ్రహ్మ సనాతనమజం విభుమ్‌ | వేదాంతేషు వదన్త్యేకం చైతన్యం జ్యోతిరీశ్వరమ్‌. 1

ఆనందః సహజస్తస్య వ్యజ్యతే సకదాచన | వ్యక్తిః సాతస్య చైతన్య చమత్కార రసాహ్వయా. 2

ఆద్యస్తస్య వికారో యఃసో7 హంకార ఇతిస్మృతః | తతో7భిమానస్తదేవం సమాప్తం భువనత్రయమ్‌. 3

అభిమానాద్రతిః సాచ పరిపోషముపేయుషీ | వ్యభిచార్యాదిసామాన్యాచ్ఛృంగార ఇతిగీయతే. 4

తద్భేదాః కామమితరే హస్యాద్యా అప్యనేకశః | స్వస్వస్థాయి విశేషోత్థారి ఘోషస్వలక్షణాః. 5

అగ్ని దేవుడు పలికెను. అక్షరము, సనాతనము, జన్మ రహితము సర్వవ్యాప్తము పరబ్రహ్మ స్వరూపము, అద్వితీయము, జ్యోతి రూపము అగు ఏ చైతన్యము వేదాంతములలో చెప్పబడుచున్నదో దానికి ఆనందము సహజము. యది అపుడపుడు అభివ్యక్త మగును. ఈ అభివ్యక్తియే చమత్కారమనియు చెప్పబడును. దాని ప్రథమ వికారమునకు అహంకార మని పేరు. దాని నుండి అభిమానము పుట్టినది. ఈ భువనత్రయము ఈ అభిమానము నందే అంతర్గతమై యున్నది. అభిమానము నుండి రతి పుట్టును. యది వ్యభిచార్యాది భావసామాన్యముచే పరిపుష్టమై శృంగార మని చెప్పబడును. ఇతరమైన హాస్యాదులు ఈ శృంగార భేదములే. వాటికి ఆయా స్థాయీ భాములుండును. వాటి పరిపోషమే ఆ రసముల లక్షణము.

సత్త్వాది గుణసంతానా జాయన్తే పరమాత్మనః | రాగాద్భవతి శృంగారో రౌద్రసై#్తక్‌ష్ణ్య త్ర్పజాయతే. 6

వీరో7వష్టమ్భజః సంకోచ భూర్భీభత్స ఇష్యతే | శృంగారాజ్జాయతేహాసో రౌద్రాత్తుకరుణో రసః. 7

వీరశ్చాద్భుత నిష్పత్తిః స్యాద్బీభత్సాద్భయానకః | శృంగార హాస్యకరుణా రౌద్రవీర భయానకా ః 8

భీభత్ఛాద్భుత శాంతాఖ్యాః స్వభావాచ్చతురో రసాః | లక్ష్మీరివవినాత్యాగాన్న వాణీ భాతినీరసా. 9

అపారే కావ్యసంసారే కవిరేవ ప్రజాపతిః | యథావైరోచతే విశ్వం తథేదం పరివర్తతే. 10

శృంగారీ చేత్కవిః కావ్యేజాతం రసమయం జగత్‌ | సచేత్క విర్వీత రాగోనీరసం వ్యక్తమేవతత్‌. 11

న భావహీనో7స్తి రసోన భావోరస వర్జితః | భావయంతి రసానే భిర్భావ్యన్తే చరసా ఇతి. 12

స్థాయినో7ష్టౌ రతిముఖాః స్తంభాద్యా వ్యభిచారిణః | మనో7ను కూలే7నుభవః సుఖస్యరతిరిష్యతే. 13

హర్షాదిభిశ్చ మనసోవికాసో హాసఉచ్యతే | చిత్రాది దర్శనాచ్ఛేతో వైక్లవ్యం బ్రువతే భయమ్‌. 14

జుగుప్సాచ పదార్థానాంనిన్దా దౌర్భాగ్య వాహినామ్‌ | విస్మయో7తిశ##యేనార్థ దర్శనాచ్చిత్త విస్తృతిః. 15

అష్టౌస్తంభాదయః సత్త్వాద్రజస్తమఅతః పరమ్‌ | స్తంభ##శ్చేష్టా ప్రతీఘాతో భయరాగా ద్యుపాహితః. 16

శ్రమరాగా ద్యుపేతాంతః క్షోభజన్మ వపుర్జలమ్‌ | స్వేదోహర్షాదిభిర్ధేహోచ్ఛ్వాసో7న్తః పులకోద్గమః. 17

