Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

అథ ఏకత్రింశత్యధిక త్రిశతతమో7ధ్యాయః.

అథ ఛందోజాతి నిరూపణమ్‌

అగ్ని రువాచ :

చతుః శతముత్కృతిః స్యాదుత్కృతేశ్చతురస్త్యజేత్‌ | అభిసంఖ్యా ప్రత్యకృతిస్తాని ఛందాంసివై పృథక్‌. 1

కృతిశ్చాతి ధృతిర్ధాత్రీ అత్యష్టి శ్చాష్టిరిత్యతః | అతిశక్వరీ శక్వరీతి ఆతిజగతీ జగత్యపి. 2

ఛందో7త్ర లౌకికం స్యాచ్చ ఆర్షమాత్రైష్టు భాత్‌ స్స్మృతం| త్రిష్టుప్పంక్తిర్బృహతీ అనుష్టుభుష్ణి గీరితమ్‌. 3

గాయత్రీ స్యాత్సుప్రతిష్టా ప్రతిష్ఠా మధ్యయాసహ | అత్యుక్తాత్యుక్త ఆదిశ్చ ఏకైకాక్షర వర్జితమ్‌. 4

చతుర్భాగో భ##వేత్పాదో గణచ్ఛందః ప్రదర్శ్యతే | తావన్తః సముద్రాగణాహ్యాది మధ్యాన్తసర్వగాః. 5

చతుర్వర్ణాః పంచగణా ఆర్యాలక్షణ ముచ్యతే | స్వరార్ధం చార్యార్ధం స్యాదార్యాయాం విషమేణజః. 6

షష్ఠోజో నలపూర్వాస్యాద్ద్వితీయాదిపదంనలే | సప్తమే7న్తే ప్రథమాచ ద్వితీయే పంచమేనలే. 7

అర్ధేపదం ప్రథమాది షష్ఠఏకోలఘుర్భవేత్‌ | త్రిషు గణషు పాదః స్యాదార్యా పంచార్ధకే స్మృతా. 8

విపులాన్యథ చపలా గురుమధ్యగతౌచ జౌ | ద్వితీయ చతుర్థౌ పూర్వేచ చపలా ముఖపూర్వికా. 9

ద్వితీయే జఘన పూర్వా చపలార్యా ప్రకీర్తితా | ఉభయోర్మహా చపలా గీతవాద్యార్థ తుల్యకా. 10

అంత్యేనార్ధే నోపగీతి రుద్గీతిశ్చోత్ర్కమాత్స్మృతా | అర్థేరక్షగణా ఆర్యాగీతచ్ఛందో7థ మాత్రయా. 11

వైతాళీయం ద్విస్వరాస్యాదాయుష్పాదే సమేనలః | వసవో7న్తే వనగాశ్చ గోపుచ్ఛం దశకం భ##వేత్‌. 12

భగణాన్తా పాటలికా శేషేపరే చ పూర్వవత్‌ | సాకం షడ్‌వా మిశ్రాయుక్ర్పాచ్యవృత్తిః ప్రదర్శ్యతే. 13

పంచమేన పూర్వసాకం తృతీయేన సహస్రయుక్‌ | ఉదీచ్యవృత్తిర్వాచ్యం స్యాద్యుగపచ్చ ప్రవర్తకమ్‌. 14

ఆయుక్చారుహాసినీ స్యాద్యుగ పచ్చాన్తికా భ##వేత్‌ | సప్తార్చిర్వ సవశ్చైవ మాత్రాసమకమీరితమ్‌. 15

భ##వేన్నల రమౌలశ్చ ద్వాదశో వనవాసికా | విశ్లోకః పంచమాష్టౌమో చిత్రనవమ కశ్చలః. 16

పరయుక్తేనోప చిత్రా పాదా కులక మిత్యుత | గీత్యార్యా లోపశ్చేత్సౌమ్యాలః పూర్వాజ్యోతిరీరితా. 17

స్యాచ్ఛిఖా విపర్యస్తార్ధా తూలికా సముదాహృతా | ఏకోన త్రింశదన్తేగః స్యాజ్‌జ్ఞేజన సమావలా. 18

గుఇత్యేక గురుం సంఖ్యా వర్ణాద్దశ విపర్యయాత్‌.18

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే ఛందఃసారే ఏకత్రింశదధిక త్రిశతతమోధ్యాయః.

