Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

అథ ద్వాత్రింశధిక త్రిశతతమోధ్యాయః.

అథ విషమకథనమ్‌

అగ్ని రువాచ :

వృత్తం సమంచార్ధసమం విషమంచ త్రిధావదే | సమంతావత్కృతా కృతమర్ధ సమంచ కారయేత్‌. 1

విషమంచైవ వాస్యూన మతివృత్తం సమాన్యపి | గ్లౌ చతుష్ర్పమాణీ స్యాదాభ్యామన్య ద్వితానకమ్‌. 2

పాదస్యాద్యన్తు వక్రం స్యాత్సనౌన ప్రథమాస్మృతౌ | బాల్యముశ్చతుర్థాద్వర్ణాత్పథ్యా వక్రంయుజోయతః. 3

విపరీత పథ్యాన్యాసాచ్చపలా వాయుజస్వనః | విపులాయుగ్మ సప్తమః సర్వంతసై#్యవ తస్యచ. 4

తౌంతౌవా విపులానేకా చక్రజాతిః సమీరితా | భ##వేత్పదం చతురూర్ధ్వం చతుర్వృద్ధ్యాపదేషు చ. 5

గురుద్వయాన్త ఆపీడః ప్రత్యాపీడో గణాదికః | ప్రథమస్య విపర్యాసే మంజరీ లవణీ క్రమాత్‌. 6

భ##వేదమృత ధారాభ్యా ఉద్దతాద్యుచ్యతే7ధునా | ఏకతః ససజసానః స్యుర్నసౌజోగో7థ భౌనజౌ. 7

నోగో7థ సజసా గోగస్తృతీయ చరణస్యచ | సౌరభే కేచనభగా లలితంచనమౌజసౌ. 8

ఉపస్థితం ప్రచుపితం ప్రథమాద్యం సమౌజసౌ | గౌగథో మలజారోగః సమౌచరజయాః పదే 9

వర్ధమానం మలౌస్వౌనసౌ అథో భోజోవఇ (ఈ) రితా | శుద్ధం విరాడర్షభాఖ్యం వక్ష్యేచార్థసమన్తతః. 10

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే ఛందఃసారే ద్వాత్రింశ దధిక త్రిశతతమో7ధ్యాయః.

అగ్నిదేవుడు పలికెను, సమ, అర్ధసమ, విషమములను, మూడు విధములగు వృత్తములను చెప్పెదను. సమపృత్త సంఖ్యలో అదే సంఖ్యతో గుణించవలెను. దాని గుణన ఫలము అర్థ సమవృత్త సంఖ్యయగును. అర్ధ సమవృత్త సంఖ్యలో కూడ ఆసంఖ్యతో గుణించగా ఎంత వచ్చునో యన్ని విషమ వృత్తములగును. విషమ వృత్త అర్ధ సమవృత్త సంఖ్యలలో మూలరాశిని తీసివేయగా శుద్ధ విశమ, శుద్ధ అర్ధసమ, వృత్తముల సంఖ్య తెలియును. ఒక్కొక్క పాదము నందు గురు లఘువులతో సమాప్తిని పొంది అనుష్టుప్‌కు ''సమాని'' యని పేరు. అంతిమ వర్ణములు వరుసగ లఘువు గురువుయైనచో యది ప్రమాణి ఈ రెండింటి కంటే భిన్నమైనది వితానము ఇటుపైన మూడు అధ్యాయముల వరకు పాదస్యయను పదము, పద చతురూర్ధ్వ ఛందస్సు వరకు అనుష్టుప్‌ వక్త్రము యనునదియు, అధికార పదములు వక్త్ర జాతి ఛందస్సులో పాద ప్రథమాక్షరము తరువాత సగణన గణములను ప్రయోగించరాదు. చతుర్థాక్షరము తరువాత భగణము ప్రయోగించవలెను. ద్వితీయ, చతుర్థ పాదముల నాల్గవ అక్షరముల తరువాత జగణము వచ్చినది. పథ్యా వక్త్ర. కొందరి మతము ప్రకారము ఇందుకు విపరీతముగ చేసినచో అది పథ్యా. విషమ పాద చతుర్థాక్షరానంతరము, నగణము సమపాద చతుర్థాక్షరానంతరము యగణము వున్నది చపలా సమ పాదములలో యేడవ అక్షరము లఘువు అయినచో యది విపులా ప్రథమ తృతీయ పాదముల, చతుర్థాక్షరము తరువాత, యగణమునకు బదులు భగణాదులున్నచో యది విపులా ఈ విధముగ విపుల యనేక విధములుగా వుండును. ఇంతవరకు వక్త్రజాతి ఛందస్సులు చెప్పబడినవి. అనుష్టుప్‌ ప్రథమ పాదము తరువాత పాదము లందు క్రమముగా నాల్గేసి అక్షరమున్నచో దానికి పాద చతురూర్ధ్వము యని పేరు. దీనిలో చివరి రెండు అక్షరములు గురువులైనచో ఆపీడము మొదటి రెండు అక్షరములు, గురువు, మిగిలినవన్ని లఘువులైనచో ప్రత్యాపీడము పదచతురూర్ధ్వ ఛందస్సులో, ప్రథమ పాదమునకు ఇతర పాదమునకును పరివర్తన మున్నచో వరుసగ మంజరి, లవలి, అమృతధార, యన ఛందస్సులు ఏర్పడును. ఇపుడు ఉద్గతా ఛందస్సు చెప్పబడుచున్నది. ప్రథమ పాదమున స, జ, స, లఘువులు, ద్వితీయ పాదమున న, స, జ, గురువులు తృతీయ పాదము భ, న, జ, లఘు గురువులు, చతుర్థ పాదమున స, జ, సజ, గురువులు వున్నచో యది ఉద్గతా ఛందస్సు దీని తృతీయ చరణమున రా, న, భ, గురువులు వున్నచో యది సౌరభము. ఉద్గత తృతీయ పాదమున న, న, స, స లు వున్నచో యది లలిత, ప్రథమ పాదమున య, స, జ, భ గురుద్వయములును, ద్వితీయ పాదమున స, న, జ, ర, గురువులు, తృతీయ పాదమున న, న, స ములును, చతుర్థ పాదము న, న, న, జ, భగణములును వున్నచో యది ప్రచుపిత ఛందస్సు. దీని తృతీయ పాదమున న, స, వ, వ, స, గుణములున్నచో వర్ధమాన ఛందస్సు తృతీయ పాదమున త, జ, ర ములు వున్నచో యది శుద్ధ విరాడర్షభము. ఇపుడు అర్ధ సమ వృత్తములు చెప్పెదను.

అగ్ని మహాపురాణమున ఛందస్సార మను మూడువందల ముప్పది రెండవ అధ్యాయము సమాప్తము.

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page