హర్షాది జన్మవాక్సంగః స్వరభేదో భయాదిభిః | మనోవైక్లవ్యం మిచ్చన్తి శోకమిష్టక్షయాదిభిః. 18

క్రోధసై#్తక్‌ష్ణ ప్రబోధశ్చ ప్రతికూలాను కారిణి | పురుషార్థ సమాప్త్యర్థోయః సఉత్సాహ ఉచ్యతే. 19

చిత్తక్షోభ భవోత్తంభోవేపథుః పరికీర్తితః | వై వర్ణ్యంచ విషాదాది జన్మకాంతి విపర్యయః. 20

దుఃఖానందాదిజంనేత్ర జలమశ్రుచ విశ్రుతమ్‌ |

సత్త్వాది గుణ సముదాయములు పరమాత్మ నుండి జనించును. రాగము నుండ శృంగారము తీక్‌ష్ణత్వము నుండి రౌద్రము, ఉత్సాహము నుండి వీరము, సంకోచము నుండి భీభత్సము పుట్టును. శృంగార హాస్య కరుణ రౌద్ర వీర భయానక భీభత్స అద్భుత శాంతములు తొమ్మిది రసములు. నాల్గు రసములు (శృంగార రౌద్ర వీర భీభత్సములు) సహజములు. త్యాగము లేని ధనము వలె, రసము లేని వాక్కు ప్రకాశించదు. అపారమైన కావ్య సంసారములో కవియే ప్రజాపతి. అతనికి ఈ సంసారము ఎట్లు ఇష్టమగునో అట్టి మార్పు చెందు చుండును. కవి శృంగారియైనచో కావ్య జగత్తు రసమయుమగును. అతడు రసహీనుడై నచో కావ్యము నీరస మగును. భావహీన మగు రసము, రస వర్ణితమగు భావము వుండవు. భావములు రసములను అభివ్యక్తము చేయను. ''భావ్యంతే రసాః ఏభిః'' యను వ్యుత్పత్తిచే భావములు చెప్పబడును. రతి మొదలగు స్థాయీ భావములు ఎనిమిది. స్తంబాదులు ఎనిమిది. మనస్సు కనుకూల మగు సుఖానుభవము రతి. హర్షాదులచే చిత్త వికాసము హాసము. చిత్రాది దర్శనము వలన కూడ హాసము కలుగును. చిత్తమునకు విక్లబత్వము భయ మని చెప్పుదురు. చెడ్డ వస్తుల నింద జుగుప్స. ఉత్కృష్ట మగు వస్తువులను చూచుటచే కలుగు చిత్త విస్తారము విస్మయము. స్తలబాదులగు ఎనిమిది భావములు సత్త్వము వల్ల కలుగును. రజ స్తమస్సులకు అతీతములు. భయరాగాదులచే కల్గిన చేష్టా విఘాతము స్తంభము. శ్రమరాగాదులతో కూడిన ఆంతర క్షోభముచే కలిగిన శరీర జలము స్వేదము. హర్షాదులచే దేహము పులకరించుట పులకోద్గమము. హర్షాది జన్య మగు వచన అస్పష్టత్వము స్వర భేదము. ఇష్ట క్షయాదులచే కలిగిన మనోవైక్లబ్యము శోకము. ప్రతికూలముగా ప్రవర్తించు వాని విషయమున తీక్‌ష్ణత్వము. క్రోధము పురుషార్థమును పూర్తి చేయుటకు యత్నము ఉత్సాహము. చిత్త క్షోభము కలిగిన ఉత్తంభము వేపథువు. విషాదాదుల వలన కాంతి కోల్పోవుట వైవర్ణ్యము. దుఃఖా నాందాదుల వలన కల్గిన నేత్ర జలము ఆశ్రువు లంఘనాదులచే ఇంద్రియములు పనిచేయ కుండుట ప్రళయము.

