Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

అథ ఏకోన త్రింశత్యధిక త్రిశతతమో7ధ్యాయః.

అథ ఛందః సారః

అగ్ని రువాచ :

ఛందో7ధికారే గాయత్రీ దేవీ చైకాక్షరీ భ##వేత్‌ | పంచ దశాక్షరీ సా స్యాత్ర్పాజాపత్యాష్టవర్ణికా. 1

యజుషాం షడర్జా గాయత్రీ సామ్నాంస్యా ద్ద్వాదశాక్షరా |

ఋచామష్టా దశార్ణాస్యాత్సామ్నాం వర్ధేత చ ద్వయమ్‌. 2

ఋచాం తుర్యంచ వర్ధేత ప్రజాపత్యా చతుష్టయమ్‌ | వర్ధేదేకైకం శేషే ఆతుర్యాదేకముత్సృజేత్‌. 3

ఉష్ణిగనుష్టుబ్బృహతీ పంక్తిస్త్రిష్టుబ్జగత్యపి | తాని జ్ఞేయాని క్రమశోగాయత్ర్యో బ్రహ్మ ఏవతాః. 4

తిస్రస్తిసః సనామ్న్యః స్యురేకైకా ఆర్ష్య ఏవచ | ఋగ్యజుషాం సంజ్ఞాః స్యుశ్చతుః షష్టిపదేలిఖేత్‌. 5

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే ఛందఃసారే ఏకోన త్రింశ దుత్తర త్రిశతతమో7ధ్యాయః.

అగ్నిదేవుడు పలికెను. ''ఛందస్‌'' యను శబ్దము ఈ ప్రకరణములో అనువృత్తి చెందుచుండును. దైవిగాయత్రి ఏకాక్షరి, ఆసురిపంచదశాక్షరి, ప్రాజాపత్య అష్టాక్షరి, యాజుషి షడక్షరి, సామ్నీ గాయత్రి ద్వాదశాక్షరి, అర్చి అష్టాదశాక్షరి, సామ్నిగాయత్రిలో క్రమముగా రెండేసి అక్షరములు పెంచుచు ఆరుకోష్ఠములలో వ్రాయవలెను. ఆర్చి గాయత్రిలో మూడేసి ప్రాజాపత్య గాయత్రిలో నాలుగేసి ఇతర గాయత్రులలో ఒక్కొక్కటి అక్షరము పెంచవలెను. ఆసురి గాయత్రి యొక్క ఒక్కొక్క అక్షరము క్రమముగ, ఆరు కోష్ఠములలో తగ్గినచో వాటిని సామ్న్యాది భేద సహితముగా ఉష్ణిక్‌, అనుష్టుప్‌, బృహతి, పంక్తి, త్రిష్టుప్‌, జగతీ ఛందస్సులుగా తెలుకొనవలెను. యాజుషి సామ్ని ఆర్చిగాయత్రుల అక్షరములను వేరువేరు కూర్చుటచే బ్రాహ్మీ గాయత్రి. బ్రాహ్మి ఉష్ణిక్‌ మొదలగునవి ఏర్పడును యాజుషికి ముందున్న మూడు గాయత్రుల అక్షరములను వేరువేరుగా ఆరుకోష్ఠములలో చేర్చుటచే ఎన్ని అక్షరములగునో యని అర్షీ గాయత్రి ఆర్షి ఉష్ణిక్‌ ఇత్యాది భేదములు ఏర్పడును. వీటిని అరువది నాలుకోష్ఠములలో వ్రాయవలెను.

అగ్ని మహాపురాణమున ఛందస్సారమున మూడువందల ఇరువది తొమ్మిదవ అధ్యాయము సమాప్తము.

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page