అగ్నిదేవుడు చెప్పెను. ఉత్కృతి ఛందస్సునందు నూట నాలుగు అక్షరము లుండును. ఉత్కృతి నుండి నాలుగేసి అక్షరములు తగ్గించుచు పోయినచో వేరువేరు ఛందస్సులు ఏర్పడును. అవి వైదిక ఛందసులు గాయత్రి మొదలు త్రిష్టుప్‌ వరకువున్నవి లౌకిక ఛందస్సులు కూడ వాటిపేర్లు త్రిష్టుప్‌ పంక్తి బృహతీ, అనుష్టుప్‌, ఉష్టిక్‌, గాయత్రి యనునవి. గాయత్రిలో ఒక్కొక్క అక్షరము తగ్గినచో సుప్రతిషా ప్రతిష్ఠా మధ్యా, అత్యుక్తాత్యుక్తా మొదలగు ఛందస్సు లేర్పడును. ఛందస్సులో నాల్గవ భాగమునకు పాదమని పేరు. ముందు గణ ఛందస్సు చెప్పబడుచున్నది. నాలుగు లఘు అక్షరములు ఒక గణము. ఇవియైదు కొన్ని చోట్ల ఆది గురువు - మధ్య గురువు - అంత్య గురువు సర్వ గురువు - నాల్గు అక్షరములును లఘువులు వుండవచ్చును. ఇపుడు అర్యా లక్షణము చెప్పబడుచున్నది. ఏడున్నర గణములతో ఆర్య ఏర్పడును. విషమ గణము జగణము కాకూడదు. ఆరవ గణము జగణము కావలెను. లేదా సర్వ లఘువు కావలెను. సర్వ లఘువైనపుడు ఆగణము యొక్క ద్వితీయాక్షరము నుండి పదసంజ్ఞ ఏర్పడును. ఆరవ గణము మధ్యగురువుగాని, సర్వ లఘువు కాని అయినచో, ఏడవ గణము కూడ సర్వ లఘువైనచో దాని ప్రథమాక్షరము నుండి పదసంజ్ఞ ప్రవర్తించును. ఉత్తరార్థమున ఐదవ గణము సర్వ లఘువైనచో దాని ప్రథమాక్షరము నుండి పద ప్రారంభమగును. ఉత్తరార్థమున ఏడవ గణము ఏక మాత్ర లఘువగును. పూర్వార్ధ ఉత్తరార్ధములందు మూడేసి గణములుండి వాటి తరువాత పాద విరామమైనచో ఆ ఆరయకు పథ్యాయని పేరు. పూర్వార్ధము నందు కాని ఉత్తరార్ధమునందు కాని రెండింటి యందుకాని మూడు గణముల తరువాత పాద విరామము లేకున్నచో దానికి విపులయని పేరు. ద్వితీయ చతుర్థ గణములు గుర్వక్షరముల మధ్య నుండి జగణము కూడ వున్నచో దానికి చపలయని పేరు. పూర్వార్థమున చపలా లక్షణమున్నది ముఖ చపలా, ఉత్తరార్థమున చపలా లక్షణమున్నది జఘన చపలా, రెండింటి యందును. చపలా లక్షణమున్నది మహా చపలా! పూర్వార్ధ మువలె ఉత్తరార్ధమున్నచో గీతి ఉత్తరార్ధము వలె పూర్వార్ధమున్నచో ఉపగీతి. పూర్వోక్త క్రమమునకు విపరీతముగ నున్నచో ఉద్గతి. ఇపుడు మాత్రా ఛందస్సు చెప్పబడు చున్నది. ప్రథమ తృతీయ చరణము లందు పదునాలుగు లఘువులు, గ్వితీయ చతుర్థ చరణములందు పదహారు లఘువులు, అన్ని చరణముల అంతమునందు రగణ లఘువు, గురువు లున్నచో వైతాళీయ ఛందస్సు. దీని అంతమున ఒక గురువు అధికముగ నున్నచో యది ఔపచ్ఛందసికము. దీని చరణముల అంతములందు భగణము, రెండు గురువులు వున్నచో ''ఆపాతాభికా'' ఈ వైతాళీ ఛందస్సు నందు చెప్పబడిన రగణాదులతో ఒక్కొక్క పాదము యొక్క అంతమున ఎనిమిది లకారములు, చెప్పబడినవి. వాటిని విడిచి ప్రత్యేక పాదమున మిగిలిన లకారములలో సమ ల కారములు విషమ లకారములతో కలువకూడదు. ద్వితీయ చతుర్థ పాదము లందు ఆరు లఘువులను వరుసగా ప్రయోగించ కూడదు. తృతీయ చతుర్థ పాదములందు చతుర్థ లకారము, పంచమ లకారముతో సంయుక్తమైనచో యది ప్రాచ్యవృత్తి. ప్రథమ తృతీయ పాదములంను ద్వితీయ తృతీయ లకారములు మిశ్రితములైనచో ఉదీచ్యవృత్తి రెండు లక్షణములును ఒకే పర్యాయము ప్రవర్తించినచో యది ప్రవృత్తికా. నాల్గు పాదములు విషమ పాదముల ననుసరించియున్నచో యది చారుహాసిని. సమపాద లక్షణములున్నచో అపరాంతిక ఒక్కొక్క పాదమున పదునారు లకారములుండి, పాదాంతి మాక్షరములు గురువు లైనచో యది మాత్రా సమకము. దీనిలో పండ్రెండవ లకారము స్వరూపము నందేవున్నచో యది పవనాసికా పంచమ అష్టమ లకారములు లఘువులైనచో విశ్లోకము తొమ్మిదవ కూడ లఘువైనచో యది చిత్ర. నవమ దశముములు కలిపినచో ఉపచిత్ర మాత్రా సమకాది పంచ ఛందస్సులలో ఒక్కొక్క పాదముతో నాలుగు పాదముల ఛందస్సు ఏర్పరచినచో దానికి పాదాకులకము యని పేరు. ఒక్కొక్క పాదమున పదునారేసి లఘువులుండి దేనితోను కలిసి గురువు కానిచో అది గీత్యార్య దీనిలోనే అర్ధభాగములో అన్ని మాత్రలు గురువులు, రెండవ అర్థమున లఘువులు అయినచో ఆదిశిఖా. దీనికి విపర్యస్తార్ధమైనచో తూలిక. పూర్వార్ధమున ఇరువది తొమ్మిది లకారములు, ఉత్తరార్థమున ముప్పది ఒక్క లకారములు, చివరి రెండు లఘువుల స్థానమున ఒక గురువు వున్నచో అది సమావల. ''గు'' యనునది ఒక గురువును చెప్పును. అక్షర సంఖ్యలో గురు సంఖ్యను తగ్గించగ మిగిలినది లఘు సంఖ్య యగును.

అగ్ని మహాపురాణమున ఛందస్సారమున మూడువందల ముప్పదవ అధ్యాయము సమాప్తము.

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page