ఇంద్రియాణా మస్తమయః ప్రలయో లంఘనాదిభిః. 21

వైరాగ్యా దిర్మనః ఖేదోనిర్వేద ఇతి కథ్యతే | మనః పీడాది జన్మాచ సాదోగ్లానిః శరీరగా. 22

శంకానిష్టాగమోత్ర్పేక్షా స్యాదసూయాచ మత్సరః | మదరాద్యుపయోగోత్థం మనః సంమోహనంమదః. 23

క్రియాతిశయ జన్మాంతః శరీరోత్థక్లమః శ్రమః | శృంగారాదిక్రియాద్వేష చిత్తస్యాలస్యముచ్యతే. 24

దైన్యం సత్త్వాదపభ్రంశశ్చింతార్థ పరిభావనమ్‌ | ఇతిక ర్తవ్య తోపాయాదర్శనం మోహఉచ్యతే. 25

స్మృతిః స్యాదను భూతస్య వస్తునః ప్రతిబింబనమ్‌ | మతిరర్థ పరిచ్ఛేదస్తత్త్వ జ్ఞానోపనాయితః. 26

వ్రీడానురాగాది భవః సంకోచః కో7పిచేతసః | భ##వేచ్ఛపలతా7స్థైర్యం హర్షశ్చిత్త ప్రసన్నతా. 27

ఆవేశశ్చ ప్రతీకారః శయోవైధుర్యమాత్మనః | కర్తవ్యే ప్రతిభాభ్రంశో జడతేత్యభిధీయతే. 28

ఇష్టప్రాప్తేరుపచితః సంపదాభ్యుదయోధృతిః | గర్వః పరేష్వవజ్ఞానమాత్మ న్యుత్కర్షభావనా. 29

భ##వేద్విషాదో దైవాదేర్విఘాతో7భీష్టవస్తుని | ఔత్సుక్యమీప్సితా ప్రాప్తేర్వాంఛయా తరలాస్థితిః. 30

చిత్తేంద్రియాణాం సై#్తమిత్య మనస్మారో7చలాస్థితిః | యుద్ధేబాధాదిభిస్త్రాసో వీప్సా చిత్తచమత్కృతిః 31

క్రోధస్యాప్రశమో7మర్షః ప్రబోధశ్చేతనోదయః | అవహిత్థం భ##వేద్గుప్తిరింగితాకార గోచరా. 32

రోషతోగురు వాగ్దండ పారుష్యం విదురుగ్రతామ్‌ | ఊహోవితర్కః స్యాద్వ్యాధిర్మనో వపురవగ్రహః. 33

అనిబద్ధ ప్రలాపాది రున్మాదో మదనాదిభిః | తత్త్వజ్ఞానాదినాచేతః కషాయోపరమః శమః. 34

వైరాగ్యాదులచే మనఃక్లేదము నిర్వేదము. మానసిక పీడాదుల వలన కలిగిన శరీర దౌర్బల్యము గ్లాని. అనిష్ట ప్రాప్తిని ఊహించుట శంక. మత్సరము అసూయ. మదిరాదుల ఉపయోగము వలన కలిగిన మానసిక మోహము మదము. ఎక్కువ పని చేయుటచే కలిగిన శరీర క్లాంతిశ్రమము. చిత్తమునకు శృంగారాది క్రియల యందు ద్వేషము ఆలస్యము. సత్త్వము నుండి తొలగుట దైన్యము. విషయములను గూర్చి ఆలోచించుట చింత. చేయదగిన ఉపాయము తెలియ జాలకుండుట మోహము. అనుభవించిన వస్తువును మరల ప్రతిబింబింప చేసుకొనుట స్మృతి. యథార్థ జ్ఞానము వలన విషయ నిర్ణయము మతి. అనురాగాదుల వలన కలిగిన ఒకానొక విధ మగు చేత స్సంకోచము వరడా. అస్థిరత్వము చపలతా. చిత్త ప్రసన్నతాహర్షము; ప్రతీకార వాంఛచే కలిగిన అంతః కరణ వైకల్యము ఆవేళము. కర్తవ్యము విషయము ఏమి తోచుకుండుట జడతా. అభీష్ట వస్తు ప్రాప్తిచే కలిగిన ఆనందము ధృతి. ఇతరుల యందు అనాదరమును, తన యందు ఉత్కర్ష భావన గర్వము. అభీష్ట వస్తువు యందు దైవాది విఘాతము విషాదము. ఈప్సిత సిద్ధికొరకై చంచలమైన మానసిక స్థితి ఔత్సుక్యము. చిత్తేంద్రియాదులు పనిచేయ కుండుట అపస్మారము. యుద్ధము లందు బాధాదుల వలన స్థిరముగ వుండ జాలక పోవుట త్రాజము చిత్త చమత్కారము వీప్ప. క్రోదము శమించకుండుట అమర్షము. చేతన హృదయము ప్రబోధము. ఇంగితాకారములను దాచుకొనుట అవహిత్థము. గురువుల విషయమున కోపముచే వాక్పారుష్యదండ పారుషయములు ఉగ్రత, ఊహ వితర్కము. మనస్సు శరీరము సరిగా వుండకపోవుట వ్యాధికామాదులచే అసంబద్ధ ప్రలాపము ఉన్మాదము. తత్త్వ జ్ఞానాదులచే చిత్తమాలిన్యము తొలగుట శమము.

కవిభిర్యోజనీయావైభావాః కావ్యాది కేరసాః | విభావ్యతేహి రత్యాదిర్యత్ర యేన విభావ్యతే. 35

విభావోనామ సద్వేధా77లంబనోద్ధీపనాత్మకః | రత్యాది భావవర్గో7యంయమాజీవ్యోపజాయతే. 36

ఆలంబనవిభావో7సౌ నాయకాది భవస్తథా | ధీరోదాత్తో ధీరోద్ధతః స్యాద్ధీరలలితస్తథా. 37

ధీరప్రశాంత ఇత్యేవం చతుర్ధా నాయకఃస్మృతః | అనుకూలో దక్షిణశ్చశఠోధృష్టః ప్రవర్తితః. 38

పీఠమర్దో విటశ్చైవ విదూషక ఇతిత్రయః | శృంగారే నర్మసచివా నాయకస్యాను నాయకాః| 39

పీఠమర్దః సంభలకః శ్రీమాంస్తద్దేశజోవిటః | విదూషకో వైహసిక స్త్వష్ట నాయక నాయికాః. 40

స్వకీయా పరకీయాచ పునర్భూరితి కౌశికాః | సామాన్యాన పునర్భూరి ఇత్యాద్యా బహుభేతదః. 41

ఉద్దీపన విభావాస్తే సంస్కారైర్వి విధైఃస్థితైః | ఆలంబన విభావేషు భావానుద్దీపయన్తియే. 42

చతుఃషష్టి కలాద్వేధా కర్మాద్యైర్గీతి కాదిభిః | కుహకంస్మృతి రప్యేషాం ప్రాయోహాసోప హారకః. 43

ఆలంబన విభావస్య భావై రుద్బుద్ధ సంస్కృతైః | మనోవాగ్బుద్ధి వపుషాంస్మృతీచ్ఛా ద్వేషయత్నతః. 44

ఆరంభఏవ విదుషామనుభావ ఇతిస్మృతః | సచాను భూయతేచాత్ర భవత్యుత నిరుచ్యతే. 45

మనోవ్యాపార భూయిష్టో మనఆరంభ ఉచ్యతే | ద్వివిధః పౌరుషః సై#్త్రణ ఈదృశో7పి ప్రసిధ్యతి. 46

కావ్యాదులందు కవులు భావములను రసములను కూర్చవలెను. దేనిచే రత్యాదులు విభావితములగునో యది విభావము. విభావ్యతేయేన యని విగ్రహము. ఆలంబనము ఉద్దీపనము యని యది రెండు విధములు. ఈ రత్యాది భావర్గము దేనిని ఆధారముగా తీసుకుని పుట్టునో అది ఆలంబన విభావము. ఇది నాయకాదులను ఆధారముగా చేసుకుని పుట్టును. ధీరోదాత్త దీరోద్ధత, ధీరలలిత, ధీర ప్రశాంతులని నాయకులు నాలుగు విధములు. అనుకూలుడు, దక్షిణుడు, శఠుడు, దృష్టుడు యని మరి నాలుగు విధములు. శృంగారమున నాయకునకు పీఠ మర్దుడు, విలుడు, విదూషకుడు యని ముగ్గురు ధర్మ సచివులుగా వుందురు. వీరు అనునాయకులు. పీఠమర్దుడు శ్రీమంతుడై నాయకుని వలె బలవంతుడై వుండును. విటుడు నాయకుని దేశమునకు చెందిన వాడై వుండును. నవ్వించువాడు విదూషకుడు. నాయకుని నాయికలు కూడ ఎనివిధములుగా వుందురు. స్వకీయ, పరకీయ, పునర్భూ యని కౌశికుడు చెప్పెను. మరికొందరు, పునర్భూరికి బదులుగ సామాన్యను అంగీకరింతురు. ఈ నాయికలలో చాలభేదము లున్నవి. ఉద్దీపన విభావములు వివిధ సంస్కార రూపముల నుండి ఆలంబన విభాము నందు భావోద్ధీపనము చేయును. కర్మదుల చేతను గీతకాదుల చేతను, చతుష్టష్టి కళలు ఆరు విధములు, సాధారణముగ కోకన్మృతులు హాసోపహాకారములు. ఉద్బుద్ధములు సంస్కృతములు యగు భావములచే ఇచ్ఛాద్వేష ప్రయత్నముల సంయోగములచే కలుగు మనోవాణి బుద్ధి శరీర కార్యములను విద్వజ్జనులు అనుభావములందురు. "సః ఆనుభూయతే" అత్ర యని కాని సః అనుభవతి యని కాని దీని నిర్వచనము. మానసిక వ్యాపారము అధికముగా నున్నది మానసికారంభము. పౌరుషముసై#్త్రణము యని యది రెండు విధములు.

శోభావిలాసో మాధుర్యం స్థైర్యం గాంభీర్యమేవచ | లలితశ్చ తథౌదార్యం తేజో7ష్టావితి పౌరుషాః. 47

నీచనిందోత్తమస్పర్ధాశౌర్యం దాక్ష్యాదికారణమ్‌ | మనోధర్మే భ##వేచ్ఛోభా శోభ##తేభవనంయథా. 48

భావోహవశ్చ హేలాచ శోభాకాంతి స్తథైవచ | దీప్తిర్మాధుర్య శౌర్యేచ ప్రాగల్భ్యం స్యాదుదారతా. 49

స్థైర్యం గంభీరతాస్త్రీణాం విభావాద్వాద శేరితాః | భావోవిలాసోహావః స్యాద్భానః కించిచ్చ హర్షజః 50

వాచోయు క్తిర్భవే ద్వాగారం భోద్వాదశ ఏవసః | తత్రభాషణ మాలాపః ప్రలాపో వచనంబహు. 51

విలాపో దుఃఖవచన మనులాపో7 సకృద్వచః | సంలావ ఉక్తప్రత్యుక్త మపలాపో7న్య థావచః. 52

వార్తాప్రయాణం సందేశో నిర్దేశః ప్రతిపాదనమ్‌ | తత్త్వాదోశో7తి దేశో7యమ పదేశో7న్య వర్ణనమ్‌. 53

ఉపదేశశ్చ శిక్షా వాగ్వ్యాజోక్తిర్వ్య పదేశకః | బోధాయ ఏషవ్యాపారః సుబుద్ధ్వారంభ ఇష్యతే |

తస్యభేదాస్త్రయస్తేచ రీతి వృత్తిప్రవృత్తయః. 54

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే శృంగారాది రస నిరూపణం నామైకోన చత్వారింశ దధిక త్రిశతతమో7ధ్యాయః.

శోభా, విలాస, మాధుర్యస్థైర్య గాంభీర్య లలిత ఔదార్య తేజస్సులను ఎనిమిది పౌరుషములు నీచులనింద ఉత్తములతో స్పర్ధ శౌర్యము చాతుర్యము వీటిచేమను ధర్మమునందు శోభకలుగును. యిది ఇంటిలో శోభవంటిది. భావ, హావ, హేళా, శోభ, కాంతి దీప్తి, మాధుర్య, శౌర్య, పాగల్భ్య, ఉదారతా, స్థైర్య గంబీరతలు యను పండ్రెండు స్త్రీల విభావములు. విలాస హావములను భావమందురు. ఇది కొంచెము హర్షముచే పుట్టును. వాక్సంబంధము వాగారంభము వీనికి పండ్రెండు భేదములున్నవి. మాటలాడుట ఆలాపము, ఎక్కువ మాటలాడుట ప్రలాపము దుఃఖవచనము విలాపము. మాటిమాటికి చెప్పుట యనులాపము, ఉక్తిప్రత్యుక్తులు సల్లాపము. మరొక విధముగ చెప్పుట అపలాపము. వార్తను మోసికొని పోవుట సందేశము. ఒక విషయమును ప్రతిపాదించుట నిర్దేశము. తత్త్వమును చెప్పుట అతిదేశము. యన్యవర్ణనము అపదేశము; శిక్షా పూర్వ కవచనము ఉపదేశము; వ్యాజోక్తివ్యపదేశము. ఇతరులకు విషము బోధించుటకై ఉత్తమ బుద్దినాశ్రయించి వాగారంభము చేయవలెను. దానికి రీతి, వృత్తి ప్రవృతియని మూడు భేదములు.

అగ్నిమహాపురాణమున శృంగారాది రసనిరూపణమను మూడువందల ముప్పదితొమ్మిదవ అధ్యాయము సమాప్తము.

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page